TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ

Solutions for Class 8 Telugu: Lesson 11 Kapubidda

Access comprehensive textbook solutions for Lesson 11 Kapubidda using the official curriculum guides for Class 8 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 8 Telugu Solutions: Lesson 11 Kapubidda

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

గేయం – ప్రారంభ ప్రశ్నలు

Question 1: తొలివాన కురిసే కాలాన్ని ఏమంటారు?

Answer:

తొలివాన కురిసే కాలాన్ని తొలకరి అంటారు.

Exam Tips:

a) పదానికి అర్థం ఒక్క వాక్యంలో స్పష్టంగా రాయండి: తొలకరి.

 

Question 2: ఈ గేయం ఎవరి గురించి చెపుతుంది?

Answer:

ఈ గేయం రైతును గురించి చెబుతుంది.

Exam Tips:

a) గేయంలోని “హలం”, “పొలం దున్నడం” వంటి మాటల ఆధారంగా జవాబు రాయండి.

 

Question 3: గేయానికి బొమ్మకి మధ్య గల సంబంధం ఏమిటి?

Answer:

“గేయంలో హలమె మన సౌభాగ్య బలమనుచు చాటి పొలము దున్నాలోయి” అని ఉన్నది. బొమ్మలో హలం పట్టుకొని రైతు పొలం దున్నుతున్నాడు. గేయంలోను, బొమ్మలోనూ ఉన్నభావం ఒక్కటే.

Exam Tips:

a) గేయంలోని వాక్యాన్ని ఉటంకించి, అది బొమ్మలో ఎలా కనిపిస్తున్నదో చెప్పండి.

 

Question 4: బంగారు పంటలను పండించే రైతుల గురించి మీకేం తెలుసు?

Answer:

రైతు ఎండ, వాన లెక్క చెయ్యకుండా పగలు, రాత్రి తేడా లేకుండా పొలంలో శ్రమపడతాడు. తన సుఖాన్ని త్యాగం చేసి తన చెమటతో నేలను తడిపి బంగారు పంటలను పండిస్తాడు. ప్రపంచానికి ఆకలి తీరుస్తాడు.

Exam Tips:

a) రైతు శ్రమ, త్యాగం, ప్రపంచానికి ఆహారం ఇవ్వడం అనే మూడు విషయాలు చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి

Question 1: రైతులవలె, ఇతర వృత్తులవారు పడే బాధలను తెల్పండి.

Answer:

కుండలు చేసే కుమ్మరి మన్ను తీసి మెత్తగా తొక్కి మృదువైన ముద్దగా చేసి ఎంతో జాగ్రత్తగా సారె మీద పెట్టి రకరకాల ఆకారాలలో కుండలు చేస్తాడు. అతడు పడే కష్టానికి మనం కుండల కిచ్చే ధర ఏపాటి ? కమ్మరి కొలిమి దగ్గర ఆ వేడిని భరిస్తూ ఇనుము కాల్చి రకరకాల పనిముట్లు తయారు చేస్తాడు. కత్తి, కొడవలి వంటివి వేడి మీదనే సాగకొడతాడు. సాలెవారు పత్తి నుంచి నూలు తీసి మగ్గం మీద రకరకాల కళాకృతులతో వస్త్రాలు నేస్తారు. ఇలాగే ఎంతో మంది. వారెంత కష్టపడినా ఆ శ్రమకు తగిన ఫలితం లభించక పేదరికంతో క్రుంగిపోతున్నారు.

Exam Tips:

a) కుమ్మరి, కమ్మరి, సాలె వంటి ఒక్కో వృత్తి పనినీ, వారి కష్టాన్నీ వేరువేరుగా రాయండి.

 

Question 2: మూడు కాలాల్లో రైతులు చేపట్టే పనులేవి?

Answer:

రైతులు వేసవి కాలం, వానాకాలం, చలికాలం అనే మూడు కాలాల్లోనూ ఎండనక, వాననక పొలాల్లో పనులు చేస్తూనే ఉంటారు. దానికోసం ప్రతిరోజూ పొలం పనులు చేయవలసి ఉంటుంది. దుక్కిదున్నటం, చదును చేయటం, విత్తనాలు చల్లటం, నీరు పెట్టం, కలుపు తీయటం, క్రిమికీటకాల నుండి పంటను రక్షించుకోవటం, కోతలు, నూర్పిళ్ళు, ధాన్యాన్ని బస్తాలకెత్తి గమ్యం చేర్చటం – ఇలా ఏడాది పొడుగునా రైతులకు పనులుంటూనే ఉంటాయి.

Exam Tips:

a) వేసవి, వానాకాలం, చలికాలం అనే మూడు కాలాల పేర్లను జవాబులో పేర్కొనండి.
b) దుక్కి దున్నడం నుండి ధాన్యం చేర్చడం వరకు పనులను క్రమంలో రాయండి.

 

Question 3: పేదరైతు కష్టాలు ఎట్లాంటివి?

Answer:

పేదరైతు తిండికి బట్టకు కరువై ఎంతో భారంగా బ్రతుకు గడుపుతూ ఉంటాడు. పంట పండించడానికి భూస్వాముల దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పుచేసి తీర్చలేక బాధపడుతూ మరింత పేదవాడై పోతాడు. ఎండ, వాన, చలి, పగలు-రాత్రి అనే తేడాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేసి పంట పండించినా గిట్టుబాటు ధర రాదు. దళారులు ఎంతో తక్కువ ధరకు కొనేసి మరింత లాభాలకు అమ్ముకొని ధనవంతులైపోతూ పేదవారిని మరింత పేదవారుగా మారుస్తారు. ఇలా పేదరైతు అనేక కష్టాలు పడుతున్నాడు.

