TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ

Official TS Board Solutions for Class 7 Telugu: Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao)

Explore reliable textbook solutions for Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao) tailored for Class 7 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Telugu: Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao)

Access the complete solution PDF for Class 7 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

పరిచయ చర్చ

Question 1: పై వాక్యాలు దేని గురించి చెప్తున్నాయి?

Answer:

పై వాక్యాలు దేశం యొక్క గొప్పదనం గూర్చి చెప్తున్నాయి.

Exam Tips:

a) గేయ భావాన్ని ఒక వాక్యంలో చెప్పండి: దేశ గొప్పదనం.
b) ప్రశ్న అడిగిన విషయానికే జవాబు రాయండి; ఎక్కువ వివరణ అవసరం లేదు.

 

Question 2: దేశంపట్ల ఎటువంటి భావనతో ఉండాలి?

Answer:

మనం ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ కాలుపెట్టినా, ఎంత ఉన్నతస్థానానికి వెళ్ళినా మన దేశం పట్ల గౌరవ భావంతో ఉండాలి.

Exam Tips:

a) ‘గౌరవ భావం’ అనే కీలక పదాన్ని తప్పక రాయండి.
b) ఏ దేశం వెళ్ళినా, ఏ స్థానంలో ఉన్నా అనే రెండు సందర్భాలను చెప్పండి.

 

Question 3: జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?

Answer:

మన భారతమాత గొప్పతనాన్ని చాటడమే జాతి గౌరవాన్ని నిలపడం అని నా ఉద్దేశ్యం.

Exam Tips:

a) జాతి గౌరవం అంటే దేశ ఘనతను చాటడం అని స్పష్టంగా రాసి, ఒక ఉదాహరణ (ఉదా: క్రీడల్లో పతకాలు) ఇవ్వవచ్చు.

 

Question 4: ఈ గేయాన్ని ఎవరు రచించి ఉండవచ్చు?

Answer:

శ్రీ రాయప్రోలు సుబ్బారావు.

Exam Tips:

a) గేయ కర్త పేరు ‘రాయప్రోలు సుబ్బారావు’ను అక్షర దోషాలు లేకుండా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.108)

Question 1: కవి భారత భూమిని ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ అనడంలో ఆంతర్యమేమిటి?

Answer:

భారత భూమిలో సంపదలున్నాయి. వజ్రాల గనులు, బంగారం గనులు, ఇవికాక విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఎన్నటికీ తరగని ప్రకృతి సంపద ఉన్నది.
చదువులకు, సాములకు, ఋషులకు, వీరులకు నిలయమైనది భారతభూమి. ఎంతో మంది గొప్ప శాస్త్రజ్ఞులు దేశగౌరవాన్ని కీర్తి శిఖరాలపై నిలిపారు. అందుకే కవి భారతదేశాన్ని శ్రీలుపొంగిన జీవగడ్డ అన్నాడు. శ్రీలు అంటే సంపదలు.

Exam Tips:

a) ‘శ్రీలు’ = సంపదలు, ‘జీవగడ్డ’ = ప్రాణం ఉన్న భూమి అని పదాల అర్థాలను ముందు చెప్పండి.
b) గనులు, ప్రకృతి సంపద, ఋషులు, వీరులు, శాస్త్రజ్ఞులు అనే అంశాలను విడివిడిగా పేర్కొనండి.

 

Question 2: భారతదేశం ఎందుకు పుణ్యభూమిగా కీర్తించబడింది.

Answer:

భారతదేశంలో వ్యాసుడు, వాల్మీకి మొదలుగా గల మహాకవులు, మహర్షులు జన్మించారు. సంస్కృతికి, సంప్రదాయానికి నిలయంగా ఉన్నది ఈ దేశం.
వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాది పవిత్ర గ్రంథాలు ఇక్కడే పుట్టాయి. అందుకే ఈ దేశం పుణ్యభూమిగా కీర్తించబడింది.

Exam Tips:

a) వ్యాసుడు, వాల్మీకి వంటి మహాకవుల పేర్లను, వేదాలు, ఉపనిషత్తులు వంటి గ్రంథాల పేర్లను తప్పక రాయండి.

 

Question 3: చెవులకు విందుచేయడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?

Answer:

మనకు ఇష్టమైనది సమృద్ధిగా దొరకడమే విందు. ఇంపైన భోజనం విందు భోజనం. చూడటానికి అందంగా ఉంటే కనుల విందు అనీ, అలాగే వినడానికి ఇష్టంగా ఉండే మాటలుగాని పాటలుగాని లభించినపుడు చెవులకు విందు అనీ అంటాము.
చెవులకు విందుచేయడం అంటే మధురంగా పాడటం, ప్రియంగా మాట్లాడటం.

Exam Tips:

a) ‘విందు’ అంటే ఇష్టమైనది సమృద్ధిగా లభించడం అని చెప్పి, తర్వాత ‘చెవులకు విందు’కు వివరణ ఇవ్వండి.
b) ‘కనుల విందు’ వంటి సమాన ఉదాహరణ ఇస్తే సమాధానం స్పష్టమవుతుంది.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.109)

Question 1: ఎటువంటి పనులు చేసినవారు ధీరపురుషులుగా కీర్తించబడతారు?

