TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ

Official TS Board Solutions for Class 8 Telugu Upavachakam: Lesson 03 Chindu Yellamma

Explore reliable textbook solutions for Lesson 03 Chindu Yellamma tailored for Class 8 learners. Utilizing these Telugu Upavachakam answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Telugu Upavachakam: Lesson 03 Chindu Yellamma

Navigate directly to the solved Telugu Upavachakam textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: ఎల్లమ్మ విద్యాభ్యాసం గురించి తెల్పండి.

Answer:

ఎల్లమ్మ చిన్నతనంలో ఒక అయ్యగారు చదువు చెప్పేవారు. కాని ఆమె దగ్గర చదువుకోడానికి పలకలుగాని ఆయనకివ్వడానికి పైసలుగాని లేవు. పగిలిన కుండ పెంకులు పెద్దవి ఏరుకొచ్చుకొని వాటిమీద బొగ్గుతో రాసుకొనేవాళ్ళు. అయ్యవారి దగ్గరున్న పెద్దబాలశిక్ష ఒక్కటే పుస్తకం. అదే చదివేవాళ్ళు. అలా ఎల్లమ్మ చదువుకోడానికి ఎంతో కష్టపడ్డది.

Exam Tips:

a) పలకలు, పైసలు లేక కుండ పెంకులపై బొగ్గుతో రాయడం, పెద్దబాలశిక్ష చదవడం అనే వివరాలను వరుసగా రాయండి.

 

Question 2: ఎల్లమ్మకు చిందుభాగోతంలో ప్రవేశం ఎలా జరిగింది ?

Answer:

ఎల్లమ్మ చిన్నతనంలో రెండు మూడు కథలే ఆడేవాళ్ళట. చిన్నప్పటి నుండే భాగోతం నేర్పుతుండే వాళ్ళు. ఆమెకు నాలుగేళ్ళ వయసులో మొహానికి రంగువేసి వేషం కట్టమన్నారు. బాలకృష్ణుని వేషంతో ఆమె రంగ ప్రవేశం చేసింది. తెర వెనుక పాడుతుంటే తెర ముందు ఎగిరిందట. అలా అలవాటై ఎనిమిదేళ్ళప్పుడు బాలకృష్ణుడు, రంభవేషాలు వేసింది. తరువాత రకరకాల ఆడ, మగ పాత్రలు వేసింది.

Exam Tips:

a) నాలుగేళ్ల వయసులో బాలకృష్ణుడి వేషం, ఎనిమిదేళ్లప్పుడు రంభ వేషం అనే వయసులను తప్పక పేర్కొనండి.

 

Question 3: చిందు భాగోతం గురించి రాయండి.

Answer:

చిందు భాగోతం అన్నా యక్షగానమన్నా రెండూ ఒకటే. ఏమీ తేడా లేదు. చిందోళ్ళ ఆట అంటే అగ్ర కులస్థులు రారని చిందు యక్షగానం అని పిలిచేవారు. ఉదయం పదిగంటలకు ఆట మొదలు పెడితే సాయంత్రం దీపాలు పెట్టేదాకా ఆడేవాళ్ళు. యక్షగానం పుస్తకాల్లో చూసి కావలసినవి తీసుకొని నేర్చుకుంటారు. చిరుతల భాగోతులు, దాసరులు, చిందు భాగోతులు తీసుకొనే కథలు ఒకటే అయిన వాటి దరువులను బట్టి వేరుగా ఉంటాయి.

Exam Tips:

a) చిందు భాగోతం, యక్షగానం ఒకటే అని చెప్పి, అగ్రకులస్థుల కారణంగా ‘చిందు యక్షగానం’ అనే పేరు వచ్చిందని రాయండి.

 

Question 4: చిందు భాగోతంలో ఏఏ కథలు ఆడేవారు ? ఎల్లమ్మ పోషించిన పాత్రలేవి ?

