Official TS Board Solutions for Class 11 Telugu: Chapter 05 Telangana Idioms
Explore reliable textbook solutions for Chapter 05 Telangana Idioms tailored for Class 11 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Chapter-wise Solutions for Telugu: Chapter 05 Telangana Idioms
Access the complete solution PDF for Class 11 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు
Question 1: పాఠ్యాంశంలో ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి?
Answer:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళు రచించిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో తెలంగాణ జాతీయాలు వివరించబడ్డాయి.
1. వరిగడ్డిమంట:
ఎండుగడ్డి అంటిందే తడువుగా కాలుతుంది. వాముగా ఉన్నప్పుడు కుమ్ముగా కాలుతుంది. ‘మంచివాళ్ళకు వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం . వరిగడ్డి మంటలాంటిదంటారు. వరిగడ్డిమంటలాంటి కోపం ఆ కాసేపు భరించలేనిదిగా ఉన్నా దానికి ప్రమాదం లేదు. అదే అర్థంలో “వరిగడ్డిమంట” అను జాతీయాన్ని వాడతారు.
2. కుక్కిన పేను : రాకాసిబల్లుల లాంటి మహామహా జంతుజాలం నాశనం అయింది. కాని పేను జాతి మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే ఉంది.
పేనును కుక్కితే చిటుక్కుమన్న శబ్దం వస్తుంది. కొన్ని ఈడ్డులాంటి పేలు చిటుక్కుమనవు గోరువత్తిడికి తలకు అంటుకుపోతాయి. చచ్చినట్లుపడి ఉంటాయి. అలా కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్లు పడిఉండే పేలు కుక్కిన పేలు. “ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కి పేనువలె పడున్నాడు” అనటానికి ఈ జాతీయాన్ని వాడతారు.
3. గద్ద తన్నుక పోయినట్లు ఏ కాస్త సందు దొరికినా, తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్నా, ఏ చింతచెట్టు చాటారు కొమ్మనుండి కనిపెడుతుందో గాని గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఇలా హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవటంతో పోలుస్తారు. “గంట క్రితం బజార్లకు ఆడుకొనపోయిన పిల్లాడ్ని గద్ద తన్నుక పోయినట్లు బస్సుకిందపడి చచ్చిపోయే” అని జాతీయ ప్రయోగం.
4. చుక్క తెగిపడినట్లు:
ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఉల్కలు ఆకాశం నుండి వాతావరణంలోకి రాలిపడుతుంటాయి. ఇది దూరం నుండి చూసిన వారికి ఆకాశం నుండి చుక్కలు రాలిపడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీనినే పల్లె భాషలో చుక్క తెగిపడినట్లు అని అంటుంటారు. మనం ఊహించని అతిథిగాని, వ్యక్తిగాని అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వస్తే “చుక్క తెగిపడినట్లు వచ్చావేమిటిరా అని ప్రశ్నిస్తాం. చుక్క తెగిపడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. అర్థరాత్రి అదరాబాదరా వచ్చిన పాలేరుతో “ఈ సమయంలో వచ్చావు చుక్క తెగిపడినట్లు” అని ఇల్లాలు ప్రశ్నిస్తుంది.
5. రామ చక్కని : చక్కదనం అంటే అందం. రాముని చక్కని అందగాడిగా తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి అందానికి నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని పదబంధం ఉపయోగించబడుతుంది. “రామ చక్కని అద్దం పగుల గొడితివి గదరా” “రంగయ్య రామచక్కని మనిషి”, “రామ చక్కని పిల్ల అది” అని ప్రయోగం మన సమాజంలో ఉన్నదే కదా!
Exam Tips:
a) ఐదు జాతీయాలకూ ప్రతిదానికి అర్థం + ఒక ఉదాహరణ వాక్యం రాయండి; ఉదాహరణ లేకపోతే మార్కులు తగ్గుతాయి.
b) జాతీయాన్ని ఉదాహరణలో ఉన్నదున్నట్లు (వరిగడ్డిమంట, కుక్కిన పేను, గద్ద తన్నుకపోయినట్లు, చుక్క తెగిపడినట్లు, రామచక్కని) రాయండి.
c) ప్రారంభంలో పాఠం పేరు, రచయిత వేముల పెరుమాళ్ళు, గ్రంథం పేరు తెలపండి.
Question 2: పాఠ్యాంశంలోని జంతువులు పక్షుల ఆధారంగా రూపొందిన ఏ వేని ఐదు జాతీయాలను వివరించండి?
Answer:
“తెలంగాణ జాతీయాలు” అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన ‘తెలంగాణ జాతీయాలు’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది. ఇందులో జంతువుల పక్షులు ఆధారంగా కొన్ని జాతీయాలున్నాయి.