Answer:

దేశము యొక్క గర్వమును నిలబెట్టేట్లు ప్రకాశింపజేసిన వారిని, దేశము యొక్క గొప్ప చరిత్రను ప్రపంచమంతా తెలిసేలా చేసిన వారిని, దేశమునకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారిని ‘ధీరపురుషులు’ అని కీర్తిస్తారు. ధీరులు అంటే వీరులు.

Exam Tips:

a) ధీరులు = వీరులు అని అర్థం చెప్పి, దేశగౌరవం పెంచినవారిని ఉదాహరణలతో రాయండి.

 

Question 2: భారత వైభవాన్ని ఎందుకు పాడుకోవాలి?

Answer:

మనం భారతదేశంలో పుట్టాం. భారతీయులం. ఈ భారతదేశం గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వించాలి. ఆ గొప్పదనాన్ని సంపాదించి పెట్టిన మహనీయులను గుర్తుచేసుకుంటూ భక్తితో భారతదేశ వైభవాన్ని పాడుకోవాలి.

Exam Tips:

a) భారతీయులుగా గర్వించడం, మహనీయులను గుర్తుచేసుకోవడం అనే రెండు కారణాలను చెప్పండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: ఈ గేయం దేన్ని గురించి చెపుతున్నది? ఇందులో దేశభక్తికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి ?

Answer:

ఈ గేయం భారతదేశం గొప్పతనం గూర్చి చెపుతోంది. భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి, వీరులైన రాజులను గూర్చి, ఇక్కడి నదుల గొప్పదనం గురించి గానం చేయాలని చెపుతోంది.
దేశభక్తికి సంబంధించిన విషయాలు:
1. భారతదేశం సిరులు పొంగిన జీవగడ్డ, పాడిపంటలు గల భాగ్యదేశం.
2. దేశ గౌరవం ప్రకాశించేటట్లు, దేశ చరిత్ర విస్తరించేటట్లు, దేశాన్ని కాపాడిన వీర పురుషుల గురించి తెలుసుకోవాలి. అదే దేశభక్తి.

Exam Tips:

a) ప్రశ్నలో రెండు భాగాలున్నాయి (గేయం విషయం; దేశభక్తి అంశాలు) – రెండింటికీ విడివిడిగా జవాబు ఇవ్వండి.

 

Question 2: ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి.

Answer:

కవి రాయప్రోలు సుబ్బారావు మన దేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా, ప్రతివారూ పాడుకొనేందుకు వీలుగా ఈ కింది విషయాలను చెప్పారు.
మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. అలాంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి.
వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది.
ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది.
సూత్రాలను చెప్పిన కాలం నాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి.
కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరిగించగల రాగంతో బిగ్గరగా, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి.
నవరసాలతో నిండిన, తేటతెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశచరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి. పాండవుల కత్తుల పదునుతో తళతళలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగుపదాలతో అందరూ కలసి పాడుకోవాలి.
ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్రానది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటినా చెక్కుచెదరని ధైర్యంగల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.

Exam Tips:

a) సారాంశం అడిగినప్పుడు గేయంలోని పది చరణాల ముఖ్యాంశాలను క్రమంగా (సంపదలు → ఋషులు → బానిసతనం → కవులు → వీరులు) రాయండి.
b) ‘సొంత మాటల్లో’ అని అడిగారు కాబట్టి గేయ పంక్తులను యథాతథంగా కాకుండా వచనంలో రాయండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

Question 1: ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి.

Answer:

భరతఖండము, జీవగడ్డ, భాగ్యసీమ, విమల తలము, భావిభారతము.

Exam Tips:

a) గేయం మొదటి చరణం నుంచి పదాలను వెతికి, గేయంలో ఉన్న రూపంలోనే రాయండి.

 

Question 2: ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
అ. మనదేశం వేదాలకు పుట్టినిల్లు
ఆ. కాకతీయుల యుద్ధ నైపుణ్యం
ఇ. లేత మాటలు చెవులకింపుగ
ఈ. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి.
ఉ. నవరసాలు నాట్యమాడాయి.

Answer:

అ. వేదశాఖలు వెలిసెనిచ్చట.
ఆ. కాకతీయుల కదన పాండితి.
ఇ. చివురు పలుకులు చెవులవిందుగ.
ఈ. ఉపనిషన్మధువొలికె నిచ్చట.
ఉ. నవరసమ్ములు నాట్యమాడగ.

Exam Tips:

a) గేయంలోని పంక్తిని పూర్తిగా, మార్చకుండా రాయండి.
b) భావానికి సరిపోయే పదాలను గుర్తించి (కదన పాండితి = యుద్ధ నైపుణ్యం) సరిపోల్చండి.

 

III. స్వీయరచన

Question 1: భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరపురుషులను గురించి తెలపండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

చరిత్రలో భారతదేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. కాకతీయరాజులు గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తమ పరాక్రమంతో శత్రువులను మట్టుపెట్టి సుస్థిర రాజ్యాన్ని స్థాపించారు. వీరశివాజీ మన దేశాన్ని శత్రువుల బారినుండి కాపాడిన మహావీరుడు.

Exam Tips:

a) కనీసం ముగ్గురు నలుగురి పేర్లు, వారి ప్రత్యేకత ఒక్కొక్క వాక్యంలో రాయండి.

