Step-by-Step Textbook Solutions for Class 11 Chemistry Chapter 09 s-Block Elements
Access comprehensive textbook solutions for Chapter 09 s-Block Elements using the official curriculum guides for Class 11 Chemistry. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Download Chapter 09 s-Block Elements Textbook Solutions PDF
Navigate directly to the solved Chemistry textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు
Question 1: ఆవర్తన పట్టికలో కర్ణ సంబంధం ఉండటానికి గల కారణాలను తెలపండి.
Answer:
ఆవర్తన పట్టికలో Li – Mg, Be – Al, B – Si ల మధ్య కర్ణ సంబంధం ఉంటుంది. దీనికి కారణం
1. మూలక పరమాణు పరిమాణం సమానంగా ఉండటం.
2. వాటి ఋణవిద్యుదాత్మకత విలువలు సమానంగా ఉండటం.
3. మూలకాలకు ఒకే ధ్రువణ సామర్థ్యం (ఆవేశం / వ్యాసార్థాల నిష్పత్తి)
ఉండటం.
Exam Tips:
a) కర్ణ సంబంధం ఉన్న మూడు జతలు (Li–Mg, Be–Al, B–Si) పేర్లు రాసి, కారణాలుగా పరిమాణం, ఋణవిద్యుదాత్మకత, ధ్రువణ సామర్థ్యాలను చెప్పండి.
Question 2: K, Rb ల ఎలక్ట్రాన్ విన్యాసాలను పూర్తిగా రాయండి.
Answer:
ఎలక్ట్రాన్ విన్యాసాలు
K (Z = 19) – 1s² 2s² 2p⁶ 3s² 3p⁶ 4s¹
Rb (Z = 37) – 1s² 2s² 2p⁶ 3s² 3p⁶ 3d¹⁰ 4s² 4p⁶ 5s¹
Exam Tips:
a) విన్యాసాన్ని క్రమంగా (1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 5s) రాయండి; ఎలక్ట్రాన్ల మొత్తం పరమాణు సంఖ్యకు సమానమో సరిచూసుకోండి.
Question 3: లిథియమ్ లవణాలు చాలావరకు ఆర్ద్రీకృతమై ఉంటాయి. ఎందుకు ?
Answer:
Li⁺ అయాన్ యొక్క పరమాణు పరిమాణం తక్కువ మరియు హైడ్రేషన్ తీవ్రత ఎక్కువ. కావున Li లవణాలు చాలా వరకు ఆర్ద్రీకృతమై ఉంటాయి. ఉదా : LiCl·2H₂O
Exam Tips:
a) చిన్న Li⁺ కు అధిక హైడ్రేషన్ శక్తి ఉండటం ముఖ్య కారణం; LiCl·2H₂O ఉదాహరణ ఇవ్వండి.
Question 4: క్షారలోహాలలో దేనికి అసాధారణ సాంద్రత ఉంటుంది ? గ్రూపు 1 మూలకాల సాంద్రతల మార్పులో క్రమం ఏమిటి ?
Answer:
‘K’ మూలకానికి అసాధారణ సాంద్రత ఉంటుంది. దీని సాంద్రత Na కన్నా తక్కువ ఉంటుంది. K యొక్క స్ఫటిక జాలకంలో అంతర పరమాణుక దూరాలు ఎక్కువగా ఉంటాయి.
IA గ్రూపు మూలకాల సాంద్రత సాధారణంగా పెరుగుతుంది (K మినహా). అంటే Li < Na > K < Rb < Cs
Exam Tips:
a) K కి సాంద్రత అసాధారణం (Na కన్నా తక్కువ) అని చెప్పి, కారణంగా పరమాణువుల మధ్య ఎక్కువ దూరాన్ని రాయండి.
Question 5: సోడియమ్ కంటే లిథియమ్ నీటితో జరిపే చర్యాతీక్షణత తక్కువ. కారణాలను తెలపండి.
Answer:
లిథియమ్కు పరమాణు పరిమాణం తక్కువ మరియు హైడ్రేషన్ శక్తి ఎక్కువ. కావున Na కంటె Li నీటితో జరిపే చర్యా తీక్షణత తక్కువ.
Exam Tips:
a) నీటితో చర్యాశీలత క్రమం Li < Na < K < Rb < Cs; Li లో అధిక హైడ్రేషన్ శక్తి కారణం.
Question 6: క్షారలోహాల హాలైడ్లలో లిథియమ్ అయొడైడ్ అత్యధిక కోవలెంట్ ధర్మం కలది. కారణాలను తెలపండి.
Answer:
క్షారలోహాల హాలైడ్లలో లిథియమ్ అయొడైడ్ అత్యధిక కోవలెంట్ ధర్మం కలది. కారణాలు:
1. Li⁺ కు పరమాణు (అయానిక) పరిమాణం తక్కువ.
2. Li⁺ కు ధ్రువణ సామర్థ్యం ఎక్కువ.
3. I⁻ అయాన్ యొక్క పరిమాణం మిగిలిన హాలైడ్ అయాన్ల పరిమాణం కన్నా ఎక్కువ ఉండటం వలన దీనికి ధ్రువణం చెందే సామర్థ్యం (ధ్రువణీయత) ఎక్కువ.
Exam Tips:
a) Fajans నియమాల ఆధారంగా రాయండి: చిన్న కాటయాన్ (అధిక ధ్రువణ సామర్థ్యం) + పెద్ద ఆనయాన్ (అధిక ధ్రువణీయత) = ఎక్కువ కోవలెంట్ స్వభావం.
Question 7: క్షారలోహ హైడ్రోజన్ కార్బొనేట్ కంటే లిథియమ్ హైడ్రోజన్ కార్బొనేట్ ఏ విధంగా విభేదిస్తుంది ?
Answer:
లిథియమ్ హైడ్రోజన్ కార్బొనేట్ ఘనరూపంలో లభ్యం కాదు. కాని మిగిలిన క్షారలోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఘన పదార్థాలుగా ఏర్పడతాయి.
Exam Tips:
a) LiHCO₃ ఘన స్థితిలో లేదని, ద్రావణంలో మాత్రమే ఉంటుందని స్పష్టంగా రాయండి.
Question 8: ఏవైనా రెండు క్షారమృత్తిక లోహాల ఎలక్ట్రానిక్ విన్యాసాలను పూర్తిగా రాయండి.
Answer:
Be (Z = 4) – 1s² 2s²
Mg (Z = 12) – 1s² 2s² 2p⁶ 3s²
Ca (Z = 20) – 1s² 2s² 2p⁶ 3s² 3p⁶ 4s²
Exam Tips:
a) Be (Z = 4), Mg (12), Ca (20) - మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య సరిపోయిందో చూసుకోండి.
Question 9: క్షారమృత్తిక లోహాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాల మార్పుల గురించి చెప్పండి.
Answer:
క్షారమృత్తిక లోహాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు క్షార లోహాల కంటే ఎక్కువగా ఉంటాయి (లోహ బంధం బలమైనది). అయితే వాటి స్ఫటిక నిర్మాణాలు వేర్వేరుగా ఉండటం వల్ల ఈ విలువలు గ్రూపులో క్రమబద్ధంగా మారవు.
Exam Tips:
a) క్షార లోహాల కంటే ఎక్కువ, కానీ క్రమం లేదు - రెండు విషయాలు రాయండి.
Question 10: గ్రూపు 2 మూలకాలు జ్వాలకు కలిగించే స్వాభావిక రంగులు ఏమిటి ?
Answer:
గ్రూపు 2 మూలకాలు జ్వాలకు కలిగించే స్వాభావిక రంగులు
| మూలకం | జ్వాల స్వాభావిక రంగు |
| Be | రంగు లేదు |
| Mg | రంగు లేదు |
| Ca | ఇటుక ఎరుపు |
| Sr | కెంపు రంగు |
| Ba | ఆపిల్ ఆకుపచ్చ |
Exam Tips:
a) రంగులను పట్టికగా రాయండి: Ca ఇటుక ఎరుపు, Sr కెంపు, Ba ఆపిల్ ఆకుపచ్చ; Be, Mg జ్వాలకు రంగు ఇవ్వవు.
Question 11: మెగ్నీషియమ్ లోహాన్ని గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది ?
Answer:
Mg లోహాన్ని గాలిలో మండిస్తే కాంతివంతంగా మండి MgO మరియు Mg₃N₂ లను ఏర్పరచును.
2Mg + O₂ → 2MgO (మెగ్నీషియం ఆక్సైడ్)
3Mg + N₂ → Mg₃N₂ (మెగ్నీషియం నైట్రైడ్)
Exam Tips:
a) రెండు ఉత్పన్నాలు: MgO మరియు Mg₃N₂ - రెండు సమీకరణాలు రాయండి.
Question 12: లిథియమ్ కార్బొనేటికి మిగిలిన క్షారలోహాల కార్బొనేట్ల వలె ఉష్ణ స్థిరత్వం లేదు. వివరించండి.
Answer:
Li కు పరమాణు పరిమాణం తక్కువ మరియు ధ్రువణ సామర్థ్యం ఎక్కువ. కావున Li₂CO₃ తొందరగా విఘటనం చెంది స్థిరమైన Li₂O మరియు CO₂ లను ఏర్పరచును. కావున లిథియమ్ కార్బొనేట్కు మిగిలిన క్షారలోహాల కార్బొనేట్ల వలె ఉష్ణ స్థిరత్వం లేదు.
Li₂CO₃ → Li₂O + CO₂
Exam Tips:
a) Li⁺ ధ్రువణ సామర్థ్యం ఎక్కువ → Li₂CO₃ వేడికి Li₂O + CO₂ గా విఘటనం చెందుతుంది.
Question 13: గ్రూపు 2 లోహాలు ద్రవ అమ్మోనియాలో అమ్మోనియేటెడ్ లోహ అయాన్లు ఏర్పడటానికి తుల్య సమీకరణాన్ని రాయండి.
Answer:
M + (x + y)NH₃ → [M(NH₃)ₓ]²⁺ + 2[e(NH₃)ᵧ]⁻
Exam Tips:
a) సమీకరణంలో ద్రావణీకృత ఎలక్ట్రాన్ [e(NH₃)ᵧ]⁻ ను చూపండి; ద్రావణం నీలి రంగు, విద్యుద్వాహకం.
