TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు

Official TS Board Solutions for Class 11 Telugu: Chapter 02 Telangana Telugu words – Urdu origins

Access comprehensive textbook solutions for Chapter 02 Telangana Telugu words – Urdu origins using the official curriculum guides for Class 11 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Chapter-wise Solutions for Telugu: Chapter 02 Telangana Telugu words – Urdu origins

Access the complete solution PDF for Class 11 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు : జవాబులు

Question 1: ఉర్దూ నుంచి తెలుగులోకి చేరినప్పుడు పదాలలో జరిగిల మార్పును వివరించండి?

Answer:

తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన “వ్యాసగుళుచ్ఛం”, రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగులో ఉర్దూ పదాల మూలాలను చక్కగా వివరించారు.
ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు, పారసీ, అరబ్బీ, తర్కీ శబ్దాల కలగాపులగం ఉర్దూ భాష. ఇది మన దేశంలో 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. దీనిని తొలుత హిందుయి జబానే హిందూస్థాన్ అన్న పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దానికి కాని అది ఉర్దూ అని పిలువబడలేదు.
తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు యథాతదంగానే చేరాయి. కమలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము, రోజు, కూలీ, బాకీ, బజారు, దుకాణం మొదలగు పదాలు ఇందుకు ఉదాహరణము. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు ఆ పదాలు అజంతమవటం సహజం. ఉదాహరణకు కలమ్-కలము అయింది. జమీందార్ – జమీందారు అయింది.
బజార్- బజారు అయింది.
కొన్ని పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఉదాహరణకు బాఖీ అనే ఉర్దూ పదం తెలుగులో బాకీ అయింది. అలాగే ‘నఖద్’ నగదుగా మారింది.
ఉర్దూపదం – తెలుగు పదం
ఉదార్ – ఉద్దర
సొహబత్ – సొబతి
మస్జిద్ – మసీదు
కుర్చీ= కుర్చీ
ఘిలాప్ – గలిబు/గలేబు
జుర్మానా – జుర్మానా
నక్స్ – నగిషీ
అబ్రూ – ఆబోరు
ఇలా ఉర్దూపదాలు తెలుగులో మార్పుచెందాయి.
కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి వచ్చి అర్థాన్ని కూడా మార్చుకున్నాయి.
ఉదాహరణకు ‘ముదామ్’ అనే పారసీ పదానికి ‘ఎల్లప్పుడూ అనే అర్థం ఉంది. ఇది తెలుగులో ‘ముద్దాముగా’ మారి ‘ప్రత్యేకించి’ అనే అర్థంలో వాడబడుతుంది. ఇలా పలు మార్పులతో అనేక పదాలు ఉర్దూ నుండి తెలుగు భాషలోకి ప్రవేశించాయి.

Exam Tips:

a) ఉర్దూ మూలాలు తెలుగులో చేరే మూడు విధానాలను (యథాతథంగా చేరడం, రూపం మారడం, అర్థం మారడం) వేర్వేరు పేరాలుగా ఉదాహరణలతో రాయండి.
b) హలంతమైన ఉర్దూ పదాలు తెలుగులో అజంతాలవుతాయి (కలమ్ – కలము, బజార్ – బజారు) అనే విషయాన్ని తప్పక పేర్కొనండి.

 

Question 2: భాషల మధ్య జరిగే ఆధానప్రదానాలను చర్చించండి?

Answer:

తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన “వ్యాసగుళుచ్ఛం” రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.
ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది.
స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మూల భాష యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడ స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఆంగ్లభాషా ప్రభావం కూడా! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవ్యత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.
ఉదాహరణకు :-
లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోకి ‘లాట్సాహెబ్’గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ. వర్ణవ్యత్యయాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

Exam Tips:

a) వర్ణాగమం, వర్ణలోపం, వర్ణవ్యత్యయం అనే మూడు పదాలను ఉదాహరణలతో (సొహబత్ – సోబతి, ఆబ్రూ – ఆబోరు) రాయండి.
b) మొదట పాఠం పేరు, రచయిత పేరు రాసి, తర్వాత ఆదాన ప్రదానాల వివరణ ఇస్తే సమాధానం క్రమబద్ధంగా ఉంటుంది.