 

Question 2: “బానిసతనం” అంటే ఏమిటి ? (ఐదు వాక్యాల్లో)

Answer:

“బానిసతనం” అనగా ‘దాస్యము’ అని అర్థం. స్వేచ్ఛగా బతకలేకపోవడం, ఇతరుల అధికారానికి లోబడి ఉండడం బానిసతనం. ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి, నెమ్మదిగా మనమీద పెత్తనం చెలాయిస్తూ దేశాన్ని ఆక్రమించి దాదాపు 200 సంవత్సరాలకు పైగా మనలను పాలించారు. ఆ సమయంలో ఆంగ్లేయులు మనలను చిత్రహింసలకు గురిచేశారు. చివరకు మన దేశ ప్రజలు ఉద్యమాలు నడిపి వారిని తరిమికొట్టారు.

Exam Tips:

a) ముందు పదానికి అర్థం (దాస్యం), తర్వాత మన దేశ చరిత్ర నుంచి ఉదాహరణ (ఆంగ్లేయుల పాలన) ఇవ్వండి.

 

Question 3: “భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

1. “భరతఖండంబు” సిరులు పొంగిన, జీవమున్న భూమి.
2. పాడి పంటలతో వర్ధిల్లుతుంది.
3. విస్తారమైన అడవులు సమృద్ధిగా ఉన్నాయి.
4. అనేక నదీజలాలు మన దేశాన్ని సమృద్ధం చేస్తున్నాయి.
అటువంటి భారతదేశాన్ని భాగ్యసీమ అనడంలో సందేహం లేదు.

Exam Tips:

a) కారణాలను నంబర్లతో రాస్తే స్పష్టంగా ఉంటుంది; చివరి వాక్యంలో నిర్ధారణ ఇవ్వండి.

 

Question 4: రాయప్రోలు సుబ్బారావు గారిని మీ మాటల్లో పరిచయం చేయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు.
రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.

Exam Tips:

a) జన్మస్థలం, రచనలు (కావ్యాలు, లక్షణ గ్రంథాలు), కవితా లక్షణాలు అనే మూడు అంశాలు ఉండాలి.
b) రచనల పేర్లను సరిగ్గా రాయండి (తృణకంకణం, స్నేహలత, ఆంధ్రావళి).

 

Question 5: భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి? (పది పంక్తుల్లో)

Answer:

మన భారతదేశం సిరులు పొంగిన, జీవమున్న భూమి. ఇది పాడిపంటలు గల భాగ్యదేశం. వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్ర భూమి ఇది. అయితే ఆ కాలం నాటి గొప్పతనం, చరిత్ర పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. అవన్నీ మరుగున పడిపోయాయి.
మనందరం భారతీయులం. కాబట్టి మనం మన దేశ గొప్పదనాన్ని గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పవిత్రమైన నదులు, పవిత్రమైన అరణ్యాలున్నాయి. “భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం” మనది. మన దేశం మతసామరస్యానికి ఆలవాలం. ఇవన్నీ మన దేశానికి ఉన్న ప్రత్యేకతలు. అప్పుడే మనం ఏ దేశం వెళ్ళినా, మన దేశం యొక్క గొప్పదనాన్ని గూర్చి విదేశీయులకు చక్కగా వివరించగలుగుతాం.

Exam Tips:

a) పది పంక్తుల జవాబులో మొదట దేశ ప్రత్యేకతలు, తర్వాత ‘ఎందుకు తెలుసుకోవాలి’ అనే కారణం ఇవ్వండి.
b) భిన్నత్వంలో ఏకత్వం, మతసామరస్యం వంటి ముఖ్య పదాలను చేర్చండి.

 

Question 6: ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి. (పది పంక్తుల్లో)

Answer:

భారతదేశం సిరిసంపదలకు నిలయం. ఇక్కడ వేదాలు, వేదాంగాలు వెలిశాయి. ఆదికావ్యమైన రామాయణాన్ని వాల్మీకి రాశాడు. వ్యాసుడు మొదలైన గొప్ప ఋషులకు ఇది నివాసం. అందమైన అడవులు, మహావృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఉపనిషత్తులు రాయబడ్డాయి. తత్త్వవేత్తలకు నిలయమైన పుణ్యభూమి భారతదేశం.
సూత్రయుగాల నాటి సంస్కారం, క్షాత్రయుగాల నాటి శౌర్యం ఈ నడుమ వచ్చిన బానిసత్వంతో చెరిగిపోయేవికావు. ఈ భారతదేశం గొప్పతనాన్ని గురించి చిరకాలం పాడుకుందాం.
చెవులకు ఇంపైన పదాలు కూర్చి నవరసభరితంగా కావ్యాలు రాసిన మంచి మనసుగల కవులను గౌరవిద్దాం. దేశమంతా తిరిగి దేశచరిత్రను ప్రపంచవ్యాప్తం చేసి, ధీరులను గురించి తెలుసుకుందాం. ధర్మపరులైన పాండవుల పరాక్రమాన్ని తెలిపే మహాభారత కథను, లోకాన్ని వేడెక్కించిన కాకతీయరాజుల యుద్ధనైపుణ్యాన్ని గానం చేద్దాం. తుంగభద్రాతీరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించి జగద్విఖ్యాతుడైన తెలుగురాజు శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకుందాం.

Exam Tips:

a) వైభవాన్ని సంపదలు, ఋషులు–కవులు, వీరులు అనే మూడు భాగాలుగా విభజించి రాయండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి.

