TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి

Official TS Board Solutions for Class 6 Telugu Upavachakam: Lesson 03 Elukamma Pelli (Upavachakam 3)

Explore reliable textbook solutions for Lesson 03 Elukamma Pelli (Upavachakam 3) tailored for Class 6 learners. Utilizing these Telugu Upavachakam answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Telugu Upavachakam: Lesson 03 Elukamma Pelli (Upavachakam 3)

Access the complete solution PDF for Class 6 Telugu Upavachakam below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

సారాంశ ప్రశ్నలు

Question 1: ఎలుకమ్మ పెళ్ళి పాఠ్యభాగ సారాంశం రాయండి.

Answer:

పరిచయం : సంతానం లేని బ్రహ్మయ్య తమకు దొరికిన ఎలుక పిల్లను భార్య కోరిక మేరకు తన మంత్రశక్తితో చిన్న పాపగా మార్చి పెంచి పెద్ద చేసి పెళ్ళి చేయడమే ఈ పాఠ్యభాగంలోని ప్రధానాంశం.
మూషిక బాల సహజ లక్షణం : ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టి బ్రహ్మయ్య దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పెరిగి పెద్ద అయిన ఆ పాప ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతుండడం, ప్రతి వస్తువునూ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, రంధ్రాలున్న చోట ఆడుకోవడం, పిల్లి కనిపిస్తే భయపడడం వంటి ఎలుక లక్షణాలతో ప్రవర్తించేది.
మూషిక బాల వినాయక భక్తి : మూషిక బాల ఒకసారి హఠాత్తుగా అమ్మానాన్నలకు చెప్పకుండా శివాలయానికి వెళ్ళి అక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలలో వినాయకుని విగ్రహానికి పూజలు చేసింది. నవరాత్రులు పూర్తయ్యాక కూడా ఆమె పొద్దస్తమానం శివాలయంలోని వినాయక విగ్రహం దగ్గరే ఆనందంగా గడిపేది.
మూషిక బాల చదువు సంధ్యలు : మూషిక బాలను బడిలో చేర్పించినా కూడా గుడికి వెళ్ళటం మాత్రం మానేది కాదు. బాగా అల్లరి చేస్తూ పుస్తకాలన్నీ కొరికేది. ఒకసారి వాళ్ళ టీచరు తోటి బాలలతో విహారయాత్రకు తీసుకెళ్ళినప్పుడు ఒక బాలిక వలలో చిక్కుకుపోతే తన పదునైన పళ్ళతో వలను కొరికి ఆమెను రక్షించింది.
మూషిక బాల పెళ్ళి : బ్రహ్మయ్య తన మంత్రశక్తితో సూర్యుణ్ణి వరుడిగా తెచ్చి పెళ్ళి చేసుకోమని కూతురిని అడిగితే మిరుమిట్లు గొలిపే ఆ వెలుగులను భరించలేనన్నది. నల్లగా ఉన్నాడని మేఘుణ్ణి, నిలకడ లేనివాడని వాయుదేవుణ్ణి, మృదుత్వం లేకుండా బండబారినట్లున్నాడని మేరు పర్వతుణ్ణి ఆమె పెళ్ళాడటానికి ఒప్పుకోలేదు. చివరికి మూషిక రాజును చూసి వలచి వరించింది.

Exam Tips:

a) సారాంశ ప్రశ్నలో ఘటనల క్రమం (ఎలుక పిల్ల – పాపగా మార్పు – పెంపకం – గుడి భక్తి – చదువు – పెళ్ళి) చెడకుండా రాయండి.
b) వరుల పేర్లు, ఆమె చెప్పిన కారణాలు (సూర్యుడు – వెలుగు, మేఘుడు – నలుపు, వాయుదేవుడు – నిలకడ లేదు, మేరు పర్వతుడు – కఠినం) జతగా రాయండి.

 

Question 2: మూషిక బాల స్వభావాన్ని వివరించండి.

