Official TS Board Solutions for Class 12 Telugu: Chapter 06 Creativity
Explore reliable textbook solutions for Chapter 06 Creativity tailored for Class 12 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Chapter-wise Solutions for Telugu: Chapter 06 Creativity
View or download the dedicated Chapter 06 Creativity solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు
Question 1: సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి.
Answer:
సృజనాత్మకత గురించి సృజనశీలత అనే పాఠంలో రచయిత ఎ.పి.జె. అబ్దుల్కలాం తన అభిప్రాయాలను కింది విధంగా వివరించాడు. సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడి నుండైనా, ఏమూల నుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం అవుతుంది. సృజనాత్మకత వివిధ కోణాలు :
సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.
మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలైనా రానివ్వండి. ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియా రూపం పొందని ఆలోచనలు నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది.
సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని బహిర్గతం చేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను రేఖాచిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది.
నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.
Exam Tips:
a) నాలుగు భాగాలుగా రాయండి: సృజనాత్మకత పుట్టే చోటు (హృదయాలు; జాలరి ఓడ, గుడిసె, ల్యాబ్ వంటివి), దాని కోణాలు, ఆలోచన-కార్యరూపం, సృజనాత్మకతను పెంపొందించడం.
b) "ఆలోచించడమే ప్రగతి", "కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది" వంటి పాఠంలోని వాక్యాలను ఉటంకిస్తే మార్కులు పెరుగుతాయి.
c) చివర గొలుసు రూపంలో రాయండి: నేర్చుకోవడం - సృజనాత్మకత - ఆలోచన - జ్ఞానం - ఉన్నత స్థానం.
Question 2: ప్రపంచంలో రాబోయే పరిణామాలను రచయిత ఏవిధంగా ఊహిస్తున్నాడు ?
Answer:
ది ఏజ్ ఆఫ్ ది స్పిరుట్యువల్ మెషిన్స్ అనే పుస్తకాన్ని రాసిన రే కురువైల్ చెప్పిన దాని ప్రకారం 2009 నాటికి 50,000 ఖరీదు చేయగల కంప్యూటరు ఒక్క సెకండులో కోటి లక్షల లెక్కలు చేయగలదు. 2019 నాటికి సెకండుకు 10 లక్షల కోట్ల లక్షల లెక్కలు చేయగలదు. అంటే అప్పటికి దాదాపుగా మానవ మేధకు సమానమైన సామర్థ్యాన్ని సాధించగలదు. 2029 నాటికి అది ఒక వెయ్యి మానవ మేధస్సులకు సమానమైన సామర్థ్యాన్ని పొందుతుంది.
అంటే భవిష్యత్తులో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్లతో నడిచే రోబోట్స్కి అప్పజెప్పి తమ మెదడుల్ని మరింత ప్రయోజనకరమైన పనులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్లు తమ భావనా సామర్థ్యంతో ప్రయోగశీల ఆలోచనతో తిరిగి మళ్లీ కంప్యూటర్లను ఓడించగలిగే స్థాయికి చేరుకుంటారు.
ఈ శతాబ్దం చివరికి మానవ ఆలోచనలను, యంత్రాల తెలివితేటలను విలీనం చేసే ధోరణి బలంగా పెరుగుతుంది. అప్పుడు మానవుడు ఒకప్పుడు రూపొందించిన యంత్రాలకూ, మానవ మేధాశక్తికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో యంత్రాల బారినుండి మానవుడి ప్రత్యేకతను మనం ఏవిధంగా నిలబెట్టుకోగలుగుతామో తెలియదు. నిస్సందేహంగా కంప్యూటర్లు ఒక సవాలుగా మారుతున్నాయి.
ఈ సమస్య కేవలం జీవశాస్త్రవేత్తలదీ, జీవసాంకేతికవేత్తలదీ మాత్రమేకాదు. మొత్తం శాస్త్రవేత్తలు అందరు మనుష్యులు రూపొందించిన కంప్యూటర్లకన్నా మానవ జాతిని ఒక మెట్టు పైనే ఉంచవలసిన గొప్ప బాధ్యత తలకెత్తుకోవలసి ఉంది.
