Download TS Board Solutions for Class 11 Chemistry Chapter 08 Hydrogen and its Compounds
Explore reliable textbook solutions for Chapter 08 Hydrogen and its Compounds tailored for Class 11 learners. Utilizing these Chemistry answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Access TS Board Solutions and Answers
Access the complete solution PDF for Class 11 Chemistry below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు
Question 1: హైడ్రోజన్ ఐసోటోపులు మూడు వాటి చర్యావేగాల్లో భేదపడతాయి. కారణాలు తెలపండి.
Answer:
1. హైడ్రోజన్ మూడు రకాల ఐసోటోపులు కలిగి ఉంటుంది. అవి
1. ప్రోటియమ్ (¹₁H)
2. డ్యుటీరియమ్ (²₁H)
3. ట్రైటియమ్ (³₁H).
2. ఈ మూడు ఐసోటోపులలో వరుసగా 0, 1, 2 న్యూట్రాన్లు ఉంటాయి. ట్రిటియం రేడియోధార్మికత కలిగి ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఐసోటోపులు వాటి చర్యావేగాల్లో విభేదిస్తాయి. వీటి చర్యాశీలత క్రింది క్రమంలో ఉంటుంది. H > D > T.
3. ఈ ఐసోటోపులు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండటం వల్ల వాటికి సారూప్యరసాయన ధర్మాలు ఉంటాయి.
Exam Tips:
a) మూడు ఐసోటోపుల (ప్రోటియం, డ్యుటీరియం, ట్రైటియం) పేర్లు, న్యూట్రాన్ల సంఖ్య 0, 1, 2 అని రాయండి.
b) ద్రవ్యరాశి తేడా వల్ల చర్యావేగాలు మారతాయి (H > D > T); ఎలక్ట్రాన్ విన్యాసం ఒకటే కావడంతో రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి.
Question 2: అధిక ద్రవీభవన స్థానాలున్న లోహాలను వెల్డింగ్ చేయడానికి డైహైడ్రోజను ఎందుకు వాడతారు ?
Answer:
డైహైడ్రోజన్ వియోగం చెంది పరమాణు హైడ్రోజన్‌ను ఇస్తుంది. ఈ పరమాణు హైడ్రోజన్ మండి 4000K ఉష్ణోగ్రతను ఇస్తుంది. కావున ఈ ఉష్ణోగ్రత జ్వాల సహాయంతో అధిక ద్రవీభవన స్థానాలున్న లోహాలను వెల్డింగ్ చేయటానికి డై హైడ్రోజను వాడతారు.
Exam Tips:
a) పరమాణు హైడ్రోజన్ తిరిగి అణువుగా మారేటప్పుడు విడుదలయ్యే అధిక ఉష్ణమే (సుమారు 4000 K) ముఖ్య కారణం.
Question 3: అత్యంత శుద్ధమైన డైహైడ్రోజన్ను తయారుచేయడానికి ఒక పద్ధతిని వివరించండి.
Answer:
నికెల్ ఎలక్ట్రోడ్లతో వెచ్చని సజల బేరియమ్ హైడ్రాక్సైడ్ [Ba(OH)₂] ను విద్యుద్విశ్లేషణ చేసి అత్యంత శుద్ధమయిన హైడ్రోజన్ ను పొందవచ్చు. ఈ ప్రక్రియలో 99.95% శుద్ధమైన H₂, ఏర్పడును.
Exam Tips:
a) Ni ఎలక్ట్రోడ్లు, వెచ్చని Ba(OH)₂ ద్రావణం, 99.95% శుద్ధత - ఈ మూడు వివరాలు తప్పక రాయండి.
Question 4: “సిన్ గ్యాస్” పదాన్ని వివరించండి.
Answer:
CO, H₂ ల మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ లేదా సిన్ గ్యాస్ అని అంటారు. దీనిని మిథనాల్ మరియు ఇతర హైడ్రోకార్బన్లను సంశ్లేషణం చేయటానికి వాడతారు.
తయారీ:
\( \mathrm{C(s) + H_2O(g)} \xrightarrow{1270\,K} \mathrm{CO(g) + H_2(g)} \)
Exam Tips:
a) సిన్ గ్యాస్ = CO + H₂ మిశ్రమం; దానిని తయారుచేసే చర్య (C + H₂O, 1270 K) కూడా రాయండి.
Question 5: “కోల్ గాసిఫికేషన్” అంటే ఏమిటి ? దానిని సరైన తుల్య సమీకరణంతో వివరించండి.
Answer:
కోల్‌ను నీటి ఆవిరితో 1270 K ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపి సిన్ గ్యాస్‌ను తయారు చేయటాన్ని కోల్ గాసిఫికేషన్ అంటారు.
\( \mathrm{C(s) + H_2O(g)} \longrightarrow \underset{\text{సిన్ గ్యాస్}}{\mathrm{CO(g) + H_2(g)}} \)
Exam Tips:
a) కోల్ గాసిఫికేషన్ సమీకరణంలో ఉష్ణోగ్రత (1270 K) మరియు ఉత్పన్నాలు CO + H₂ ను సరిగా రాయండి.
Question 6: హైడ్రైడ్ అంటే నిర్వచనం చెప్పండి. ఎన్ని రకాల హైడ్రైడ్లున్నాయి ? వాటి పేర్లను చెప్పండి.
Answer:
హైడ్రోజన్ ఇతర మూలకాలతో ఏర్పరచే ద్విమూలక (బైనరీ) సమ్మేళనాలను హైడ్రైడ్లు అంటారు. ఇవి మూడు రకాలు.
1. అయానిక లేదా సెలైన్ లేదా ఆవరణ సదృశ హైడ్రైడ్లు. ఉదా || NaH, CaH₂ మొ||
2. కోవలెంట్ లేదా అణు హైడ్రైడ్లు. ఉదా || B₂H₆, CH₄ మొ||వి.
3. లోహ లేదా నాన్ – స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్లు. ఉదా || PdH
Exam Tips:
a) హైడ్రైడ్ల మూడు రకాలను (అయానిక, కోవలెంట్, లోహ) ఒక్కో ఉదాహరణతో రాయండి.
Question 7: ద్రవీకృత ప్రావస్థలో నీటికి అసాధారణ లక్షణం ఉంటుంది. అది నీటి అధిక భాష్పీభవనోష్టానికి దారితీస్తుంది. ఆ ధర్మం ఏమిటి ?
Answer:
నీటి అణువుల మధ్య అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఉండటం వలన ద్రవీకృత ప్రావస్థలో నీటికి అసాధారణ లక్షణం ఉంటుంది. దీని వలన నీటికి అధిక భాష్పీభవన స్థానం ఉంటుంది.
Exam Tips:
a) అంతరణుక హైడ్రోజన్ బంధం అనే పదాన్ని తప్పక వాడండి.
Question 8: కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు నీరు O₂ గా ఆక్సీకరణం చెందుతుంది. అయితే ఏ మూలకం క్షయకరణం చెందుతుంది ?