Answer:

నేను భరతమాతను. సిరిసంపదలతో, పాడిపంటలతో తులతూగుతున్నాను. రామాయణ, భారత భాగవతాలను రచించిన వాల్మీకి, వ్యాసులకు తల్లినైనాను. ఔషధాలతో నిండిన అరణ్యాలెన్నో నాలో ఉన్నాయి. బలపరాక్రమాలు కలిగిన రాజులకు జన్మనిచ్చి పోషించాను. వీరాధివీరులైన నా బిడ్డల వలన నా కీర్తి ప్రపంచ వ్యాప్తమైంది. నా బిడ్డలైన కౌరవ పాండవులు ధైర్యసాహసాలతో కురుక్షేత్ర యుద్ధం చేశారు. వారందరినీ భక్తి శ్రద్ధలతో పాడుకోండి. పవిత్రమైన నదులెన్నో నాపై ప్రవహిస్తున్నాయి. వాటిలో మధుర జలాలను తాగడానికి, పంట పొలాలకు ఉపయోగించుకోండి. అందరూ కలిసి నా గొప్పతనాన్ని గానం చేయండి. జన్మ ధన్యం చేసుకోండి అని భరతమాత తన ఆత్మకథను తెలిపింది.

Exam Tips:

a) ‘నేను భరతమాతను’ అని ఉత్తమ పురుషలో (నేను, నా) రాయండి.
b) గేయంలోని అంశాలనే (సంపదలు, ఋషులు, నదులు, వీరులు) క్రమంగా చేర్చండి.

 

Question 2: మన దేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.

Answer:

మా ఊరు మారుమూలపల్లె
మేమంతా జానపద గాయకులం
మా ఊరిలో బడి ఉంది
మా ఊరిలో గుడి ఉంది.
మా ఊరు మారుమూలపల్లె – పంట పొలాలున్నాయ్
మా ఊరి చుట్టుపట్ల మామిడితోటలున్నయ్
మా ఊరికి మైలుదూరాన
మా ఊరు మారుమూలపల్లె
వ్యవసాయం మా జీవనం
పదిమందికి సాయమే మాకు మనోబలం
ఐఏఎస్‌లయిండ్రు మా ఊరి పోరగాండ్రు
ఐపీఎస్‌లయిండ్రు మా ఊరి చెల్లెండ్రు
మా ఊరు మారుమూలపల్లె
మేమంతా జానపద గాయకులం.

Exam Tips:

a) గేయానికి పల్లవి (మా ఊరు …), చరణాలు ఉండేలా రాయండి; ప్రాస పాటించండి.
b) మీ ఊరి నిజమైన ప్రత్యేకతలు (పంటలు, బడి, గుడి, వ్యక్తులు) చేర్చండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
అ. ఋషులు, మునులు విపినాలలో తపస్సు చేస్తూంటారు.
ఆ. మనందరం భూతలం మీద నివసిస్తున్నాము.
ఇ. ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు.
ఈ. తేనెటీగలు మధువును ఇస్తాయి.
ఉ. నేటి బాలలే భావి భారతపౌరులు.
ఊ. సైనికులకు చేవ ఉండాలి.

Answer:

అ. విపినాలు = అడవులు
సొంతవాక్యం: అనేక రకాలైన పక్షులు, జంతువులు అడవులలో ఉంటాయి.
ఆ. తలం = ప్రదేశం, చోటు
సొంతవాక్యం: భారతదేశంలో పుణ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
ఇ. మేళవింపు = కలయిక, జతచేయడం
సొంతవాక్యం: నవరసాల కలయికే మన తెలుగు నాటకాల ప్రత్యేకత.
ఈ. మధువు = తేనె
సొంతవాక్యం: తేనెను పాలల్లో వేసి పిల్లలు ప్రతిరోజూ తాగడం వల్ల బలం వస్తుంది.
ఉ. భావి = భవిష్యత్తు
సొంతవాక్యం: విద్యార్థులు భవిష్యత్తు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి.
ఊ. చేవ = సారము, ధైర్యము
సొంతవాక్యం: యుద్ధమునందు సైనికులకు ధైర్యము ఉండాలి.

Exam Tips:

a) అర్థం చెప్పిన తర్వాత ఆ పదం వాక్యంలో సహజంగా అమరేలా సొంతవాక్యం రాయండి.
b) ‘వాక్యంలో పదాన్ని మార్చి మళ్ళీ చదివి’ అర్థం సరిపోతుందో లేదో పరీక్షించండి.

 

Question 2: కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలను గేయం నుంచి తీసి రాయండి.
అ. అధిక సంపదలు కలిగినవారికంటే గుణవంతులే గొప్ప.
ఆ. మనదేశం చాలా సంవత్సరాలు బ్రిటీషువారి కింద బానిసతనంలో మగ్గిపోయింది.
ఇ. మంచివారిని, గొప్పవారిని గౌరవించాలి.
ఈ. వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది.
ఉ. వ్యాసుడు సంస్కృతంలో భారత, భాగవతాలు రాశాడు.

Answer:

అ. శ్రీలు, భాగ్యములు
ఆ. బానిసతనం, దాస్యం
ఇ. మంచివారు, గొప్పవారు, మహనీయులు
ఈ. వేడి, కాక
ఉ. వ్యాసుడు, బాదరాయణుడు

Exam Tips:

a) సమానార్థక పదాలను వాక్యంలోని పదం (శ్రీలు, దాస్యం) పక్కన గేయంలో ఉన్న రూపంలోనే రాయండి.

