Official TS Board Solutions for Class 9 Telugu Upavachakam: Lesson 03 Kaloji (Supplementary Reader)
Explore reliable textbook solutions for Lesson 03 Kaloji (Supplementary Reader) tailored for Class 9 learners. Utilizing these Telugu Upavachakam answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Chapter-wise Solutions for Telugu Upavachakam: Lesson 03 Kaloji (Supplementary Reader)
View or download the dedicated Lesson 03 Kaloji (Supplementary Reader) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu Upavachakam.
ఉపవాచకం – కాళోజి
Question 1: కాళోజి – బాల్యం – విద్యాభ్యాసంను గూర్చి రాయండి.
Answer:
కాళోజి నారాయణరావుగారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అనగా 9-9-1914న జన్మించాడు. ఈయన ‘రట్టహళ్ళి’ అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూరు జిల్లాలో ఉంది. ఈ ఊరు, కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది.
కాళోజీ బాల్యంలో వారి కుటుంబం, కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని ‘సాయరాం’ అనే గ్రామంలోనూ, మరికొంతకాలం తెలంగాణాలోని ఇల్లెందు తాలూకా ‘కారేపల్లి’ గ్రామంలోనూ నివసించేది. 1917 వరకూ కాళోజీ కుటుంబం ‘హనుమకొండ’ లో ఉండేది. తరువాత ‘మడికొండ’ కు మారింది.
కాళోజీ అన్న రామేశ్వరరావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాదు వెళ్ళవలసినప్పుడు కాళోజీ పాతబస్తీలోని చౌయహల్లా కాన్లీబడిలో సెకండ్ ఫారమ్‌లో చేరారు. ఆ తరువాత సుల్తాను బజారులోని రెసిడెన్సీ మిడిల్ స్కూలులో చేరారు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్‌లో వరంగల్ కాలేజిమేట్ హైస్కూలులో ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. 1939లో కాళోజీ ‘లా’ పూర్తి చేశారు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన ‘రుక్మిణి’ని వివాహం చేసుకున్నారు.
Exam Tips:
a) జన్మతేదీ (9-9-1914), జన్మస్థలం (రట్టహళ్ళి), విద్య (లా – 1939), వివాహం (రుక్మిణి – 1940) అనే వివరాలను క్రమంగా రాయండి.
b) ఊరి పేర్లు (సాయరాం, కారేపల్లి, హనుమకొండ, మడికొండ) సరిగ్గా రాయండి.
Question 2: కాళోజిగారి కథలను గూర్చి రాయండి.
(లేదా)
కథా రచయితగా కాళోజీ ఎలా రాణించారు ?
Answer:
కాళోజీ కవిగానేగాక, కథకునిగా కూడ రాణించాడు. ఈయన కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ కథలకు ఈనాటికీ ‘ప్రాసంగికత’ ఉంది.
కులమతాలపేరిట, మనుషుల్ని హీనంగా చూడటం అవమానించడం, ఎంత దారుణమో ఈయన చెప్పారు. మనుషుల్లో ఉండే ద్వంద్వ ప్రవృత్తినీ, అన్యాయరీతుల్ని గూర్చి ఈయన తన కథల్లో చెప్పారు.
ఈయన ‘విభూతి లేక ఫేస్ పౌడర్ కథ’ వ్యంగ్య హేళనలతో సాగింది. ఈ కథలో అలంకరణల పట్ల మోజును గూర్చి, నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు.
రాజకీయములో పరిపాలనలో ఉన్న అవకతవకలనూ, అక్రమాలనూ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది. ఈ పరిస్థితుల్ని రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుడి కథలకు ముడిపెట్టి, కాళోజీ రాసిన కథ పేరు “లంకా పునరుద్ధరణ”. రామాయణ కథపై విసరిన వ్యంగ్యాస్త్రమే, ‘లంకా పునరుద్ధరణ’ కథ.