Answer:
కిరణజన్య సంయోగక్రియను ఈ విధంగా వ్రాస్తారు. 6CO₂ + 6H₂O → C₆H₁₂O₆ + 6O₂. ఈ చర్యలో నీరు, O₂ గా ఆక్సీకరణం చెందుతుంది. కార్బన్ క్షయకరణం చెందుతుంది. (కార్బన్ యొక్క ఆక్సీకరణ స్థితి +4 నుంచి ‘0’ కు తగ్గుతుంది.)
Exam Tips:
a) ఆక్సీకరణ స్థితుల మార్పు రాయండి: నీరు → O₂ (ఆక్సీకరణ), C: +4 → 0 (క్షయకరణం).
Question 9: “స్వయం ప్రోటోలసిస్” అంటే మీకేమి తెలుస్తుంది ? నీటి స్వయం ప్రోటోలసిసికి సమీకరణాన్ని రాయండి.
Answer:
నీరు ఆమ్లంగాను, క్షారంగాను పనిచేయగల ద్విస్వభావ పదార్థంగా పనిచేస్తుంది. ఈ విధంగా నీరు స్వయం అయనీకరణం చెందే ధర్మాన్ని ‘స్వయం ప్రొటోలసిస్’ అంటారు. నీటి స్వయం ప్రొటోలసిస్ చర్యను క్రింది విధంగా వ్రాయవచ్చు.
\( \underset{\text{ఆమ్లం-1}}{\mathrm{H_2O(l)}} + \underset{\text{క్షారం-2}}{\mathrm{H_2O(l)}} \rightleftharpoons \underset{\text{ఆమ్లం-2}}{\mathrm{H_3O^{+}(aq)}} + \underset{\text{క్షారం-1}}{\mathrm{OH^{-}(aq)}} \)
Exam Tips:
a) నీరు ఒకే సమయంలో ఆమ్లంగా, క్షారంగా పనిచేసే సమీకరణాన్ని ఆమ్లం-1/క్షారం-2 జతలతో చూపండి.
Question 10: బ్రాన్‌స్టెడ్ సిద్ధాంతపరంగా నీరు ద్విస్వభావం గల పదార్థం. దానిని మీరు ఎట్లా వివరిస్తారు ?
Answer:
బ్రాన్‌స్టెడ్ సిద్ధాంతం ప్రకారం ప్రోటాన్ దాత ఆమ్లంగాను, ప్రోటాన్ స్వీకర్త క్షారంగాను పనిచేస్తాయి. నీరు NH₃ కు ప్రోటాన్‌ను దానం చేసి ఆమ్లంగా పనిచేస్తుంది.
\( \underset{\text{ఆమ్లం}}{\mathrm{H_2O}} + \mathrm{NH_3} \rightleftharpoons \mathrm{OH^{-}} + \mathrm{NH_4^{+}} \)
నీరు H₂S నుంచి ప్రోటాన్ ను స్వీకరించి క్షారంగా పనిచేస్తుంది.
\( \underset{\text{క్షారం}}{\mathrm{H_2O}} + \mathrm{H_2S} \rightleftharpoons \mathrm{H_3O^{+}} + \mathrm{HS^{-}} \)
కావున నీరు ద్విస్వభావం గల పదార్ధం.
Exam Tips:
a) NH₃ తో నీరు ప్రోటాన్ దాతగా (ఆమ్లం), H₂S తో ప్రోటాన్ స్వీకర్తగా (క్షారం) - రెండు సమీకరణాలు రాయండి.
లఘు సమాధాన ప్రశ్నలు
Question 11: NH₃, H₂O, HF ల బాష్పీభవన స్థానాలు, ఆయా గ్రూపుల్లో వాటి తరవాత మూలకాల హైడ్రైడ్ల బాష్పీభవన స్థానాలకంటే ఎక్కువగా ఉంటాయి. మీ కారణాలు చెప్పండి.
Answer:
NH₃, H₂O, HF ల బాష్పీభవన స్థానాలు, ఆయా గ్రూపుల్లో వాటి తరువాత మూలకాల హైడ్రైడ్ల బాష్పీభవన స్థానాలకంటే ఎక్కువగా ఉంటాయి. కారణాలు:
1. NH₃, H₂O, HF లలో హైడ్రోజన్ అధిక ఋణ విద్యుదాత్మకత గల N, O, F లతో బంధించబడి ఉంటుంది.
2. అందువలన ఈ హైడ్రైడ్లలో అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఏర్పడతాయి.
3. ఈ హైడ్రోజన్ బంధాల వలన ఈ హైడ్రైడ్లకు అధిక బాష్పీభవన స్థానాలుంటాయి.
Exam Tips:
a) N, O, F లకు ఉన్న అధిక ఋణవిద్యుదాత్మకత, హైడ్రోజన్ బంధం అనే రెండు పదాలు తప్పక ఉండాలి.
Question 12: ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ స్థానాన్ని దాని ఎలక్ట్రాన్ విన్యాసపరంగా చర్చించండి.
Answer:
ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ యొక్క స్థానం చర్చనీయాంశం. హైడ్రోజన్ IA గ్రూపులోని క్షార లోహాలతోను, VIIA గ్రూపులోని హాలోజన్లతోను పోలికలు కలిగి ఉంటుంది.
హైడ్రోజన్‌ను IA గ్రూపు మూలకాలతో చేర్చడానికి కారణాలు:
1. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం (1s¹) క్షార లోహాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని (ns¹) పోలి ఉంటుంది.
2. క్షార లోహాల వలె హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్‌ను పోగొట్టుకొని ఏకమాత్ర ధనావేశిత అయాన్ (H⁺) ను ఏర్పరచగలదు.
హైడ్రోజన్‌ను VIIA గ్రూపు మూలకాలతో చేర్చడానికి కారణాలు:
1. హైడ్రోజన్ హాలోజన్ల వలె ద్విపరమాణుక అణువులను (H₂) ఏర్పరుస్తుంది.
2. హైడ్రోజన్ హాలోజన్ల వలె ఒక ఎలక్ట్రాన్‌ను పొంది ఏకమాత్ర ఋణావేశిత అయాన్ (H⁻) ను ఏర్పరుస్తుంది.
హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s¹ మాత్రమే పరిగణనలోకి తీసుకుని దీనిని IA గ్రూపు మూలకాలతో కలిపారు.
Exam Tips:
a) IA గ్రూపుతో పోలికలు, VIIA గ్రూపుతో పోలికలు - రెండు వైపులా రెండేసి కారణాలు రాసి, చివరన IA లో ఉంచడానికి కారణం చెప్పండి.
Question 13: హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం దాని రసాయన ధర్మాలకు ఎట్లా అనువుగా ఉంటుంది ?
Answer:
హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s ¹. కావున
1. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాను కోల్పోయి చర్యలలో పాల్గొని H⁺ ను ఏర్పరచును. ఉదా : HF + H₂O → H₃O⁺ + F–
2. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాను గ్రహించి చర్యలలో పాల్గొని H⁻ ను ఏర్పరుస్తుంది. ఉదా : 2Na + H₂ → 2NaH [Na⁺ H –]
3. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాను పంచుకొని సమయోజనీయ బంధాలను ఏర్పరచును.
