TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

Solutions for Class 12 Telugu: Poem 02 Bhagiratha Prayatnam

Review structured textbook solutions for Class 12 Telugu Poem 02 Bhagiratha Prayatnam. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 12 Telugu Solutions: Poem 02 Bhagiratha Prayatnam

View or download the dedicated Poem 02 Bhagiratha Prayatnam solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

Question 1: ‘భగీరథ ప్రయత్నం’ పాఠ్య సారాంశం రాయండి.

Answer:

సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయిన తీరును మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని నిశ్చయించుకున్నాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.
ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకో అంటే భగీరథుడు సంతోషించి, సాగరుల భస్మరాశులపై దేవనదీ నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, తన వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా కోరాడు.
అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. కానీ దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. కావున శివున్ని మెప్పిస్తే దేవనదిని ఆయన భరిస్తాడు అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు. ఆ రాజు తపస్సుకు మెచ్చిన శివుడు దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను.
అని చెప్పగా భగీరథుడు విజయం సాధించానని సంతోషించాడు. శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలని మనస్సులో అనుకున్నాడు.
దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా శబ్దం చేస్తూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉండి పోయింది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది. అని దేవతలు వేడుకొనగా శివుడు పరమ సంతోషంతో ఆ గంగానదిని సముద్రంలోకి వదిలాడు.
శివుని జడలనుండి గంగానది ఏడు పాయలుగా ప్రవహించింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథం ఎక్కి కదిలాడు.
అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందంగా దేవనదీ జలాలలో స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకి మరింత పవిత్రంగా మారిన దేవనదీ జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు అనేకసార్లు ఆనదిలో స్నానం చేశారు.
జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్య చకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వం అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది. ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసే విధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గానికి చేరుకున్నారు.
బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథునితో “భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అప్పటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆ గొప్ప లోకంలో ఉంటావు. గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుందని అన్నాడు.

Exam Tips:

a) సారాంశం క్రమంలో రాయండి: భగీరథుని తపస్సు (గోకర్ణం), బ్రహ్మ వరాలు, శివుని తపస్సు, గంగ గర్వం, శివుని జటాజూటంలో చిక్కుకొనుట, ఏడు పాయలు, జహ్ను మహర్షి, పాతాళంలో సాగరుల ఉద్ధరణ.
b) కథలోని పేర్లు తప్పు లేకుండా రాయండి: భాసురహ్లాదినీ, పావనీ, నందినీ (తూర్పు), సీతా, సుచక్షు, సింధు (పడమర), ఏడవది భగీరథుని వెంట.
c) చివరి వాక్యంలో ‘జాహ్నవి’, ‘భాగీరథి’ పేర్ల వివరణ రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 2: ‘గంగా ప్రవాహం’ ఎలా కొనసాగిందో తెలుపండి.

Answer:

భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను, శివున్ని ప్రసన్నం చేసుకున్నాడు. గంగను తన తలపై భరిస్తానని శివుడు ఇచ్చిన మాట గంగకు కోపం తెప్పించింది. తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని గంగ భావించింది. గంగ గర్వాన్ని తొలగించాలని శివుడు అనుకున్నాడు. ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది.
ఈ విధంగా శివుని తలపై పడి శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. తమరు అనుగ్రహిస్తే ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్ప మేలు కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు గంగానదిని సముద్రంలోకి వదిలాడు.
శివుని జడలనుండి విడువబడిన గంగానది భాసురహ్లాదినీ, పావనీ, నందినీ, సీతా, సుచక్షు, సింధు, అనే ఆరుపాయలు తూర్పు, పడమరలకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి పాతాళానికి కదిలాడు.
అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆనదిలో స్నానం చేశారు.
జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అని అనగానే జహ్నుమహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. గంగ భగీరథుని రథం వెంబడి సముద్రం వైపు వెళ్ళింది.
ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళి, సగరపుత్రుల బూడిదకుప్పలు తడిసేవిధంగా ప్రవహించింది. దానితో సాగరులకు పాపములు పోయి దివ్యరూపాలు వచ్చాయి. వారు దేవతలలాగా విమానాలలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. అప్పటి నుండి గంగానది జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, భగీరథుని కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ఈ భూమిపై ప్రవహిస్తుంది.

