Download TS Board Solutions for Class 9 Telugu Upavachakam Lesson 05 Swami Vivekananda (Supplementary Reader)
Review structured textbook solutions for Class 9 Telugu Upavachakam Lesson 05 Swami Vivekananda (Supplementary Reader). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access TS Board Solutions and Answers
View or download the dedicated Lesson 05 Swami Vivekananda (Supplementary Reader) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu Upavachakam.
పాఠ్యాంశ ప్రశ్నలు – జవాబులు
Question 1: నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
Answer:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.
ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్కు ఆటలంటే ప్రాణం.
– నరేన్కు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రరసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.
నరేన్కు క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీకావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటిశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.
తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, మరుసటి సంవత్సరం నేడు ‘స్కాటిష్ చర్చ్ కాలేజీ’ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.
Exam Tips:
a) బాల్యం, విద్యాభ్యాసం అనే రెండు అంశాలను వేర్వేరు పేరాలుగా రాయండి (6వ ఏట విద్యారంభం, 7వ ఏట మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్, 1884లో బి.ఏ.).
b) సంవత్సరాలు, సంస్థల పేర్లు (ప్రెసిడెన్సీ కాలేజీ, స్కాటిష్ చర్చ్ కాలేజీ) తప్పులేకుండా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
Question 2: వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలను తెల్పండి.
Answer:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓడలో టిక్కెట్టు కొని ఇచ్చాడు. నరేంద్రునికి “వివేకానంద” అనే నామాన్ని స్వీకరించమన్నాడు.
వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్’లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.
షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ప్రొఫెసర్ జె.హెచ్.రైట్తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.
ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు.
వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.
సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.
Exam Tips:
a) సంఘటనలను క్రమంలో రాయండి: బయలుదేరిన తేదీ (1893 మే 31) → వాంకోవర్ → షికాగో → బోస్టన్ → విశ్వమత మహాసభ.
b) ‘నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా’ అనే సంబోధనను తప్పక పేర్కొనండి; అదే సభను ఆకట్టుకున్న ముఖ్యాంశం.
Question 3: వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి ?
Answer:
వివేకానందుని సందేశము: “మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారతజాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.
భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీజనోద్ధరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్రపాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలనూ పరిష్కరించే మార్గం కావాలి.
వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలనూ, అమాయక ప్రజలనూ, అణగద్రొక్కబడిన వారినీ ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి.
లేవండి మేల్కొనండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి.”
Exam Tips:
a) సందేశాన్ని మూడు భాగాలుగా రాయండి: జాతికి, సమాజానికి (స్త్రీజనోద్ధరణ, విద్య), యువతకు.
b) చివర ‘ఉత్తిష్ఠత! జాగ్రత!’ అనే ఉపనిషత్ వాక్యంతో ముగిస్తే జవాబు ప్రభావవంతంగా ఉంటుంది.
Question 4: వివేకానందుని సందేశాల ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
Answer:
ఏకపాత్రాభినయం “వివేకానంద”:
నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యాలపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా, అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.
మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీజనోద్ధరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.
మనం వ్యావహారిక భాషలోనే శాస్త్రపాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి. సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగద్రొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.
“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” (లేవండి! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి !)
Exam Tips:
a) ఏకపాత్రాభినయాన్ని సంబోధనతో ప్రారంభించి (నా భారతీయ సహోదరులారా!), ఆవేశపూర్వకమైన చిన్న వాక్యాలలో రాయండి.
b) సందేశంలోని ముఖ్య అంశాలు – సమానత్వం, విద్య, యువతకు పిలుపు – తప్పనిసరిగా ఉండాలి.
పరిచిత గద్యం 1 – అవగాహన ప్రశ్నలు
కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూంటే దారిలో ఒక కోతులగుంపు కనిపించింది. అవి ఆయనవైపు తిరిగి పరుగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో వివేకానంద స్వామిజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్త నారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ పరుగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, “ఆగు! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో” అని గట్టిగా అరిచాడు. స్వామిజీ ఆగి వెనక్కి తిరగగానే, కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామిజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతి కాలంలో స్వామిజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనీ, ఆ కోతుల్లాగ కష్టాలు మనల్ని వెన్నాడుతున్నాయనీ, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటినెదుర్కొంటామో, అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు.
Question 1: కోతులు ఎప్పుడు పరుగుపెట్టాయి ?
Answer:
స్వామీజీ వెనుదిరిగి రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే కోతులు పరుగుపెట్టాయి.
Exam Tips:
a) ప్రశ్నలో అడిగిన ‘ఎప్పుడు’ కు సమాధానంగా సంఘటన (స్వామీజీ వెనుదిరిగి ఎదుర్కొన్నప్పుడు) ను ఒకే వాక్యంలో రాయండి.
Question 2: వివేకానంద స్వామిజీకి కోతులు ఎప్పుడు కనిపించాయి ? ఎక్కడ కనిపించాయి ?
Answer:
వివేకానంద స్వామిజీకి కాశీలో, దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో కోతులు కనిపించాయి.
Exam Tips:
a) ‘ఎప్పుడు’, ‘ఎక్కడ’ అనే రెండు భాగాలకూ విడివిడిగా జవాబు ఉండాలి (దుర్గాలయం నుండి వస్తున్నప్పుడు – కాశీలో).