ఉదా : H : Cl.
Exam Tips:
a) హైడ్రోజన్ 1s¹: ఎలక్ట్రాన్ కోల్పోవడం (H⁺), పొందడం (H⁻), పంచుకోవడం - మూడు సందర్భాలకు ఒక్కో ఉదాహరణ ఇవ్వండి.
Question 14: (a) క్లోరిన్ (b) సోడియం లోహంతో డైహైడ్రోజన్ చర్య జరిపితే ఏమవుతుంది ?
వివరించండి.
Answer:
a) క్లోరిన్‌తో డైహైడ్రోజన్ చర్య : డై హైడ్రోజన్ క్లోరిన్‌తో చర్య జరిపి హైడ్రోజన్ క్లోరైడ్‌ను ఏర్పరచును.
H₂ + Cl₂ → 2HCl
b) డై హైడ్రోజన్ Na లోహంతో చర్య : డై హైడ్రోజన్ Na లోహంతో చర్య జరిపి సోడియం హైడ్రైడ్‌ను ఏర్పరుస్తుంది.
2Na + H₂ → 2NaH
Exam Tips:
a) రెండు చర్యలకు తుల్య సమీకరణాలు రాయండి: H₂ + Cl₂ → 2HCl, 2Na + H₂ → 2NaH.
Question 15: భారజలం పై ఒక వ్యాఖ్యను రాయండి.
Answer:
డ్యుటీరియం ఆక్సైడ్ (D₂O) ను భారజలం అంటారు. N/2 NaOH ద్రావణంతో క్షారయుతం చేసిన నీటిని ఎక్కువ కాలం పాటు విద్యుద్విశ్లేషణ జరిపి భారజలాన్ని తయారుచేస్తారు.
(1) న్యూక్లియర్ రియాక్టర్లలో మోడరేటర్గాను,
(2) చర్యా విధానాల అధ్యయనంలో వినిమయ కారకంగాను భారజలాన్ని ఉపయోగిస్తారు.
ఇతర డ్యుటీరియమ్ సమ్మేళనాలను తయారుచేయటానికి D₂O ను ఉపయోగిస్తారు.
CaC₂ + 2D₂O → C₂D₂ + Ca(OD)₂
SO₃ + D₂O → D₂SO₄
Al₄C₃ + 12D₂O → 3CD₄ + 4Al(OD)₃
ఈ చర్యలను డ్యుటిరాలసిస్ చర్యలు అంటారు.
Exam Tips:
a) D₂O నిర్వచనం, తయారీ, రెండు ఉపయోగాలు (మోడరేటర్, ట్రేసర్) మరియు ఒక డ్యుటిరాలసిస్ చర్య రాయండి.
Question 16: హైడ్రోజన్ ఐసోటోపుల పేర్లను తెలపండి. ఈ ఐసోటోపుల ద్రవ్యరాశుల నిష్పత్తి ఏమిటి ?
Answer:
హైడ్రోజన్‌కు మూడు ఐసోటోపులున్నాయి.
1. ప్రోటియం (హైడ్రోజన్) \( {}_1^1\mathrm{H} \)
2. డ్యుటీరియమ్ \( {}_1^2\mathrm{H} \) లేదా \( {}_1^2\mathrm{D} \)
3. ట్రైటియమ్ \( {}_1^3\mathrm{H} \) లేదా \( {}_1^3\mathrm{T} \)
ఈ ఐసోటోపుల ద్రవ్యరాశుల నిష్పత్తి
H : D : T = 1 : 2 : 3
Exam Tips:
a) ద్రవ్యరాశుల నిష్పత్తి 1 : 2 : 3 అని (ద్రవ్యరాశి సంఖ్యల నిష్పత్తి) గుర్తుంచుకోండి.
Question 17: “వాటర్ గ్యాస్ షిఫ్ట్” చర్య అంటే ఏమిటి ? ఈ చర్యతో హైడ్రోజన్ తయారీని ఎట్లా పెంచగలరు ?
Answer:
CO, H₂ ల మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ లేదా సిన్ గ్యాస్ అంటారు.
వాటర్ గ్యాస్ షిఫ్ట్ చర్య : H₂ యొక్క ఉత్పత్తి పెంచటానికి సిన్‌గ్యాస్ మిశ్రమంలోని కార్బన్ మోనాక్సైడ్‌ను ఐరన్ క్రోమేట్ ఉత్ప్రేరకం సమక్షంలో నీటి ఆవిరితో చర్యనొందిస్తారు. ఈ చర్యను “వాటర్ గ్యాస్ షిఫ్ట్ చర్య” అంటారు.
\( \mathrm{C + H_2O} \xrightarrow{1270\,K} \mathrm{CO + H_2} \)
\( \mathrm{CO(g) + H_2O(g)} \xrightarrow[\text{ఉత్ప్రేరకం}]{673\,K} \mathrm{CO_2(g) + H_2(g)} \)
సోడియం ఆర్సినైట్ ద్రావణంలో మార్జనం చేసి CO₂ ను తొలగించవచ్చు.
Exam Tips:
a) వాటర్ గ్యాస్ షిఫ్ట్ చర్య: CO + H₂O → CO₂ + H₂ (Fe క్రోమేట్, 673 K); CO₂ ను ఆర్సినైట్ ద్రావణంతో తొలగిస్తారని చేర్చండి.
Question 18: కింది చర్యలను పూర్తిచేసి, తుల్యం చేయండి.
\( \text{(i) } \mathrm{H_2(g) + M_mO_o(s)} \xrightarrow{\Delta} \)
\( \text{(ii) } \mathrm{CO(g) + H_2(g)} \xrightarrow[\text{ఉత్ప్రేరకం}]{\Delta} \)
\( \text{(iii) } \mathrm{C_3H_8(g) + 3H_2O(g)} \xrightarrow[\text{ఉత్ప్రేరకం}]{\Delta} \)
\( \text{(iv) } \mathrm{Zn(s) + NaOH(aq)} \xrightarrow{\text{వేడి}} \)
Answer:
\( \text{i) } o\,\mathrm{H_2(g) + M_mO_o(s)} \xrightarrow{\Delta} m\,\mathrm{M(s)} + o\,\mathrm{H_2O(l)} \)
\( \text{ii) } \mathrm{CO(g) + 2H_2(g)} \xrightarrow[\text{ఉత్ప్రేరకం}]{\Delta} \mathrm{CH_3OH(l)} \)
\( \text{iii) } \mathrm{C_3H_8(g) + 3H_2O(g)} \xrightarrow[\text{ఉత్ప్రేరకం}]{\Delta} 3\mathrm{CO(g)} + 7\mathrm{H_2(g)} \)
\( \text{iv) } \mathrm{Zn(s) + 2NaOH(aq)} \xrightarrow{\text{వేడి}} \mathrm{Na_2ZnO_2 + H_2} \)
Exam Tips:
a) సమీకరణాల్లో పరమాణువులను లెక్కించి తుల్యం చేయండి; Zn + 2NaOH → Na₂ZnO₂ + H₂ గుర్తుంచుకోండి.
