Download TS Board Solutions for Class 12 Telugu Chapter 01 Mitralabham
Explore reliable textbook solutions for Chapter 01 Mitralabham tailored for Class 12 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Access TS Board Solutions and Answers
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు
Question 1: ముసలి గద్ద, మార్గాల వృత్తాంతాన్ని రాయండి.
Answer:
భాగీరథీ నదీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతో జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించిన గద్ద హెచ్చరించింది.
అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఎలా తప్పించుకోవాలని ఆలోచించి, అయ్యేదేదో అవుతుంది రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాలని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకుంది. గద్ద దగ్గరికి వెళ్లి అయ్యా! నమస్కారము అనగానే గద్ద నీవెవరని అడిగింది.
నేను పిల్లిని, నన్ను దీర్ఘకర్ణమని పిలుస్తారు అన్నది. అలా అనగానే గద్ద కోపంతో నువ్వు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు తీస్తానని అన్నది. ముందు నామాట వినండి. ఆ తరువాత నేను చంపదగిన వాడనా, కాదా నిర్ణయించండి. లక్షణాలను పరిశీలించి వీడు గౌరవించదగినవాడు వీడు శిక్షించదగిన వాడు అని నిర్ణయించాలి కాని పుట్టిన జాతిని చూసి కాదు అని పిల్లి చెప్పింది.
ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడగగా పిల్లి తనగురించి చెప్పింది. ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నాను. మిమ్మల్ని ధర్మజ్ఞులని, మంచివారని యిక్కడి పక్షులు అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటే విన్నాను. చాలా రోజుల నుండి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను. అది ఇన్ని రోజులకు ఫలించింది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీ నుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా ? శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని అంటారు. ఇంటికి వచ్చిన వారు నిరాశతో పోకూడదు. అది మహా పాపం కదా అని పిల్లి అనగానే, పిల్లులు మాంసాహారులు. ఇక్కడ నా పక్షిపిల్లలున్నాయి. అందువల్ల నేను అలా అన్నానని గద్ద చెప్పగానే పిల్లి రెండు చెవులు మూసికొని కృష్ణ కృష్ణ! ఎంతపాపముచేసి ఈ పిల్లిజన్మ ఎత్తానో ? అది చాలదని ఈపాపం కూడా చేయాలా ? ఎంత మాట వినవలసివచ్చింది.
ధర్మశాస్త్రము విని, నిష్కాముఁడనై చాంద్రాయణ వ్రతము చేస్తున్న నేను ఈ పాపం చేస్తానా? ధర్మశాస్త్రములు అన్ని అహింసా పరమో ధర్మః అని ఏక కంఠంతో బోధిస్తున్నాయి. ఏ హింస చేయకుండా అన్ని ప్రాణులను దయతో చూసేవారికి స్వర్గము సులభంగా అందుతుంది.
భూతదయ గలవాఁడు అన్ని ధర్మాలు చేసిన వాడితో సమానం. అది లేనివాఁడు ఎన్ని దానధర్మాలు చేసినా చేయనివాడితో సమానం. చివరకు తాను చేసిన ధర్మాలే తనకు సహాయం చేస్తాయి. కాని మిగిలినవేవి తోడురావు. తెలియక చెడిపోయిన కాలము పోని, తెలిసి ఇంకా ఎందుకు చెడిపోవాలి ? అడవిలో స్వచ్ఛందంగా మొలచిన ఏ ఆకులతోనో, దుంపలతోనో ఆకలి తీర్చుకోవచ్చు.
కాని ఈపాడు పొట్టకోసం ఇంత పాపం ఎవరైనా చేస్తారా ? ఆహా ! యెంతమాట అన్నారు. అని అనగా గద్దవిని కోపం తెచ్చుకోకండి. కొత్తగా వచ్చిన వారిస్వభావం ఎలా తెలుస్తుంది ? అప్పుడు తెలియక అన్న మాటను తప్పుగా అనుకోకు.
పోయినమాట పోని. నీవు ఇకపై ఇష్టం వచ్చినట్లు రావచ్చు, పోవచ్చు, ఇక్కడ ఉండవచ్చు. నీకు ఎటువంటి ఆటంకం లేదని చెప్పింది. తరువాత పిల్లి గద్దతో చాలా స్నేహంగా ఉంటూ, ఆ చెట్టు తొర్రలో నివసించేది.
ఇలా కొన్ని రోజులు గడచిన తర్వాత పిల్లి ప్రతి రోజు అర్థరాత్రి చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లల గొంతు కొరికితెచ్చి తొర్రలో పెట్టుకొని తినేది. అక్కడి పక్షులు తమపిల్లలు కనిపించకపోవడంతో చాలా బాధ పడి వెతకడం ప్రారంభించాయి. అది తెలుసుకున్న పిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆపక్షులు వెతుకుతూ ఆ ముసలి గద్ద ఉండే తొర్రలో తమ పిల్లల ఎముకలు, ఈకలు ఉండటం చూసి ఈ గద్దయే తమ పిల్లలను తిన్నదని భావించి దానిని గోళ్లతో రక్కి, ముక్కులతో పొడిచి చంపాయి.