 

Question 3: కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.
అ. విపినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
ఆ. ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ గడ్డమీద పుట్టిన ప్రతివారూ పౌరుషవంతులే.
ఇ. గొప్పవారి సేవలు కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి.
ఈ. విశాలమైన మన దేశంలో విస్తారమైన అడవులున్నాయి.

Answer:

అ. విపినాలు, అరణ్యాలు
ఆ. ధరణి, గడ్డ; వీరులు, పౌరుషవంతులు; జన్మించారు, పుట్టిన
ఇ. కలకాలం, ఎల్లప్పుడు
ఈ. విశాలమైన, విస్తారమైన

Exam Tips:

a) ఒకే వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమానార్థక జతలు ఉండవచ్చు; అన్నింటినీ రాయండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది వాక్యాలను చదువండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
ఉదా: ఈ శిల్పం ఎంత అందంగా ఉందో ! – ఆశ్చర్యార్థక వాక్యం
అ) పనిని త్వరగా పూర్తిచేయాలి.
ఆ) చుట్టాలు ఎప్పుడు వస్తారు.
ఇ) ఈ పుస్తకం వెల ఎంత.
ఈ) పాఠం అందరూ చదువుకొని రండి.
ఉ) మీరు నానుండి తెలుసుకోండి.

Answer:

అ) విధ్యర్థక వాక్యం
ఆ) ప్రశ్నార్థక వాక్యం
ఇ) ప్రశ్నార్థక వాక్యం
ఈ) విధ్యర్థక వాక్యం
ఉ) విధ్యర్థక వాక్యం

Exam Tips:

a) వాక్యం చివరి క్రియను చూడండి: -ఆలి (చేయాలి) = విధ్యర్థకం; ఎప్పుడు/ఎంత వంటి ప్రశ్న పదాలు = ప్రశ్నార్థకం.
b) ప్రశ్నార్థక వాక్యం చివర ‘?’ గుర్తు పెట్టడం మరచిపోవద్దు.

 

Question 2: కింది వాక్యాలను చదువండి. అవసరమైనచోట తగిన విరామచిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి.
అ) అట్లా అనుకోకండి
ఆ) నేను చెప్పింది విన్నారో లేదో
ఇ) ఈ సంవత్సరం వర్షాలు పడుతాయో లేదో
ఈ) మీరెప్పుడైనా రావచ్చు
ఉ) అనుమతి లేకుండా లోనికి రావద్దు
ఊ) మీరు భోజనానికి వెళ్ళవచ్చు
ఋ) అబ్బ ఎంత వర్షం కురిసింది
ౠ) మనసు పెట్టి వినండి

Answer:

అ) అట్లా అనుకోకండి. – నిషేధార్థక వాక్యం
ఆ) నేను చెప్పింది విన్నారో ! లేదో ! – సందేహార్థక వాక్యం
ఇ) ఈ సంవత్సరం వర్షాలు పడుతాయో ! లేదో ! – సందేహార్థక వాక్యం
ఈ) మీరెప్పుడైనా రావచ్చు. – అనుమత్యర్థక వాక్యం
ఉ) అనుమతి లేకుండా లోనికి రావద్దు. – నిషేధార్థక వాక్యం
ఊ) మీరు భోజనానికి వెళ్ళవచ్చు. – అనుమత్యర్థక వాక్యం
ఋ) అబ్బ ! ఎంత వర్షం కురిసింది ! – ఆశ్చర్యార్థక వాక్యం
ౠ) మనసు పెట్టి వినండి. – విధ్యర్థక వాక్యం

Exam Tips:

a) గుర్తులు: -వద్దు/-కండి = నిషేధం; -వచ్చు = అనుమతి; ‘…లేదో’ = సందేహం; ‘అబ్బ, ఎంత’ = ఆశ్చర్యం.
b) ప్రతి వాక్యం చివర సరైన విరామ చిహ్నం (. ? !) పెట్టి రాయండి.

 

ప్రాజెక్టు పని

Question 1: భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.

Answer:

1. భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
అసేతుహిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు
త్రివేణిసంగమ పవిత్రభూమి
నాల్గువేదములు పుట్టినభూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
2. ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీజాతి నిండు గౌరవము (రాయప్రోలు సుబ్బారావు)
3. జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి… (దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి)

Exam Tips:

a) సేకరించిన గేయాలకు కవి పేరు తప్పనిసరిగా రాయండి.
b) నమూనా గేయాలు చాలు – స్వంత రచన కాకుండా గేయం ఎవరిదో గుర్తించి రాయడమే ప్రాజెక్టు ఉద్దేశం.

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: భారతదేశాన్ని పుణ్యభూమి అని ఎందుకన్నారు ?

Answer:

వేదాలు, వేదాంగాలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను కన్న భూమి ఇది. అందుకే భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు.

Exam Tips:

a) వేదాలు, రామాయణం, వ్యాసుడు – ఈ మూడు కారణాలను చెప్పండి.

 

Question 2: దేశగౌరవాన్ని పెంచిన భారతీయ వీరుల గురించి చెప్పండి.

Answer:

రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన కాకతీయ వీరుల పరాక్రమం ప్రపంచ ప్రఖ్యాతం. పాండవులు ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల అధర్మాన్ని నాశనం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు తన బలపరాక్రమాలతో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కళలను, కళాకారులను పోషించాడు.
ఆయన తెలుగు భాషకు చేసిన సేవ సాటిలేనిది.