Question 19: 13వ గ్రూపు మూలకాలు ఏర్పరచే హైడ్రైడ్ల స్వభావం ఏమిటి ?
Answer:
13వ గ్రూపు మూలకాలు p – బ్లాకుకు చెందుతాయి. ఇవి కోవలెంట్ హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి. ఈ హైడ్రైడ్లు ఎలక్ట్రాన్ న్యూనత (ఎలక్ట్రాన్ కొరత) గల సమ్మేళనాలు. లూయీ నిర్మాణాన్ని సాంప్రదాయ పద్ధతిలో రాయడానికి కావలసిన ఎలక్ట్రాన్ల కన్నా తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. కావున ఇవి లూయీ ఆమ్లాలుగా పనిచేస్తాయి. ఉదా : B₂H₆. బోరాన్ ఏర్పరచే హైడ్రైడ్లను బోరేన్లు అంటారు.
Exam Tips:
a) 13వ గ్రూపు హైడ్రైడ్లు ఎలక్ట్రాన్ కొరత గలవి, లూయీ ఆమ్లాలు (ఉదా: B₂H₆) అని రాయండి.
Question 20: సంశ్లేషిత రెజిన్ పద్ధతి, అయాన్ వినిమయ రెజిన్ పద్ధతుల్లో జలకాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించే సూత్రాన్ని, పద్ధతిని చర్చించండి.
Answer:
i) సంశ్లేషిత రెజిన్ల పద్దతి : ఈ పద్దతిలో అయాన్లను తొలగించడం రెండు రకాలుగా జరుగుతుంది. అన్ని రకాల లవణాలు తొలగించబడిన నీటిని అయాన్ విరహిత జలం అంటారు.
1. కాటయాను తొలగించుట : కాటయాన్ వినిమయ రెజిన్ ను కలిగి ఉన్న ట్యాంక్గుండా కఠినజలాన్ని పంపుతారు. అపుడు Ca²⁺ మరియు Mg²⁺ అయాన్లు H⁺ అయాన్లతో స్థానభ్రంశం చెందించబడతాయి.
2RCOOH + Ca²⁺ → (RCOO)₂Ca + 2H⁺
2. ఆనయాన్లను తొలగించుట : ఆ తర్వాత నీటిని ఆనయాన్ వినిమయ రెజిన్ ట్యాంక్ ద్వారా పంపుతారు. అపుడు నీటిలోని ఆనయాన్లు రెజిన్లోని OH– అయాన్లతో స్థానభ్రంశం చెందించబడతాయి.
\( \mathrm{R{-}NH_3^{+}OH^{-} + Cl^{-}} \longrightarrow \mathrm{R{-}NH_3^{+}Cl^{-} + OH^{-}} \)
\( 2\,\mathrm{R{-}NH_3^{+}OH^{-} + SO_4^{2-}} \longrightarrow (\mathrm{R{-}NH_3^{+}})_2\mathrm{SO_4^{2-}} + 2\mathrm{OH^{-}} \)
H⁺ మరియు OH– అయాన్లు ఏకమై అయాన్ విరహిత జలాన్ని ఏర్పరుస్తాయి.
కొంత కాలానికి రెజిన్లు తమ వినిమయ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందువలన వాటిని మరల ఉద్ధరించాలి. కాటయాన్ రెజిన్ గుండా విలీన H₂SO₄ ప్రసరింపచేయడం ద్వారా పునరుద్ధరిస్తారు. ఆనయాన్ రెజిన్ గుండా కాస్టిక్ సోడా ప్రసరింపచేయడం ద్వారా పునరుద్ధరిస్తారు.
ii) అయాన్ వినిమయ పద్ధతి: ఈ పద్ధతిని జియొలైట్ లేదా పెరుటిట్ ప్రక్రియ అని కూడా అంటారు. ఆర్థో సోడియం అల్యూమినియం సిలికేట్ (NaAlSiO₄) ను జియొలైట్ లేదా పెరుటిట్ అంటారు. దీనిని కఠిన జలానికి కలిపినపుడు వినిమయ చర్యలు జరుగుతాయి.
\( 2\mathrm{NaAlSiO_4(s)} + \mathrm{Ca^{2+}(aq)} \longrightarrow \mathrm{Ca(AlSiO_4)_2(s)} + 2\mathrm{Na^{+}(aq)} \)
జియొలైట్లో ఉన్న సోడియమ్ అంతా ఖర్చు అయిపోయినపుడు అది వ్యయమైపోయింది అని అంటారు. దాన్ని సజల NaCl ద్రావణంతో అభిచర్యని జరిపి పునరుత్పత్తి చేస్తారు.
\( \mathrm{Ca(AlSiO_4)_2(s)} + 2\mathrm{NaCl(aq)} \longrightarrow 2\mathrm{NaAlSiO_4(s)} + \mathrm{CaCl_2(aq)} \)
Exam Tips:
a) కాటయాన్ వినిమయం, ఆనయాన్ వినిమయం, పునరుద్ధరణ - మూడు దశలను వేర్వేరుగా రాయండి; జియొలైట్ పద్ధతికి సమీకరణాలు ఇవ్వండి.
Question 21: ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగాన్ని గురించి కొన్ని వాక్యాలు రాయండి. (March 2013)
Answer:
హైడ్రోజన్ అధిక మండు ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. అందువలననే, దీనిని పారిశ్రామిక ఇంధనంగా విరివిగా ఉపయోగిస్తారు.
1. ఆక్సీ హైడ్రోజన్ బ్లోటార్చ్ : పరిశుద్ధ H₂ మరియు O₂ వాయువుల మిశ్రమాన్ని అత్యధిక ఉష్ణోగ్రత (3000°C సుమారుగా) వద్ద మండిస్తే ఆక్సీ హైడ్రోజన్బ్లోటార్చ్ ఏర్పడుతుంది. ఈ జ్వాలను వెల్డింగ్ మరియు కరిగించే ప్రక్రియలలో ఉపయోగిస్తారు.
2. వాటర్ గ్యాస్ : CO మరియు H₂ ల మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అంటారు. వేడిగా ఉన్న ఎర్రని కోక్ మీదుగా నీటి ఆవిరిని పంపి దీనిని తయారుచేస్తారు. దీనిని పారిశ్రామిక ఇంధనంగా వాడతారు.
3. సెమివాటర్ గ్యాస్ : హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ మరియు మిథేన్‌ల మిశ్రమాన్ని సెమివాటర్ గ్యాస్ అంటారు. స్టీల్పరిశ్రమలలో దీనిని ఇంధనంగా ఉపయోగిస్తారు.
4. హైడ్రోజన్ ను, ఇంధన ఘటాలలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయుటకు ఉపయోగిస్తారు.