Exam Tips:

a) గంగ శివుని తలపై పడటం నుండి సముద్రం చేరడం వరకు ఘట్టాలను వరుసగా రాయండి; శివుని మాయచే గంగ జటాజూటంలో తిరగడం ముఖ్యమైన అంశం.
b) దేవతల ప్రార్థన, జహ్నువు గంగను మింగి చెవుల నుండి వదలడం, భగీరథుని రథం వెంట పాతాళానికి వెళ్ళడం మరువకండి.
c) చివర సాగరులకు స్వర్గప్రాప్తి కలిగిందని చెప్పి ముగించండి.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు

Question 1: పండరీనాథుడి గురించి రాయండి.

Answer:

భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం నాటివాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల నియోగిశాఖకు చెందినవాడు. పండరీనాథరావు తల్లిదండ్రులు వేంకటాబిన్, గోపాలరావు.
శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే ఆయన గ్రంథాన్ని 1810, మే ఏడవ తేదీన శంకర జయంతి రోజు శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. కాని అది అలభ్యం. శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

Exam Tips:

a) కవి పరిచయంలో నాలుగు అంశాలు రాయండి: పేరు (మోతుకూరి పండరీనాథరావు), కాలం (18వ శతాబ్దం), స్వస్థలం (మడికొండ, ఓరుగల్లు దగ్గర), గ్రంథం (శ్రీమత్ పండరీనాథ రామాయణం).
b) 1810 మే 7న శంకర జయంతి రోజున శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడనే తేదీ, ‘రామకథా కల్పలత’ అనే అలభ్య గ్రంథం వివరాలు అదనపు మార్కులు ఇస్తాయి.

 

Question 2: కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది ?

Answer:

సగరునికి సుమతి, కేశిని అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు. భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజునునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు. ఆ మాంసపు ముద్దను ముక్కలు చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు జన్మించారు. వీరు పెరిగి ప్రజలను కష్టపెట్టసాగారు.
వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో పాతాళానికి వెళ్ళారు. అక్కడ తమ యాగాశ్వాన్ని చూశారు. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న కపిలమహర్షిని చూశారు. ఆ మహర్షీ తమ యాగాశ్వాన్ని అక్కడ దాచిపెట్టాడని అతని తపస్సును భగ్నం చేయ ప్రయత్నించారు. అలా కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైపోయారు.

Exam Tips:

a) కారణాన్ని వరుసగా రాయండి: ఇంద్రుడు యాగాశ్వాన్ని కపిలుని ఆశ్రమంలో దాచడం, సాగరులు అక్కడ గుర్రాన్ని చూసి కపిలుడే దొంగ అనుకొని తపస్సును భంగపరచడం.
b) సగరునికి సుమతి, కేశిని అనే ఇద్దరు భార్యలు; సుమతికి అరవై వేలమంది పుత్రులు అనే నేపథ్యం ఒక వాక్యంలో రాయండి.

 

Question 3: గంగకు ‘జాహ్నవి’ అనే పేరు ఎందుకు వచ్చింది ?

Answer:

భగీరథుని తపస్సుకు మెచ్చి శివుడు తన తలపై గంగను నిలిపాడు. దేవతల కోరికపై శివుడు తన జటాజూటం నుండి గంగను విడిచాడు. గంగ ఏడు పాయలుగా ప్రవహించింది. అందులో ఒకటి భగీరథుని వెంట వెళుతూ జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో “ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వాన్ని అణచావు.
ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుండి పుట్టింది కావున జాహ్నవి అనే పేరుతో భూలోకంలో గంగ పిలువబడుతుంది.

Exam Tips:

a) జాహ్నవి అనే పేరు జహ్ను మహర్షి కూతురు కావడం వల్ల వచ్చింది; ఈ కారణాన్ని చివరి వాక్యంలో స్పష్టంగా రాయండి.
b) ఘట్టాన్ని వివరించండి: గంగ యాగశాలను ముంచడం, జహ్నువు గంగను మింగడం, దేవతల ప్రార్థనతో చెవుల నుండి వదలడం.