Exam Tips:

a) ప్రతి వీరుడి పేరు, ఆయన ప్రత్యేకతను జతగా రాయండి.

 

Question 3: యుద్ధాలు ఎందుకు చేస్తారు ? యుద్ధాలవల్ల లాభమా ? నష్టమా ? ఎందువల్ల ?

Answer:

1) ఏదైనా ఒక దేశం యొక్క అధికార యంత్రాంగం గాని, సైన్యంగాని బలహీనంగా ఉన్నప్పుడు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి బలంగా ఉన్న దేశాలు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తుంటాయి.
2) యుద్ధాలవల్ల రెండు పక్షాలలోనూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. యుద్ధ సామగ్రికి ఎంతో ధనం ఖర్చవుతుంది. యుద్ధాలవల్ల కలిగిన నష్టాలను పూడ్చుకోడానికి ఎంతో కాలం పడుతుంది.
3) కొన్ని అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తెగబడి యుద్ధాలు చేసి ఆ దేశ నాయకులను, సామాన్య పౌరులను చిత్రహింసలకు గురిచేసి చంపేస్తాయి.
4) కొన్ని దేశాల ప్రజలు యుద్ధాలకు భయపడి బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తారు.
పై విషయాలను గమనిస్తే యుద్ధాలవల్ల నష్టాలే గాని లాభం ఏ మాత్రం ఉండదు అని నా అభిప్రాయం.

Exam Tips:

a) ప్రశ్నలో మూడు భాగాలున్నాయి (ఎందుకు, లాభమా నష్టమా, ఎందువల్ల) – మూడింటికీ జవాబు ఇవ్వండి.
b) చివరి వాక్యంలో మీ నిర్ణయాన్ని (నష్టాలే ఎక్కువ) స్పష్టంగా రాయండి.

 

Question 4: మీకు తెలిసిన కొందరు ప్రాచీన, ఆధునిక తెలుగుకవులను గురించి తెలపండి.

Answer:

తెలుగులో ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతానికి శ్రీకారం చుట్టాడు. తరువాత వచ్చిన తిక్కన, ఎర్రన భారతాన్ని పూర్తిచేశారు. పోతన, శ్రీనాథుడు గొప్ప కవులు, పండితులు. శ్రీకృష్ణదేవరాయలు కవిరాజు. అష్టదిగ్గజ కవులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. వీరంతా ప్రాచీన కవులు.
కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు, చిన్నయసూరి, తిరుపతి వేంకటకవులు, వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ మొదలైన ఆధునిక కవులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది.

Exam Tips:

a) ప్రాచీనులు (నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు), ఆధునికులు (వీరేశలింగం, గురజాడ, శ్రీశ్రీ…) అని రెండు వర్గాలుగా విడగొట్టి రాయండి.

 

Question 5: గేయం ఆధారంగా కవి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.

Answer:

“రాయప్రోలు సుబ్బారావు” గారు రచించిన ఈ గేయం చాలా బాగుంది. దీనిని చదువుతుంటేనే శరీరం గగుర్పాటుకు గురౌతున్నది. కవి హృదయంలో నుండి ఈ గేయం పొంగిపొర్లింది. కవికి గల దేశభక్తి బాగా తెలుస్తున్నది. భారతదేశ ఔన్నత్యాన్ని బాగా అవగాహన చేసుకొని భక్తితో ఈ దేశభక్తి గేయాన్ని కవి రచించారు. రచయిత ఈ గేయాన్ని రచించి ‘మాతృదేశం’ పట్ల తనకు గల గౌరవాన్ని చాటుకొన్నారు.
మన దేశంలో వేదాలు పుట్టాయని, భారత రామాయణాది గ్రంథాలు జన్మించాయని, వ్యాస, వాల్మీకాది కవులు జన్మించిన పుణ్యభూమి అని కవి దేశ గౌరవాన్ని చాటి చెప్పారు. తెలుగు కవులు తేట తెలుగు పదాలతో చెవులకు ఆనందం కలిగించే విధంగా కవిత్వం రాశారని, వాటిద్వారా దేశ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచమంతా వ్యాపించాయని కవి తమ అభిప్రాయాలను చక్కగా వివరించారు.

Exam Tips:

a) కవి దేశభక్తి, తెలుగుదనం అనే రెండు లక్షణాలను గేయంలోని ఉదాహరణలతో చెప్పండి.
b) ‘నా అభిప్రాయం’ అని అడిగినప్పుడు మొదటి వాక్యంలో మీ స్పందన, తర్వాత కారణాలు రాయండి.

 

అదనపు అభ్యాసాలు

Question 1: క్రింది గేయాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
వేద శాఖలు వెలసె నిచ్చట
ఆది కావ్యం అలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !
1. ‘వేదశాఖలు’ అనగా నేమి ?
2. ‘ఆదికావ్యం’ అనగా ఏది ?
3. ‘బాదరాయణుడు’ అంటే ఎవరు ?
4. “పరమ” అనగా ఏమిటి ?
5. ఈ గేయాన్ని ఎవరు రచించారు ?

Answer:

1. వేదశాఖలు అనగా వేదాలు, వేదాంగాలు.
2. ఆదికావ్యం అనగా శ్రీమద్రామాయణము.
3. బాదరాయణుడు అనగా వేదవ్యాసుడు.
4. పరమ అనగా ‘శ్రేష్ఠమైన’ అని అర్థం.
5. ఈ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు రచించాడు.

