Solutions for Class 11 Telugu: Chapter 03 Humanism in Ancient Literature
Access comprehensive textbook solutions for Chapter 03 Humanism in Ancient Literature using the official curriculum guides for Class 11 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 11 Telugu Solutions: Chapter 03 Humanism in Ancient Literature
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు
Question 1: ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి?
Answer:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతా వాదాన్ని గురించి చక్కగా వివరించారు.
మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి. దీనిని మానవతా వాదం అనే కన్నా మానవతా దృక్పథం అనటం సబబని రవ్వా శ్రీహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పథానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని పట్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూపించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.
ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహాత్మ్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయిన వానితో సమానుడట.
వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం….” అన్న ఆదికావ్యమైన రామాయణ వాక్యాలు పరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం – వాల్మీకిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా!- ఇక ‘మహాభారతంలో ఉన్నదే మరొక చోట కూడా ఉంటుంది. మహాభారతంలో లేనిది మరెక్కడా ఉండదు. ధర్మప్రతిపాదన మహాభారత లక్షణం. దధీచి, శిబి, రంతి దేవుని కథలు మానవతా వాదానికి మచ్చుతునకలు. రంతిదేవుని నోట వ్యాసుడు “న త్వహం కామయే రాజ్యం…” అన్న శ్లోకం ద్వారా” నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలే వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే కావాలంటాడు. దీనికి మించిన మానవతా వాదం ఇంకా ఎక్కడున్నది.
ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్బాధను తీరుస్తుంది కాబట్టి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉదాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్పించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో దానమైనా నిత్యం చేస్తే అది మానవత్వం అనిపించుకుంటుందని చెప్పబడింది.
భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మానవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది.
అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు. అష్టాంగ హృదయంలో ‘బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నంపెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.
మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వాశ్రీహరి పేర్కొన్నారు.
Exam Tips:
a) వ్యాసరూప ప్రశ్నకు ప్రారంభంలో పాఠం పేరు, రచయిత (రవ్వా శ్రీహరి), గ్రంథం (సాహితీ నీరాజనం) రాయండి.
b) మానవతా దృక్పథానికి మూలం ప్రేమ; ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, అష్టాంగ హృదయం నుంచి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
c) చివరి వాక్యంలో ‘మానవులందరూ, సర్వజీవులూ సుఖంగా ఉండాలి’ అనే ముగింపు రాయండి.
Question 2: ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలపండి?
Answer:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావం చక్కగా వివరించబడింది.
జీవ కారుణ్యం అంటే సృష్టిలోని సకల జీవులపట్ల కరుణ, జాలి కలిగి ఉండటం.
ఋగ్వేదంలో అన్నదానం గురించి వివరిస్తూ ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టనివాడు మృత ప్రాయుడని చెప్పబడింది. రామాయణ రచన జీవకారుణ్యాన్ని చెప్పడంతోనే ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్టాం”… అన్న శ్లోకం జీవకారుణ్యాన్ని చూపమని చెప్పింది.
కఠిన మనస్సుగల బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని కొట్టాడు. ఆడపక్షి కరుణ స్వరాన్ని విన్న వాల్మీకి మనసులో కారుణ్యం చోటు చేసుకుంది. ప్రేమ భావాన్ని కరుణ భావాన్ని మానవులపైనే గాక పశుపక్ష్యాదులపైన కూడా చూపించడం భారతీయ సంస్కృతిలో కన్పించే ముఖ్యలక్షణం. దీనినే ప్రాచీన కావ్యాలు కూడా ప్రబోధించాయి. “ఆత్మవత్ సతతం పశ్యేదపికీటపిపీలికామ్” అంటే చీమ మొదలైన కీటకాలను కూడా తమలానే భావించాలి అని అష్టాంగ హృదయం చెప్తుంది.
మహాభారతంలోని దధీచి, శిబి, రంతి దేవుడు మొదలుగు కథలలో జీవకారుణ్యం గురించి వివరించబడింది. రంతిదేవుని కథలో “నత్వహంకామయే రాజ్యం….” అన్న శ్లోకంలో వ్యాసుడు రంతిదేవుని మనసులో ఉన్న జీవకారుణ్యాన్ని వివరించాడు. “నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలు వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగటమే నాకు కావాలి” అంటాడు. దీనికి మించిన జీవకారుణ్యం ఏముంటుంది. ఇలా ప్రాచీనమైన ప్రతి కావ్యంలో కూడా జీవ కారుణ్యాన్ని కవులు తెలియచేశారు.