Exam Tips:

a) అప్పులు, గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల దోపిడీ అనే మూడు అంశాలను తప్పక రాయండి.

 

Question 4: సద్వర్తనకు దోహదం చేసే గుణాలు ఏవి?

Answer:

సద్వర్తన అంటే మంచి ప్రవర్తన. సద్వర్తనకు సహాయం చేసే గుణాలు : తెల్లవారు జామున నిద్రలేవాలి. ప్రతినిత్యం స్నానం చేయాలి. ఎవరితోనూ పోట్లాడకూడదు. అతిగా మాట్లాడకూడదు. మితభాషిగా ఉండాలి. ఇతరుల మేలు కోరాలి. ప్రకృతిలోని ఎండ, వాన, చలి వంటి ధర్మాలను ఓర్చుకోగలగాలి. ధనము, పదవులు మొదలైన వాటిపై ఆశపడరాదు. ఇవన్నీ సద్వర్తనకు దోహదం చేసే గుణాలు.

Exam Tips:

a) “సద్వర్తన = మంచి ప్రవర్తన” అని అర్థంతో ప్రారంభించండి.
b) గుణాలను ఒక్కొక్కటిగా (తెల్లవారుజామున లేవడం, మితభాషణ, పోట్లాడకపోవడం, ఆశ లేకపోవడం) చెప్పండి.

 

Question 5: రైతుకు భగవంతుడు ఇంద్రపదవిని ఇస్తున్నాడని ఎట్లా చెప్తారు?

Answer:

ఇంద్రుడు అమృతం తాగుతాడు. స్వర్గం అతని నివాసస్థానం. పట్టువస్త్రాలు, వజ్రాల కవచం ధరిస్తాడు. అతని చుట్టూ సేవకులు ఉంటారు. రైతు తినే జొన్నకూడు పరమాన్నమై, చల్లనీరు అమృత మౌతుంది. నేత వస్త్రాలే జరీ, పట్టు వస్త్రాలై కంబళి వజ్రాల కవచమౌతుంది. అతని చేతిలోని ముల్లుకర్ర వజ్రాయుధమై చుట్టూ వున్న పశువులే సేవకులౌతారు. అందమైన పైరులు నందన వనాలౌతాయి. రైతు పండించిన పంట భూమిలోని నిధులౌతాయి. ఇలా భగవంతుడు రైతు చుట్టూ ఉన్న పరిస్థితులను స్వర్గంతో సమానంగా మార్చి రైతును దేవేంద్రుని చేశాడు అని కవి వర్ణించాడు.

Exam Tips:

a) ఇంద్రుని వైభవానికి సమానంగా రైతు జీవితంలోని వస్తువులను (పరమాన్నం – జొన్నకూడు, వజ్రాయుధం – కర్ర, నందనవనం – పైరు) జతపరచి రాయండి.

 

Question 6: రైతుకు, మునికి గల పోలికలు ఏమిటి?

Answer:

ముని బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారు జామున లేస్తాడు. ఉత్తమమైన, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటాడు. వదరుబోతు కాకుండా మితభాషిగా ఉంటాడు. మోసాలు చేయడం, నాటకాలాడటం, ఆడంబరాలకు పోవడం మునుల విషయంలో జరగదు. ఈ గుణాలు అన్నీ రైతులో కూడా ఉన్నాయి.

Exam Tips:

a) తెల్లవారుజామున లేవడం, ఉత్తమ ఆహారం, మితభాషణ, మోసం చేయకపోవడం అనే పోలికలను వరుసగా రాయండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: “రైతే దేశానికి వెన్నెముక” అంటారు కదా! నేడు రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది? చర్చించండి.

Answer:

శరీరాన్ని నిలబెట్టే ముఖ్య భాగం వెన్నెముక. అలాగే దేశంలోని ప్రజలకు అన్నంపెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రైతు లేనిదే రాజ్యంలేదు… అంటూ ఉంటారు. రాత్రనక పగలనక రైతులు ఆరుగాలాలు కష్టపడి పండిస్తుంటే మనం కాలి మీద కాలేసుక్కూర్చుని ఆనందంగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాం.
ఆనందాన్నిచ్చిన రైతు పరిస్థితి ఏమిటని మనం ఆలోచించటం లేదు.
పేదరైతుకు సామాన్యుడైన వినియోగదారుకు మధ్య ఉన్న దళారులు మేడల మీద మేడలు కడుతూ కోట్లు కూడబెడుతూ ఉంటే రైతుకు గిట్టుబాటు ధరలేక రెండు పూటలా గంజి కూడ లేక పస్తులుంటున్నాడు. పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొంటున్నాడు. ఇదీ ఈనాడు రైతు పరిస్థితి.
ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులకు తగినధర తామే నిర్ణయించుకొనే అవకాశం ఇస్తే వారి బతుకు కొంచెమైనా మెరుగుపడుతుందని నా అభిప్రాయం.

Exam Tips:

a) ముందు “వెన్నెముక” పోలికను వివరించి, ఆ తర్వాత నేటి పరిస్థితిని రాయండి.
b) చర్చలో మీ సొంత అభిప్రాయాన్ని (గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం) ముగింపులో చెప్పండి.

 

Question 2: రైతు యొక్క జీవనవిధానం గురించి, కవికి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడండి.

Answer:

రైతు యొక్క జీవన విధానాన్ని కవి ముని జీవితంతో పోల్చాడు. మునుల వలె రైతు ఎండ, వాన, చలి, లెక్కచేయడు. చీకటి, వెలుగు, పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా పనిచేస్తాడు. మౌనంగా ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. రైతు దినచర్య ముని దినచర్యలాగే ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు.
ఇంద్రభోగాలనైనా లెక్కచేయకుండా తిరస్కరిస్తాడు. ఈ లక్షణాలన్నీ మునుల జీవిత విధానాన్ని పోలి ఉంటాయని కవి అభిప్రాయపడ్డాడు.