Answer:

చిందు భాగోతంలో సారంగధర, చెంచులక్ష్మి, సతీసావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాంధాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీ తులసి, బబృవాహన, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, అల్లీరాణి, గంగా కళ్యాణం, రామదాసు చరిత్ర, సుగ్రీవ విజయం మొదలైన ఇరవైఐదు కథలు ఆడేవాళ్ళు. ఆ కథలన్నింటిలోనూ ఎల్లమ్మ ప్రధాన పాత్రలు పోషించేది. ఆడపాత్రలే కాదు. మగపాత్రలు గూడా ధరించేది.

Exam Tips:

a) ప్రశ్నలో రెండు భాగాలున్నాయి: కథలకు రెండు మూడు ఉదాహరణలు (సారంగధర, సతీసావిత్రి), తర్వాత ఎల్లమ్మ ఆడ, మగ పాత్రలు ధరించిందని రాయండి.

 

Question 5: చిందు భాగవతులు జీవనం ఎలా గడిపేవారు ?

Answer:

పాత రోజుల్లో భాగోత మాడితే ఏమంత ఆదాయం వచ్చేది కాదు. చాలా కష్టపడి బతుకీడ్చేవాళ్ళు. దసరాకు పెట్టెపూజ చేస్తారు. దీపావళి వెళ్ళాక ఊరూరూ తిరగటం మొదలు పెడతారు. సంక్రాంతి, శివరాత్రి దాక భాగోతాలు ఆడుతూనే ఉంటారు. మళ్ళీ వానాకాలం అప్పుడు ఇంటికొస్తారు. కొంతకాలం తెచ్చుకున్నదేదో తింటారు. లేకుంటే అప్పుతెచ్చుకుంటారు. కొంతమంది కూలికి పోతారు.

Exam Tips:

a) సంవత్సర క్రమంలో రాయండి: దసరాకు పెట్టెపూజ, దీపావళి తర్వాత ఊరూరా తిరగడం, సంక్రాంతి–శివరాత్రి వరకు ఆటలు, వానాకాలంలో ఇంటికి.

 

Question 6: చిందు భాగోతానికి గుర్తింపు ఎలా వచ్చింది ?

Answer:

ప్రజలు చిందు భాగోతాన్ని ఆదరించి పోషించారు. కాని ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ఒకసారి నటరాజ రామకృష్ణ ఎల్లమ్మను పిలిచి చిందు పాడమన్నాడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడారు. ఆయన తన శాలువా తీసి ఎల్లమ్మకు కప్పాడు. చిందును గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు. ఎల్లమ్మ బృందాన్ని పరిచయం చేశాడు. అలా చిందు భాగోతానికి గుర్తింపు లభించింది.

Exam Tips:

a) నటరాజ రామకృష్ణ పాత్ర కీలకం: ఆయన శాలువా కప్పడం, ప్రభుత్వానికి పరిచయం చేయడం అనే రెండు అంశాలు రాయండి.

 

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు – పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: ఎల్లమ్మ చిన్నతనంలో చిందు భాగోతాల ప్రదర్శనల ఏర్పాట్లు ఎలా జరిగేవి ?

Answer:

భాగోతంలో ముందుగా అంబకీర్తన పాడి ఆట మొదలు పెడతారు. ముందు రంభ వేషం, వెనుక నుంచి గోపాల కృష్ణుని వేషం వస్తాయి.
“రంభా ఊర్వశులమమ్మా, మాయమ్మ” అని పాడుకుంటూ పిల్లలందర్నీ పరదా ముందు ఆడిస్తారు. అదే అంబ కీర్తన. అంటే ప్రార్థన అన్నమాట. ఇక ఆట మొదలౌతుంది. తెరవెనుక వేషాలు తయారయ్యేదాకా పిల్లలు చిన్నికృష్ణుడి పాట చిందేస్తూ ఉంటారు. పిల్లలకు ఆట నేర్పినట్టూ ఉంటుంది. ప్రజలను కూర్చోబెట్టినట్టూ ఉంటుంది. వేషాల తయారీ పూర్తవుతుంది. ఎక్కడ ఏ కొత్తపాట విన్నా పాడేస్తూ ఉండేది ఎల్లమ్మ. అసలు భాగోతం మొదలు పెట్టగానే ముందు గణపతి ప్రార్థన, తర్వాత సరస్వతీ ప్రార్థన చేసి ఆట మొదలు పెడతారు. ఇలా చుట్టు పక్కల ఊళ్ళల్లో గూడ ప్రదర్శనలిచ్చేవారు.