Answer:

పరిచయం : తుంగభద్రా నది ఒడ్డున ఉన్న గ్రామంలో నివసిస్తున్న సంతానం లేని బ్రహ్మయ్య దంపతులకు తమ కుటీరం ముందు ఒక ఎలుక పిల్ల కనిపించింది. దానికి సపర్యలు చేసిన బ్రహ్మయ్య భార్య కోరిక మేరకు తన మంత్రశక్తితో ఆ ఎలుకపిల్లను చిన్న పాపగా మార్చి మూషిక బాల అని పేరు పెట్టాడు.
ప్రవర్తన : అల్లారుముద్దుగా పెరిగి పెద్దదైన మూషిక బాల ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండేది కాదు. కనిపించిన వస్తువులన్నింటినీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పు డబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటనే ఆడుకోవడం, పిల్లులు కనిపిస్తే భయంతో ఉరకడం ఆమెకు సహజ లక్షణాలుగా మారిపోయాయి.
వినాయక భక్తి : మూషిక బాల ఒకసారి తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా శివాలయానికి వెళ్ళి అక్కడ నవరాత్రి మండపంలోని వినాయకుని విగ్రహం ముందు పూజారితో పాటు పూజలు చేసింది.
చదువు సంధ్యలు : మార్పు వస్తుందని భావించి బళ్ళో వేసినా ఆమె గుడికి వెళ్ళడం మాత్రం మానలేదు.
వివాహం : మూషిక బాలకు గొప్ప వరుణ్ణి తేవాలని తండ్రి ప్రయత్నించినా ఆమె సూర్యుణ్ణి, మేఘుణ్ణి, వాయుదేవుణ్ణి, మేరు పర్వతుణ్ణి తిరస్కరించి మూషికరాజును పెళ్ళి చేసుకుంది.

Exam Tips:

a) ‘స్వభావం’ ప్రశ్నలో ఎలుక లక్షణాలను (కొరకడం, తిరగడం, పిల్లికి భయపడడం) ఉదాహరణలతో రాయండి.
b) ఆమె వినాయక భక్తిని, చదువుపై శ్రద్ధ లేకపోవడాన్ని కూడా ప్రస్తావిస్తే సమాధానం సమగ్రమవుతుంది.

 

Question 3: ఎలుకమ్మ ఎవరిని ఎందుకు వరించింది ?

Answer:

పరిచయం : మూషిక బాలకు పెళ్ళీడు రాగానే పెళ్ళి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. సూర్యుణ్ణి పెళ్ళికొడుకుగా తీసుకువచ్చాడు తండ్రి. కానీ మూషిక బాల తండ్రి తీసుకువచ్చిన సూర్యుడు, మేఘుడు, వాయుదేవుడు, మేరు పర్వతుడు వంటి గొప్ప వరులను తిరస్కరించి మూషిక రాజును వరించింది.
సూర్యుడు : తండ్రి వరుడిగా తెచ్చిన సూర్యుణ్ణి చూసి “బాగానే ఉన్నాడు కానీ అతని మిరుమిట్లు గొలిపే కాంతిని నేను భరించలేను” అన్నది మూషిక బాల.
మేఘుడు : మేఘుణ్ణి చూసిన మూషిక బాల “వరుడు అందగాడే గాని నల్లగా ఉన్నాడు” అని తిరస్కరించింది.
వాయుదేవుడు : “ఇతడు అందగాడే గానీ ఇతనికి అస్సలు నిలకడ లేదు” అన్నది. “ఈయనకంటే మంచివాడు, గొప్పవాడు లేడా ?” అని తండ్రిని ప్రశ్నించింది.
మేరు పర్వతుడు : మేరు పర్వతుడు మృదుత్వం లేకుండా బండబారినట్లుండడం వల్ల మూషిక బాలకు నచ్చలేదు.
మూషిక రాజు : మూషిక రాజును చూసీ చూడగానే మూషిక బాల సిగ్గుతో తలవంచుకొని వినయంగా నమస్కరించింది. “ఈ అందగాణ్ణి పెండ్లి చేసుకోవడానికి అనుమతించండి” అన్నది.
ముగింపు : అందరికంటే ధనవంతుడూ, యోగ్యుడూ, చక్కని అందగాడూ, చదువుకున్నవాడయిన వరుణ్ణి తేవాలనుకున్నా మూషిక బాల మూషిక రాజును పెళ్ళాడింది కదా ! అని బ్రహ్మయ్య దంపతులు ఆశ్చర్యపోయారు.