 

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు

Question 1: ఉర్దూవానా పదాన్ని వివరించండి?

Answer:

తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడినది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాసగుళుచ్ఛం’, రెండవ భాగం నుండి గ్రహించబడింది.
మన దేశంలోని భాషలన్నింటిపై సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో అలాగే ఆంగ్లభాషా ప్రభావం ఉర్దూ భాషపై ఉంది. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు, ‘ఉర్దువానా’ అనే పదాన్ని తరుచుగా వాడుతుంటారు. ఉర్దూ పండితులు పలు ఆంగ్లపదాలను పద బంధాలను ఉర్దూలోకి అనువదించుకున్నారు. అవిగాక ఒక భాష అన్యభాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప వర్ణవ్యత్యయ పద్దతులలో ఎన్నో ఆంగ్లపదాలను ఉర్దూభాషలోకి మార్చుకున్నారు. ఆభాషా రూపమే ‘ఉర్దూవానా’.
ఉదా : లార్డ్ అనే ఆంగ్లపదం లాట్ సాహెబ్ ను
కమాండ్ అనే ఆంగ్లపదం కమాన్ ను
ఫిలాసఫీ అనే పదం ఫల్సపా గాను
ఇలా పలు ఆంగ్లపదాలు ఉర్దూలోకి వచ్చాయి. ఆ పదాల సమూహంతో వచ్చిన దానిని ‘ఉర్దూవానా’ అన్నారు.

Exam Tips:

a) ‘ఉర్దూవానా’ అంటే ఆంగ్ల పదాలను ఉర్దూలోకి అనువదించి లేదా మార్చి తీసుకోవడం అని స్పష్టంగా నిర్వచించండి.
b) లార్డ్ – లాట్‌సాహెబ్, ఫిలాసఫీ – ఫల్సఫా వంటి ఉదాహరణలు రాయడం మరువకండి.

 

Question 2: తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు?

Answer:

తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాసగుళుచ్ఛం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.
ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది. తెలంగాణా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.

Exam Tips:

a) తెలంగాణ తెలుగులో ఉర్దూ, హిందీ, మరాఠీ పదాలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమని నొక్కి చెప్పండి.
b) గ్రాంథికంలో నాలుగు ప్రాంతాల తెలుగు ఒకటే, వ్యవహారికంలో భేదం అనే వ్యత్యాసాన్ని రాయండి.

 

Question 3: తెలంగాణా తెలుగులో యథాతదంగా చేరిన ఉర్దూ పదాలను తెలపండి?

Answer:

‘తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా. సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడి ‘వ్యాసగుళుచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.
ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి చేరేటప్పుడు వాటి రూపు రేఖలు మారటమో లేకఅర్థం మారటమో జరుగుతుంది. అలా కాకుండా తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ పదాలు యథాతదంగా చేరాయి. అలాంటి పదాలలో కలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము, రోజు, కూలీ, బాకీ, గురుజు, బజారు, దుకాణం, మాలు, జబర్దస్తీ, జోరు, మొదలగు పదాలున్నాయి. ఇవన్నీ యథాతదంగా ఎలాంటి మార్పును పొందకుండా తెలుగులోకి వచ్చిన ఉర్దూపదాలు.

Exam Tips:

a) జాబితాలో పదాలను మార్పు లేకుండా రాయండి (కలము, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, కూలీ, బజారు, దుకాణం మొదలైనవి).
b) కనీసం ఆరు ఏడు పదాలు రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 4: సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?

Answer:

సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు.
సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభాతము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్వదానము, విశ్వామిత్ర మొదలుగునవి ఉన్నాయి.
హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.
అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.

Exam Tips:

a) సామల సదాశివ జననం (1928), మరణం (2012), ప్రసిద్ధ రచనలు (మలయ మారుతాలు, స్వరలయలు, యాది) తేదీలతో సహా రాయండి.
b) పురస్కారాలను (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, గౌరవ డాక్టరేట్లు) చివరలో విడిగా పేర్కొనండి.