రాతి బొమ్మకు గుడిని కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు, ప్రాణం ఉన్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసరిన మరో వ్యంగ్యాస్త్రం, “భూతదయ” అనే కథ. ఈ విధంగా కాళోజీ కథలన్నీ ఒకరకంగా రాజకీయ కథలు. ఈ కథలో సాహిత్య విలువలను కాపాడడానికి కాళోజీ ప్రయత్నించారు.
Exam Tips:
a) రెండు కథల పేర్లు ('లంకా పునరుద్ధరణ', 'భూతదయ'), 'విభూతి లేక ఫేస్ పౌడర్' తప్పక పేర్కొనండి.
b) కథల లక్షణాలు: స్వచ్ఛత, సూటిదనం, నిరసన, వ్యంగ్యం – ఇవి రాయండి.
Question 3: కాళోజి ‘కవిత్వం – భాష’ అనే వాటిని గూర్చి రాయండి.
Answer:
కాళోజి తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందాడు. తెలంగాణ పక్షాన నిలిచి, తాడిత, పీడిత ప్రజల గుండెల్లో కొలువైన మహాకవి కాళోజి. కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలో, ఆవేదనలో, వేషభాషల్లో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.
ఈయన సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించారు. కాళోజీ ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కవి. నిరంకుశ రాజ్యాలమీద తన జీవితాంతం కత్తి కట్టి పోరాడాడు. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో, మమేకమైన కాళోజీ కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన ఆయన కవిత, “కాటేసి తీరాలె” అనేది. ఇందులోని కసి తెలంగాణ ప్రజలది.
“మన పిల్లల చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”
కాళోజీ భాష : కాళోజీ దృష్టిలో భాష రెండు రకాలు. ఒకటి “బడి పలుకుల భాష”. రెండవది జనం నిత్యం వ్యవహారంలో వాడే “పలుకుబడుల భాష”. వీటినే గ్రాంథిక భాష, వ్యావహారిక భాష అంటాము.
ఏ భాషకైనా జీవధాతువు, మాండలికమే. కాళోజీ జీవభాష వైపే మొగ్గు చూపాడు.
Exam Tips:
a) 'కాటేసి తీరాలె' పద్యపాదాలను ఉదహరిస్తే మార్కులు పెరుగుతాయి.
b) భాష: బడి పలుకుల భాష (గ్రాంథికం), పలుకుబడుల భాష (వ్యావహారికం) తేడా రాసి, జీవభాష వైపు మొగ్గు అని ముగించండి.
Question 4: కాళోజీ నారాయణరావుగారి ప్రజా జీవితం గురించి రాయండి.
Answer:
ఎనిమిది దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కాళోజీ బ్రతుకు ముడిపడింది. ఆయన వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరుగుబడ్డాడు. ఆయన వాదనలోని సమర్థనలను, ఆలోచించ గలవారు గుర్తించారు. ఈయన పెక్కు సందర్భాల్లో తెలంగాణేతరుల మనస్సులను కూడా జయించాడు.
కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా చెప్పాలి. ఈయన తెలంగాణ వారసత్వంలోంచి ఎదిగాడు. ఈయన మనుషులను అర్థం చేసుకున్న తీరు, విశిష్టమైనది. ఈయనకు భాగవతంలో ప్రహ్లాదుడి పాత్ర నచ్చిందని చాలాసార్లు చెప్పాడు. అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు పూజ్యుడని, కాళోజీ చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని ఈయన భావించాడు.
ఓటుహక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకొని, ఈయన తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి కాళోజిలో అడుగడుగునా కనిపిస్తుంది.
వ్యక్తిత్వం, స్వేచ్ఛ, అనే రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని, కాళోజీ చెప్పారు. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నారు. “నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కులకోసం అవసరమైతే నా ప్రాణాలిచ్చి పోరాడుతా” అనే మాటల్ని కాళోజీ గుర్తు చేసేవారు. ఆ మేరకు ఆయన బతికారు.
తెలంగాణ ఇటీవల వరకు యుద్ధ భూమి అందులో కాళోజీ ప్రజల వైపు నిలబడి, కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. కాళోజీ ఉద్యమ కవి.