Exam Tips:

a) నలుగురు వరులను, వారిని తిరస్కరించిన కారణాలను పట్టికలా (వరుడు – కారణం) వరుసగా రాస్తే స్పష్టంగా ఉంటుంది.
b) చివరికి ఆమె మూషిక రాజునే వరించిందని, అది ఆమె సహజ స్వభావం వల్లేనని ముగించండి.

 

పరిచిత గద్యభాగం – 1

ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వశక్తులున్నాయి. ఒకరోజున బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళ్తుండగా జారి బ్రహ్మయ్య ఇంటిముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, “మనకు పిల్లలు లేరు కదా ! మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి” అన్నది. భార్య మాట కాదనలేక, “సరే, నీ ఇష్టం !” అన్నాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం జపించి కమండలంలోని నీళ్ళను చిట్టెలుకమీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లారుముద్దుగా పెంచసాగింది. వాళ్ళిద్దరూ ఆ పాపకు ‘మూషిక బాల’ అని పేరు పెట్టారు.

Question 1: పై పేరా చదివి సరైన జవాబులు గుర్తించండి.
1. బ్రహ్మయ్య ఇంటి ముందర ఏమి పడింది ? (అ) కాకిపిల్ల (ఆ) కోకిల పిల్ల (ఇ) ఎలుక పిల్ల (ఈ) పక్షి పిల్ల
2. కింది వాటిలో బ్రహ్మయ్యకు లేనిది ఏమిటి ? (అ) ధనం (ఆ) విద్య (ఇ) మంత్రశక్తి (ఈ) తెలివి
3. బ్రహ్మయ్య చిట్టెలుకను ఎట్లా మార్చాడు ? (అ) పెద్ద ఎలుక (ఆ) పక్షిలా (ఇ) చిలుకలా (ఈ) చిన్న పాపలా
4. ఎలుకను ముక్కున కరుచుకొని వెడుతున్నది ఏది ? (అ) చిలుక (ఆ) కాకి (ఇ) పిల్లి (ఈ) గద్ద
5. చిన్న పాపకు పెట్టిన పేరు ఏమిటి ? (అ) హంసరాజు (ఆ) మూషిక బాల (ఇ) వెన్నెల బాల (ఈ) హిమబాల

Answer:

1. (ఇ) ఎలుక పిల్ల
2. (అ) ధనం
3. (ఈ) చిన్న పాపలా
4. (ఆ) కాకి
5. (ఆ) మూషిక బాల

Exam Tips:

a) ‘లేనిది ఏది’ అనే ప్రశ్నలలో పేరాలో ‘లేకపోయినా’ వంటి పదాలను వెతకండి – ఇక్కడ ‘ధనం లేకపోయినా’ అని ఉంది.
b) పేరాలోని కథా క్రమాన్ని (కాకి – ఎలుక పిల్ల – మంత్రం – పాప – పేరు) గుర్తుపెట్టుకుంటే అన్ని ప్రశ్నలు తేలికవుతాయి.

 

పరిచిత గద్యభాగం – 2

“మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనే చూశాను. ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది” అని అసలు సంగతి చెప్పింది ఆ మనిషి. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య శివాలయానికి పోయారు. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చుని, పూజలో అతనికి సాయం చేస్తున్నది. భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నది. తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ తన్మయమై పోతున్నది. తల్లిదండ్రులను చూసి, తననక్కడి నుంచి తోలుకొని పోతారేమోనని భయంతో దేవుడి విగ్రహం వెనుకకు పోయి దాక్కున్నది.

Question 1: పై పేరా చదివి ఖాళీలను పూరించండి.
1. వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటు ………………
2. మూషిక బాల …………… దగ్గరే కూర్చొని ఉన్నది.
3. మూషిక బాల ……………. ను చూస్తూ తన్మయమై పోతున్నది.
4. బాలిక శివాలయంలో ………………. నుంచి ఉన్నది.
5. తల్లిదండ్రులు తనను తీసుకుపోతారేమోనని ……………. వెనుక దాక్కున్నది.

Answer:

1. శివాలయం
2. పూజారి
3. వినాయకుణ్ణి
4. నిన్న ఉదయం
5. దేవుడి విగ్రహం

Exam Tips:

a) కర్మ పదం ఖాళీ ముందు ‘ను’ ఉన్నప్పుడు (3వ ఖాళీ) జవాబు ద్వితీయా విభక్తిలో (వినాయకుణ్ణి) రాయాలి.
b) సమయ సూచక ఖాళీలకు (నిన్న ఉదయం) పేరాలోని మాటలనే వాడండి.