Exam Tips:

a) కవి రైతును మునితో పోల్చిన విషయాన్ని మొదటి వాక్యంలోనే చెప్పండి.

 

Question 3: “రైతులు కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు” – అని ఎందుకంటారు?

Answer:

ఎండల తాకిడికి తట్టుకోడానికి ఎత్తుమేడలు లేకపోతే చెట్ల నీడల్లో ఉంటాడు.
ఇల్లంతా వాన చినుకులతో తడిసిపోతే పొదరిళ్ళలో కాలక్షేపం చేస్తాడు. వణికించే చలి నుండి కాపాడుకోడానికి గడ్డివాములలో దూరతాడు. రాత్రి పూట చీకటిలో ఏ పుట్టల మీదో మిట్టల మీదో కాలం గడుపుతాడు. మునుల్లాగా కారడవుల్లో పాములు, తేళ్ళు, పులులు మొదలైన వాటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇలా కష్టాలను కూడా సుఖాలుగానే భావిస్తాడు రైతు.

Exam Tips:

a) ఎండ, వాన, చలి, చీకటి అనే నాలుగు కష్టాలకూ రైతు ఎలా సర్దుకుంటాడో ఒక్కొక్కటిగా రాయండి.

 

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: కింది పద్యాన్ని చదివి భావంలోని ఖాళీలను పూరించండి.
‘కష్టసుఖముల నొకరీతి గడుపువారు
శత్రు మిత్రుల సమముగా సైచువారు
సైరికులు దప్ప నంతటి శాంతులెవరు ?
కాన చేమోడ్చి వారినే గౌరవింతు.
భావం: సైరికులు అనగా ______. వారు శత్రువులను, ______ను సమానంగా ______. వారి శాంత స్వభావం వల్లనే వారిని నేను ______ జోడించి గౌరవిస్తాను.

Answer:

సైరికులు అనగా రైతులు. వారు శత్రువులను, మిత్రులను సమానంగా సహిస్తారు. వారి శాంత స్వభావం వల్లనే వారిని నేను చేతులు జోడించి గౌరవిస్తాను.

Exam Tips:

a) ఖాళీలను పూరించేటప్పుడు పద్యంలోని పదాల అర్థాలను (సైరికులు = రైతులు, సైచు = సహించు) గుర్తుంచుకోండి.

 

Question 2: కింది పద్యాన్ని చదివి దాని కింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.
“ఎండకాలము గుడిసెల నెగరజిమ్మ
తొలకరించిన వర్షము తొట్రుపరుప
ముసురుపెట్టగా రొంపిలో మూల్గుచున్న
కర్షకా! నీదు పల్లెను గాంతురెవరు.”
(అ) ‘రొంపి’కి సరియైన అర్థాన్ని గుర్తించండి.
(ఎ) నీరు (బి) వరద (సి) గాలి (డి) బురద
(ఆ) ‘ఎగురజిమ్ముట’ అనగా
(ఎ) కాలిపోవుట (బి) గాలికి పైకి విసురు (సి) కూలిపోవుట (డి) కిందపడుట
(ఇ) ‘తొలకరించుట’ అంటే నీకు ఏమి తెలుస్తున్నది?
(ఎ) పలకరించుట (బి) పులకరించుట (సి) వర్షాకాలం మొదలు (డి) ఎండాకాలం మొదలు
(ఈ) ‘కాంతురెవరు’ అనడంలోని ఉద్దేశం
(ఎ) ఎవరు చూస్తారు? (బి) ఎవరు పట్టించుకుంటారు? (సి) ఎవరు అంటారు? (డి) ఎవరు వింటారు?

Answer:

(అ) (డి) బురద
(ఆ) (బి) గాలికి పైకి విసురు
(ఇ) (సి) వర్షాకాలం మొదలు
(ఈ) (ఎ) ఎవరు చూస్తారు?

Exam Tips:

a) పద్యంలో ఆ పదం వచ్చిన పంక్తిని మళ్ళీ చదివి సందర్భం ఆధారంగా అర్థాన్ని ఎంచుకోండి.
b) “తొలకరి” అంటే మొదటి వర్షం కురిసే కాలం, అంటే వర్షాకాలం ప్రారంభం.

 

III. స్వీయరచన – ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: “ఇంద్రపదవి కన్నా రైతు జన్మ గొప్పది” ఎందుకు? (లేదా) ఇంద్రుని కంటె రైతు గొప్పవాడని ఎలా చెప్పగలవు?

Answer:

ఇంద్ర పదవిలో ఉన్నవాడు భోగభాగ్యాలు కోరతాడు. స్వర్గసుఖాలు, అప్సరసలు, అమృతపానం లేకుండా ఉండలేడు. నందనవనంలో విహారాలు వారి కెంతో ప్రీతి. ఈ విధంగా విలాసాల్లో మునిగిపోతాడు ఇంద్రుడు. కాని తనరక్షణ తను చేసుకోలేక ఇతరులపై ఆధారపడతాడు. రైతుకు ఆ భోగాలపై ఆశ లేదు. తన చుట్టూ ఉన్నవాటినే స్వర్గ సౌఖ్యాలుగా భావిస్తాడు. తన అవసరానికి మించి ఏమీ కోరడు. తానే అందరి ఆకలి తీరుస్తాడు. అంతేగాక తన రక్షణ తానే చూసుకోగలడు. ఎవరి మీదా ఆధారపడడు. అందుకే ఇంద్రుని కన్న రైతు జన్మ గొప్పది.