1. కోతికి పుండు పుట్టినట్లు ఒక కోతికి పుండయ్యింది. విచిత్రంగా కన్పించింది. మరొక కోతి వచ్చి ఆపుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. అలాగే మరొక కోతి కూడా అలా చేసింది. ఆకోతి కూడా పుండు బాధ పడలేక గోక్కున్నది. పుండు మరింత నెత్తురుకారి పెద్దయింది. ఏ కోతికి పుండు పెద్ది కావాలని ఉండదు. అయినా తెలియని తనం వలన ఈ కోతి పుండు మానదు “అత్తా! ఈ పోరగాని కాలుకు దెబ్బ తాకిందని పట్టేసి బడికితోలేస్తే మళ్ళీ దెబ్బతాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది” అన్న కోడలి మాటల్లో ఈ జాతీయం పలుకబడింది.
2. ఎద్దును చూసి మేతెయ్యాలి : ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కుదురుతుందా? విచక్షణతో దేనికేంత వేయాలో తెలుసుకోవాలి. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులుంటాయి. వాటికి తగ్గమేత వాటికి వేయాలి. కొన్ని బొండలుంటాయి. వాటి పుట్టుకే చిన్నది. కడుపు కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుంది. వాటికి మేత ఎక్కువ వేస్తే తొక్కి పాడుచేస్తాయి. ‘దసరా మామూళ్ళని అందరికి పదిరూపాలే ఇస్తిరి.
ఎద్దును చూసి మేతెయ్యాలి. మే ఎల్లకాలం పనికచ్చేటోల్లం. మాది మా కుండాల” అని జాతీయం ప్రయోగించబడుతుంది.
3. ఊరుగొడ్డుపోలేదు : ఊరిలో ఎక్కడో ఒకచోట దొరకుండా పోదు అనుట ఒక కుటుంబంలో ఒక వస్తువు దొరకకుండా పోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు. గొడ్డు పోవుట అంటే వంధత్వం, అలభ్యం. ఒక కుటుంబంలో దొరకకపోతే వేరే కుటుంబంలో దొరుకుతుందని భావం” “అయ్యో! నీవు యియ్యకపోతే మాయె.
ఊరుగొడ్డుపోయిందా? ఎక్కడో ఒకచోట ఎవరన్నా ఇస్తారు. అందరూ ఒకే తీరు ఉంటారా? అని ఈ జాతీయం ప్రయోగించబడుతుంది
4. కోడి మెదడు : అల్పత్వం మతిమాలిన తనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి. దాని మెదడు కూడా చిన్నదే! చెపితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వాడిని కోడిమెదడువాడు అంటారు. “వానిది కోడి మెదడు. వానికి తోచదు. ఒకరు చెప్తే వినడు” అంటారు.
5. బుడుబుంగ : నీటిలో తిరిగే పక్షి, బాతు జాతికి చెందింది. నల్లగా ఉంటుంది. ఒక చోట బుడుక్కున మునుగుతుంది. కూత పెట్టు దూరంలో తేలుతుంది. మళ్ళీ మళ్ళీ మునిగినా అలాగే తేలుతుంది. లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో, వెంటనే మరో ఇంట్లో ఇలా కాలాగకుండా తిరిగే వాడిని బుడుబుంగ అని అంటారు.
Exam Tips:
a) జంతువులు/పక్షులకు సంబంధించినవే ఎంచుకోండి: కోతికి పుండు, ఎద్దును చూసి మేతెయ్యాలి, ఊరుగొడ్డుపోలేదు, కోడి మెదడు, బుడుబుంగ.
b) ప్రతి జాతీయానికి అది ఏ సందర్భంలో వాడతారో ఒక వాక్య ప్రయోగం ఇవ్వండి.
II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు
Question 1: ‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి?
Answer:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజాం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడుకోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు.
పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలను వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు.
ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనమడు అనుభవిస్తున్నట్లు” ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది.
Exam Tips:
a) ‘తాత జాగీరు’ నేపథ్యం – నైజాం కాలపు పటేలు, పట్వారీ, జమీందారు, ముక్తాదారు వంటి అనువంశిక పదవులు – పేర్కొనండి.
b) కష్టార్జితం కాని సంపద అనే అర్థాన్ని మొదటి వాక్యంలోనే రాయండి.
Question 2: ఇంటింటికి మంటి పొయ్యి జాతీయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి?
Answer:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నాకు ధనమున్నదికదా అని బంగారు పొయ్యి లాడరు కదా! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మాకోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది.
బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందటమాకురావా” అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.