Question 14: క్షారమృత్తిక లోహాల ఫ్లోరైడ్లు నీటిలో ఆయా క్లోరైడ్ కంటే అల్ప ద్రావణీయత కలిగి ఉన్నవి. ఎందుకు ?
Answer:
ఫ్లోరైడ్ అయాన్ యొక్క పరిమాణం తక్కువ మరియు జాలక శక్తి ఎక్కువ. కావున క్షారమృత్తిక లోహాల ఫ్లోరైడ్లు నీటిలో ఆయా క్లోరైడ్ కంటే అల్ప ద్రావణీయత కలిగి ఉన్నవి.
Exam Tips:
a) ఫ్లోరైడ్ లోహపు జాలక శక్తి అధికం కావడం వల్ల ద్రావణీయత తక్కువ.
Question 15: ఆర్ద్ర Mg(NO₃)₂ ని వేడిచేస్తే ఏమౌతుంది ? దానికి తుల్య సమీకరణాన్ని ఇవ్వండి.
Answer:
ఆర్ద్ర Mg(NO₃)₂ లవణాన్ని వేడిచేయగా మొదట అనార్ద్ర Mg(NO₃)₂ ఏర్పడుతుంది. దీనిని తిరిగి వేడిచేస్తే ఆక్సైడ్ ఏర్పడుతుంది.
\( \mathrm{Mg(NO_3)_2 \cdot 6H_2O} \xrightarrow{\Delta} \mathrm{Mg(NO_3)_2} + 6\mathrm{H_2O} \)
\( 2\mathrm{Mg(NO_3)_2} \xrightarrow{\Delta} 2\mathrm{MgO} + 4\mathrm{NO_2} + \mathrm{O_2} \)
Exam Tips:
a) రెండు దశలు: నిర్జలీకరణం, తర్వాత MgO + NO₂ + O₂ ఏర్పడటం.
Question 16: క్షారమృత్తిక లోహ హైడ్రాక్సైడ్ జల ద్రావణీయత గ్రూపులో పైనుంచి కిందికి పెరుగుతుంది. ఎందుకో చెప్పండి.
Answer:
క్షార మృత్తిక లోహ గ్రూపులో (IIA) పై నుండి క్రిందకుపోయే కొలది ఆర్ద్రీకరణోష్ణం కంటే స్ఫటిక జాలక శక్తి అధికంగా తగ్గడం వల్ల వీటి హైడ్రాక్సైడ్ జల ద్రావణీయత క్రమంగా పెరుగుతుంది.
Exam Tips:
a) గ్రూపులో కిందికి జాలక శక్తి తగ్గుదల > ఆర్ద్రీకరణ శక్తి తగ్గుదల; కాబట్టి ద్రావణీయత పెరుగుతుంది.
Question 17: క్షారమృత్తిక లోహాల కార్బొనేట్ల, సల్ఫేట్ల జలద్రావణీయత గ్రూపులో కిందికి పోయినకొద్దీ ఎందుకు తగ్గుతుంది?
Answer:
గ్రూపులో పై నుంచి క్రిందకు పరమాణు పరిమాణం పెరుగుతుంది. కావున కార్బొనేట్, సల్ఫేట్ల యొక్క జాలక మరియు హైడ్రేషన్ ఎంథాల్పీలు తగ్గుతాయి. హైడ్రేషన్ఎంథాల్పీలో తగ్గుదల జాలక ఎంథాల్పీలో తగ్గుదల కన్నా ఎక్కువగా ఉంటుంది. కావున క్షార మృత్తిక లోహాల కార్బొనేట్ల, సల్ఫేట్ల జలద్రావణీయత పై నుంచి క్రిందకు తగ్గుతాయి.
Exam Tips:
a) కార్బొనేట్లు, సల్ఫేట్లకు ఇక్కడ ఆర్ద్రీకరణ ఎంథాల్పీ తగ్గుదల ఎక్కువ కాబట్టి ద్రావణీయత తగ్గుతుంది (హైడ్రాక్సైడ్లకు వ్యతిరేకం).
Question 18: పోర్ట్లాండ్ సిమెంట్ సగటు సంఘటనాన్ని తెలపండి.
Answer:
పోర్ట్లాండ్ సిమెంట్ సంఘటనం:
| ఘటకం | శాతం |
| CaO | 50–60% |
| SiO₂ | 20–25% |
| Al₂O₃ | 5–10% |
| MgO | 2–3% |
| Fe₂O₃ | 1–2% |
| SO₃ | 1–2% |
Exam Tips:
a) పట్టికలోని శాతాలను (CaO 50-60% మొదలైనవి) గుర్తుంచుకోండి.
Question 19: సిమెంట్‌కి జిప్సమ్ని ఎందుకు కలుపుతారు ?
Answer:
సిమెంట్‌కు జిప్సమ్ కలుపుట వలన సెట్టింగ్ నెమ్మదిగా జరిగి సిమెంట్ తగినంతగా గట్టిపడుతుంది.
Exam Tips:
a) జిప్సమ్ సెట్టింగ్ వేగాన్ని తగ్గిస్తుంది - ఇదే ముఖ్య పాయింట్.
Question 20: ప్రకృతిలో క్షారలోహాలు స్వేచ్ఛా స్థితిలో ఎందుకు దొరకవు ? (March 2013)
Answer:
క్షారలోహాలు చాలా చురుకైనవి. అందుచేత అవి స్వేచ్ఛా స్థితిలో దొరకవు. ఎప్పుడూ సంయోగస్థితిలోనే దొరుకుతాయి. Na మరియు K లు విస్తారంగా దొరికే క్షారలోహాలు.
Exam Tips:
a) క్షార లోహాలు చాలా చురుకైనవి కాబట్టి సంయోగ స్థితిలోనే దొరుకుతాయి అని రాయండి.
Question 21: సాల్వే పద్ధతిలో పొటాషియమ్ కార్బొనేట్‌ని తయారుచేయలేం. ఎందుకు ?
Answer:
అమ్మోనియం బై కార్బొనేట్‌ను సంతృప్త KCl కలిపితే KHCO₃ అవక్షేపం ఏర్పడుతుంది. కాని అట్లేర్పడ్డ KHCO₃ అధిక ద్రావణీయత కలిగి ఉంటుంది. కావున పొటాషియమ్ కార్బొనేట్‌ను సాల్వే పద్దతిలో తయారు చేయలేము.
Exam Tips:
a) KHCO₃ నీటిలో చాలా ఎక్కువగా కరుగుతుంది కాబట్టి అవక్షేపం రాదు.
Question 22: కాస్టిక్ సోడా ముఖ్యమైన ఉపయోగాలను వివరించండి.
Answer:
కాస్టిక్ సోడా యొక్క ఉపయోగాలు
1. సబ్బు, కాగితం, కృత్రిమ సిల్క్ మరియు అనేక రసాయన పదార్థాల భారీ తయారీల్లో ఉపయోగిస్తారు.
2. పెట్రోలియం శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు.
3. బాక్సైట్‌ను శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు.
4. శుద్ధ కొవ్వులను, నూనెలను తయారుచేయటానికి ఉపయోగిస్తారు.
5. ప్రయోగశాలలో కారకంగా ఉపయోగిస్తారు.
Exam Tips:
a) కనీసం నాలుగు ఉపయోగాలను పాయింట్లుగా రాయండి.
Question 23: సోడియమ్ కార్బొనేట్ ముఖ్య ఉపయోగాలను వివరించండి.
Answer:
సోడియమ్ కార్బొనేట్ ముఖ్య ఉపయోగాలు
1. మృదుజలాన్ని తయారుచేయటానికి, నేలను శుభ్రపరచటానికి Na₂CO₃ ను వాడతారు.
2. లాండ్రీలలో Na₂CO₃ ను వాడతారు.
3. గాజు, సబ్బు, బొరాక్స్, కాస్టిక్ సోడాల తయారీలో వాడతారు.
4. కాగితం, రంగులు, వస్త్ర పరిశ్రమలలో వాడతారు.
Exam Tips:
a) ఉపయోగాలను సంఖ్యలతో వేర్వేరు పంక్తులలో రాయండి.
Question 24: పొడిసున్నం ముఖ్య ఉపయోగాలను వివరించండి.
Answer:
పొడిసున్నం ఉపయోగాలు
1. చక్కెరను శుద్ధి చేయుటలో ఉపయోగిస్తారు.
2. రంజన ద్రవ్యాలను తయారుచేయటంలో వాడతారు.
3. సిమెంట్ తయారీలో వాడతారు.
4. Na₂CO₃, NaOH ల తయారీలో ఉపయోగిస్తారు.
Exam Tips:
a) పొడిసున్నం = CaO; నాలుగు ఉపయోగాలు రాయండి.
Question 25: (i) BeCl₂ (బాష్పం)
(ii) BeCl₂ (ఘనపదార్థం) ల నిర్మాణాలను గీయండి.
Answer:
i) BeCl₂ (బాష్పం) 1200K వద్ద రేఖీయ రూపంలో ఉండును.
Cl – Be – Cl
ii) ఘనస్థితిలో BeCl₂ శృంఖల నిర్మాణం కలిగి ఉండును.
Exam Tips:
a) BeCl₂ ఆవిరి రేఖీయం (1200 K) మరియు ఘనం శృంఖలం - రెండింటికీ పటం గీయండి.
Question 26: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రాముఖ్యతను వివరించండి.
Answer:
1. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ని గృహ నిర్మాణాల్లోను, ప్లాస్టర్లలోను ఉపయోగిస్తారు.
2. ఎముకలు విరిగినా, నొప్పులు పట్టినా శరీర అవయవాలను కదలిక లేకుండా చేయడానికి దీనిని వాడతారు.
3. దంత వైద్యంలో దీనిని వాడతారు.
Exam Tips:
a) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగాలు: నిర్మాణం, ఎముకల కట్టు, దంత వైద్యం.
Question 27: క్షారమృత్తిక లోహాల కార్బొనేట్లలో దేనికి అధిక ఉష్ణ స్థిరత్వం ఉంటుంది ? ఎందుకు ?