Exam Tips:
a) జీవకారుణ్యం అంటే ఏమిటో నిర్వచనంతో ప్రారంభించండి.
b) క్రౌంచ పక్షుల ఘట్టం, ‘ఆత్మవత్ సతతం పశ్యేత్…’ శ్లోకం, రంతిదేవుని ‘న త్వహం కామయే రాజ్యం’ శ్లోకం తప్పక చేర్చండి.
II. సంగ్రహ రూప ప్రశ్నలు సమాధానాలు
Question 1: అన్నదాన ప్రాముఖ్యతను తెలియచేయండి?
Answer:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో అన్నదాన మహిమను వర్ణించారు.
దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పది. అది మానవుల ఆకలి బాధను తీరుస్తుంది. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూంటే చూసి చూడనట్లుండటం మానవత్వం కాదు అని మన ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది. తైత్తిరీయ ఉపనిషత్తులో, అన్నాన్ని ఎక్కువగా వండాలని ఆకలితో అలమటించే దీనులకు అన్నం పెట్టాలని అలా పెట్టనివాడు నరకానికి పోతాడని వివరించబడింది. అలా అన్నార్తులకు అన్నం పెట్టనివాడు కేవలం పాపాన్నే భుజిస్తాడని చెప్పింది.
ఎవరు తనకోసం మాత్రమే వండుకుంటాడో అంటే ఎవరు అన్నార్తుల బాధను పట్టించుకోకుండా తన పొట్టమాత్రమే చూసుకుంటాడో వాడు నరకాన్ని పొందుతాడని పాపాన్ని ప్రోగుచేసుకుంటాడని స్మృతులు వివరించాయి.
భాగవతంలో కూడా గృహస్థ ధర్మాన్ని వివరిస్తూ తన కడుపు నింపుకోవడానికి అవసరమైన ధనం మీదే మానవునకు అధికారం ఉంటుంది. మిగిలినది అన్నార్తులకు వినియోగించాలని చెప్పింది. ఇలా అన్నదాన ప్రాముఖ్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు వివరించాయి.
Exam Tips:
a) అన్నదానం గొప్పదనానికి ఋగ్వేదం, తైత్తిరీయ ఉపనిషత్తు, భాగవతం, స్మృతుల ఆధారాలు వరుసగా రాయండి.
b) ‘తనకోసం మాత్రమే వండుకునేవాడు పాపాన్నే భుజిస్తాడు’ అనే భావం ముఖ్యం.
Question 2: అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది?
Answer:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం’ అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. దుఃఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో ఉన్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టాంగ హృదయం చెప్తుంది. మానవుని సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ఏ జీవనాధారం లేని వారికి వ్యాధిగ్రస్తులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అదే మనవత్వం అనిపించుకుంటుందని అష్టాంగ హృదయం బోధించింది.
Exam Tips:
a) అష్టాంగ హృదయం చెప్పినవారు: జీవనాధారం లేనివారు, రోగులు, దుఃఖితులు – ముగ్గురినీ పేర్కొనండి.
b) ‘ఆత్మవత్ సతతం పశ్యేత్…’ శ్లోకాన్ని, దాని భావాన్ని కూడా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
Question 3: రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి?
Answer:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న ‘పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు.
వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది.
మహాభారతం లో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివరించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో “నత్వహం కామయే రాజ్యం”…..
అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం గతి మీశ్వరాత్…..” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుండి వాళ్ళ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.
Exam Tips:
a) రంతిదేవుడు కోరనివి (రాజ్యం, స్వర్గం, మోక్షం), కోరినది (ఆర్తుల దుఃఖ నివారణ) – రెండింటినీ స్పష్టంగా రాయండి.
b) భారతంలోని శ్లోకంతో పాటు భాగవత శ్లోకాన్ని ప్రస్తావించడం అదనపు విషయం.
Question 4: పురాణాలు ఎవరిపైన దయచూపాలని చెప్పాయి?
Answer:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం’ అను పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. దీనిలో మానవతా వాదం ప్రాచీన సాహిత్యంలో ఎలా వివరించబడిందో రవ్వావారు వివరించారు.
మన పురాణాలు వట్టి పురాణాలు కావు. వాటిలో మానవులందరూ సుఖంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ప్రగతిని సాధించాలి. ఏ ఒక్కరూ దుఃఖంతో జీవించరాదు అని వివరించాయి. కేవలం మానవులకే కాకుండా పశుపక్ష్యాదులపైన కూడా దయ, జాలి కరుణలను చూపించాలని ప్రబోధించాయి.