Exam Tips:

a) ఇంద్రుడు ఇతరులపై ఆధారపడతాడు, రైతు స్వయం సమృద్ధుడు – ఈ తేడాను స్పష్టంగా చెప్పండి.

 

Question 2: “జై జవాన్! జై కిసాన్!!” అంటారు కదా! రైతుకు, సైనికునికి గల పోలికలు ఏమిటి?

Answer:

జవాను అంటే సైనికుడు. రాత్రింబవళ్ళు ఆరుబయట సరిహద్దుల్లో కాపలా కాస్తాడు. శత్రువులను తన మాతృభూమిలోనికి అడుగుపెట్టనివ్వడు. భూమాతను సదా కాపాడుతాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలనూ ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు. కిసాను అంటే రైతు కూడా రాత్రింబవళ్ళు ఆరుబయట తన పొలాలకు కాపలాకాస్తాడు. ఈతి బాధల నుండి పంటను రక్షించుకుంటాడు. నేల తల్లిని సదా గౌరవిస్తాడు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రకృతి ధర్మాలను ఓర్పుతో భరిస్తాడు. క్రూరమృగాలను కూడా లెక్కచేయడు.

Exam Tips:

a) కాపలా, ఓర్పు, ప్రకృతి ధర్మాలను భరించడం, ధైర్యం అనే సామ్యాలను జవాన్–కిసాన్ ఇద్దరికీ జతపరచి రాయండి.

 

Question 3: రైతులకు గల ఐదు సమస్యలను చెప్పండి.

Answer:

రైతు ఎండ, వాన, చలి, చీకటి అన్నీ భరిస్తూ ఏడాది పొడుగునా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. అతనికి ఉండడానికి సౌకర్యవంతమైన ఇల్లులేదు. ఇంత కష్టపడినా భార్యాబిడ్డలకు తృప్తిగా తిండిపెట్టలేడు. తన ఆకలి దప్పికలు తీరవు. చలి వణికిస్తున్నా చల్లని నేలపై పండుకోవలసిందే. ఎర్రరటి ఎండలో, రాళ్ళల్లో, ముళ్ళలో నడుస్తున్నా కాళ్ళకు చెప్పులుండవు. వడగళ్ళు రాలుతున్నా, పెనుగాలికి దుమ్ము కళ్ళలో పడుతున్నా ఉరుముల్లో మెరుపుల్లో తిరగవలసిందే. ఇవన్నీ రైతుకు గల సమస్యలే.

Exam Tips:

a) సమస్యలను ఐదు వేరువేరు వాక్యాల్లో రాయండి (ఇల్లు లేకపోవడం, తిండి లేకపోవడం, చెప్పులు లేకపోవడం, వడగళ్ళు/గాలి, విశ్రాంతి లేకపోవడం).

 

Question 4: “రైతు ప్రకృతితో మమైకమై ఉంటాడు” దీనిని సమర్థించండి.

Answer:

రైతు అహర్నిశలు ప్రకృతితో మమైకమై ఉంటాడు. వేసవి కాలపు మండు టెండలో కూడా తన పని పూర్తి చేస్తాడు. వానలో నానిపోతూ, చలిలో వణికి పోతూ కూడా నేలను దున్నుతాడు. రాత్రనక, పగలనక రాళ్ళలోను అడవిలోను తడబడకుండా తిరుగుతుంటాడు. నిద్రవస్తే తలకింద చేయి పెట్టుకొని ఏ చింతా లేకుండా గులకరాళ్ళపై నిద్రపోతాడు. ఇలా ప్రకృతిలోని ప్రతిమార్పునూ గమనించుకుంటూ ఉండేవాడు రైతు మాత్రమే అనిపిస్తుంది.

Exam Tips:

a) మూడు కాలాల్లో రైతు ప్రకృతితో ఎలా కలిసిపోయి ఉంటాడో ఉదాహరణలతో చెప్పండి.

 

III. స్వీయరచన – పది వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: “రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది” సమర్థిస్తూ రాయండి.

Answer:

రైతు కష్టం : రైతు ఏడాది పొడుగునా కష్ట పడి పంటలు పండించాలి అంటే అతనికి ఎంతో శక్తికావాలి. ఆ శక్తి కావాలంటే కడుపునిండా తినాలి. కడుపునిండా తింటేనే గదా కష్టపడగలిగేది! అలాగే అతడి భార్యాబిడ్డలు సుఖంగా ఉంటే అతడు సంతోషించగలడు. వాళ్ళు సుఖంగా ఉండాలంటే రైతుపడ్డ కష్టానికి తగినంత ఫలితం చేతికందాలి. మనం రైతును సుఖపడనిస్తున్నామా? లేదే! అతను చేసిన కష్టానికి తగిన వెలకట్టకుండా కష్టాల ఊబిలో ముంచేస్తున్నాం.
మన సుఖం : రైతు శ్రమఫలాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న ఆహారాన్ని తింటూ, రైతును పట్టించుకోవడం లేదు. రైతును చిన్న చూపుచూస్తున్నాం.
పరిస్థితి మారాలి : సమాజంలో ఈ పరిస్థితి మారాలి. రైతుకు తన శ్రమఫలానికి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం కల్పించాలి. దళారులను, స్వార్థ పరులనూ పక్కన పెట్టి వినియోగదారునికీ రైతుకూ సరాసరి సంబంధాన్ని ఏర్పరిస్తే ఇద్దరూ సుఖపడతారు. ఆకాశానికి రెక్కలు కట్టుకొని ఎగిరిన ధరలు నేలకు దిగుతాయి. రైతు కూడా సమాజంలో పదిమందితో బాటు తాను కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.