 

Question 4: గంగ ఏ పేర్లతో పాయలుగా ప్రవహించింది ?

Answer:

శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలనుకున్నాడు.
దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.
దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను.
ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లుగల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది.

Exam Tips:

a) ఏడు పాయలను రెండు వర్గాలుగా రాయండి: తూర్పున భాసురహ్లాదినీ, పావనీ, నందినీ; పడమరన సీతా, సుచక్షు, సింధు; ఏడవది భగీరథుని వెంట.
b) పేర్ల స్పెల్లింగ్‌ను జాగ్రత్తగా రాయండి; పేరు తప్పుగా రాస్తే మార్కులు పోతాయి.

 

III. ఏకపద/ వాక్య సమాధాన ప్రశ్నలు

Question 1: ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మం అయ్యారు ?

Answer:

కపిల మహర్షి

Exam Tips:

a) ఒకే పదంలో ‘కపిల మహర్షి’ అని రాయండి. సాగరులను భస్మం చేసినది ఆయన కోపాగ్ని.

 

Question 2: ‘పండరీనాథ రామాయణం’ ఎవరికి అంకితం ఇచ్చారు ?

Answer:

శ్రీరామచంద్రునికి

Exam Tips:

a) సమాధానం ‘శ్రీరామచంద్రునికి’. పండరీనాథరావు 1810 మే 7న శంకర జయంతి రోజున అంకితమిచ్చాడని గుర్తుంచుకోండి.

 

Question 3: భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు ?

Answer:

గోకర్ణంలో

Exam Tips:

a) సమాధానం ‘గోకర్ణం’. గోకర్ణంలో భగీరథుడు వేయి సంవత్సరాలు తపస్సు చేశాడని పేర్కొంటే సరిపోతుంది.

 

Question 4: గంగను శిరస్సుపై ఎవరు ధరించారు ?

Answer:

శివుడు

Exam Tips:

a) శివుడు గంగను శిరస్సుపై ధరించాడు. ఆయనకు గంగాధరుడు అనే పేరు ఇందుకే వచ్చిందని రాయవచ్చు.

 

Question 5: ‘నాకము’ అనగానేమి ?

Answer:

స్వర్గం

Exam Tips:

a) ‘నాకము’ అంటే స్వర్గం. పర్యాయపదాలు: స్వర్గం, దివి, త్రిదివం. అర్థం అడిగినప్పుడు ఒక్క పదంలో రాయండి.

 

Question 6: ‘భగీరథ ప్రయత్నం’ ఏ కావ్యం లోనిది ?

Answer:

శ్రీమత్ పండరీనాథ రామాయణం

Exam Tips:

a) గ్రంథం పేరు పూర్తిగా రాయండి: ‘శ్రీమత్ పండరీనాథ రామాయణం’ (బాలకాండ, ద్వితీయాశ్వాసం). ‘రామాయణం’ అని మాత్రమే రాస్తే మార్కులు తగ్గవచ్చు.

 

Question 7: భగీరథుడిని ఎవరు ఆశీర్వదించారు ?

Answer:

బ్రహ్మ

Exam Tips:

a) బ్రహ్మ భగీరథుని తపస్సుకు మెచ్చి ఆశీర్వదించి వరాలు ఇచ్చాడు. తరువాత శివుని మెప్పించమని సలహా ఇచ్చాడు.

 

Question 8: సగరుల భస్మం ఏ లోకంలో ఉంది ?

Answer:

పాతాళం

Exam Tips:

a) సగరుల భస్మరాశులు పాతాళంలో ఉన్నాయి. గంగ పాతాళానికి వెళ్ళి వాటిపై ప్రవహించడంతో వారికి స్వర్గం కలిగింది.

 

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

Question 1: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “శంభుమస్తకముపైఁ బడియె గడు నద్భుతంబుగాన్”

Answer:

కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
అర్థం : శంకరుని తలపై అందంగా పడింది.
సందర్భం : శివునిపై కోపంతో శివున్ని పాతాళానికి తొక్కి వేయాలని దేవలోకంలో ప్రవహించే గంగానది హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడిన సందర్భంలోనిది.
వ్యాఖ్య : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. దానికి గంగ శివునిపై కోపం పెంచుకుంది. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడి శివుని జటాజూటంలో చిక్కుకున్నది.