Exam Tips:
a) ఇంధనాలుగా ఆక్సీహైడ్రోజన్ జ్వాల, వాటర్ గ్యాస్, సెమివాటర్ గ్యాస్, ఇంధన ఘటాలు - నాలుగు ఉపయోగాలను పాయింట్లుగా రాయండి.
Question 22: 1% H₂O₂ ద్రావణాన్ని మీకు ఇచ్చాం. దాని నుంచి శుద్ధ H₂O₂ ని తయారుచేయడానికి మీరు ఏమి చర్యలను తీసుకుంటారు ?
Answer:
ఇవ్వబడిన 1% H₂O₂ నుండి శుద్ధ H₂O₂ ను క్రింది విధంగా పొందవచ్చు.
1. 1% H₂O₂ ద్రావణాన్ని నీటి ఉష్ణకారి (వాటర్ బాత్) పై ఆవిరి చేసి సుమారు 30% గాఢత వరకు గాఢపరుస్తారు.
2. 30% గాఢత గల H₂O₂ ద్రావణాన్ని అల్ప పీడనాల వద్ద జాగ్రత్తగా స్వేదనం చేస్తే గాఢత ఇంకా పెరిగి 85% అవుతుంది.
3. పై దశలోని ద్రావణాన్ని చల్లబరచి ఘనీభవనం చేస్తే శుద్ధ H₂O₂ స్ఫటికాలు ఏర్పడతాయి.
Exam Tips:
a) ఆవిరి చేయడం (30%) → అల్ప పీడన స్వేదనం (85%) → ఘనీభవనం (శుద్ధ H₂O₂) అనే క్రమాన్ని గుర్తుంచుకోండి.
Question 23: ఆధునిక కాలంలో H₂O₂ వలన కలిగే ఏవైనా మూడు ఉపయోగాలను చెప్పండి.
Answer:
1. గృహ మరియు పారిశ్రామిక వ్యర్థ పదార్థాల కాలుష్య నివారణలో వాడతారు.
2. సయనైడ్ల ఆక్సీకరణలో వాడతారు.
3. మురుగు కాల్వల వ్యర్థాలకు ఏరోబిక్ స్థితులను పునఃస్థాపించడానికి దీనిని వాడతారు.
Exam Tips:
a) మూడు ఉపయోగాలు పాయింట్లుగా రాస్తే చాలు; ఒక్కొక్కటి ఒక వాక్యంలో.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 24: వ్యాపార సరళిలో డైహైడ్రోజనిని తయారుచేయడంపై ఒక వ్యాసం రాయండి. తుల్య సమీకరణాలను ఇవ్వండి.
Answer:
వ్యాపార సరళిలో డైహైడ్రోజన్ ను ఈ క్రింది పద్ధతులలో తయారు చేస్తారు.
i) ప్లాటినమ్ ఎలక్ట్రోడ్లను ఉపయోగించి ఆమ్లీకృత లేదా క్షారయుత జలాన్ని విద్యుద్విశ్లేషణ చేస్తే డై హైడ్రోజన్ ఏర్పడుతుంది.
\( 2\mathrm{H_2O} \xrightarrow[\text{ఆమ్లం / క్షారం}]{\text{విద్యుద్విశ్లేషణ}} 2\mathrm{H_2} + \mathrm{O_2} \)
ii) నెల్సన్ పద్దతిలో బ్రైన్ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేసి డై హైడ్రోజన్ ను తయారు చేస్తారు.
NaCl → Na⁺ + Cl–
H₂O → H⁺ + OH–
ఆనోడ్ వద్ద 2Cl– → Cl₂ + 2e–
కాథోడ్ వద్ద 2H⁺ + 2e– → H₂
2Na⁺ + 2OH⁻ → 2NaOH
iii) ఉత్ప్రేరకం సమక్షంలో, అధిక ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోకార్బన్ల పై నీటి ఆవిరి చర్య ఫలితంగా డై హైడ్రోజన్ ఏర్పడుతుంది.
\( \mathrm{CH_4 + H_2O} \xrightarrow[\mathrm{Ni}]{1270\,K} \mathrm{CO + 3H_2} \)
iv) ఎర్రగా కాల్చిన కోక్ మీదుగా నీటి ఆవిరిని పంపినపుడు డై హైడ్రోజన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C + H_2O} \xrightarrow{1270\,K} \mathrm{CO + H_2} \)
CO, H₂ మిశ్రమాన్ని సిన్‌గ్యాస్ అంటారు. దీనిలోని CO ను ఐరన్ క్రోమేట్ ఉత్ప్రేరకం సమక్షంలో నీటి ఆవిరితో చర్యనొందించి H₂ ను అధికంగా ఉత్పత్తి చేస్తారు. దీనినే వాటర్ గ్యాస్ షిఫ్ట్ చర్య అంటారు.
\( \mathrm{CO + H_2O} \xrightarrow[\text{ఉత్ప్రేరకం}]{673\,K} \mathrm{CO_2 + H_2} \)
సోడియం ఆర్సినైట్ ద్రావణంతో మార్జనం చేసి CO₂ ను తొలగిస్తారు.
Exam Tips:
a) నాలుగు పద్ధతులను (నీటి విద్యుద్విశ్లేషణ, బ్రైన్, హైడ్రోకార్బన్లు, కోక్) సమీకరణాలతో రాయండి; షిఫ్ట్ చర్య కూడా మర్చిపోకండి.
Question 25: i) N₂
ii) లోహ అయాన్లు, లోహ ఆక్సైడ్లు
iii) కర్బన సమ్మేళనాలు.
వీటితో చర్యలను బట్టి డైహైడ్రోజన్ రసాయనశాస్త్రాన్ని వివరించండి.
Answer:
i) నైట్రోజన్ చర్య: నైట్రోజన్ హైడ్రోజన్ చర్య జరిపి అమ్మోనియాను ఇస్తుంది.
\( 3\mathrm{H_2 + N_2} \xrightarrow[\mathrm{Fe,\ Mo}]{673\,K,\ 200\,atm} 2\mathrm{NH_3} \)
అమ్మోనియాను భారీగా తయారుచేయటానికి హాబర్ విధానంలో ఈ చర్యనే వాడతారు.
ii) a) లోహ అయాన్లతో చర్య : హైడ్రోజన్, లోహ అయాన్లను జల ద్రావణంలో లోహాలుగా క్షయకరణం చెందించును.
\( \mathrm{H_2(g) + Pd^{2+}(aq)} \longrightarrow \mathrm{Pd(s)} + 2\mathrm{H^{+}(aq)} \)
b) లోహ ఆక్సైడ్లతో చర్య : హైడ్రోజన్ లోహ ఆక్సైడ్లను లోహాలుగా క్షయకరణం చెందించును.
H₂ + CuO → Cu + H₂O
iii) కర్బన సమ్మేళనాలతో చర్య ఉత్ప్రేరకాల సమక్షంలో హైడ్రోజన్ వివిధ రకాల కర్బన సమ్మేళనాలతో చర్య జరుపుతుంది.
a) వృక్షజనితమయిన నూనెలను నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజనీకరణం చేస్తే తినే కొవ్వును ఇస్తుంది.
b) ఓలిఫిన్లతో హైడ్రో ఫార్మైలేషన్ జరిపితే ఆల్డిహైడ్లు వస్తాయి. అవి మళ్ళీ క్షయకరణం చెంది ఆల్కహల్లను ఇస్తాయి.