Exam Tips:
a) ఓటు హక్కు బోర్డు, ప్రహ్లాదుని పాత్ర, స్వేచ్ఛ గురించిన మాట వంటి ఉదాహరణలు ఇవ్వండి.
b) 'తెలంగాణ వైతాళికుడు', 'ఉద్యమ కవి' అనే ముగింపు వాక్యాలు ఉపయోగించండి.
Question 5: కాళోజీ నారాయణరావు వ్యక్తిత్వాన్ని గురించి సంక్షిప్తంగా రాయండి.
Answer:
కాళోజీ 9-9-1914న బీజపూర్ జిల్లా రట్టహళ్ళిలో జన్మించారు. 1939లో లా పూర్తిచేసి, 1940లో రుక్మిణిని పెండ్లాడారు. ఆచరణకు, ఆదర్శానికీ తేడాలేని జీవితం ఆయనది. కాళోజీ నిరంతర ఉద్యమ జీవి. తమ కాలంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. రజాకార్లను ఎదిరించి జైలు జీవితం గడిపారు. నిజాం రాజును ఎదిరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఇతరుల బాగు కోసం పోరాడేతత్త్వం, సామాజిక స్పృహ, కాళోజీలో ఉన్నాయి.
కాళోజీ తాడిత పీడిత ప్రజల గుండెల్లో నిలిచిన కవి. ఆయనలో తెలంగాణా స్వరూపం దర్శనమిస్తుంది. దాశరథి అన్నట్లు, కాళోజీ, “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం”. కాళోజీ, సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరున అనేక కవితలు రాశాడు. కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. రజాకార్లపై తన కోపాన్ని కాళోజీ ‘కాటేసి తీరాలె’ అన్న కవితలో రాశారు. కాళోజీ తన రచనలలో, జీవ భాష వైపే మొగ్గుచూపారు. ‘వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది’, అని కాళోజీ ఎలుగెత్తి చాటాడు. కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, కథకునిగా కూడా, రాణించారు. కాళోజీ వివక్షను వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. కాళోజీ తెలంగాణ వైతాళికుడు.
ఈయన, ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంటుందని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరిగేవాడు. ఆయన నిర్భయంగా మాట్లాడేవారు. కాళోజీ జీవితాంతం, ప్రజాస్వామ్యవాదిగా ఉన్నాడు. ఖలీల్ జిబ్రాన్ రాసిన “ది ప్రాఫెట్”ను ‘జీవనగీత’గా అనువదించాడు. తన భౌతిక శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ వారికి అందించాడు.
కాళోజీ జీవితమంతా దేశంగా, ప్రజలుగా, ఉద్యమాలుగా బతికిన మహాకవి.
Exam Tips:
a) జననం–విద్య–ఉద్యమాలు–రచనలు–ముగింపు అనే క్రమంలో సంక్షిప్తంగా రాయండి.
b) 'జీవనగీత' అనువాదం, శరీర దానం వంటి ప్రత్యేక అంశాలను రాయండి.
పరిచిత గద్యాలు (1)
తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన కవి కాళోజి. మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి అన్నట్లు “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి.” తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజీ.
సమాజ గొడవను తన గొడవగా చేసుకొని “నా గొడవ” పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి నిజానికి అంతర్జాతీయ కవి. నిరంకుశ రాజ్యాలమీద జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజి. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో మమేకమైన కాళోజి కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్టకు చేర్చిన కవిత “కాటేసి తీరాలె”. ఇందులోని కసి తెలంగాణా ప్రజలందరిది.
Question 1: కాళోజీ గురించి దాశరథి అన్నమాట ఏది ?
Answer:
‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి’ అని దాశరథి కాళోజి గురించి చెప్పాడు.
Exam Tips:
a) దాశరథి మాట: 'తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం' – యథాతథంగా రాయండి.
Question 2: కాళోజి ఎటువంటి కవి ?
Answer:
ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి, నిజానికి అంతర్జాతీయ కవి.