Exam Tips:

a) రైతు కష్టం – మన సుఖం – రావలసిన మార్పు అనే మూడు భాగాలుగా జవాబును విభజించండి.
b) గిట్టుబాటు ధర, దళారుల తొలగింపు అనే పరిష్కారాలను ముగింపులో రాయండి.

 

Question 2: “కర్షకా! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను” అని కవి అన్నాడు కదా! అలా నమస్కరించదగిన రైతులు చేస్తున్న కృషిని వివరించండి.

Answer:

దేశంలోని ప్రజలకు అన్నం పెట్టి, దేశాన్ని నిలబెట్టేది రైతు. రాత్రినక, పగలనక రైతులు ఎల్లవేళలా, ఆరుకాలాలు కష్టపడి పనిచేసి, పంట పండిస్తుంటే, అతని కష్టఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ రైతు పరిస్థితి ఏమిటని ఆలోచించము. రైతుకి, వినియోగదారుడికి మధ్యనుండే దళారులు లక్షలకొద్దీ ధనం సంపాదిస్తుంటే, రైతులకు గిట్టుబాటు ధరలేక, రెండుపూటలా తీసుకోవడానికి గంజీ కూడా లేక పస్తులుంటాడు.
పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు. ఎండ, వాన, చలి లెక్కచేయడు. నిరంతరం తనువేసిన పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరినీ మోసం చేయడు. కష్టసుఖాలు ఏవి వచ్చినా మునిలాగా ఒకే విధంగా ఉంటాడు. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం ఉండదు. అందుకే కవి కర్షకా ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నాడు.

Exam Tips:

a) రైతు కృషి, సహనం, నిజాయితీ అనే గుణాలను చెప్పి, చివరగా కవి ఎందుకు నమస్కరించాడో రాయండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: పాఠం ఆధారంగా రైతు ఆత్మకథను రాయండి.

Answer:

నేనొక రైతును. ఆరుగాలాలు శ్రమించి పంటలు పండిస్తాను. ప్రపంచానికి ఆకలి తీరుస్తాను.మండు వేసవి ఎండలలో ఆ వేడికి కాలిపోతూ పనిచేస్తాను. వానలో నానుతూ చలికి వణుకుతూ నాగలితో పొలం దున్నుతాను. అడవులలోనైనా రాళ్ళలోనైనా రాత్రిగాని పగలుగాని ఎలా అవసరమైతే అలా వెళుతుంటాను.
అలిసిపోతే గులకరాళ్ళను కూడా పట్టించుకోకుండా తలకింద చేయి పెట్టుకొని పడుకుంటాను.
నాకు శత్రువులు, మిత్రులు, కష్టసుఖాలు అన్నీ సమానమే. కార్చిచ్చును, ముళ్ళను, వడగళ్ళను, పెనుగాలి దుమ్మును, ఉరుములు మెరుపులను అన్నింటినీ భరిస్తాను. మంచు కురుస్తున్నా పచ్చిక మీద పడుకుంటాను. ఒక్కొక్కసారి కటిక చీకట్లో దారితప్పిపోతే ఆకలి దప్పికలకు బాధ పడతాను. ఇన్ని కష్టాలు పడినా నా భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను.
ఎండలకు వానలకు చలికి తట్టుకోడానికి నాకు మంచి ఇల్లు లేదు. చెట్ల నీడల్లోనూ పొదరిళ్ళ బురదలోనూ గడ్డివాములలోనూ తలదాచుకుంటాను. ఒక్కొక్కసారి క్రూరమృగాల మధ్య తిరగవలసి వచ్చినా ధైర్యం కూడగట్టుకొని ఉంటాను. తెల్లవారు జామునే లేచి స్నానం చేయటం, సాత్వికమైన ఆహారం తినటం నా పద్ధతి.
ఎవరితోనూ వాదాలు పెట్టుకోను. మాయమాటలు, మోసాలు, ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకున్నంతలో ఇతరులకు పంచి పెడతాను.
ఈశ్వరుడిచ్చే ఇంద్రపదవిగాని, ప్రకృతి కాంత వలపులుగాని నాకవసరంలేదు. నేను తినే జొన్న సంకటే నాకు పరమాన్నం. నేను కట్టే నూలు బట్టలే చీనాంబరాలు. నా చేతికర్ర నా వజ్రాయుధం. నా కంబళి నాకు వజ్రకవచం. నా పంటపొలాలే నందనవనాలు, నిధి నిక్షేపాలు. నాకున్నంతలో తృప్తిపడతాను. పరుల కోసం పాటుపడతాను. నేను కోరేదొక్కటే. నా శ్రమను గుర్తించండి. తగిన విలువ నివ్వండి.

Exam Tips:

a) ఆత్మకథను “నేను” అనే ప్రథమ పురుషలో రాయండి.
b) పాఠంలోని ఇంద్రపదవి – జొన్నకూడు – కంబళి వంటి పోలికలను చేర్చండి.

 

Question 2: అందరికి అన్నం పెట్టే రైతు కృషిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.