Exam Tips:
a) ‘సామాజిక న్యాయం’ అంటే ఇక్కడ అందరి ఇళ్ళలోనూ ఒకేరకమైన కష్టాలు ఉంటాయనే భావం అని స్పష్టంగా రాయండి.
b) మట్టి పొయ్యి – బంగారు పొయ్యి పోలికను చేర్చండి.
Question 3: బట్టకాల్చి మీద వేయడం అంటే ఏమిటి?
Answer:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
బట్టకాల్చి మీద వేయటమంటే నిందలు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగ తనం చేశాడు. నేను నా సొంత బంగామని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను.
బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఈ జాతీయం ప్రస్తావించబడుతుంది.
Exam Tips:
a) అర్థం: నిందలు మోపడం/అన్యాయంగా ఇరికించడం. ఉదాహరణ సంఘటనతో వివరించండి.
Question 4: ‘వరిగడ్డిమంట’ జాతీయాన్ని వివరించండి?
Answer:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
వరిగడ్డి ఎండినదైతే అగ్ని అంటిందే తడవుగా మంటలంటుకుని కాలుతుంది.
వాముగా ఉంటే మాత్రం కమ్ముకుని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. వంట చెరుకు అంటుకోవటానికి, పొయ్యి రాజుకోవటానికి, చలిమంటలకు బగ్గున లేచే మంటల కోసం వరిగడ్డినే వాడతారు. ఏదైనా వరిగడ్డి బగ్గున మండి బుగ్గయిపోతుంది.
మంచివాళ్ళకు వచ్చే కోపం వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటలాంటిది. కొద్దిసేపటిలో మాయమైపోతుంది. అలాంటప్పుడు వరిగడ్డిమంటతో పోలుస్తారు.
Exam Tips:
a) వరిగడ్డి మంట త్వరగా రగిలి త్వరగా ఆరిపోతుంది; అదే మంచివారి కోపానికి పోలిక – ఈ సామ్యాన్ని తప్పక రాయండి.
III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
Question 1: వేముల పెరుమాళ్ళు విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ?
Answer:
రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది.
Exam Tips:
a) విద్యాభ్యాసం జరిగిన మూడు ఊర్లు: రాయికల్, కోరుట్ల, జగిత్యాల – మూడూ రాయండి.
Question 2: వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి?
Answer:
వేముల పెరుమాళ్ళు వ్రాసిన త్రిశతి పేరు ‘గాంధీమార్గం’
Exam Tips:
a) త్రిశతి = మూడు వందల పద్యాలు; పేరు ‘గాంధీమార్గం’.
Question 3: వేముల పెరుమాళ్ళు ప్రసంగాల సంకలనం పేరేమిటి ?
Answer:
మానవతా పరిమళాలు
Exam Tips:
a) ఆకాశవాణి ప్రసంగాల సంకలనం ‘మానవతా పరిమళాలు’.
Question 4: జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది?
Answer:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది
Exam Tips:
a) సమాధానంలో ‘తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర’ అనే పదబంధాన్ని ఉపయోగించండి.
Question 5: జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది?
Answer:
గంగలో రాయివంటిది
Exam Tips:
a) జానపదుల జాతీయం, సామెత ‘గంగలో రాయి’ వంటివి – పోలికను ఉన్నదున్నట్లు రాయండి.
Question 6: “చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
Answer:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.
Exam Tips:
a) వాక్య ప్రయోగంలో జాతీయం అర్థానికి తగిన సందర్భం (అనుకోకుండా రావడం) ఉండాలి.
Question 7: “రామచక్కని” అనే జాతీయాన్ని ఉపయోగించి ఒక వాక్యం తయారు చేయండి.
Answer:
శ్రీరాముడు రామచక్కనోడు.
Exam Tips:
a) వాక్యంలో జాతీయం మార్పు లేకుండా ఉపయోగించండి; ‘రామచక్కని’ అందాన్ని/మంచితనాన్ని సూచిస్తుంది.
Question 8: “లొల్లిలో లొల్లి” జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి?
Answer:
రాజకీయ పార్టీలు అవినీతిని గురించి ఇప్పుడు లొల్లిలో లొల్లి చేస్తున్నాయి.
Exam Tips:
a) ‘లొల్లి’ అంటే గొడవ; వాక్యంలో గొడవ చేయడం అనే అర్థం వచ్చేలా రాయండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 11 Telugu Chapter 05 Telangana Idioms
Official TS Board Solutions for Chapter 05 Telangana Idioms
Access structured TS Board textbook solutions for Chapter 05 Telangana Idioms. Designed in alignment with the latest academic curriculum for Class 11 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Step-by-Step Explanations for Chapter 05 Telangana Idioms
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Next Steps in Your Telugu Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 05 Telangana Idioms with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Telugu. You can access TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు in printable PDF format for offline study on any device.