Answer:
క్షారమృత్తిక లోహాల కార్బొనేట్లలో BaCO₃ కు అధిక ఉష్ణస్థిరత్వం ఉంటుంది. కారణం Ba²⁺ అయాన్ యొక్క పరిమాణం ఎక్కువ కావటం వలన ధ్రువణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందువలన BaCO₃ త్వరగా విఘటనం చెందదు. కావున BaCO₃ కు ఉష్ణస్థిరత్వం ఎక్కువగా ఉంటుంది.
Exam Tips:
a) BaCO₃ లో Ba²⁺ పెద్దది, ధ్రువణ సామర్థ్యం తక్కువ → ఎక్కువ ఉష్ణ స్థిరత్వం.
Question 28: కింది చర్యలకు తుల్య సమీకరణాలను రాయండి.
i) Na₂O₂ నీరు రసాయన చర్య
ii) నీటితో K₂O చర్య
Answer:
i) Na₂O₂ + 2H₂O → 2NaOH + H₂O₂
ii) K₂O + H₂O → 2KOH
Exam Tips:
a) తుల్య సమీకరణాలు: Na₂O₂ + 2H₂O → 2NaOH + H₂O₂; K₂O + H₂O → 2KOH.
లఘు సమాధాన ప్రశ్నలు
Question 29: ఆక్సీకరణ జ్వాలకు క్షారలోహాలు, వాటి సమ్మేళనాలు స్వాభావిక రంగులను ఇస్తాయి. కారణాలను వివరించండి.
Answer:
క్షారలోహాలు, వాటి సమ్మేళనాలు ఆక్సీకరణ జ్వాలకు స్వాభావిక రంగులను ఇస్తాయి. జ్వాల నుంచి ఉష్ణాన్ని గ్రహించి బాహ్య ఆర్బిటాల్ ఎలక్ట్రాన్‌ను పై శక్తిస్థాయికి ఉత్తేజపరుస్తాయి. ఉత్తేజిత ఎలక్ట్రాన్ తిరిగి భూస్థాయికి చేరినప్పుడు వికిరణాలను ఉద్గారిస్తుంది. ఈ వికిరణాలు దృశ్య కాంతి ప్రాంతంలో ఉంటాయి. కావున ఇవి రంగులను ప్రదర్శిస్తాయి.
Exam Tips:
a) ఉత్తేజం → తిరిగి భూస్థాయికి వచ్చేటపుడు దృశ్య కాంతి ఉద్గారం, ఈ మూడు దశలను వరుసగా రాయండి.
Question 30: కాంతి విద్యుత్ ఘటాల ఎలక్ట్రోడ్లుగా సీసియమ్, పొటాషియమ్ ఏ ధర్మాలు ఉపయోగపడతాయి ?
Answer:
సీసియమ్, పొటాషియమ్లలో అయనీకరణ శక్తులు తక్కువగా ఉంటాయి. కాంతితో ఈ లోహాలను చర్య జరిపినపుడు ఆ లోహ పరమాణువులు ఎలక్ట్రాన్ కోల్పోవుటకు సరైన శక్తిని శోషించుకొంటాయి. కావున సీసియమ్, పొటాషియమ్లు కాంతి విద్యుత్ ఘటాల ఎలక్ట్రోడ్లుగా ఉపయోగపడతాయి.
Exam Tips:
a) Cs, K లో అయనీకరణ శక్తి తక్కువ → కాంతి వల్ల ఎలక్ట్రాన్లు సులభంగా వెలువడతాయి (కాంతి విద్యుత్ ప్రభావం).
Question 31: క్షార లోహాలు గాలితో చర్యపై లఘు వ్యాఖ్యను రాయండి.
Answer:
క్షార లోహాలు గాలిలో చురుగ్గా మండి ఆక్సైడ్లను ఇస్తాయి. లిథియమ్ మోనాక్సైడ్‌ను ఇస్తుంది.
4Li + O₂ → 2Li₂O (లిథియమ్ మోనాక్సైడ్)
సోడియమ్ ఆక్సిజన్‌తో మితంగా చర్య జరిపితే మోనాక్సైడ్‌ను, అధికంగా చర్య జరిపితే పెరాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
4 Na + O₂ (మితంగా) → 2Na₂O (సోడియమ్ మోనాక్సైడ్)
2Na + O₂ (అధికంగా) → Na₂O₂ (పెరాక్సైడ్)
మిగిలిన లోహాలు ఆక్సిజన్‌లో చర్య జరిపి సూపరాక్సైడ్లను ఏర్పరుస్తాయి.
M + O₂ → MO₂ (సూపరాక్సైడ్)
Exam Tips:
a) Li → Li₂O; Na → Na₂O₂ (అధికంగా); K, Rb, Cs → సూపరాక్సైడ్ MO₂.
Question 32: కింది లోహాలు ఒక్కొక్కదానికి ఏవైనా రెండు ఉపయోగాలను రాయండి.
(i) లిథియమ్
(ii) సోడియమ్
Answer:
i) లిథియమ్ ఉపయోగాలు.
a) మిశ్రమ లోహాల తయారీలో వాడతారు. ఉదా : Li – Pb మిశ్రమ లోహం మోటార్ ఇంజన్లలో బేరింగ్‌లుగా వాడతారు. Li – Al మిశ్రమ లోహాలు విమాన భాగాల తయారీలో వాడతారు.
b) Li ను ఉష్ణకేంద్రక చర్యలలోను, విద్యుత్ రసాయన ఘటాల తయారీలోను వాడతారు.
ii) సోడియమ్ లోహం – ఉపయోగాలు.
a) కర్బన రసాయన చర్యల్లో కారకంగా వాడతారు.
b) మిశ్రమ లోహాల తయారీలో వాడతారు.
c) శీతలకారిగా వాడతారు.
d) ఐసోప్రీన్ ను పాలిమరీకరణం చెందించి రబ్బర్ ఏర్పడటంలో ఉత్ప్రేరకంగా వాడతారు.
Exam Tips:
a) రెండు లోహాలకు ఒక్కో రెండు ఉపయోగాలు రాయండి.
Question 33: వాషింగ్ సోడా ధర్మాలను రాయండి.
Answer:
వాషింగ్ సోడా ధర్మాలు:
Na₂CO₃·10H₂O (డెకాహైడ్రేట్) ను వాషింగ్ సోడా అంటారు. ఇది తెల్లని, రంగులేని, స్ఫటిక ఘనపదార్థం.
ఇది నీటిలో కరుగుతుంది.
దీనిని వేడిచేయగా నీటి అణువులను కోల్పోయి మోనోహైడ్రేట్గా మారును. దీనిని 373K కంటే ఎక్కువగా వేడిచేసినపుడు సోడా యాషన్ను ఏర్పరచును.
\( \mathrm{Na_2CO_3 \cdot 10H_2O} \xrightarrow{373\,K} \underset{\text{మోనోహైడ్రేట్}}{\mathrm{Na_2CO_3 \cdot H_2O}} + 9\mathrm{H_2O} \)
\( \mathrm{Na_2CO_3 \cdot H_2O} \xrightarrow{>373\,K} \underset{\text{సోడాయాష్}}{\mathrm{Na_2CO_3}} + \mathrm{H_2O} \)
Na₂CO₃ జలద్రావణం CO₂ ను శోషించుకొని సోడియం బై కార్బొనేట్‌ను ఇస్తుంది.
Na₂CO₃ + H₂O + CO₂ → 2NaHCO₃
Na₂CO₃ ఆమ్లాలతో చర్య జరిపి CO₂ వాయువును ఇస్తుంది.
Na₂CO₃ + 2HCl → 2NaCl + H₂O + CO₂
ఆనయాన్ జలవిశ్లేషణం వలన Na₂CO₃ జలద్రావణానికి క్షారస్వభావం ఉంటుంది.
CO₃²⁻ + H₂O ⇌ HCO₃⁻ + OH⁻
Exam Tips:
a) వాషింగ్ సోడా సమీకరణాలు (373 K, >373 K) మరియు క్షార స్వభావానికి జలవిశ్లేషణ సమీకరణం రాయండి.
Question 34: సోడియమ్ కార్బొనేట్ ఉపయోగాలను రాయండి.
Answer:
సోడియమ్ కార్బొనేట్ ముఖ్య ఉపయోగాలు
1. మృదుజలాన్ని తయారుచేయటానికి, నేలను శుభ్రపరచటానికి Na₂CO₃ ను వాడతారు.
2. లాండ్రీలలో Na₂CO₃ ను వాడతారు.
3. గాజు, సబ్బు, బొరాక్స్, కాస్టిక్ సోడాల తయారీలో వాడతారు.
4. కాగితం, రంగులు, వస్త్ర పరిశ్రమలలో వాడతారు.
Exam Tips:
a) ఉపయోగాలను సంఖ్యల వారీగా రాయండి.
Question 35: ముడి సోడియమ్ క్లోరైడ్ నుంచి శుద్ధ లవణాన్ని మీరు ఎట్లా తయారుచేస్తారు ?
Answer:
ముడి సోడియమ్ క్లోరైడ్ నుంచి శుద్ధ లవణాన్ని తయారుచేయుట:
1. ముడి లవణాన్ని ముందుగా వీలైనంత కనీస నీటిలో కరిగించి, తరువాత వడబోస్తారు. నీటిలో కరగని మలినాలను తీసివేస్తారు.
2. ద్రావణంలోనికి హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును పంపి సంతృప్తపరుస్తారు. శుద్ధ NaCl స్ఫటికాలు వేరుపడతాయి.
3. కాల్షియమ్ క్లోరైడ్, మెగ్నీషియమ్ క్లోరైడ్లు NaCl కంటే అధిక ద్రావణీయత కలవి కాబట్టి ద్రావణంలో మిగిలిపోతాయి.
Exam Tips:
a) HCl వాయువు పంపినపుడు సాధారణ అయాన్ ప్రభావంతో NaCl స్ఫటికాలు వేరుపడతాయి.
Question 36: కాష్టనర్-కెల్నర్ పద్ధతి గురించి మీకేమి తెలుసు ? దానిలో ఉన్న సూత్రాన్ని రాయండి.