Exam Tips:

a) గేయంలోని పదాలకు అర్థాలు అడిగినప్పుడు ‘… అనగా …’ అనే రూపంలో రాయండి.

 

Question 2: కింది గేయ భాగాన్ని చదివి ప్రశ్నలు తయారుచేయండి.
“లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా!”

Answer:

1. ఈ గేయం దేన్ని గురించి చెబుతోంది?
2. చీకిపోవడం అంటే ఏమిటి?
3. కాకతీయులెటువంటివారు?
4. ఈ గేయం దేన్ని గురించి పాడమంటోంది?
5. ఎలా పాడమంటోంది?

Exam Tips:

a) గేయంలోని ముఖ్య పదాలను (కాకతీయులు, కదన పాండితి, చీకిపోవని) ఆధారంగా తీసుకొని ప్రశ్నలు రూపొందించండి.

 

Question 3: కింది గేయ భాగాన్ని చదివి ప్రశ్నలు తయారుచేయండి.
“పాండవేయుల పదునుకత్తులు
మండి మెరసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవే చెల్లెలా !”

Answer:

1. పాండవేయులు అంటే ఎవరు?
2. కత్తులు ఎటువంటివి?
3. రణకథ అంటే ఏమిటి?
4. కత్తులు ఎవరివి?
5. రణకథను ఎలా పాడాలి?

Exam Tips:

a) ఎవరు, ఎటువంటి, ఏమిటి, ఎలా అనే ప్రశ్న పదాలతో వేర్వేరు రకాల ప్రశ్నలు రాయండి.

 

Question 4: ఈ గేయభాగంలోని పదాల క్రమాన్ని సరిచేసి రాయండి. భావం రాయండి.
“వృక్ష విపిన బంధుర వాటిక
నిచ్చట వొలికె ఉపనిషన్మధు
విస్తరించిన తత్త్వము విపుల
తలమిదె విమల తమ్ముడా !”

Answer:

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమల తలమిదె తమ్ముడా
భావం: ఓ తమ్ముడా! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గలిగిన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది.

Exam Tips:

a) గేయ పాదాల క్రమం: ప్రతి పాదంలో ఛందస్సు, ప్రాస సరిపోయేలా పదాలను అమర్చండి.
b) భావం రాసేటప్పుడు ‘తమ్ముడా’ అనే సంబోధనను కూడా చేర్చండి.

 

Question 5: ఈ గేయభాగంలోని పదాల క్రమాన్ని సరిచేసి రాయండి. భావం రాయండి.
“నాట్యమాడగ రసమ్ములునవ
పలుకులు విందుగ చివురు చెవుల
కాంత కవితలల్లిన హృదయుల
చెల్లెలా గారవింపవె !”

Answer:

నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన కాంతహృదయుల
గారవింపవె చెల్లెలా!
భావం: ఓ చెల్లెలా! నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.

Exam Tips:

a) ‘నవరసాలు’ అంటే శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం – వీటిని గుర్తుంచుకోండి.

 

Question 6: కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
భారతదేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు. వారిలో గోపాలకృష్ణ గోఖలే ముఖ్యులు. ఈయన గాంధీజీకి రాజకీయ గురువు, ధైర్యశాలి. వందేమాతర గీతం ద్వారా ప్రజలను చైతన్యపరచిన బంకించంద్ర చటర్జీ ధీశాలి. బ్రిటిషువారిని గడగడలాడించిన లాలాలజపతిరాయ్ “పంజాబ్ కేసరి”గా ప్రసిద్ధి చెందారు. బ్రిటిషు వారి దుర్మార్గాలను ఎదిరించిన తాంతియాతోపే గొప్పవీరుడు. 1859 ఏప్రిల్ 18న ఈయనను బ్రిటిషువారు ఉరితీశారు. బ్రిటిషు పాలకులనెదిరించి ప్రజలను చైతన్యపరచిన అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు ఏమాత్రం జంకని వీరనాయకుడు. ‘సైమన్ గోబ్యాక్’ అని నినదించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యశాలిగాక మరెవ్వరు.
1. గోపాలకృష్ణ గోఖలే ఎవరు ?
2. వందేమాతరం గీతం ఎవరు రాశారు ?
3. పంజాబ్ కేసరి అని ఎవరిని అంటారు ?
4. ప్రకాశం పంతులు ఏమని నినాదం చేశారు ?
5. 1859 ఏప్రిల్ 18న బ్రిటిష్‌వారు ఎవరిని ఉరితీశారు ?

Answer:

1. గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు.
2. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రాశారు.
3. లాలాలజపతిరాయ్‌ని ‘పంజాబ్ కేసరి’ అని పిలుస్తారు.
4. ప్రకాశం పంతులు ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నినాదం చేశారు.
5. 1859 ఏప్రిల్ 18న తాంతియాతోపేను బ్రిటిష్‌వారు ఉరితీశారు.

Exam Tips:

a) జవాబులను పేరాలోని వాక్యాల నుంచే తీసుకొని పూర్తి వాక్యంలో రాయండి.
b) తేదీలు, పేర్లు (తాంతియాతోపే, బంకించంద్ర ఛటర్జీ) అక్షరదోషాలు లేకుండా రాయండి.