 

పరిచిత గద్యభాగం – 3

మూషికబాల నాలుగో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడిపిల్లలను తీసుకొని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్‌కు పోయారు. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తూ, ఆ అడవిలో వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది. ఎంత మంది ప్రయత్నించినా ఆ వలనుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషిక బాల తన పదునైన పండ్లతో ఆ వల తాళ్ళను క్షణాల్లో కొరికి, గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికీ మూషిక బాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారీ మూషిక బాలదే మొదటి బహుమతి. మెల్లమెల్లగా మూషిక బాలకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నిరాఘాటంగా పూర్తిచేసింది.

Question 1: పై పేరా చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

Answer:

1. సంఘటన జరిగినపుడు మూషికబాల ఏ తరగతిలో ఉంది ? – నాలుగో తరగతిలో.
2. బడి పిల్లలు టీచర్‌తో కలిసి ఎక్కడికి పోయారు ? – అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్‌కు.
3. ప్రమాదంలో చిక్కుకున్న బాలిక పేరు ఏమిటి ? – గీత.
4. గీతను ప్రమాదం నుండి తప్పించింది ఎవరు ? – మూషిక బాల.
5. మూషిక బాలకు దేనిపట్ల ఇష్టం పెరిగింది ? – చదువు పట్ల.

Exam Tips:

a) ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఎవరు, ఎక్కడ, ఏమి, ఎందుకు, ఎలా అనే ప్రశ్న పదాలను మార్చి మార్చి వాడండి.
b) ప్రతి ప్రశ్నకు జవాబు పేరాలోనే ఉండేలా చూసుకోండి; పేరాలో లేని విషయాలపై ప్రశ్నలు అడగకండి.

 

పరిచిత గద్యభాగం – 4

కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దయింది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటయింది. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చికూరగాయలు తినడం, పప్పుడబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటనే ఆటలాడుకోవడం, పిల్లులు కనిపిస్తే భయంతో ఉరకడం మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి.

Question 1: పై పేరా చదివి ఖాళీలను పూరించండి.
1. మూషిక బాల ………………. కనిపిస్తే భయంతో ఉరకడం చేసేది.
2. ఒక చోట ………………. ఉండకుండా తిరగడం అలవాటయింది.
3. ……………….. ఉన్న చోట ఆటలాడుకునేది.
4. కనిపించిన వస్తువులన్నీ …………………. చేసేది.
5. ……………. కోసం వెదికేది.

Answer:

1. పిల్లులు
2. స్థిరంగా
3. రంధ్రాలు
4. కొరకడం
5. చిరుతిండ్ల

Exam Tips:

a) పేరాలోని వాక్యాలను యథాతథంగా గుర్తుపెట్టుకొని ఖాళీల్లో ఆ పదాలనే రాయండి.
b) ఖాళీ తరువాత ఉన్న పదాన్ని బట్టి (కోసం, ఉన్న చోట) సరైన విభక్తి రూపం ఎంచుకోండి.

 

Free study material for Telugu Upavachakam

Free TS Board Textbook Explanations: Class 6 Telugu Upavachakam Lesson 03 Elukamma Pelli (Upavachakam 3)

Textbook Solutions for Class 6 Telugu Upavachakam Lesson 03 Elukamma Pelli (Upavachakam 3)

Access structured TS Board textbook solutions for Lesson 03 Elukamma Pelli (Upavachakam 3). Designed in alignment with the latest academic curriculum for Class 6 Telugu Upavachakam, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 03 Elukamma Pelli (Upavachakam 3) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 03 Elukamma Pelli (Upavachakam 3) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి for the 2026-27 session?

The complete and updated TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu Upavachakam are as per latest TS Board curriculum.

Are the Telugu Upavachakam TS Board solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu Upavachakam concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి will help students to get full marks in the theory paper.

Do you offer TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Telugu Upavachakam. You can access TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి in both English and Hindi medium.

Is it possible to download the Telugu Upavachakam TS Board solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire TS 6th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson Telangana ఎలుకమ్మ పెళ్ళి in printable PDF format for offline study on any device.