H₂C = CH₂ + CO + H₂ → CH₃ CH₂ CHO
CH₃ CH₂ CHO + H₂ → CH₃ CH₂ CH₂ OH
Exam Tips:
a) N₂ (హాబర్), లోహ ఆక్సైడ్ల క్షయకరణం, హైడ్రోజనీకరణం, హైడ్రోఫార్మైలేషన్ - ప్రతి దానికి ఒక సమీకరణం ఇవ్వండి.
Question 26: కింది వాటిని సరైన ఉదాహరణలతో వివరించండి.
i) ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్లు
ii) ఎలక్ట్రాన్లు కచ్చితంగా ఉన్న హైడ్రైడ్లు
iii) ఎలక్ట్రాన్లు అధికంగాగల హైడ్రైడ్లు
Answer:
i) ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్లు : 13వ గ్రూపు మూలకాలన్ని ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి. లూయీ నిర్మాణాన్ని సాంప్రదాయ పద్దతిలో రాయటానికి కావలసిన ఎలక్ట్రాన్ల కన్నా తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి లూయీ ఆమ్లాలుగా పనిచేస్తాయి. ఉదా : B₂H₆
ii) ఎలక్ట్రాన్లు కచ్చితంగా ఉన్న హైడ్రైడ్లు: 14వ గ్రూపు మూలకాలు ఎలక్ట్రాన్లు కచ్చితంగా ఉన్న హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి. లూయీ నిర్మాణాన్ని సాంప్రదాయక పద్ధతిలో రాయటానికి కావలసిన ఎలక్ట్రాన్లు ఉంటాయి.
ఉదా : CH₄, SiH₄
iii) ఎలక్ట్రాన్లు అధికంగా గల హైడ్రైడ్లు: 15 – 17 గ్రూపు మూలకాలు ఎలక్ట్రాన్లు అధికంగాగల హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి. లూయీ నిర్మాణాన్ని సాంప్రదాయక పద్దతిలో రాయటానికి కావలసిన ఎలక్ట్రాన్ల కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎక్కువయిన ఈ ఎలక్ట్రాన్లు ఒంటరి జంటలుగా ఉంటాయి. ఇవి లూయీ క్షారాలుగా పనిచేస్తాయి.
ఉదా : NH₃, H₂O
Exam Tips:
a) మూడు రకాలకు గ్రూపులు గుర్తుంచుకోండి: 13 (కొరత), 14 (కచ్చితం), 15-17 (అధికం); ఉదాహరణలు B₂H₆, CH₄, NH₃.
Question 27: i) అయానిక హైడ్రైడ్లు
ii) అల్పాంతరాళ హైడ్రైడ్ల గూర్చి క్లుప్తంగా రాయండి.
Answer:
i) అయానిక హైడ్రైడ్లు లేదా సెలైన్ హైడ్రైడ్లు :
– అధిక ధన విద్యుదాత్మకత కల s – బ్లాక్ మూలకాలు అయానిక హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి.
– LiH, BeH₂, MgH₂ వంటి హైడ్రైడ్లలో కొంత సమయోజనీయ లక్షణం కనిపిస్తుంది.
– తయారీ : లోహాన్ని నేరుగా H₂ తో సంయోగం ద్వారా వీటిని పొందవచ్చు.
\( 2\mathrm{Na + H_2} \xrightarrow{300^\circ C} 2\mathrm{NaH} \)
– ఘన స్థితిలో అయానిక హైడ్రైడ్లు స్పటిక, అభాష్పశీల, అవాహక పదార్థాలు.
అయినా వీటి ద్రవాలు విద్యుత్ వాహకాలు. వాటి విద్యుత్ విశ్లేషణలో ఆనోడ్ వద్ద హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. దీనిని బట్టి H– అయాన్ ఉంటుందని నిర్ధారణ అవుతుంది.
\( \mathrm{CaH_2(\text{కరిగిన})} \xrightarrow{\text{విద్యుద్విశ్లేషణ}} \mathrm{Ca} + \mathrm{H_2} \)
– సెలైన్ హైడ్రైడ్లు నీటితో చర్య జరిపి H₂ వాయువును ఇస్తాయి.
NaH + H₂O → NaOH + H₂
ii) అల్పాంతరాళ హైడ్రైడ్లు: d – బ్లాకు, f బ్లాకు మూలకాలు హైడ్రోజన్‌తో సంయోగం చెంది అల్పాంతర లేదా నాన్-స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి. ఉదా : TiH₁.₅–₁.₈, ZrH₁.₃–₁.₇₅, PdH₀.₆–₀.₈. అయితే 7, 8, 9 గ్రూపు లోహాలు హైడ్రైడ్లను ఇవ్వవు (హైడ్రైడ్ అంతరం). ఇవి నాన్-స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు.
ఇంతకు ముందు కాలంలో, ఈ హైడ్రైడ్లలోని హైడ్రోజన్ లోహ జాలకంలోని అల్పాంతరాళాల్లో ఆక్రమించుకొని, జాలక రకంలో మార్పు లేకుండా దానిని వికృతి చెందిస్తుందని భావించారు. అయితే ఇటీవల అధ్యయనాలు Ni, Pd, Ce, Ac హైడ్రైడ్లు మినహా మిగిలిన ఈ తరగతి హైడ్రైడ్లన్నింటి జాలకాలు వాటి మాతృ లోహాల జాలకాల కంటే భిన్నంగా ఉంటాయని చూపాయి.
Pd, Pt వంటి లోహాలు చాలా ఎక్కువ ఘనపరిమాణంలో హైడ్రోజన్‌ను తమలో ఇముడ్చుకోగలవు. అందుకని హైడ్రోజన్‌ను నిల్వచేసే మాధ్యమాలుగా వాటిని ఉపయోగిస్తారు.
Exam Tips:
a) అయానిక హైడ్రైడ్లు: s-బ్లాక్, H⁻ అయాన్, కరిగిన స్థితిలో విద్యుత్ విశ్లేషణలో ఆనోడ్ వద్ద H₂; అల్పాంతరాళ హైడ్రైడ్లు: d, f బ్లాక్, నాన్-స్టాయికియోమెట్రిక్.
Question 28: నీటి రసాయన ధర్మాలను ఏ నాలుగింటినైనా విశదీకరించండి.
Answer:
i) ద్విస్వభావ ప్రవృత్తి : నీరు ఆమ్లంగాను, క్షారంగాను పనిచేయగల సామర్థ్యాన్ని చూపుతుంది. అంటే ద్విస్వభావ పదార్థంగా పనిచేస్తుంది. బ్రాన్‌స్టెడ్ సిద్ధాంతపరంగా అది NH₃ తో ఆమ్లంగా పనిచేస్తుంది. H₂S తో నీరు క్షారంగా పనిచేస్తుంది.