Exam Tips:

a) నాలుగు భాగాలుగా రాయండి: కవి పరిచయం, అర్థం, సందర్భం, వ్యాఖ్య. ఇదే క్రమం పాటిస్తే పూర్తి మార్కులు.
b) సందర్భం: గంగ శివుని తలపై హిమాలయంలా ప్రకాశిస్తున్న చోట పడిన ఘట్టం. ‘అద్భుతంగా పడటం’ అనే అంశాన్ని వ్యాఖ్యలో వివరించండి.

 

Question 2: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “నాకంబునకుద్గమించె భయకృత్ప్రేతత్వ నిర్ముక్తమై”

Answer:

కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
అర్థం : భయంకరమైన ప్రేత స్వభావాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళారు.
సందర్భం : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. అల ఇలపై అడుగిడిన గంగా జలంలో సామాన్యులు స్నానం చేసి పుణ్యలోకాలకు వెళ్తున్న సందర్భంలోనిది.
వ్యాఖ్య : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేశారు. అలా పవిత్రులై తమ భయంకరమైన ప్రేతరూపాలను వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

Exam Tips:

a) సందర్భం: అనేక ప్రదేశాల ప్రజలు గంగాజలంలో స్నానం చేసి ప్రేత స్వభావం వదిలి స్వర్గం చేరారు. ‘భయకృత్ప్రేతత్వ’ పదాన్ని సరిగా రాయండి.
b) కవి పరిచయం వాక్యాలు అన్ని వ్యాఖ్యలకూ ఒకటే; వాటిని సరిగా నేర్చుకుంటే సమయం ఆదా అవుతుంది.

 

Question 3: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “నాటనుండి జహ్నునకు కూఁతురగుట”

Answer:

కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
అర్థం : ఆ రోజు నుండి జహ్ను మహర్షికి కూతురైనది.
సందర్భం : భగీరథుని వెంట వెళ్తున్న గంగ జహ్ను మహర్షి యాగశాలను ముంచి వేస్తే జహ్నువు గంగను మింగాడు. దేవతల ప్రార్థనతో మళ్ళీ చెవుల నుండి వదిలిన సందర్భంలోనిది.
వ్యాఖ్య : జహ్నువు గంగను తాగేయడాన్ని చూసిన దేవతలందరూ ఆశ్చర్యచకితులై “నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింపచేశావు. గంగాదేవి యొక్క గర్వం అణిచివేశావు. ఇకపై ఈ గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది అని అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజు నుండి గంగ జాహ్నవిగా పిలువబడుతున్నది.

Exam Tips:

a) సందర్భం: జహ్నువు గంగను మింగి, దేవతల ప్రార్థనతో చెవుల నుండి విడిచిన తరువాత ‘నీ కూతురుగా గుర్తింపు’ అని దేవతలు చెప్పిన ఘట్టం.
b) వ్యాఖ్యలో అగస్త్యుడు సముద్రం త్రాగిన ఉపమానాన్ని తప్పక చెప్పండి.

 

Question 4: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “నుతింపఁగా సకలదైవతకోటులకైన శక్యమే”

Answer:

కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
అర్థం : కీర్తించడానికి సమస్త దేవ సమూహాలకూ సాధ్యం కాదు
సందర్భం : ఎంతో తపస్సు చేసి, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పాతాళంలో పడిఉన్న తన పితరుల భస్మ రాశులపై గంగను ప్రవహింపజేసిన భగీరథున్ని బ్రహ్మదేవుడు మెచ్చుకుంటున్న సందర్భంలోనిది.
వ్యాఖ్య : బ్రహ్మ భగీరథున్ని కరుణతో చూసి “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు ఈ ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని తరించడం సాధ్యం కాలేదు. దానిని సాధించిన నిన్ను, నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు” అని అన్నాడు.