అదృష్టవశాత్తూ మానవ మేధ సృజనాత్మకత, ప్రయోగశీల పార్శ్వాలు ఎంత గొప్పవంటే అవి మనిషిని ఎన్నటికి యంత్రం ముందు ఓడిపోనివ్వవు.
మానవజాతిలో సహజసిద్ధమైన, అంతర్గతమైన మహాశక్తిని పరిపూర్ణంగా ఆవిష్కరించే దిశగా హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్వేర్ను మనమింకా అభివృద్ధి చేయవలసి ఉంది. అని ప్రపంచంలో రాబోయే పరిణామాలను కలాం ఊహించాడు.
Exam Tips:
a) రే కురువైల్ (ది ఏజ్ ఆఫ్ ది స్పిరిట్యువల్ మెషిన్స్) చెప్పిన 2009 నాటి 50,000 ఖరీదు కంప్యూటర్ అంచనాతో ప్రారంభించండి.
b) చివరి వాక్యంలో హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్‌వేర్‌ను మనం ఇంకా అభివృద్ధి చేయాలనే కలాం ఊహను రాయండి; మనిషి మేధ యంత్రం ముందు ఓడిపోడనే అంశం కీలకం.
II. సంగ్రహరూప ప్రశ్నలు
Question 1: సృజనాత్మకతకు ఉన్న పార్శ్వాలను వివరించండి.
Answer:
సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి.
అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.
Exam Tips:
a) మూడు విధాలుగా రాయండి: నూతన ఆవిష్కరణలు, కొత్త ప్రయోగాలు, ఉన్నవాటినే కొత్తగా తెలుసుకోవడం; తర్వాత జతపరచడం, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కునే సామర్థ్యం.
b) "సృజనాత్మకత ఒక వైఖరి", "అందరూ చూసినదాన్నే భిన్నంగా ఆలోచించడం ముఖ్యలక్షణం" అనే వాక్యాలు తప్పక రాయండి.
Question 2: ‘సృజనాత్మకత’ ఎలా పెంపొందుతుంది ?
Answer:
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం అవసరం. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్త విషయాలపట్ల ఆసక్తి, ఉత్సాహం ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లోని భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది.
జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.
Exam Tips:
a) వరుస క్రమం రాయండి: ప్రతి హృదయం సృజనాత్మకం - పిల్లల ప్రశ్నలకు జవాబులు - భావాలు చిత్రాలు, కథలు, కవితలుగా మారడం - నేర్చుకోవడం - ఆలోచన - జ్ఞానం.
b) పిల్లల ప్రశ్నలకు జవాబు చెప్పడం ముఖ్యమైన మార్గమని ప్రత్యేకంగా రాయండి.
Question 3: బలమైన సంకల్పంతో చేసే కృషి ఎలాంటి ఫలితమిస్తుంది ?
Answer:
ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగరాలనే కోరిక, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి.
ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు (ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన నమ్మకాలకు) నిస్సందేహంగా ఎదురీదగలమని కలాం ప్రబోధించాడు.
Exam Tips:
a) తుమ్మెద ఉదాహరణ ఇవ్వండి: ఏరోడైనమిక్ సూత్రాల ప్రకారం ఎగరడం అసాధ్యమైనా, ఎగరాలనే సంకల్పంతో రెక్కలు ఆడిస్తూ ఎగురుతుంది.
b) చివరి వాక్యం: బలమైన సంకల్పంతో పాతుకుపోయిన నమ్మకాలను కూడా ఎదురీదగలమని కలాం చెప్పాడు.
Question 4: ఆర్ద్రకృష్ణ ఊహించిందేమిటి ?
Answer:
పదమూడేళ్ల ఆర్ద్రకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహారించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది.
అప్పుడు అంగారక గ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమ మీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణు శర పరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురునిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. ‘ఆర్ద్రకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.