H₂O + NH₃ ⇌ OH⁻ + NH₄⁺
H₂O + H₂S ⇌ H₃O⁺ + HS⁻
ii) లోహాలతో చర్య : అధిక ధనవిద్యుదాత్మకత గల లోహాలు నీటిని క్షయీకరించి డై హైడ్రోజన్‌గా మార్చగలవు.
2H₂O + 2Na → 2NaOH + H₂
iii) జలవిశ్లేషణ చర్య : కొన్ని సమయోజనీయ పదార్థాలు, కొన్ని అయానిక పదార్థాలు నీటిలో జలవిశ్లేషణ చెందుతాయి.
P₄O₁₀ + 6H₂O → 4 H₃PO₄
SiCl₄ + 2H₂O → SiO₂ + 4HCl
iv) ఆర్ద్ర లవణాలు ఏర్పడడం : జల ద్రావణాల నుంచి చాలా లవణాలు ఆర్ద్ర లవణాలుగా స్ఫటికీకరణం చెందగలవు.
a) సమన్వయ సమయోజనీయ జలం : ఉదా : [Cr(H₂O)₆]³⁺ 3Cl⁻
b) అల్పాంతరాళ జలం : ఉదా : BaCl₂·2H₂O
c) హైడ్రోజన్ బంధిత జలం : ఉదా : [Cu(H₂O)₄]²⁺ SO₄²⁻·H₂O (ఇది CuSO₄·5H₂O లో ఉంటుంది).
Exam Tips:
a) నాలుగు ధర్మాలను (ద్విస్వభావం, లోహాలతో చర్య, జలవిశ్లేషణ, ఆర్ద్ర లవణాలు) శీర్షికలతో సమీకరణాలతో రాయండి.
Question 29: కఠినజలం, మృదుజలం అంటే ఏమిటో వివరించండి. కింది పద్ధతులను నీటి కఠినత్వాన్ని తొలగించడానికి వాడడంపై వ్యాఖ్యను రాయండి.
i) అయాన్ – వినిమయ పద్ధతి
ii) కాల్గన్ పద్ధతి
Answer:
కఠిన జలం : సబ్బుతో త్వరగా నురుగును ఇవ్వని నీటిని కఠిన జలం అంటారు. నీటిలో Ca మరియు Mg లవణాల వలన కఠినత్వం వస్తుంది.
Ca, Mg బై కార్బోనేట్ల వల్ల అశాశ్వత కాఠిన్యత వస్తుంది.
Ca, Mg క్లోరైడ్ లు, సల్ఫేట్ల వల్ల శాశ్వత కాఠిన్యత వస్తుంది.
మృదుజలం : సబ్బుతో త్వరగా నురుగును ఏర్పరచే నీటిని మృదుజలం అంటారు.
i) అయాన్ – వినిమయ పద్ధతి : ఈ పద్ధతిని జియొలైట్ లేదా పెరుటిట్ ప్రక్రియ అని కూడా అంటారు. ఆర్థో సోడియం అల్యూమినియం సిలికేట్ (NaAlSiO₄) ను జియొలైట్ లేదా పెరుటిట్ అంటారు. దీనిని కఠిన జలానికి కలిపినపుడు వినిమయ చర్యలు జరుగుతాయి.
\( 2\mathrm{NaAlSiO_4(s)} + \mathrm{Ca^{2+}(aq)} \longrightarrow \mathrm{Ca(AlSiO_4)_2(s)} + 2\mathrm{Na^{+}(aq)} \)
జియొలైట్లో ఉన్న సోడియమ్ అంతా ఖర్చు అయిపోయినపుడు అది వ్యయమైపోయింది అని అంటారు. దాన్ని సజల NaCl ద్రావణంతో అభిచర్యని జరిపి పునరుత్పత్తి చేస్తారు.
\( \mathrm{Ca(AlSiO_4)_2(s)} + 2\mathrm{NaCl(aq)} \longrightarrow 2\mathrm{NaAlSiO_4(s)} + \mathrm{CaCl_2(aq)} \)
ii) కాల్గన్ పద్ధతి : సోడియమ్ హెక్సా మెటాఫాస్ఫేట్ (Na₆P₆O₁₈) ని వ్యాపార సరళిలో కాల్గన్ అంటారు. దీనిని కఠిన జలానికి కలిపినపుడు కింది చర్యలు జరుగుతాయి.
\( \mathrm{Na_6P_6O_{18}} \longrightarrow 2\mathrm{Na^{+}} + \mathrm{Na_4P_6O_{18}^{2-}} \)
\( \mathrm{M^{2+} + Na_4P_6O_{18}^{2-}} \longrightarrow [\mathrm{Na_2MP_6O_{18}}]^{2-} + 2\mathrm{Na^{+}}\quad [\mathrm{M = Mg,\ Ca}] \)
సంక్లిష్ట Mg⁺², Ca⁺² అయాన్లు ద్రావణంలో ఉంటాయి. ఇవి సబ్బుతో చర్య నొందవు. కావున ఈ నీరు సబ్బుతో నురగను ఇస్తుంది.
Exam Tips:
a) కఠిన, మృదుజలం నిర్వచనాలు ముందుగా; తర్వాత జియొలైట్ మరియు కాల్గన్ పద్ధతుల సమీకరణాలు.
Question 30: హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సీకరణిగాను, క్షయకరణిగాను పనిచేయగలదు అనడానికి రసాయన చర్యలను రాసి సమర్ధించండి.
Answer:
ఆమ్ల, క్షార యానకాలు రెండింటిలోను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సీకరణిగాను, క్షయకరణిగాను పనిచేస్తుంది.
i) ఆమ్ల యానకంలో ఆక్సీకరణ చర్య:
2Fe²⁺ + 2H⁺ + H₂O₂ → 2Fe³⁺ + 2H₂O
PbS + 4H₂O₂ → PbSO₄ + 4H₂O
ii) ఆమ్ల యానకంలో క్షయకరణ చర్య:
2MnO₄⁻ + 6H⁺ + 5H₂O₂ → 2Mn²⁺ + 8H₂O + 5O₂
HOCl + H₂O₂ → H₃O⁺ + Cl⁻ + O₂
iii) క్షార యానకంలో ఆక్సీకరణ చర్య:
2Fe²⁺ + H₂O₂ → 2Fe³⁺ + 2OH⁻
Mn²⁺ + H₂O₂ → Mn⁴⁺ + 2OH⁻
iv) క్షార యానకంలో క్షయకరణ చర్య:
I₂ + H₂O₂ + 2OH⁻ → 2I⁻ + 2H₂O + O₂
2MnO₄⁻ + 3H₂O₂ → 2MnO₂ + 3O₂ + 2H₂O + 2OH⁻
Exam Tips:
a) నాలుగు సందర్భాలను (ఆమ్ల/క్షార యానకం × ఆక్సీకరణి/క్షయకరణి) వేర్వేరు శీర్షికలతో ఒక్కో సమీకరణంతో రాయండి.