 

Question 7: కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన సువిశాలమైన దేశం. ఎంతో మంది రాజులు దీనిని పాలించారు. కళలను పోషించి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన దేశం. ఉన్నతులైన వైద్యులను, శాస్త్రవేత్తలను తయారుచేసి ప్రపంచంలో తన గొప్పతనాన్ని చాటుకున్నది.
1. భారతదేశం ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించింది?
2. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిందెవరు ?
3. మన దేశానికి గొప్పదనం ఎవరివల్ల వచ్చింది ?
4. మన దేశం ప్రత్యేకత ఏమిటి ?
5. పై పేరాలోనుంచి ఒక వ్యతిరేక పదాల జంటను రాయండి.

Answer:

1. భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది.
2. మన దేశాన్ని పాలించిన ఎంతోమంది రాజులు.
3. ఉన్నతమైన వైద్యులు, శాస్త్రవేత్తల వలన.
4. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండటం.
5. భిన్నత్వం × ఏకత్వం

Exam Tips:

a) ‘ఎక్కడ నుండి ఎక్కడి వరకు’ వంటి ప్రశ్నలకు రెండు ప్రదేశాల పేర్లూ ఇవ్వండి.

 

Question 8: కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
1. భాగ్యసీమయి
2. కవితలల్లిన
3. రాగమెత్తి

Answer:

1. భాగ్యసీమయి = భాగ్యసీమ + అయి – అత్వ సంధి
2. కవితలల్లిన = కవితలు + అల్లిన – ఉత్వ సంధి
3. రాగమెత్తి = రాగము + ఎత్తి – ఉత్వ సంధి

Exam Tips:

a) మొదటి పదం చివర ‘ఉ’ ఉంటే ఉత్వ సంధి, ‘అ’ ఉంటే అత్వ సంధి అని గుర్తుపెట్టుకోండి.
b) విడదీసినప్పుడు రెండు పదాల మధ్య ‘+’ గుర్తు పెట్టండి.

 

Question 9: సంధి గల పదాన్ని గుర్తించి, విడదీయండి. సంధుల పేర్లు రాయండి.
1. రాలు కరగగ రాగమెత్తి
2. శ్రీలు పొంగిన జీవగడ్డయి
3. దేశాన్ని గురించి కవి ఇట్లనెను

Answer:

1. రాగమెత్తి = రాగము + ఎత్తి – ఉత్వ సంధి
2. జీవగడ్డయి = జీవగడ్డ + అయి – అత్వ సంధి
3. ఇట్లనెను = ఇట్లు + అనెను – ఉత్వ సంధి

Exam Tips:

a) వాక్యంలో రెండు పదాలు కలిసిపోయి ఒకే పదంగా మారిన చోటును వెతకండి.

 

Question 10: కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.
నవరసాల ………… నిండి, తేట తెలుగు మాటల ………… చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవుల ………… గౌరవించాలి.

Answer:

నవరసాలతో నిండిన, తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.

Exam Tips:

a) ‘తో’ = తృతీయా విభక్తి (సహాయం/తోడు), ‘ను’ = ద్వితీయా విభక్తి (కర్మ) అని గుర్తుంచుకోండి.

 

Question 11: కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. జీవగడ్డ
2. భాగ్యసీమ
3. శౌర్యచండిమ
4. చెవుల విందు
5. చీకిపోవని

Answer:

1. భారతదేశము సిరులు పొంగిన జీవగడ్డ.
2. భారతదేశము పాడిపంటలకు భాగ్యసీమ.
3. కాకతీయ రాజుల శౌర్యచండిమ పేరుకెక్కింది.
4. బాలమురళి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
5. ఆంధ్రుల తేజస్సు చీకిపోని చేవగలది.

Exam Tips:

a) ఇచ్చిన పదం వాక్యంలో యథాతథంగా (అదే రూపంలో) ఉండేలా రాయండి.
b) వాక్యం అర్థవంతంగా, పదానికి సరిపోయే సందర్భంలో ఉండాలి.

 

Question 12: కింది పదాలకు వ్యతిరేక పదాలు రాసి వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి.
1. ధీరుడు
2. ఆది
3. పదను

Answer:

1. ధీరుడు × భీరుడు
నా మిత్రుడు భీరుడు కాదు.
2. ఆది × అంతము
ఈ కథ ఆది నుండి అంతము వరకు ఆసక్తికరంగా ఉంది.
3. పదును × మొండి
మొండి మనుషులు ఏమి చెప్పినా అర్థం చేసుకోరు.

Exam Tips:

a) వ్యతిరేక పదం (ధీరుడు × భీరుడు) ఇచ్చి, వెంటనే అదే పదంతో ఒక వాక్యం రాయండి.
b) పాఠంలో ఇచ్చిన వ్యతిరేక పదాల జాబితా (ఆది × అంత, నింగి × నేల) గుర్తుంచుకోండి.

 

Free study material for Telugu

Telugu Class 7 Curriculum Solutions: Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao)

Official TS Board Solutions for Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao)

Access structured TS Board textbook solutions for Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao). Designed in alignment with the latest academic curriculum for Class 7 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao)

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 11 Sreelu Pongina Jeevagadda (Rayaprolu Subbarao) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Telugu Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 7 Telugu.

FAQs

Where can I find the latest TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ for the 2026-27 session?

The complete and updated TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ will help students to get full marks in the theory paper.

Do you offer TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire TS 7th Class Telugu 11th Lesson Questions and Answers Telangana శ్రీలు పొంగిన జీవగడ్డ in printable PDF format for offline study on any device.