Answer:
కాష్టనర్-కెల్నర్ ఘటంలో NaCl ను విద్యుద్విశ్లేషణ చేసి NaOH ను తయారుచేస్తారు. ఈ పద్ధతిలో మెర్క్యురీ కాథోడ్గాను, కార్బన్ ఆనోడ్గాను పనిచేస్తాయి. కాథోడ్ వద్ద ఏర్పడ్డ Na లోహం మెర్క్యురీతో సంయోగం చెంది సోడియమ్ అమాల్గమ్ను ఇస్తుంది. ఆనోడ్ వద్ద క్లోరిన్ వాయువు వెలువడుతుంది.
కాథోడ్:
\( \mathrm{Na^{+} + e^{-}} \xrightarrow{\mathrm{Hg}} \mathrm{Na\text{-}అమాల్గమ్} \)
ఆనోడ్: Cl⁻ → ½Cl₂ + e⁻
అమాల్గమ్ నీటితో అభిచర్య జరిపితే సోడియమ్ హైడ్రాక్సైడ్, హైడ్రోజన్ వాయువు వస్తాయి.
2Na-అమాల్గమ్ + 2H₂O → 2NaOH + 2Hg + H₂
Exam Tips:
a) సెల్ లో Hg కాథోడ్, కార్బన్ ఆనోడ్; అమాల్గమ్ + నీరు → NaOH + H₂ - చివరి సమీకరణం మర్చిపోకండి.
Question 37: కాస్టిక్ సోడా అనువర్తనాలను రాయండి.
Answer:
కాస్టిక్ సోడా యొక్క ఉపయోగాలు
1. సబ్బు, కాగితం, కృత్రిమ సిల్క్ మరియు అనేక రసాయన పదార్థాల భారీ తయారీల్లో ఉపయోగిస్తారు.
2. పెట్రోలియం శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు.
3. బాక్సైట్‌ను శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు.
4. శుద్ధ కొవ్వులను, నూనెలను తయారుచేయటానికి ఉపయోగిస్తారు.
5. ప్రయోగశాలలో కారకంగా ఉపయోగిస్తారు.
Exam Tips:
a) ఉపయోగాలను పాయింట్లుగా రాయండి.
Question 38: Na⁺, K⁺ అయాన్ల ప్రాముఖ్యతను జీవరసాయన శాస్త్రంలో చెప్పండి.
Answer:
1. కణాల్లోని కర్బన అణువులలో ఉన్న ఋణావేశాలను లోహ అయాన్లపై ఉండే ఆవేశాలు తుల్యం చేస్తాయి.
2. కణాలలో ద్రవాభిసరణ పీడనాన్ని కూడా నిలకడగా ఉంచటానికి ఈ అయాన్లు సహాయపడతాయి.
3. కణపు పొరకు అటు, ఇటు రెండు పక్కల Na⁺, K⁺ అయాన్ లుంటాయి. దీని వలన కణంలో విద్యుత్ శక్మం ఏర్పడుతుంది. Na⁺ అయాన్లుండటం వలన గ్లూకోజ్ కణం లోపలికి వెళుతుంది. అధికంగా ఉన్న Na⁺ అయాన్లు బహిష్కృతమవుతాయి.
4. పొటాషియమ్ అయాన్లు కణాంతర్భాగంలో గ్లూకోజ్ జీవన క్రియల్లో దోహదపడతాయి. ప్రోటీన్ సంశ్లేషణలోనూ, కొన్ని నిర్దిష్టమైన ఎంజైములు ఉత్తేజితమవటానికి సహాయపడతాయి.
Exam Tips:
a) Na⁺, K⁺ పాత్రలు: ద్రవాభిసరణ పీడనం, నాడీ ప్రచోదనం (విద్యుత్ శక్మం), ఎంజైమ్ ఉత్తేజం.
Question 39: Mg లోహం ముఖ్య ఉపయోగాలను చెప్పండి.
Answer:
Mg లోహం ముఖ్య ఉపయోగాలు
Mg లోహం Al, Zn, Mn మరియు Sn లలో ముఖ్యమైన మిశ్రమ లోహాలను ఏర్పరచును.
మిల్క్ ఆఫ్ మెగ్నీషియమ్ను ఆమ్ల విరోధిగా వాడతారు.
టూత్‌పేస్ట్‌లలో ఉపయోగిస్తారు.
ఇన్సెండియరీ బాంబులు మరియు సిగ్నల్స్‌లో Mg ని ఉపయోగిస్తారు.
Mg పొడి మరియు రిబ్బన్లను ఫ్లాష్ బల్బులలో ఉపయోగిస్తారు.
Exam Tips:
a) Mg ఉపయోగాలు: మిశ్రమ లోహాలు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఫ్లాష్ బల్బులు.
Question 40: Be(OH)₂ ద్విస్వభావ పదార్థం అని రుజువు చేయండి.
Answer:
బెరిలియమ్ హైడ్రాక్సైడ్ ఆమ్లాలతోను, క్షారాలతోను చర్య జరుపుతుంది. కాబట్టి దానికి ద్విస్వభావం ఉంటుంది.
\( \mathrm{Be(OH)_2} + 2\mathrm{OH^{-}} \longrightarrow \underset{\text{బెరిలేట్ అయాన్}}{[\mathrm{Be(OH)_4}]^{2-}} \)
\( \mathrm{Be(OH)_2} + 2\mathrm{HCl} + 2\mathrm{H_2O} \longrightarrow [\mathrm{Be(H_2O)_4}]\mathrm{Cl_2} \)
Exam Tips:
a) ఆమ్లంతో మరియు క్షారంతో - రెండు చర్యలనూ రాస్తేనే ద్విస్వభావం రుజువవుతుంది.
Question 41: బెరిలియమ్ అసంగత ప్రవర్తన గురించి ఒక వ్యాఖ్యను రాయండి.
Answer:
బెరిలియమ్ అసంగత ప్రవర్తన.
బెరిలియమ్ అదే గ్రూపులోని ఇతర లోహాలతో పోలిస్తే అసంగత ప్రవర్తనని చూపిస్తుంది.
1. బెరిలియమ్ పరమాణు, అయానిక పరిమాణాలు తక్కువగా ఉండటం వలన, ఇది ఎక్కువగా కోవలెంట్ సమ్మేళనాలను ఇస్తుంది. ఈ సమ్మేళనాలు తేలిగ్గా జలవిశ్లేషణ చెందుతాయి.
2. Be సమన్వయ సంఖ్య 4. కాని మిగిలిన మూలకాలు d – ఆర్బిటాళ్ళను ఉపయోగించుకొని సమన్వయ సంఖ్య 6ను ప్రదర్శిస్తాయి.
3. బెరిలియమ్ ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్లు ద్వి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి.
Exam Tips:
a) చిన్న పరిమాణం, కోవలెంట్ స్వభావం, సమన్వయ సంఖ్య 4, ద్విస్వభావ ఆక్సైడ్ - నాలుగు అంశాలు.
Question 42: Be, Al తో కర్ణ సంబంధం కలిగి ఉంటుంది. చర్చించండి.
Answer:
బెరిలియమ్, అల్యూమినియంతో కర్ణసంబంధాన్ని కలిగి ఉంటుంది.
1. Al మాదిరిగానే Be కూడా ఆమ్లాలతో చర్య జరపదు.
2. Be (OH)₂ మరియు Al (OH)₃ రెండు కూడా క్షారంలో కరిగి బేరిలేట్ అయాన్[Be(OH)₄]²⁻ మరియు అల్యూమినేట్ అయాన్ [Al(OH)₄]⁻ లను ఏర్పరుస్తాయి.
3. వాయు ప్రావస్థలో బెరిలియమ్, అల్యూమినియమ్ క్లోరైడ్లకు వంతెన నిర్మాణాలు ఉంటాయి.
4. Be, Al రెండు కూడా సంక్లిష్టాలను ఏర్పరుస్తాయి.
5. Be, Al క్లోరైడ్లు లూయీ ఆమ్లాలుగా పనిచేస్తాయి.
Exam Tips:
a) Be–Al కర్ణ సంబంధానికి ఐదు పాయింట్లు (ఆమ్లాలతో చర్యలేకపోవడం, ద్విస్వభావం, వంతెన నిర్మాణం...) రాయండి.
Question 43: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏమిటి ? దాని మీద లఘు వ్యాఖ్యను రాయండి.
Answer:
కాల్షియమ్ సల్ఫేట్ హెమిహైడ్రేట్ను (CaSO₄·½H₂O) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు.
తయారీ: జిప్సమ్ CaSO₄·2H₂O ని 393 K వద్ద వేడిచేసి దీనిని తయారు చేస్తారు.
2(CaSO₄·2H₂O) → 2(CaSO₄)·H₂O + 3H₂O
393 K కంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను వేడిచేస్తే అనార్ద్ర CaSO₄ ఏర్పడుతుంది. దీనినే “డెడ్ బర్న్ట్ ప్లాస్టర్” అంటారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు తగినంత నీరు కలిపితే ప్లాస్టిక్ పదార్థం లాంటిది ఏర్పడుతుంది. ఈ పదార్థం 5 నుంచి 15 నిమిషాలలో గట్టిపడుతుంది.
ఉపయోగాలు:
దీనిని గృహ నిర్మాణాల్లోను, ప్లాస్టర్లలోను అతి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎముకలు విరిగినా, నొప్పులు పట్టినా శరీర అవయవాలను కదలిక లేకుండా చేయటానికి దీనిని వాడతారు.
దంతవైద్యంలో దీనిని వాడతారు.
Exam Tips:
a) తయారీ సమీకరణంలో 393 K ఉష్ణోగ్రత మరియు 3H₂O గుర్తుంచుకోండి.
Question 44: రసాయన ప్రవృత్తిలో మెగ్నీషియమ్ లిథియమ్ ఏ రకంగా సారూప్యతను చూపిస్తుంది ?
Answer:
రసాయన ప్రవృత్తిలో Mg, Li ల సారూప్యత.
1. Li, Mg లు నీటితో నెమ్మదిగా చర్య జరుపుతాయి. వాటి ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్లు తక్కువగా కరుగుతాయి.
2. అవి రెండూ నైట్రోజన్‌తో చర్య జరిపి నైట్రైడ్లను ఏర్పరుస్తాయి.