Exam Tips:
a) ఊహ క్రమం: క్రీ.శ. 3000 - అంగారక గ్రహానికి వలస - బృహస్పతి నుంచి ఏస్టరాయడ్ ముప్పు - అణు శరాలతో దానిని ఛేదించడం - అంగారక నాగరికత జీవించడం.
b) వయసు (13 ఏళ్లు) తప్పక రాయండి; కలాం "శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా ఉంది" అని మెచ్చుకున్న విషయం చివర చేర్చండి.
III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు
Question 1: భారతదేశపు ‘మిస్సైల్ మ్యాన్’ అని ఎవరికి పేరు ?
Answer:
ఎ.పి.జె. అబ్దుల్ కలాంకు.
Exam Tips:
a) ఒకే వాక్యం చాలు: ఎ.పి.జె. అబ్దుల్ కలాంకు. అదనపు వివరాలు (DRDO, రాష్ట్రపతి పదవి) ప్రశ్నకు అవసరం లేదు.
Question 2: ఎ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏమిటి ?
Answer:
అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం.
Exam Tips:
a) పూర్తి పేరు ఇలా రాయండి: అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం (పాఠ్యపుస్తకంలోని స్పెల్లింగ్‌నే ఉపయోగించండి).
Question 3: ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత ఎవరు ?
Answer:
ఎ.పి.జె. అబ్దుల్ కలాం.
Exam Tips:
a) వింగ్స్ ఆఫ్ ఫైర్ కలాం ఆత్మకథ అని గుర్తుంచుకోండి; జవాబు ఒక్క వాక్యంలో రాయండి.
Question 4: ‘సృజనాత్మకత’ ఎక్కడి నుండి ప్రభవిస్తుంది ?
Answer:
సుందర హృదయాల నుండి.
Exam Tips:
a) జవాబు: సుందర (నిష్కల్మష) హృదయాల నుండి. "సుందర హృదయాలే సృజనాత్మకతా నిలయాలు" అని పాఠ్యంలోని పదాలను వాడండి.
Question 5: మానవునికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం ఏది ?
Answer:
మానవుని మేధ.
Exam Tips:
a) జవాబు "మానవుని మేధ" అని రాయండి; ఇది మానవునికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం.
Question 6: సృజనాత్మకత దేనికి దారితీస్తుంది ?
Answer:
నూతన ఆలోచనలకు.
Exam Tips:
a) జవాబు: నూతన ఆలోచనలకు. పాఠంలో ఉన్న వరుస గుర్తుంచుకోండి: సృజనాత్మకత - ఆలోచనలు - జ్ఞానం.
Question 7: “అనారోగ్యం గురించి ఆలోచించకు” కవిత రాసిందెవరు ?
Answer:
రష్యాకు చెందిన పన్నెండేళ్ళ అన్నా సిన్య కోవ.
Exam Tips:
a) కవిత పేరు "అనారోగ్యం గురించి ఆలోచించకు", రచయిత్రి రష్యాకు చెందిన 12 ఏళ్ల అన్నా సిన్యకోవ – రెండింటిలో పేరు, వయసు, దేశం రాయండి.
Question 8: “నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నది. ఎవరు ?
Answer:
రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్.
Exam Tips:
a) ఈ మాటలన్నది సాటర్న్-V రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్ అని రాయండి; అతడి ఆలోచన "అసాధ్యమనేది లేదు" అనే సృజనశీల దృక్పథాన్ని చూపుతుంది.
Free study material for Telugu
TS Board Solutions for Class 12 Telugu Chapter 06 Creativity
Chapter Exercise Answers for Class 12 Telugu
Access structured TS Board textbook solutions for Chapter 06 Creativity. Designed in alignment with the latest academic curriculum for Class 12 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Detailed Answer Guides for Chapter 06 Creativity
Clear, methodical explanations accompany every challenging problem within the Class 12 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Complete Preparation Kit for Class 12 Exams
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 06 Creativity with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత in printable PDF format for offline study on any device.