Exam Tips:

a) అంబకీర్తన (ప్రార్థన) నుంచి గణపతి, సరస్వతీ ప్రార్థనల వరకు ప్రదర్శన క్రమాన్ని పది వాక్యాల్లో వివరించండి.

 

Question 2: ఎల్లమ్మబృందం వారి చిందు భాగోతం ప్రత్యేకతలు తెల్పండి.

Answer:

ఎల్లమ్మ చిన్నప్పుడు మద్దెల తాళాలు గజ్జెలు మాత్రమే వాయిద్యాలుగా ఉండేవి. పూపూ అని ఊదే బుర్ర ఒకటుండేది. దాన్ని పుంగి అంటారు. ఈ పుంగిని ఆట మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఊదాలి. దీని కోసం ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. తెరముందు ఎవరివేషం ఐపోతే వారు వెనక్కొచ్చి ఊదుతుండేవారు. అందరికీ చేతనౌను. ఎండిన సొరకాయను తయారుచేసుకొని ఊదుకొనేవారు. తరువాత తబల, హార్మోనియం, తాళం, గజ్జెలు ఉపయోగించేవారు. అవీ బృందంలో వాళ్ళే వాయిస్తారు. ప్రతివారికి వాయించటం వచ్చు. మరొక ప్రత్యేకత ఏమంటే వాళ్ళ భాగోతానికి తెరవెనుక పల్లవి ఉంటుంది. ‘తైతకథోం తకథోం’ అని ఆ పల్లవి పాడేవాళ్ళు అన్న తరువాతే తెరముందు పాత్ర చిందు మొదలు పెడుతుంది. బుడ్డర్ ఖాన్ వేషం హాస్యపాత్ర. అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. భాగోతానికి అదే నిండుదనం ఇస్తుంది. ఎప్పుడైనా ఏ పాత్రైనా రాకపోతే బృందంలో వాళ్ళే సర్దుకుంటారు. ఇవి ఎల్లమ్మ బృందం చిందు విశేషాలు

Exam Tips:

a) వాయిద్యాలు (పుంగి, మద్దెల, తబల, హార్మోనియం), తెరవెనుక పల్లవి, బుడ్డర్‌ఖాన్ హాస్యపాత్ర అనే విశేషాలను ఒక్కొక్కటి ప్రత్యేక వాక్యంగా రాయండి.

 

పరిచిత గద్యభాగాలు

Question 1: కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
మాఊర్ల అందరికి సిన్నప్పటి నుండి భాగోతం నేర్పుతుండె. పెద్దోళ్లు నాకు నాలుగేండ్లు ఉండంగ నా ముఖంకు రంగు ఏసిండ్రు. బాలకృష్ణుని ఏషం గట్టిచ్చినరు. మావోల్లు పర్ద ఎనుక పాట పాడితే నేను పర్దముంగట ఎగిరిన. ఇగ అప్పటి నుండి మాతల్లి దండ్రులు యేషం ఏయించి నాచేయి పట్టుకపోయి తోలేసి ఎగురుమని అంటుండె. అట్ల నాకు భాగోతం ఆడుడు అలవాటు చేసినరు. నేను ఎనిమిదేండ్లప్పుడు బాలకృష్ణుని యేషం, తర్వాత రంభ యేషం కడుతుంటిని. ప్రశ్నలు :
1. ఎల్లమ్మ ఎంత వయసులో మొదటిసారి భాగోతం ఆడింది ?

Answer:

నాలుగేళ్ళ వయసులో

Exam Tips:

a) పేరా ఆధారిత ప్రశ్నలకు పేరాలోని వాక్యాల నుంచే జవాబు తీసుకోండి; ఇక్కడ మొదటి ప్రశ్న వయసు గురించి: నాలుగేళ్లు.