3. Li, Mg లు రెండూ కూడా ఆక్సిజన్‌తో చర్య జరిపి మోనాక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.
4. Li, Mg కార్బొనేట్లు వేడిచేస్తే తేలిగ్గా విఘటనం చెంది ఆక్సైడ్లను, CO₂ ను ఇస్తాయి.
5. LiCl, MgCl₂ లు రెండూ చెమ్మగిల్లే పదార్థాలే. సజల ద్రావణాల నుంచి వాటి హైడ్రేట్లు LiCl·2H₂O, MgCl₂·8H₂O స్ఫటికీకరణం చెందుతాయి.
Exam Tips:
a) Li–Mg సారూప్యతలు ఐదు పాయింట్లుగా రాయండి.
Question 45: ద్రవ అమ్మోనియాలో క్షార లోహాలను కరిగిస్తే, ద్రావణానికి వివిధ రంగులు వస్తాయి. ఈ రకమైన రంగుల్లో మార్పుకు కారణాలను వివరించండి.
Answer:
క్షారలోహాలు ద్రవ అమ్మోనియాలో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాలను ఇస్తాయి. ఈ ద్రావణాలకు విద్యుద్వాహక లక్షణం ఉంటుంది.
M + (x + y)NH₃ → [M(NH₃)ₓ]⁺ + [e(NH₃)ᵧ]⁻
ఈ నీలిరంగు ద్రావణంలో అమ్మోనియాలో ఎలక్ట్రాన్ కలిసి ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ దృగ్గోచర ప్రాంతంలో కాంతిని శోషించుకుంటుంది. కాబట్టి ద్రావణానికి నీలి రంగు వస్తుంది.
ఈ ద్రావణాలు పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి.
గాఢ ద్రావణాన్ని వేడిచేస్తే నీలంరంగు కంచు రంగుగా మారుతుంది. ద్రావణం డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది.
Exam Tips:
a) నీలి రంగు → ద్రావణీకృత ఎలక్ట్రాన్ కాంతి శోషణ; గాఢ ద్రావణంలో కంచు రంగు, డయా అయస్కాంతం.
Question 46: i) సోడియమ్ లోహాన్ని నీటిలో వేస్తే ఏమి జరుగుతుంది ?
ii) సోడియమ్ లోహానికి గాలిని స్వేచ్ఛగా సరఫరా చేస్తే ఏమి జరుగుతుంది?
Answer:
i) సోడియం లోహాన్ని నీటిలో వేస్తే H₂ వాయువును విడుదల చేస్తుంది.
2Na + 2H₂O → 2NaOH + H₂
ii) సోడియమ్ లోహానికి గాలిని స్వేచ్ఛగా సరఫరా చేస్తే సోడియమ్ పెరాక్సైడ్ ఏర్పడుతుంది.
2Na + O₂ → Na₂O₂
Exam Tips:
a) రెండు చర్యలకు తుల్య సమీకరణాలు రాయండి: Na + H₂O, Na + O₂.
Question 47: కింది వాటికి కారణాలేమిటి ?
i) Na₂CO₃ జల ద్రావణం క్షార ధర్మం కలిగి ఉంటుంది.
ii) క్షార లోహాలను, వాటి గలన క్లోరైడ్లని విద్యుద్విశ్లేషణ చేసి తయారుచేస్తారు.
Answer:
i) Na₂CO₃ జల ద్రావణం క్షార స్వభావం కలిగి ఉంటుంది. నీటిలో ఆనయానిక్ జలవిశ్లేషణ జరిగి OH⁻ అయాన్లు విడుదలవుతాయి. జలద్రావణం pH > 7 కావున ద్రావణం క్షార స్వభావం కలిగి ఉండును.
Na₂CO₃ → 2Na⁺ + CO₃²⁻
CO₃²⁻ + H₂O ⇌ HCO₃⁻ + OH⁻
ii) క్షారలోహాలు బలమైన క్షయకరణులు. కావున రసాయన క్షయకరణ పద్ధతుల ద్వారా వీటిని తయారుచేయలేము. క్షారలోహ లవణ జల ద్రావణాలను విద్యుద్విశ్లేషణ చేస్తే క్షార లోహాలకు బదులుగా కాథోడ్ వద్ద H₂ వాయువు విడుదలవుతుంది. కావున గలన క్లోరైడ్లను విద్యుద్విశ్లేషణ చేయటం ద్వారా మాత్రమే మనము క్షారలోహాలను తయారుచేస్తాము. ఉదా : గలన NaCl ను విద్యుద్విశ్లేషణ చేసి Na లోహాన్ని తయారుచేస్తాము.
Exam Tips:
a) ప్రతి భాగానికి కారణం + సమీకరణం (ఆనయాన్ జలవిశ్లేషణ / గలన NaCl విద్యుద్విశ్లేషణ) రాయండి.
Question 48: కింది పరిశీలనలను మీరు ఎట్లా వివరిస్తారు ?
i) BeO దాదాపు కరగదు, కానీ BeSO₄ నీటిలో కరుగుతుంది.
ii) BaO నీటిలో కరుగుతుంది, కానీ BaSO₄ కరగదు.
Answer:
BeO లో జాలక ఎంథాల్పీ, హైడ్రేషన్ ఎంథాల్పీ కన్నా ఎక్కువగా ఉంటుంది. కావున అది నీటిలో కరగదు. కాని BeSO₄ లో జాలక ఎంథాల్పీ హైడ్రేషన్ ఎంథాల్పీ కన్నా తక్కువగా ఉంటుంది. కావున అది నీటిలో కరుగుతుంది.
BaO లో జాలక ఎంథాల్పీ, హైడ్రేషన్ ఎంథాల్పీ కన్నా తక్కువగా ఉంటుంది. కావున అది నీటిలో కరుగుతుంది. BaSO₄ లో జాలక ఎంథాల్పీ, హైడ్రేషన్ ఎంథాల్పీ కన్నా ఎక్కువగా ఉంటుంది. కావున అది నీటిలో కరగదు.
Exam Tips:
a) రెండు జతలకు జాలక ఎంథాల్పీ, ఆర్ద్రీకరణ ఎంథాల్పీల పోలికతో వివరించండి.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 49: కింది అంశాలపరంగా క్షారలోహాలను ఒకే గ్రూపులో చేర్చడాన్ని సమర్థించండి.
i) ఎలక్ట్రానిక్ విన్యాసం,
ii) క్షయకరణి స్వభావం,
iii) ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్లు
Answer:
i) ఎలక్ట్రానిక్ విన్యాసం
| మూలకం | సంకేతం | ఎలక్ట్రాన్ విన్యాసం |
| లిథియమ్ | Li | [He] 2s¹ |
| సోడియమ్ | Na | [Ne] 3s¹ |
| పొటాషియమ్ | K | [Ar] 4s¹ |
| రుబిడియమ్ | Rb | [Kr] 5s¹ |
| సీసియమ్ | Cs | [Xe] 6s¹ |
| ఫ్రాన్సియమ్ | Fr | [Rn] 7s¹ |
క్షార లోహాల బాహ్య కక్షలో ఎలక్ట్రాన్ విన్యాసం ns¹. అన్ని మూలకాలు వేలన్సీ కక్షలో ఒక ఎలక్ట్రాన్‌ను కలిగి ఉంటాయి.
ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండటం వలన ధర్మాలలో సారూప్యత కనిపిస్తుంది. కావున క్షారలోహాలన్నీ ఒకే గ్రూపులో ఉండటాన్ని సమర్థించవచ్చు.
ii) క్షయకరణ స్వభావం
క్షారలోహాలు బలమైన క్షయకరణులు
Li అధిక క్షయకరణ స్వభావం కలది. ‘Na’ తక్కువ క్షయకరణ స్వభావం కలది.
క్షయకరణ స్వభావానికి ప్రమాణ విద్యుత్ పొటెన్షియల్ (E°) ఒక కొలమానం. Li కు అధిక హైడ్రేషన్ ఎంథాల్పీ కలదు. దీనికి అధిక రుణాత్మక E° విలువ కలదు. కావున ఇది బలమైన క్షయకారిణి.
iii) a) ఆక్సైడ్లు : అన్ని క్షార లోహాలు మంచి క్షయకారిణులు. కాబట్టి వాటిని ఒకే గ్రూపులో ఉంచారు. క్షార లోహాలు గాలిలో చురుగ్గా మండి ఆక్సైడ్లను ఇస్తాయి. లిథియమ్ మోనాక్సైడ్‌ను ఇస్తుంది.
4Li + O₂ → 2Li₂O (లిథియమ్ మోనాక్సైడ్)
సోడియమ్ ఆక్సిజన్‌తో మితంగా చర్య జరిపితే మోనాక్సైడ్, అధికంగా చర్య జరిపితే పెరాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
4 Na + O₂ (మితంగా) → 2Na₂O (సోడియమ్ మోనాక్సైడ్)
2Na + O₂ (అధికంగా) → Na₂O₂ (పెరాక్సైడ్)
మిగిలిన లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరిపి సూపరాక్సైడ్లను ఏర్పరుస్తాయి.
M + O₂ → MO₂ (సూపరాక్సైడ్)
క్షారలోహ అయాన్ పరిమాణం పెరిగిన కొలది సూపరాక్సైడ్ వంటి పెద్ద ఆనయాన్లు పెద్ద కాటయాన్లతో స్థిరమైన జాలకాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి సూపరాక్సైడ్ స్థిరత్వం పెరుగుతుంది.
b) హైడ్రాక్సైడ్లు : క్షారలోహ ఆక్సైడ్లు జల విశ్లేషణ జరిపి హైడ్రాక్సైడ్లు ఏర్పరచును.
M₂O + H₂O → 2MOH
M₂O₂ + 2H₂O → 2MOH + H₂O₂
2MO₂ + 2H₂O → 2MOH + H₂O₂ + O₂ (M = క్షార లోహం)
ఇవి రంగులేని స్ఫటిక ఘన పదార్ధాలు.
ఇవి బలమైన క్షారాలు మరియు నీటిలో కరిగి ఉష్ణాన్ని విడుదల చేయును. కాబట్టి ఆక్సైడ్, హైడ్రాక్సైడ్ ధర్మాల పరంగా క్షారలోహాలను ఒకే గ్రూపులో చేర్చడం సమంజసం.