Answer:

అభినందన పత్రం
కృషీవలా!
ఆరుగాలాలు శ్రమించి అమృతం లాంటి పంటలు పండించి ప్రజలకు పంచుతున్నావు. ఒక్కదినమైనా విశ్రాంతి ఎరుగక కృషిచేస్తావు. నీ కృషికి మా కైమోడ్పులు.
అన్నదాతా!
అన్నంలేనిదే ఏప్రాణీ బ్రతకలేదు. అటువంటి ప్రాణాధారమైన అన్నాన్ని ఉత్పత్తి చేసి మనుషులను బ్రతికిస్తున్నావు. గడ్డీగాదంతో పశువులను బ్రతికిస్తున్నావు.
అటువంటి నీకు మా జోతలివే.
హాలికా!
పచ్చని పైరులతో చెట్లతో కాలుష్యాన్ని రూపు మాపి అందరికీ ప్రాణవాయువు నందిస్తున్నావు. ఏ వైద్యుడూ ప్రసాదించలేని ఆరోగ్యాన్ని నీవు ప్రసాదిస్తున్నావు. నీకివే మా కృతజ్ఞతాంజలులు.
అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా ఉన్నంతలో సంతృప్తి పడిపోతూ సత్ప్రవర్తనతో జీవిస్తావు. తగువులు నీ దరి దాపులకు రావు. మితభాషివై అందరి మేలు కోరుతూ అందరి ప్రేమను చూరగొన్నావు. నీ ఆదర్శ జీవనానికి మా అభినందనలందుకో.

Exam Tips:

a) అభినందన పత్రంలో సంబోధన, గుణాల ప్రశంస, కృతజ్ఞత అనే మూడు భాగాలు ఉండాలి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

Answer:

అ) హలం = నాగలి
హలం బలరాముని ఆయుధం.
ఆ) సైరికులు = రైతులు
సైరికులు అహోరాత్రాలు కష్టపడి పంటలు పండిస్తారు.

Exam Tips:

a) పదానికి సరైన అర్థం వచ్చేలా సొంత వాక్యం రాయండి.

 

Question 2: కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
రాత్రి, గరువము, బ్రహ్మ, పసరము, పసువు, చిచ్చు, చందురుడు, పశువు, చంద్రుడు, శుచి, గర్వము, రాతిరి, బొమ్మ

Answer:

ప్రకృతివికృతి
రాత్రిరాతిరి
బ్రహ్మబొమ్మ
శుచిచిచ్చు
గర్వముగరువము
పశువుపసరము, పసువు
చంద్రుడుచందురుడు

Exam Tips:

a) సంస్కృత పదాలు ప్రకృతులు, వాటి తెలుగు రూపాలు వికృతులు; ఒక ప్రకృతికి రెండు వికృతులు ఉండవచ్చు (పశువు – పసరము, పసువు).

 

Question 3: కింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి.
(అ) మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేడు. తాపసికి దీక్ష ఎక్కువ.
(ఆ) వానరులు రాళ్ళు తీసుకొనిరాగా, ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు.
(ఇ) మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి. సాయంకాలం ఆవులమందలు ఇళ్ళకు చేరుతాయి.

Answer:

అ) ముని, తాపసి
ఆ) రాయి, శిల
ఇ) మాపువేళ – సాయంకాలం

Exam Tips:

a) వాక్యాలను జాగ్రత్తగా చదివి ఒకే అర్థం ఇచ్చే రెండు పదాలను జతగా రాయండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.

Answer:

అ) తాపసేంద్ర = తాపస + ఇంద్ర = గుణ సంధి
ఆ) పరమాన్నము = పరమ + అన్నము = సవర్ణదీర్ఘ సంధి
ఇ) కేలెత్తి = కేలు + ఎత్తి = ఉత్వ సంధి
ఈ) గాఢాంధకారము = గాఢ + అంధకారము = సవర్ణదీర్ఘ సంధి
ఉ) కొంపంత = కొంప + అంత = అత్వ సంధి

Exam Tips:

a) మొదటి పదం చివర ఉన్న అచ్చు, రెండో పదం మొదటి అచ్చు చూసి సంధిని గుర్తించండి.
b) అ + ఇ = ఏ అయితే గుణ సంధి; అ + అ = ఆ అయితే సవర్ణదీర్ఘ సంధి.

 

Question 2: కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి. దానిని గురించి వివరించండి.
రైతు మునివలె తెల్లవారు జామునే లేస్తాడు.

Answer:

ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉన్నది. ఒక విషయాన్ని మరొక విషయంతో అందంగా పోల్చి చెప్పటం ఉపమాలంకారం. వర్ణించే విషయం ఉపమేయం. పోలిక చెప్పే విషయం ఉపమానం. పోలిక తెలిపేపదం ఉపమావాచకం. ఉపమాన ఉపమేయాలకు గల పోలిక సమాన ధర్మం. ఇక్కడ రైతును మునితో పోల్చి వర్ణించారు. రైతు-ఉపమేయం. ముని ఉపమానం. వలె ఉపమావాచకం. తెల్లవారు జామున లేవడం సమానధర్మం. కనుక ఇది ఉపమాలంకారం.

Exam Tips:

a) ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం అనే నాలుగు అంగాలనూ వాక్యం నుండి గుర్తించి రాయండి.

 

Question 3: వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా! అన్నట్లు ఉన్నది. – ఇందులోని అలంకారాన్ని గుర్తించి వివరించండి.

Answer:

ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉన్నది. ఉత్ప్రేక్ష అంటే ఊహించటం. పోలికను ఊహించటం ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ చెట్టుకొమ్మను గొడుగువలె ఊహించారు. కనుక ఉత్ప్రేక్షాలంకారం.

Exam Tips:

a) “ఊహించి చెప్పడం” అనే లక్షణం ఉంటే అది ఉత్ప్రేక్షాలంకారం.

 

Question 4: అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు? – ఇందులోని అలంకారాన్ని గుర్తించి వివరించండి.

Answer:

ఈ వాక్యంలో వృత్త్యనుప్రాస అనే శబ్దాలంకారం ఉన్నది. ఒకే హల్లు ఒక వాక్యంలో చాలాసార్లు వస్తే దానిని వృత్త్యనుప్రాస అంటారు. ఈ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం ఆవృత్తమైంది.