క్రిమికీటకాదులు పైన, పశు పక్ష్యాదులపైన, ఏ కులం వారిపైనైనా, పతితులపైన వర్ణసాంకర్యం గల వారిపైన దయాగుణాన్ని చూపాలని పురాణాలు వివరించాయి. చివరికి తృణ వృక్షాదులను కూడా జీవంగల వానిగా భావించి వాటికి ఏ విధమైన హానిని కలిగించకుండా కాపాడుకోవాలని మన పురాణాలు వివరించాయి.
Exam Tips:
a) పురాణాలు దయ చూపమన్నవారి జాబితా: క్రిమికీటకాలు, పశుపక్ష్యాదులు, పతితులు, వర్ణసాంకర్యం గలవారు, తృణవృక్షాదులు.
b) జాబితాను క్రమంగా పాయింట్లుగా రాయండి.
III. ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
Question 1: ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు?
Answer:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వేంకట నరసమ్మ, నరసయ్యలు.
Exam Tips:
a) ఈ ఒక్కవాక్య ప్రశ్నలో తల్లి పేరు ‘వేంకట నరసమ్మ’, తండ్రి ‘నరసయ్య’ – పేర్లు తప్పు కాకుండా రాయండి.
Question 2: ఆచార్య రవ్వా శ్రీహరి రచనలు తెలియచేయండి?
Answer:
తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు, అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలను రచించారు.
Exam Tips:
a) రచనల పేర్లను ఖచ్చితంగా రాయండి: తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు, అన్నమయ్య భాషా వైభవం.
Question 3: ఆచార్య రవ్వాశ్రీహరి సంస్కృతానువాద రచనలేవి?
Answer:
డా. సి. నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి, వేమన శతకం, నృసింహ శతకాలు శ్రీహరి సంస్కృతానువాదాలు.
Exam Tips:
a) అనువదించిన గ్రంథాలు: సి.నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి, వేమన శతకం, నరసింహ శతకం.
Question 4: ఆచార్య రవ్వాశ్రీహరికి ‘మహామహోపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసిన సంస్థ ఏది ?
Answer:
తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరికి ‘మహామహోపాధ్యాయ’ బిరుదును ఇచ్చింది.
Exam Tips:
a) బిరుదు ‘మహామహోపాధ్యాయ’; ఇచ్చిన సంస్థ తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం – రెండూ రాయండి.
Question 5: మానవతా దృక్పథానికి మూలమేమి?
Answer:
మానవతా దృక్పథానికి మూలం ‘ప్రేమ’
Exam Tips:
a) సమాధానం ఒకే మాట: ‘ప్రేమ’. ప్రశ్నను పూర్తి వాక్యంగా మార్చి రాయండి.
Question 6: సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది?
Answer:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.
Exam Tips:
a) ఆదికావ్యం వాల్మీకి రామాయణం – రచయిత పేరు కూడా చేర్చండి.
Question 7: ధర్మసింధువు ఏమని ప్రబోధిస్తుంది?
Answer:
బాలురకు వృద్ధులకు అన్నంపెట్టందే భుజింపరాదని ప్రబోధిస్తుంది.
Exam Tips:
a) ‘బాలురకు, వృద్ధులకు అన్నం పెట్టిన తర్వాతే భుజించాలి’ – ఇద్దరినీ పేర్కొనడం మర్చిపోకండి.
Question 8: చరక సంహితలో చరకాచార్యుడు ఏమని శాసించాడు?
Answer:
మానవుడు నిత్యమూ సమస్త ప్రాణుల కళ్యాణాన్ని కోరుకోవాలని శాసించాడు.
Exam Tips:
a) చరకుడు కోరినది: సమస్త ప్రాణుల కళ్యాణం (క్షేమం). ‘చరక సంహిత’ పేరు సరిగా రాయండి.
Free study material for Telugu
Telugu Class 11 Curriculum Solutions: Chapter 03 Humanism in Ancient Literature
Official TS Board Solutions for Chapter 03 Humanism in Ancient Literature
Review comprehensive exercise answers for Class 11 Telugu Chapter 03 Humanism in Ancient Literature. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Chapter 03 Humanism in Ancient Literature
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 03 Humanism in Ancient Literature concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Telugu Revision
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Telugu.
FAQs
The complete and updated TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Telugu. You can access TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Telugu Study Material Chapter 3 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం in printable PDF format for offline study on any device.