Exam Tips:
a) మూడు అంశాలను శీర్షికలుగా (విన్యాసం, క్షయకరణ స్వభావం, ఆక్సైడ్లు/హైడ్రాక్సైడ్లు) రాసి ప్రతిదానికి సమీకరణాలు/ఉదాహరణలు ఇవ్వండి.
Question 50: లిథియము, మిగిలిన క్షార లోహాలకు మధ్య తేడాలపై వ్యాసాన్ని రాయండి.
Answer:
గ్రూపులో ఇతర మూలకాలలో పోలిస్తే లిథియమ్ అసాధారణ ధర్మాలు ప్రదర్శిస్తుంది. లిథియమ్ అసాధారణ ప్రవర్తనకు కారణాలు.
1. అత్యంత తక్కువ పరమాణు సైజు, అయానిక సైజు ఉండటం.
2. అత్యధిక ధ్రువణ సామర్థ్యం ఉండటం.
వీటి ఫలితంగా లిథియమ్ సమ్మేళనాలకు కోవలెంట్ ధర్మాలు ఎక్కువవుతాయి. కావున అవి కర్బన ద్రావణుల్లో కరుగుతాయి.
లిథియమ్ అసాధారణ ధర్మాలు:
1. లిథియమ్ మిగిలిన క్షారలోహాల కంటే గట్టిగా ఉంటుంది.
2. క్షార లోహాల్లో Li అత్యల్ప చర్యాశీలత కలది. గాలిలో మండిస్తే మోనాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
3. లిథియమ్ నేరుగా N₂ తో సంయోగం చెందుతుంది. ఏ ఇతర క్షారలోహం N₂ తో చర్య జరపదు.
4. లిథియమ్ హైడ్రోజన్ కార్బొనేట్ ఘనరూపంలో లభ్యం కాదు. మిగిలిన మూలకాలు ఘన హైడ్రోజన్ కార్బొనేట్‌లను ఏర్పరుస్తాయి.
5. లిథియమ్ నైట్రేట్‌ను వేడిచేస్తే లిథియమ్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇతర క్షారలోహాల నైట్రేట్లు విఘటనం చెంది నైట్రైట్లను ఇస్తాయి.
4 LiNO₃ → 2 Li₂O + 4 NO₂ + O₂
2MNO₃ → 2MNO₂ + O₂ (M = Li తప్ప ఇతర క్షార లోహాలు)
6. LiF, Li₂O లు వాటి అనురూప క్షారలోహాల సమ్మేళనాలకంటే నీటిలో సాపేక్షంగా తక్కువగా కరుగుతాయి.
Exam Tips:
a) Li యొక్క అసాధారణ ధర్మాలకు కారణం (చిన్న పరిమాణం, అధిక ధ్రువణ సామర్థ్యం) ముందు రాసి, తర్వాత పాయింట్లు ఇవ్వండి.
Question 51: సోడియమ్ కార్బొనేట్‌ని తయారుచేయడం, దాని ధర్మాలను చర్చించండి.
Answer:
సోడియమ్ కార్బొనేట్‌ను సాధారణంగా సాల్వే పద్ధతిలో తయారు చేస్తారు. ఈ పద్ధతిలో Na₂CO₃ ను క్రింది విధంగా తయారు చేస్తారు.
1. అమ్మోనియా ద్రావణంలోనికి CO₂ వాయువును పంపితే అమ్మోనియం బై కార్బొనేట్ ఏర్పడుతుంది.
NH₃ + H₂O + CO₂ → NH₄HCO₃
2. ఏర్పడిన అమ్మోనియమ్ బైకార్బొనేట్‌ను సోడియమ్ క్లోరైడ్‌తో చర్య జరిపిస్తే సోడియమ్ బైకార్బొనేట్ ఏర్పడుతుంది.
NH₄HCO₃ + NaCl → NH₄Cl + NaHCO₃
3. సోడియమ్ బైకార్బొనేట్‌ను వేడిచేస్తే సోడియమ్ కార్బొనేట్ ఏర్పడుతుంది.
\( 2\mathrm{NaHCO_3} \xrightarrow{\Delta} \mathrm{Na_2CO_3 + H_2O + CO_2} \)
ధర్మాలు:
సోడియమ్ కార్బొనేట్ తెల్లని, స్ఫటిక పదార్థం.
Na₂CO₃·10H₂O ను డెకాహైడ్రేట్ అంటారు. దీనిని వాషింగ్ సోడా అంటారు. 373 K కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద దీనిని వేడిచేస్తే పూర్తిగా అనార్ద్రంగా తయారవుతుంది. దీనినే సోడాయాష్ అంటారు.
\( \mathrm{Na_2CO_3 \cdot 10H_2O} \xrightarrow{373\,K} \mathrm{Na_2CO_3 \cdot H_2O} + 9\mathrm{H_2O} \)
\( \mathrm{Na_2CO_3 \cdot H_2O} \xrightarrow{>373\,K} \underset{\text{సోడాయాష్}}{\mathrm{Na_2CO_3}} + \mathrm{H_2O} \)
Na₂CO₃ లోని కార్బొనేట్ భాగం నీటిలో జలవిశ్లేషణ చెంది క్షార ద్రావణాన్ని ఇస్తుంది.
CO₃²⁻ + H₂O ⇌ HCO₃⁻ + OH⁻
ఇది ఆమ్లాలతో చర్య జరిపి, CO₂ వాయువును ఇస్తుంది.
Na₂CO₃ + 2HCl → 2NaCl + H₂O + CO₂
Exam Tips:
a) సాల్వే పద్ధతి మూడు దశలు (NH₄HCO₃, NaHCO₃, Na₂CO₃) సమీకరణాలతో రాయండి.
Question 52: కింది అంశాలపరంగా క్షార మృత్తికలోహాల సారూప్యతను చర్చించండి.
i) ఎలక్ట్రానిక్ విన్యాసం,
ii) ఆర్ద్రీకరణోష్ణాలు,
iii) ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్ల స్వభావాలు
Answer:
i) ఎలక్ట్రానిక్ విన్యాసం:
| మూలకం | సంకేతం | ఎలక్ట్రాన్ విన్యాసం |
| బెరిలియమ్ | Be | [He] 2s² |
| మెగ్నీషియమ్ | Mg | [Ne] 3s² |
| కాల్షియమ్ | Ca | [Ar] 4s² |
| స్ట్రాన్షియమ్ | Sr | [Kr] 5s² |
| బేరియమ్ | Ba | [Xe] 6s² |
| రేడియమ్ | Ra | [Rn] 7s² |
క్షారమృత్తిక లోహాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns².
ఈ మూలకాల వేలన్సీ కక్ష s – ఆర్బిటాల్‌లో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి. కావున ఈ మూలకాల ధర్మాలలో సారూప్యత కనిపిస్తుంది.
ii) ఆర్ద్రీకరణోష్ణాలు
క్షార మృత్తిక లోహాల ఆర్ద్రీకరణోష్ణాలు లోహ అయాన్ పరిమాణం పెరిగేకొలది తగ్గుతాయి.
Be²⁺ > Mg²⁺ > Ca²⁺ > Sr²⁺ > Ba²⁺
క్షార లోహ అయాన్ల ఆర్ద్రీకరణోష్ణాల కంటే క్షార మృత్తిక లోహాలకు ఆర్ద్రీకరణోష్ణాలు ఎక్కువగా ఉంటాయి.
iii) a. ఆక్సైడ్లు
క్షారమృత్తిక లోహాలు ఆక్సిజన్‌లో మండి మోనాక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.
BeO ద్విస్వభావ సంయోజనీయ ఆక్సైడ్. మిగతా ఆక్సైడ్లు అయానిక క్షార స్వభావం కలిగి ఉంటాయి.
b. హైడ్రాక్సైడ్లు
BeO తప్ప మిగిలిన ఆక్సైడ్లు జల విశ్లేషణ చేసినపుడు హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయి.
క్షారలోహ హైడ్రాక్సైడ్ కంటే క్షార మృత్తిక లోహ హైడ్రాక్సైడ్లు తక్కువ క్షార స్వభావం కలిగి ఉంటాయి.
Be(OH)₂ ద్విస్వభావ పదార్థం అంటే ఇది ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ చర్య జరుపుతుంది.
Exam Tips:
a) ప్రతి అంశానికి సాధారణ లక్షణాన్ని ఉదాహరణతో రాయండి: ns² విన్యాసం, ఆర్ద్రీకరణోష్ణం క్రమం, BeO ద్విస్వభావం.
Question 53: క్షారమృత్తిక లోహాల
i) కార్బొనేట్లు
ii) సల్ఫేట్లు
iii)నైట్రేట్ల గురించి చర్చించండి.
Answer:
i) కార్బొనేట్లు
క్షార మృత్తిక లోహాలు MCO₃ రకమైన కార్బొనేట్‌లను ఏర్పరుస్తాయి. నీటిలో కరిగే లోహ లవణ ద్రావణాలకు Na₂CO₃ ద్రావణాన్ని కలిపి ఈ కార్బొనేట్‌లను తయారుచేస్తారు.
గ్రూపులో పై నుంచి క్రిందకు పరమాణు సంఖ్య పెరిగే కొలది కార్బనేట్ల ద్రావణీయతలు తగ్గుతాయి.
ఈ కార్బొనేట్లు వేడిచేయగా వియోగం చెంది CO₂ ను ఏర్పరచును.
MCO₃ → MO + CO₂
ii) సల్ఫేట్లు
క్షార మృత్తిక లోహాలు MSO₄ రకమైన సల్ఫేట్లను ఏర్పరుస్తాయి.
ఇవి తెల్లని ఘన పదార్థాలు. ఉష్ణ స్థిరమైనవి.
Be²⁺, Mg²⁺ కు ఆర్ద్రీకరణోష్ణం ఎక్కువ. అందువలన BeSO₄ మరియు MgSO₄ లు నీటిలో కరుగుతాయి.