 

III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

Question 1: ఉర్దూ భాషను పూర్వం ఏ పేర్లతో పిలిచేవారు ?

Answer:

ఉర్దూ భాషను పూర్వం హిందుయి-జబానె-హిందుస్థాన్ అనే పేర్లతో 18వ శతాబ్దం వరకు పిలిచేవారు.

Exam Tips:

a) ‘హిందుయి జబానె హిందూస్థాన్’ అనే పేరును సరిగ్గా రాయండి; 18వ శతాబ్దం వరకు ఈ పేరు ఉండేదని చెప్పండి.

 

Question 2: ‘లాట్ సాహెబ్’ పదానికి మూల పదం ఏది?

Answer:

‘లాట్ సాహెబ్’ అనే పదానికి మూల పదం ‘లార్డ్’ అనే ఆంగ్లపదం

Exam Tips:

a) మూల పదం (ఆంగ్లం ‘లార్డ్’) ఏ భాషదో కూడా పేర్కొనండి.

 

Question 3: ‘జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ఏ విధంగా మారింది?

Answer:

జుర్మానా అనే ఉర్దూపదం తెలుగులో ‘జుల్మానా’గా మారింది.

Exam Tips:

a) ఉర్దూ పదం, తెలుగు రూపం రెండింటినీ వరుసగా రాస్తే స్పష్టంగా ఉంటుంది.

 

Question 4: ‘ముహ్జుబాణీ’ అనే ఉర్దూపదానికి అర్థం?

Answer:

‘ముహ్ జుబాణీ అనే ఉర్దూపదానికి’ ‘నోటితో’ అని అర్థం.

Exam Tips:

a) ఉర్దూ పదాల అర్థాలను నేర్చుకునేటప్పుడు ఉర్దూ రూపం – అర్థం జంటలుగా గుర్తుంచుకోండి.

 

Question 5: ‘కులాసా’ తెలుగు పదానికి ఉర్దూరూపం?

Answer:

కులాసా తెలుగు పదానికి ఉర్దూరూపం ‘ఖులాసా’

Exam Tips:

a) ఉర్దూ రూపం ‘ఖులాసా’ (ఖ తో) అని స్పెల్లింగ్ జాగ్రత్తగా రాయండి.

 

Question 6: ‘ఉర్దూ’ భాషకు ‘ఉర్దూ’ అనుపేరు ఏ శతాబ్దంలో వచ్చింది?

Answer:

18వ శతాబ్దంలో

Exam Tips:

a) శతాబ్దాన్ని అంకెల్లో (18వ శతాబ్దం) రాయడం సరిపోతుంది; దీనికి ముందు ‘హిందుయి జబానె హిందూస్థాన్’ అనే పేరు ఉండేదని గుర్తుంచుకోండి.

 

Question 7: ‘సామల సదాశివ’ రాసిన శతకం?

Answer:

‘సాంబశివ’ శతకం

Exam Tips:

a) శతకం పేరు ‘సాంబశివ శతకం’; రచన పేరును ఇతర రచనలతో కలపకండి.

 

Question 8: ఏ గ్రంథానికి సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది?

Answer:

స్వరలయలు అనే గ్రంథానికి

Exam Tips:

a) ‘స్వరలయలు’ (2011, కేంద్ర సాహిత్య అకాడమీ) – ‘అన్జద్ రుబాయిలు’ అనువాదానికి వచ్చిన రాష్ట్ర పురస్కారంతో కలిపేయకండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 11 Telugu Chapter 02 Telangana Telugu words – Urdu origins

Official TS Board Solutions for Chapter 02 Telangana Telugu words – Urdu origins

Access structured TS Board textbook solutions for Chapter 02 Telangana Telugu words – Urdu origins. Designed in alignment with the latest academic curriculum for Class 11 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Chapter 02 Telangana Telugu words – Urdu origins

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Next Steps in Your Telugu Revision

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Telugu.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Telugu. You can access TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Telugu Study Material Chapter 2 తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు in printable PDF format for offline study on any device.