Exam Tips:

a) ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమైతే వృత్త్యనుప్రాస; ఇక్కడ ‘క్క’ ఆవృత్తమైంది అని చూపండి.

 

Question 5: ఛందస్సులో గణవిభజన తెలుసుకున్నారు కదా! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం. కింది పాదాలను పరిశీలించి ఉత్పలమాల లక్షణాలు రాయండి.

Answer:

గణంభరనభభరవ
గణ చిహ్నంUIIUIUIIIUIIUIIUIUIU
అక్షరాలులెక్కకురానికోరికలరీతులలోబడిమానవుండిటుల్

(మొదటి పాదం మాత్రమే చూపబడింది; రెండో పాదం కూడా ఇదే గణ క్రమంలో ఉంటుంది.)
పై పాదాల్లో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలున్నాయి.
మొదటి అక్షరానికి లె (ఎ) – రీ (ఈ), యు (ఉ) – చుం (ఉ): 10వ అక్షరానికి యతి చెల్లింది.
పై పాదాలలో ప్రాసగా ‘క్క’ అనే హల్లు వచ్చింది.
పై పాదాల్లో 20 అక్షరాలున్నాయి.
పై పద్య పాదాలు “ఉత్పలమాల” వృత్త పద్యానివి.
నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు.
పద్య పాదంలో మొదటి అక్షరానికి వర్ణమైత్రి కలిగిన అక్షరం (లేదా అదే అక్షరం) అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ‘యతిమైత్రి’ అంటారు.
పద్య పాదాలలో రెండవ అక్షరానికి ‘ప్రాస’ అని పేరు. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాస నియమం” అంటారు.
ఉత్పలమాల లక్షణాలు:
1) ఇది వృత్త పద్యం.
2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
3) ప్రతి పాదంలో వరుసగా భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు వస్తాయి.
4) ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం.
5) ప్రాస నియమం ఉంటుంది.
6) ప్రతి పాదంలోను 20 అక్షరాలుంటాయి.

Exam Tips:

a) ఉత్పలమాల గణ క్రమం “భ-ర-న-భ-భ-ర-వ” మరియు 20 అక్షరాలు; యతి స్థానం 10వ అక్షరం అని గుర్తుంచుకోండి.
b) గణాలను U (గురువు), I (లఘువు) గుర్తులతో రాసి చూపిస్తే మార్కులు పూర్తిగా వస్తాయి.

 

Question 6: కింది పద్య పాదాలను పరిశీలించి చంపకమాల లక్షణాలు రాయండి.

Answer:

గణంనజభజజజర
గణ చిహ్నంIIIIUIUIIIUIIUIIUIUIU
అక్షరాలుఅనినననుగ్రహించితిమహావిహగోత్తమయంచుసంతసం

(మొదటి పాదం మాత్రమే చూపబడింది; రెండో పాదం కూడా ఇదే గణ క్రమంలో ఉంటుంది.)
ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయి. ఇట్లా ప్రతి పాదంలోను ఈ గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం. పై పద్యపాదాల్లో ‘అ’కు ‘త్త’తో, ‘బు’కు ‘పు’తో యతిమైత్రి చెల్లింది. ప్రాసగా ‘ని – న్’ అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి.
చంపకమాల లక్షణాలు:
1) ఇది వృత్త పద్యం.
2) పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
3) ప్రతి పాదంలో వరుసగా న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు వస్తాయి.
4) ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
5) ప్రాస నియమం ఉంటుంది.
6) ప్రతి పాదంలోను 21 అక్షరాలుంటాయి.

Exam Tips:

a) చంపకమాల గణ క్రమం “న-జ-భ-జ-జ-జ-ర”, అక్షరాలు 21, యతి స్థానం 11వ అక్షరం.
b) ఉత్పలమాలకు 20 అక్షరాలు, చంపకమాలకు 21 అక్షరాలు – ఈ తేడాను గుర్తుంచుకోండి.

 

Question 7: కింది పద్యపాదాలకు గణ విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి రాయండి.
అ) తనకు ఫలంబు లేదని యెదం దలపోయడు కీర్తిగోరు నా
ఆ) ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
ఇ) బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
ఈ) హర్తకుఁ గాదుగోచరమహర్నిశమున్ సుఖ పుష్టిసేయుస

Answer:

అ)

గణంనజభజజజర
గణ చిహ్నంIIIIUIUIIIUIIUIIUIUIU
అక్షరాలుతనకుఫలంబులేదనియెదం దలపోయడు కీర్తిగోరు నా

ఇది చంపకమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలు ఉన్నాయి. మొదటి అక్షరమైన ‘త’కు 11వ అక్షరమైన ‘దం’తో యతిమైత్రి. పాదానికి 21 అక్షరాలుంటాయి.
ఆ)
గణంభరనభభరవ
గణ చిహ్నంUIIUIUIIIUIIUIIUIUIU
అక్షరాలుఆకలిదప్పులన్వనటనందినవారికిపట్టెడన్నమో

ఇది ఉత్పలమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘ఆ’కు 10వ అక్షరమైన ‘నం’తో యతిమైత్రి.
ఇ)
గణంనజభజజజర
గణ చిహ్నంIIIIUIUIIIUIIUIIUIUIU
అక్షరాలుబలయుతుడైనవేళనిజబంధుడుతోడ్పడుగానియాతడే

ఇది చంపకమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదానికి న-జ-భ-జ-జ-జ-ర అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘బ’కు 11వ అక్షరమైన ‘బం’తో యతిమైత్రి.
ఈ)
గణంభరనభభరవ
గణ చిహ్నంUIIUIUIIIUIIUIIUIUIU
అక్షరాలుహర్తకుఁగాదుగోచరమహర్నిశమున్ సుఖపుష్టిసేయుస

ఇది ఉత్పలమాల పద్య పాదం. ఇందులో ప్రతి పాదంలోను భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలుంటాయి. మొదటి అక్షరమైన ‘హ’కు 10వ అక్షరమైన ‘హ’తో యతిమైత్రి.