CaSO₄ నుంచి BaSO₄ కు ద్రావణీయత తగ్గును.
iii) నైట్రేట్లు
క్షారమృత్తిక లోహాలు M(NO₃)₂ రకమైన నైట్రేట్లను ఏర్పరుస్తాయి. ఇవి కార్బొనేట్‌లను సజల HNO₃ తో చర్య జరపడం ద్వారా ఏర్పడతాయి.
Mg(NO₃)₂ ఆరు నీటి అణువులతో స్పటికీకరణం చెందును. Ba(NO₃)₂ అనార్ద్రమైనవి.
ఈ నైట్రేట్లను వేడిచేయగా ఆక్సైడ్లను ఏర్పరచును.
2M(NO₃)₂ → 2MO + 4NO₂ + O₂
Exam Tips:
a) కార్బొనేట్లు, సల్ఫేట్లు, నైట్రేట్ల ద్రావణీయత మరియు ఉష్ణ స్థిరత్వ ధోరణులను వేర్వేరుగా రాయండి.
Question 54: క్షారలోహాల సాధారణ భౌతిక, రసాయన ధర్మాలు ఏమిటి ?
Answer:
భౌతిక ధర్మాలు:
క్షారలోహాలన్నీ తెల్లని మెత్తని తేలికైన లోహాలు.
సైజు ఎక్కువగా ఉండటం వలన సాంద్రత తక్కువగా ఉంటుంది. వీటి ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి.
క్షారలోహాలు, వాటి లవణాలు ఆక్సీకరణ జ్వాలకు విలక్షణమైన రంగునిస్తాయి.
ఇవి బలమైన క్షయకరణులు
రసాయన ధర్మాలు:
O₂ తో చర్య : క్షారలోహాలన్నీ ఆక్సిజన్‌లో వేడిచేసినపుడు ఆక్సైడ్లను ఇస్తాయి. లిథియమ్ O₂ తో మోనాక్సైడు, సోడియమ్ పెరాక్సైడ్‌ను, మిగిలిన మూలకాలతో సూపరాక్సైడ్లను ఏర్పరుస్తాయి.
H₂ తో చర్య : క్షారలోహాలు 300-600°C వద్ద H₂ తో సంయోగం చెంది హైడ్రైడ్లనిస్తాయి.
\( 2\mathrm{M} + \mathrm{H_2} \xrightarrow{300-600^\circ C} 2\mathrm{MH} \)
ఈ హైడ్రైడ్లన్నీ అయానిక పదార్థాలు.
నీటితో చర్యాశీలత : క్షారలోహాలు నీటితో తీవ్రమైన చర్య జరుపుతాయి. ఈ చర్యలో H₂ వాయువు విడుదలవుతుంది.
2M + 2H₂O → 2MOH + H₂ (M = క్షార లోహం)
హాలోజన్లతో చర్య : క్షారలోహాలు హాలోజన్లతో సంయోగం చెంది ద్విమూలక (బైనరీ) సమ్మేళనాలనిస్తాయి.
2M + X₂ → 2MX (M = క్షార లోహం)
క్షారలోహాల హాలైడ్లన్నీ అయానిక సమ్మేళనాలే.
Exam Tips:
a) భౌతిక ధర్మాలు ముందు, రసాయన ధర్మాలు (O₂, H₂, H₂O, హాలోజన్లు) తర్వాత సమీకరణాలతో రాయండి.
Question 55: క్షార మృత్తిక లోహాల సాధారణ ధర్మాలని, వాటిలోని క్రమతను గురించి చర్చించండి.
Answer:
i) ఎలక్ట్రానిక్ విన్యాసం:
| మూలకం | సంకేతం | ఎలక్ట్రాన్ విన్యాసం |
| బెరిలియమ్ | Be | [He] 2s² |
| మెగ్నీషియమ్ | Mg | [Ne] 3s² |
| కాల్షియమ్ | Ca | [Ar] 4s² |
| స్ట్రాన్షియమ్ | Sr | [Kr] 5s² |
| బేరియమ్ | Ba | [Xe] 6s² |
| రేడియమ్ | Ra | [Rn] 7s² |
క్షారమృత్తిక లోహాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns².
ఈ మూలకాల వేలన్సీ కక్ష s – ఆర్బిటాల్‌లో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి. కావున ఈ మూలకాల ధర్మాలలో సారూప్యత కనిపిస్తుంది.
ii) ఆర్ద్రీకరణోష్ణాలు
క్షార మృత్తిక లోహాల ఆర్ద్రీకరణోష్ణాలు లోహ అయాన్ పరిమాణం పెరిగేకొలది తగ్గుతాయి.
Be²⁺ > Mg²⁺ > Ca²⁺ > Sr²⁺ > Ba²⁺
క్షార లోహ అయాన్ల ఆర్ద్రీకరణోష్ణాల కంటే క్షార మృత్తిక లోహాలకు ఆర్ద్రీకరణోష్ణాలు ఎక్కువగా ఉంటాయి.
iii) a. ఆక్సైడ్లు
క్షారమృత్తిక లోహాలు ఆక్సిజన్‌లో మండి మోనాక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.
BeO ద్విస్వభావ సంయోజనీయ ఆక్సైడ్. మిగతా ఆక్సైడ్లు అయానిక క్షార స్వభావం కలిగి ఉంటాయి.
b. హైడ్రాక్సైడ్లు
BeO తప్ప మిగిలిన ఆక్సైడ్లు జల విశ్లేషణ చేసినపుడు హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయి.
iv) కార్బొనేట్లు
క్షార మృత్తిక లోహాలు MCO₃ రకమైన కార్బొనేట్‌లను ఏర్పరుస్తాయి. నీటిలో కరిగే లోహ లవణ ద్రావణాలకు Na₂CO₃ ద్రావణాన్ని కలిపి ఈ కార్బొనేట్‌లను తయారుచేస్తారు.
గ్రూపులో పై నుంచి క్రిందకు పరమాణు సంఖ్య పెరిగే కొలది కార్బొనేట్ల ద్రావణీయతలు తగ్గుతాయి.
ఈ కార్బొనేట్లు వేడిచేయగా వియోగం చెంది CO₂ ను ఏర్పరచును.
\( \mathrm{CaCO_3} \xrightarrow{\Delta} \mathrm{CaO} + \mathrm{CO_2} \)
v) సల్ఫేట్లు
క్షార మృత్తిక లోహాలు MSO₄ రకమైన సల్ఫేట్లను ఏర్పరుస్తాయి.
ఇవి తెల్లని ఘన పదార్థాలు. ఉష్ణ స్థిరమైనవి.
Be²⁺, Mg²⁺ కు ఆర్ద్రీకరణోష్ణం ఎక్కువ. అందువలన BeSO₄ మరియు MgSO₄ లు నీటిలో కరుగుతాయి.
CaSO₄ నుంచి BaSO₄ కు ద్రావణీయత తగ్గును.
vi) నైట్రేట్లు
క్షారమృత్తిక లోహాలు M(NO₃)₂ రకమైన నైట్రేట్లను ఏర్పరుస్తాయి. ఇవి కార్బొనేట్లు సజల HNO₃ తో చర్య ద్వారా ఏర్పడతాయి.
Mg(NO₃)₂ ఆరు నీటి అణువులతో స్పటికీకరణం చెందును. Ba(NO₃)₂ అనార్ద్రమైనవి.
ఈ నైట్రేట్లను వేడిచేయగా ఆక్సైడ్లను ఏర్పరచును.
2 M(NO₃)₂ → 2MO + 4NO₂ + O₂
Exam Tips:
a) విన్యాసం, ఆర్ద్రీకరణోష్ణం, ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్లు, కార్బొనేట్లు, సల్ఫేట్లు, నైట్రేట్లు - ఏదీ వదలకండి.
Question 56: సాల్వే పద్దతిలో జరిగే వివిధ చర్యలను చర్చించండి.
Answer:
సోడియమ్ కార్బొనేట్‌ను సాధారణంగా సాల్వే పద్ధతిలో తయారు చేస్తారు. ఈ పద్ధతిలో Na₂CO₃ ను క్రింది విధంగా తయారు చేస్తారు.
1. అమ్మోనియా ద్రావణంలోనికి CO₂ వాయువును పంపితే అమ్మోనియం బై కార్బొనేట్ ఏర్పడుతుంది.
NH₃ + H₂O + CO₂ → NH₄HCO₃
2. ఏర్పడిన అమ్మోనియమ్ బైకార్బొనేట్‌ను సోడియమ్ క్లోరైడ్‌తో చర్య జరిపిస్తే సోడియమ్ బైకార్బొనేట్ ఏర్పడుతుంది.
NH₄HCO₃ + NaCl → NH₄Cl + NaHCO₃
3. సోడియం బైకార్బొనేటును వేడిచేస్తే సోడియం కార్బొనేటు ఏర్పడుతుంది.
\( 2\mathrm{NaHCO_3} \xrightarrow{\Delta} \mathrm{Na_2CO_3 + H_2O + CO_2} \)
ధర్మాలు:
సోడియమ్ కార్బొనేట్ తెల్లని, స్ఫటిక పదార్థం.
Na₂CO₃·10H₂O ను డెకాహైడ్రేట్ అంటారు. దీనిని వాషింగ్ సోడా అంటారు. 373 K కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద దీనిని వేడిచేస్తే పూర్తిగా అనార్ద్రంగా తయారవుతుంది. దీనినే సోడాయాష్ అంటారు.
\( \mathrm{Na_2CO_3 \cdot 10H_2O} \xrightarrow{373\,K} \mathrm{Na_2CO_3 \cdot H_2O} + 9\mathrm{H_2O} \)
\( \mathrm{Na_2CO_3 \cdot H_2O} \xrightarrow{>373\,K} \underset{\text{సోడాయాష్}}{\mathrm{Na_2CO_3}} + \mathrm{H_2O} \)
Na₂CO₃ లోని కార్బొనేట్ భాగం నీటిలో జలవిశ్లేషణ చెంది క్షార ద్రావణాన్ని ఇస్తుంది.
CO₃²⁻ + H₂O ⇌ HCO₃⁻ + OH⁻
Exam Tips:
a) సాల్వే పద్ధతిలో NH₃, CO₂, NaCl ముడి పదార్థాలు; NH₄Cl ఉపఉత్పత్తి అని గుర్తుంచుకోండి.