Exam Tips:
a) మూడు దృక్పథాలనూ (ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ) రాయండి.
Question 3: కాళోజీలో ఏమి కనిపిస్తుంది ?
Answer:
కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.
Exam Tips:
a) పేరాలోని వాక్యాన్ని ఉన్నట్లే రాయండి: మాటలలో, చేతలలో… తెలంగాణ స్వరూపం.
Question 4: కాళోజి ప్రజాకవి ఎట్లు అయ్యాడు ?
Answer:
తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళాడు కాబట్టి, కాళోజి ప్రజాకవి అయ్యాడు.
Exam Tips:
a) 'కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళాడు' అనే కారణాన్ని స్పష్టంగా రాయండి.
Question 5: ‘నా గొడవ’ కవితా సంపుటాల గురించి తెలుపండి.
Answer:
కాళోజీ సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు.
Exam Tips:
a) 'ఎనిమిది సంపుటాలు' అనే సంఖ్యను తప్పక రాయండి.
పరిచిత గద్యాలు (2)
కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. మతం పేరిట, కులంపేరిట మనుషుల్ని హీనంగా చూడటం, అవమానించటం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన రీతుల్ని తెలియజెప్పాడు. వ్యంగ్యం, హేళనలతో సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకల్ని, అక్రమాల్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో, లౌక్యంతో రాజ్యపాలన సాగింది.
Question 1: కాళోజి కథల్లో ఏమి కనిపిస్తుంది ?
Answer:
కాళోజీ కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తుంది.
Exam Tips:
a) మూడు లక్షణాలు: స్వచ్ఛత, సూటిదనం, నిరసన.
Question 2: తెలంగాణలో 1940 నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది ?
Answer:
తెలంగాణలో 1940 నాడు రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది.
Exam Tips:
a) 'శైశవ దశ' అనే పదం, కుట్రలు–కుతంత్రాలు–లౌక్యం అనే వివరాలు రాయండి.
Question 3: ‘ఫేస్ పౌడర్’ కథలో విశిష్టత ఏది ?
Answer:
‘ఫేస్ పౌడర్’ కథలో అలంకరణ పట్ల మోజును, నవ్వు తెప్పించే విధంగా కాళోజీ చెప్పాడు.
Exam Tips:
a) 'అలంకరణల పట్ల మోజు' మరియు 'నవ్వు తెప్పించే విధానం' రెండూ రాయండి.
Question 4: కాళోజి ఎట్లా రాణించాడు ?
Answer:
కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, మరియు కథకునిగా, రాణించాడు.
Exam Tips:
a) కవి, ఉద్యమకారుడు, కథకుడు అనే మూడు రూపాలను రాయండి.
Question 5: కాళోజీ కథల్లో చెప్పిన సంగతులేవి ?
Answer:
కాళోజీ కథల్లో కులమతాల పేరిట మనుష్యుల్ని హీనంగా చూడటం, అవమానించడం, ఎంత దారుణమో చెప్పాడు.
Exam Tips:
a) కులమతాల పేరిట మనుషులను అవమానించడం ఎంత దారుణమో చెప్పాడనే విషయాన్ని రాయండి.
Free study material for Telugu Upavachakam
Free TS Board Textbook Explanations: Class 9 Telugu Upavachakam Lesson 03 Kaloji (Supplementary Reader)
Chapter Exercise Answers for Class 9 Telugu Upavachakam
Access structured TS Board textbook solutions for Lesson 03 Kaloji (Supplementary Reader). Designed in alignment with the latest academic curriculum for Class 9 Telugu Upavachakam, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Detailed Answer Guides for Lesson 03 Kaloji (Supplementary Reader)
Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Telugu Upavachakam text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Complete Preparation Kit for Class 9 Exams
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Telugu Upavachakam.
FAQs
The complete and updated TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu Upavachakam are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu Upavachakam concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Telugu Upavachakam. You can access TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి in both English and Hindi medium.
Yes, you can download the entire TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి in printable PDF format for offline study on any device.