Question 31: క్రింది రసాయన చర్యలను పూర్తి చేసి తుల్యం చేయండి.
i) PbS (ఘ) + H₂O₂ (జల) →
ii) MnO₄⁻ (జల) + H₂O₂ (జల) →
iii) CaO (ఘ) + H₂O (వా) →
iv) Ca₃N₂ (ఘ) + H₂O (ద్ర) →
పై చర్యలను
a) జలవిశ్లేషణ,
b) ఆక్సీకరణ-క్షయకరణ,
c) హైడ్రేషన్ చర్యలుగా వర్గీకరించండి.
Answer:
1. PbS + 4H₂O₂ → PbSO₄ + 4H₂O
ఈ చర్య రిడాక్స్ చర్య. PbS ఆక్సీకరణం చెందుతుంది. H₂O₂ క్షయకరణం చెందుతుంది.
2. 2MnO₄⁻ + 6H⁺ + 5H₂O₂ → 2Mn²⁺ + 8H₂O + 5O₂
ఈ చర్య రిడాక్స్ చర్య. MnO₄⁻ క్షయకరణం చెందుతుంది. H₂O₂ ఆక్సీకరణం చెందుతుంది.
3. CaO + H₂O → Ca(OH)₂
ఈ చర్య హైడ్రేషన్ చర్య
4. Ca₃N₂ + 6H₂O → 3Ca(OH)₂ + 2NH₃
ఈ చర్య జలవిశ్లేషణ చర్య.
Exam Tips:
a) ప్రతి సమీకరణాన్ని తుల్యం చేసి, చర్య రకాన్ని (రిడాక్స్, హైడ్రేషన్, జలవిశ్లేషణ) చివరలో స్పష్టంగా రాయండి.
Question 32: హైడ్రోజన్ పెరాక్సైడిని తయారుచేయడానికి వివిధ పద్ధతులను వాటికి అనువైన రసాయన సమీకరణాలతో చర్చించండి. వీటిలో ఏ పద్ధతి H₂O₂ ని తయారుచేయడానికి ఉపయోగపడుతుంది ?
Answer:
1. బేరియం పెరాక్సైడ్‌కు చల్లని విలీన H₂SO₄ ను కలపడం ద్వారా H₂O₂ ను తయారుచేయవచ్చు.
BaO₂·8H₂O(s) + H₂SO₄(aq) → BaSO₄(s) + H₂O₂(aq) + 8H₂O(l)
2. 50% H₂SO₄ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా పెరాక్సో డై సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారుచేస్తారు. దీనిని జలవిశ్లేషణ చేస్తే H₂O₂ ఏర్పడుతుంది.
2HSO₄⁻ → H₂S₂O₈ + 2e⁻
H₂S₂O₈ + 2H₂O → 2H₂SO₄ + H₂O₂
3. పారిశ్రామికంగా H₂O₂ ను 2-ఇథైల్ ఆంత్రాక్వినాల్ యొక్క స్వయం ఆక్సీకరణ ద్వారా తయారుచేస్తారు. ఇదే పారిశ్రామికంగా H₂O₂ తయారీకి ఉపయోగపడే పద్ధతి.
\( \text{2-ఇథైల్ ఆంత్రాక్వినాల్} \underset{\mathrm{H_2/Pd}}{\overset{\mathrm{O_2\ (గాలి)}}{\rightleftharpoons}} \mathrm{H_2O_2} + \text{2-ఇథైల్ ఆంత్రాక్వినోన్} \)
Exam Tips:
a) మూడు పద్ధతులు: BaO₂ + H₂SO₄, పెరాక్సో డై సల్ఫ్యూరిక్ ఆమ్లం జలవిశ్లేషణ, 2-ఇథైల్ ఆంత్రాక్వినాల్ ఆక్సీకరణ (పారిశ్రామిక).
Question 33: H₂O₂ గాఢతని ఎన్ని రకాలుగా మీరు చెప్పగలరు ? 15 ఘనపరిమాణ H₂O₂ గాఢతని gL⁻¹ లలో లెక్కగట్టండి. ఈ గాఢతను నార్మాలిటీ, మొలారిటీలలో తెలియజేయండి.
Answer:
H₂O₂ గాఢతను ఘనపరిమాణంలో, భారశాతం (W/V) లో, మొలారిటీలో, నార్మాలిటీలో సూచించవచ్చు.
i) ఘనపరిమాణంలో: 10 ఘ.ప H₂O₂ అనగా 1 మి.లీ. ద్రావణం STP వద్ద 10 మి.లీ. O₂ ను విడుదల చేస్తుంది. అలాగే 20 ఘ.ప H₂O₂ అనగా 1 మి.లీ. ద్రావణం 20 మి.లీ. O₂ ను ఇస్తుంది.
ii) 10 ఘ.ప H₂O₂ గాఢత: H₂O₂ ఈ క్రింది విధంగా విఘటనం చెందుతుంది.
\( 2\mathrm{H_2O_2} \longrightarrow 2\mathrm{H_2O} + \mathrm{O_2} \)
2 మోల్‌ల H₂O₂ (2 × 34 = 68 గ్రా.) నుండి 1 మోల్ O₂ (STP వద్ద 22.4 లీ.) వెలువడుతుంది.
10 ఘ.ప ద్రావణంలో 1 లీ. ద్రావణం 10 లీ. O₂ ఇస్తుంది. కావున 1 లీ. ద్రావణంలో H₂O₂ భారం \( = \frac{68 \times 10}{22.4} = 30.36 \) గ్రా.
అంటే 10 ఘ.ప H₂O₂ గాఢత = 30.36 g L⁻¹ (సుమారు 3.04% W/V).
మొలారిటీ \( = \frac{30.36}{34} = 0.893 \) M
నార్మాలిటీ \( = \frac{30.36}{17} = 1.786 \) N (H₂O₂ తుల్యభారం = 17)
iii) 15 ఘ.ప H₂O₂ గాఢత:
g L⁻¹ లలో \( = \frac{15 \times 30.36}{10} = 45.54 \) g L⁻¹ (సుమారు 45.5 g L⁻¹)
నార్మాలిటీ \( = \frac{15 \times 1.786}{10} = 2.679 \) N
మొలారిటీ \( = \frac{\text{నార్మాలిటీ}}{2} = \frac{2.679}{2} = 1.34 \) M (∵ 1 M H₂O₂ = 2 N)
Exam Tips:
a) 10 ఘ.ప H₂O₂ = 30.36 g/L; మొలారిటీ = నార్మాలిటీ / 2 అనే సంబంధం గుర్తుంచుకోండి; ప్రతి అంకెకు యూనిట్లు రాయండి.
Free study material for Chemistry
TS Board Solutions for Class 11 Chemistry Chapter 08 Hydrogen and its Compounds
Textbook Solutions for Class 11 Chemistry Chapter 08 Hydrogen and its Compounds
Explore reliable textbook solutions for Chapter 08 Hydrogen and its Compounds tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Chemistry.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Chemistry text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Chemistry.
FAQs
The complete and updated TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు in printable PDF format for offline study on any device.