Question 57: సోడియమ్ క్లోరైడ్ నుంచి కింది వాటిని ఎట్లా తయారుచేస్తారు ?
i) సోడియమ్ లోహం
ii) సోడియమ్ హైడ్రాక్సైడ్
iii)సోడియమ్ పెరాక్సైడ్
iv) సోడియమ్ కార్బొనేట్
Answer:
సోడియమ్ క్లోరైడ్ నుంచి Na లోహం తయారుచేయుట
గలన NaCl ను విద్యుద్విశ్లేషణ చేయగా Na లోహం ఏర్పడును.
2NaCl → 2Na + Cl₂
కాథోడ్ వద్ద 2Na⁺ + 2e⁻ → Na
ఆనోడ్ వద్ద 2Cl⁻ → Cl₂ + 2e⁻
సోడియమ్ క్లోరైడ్ నుంచి NaOH తయారుచేయుట
NaCl జలద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ చేయగా NaOH ఏర్పడును.
NaCl → Na⁺ + Cl⁻
H₂O → H⁺ + OH⁻
ఆనోడ్ వద్ద 2Cl⁻ → Cl₂ + 2e⁻
కాథోడ్ వద్ద 2H⁺ + 2e⁻ → H₂
Na⁺ + OH⁻ → NaOH
NaCl నుంచి సోడియమ్ పెరాక్సైడ్‌ను తయారుచేయుట
మొదట గలన NaCl ను విద్యుద్విశ్లేషణ చేసి Na లోహం తయారుచేస్తారు. Na ను అధిక O₂ తో మండిస్తే సోడియమ్ పెరాక్సైడ్ ఏర్పడుతుంది.
2Na + O₂ → Na₂O₂
NaCl నుంచి సోడియమ్ కార్బొనేట్‌ను తయారుచేయుట
అమ్మోనియా ద్రావణంలోకి CO₂ వాయువును పంపితే అమ్మోనియం బై కార్బొనేట్ ఏర్పడుతుంది. అమ్మోనియం బై కార్బొనేట్‌ను NaCl తో చర్య జరిపితే సోడియమ్బైకార్బొనేట్ ఏర్పడుతుంది. సోడియమ్ బై కార్బొనేటును వేడిచేస్తే సోడియమ్కార్బొనేటు ఏర్పడుతుంది.
\( \mathrm{NH_3 + H_2O + CO_2} \longrightarrow \mathrm{NH_4HCO_3} \)
\( \mathrm{NH_4HCO_3 + NaCl} \longrightarrow \mathrm{NH_4Cl + NaHCO_3} \)
\( 2\mathrm{NaHCO_3} \xrightarrow{\Delta} \mathrm{Na_2CO_3 + H_2O + CO_2} \)
Exam Tips:
a) నాలుగు తయారీ పద్ధతులకు సమీకరణాలు రాయండి: గలన NaCl విద్యుద్విశ్లేషణ, NaCl ద్రావణం, Na + O₂, సాల్వే.
Question 58: i) మెగ్నీషియమ్ని గాలిలో వేడిచేస్తే
ii) పొడిసున్నాన్ని సిలికాతో వేడిచేస్తే
iii) తడిసున్నంతో క్లోరిన్ చర్య
iv) కాల్షియమ్ నైట్రేట్‌ని బాగా వేడిచేస్తే, ఏం జరుగుతుంది ?
Answer:
i) Mg ని గాలిలో మండించినపుడు కాంతివంతంగా మండి MgO మరియు Mg₃N₂ లను ఏర్పరచును.
2Mg + O₂ → 2MgO (మెగ్నీషియమ్ ఆక్సైడ్)
3Mg + N₂ → Mg₃N₂ (మెగ్నీషియమ్ నైట్రైడ్)
ii) పొడిసున్నాన్ని సిలికాతో వేడిచేస్తే కాల్షియమ్ సిలికేట్ ఏర్పడుతుంది.
CaO + SiO₂ → CaSiO₃
iii) తడిసున్నం క్లోరిన్‌తో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్‌ను ఏర్పరచును.
\( 2\mathrm{Ca(OH)_2} + 2\mathrm{Cl_2} \longrightarrow \mathrm{CaCl_2} + \mathrm{Ca(OCl)_2} + 2\mathrm{H_2O} \)
బ్లీచింగ్ పౌడర్
iv) కాల్షియమ్ నైట్రేట్‌ను బాగా వేడిచేస్తే అది విఘటనం చెంది CaO, NO₂ మరియు O₂ లను ఏర్పరచును.
2 Ca(NO₃)₂ → 2CaO + 4NO₂ + O₂
Exam Tips:
a) ప్రతి చర్యకు తుల్య సమీకరణం రాయండి; బ్లీచింగ్ పౌడర్ ఉత్పత్తి గుర్తుంచుకోండి.
Question 59: జీవశాస్త్ర ప్రవాహికల్లో సోడియమ్, పొటాషియమ్, మెగ్నీషియమ్, కాల్షియమ్ల సార్ధకతను వివరించండి. (March 2013)
Answer:
జీవశాస్త్ర ప్రవాహికల్లో Na, Kల పాత్ర
1. కణాల్లోని కర్బన అణువులలో ఉన్న ఋణావేశాలను లోహ అయాన్లపై ఉండే ఆవేశాలు తుల్యం చేస్తాయి.
2. కణాలలో ద్రవాభిసరణ పీడనాన్ని కూడా నిలకడగా ఉంచటానికి ఈ అయాన్లు సహాయపడతాయి.
3. కణపు పొరకు అటు, ఇటు రెండు పక్కల Na⁺, K⁺ అయాన్ లుంటాయి. దీని వలన కణంలో విద్యుత్ శక్మం ఏర్పడుతుంది. Na⁺ అయాన్లుండటం వలన గ్లూకోజ్ కణం లోపలికి వెళుతుంది. అధికంగా ఉన్న Na⁺ అయాన్లు బహిష్కృతమవుతాయి.
4. పొటాషియమ్ అయాన్లు కణాంతర్భాగంలో గ్లూకోజ్ జీవన క్రియల్లో దోహదపడతాయి. ప్రోటీన్ సంశ్లేషణలోనూ, కొన్ని నిర్దిష్టమైన ఎంజైములు ఉత్తేజితమవటానికి సహాయపడతాయి.
జీవశాస్త్రంలో Mg పాత్ర:
1. జంతు కణాలలో Mg²⁺ అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటుంది.
2. ఫాస్ఫోహైడ్రోలేజ్లు, ఫాస్పోట్రాన్స్ఫరేజ్లు వంటి ఎంజైములలో Mg²⁺ ఉంటుంది. ఈ ఎంజైములు ATP చర్యలలో పాల్గొని శక్తిని విడుదల చేస్తాయి.
3. క్లోరోఫిల్ చెట్లలోని ఆకుపచ్చ పదార్థం. ఇందులో Mg²⁺ ఉంటుంది.
జీవశాస్త్రంలో Ca పాత్ర
1. మన శరీరంలో 99% కాల్షియమ్ అయాన్లు ఎముకలు మరియు దంతాల తయారీలో ఉపయోగపడతాయి.
2. రక్త స్కందనములో మరియు కణపొర అయాన్ బదిలీ కార్యక్రమంలో ఈ అయాన్ ముఖ్య పాత్ర వహిస్తుంది.
3. కాల్షియమ్ అయాన్లు గుండె క్రమంగా కొట్టుకొనే ప్రక్రియలో మరియు కండరాల సంకోచ ప్రక్రియలో కూడా ముఖ్యపాత్రను వహిస్తాయి.
Exam Tips:
a) Na, K, Mg, Ca లకు వేర్వేరు శీర్షికలతో పాత్రలను రాయండి.
Question 60: సిమెంట్‌ని గురించి కొన్ని వాక్యాలు రాయండి.
Answer:
సిమెంట్ ఒక ముఖ్యమైన నిర్మాణోపయోగకరమైన పదార్థం. దీనిని 1824లో జోసఫ్ ఆస్పిడిన్ మొట్టమొదటగా ఇంగ్లాండ్‌లో ప్రవేశపెట్టాడు. దీనినే పోర్ట్లాండ్సిమెంట్ అంటారు.
పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ సగటు సంఘటనం కింది విధంగా ఉంటుంది. CaO 50–60%, SiO₂ 20–25%, Al₂O₃ 5–10%, MgO 2–3%, Fe₂O₃ 1–2%, SO₃ 1–2%.
మంచిరకం సిమెంట్ సిలికా (SiO₂) కి అల్యూమినా (Al₂O₃) కి ఉండే నిష్పత్తి 2.5 నుంచి 4.0 మధ్యలో ఉండాలి.
బంకమట్టిని సున్నంతో కలిపి బాగా వేడిచేస్తే అవి ద్రవీభవించి, చర్య జరిపి “సిమెంట్ క్లింకర్” ని ఏర్పరుస్తాయి. ఈ క్లింకర్‌ను 2-3% జిప్సమ్ కలిపితే సిమెంట్ వస్తుంది.
సిమెంటుకు నీటిని కలిపితే గట్టి పదార్థంగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను “సెట్టింగ్ ఆఫ్ సిమెంట్” అంటారు.
సిమెంట్ ఉపయోగాలు:
సిమెంటు కాంక్రీట్ మరియు ప్రబలిత కాంక్రీట్లలో ఉపయోగిస్తారు.
ప్లాస్టరింగ్‌లో ఉపయోగిస్తారు.
వారధులను, డ్యామ్‌లను, భవంతులను నిర్మించుటకు ఉపయోగిస్తారు.
Exam Tips:
a) సిమెంట్ సంఘటనం శాతాలు, క్లింకర్ + జిప్సమ్ (2-3%), సెట్టింగ్, ఉపయోగాలు - నాలుగు అంశాలు.
Free study material for Chemistry
TS Board Solutions for Class 11 Chemistry Chapter 09 s-Block Elements
Chapter Exercise Answers for Class 11 Chemistry
Explore reliable textbook solutions for Chapter 09 s-Block Elements tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Chemistry.
Detailed Answer Guides for Chapter 09 s-Block Elements
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Chemistry module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Complete Preparation Kit for Class 11 Exams
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Chemistry.
FAQs
The complete and updated TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు in printable PDF format for offline study on any device.