Exam Tips:

a) ఇది బ్రహ్మ భగీరథుని మెచ్చుకునే సందర్భం. సగరాదులకు సాధ్యం కాని పనిని సాధించిన భగీరథుని తపస్సును దేవతలందరూ కీర్తించలేరు అనే భావాన్ని వివరించండి.
b) ‘పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం సుసాధ్యమవుతుంది’ అనే పాఠ్యాంశ సందేశాన్ని చివర చేర్చండి.

 

V. కంఠస్థం చేయవలసిన పద్యాలు – ప్రతిపదార్థ తాత్పర్యములు

Question 1: ‘గగన ధునీ నిపాతము జగత్ప్రభుఁడైన …’ అనే పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.

Answer:

కవి పరిచయం : ఈ పద్యం మోతుకూరి పండరీనాథరావు గారు రాసిన శ్రీమత్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసము నందు భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశం లోనిది.
పద్యం :
చ||
గగన ధునీ నిపాతము జగత్ప్రభుఁడైన త్రిలోచనుండు సర్వగుఁడు సహింపఁజాలు ననవద్య తపోమహిమన్ బ్రసన్నుఁఁ జే యఁగఁదగు, నాతనిం; గరుణ నాతఁడు మేలని పల్కినన్ సురాపగ తదుదగ్ర మస్తకముపైఁ బడు తత్క్షణమంద భూవరా!
ప్రతిపదార్థం :
భూవరా ! = రాజా
గగన ధునీ = ఆకాశ నది
నిపాతము = పడితే
జగత్ + ప్రభుఁడైన = జగత్తును పాలించే
త్రి లోచనుండు = మూడు కన్నులు కలవాడు
సర్వగుఁడు = సర్వము తెలిసినవాడు
సహింపఁజాలున్ = భరిస్తాడు
అనవద్య = గొప్ప
తపోమహిమన్ = తపో మహిమ చేత
ప్రసన్నున్ + చేయగఁన్ + తగున్ = ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం
ఆతని = శివుని
కరుణన్ = కరుణ చూపడంలో
నాడు మేలని = శివుడే ఉత్తముడు అని
పల్కినన్ = చెప్పగా
సుర + ఆపగ = దేవ నది
తత్ + ఉదగ్ర = అతని గొప్ప
మస్తకముపైఁన్ పడు = తలపై పడును
తత్ + క్షణమందు = ఆ క్షణంలో
తాత్పర్యం : ఓ మహారాజా! ఆకాశగంగ పడితే జగత్తుని పాలించేవాడు, మూడు కన్నులు కలవాడు, సర్వం తెలిసిన వాడు, అయిన శివుడు మాత్రమే భరించగలడు. కావున గొప్ప తపస్సుచే శివున్ని మెప్పిస్తే దేవనది అయిన అతని శిరస్సుపై పడుతుంది.

Exam Tips:

a) ప్రతిపదార్థంలో పదాలను పద్యంలో వచ్చిన క్రమంలోనే రాయండి. సంధి పదాలను విడగొట్టండి (ఉదా: ప్రసన్నున్ + చేయగన్ + తగున్).
b) కవి పరిచయం వాక్యం రాసిన తరువాతే పద్యం, ప్రతిపదార్థం, తాత్పర్యం రాయండి.

 

Question 2: ‘ఆ సమయంబునందు దివిజాపగ వేగము …’ అనే పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.

Answer:

కవి పరిచయం : ఈ పద్యం మోతుకూరి పండరీనాథరావు గారు రాసిన శ్రీమత్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసము నందు భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశం లోనిది.
పద్యం :
ఉ||
ఆ సమయంబునందు దివిజాపగ వేగము దుస్సహంబుగాఁ జేసి మహాఘనధ్వనివిజి న్నిజనిస్వనముల్ జగత్రయ త్రాసకరంబులై మొరయ దారుణలీల హిమాచలాభమై భాసిలు శంభుమస్తకముపైఁ బడియెం గడు నద్భుతంబుగాన్.
ప్రతిపదార్థం :
ఆ సమయంబునందు = ఆ సమయంలో
దివిజ + ఆపగ = దేవలోకంలో ప్రవహించే నది
దుస్సహంబుగా = సహింప రాని
వేగము = వేగంతో
మహాఘనధ్వని = పెద్ద శబ్దం
జేసి = చేసి
విజిన్ + నిజ = గెలవాలనే కోరికతో
నిస్వనముల్ = మ్రోత
జగత్రయ = మూడు లోకాలకు
త్రాసకరంబులై = భయం కలిగించేవిగా
మొరయు = మోగగా
దారుణలీల = భయంకరముగా
హిమాచలాభమై సిలు = హిమాలయ పర్వతము లాగ
భాసిలు = ప్రకాశిస్తున్న
శంభు = శంకరుని
మస్తకము పైఁ = తలపై
కడున్ అద్భుతంబుగాన్ = మిక్కిలి అద్భుతముగా
బడియెన్ = పడింది
తాత్పర్యం : ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగా నది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడింది.

Exam Tips:

a) ఈ పద్యం ముఖ్యమైనది. ‘ఉ’ ఛందస్సు అని రాసి, శివుని తలపై గంగ పడిన దృశ్యాన్ని తాత్పర్యంలో రాయండి: గెలవాలనే కోరిక, పెద్ద శబ్దం, హిమాలయంలా ప్రకాశించే శివుడు.
b) ‘హిమాచలాభమై’ అనే ఉపమానాన్ని ప్రతిపదార్థంలో తప్పక రాయండి.

 

Question 3: ‘నానాదేశ నివాసులైన జను లానందంబు …’ అనే పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి.

Answer:

కవి పరిచయం : ఈ పద్యం మోతుకూరి పండరీనాథరావు గారు రాసిన శ్రీమత్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసము నందు భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశం లోనిది.
పద్యం :
శా||
నానాదేశ నివాసులైన జను లానందంబు సంధిల్ల సు స్నానంబుల్ సురవాహినీ జలములన్ సంతుష్టులై చేయని త్యానూనంబగు వైభవంబునఁ దదీయంబౌ పితృవ్రాతమున్ వే నాకంబున కుద్గమించె భయకృత్ప్రేతత్వ నిర్ముక్తమై.
ప్రతిపదార్థం :
నానాదేశ = అనేక ప్రదేశాలలో
నివాసులైన = నివసించే
జనులు = ప్రజలు
ఆనందంబు = ఆనందం
సంధిల్ల = ఉట్టిపడగా
సురవాహినీ = దేవనది యొక్క
జలములన్ = జలములలో
సంతుష్టులై = సంతోషంతో
సుస్నానంబుల్ = స్నానములు
చేయ = చేయగా
నిత్య + అనూనంబగు = శాశ్వతమైన
వైభవంబునఁన్ = వైభవాన్ని
తదీయంబౌ = దానికి సంబంధించిన
వే = వేలమంది (అసంఖ్యాకము)
పితృవాతమున్ = పితరుల సమూహము
భయకృత్ = భయాన్ని కలిగించే
ప్రేతత్వ = ప్రేత తత్వం నుండి
నిర్ముక్తమై = విడిచిన వారై
నాకంబునకున్ = స్వర్గానికి
ఉద్గమించెన్ = వెళ్ళారు
తాత్పర్యం : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేయగా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

Exam Tips:

a) ఇది ‘శా’ ఛందస్సు పద్యం. ప్రతిపదార్థంలో ‘నాకంబునకున్ = స్వర్గానికి’, ‘ఉద్గమించెన్ = వెళ్ళారు’ వంటి పదాలు సరిగా రాయండి.
b) తాత్పర్యంలో గంగాస్నానం వల్ల పితరులు ప్రేతత్వం నుండి విముక్తులై స్వర్గం చేరారని ముగించండి.

 

Free study material for Telugu

Step-by-Step Textbook Answers: Class 12 Telugu Poem 02 Bhagiratha Prayatnam

Chapter Exercise Answers for Class 12 Telugu

Review comprehensive exercise answers for Class 12 Telugu Poem 02 Bhagiratha Prayatnam. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Poem 02 Bhagiratha Prayatnam

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 12 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Complete Preparation Kit for Class 12 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Telugu.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం in printable PDF format for offline study on any device.