 

Question 2: ఆ ఊళ్ళో భాగోతం ఎప్పటి నుండి నేర్పేవారు ?

Answer:

చిన్న పిల్లలప్పటి నుండి

Exam Tips:

a) ‘ఎప్పటి నుండి’ అంటే కాలాన్ని సూచించే జవాబు రాయండి: చిన్నతనం నుంచే.

 

Question 3: తల్లిదండ్రులు ఎల్లమ్మను ఏం చెయ్యమన్నారు ?

Answer:

చెయ్యి పట్టుకుని ప్రదర్శనలకు తీసుకెళ్ళి చిందు వెయమన్నారు.

Exam Tips:

a) తల్లిదండ్రులు వేషం వేయించి, చేయి పట్టుకుని తెర ముందు చిందు వేయమన్నారని పూర్తి వాక్యంలో రాయండి.

 

Question 4: ఎల్లమ్మ ఏఏ వేషాలు వేసింది ?

Answer:

బాలకృష్ణుడు, రంభ

Exam Tips:

a) పేరాలో రెండు వేషాల పేర్లు ఉన్నాయి; ఆ క్రమంలోనే రాయండి: బాలకృష్ణుడు, రంభ.

 

Question 5: ‘పర్ద’ అంటే ఏమిటి ?

Answer:

తెర

Exam Tips:

a) ‘పర్ద’ మాండలిక పదం; ప్రామాణిక అర్థం ‘తెర’ అని రాయండి.

 

Question 6: కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.
మాకు అందరి కళారూపాలు నచ్చుతయి. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది. ఆమె కథలు మంచిగ చెపుతది… నాకు మనసౌతది. అది శారదకాల్లది.
ప్రజలు మమ్ముల ఎప్పటినుంచో బతికించుకుంటున్నరు గనీ, సర్కారుమాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణవల్ల పట్టించుకున్నది. ఒకసారాయన చిందు పాడమని అన్నడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడినం. తన షాలువాతీసి నాకు కప్పిండు. చిందును సర్కారుకు గుర్తుజేసిండు ఆయన. మాకు సర్కారును సూపిచ్చిండు. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు. ‘చిందుల ఎల్లవ్వది సాగుతది ఇట్ల’ అంటారు. ఇతర కళాకారులు….దాసుడు (దాచిపెట్టడం) ఏంటికి ఉన్నది చెప్పాల….! ఇగ ఇట్లనే చెప్పుకుంట పోతం…. బతుకంతా…
1. హైదరాబాదుల కథల …………… ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను ………………. వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని …………… భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి …………… లేరు.
5. ఒకసారాయన …………… పాడమని అన్నడు.

Answer:

1. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణ వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు.
5. ఒకసారాయన చిందు పాడమని అన్నడు.

Exam Tips:

a) ఖాళీలు పూరించేటప్పుడు పేరాలోని పదాన్నే యథాతథంగా (మల్లవ్వ, చెంచులక్ష్మి, చిందు) రాయండి; నంబర్లు వేసి వరుసగా రాయండి.

 

Free study material for Telugu Upavachakam

TS Board Solutions for Class 8 Telugu Upavachakam Lesson 03 Chindu Yellamma

Accessing Lesson 03 Chindu Yellamma Solutions

Explore reliable textbook solutions for Lesson 03 Chindu Yellamma tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu Upavachakam.

Concept-Driven Answers for Class 8 Telugu Upavachakam

Clear, methodical explanations accompany every challenging problem within the Class 8 Telugu Upavachakam text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 8 Telugu Upavachakam.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu Upavachakam are as per latest TS Board curriculum.

Are the Telugu Upavachakam TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu Upavachakam concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu Upavachakam. You can access TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ in both English and Hindi medium.

Is it possible to download the Telugu Upavachakam TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana చిందు ఎల్లమ్మ in printable PDF format for offline study on any device.