Question 3: ‘ఆ జంతువులనెదుర్కో’ అని ఉపదేశించిన వ్యక్తి ఎవరు ?
Answer:
‘ఆ జంతువుల నెదుర్కో’ అని ఒక వృద్ధ సన్యాసి స్వామికి అరిచి చెప్పాడు.
Exam Tips:
a) వ్యక్తి ప్రశ్నకు ‘వృద్ధ సన్యాసి’ అని స్పష్టంగా రాసి, ఆయన చెప్పిన మాటను చేర్చండి.
Question 4: వివేకానందస్వామి కోతుల సంఘటన నుండి నేర్చుకున్న పాఠం ఏమిటి ?
Answer:
కోతుల్లాగే కష్టాలు మానవులను వెన్నాడుతాయనీ, ఎప్పుడైతే, ఆగి మనం వెనక్కు తిరిగి ఆ కష్టాలను ఎదుర్కొంటామో అప్పుడు అవి పారిపోతాయనీ, స్వామి కోతుల సంఘటనను బట్టి నేర్చుకున్నాడు.
Exam Tips:
a) పాఠం సారాంశం: కష్టాలకు భయపడి పారిపోకుండా ఎదుర్కోవాలి – దీనిని సొంతమాటల్లో రాయండి.
Question 5: కోతులు సంఘటనను గూర్చి వివేకానంద ఎక్కడ చెప్పారు ?
Answer:
కోతుల సంఘటనను గూర్చి స్వామిజీ అమెరికాలో చెప్పాడు.
Exam Tips:
a) ‘ఎక్కడ’ ప్రశ్నకు స్థలం (అమెరికా) పేర్కొంటే చాలు; అనవసర వివరణ వద్దు.
పరిచిత గద్యం 2 – అవగాహన ప్రశ్నలు
వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31 వ తారీఖున అమెరికాకు బయలుదేరాడు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంగ్కాంగ్, చైనా, జపాన్ లోని రేవులలో ఆగింది. స్వామిజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవాడు. కొన్నాళ్ళకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామిజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్ళాడు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామిజీతో మాట్లాడింది. స్వామిజీ ప్రతిభాపాండిత్యాలనీ, పవిత్రతనీ, గమనించి, ‘స్వామీ మీరెప్పుడైనా బోస్టన్నగరానికి వస్తే, దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింపజేయండి’ అని తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీ షికాగో చేరుకున్నాడు. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడి భవంతులు రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయాడు.
Question 1: స్వామీజీ వేటిని చూసి విస్తుపోయారు ?
Answer:
స్వామిజీ, షికాగోలో భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలయినవి చూసి విస్తుపోయారు.
Exam Tips:
a) పేరాలోని వస్తువుల జాబితాను (భవంతులు, రోడ్లు, యంత్రాలు, కర్మాగారాలు, కళలు) వదలకుండా రాయండి.
Question 2: వివేకానంద స్వామి ప్రయాణించిన ఓడ ఎక్కడ ఆగింది ?
Answer:
వివేకానందస్వామి ప్రయాణించిన ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది.
Exam Tips:
a) ఓడ ఆగిన చోటు: కెనడాలోని వాంకోవర్ – దేశం పేరు కూడా రాయండి.
Question 3: స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ ఎవరు ? ఆమె ఏ నగరానికి చెందినది ?
Answer:
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ పేరు “సాన్బోర్న్”. ఆమె బోస్టన్ నగరానికి చెందినది.
Exam Tips:
a) రెండు భాగాల ప్రశ్న: మహిళ పేరు (సాన్ బోర్న్), నగరం (బోస్టన్) రెండూ రాయాలి.
Question 4: స్వామిజీ బొంబాయిలో ఎప్పుడు బయలుదేరారు ?
Answer:
స్వామిజీ బొంబాయిలో 1893 మే 31వ తారీఖున అమెరికాకు బయలుదేరారు.
Exam Tips:
a) తేదీని పూర్తిగా రాయండి: 1893 మే 31; బయలుదేరిన స్థలం బొంబాయి.
Question 5: స్వామిజీ ఎప్పుడు చికాగో చేరుకున్నారు?
Answer:
స్వామిజీ జూలై నెల మధ్యలో చికాగో చేరుకున్నారు.
Exam Tips:
a) పేరాలో ఇచ్చిన నెల (జూలై మధ్యలో) ను మాత్రమే రాయండి; తేదీని ఊహించి రాయవద్దు.
Free study material for Telugu Upavachakam
Step-by-Step Textbook Answers: Class 9 Telugu Upavachakam Lesson 05 Swami Vivekananda (Supplementary Reader)
Textbook Solutions for Class 9 Telugu Upavachakam Lesson 05 Swami Vivekananda (Supplementary Reader)
Review comprehensive exercise answers for Class 9 Telugu Upavachakam Lesson 05 Swami Vivekananda (Supplementary Reader). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Telugu Upavachakam text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 9 Telugu Upavachakam.
FAQs
The complete and updated TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu Upavachakam are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu Upavachakam concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Telugu Upavachakam. You can access TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద in both English and Hindi medium.
Yes, you can download the entire TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద in printable PDF format for offline study on any device.