Exam Tips:

a) ముందు పాదాన్ని అక్షరాలుగా విడదీసి, ప్రతి అక్షరానికి U/I గుర్తులు వేసి, మూడేసి అక్షరాల గణాలుగా కలపండి.
b) చివరి గణం రెండు అక్షరాలు (వ గణం) ఉంటే ఉత్పలమాల; ర గణం (UIU) ఉంటే చంపకమాల అని త్వరగా గుర్తించవచ్చు.
c) పాదంలోని అక్షరాల సంఖ్యను లెక్కించండి: 20 అయితే ఉత్పలమాల, 21 అయితే చంపకమాల.

 

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

Question 1: ప్రసార మాధ్యమాల్లో (టి.వి./రేడియో) వచ్చే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చూడండి. వాటి వివరాలను, వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి నివేదిక రాయండి.

Answer:

పరిచయం:
టీవీలో నేను చూసిన వ్యవసాయదారుల కార్యక్రమంలో డా॥ వి. ప్రవీణ్ రావుగారితో శిరీష చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది.
సేకరణ:
డా॥ ప్రవీణ్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రయత్నాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. మన దేశంలో సేంద్రియ వ్యవసాయ స్థితిగతులపై శిరీష అడిగిన ప్రశ్నలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. 25 ని॥ పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో సేంద్రియ వ్యవసాయ విధానం, లాభాలు, శిక్షణ, రైతు విద్య, మార్కెటింగ్, వివిధ వ్యక్తులు, సంస్థల సహకారాలు తదితర విషయాలెన్నో చోటుచేసుకున్నాయి. నాకు అర్థమైన విషయాలను నివేదికలో పొందుపరుస్తున్నాను.
నివేదిక:
ప్రపంచమంతటా వాతావరణ కాలుష్యం అధికమై మానవ జీవనం ప్రమాదంలో పడిపోయిన ఈ తరుణంలో జీవవైవిధ్య రక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, మానవారోగ్యాన్ని కాపాడుకునేందుకు, తక్కువ ఖర్చుతో రైతులకు అన్ని విధాల మేలు చేకూరుస్తూ లాభాలను అందించగల వ్యవసాయ విధానం “సేంద్రియ సేద్యం”. ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు, బెరళ్ళు, పశువుల పేడ, నూనెలు, రసాలు ఉపయోగించి పంటలకు అవసరమైన ఎరువును, క్రిమిసంహాయరక మందులను తయారు చేయడం, విత్తనశుద్ధి, పంటల పెంపకం, కలుపు తీయడం వంటి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక పదార్థాలను నియంత్రించడం సేంద్రియ సేద్యం యొక్క ప్రత్యేకతలు.
ఈ విధానంలో వ్యవసాయం చేయడంలో పశుపోషణ కూడా ఒక భాగం. పశువులను శ్రద్ధగా, పద్ధతి ప్రకారం పోషించడం వల్ల వాటి నుంచి లభించే మలమూత్రాలు సస్యరక్షణకు, పోషణకు ఎంతగానో ఉపకరిస్తాయి. మంచి వాతావరణం, కావలసిన పోషక పదార్థాలు తగినంతగా లభించడం వల్ల పశుపక్ష్యాదులు వృద్ధి పొంది, పంట నష్టాన్ని చాలా వరకు నివారిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. ఉత్పత్తుల్లో నాణ్యత, స్వచ్ఛత కారణంగా మార్కెట్లో అధిక ధరలు పలికి, రైతుకు లాభం చేకూరుస్తాయి. ఈనాడు మార్కెట్లో దొరికే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులూ రసాయనాల బారిన పడి ప్రజారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
సేంద్రియ సేద్యంలో అది పూర్తిగా నివారింపబడటం వల్ల అందరూ వాటిని ఇష్టపడతారు. యాపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లకు కూడా రసాయనాల బాధ తప్పని ఈ కాలంలో ఇటువంటి వ్యవసాయం ఎంతో శ్రేష్ఠమని, భారతదేశంలో పరిస్థితులు, జీవన విధానం ఈ పద్ధతికి బాగా నప్పుతుందని డా॥ వి. ప్రవీణ్ రావుగారు చెప్పడం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్ని రైతులందరూ అనుసరించాలని, ప్రజలు బాగా ఆదరించాలని, ప్రభుత్వం సరైన తోడ్పాటును అందించాలని, వ్యవసాయాధికారులు చక్కగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

Exam Tips:

a) నివేదికలో పరిచయం, సేకరణ, నివేదిక అనే మూడు భాగాలు ఉండాలి.
b) మీరు స్వయంగా చూసిన కార్యక్రమం వివరాలతో రాస్తే మంచిది; ఇది నమూనా మాత్రమే.

 

Free study material for Telugu

Step-by-Step Textbook Answers: Class 8 Telugu Lesson 11 Kapubidda

Official TS Board Solutions for Lesson 11 Kapubidda

Access structured TS Board textbook solutions for Lesson 11 Kapubidda. Designed in alignment with the latest academic curriculum for Class 8 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Lesson 11 Kapubidda

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Next Steps in Your Telugu Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Telugu.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu Lesson 11 కాపుబిడ్డ in printable PDF format for offline study on any device.