Exam Tips:
a) కథను ఈ క్రమంలో రాయండి: గద్ద నివాసం (జువ్విచెట్టు తొర్ర) → పిల్లి రాక, నటించిన భక్తి → గద్ద నమ్మకం → పిల్లి పక్షిపిల్లలను తినడం → పక్షులు గద్దను చంపడం.
b) కథ యొక్క నీతి (కొత్తవారిని, కులశీలాలు తెలియనివారిని నమ్మకూడదు) చివరి వాక్యంగా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
c) పాత్రల పేర్లు (జరద్దవము, దీర్ఘకర్ణము) సరిగా రాయండి.
Question 2: కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి.
Answer:
మగధ అనే దేశంలో మందారవతి అనే అడవిలో ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. బాగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతఁడు సుబుద్ధి అనే మంచి నక్క నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడని జింక చెప్పింది.
ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా ? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి గద్ద ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినదని ఆ కథ చెప్పినా జింక నక్కతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తరువాత నక్క ఒక పొలాన్ని చూపించింది. జింక రోజూ అక్కడికి మేతకు వెళ్ళేది. అది గమనించిన పొలం యజమాని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం మేయడానికి వెళ్లి జింక వలలో చిక్కుకుంది. దాన్ని గమనించి లోపల సంతోషించిన నక్క ఆదివారం కాబట్టి పేగులు, నరాలతో చేసిన వల తాళ్ళను కొరకను అని చెప్పింది.
సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని, చెడు కాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడనే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను.
నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు. మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు.
అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు.
ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి.
అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఊహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఊపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి.
కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను. నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది. తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అది విని జింక లేచి పరిగెత్తింది. అయ్యో ! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్క చచ్చింది.
Exam Tips:
a) కాకి చెప్పిన ఉపాయం ప్రధానం: జింక ఊపిరి బిగపట్టి చచ్చినట్లు పడుకోవడం, కాకి కళ్లు పొడుస్తున్నట్లు నటించడం, కాకి అరవగానే జింక పారిపోవడం.
b) చివరిలో యజమాని విసిరిన కర్ర నక్కకు తగిలి నక్క చనిపోవడాన్ని తప్పక చేర్చండి.
c) నక్క కపట స్నేహం, జింక మిత్రుని మాట వినకపోవడం అనే రెండు కారణాలను కథ మొదట్లో చూపండి.
II సంగ్రహరూప ప్రశ్నలు
Question 1: ముసలి గద్దను చూసి బిడాలము ఏమనుకుంది ?
Answer:
భాగీరథీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే ఒక గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతోనే జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించి గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను.
ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ? అని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది “రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాల”ని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకున్నది.
Exam Tips:
a) బిడాలం అంటే పిల్లి; ఈ ప్రశ్నకు గద్దను చూసి పిల్లి భయపడి, "రోటిలో తలపెట్టి రోకటి పోటుకు భయపడితే ఏం లాభం" అనుకుని మంచితనం నటించాలని నిశ్చయించుకున్న భాగం చాలు.
b) సామెతను కొటేషన్ గుర్తులతో యథాతథంగా రాయండి.
Question 2: గృహస్థుని ధర్మమేమిటి?
Answer:
భాగీరథి తీరంలోని జువ్వి చెట్టుపై ఉన్న గద్దతో కపట స్నేహం చేయాలని వచ్చిన పిల్లిని ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడిగింది. పిల్లి తనగురించి చెప్తూ ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నానని అన్నది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీనుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా ? అని ప్రశ్నించింది.
అంటే గృహస్థులు ఇంటికి వచ్చిన వారిని చంపకూడదని చెప్పింది. ఇంకా శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని ఆతిథ్యమిచ్చే శక్తి, ధనము లేకపోతే కనీసం మంచి మాటలతో అయినా తృప్తిపరచాలని అన్నది. ఇంటికి వచ్చిన వారిని నిరాశతో పంపకూడదని అలాపంపడం మహా పాపం అని పిల్లి గద్దకు చెప్పింది.
Exam Tips:
a) గృహస్థ ధర్మం: ఇంటికి వచ్చినవారిని చంపకూడదు, శత్రువుకైనా ఆతిథ్యం ఇవ్వాలి, శక్తి లేకుంటే మంచి మాటలతోనైనా తృప్తి పరచాలి, నిరాశతో పంపడం పాపం.
b) ఈ మూడు అంశాలను విడివిడి వాక్యాలుగా రాస్తే స్పష్టంగా ఉంటుంది.
Question 3: తనను రక్షించమని వేడుకున్న జింకతో నక్క ఏమన్నది ?
Answer:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒకరోజు నక్క జింకకు బాగా పండిన ఒక పొలం చూపించింది. ఆ రోజునుండి జింక ప్రతిరోజు ఆ పొలానికి వెళ్లి మేయగా, ఒకరోజు ఆ పొలం యజమాని రహస్యంగా ఒక వలను పెట్టి ఇంటికి పోయాడు. ఎప్పటిలానే జింక మేయడానికి వెళ్లి ఆవలలో చిక్కుకుంది. ఇప్పుడు నా మిత్రుడైన నక్క వస్తే నన్ను రక్షిస్తాడని అనుకుంటుండగా నక్క వచ్చింది. జింకను చూసి ఇన్ని రోజులకు నా ప్రయత్నము ఫలించిందని నక్క లోలోపల సంతోషించింది.
దీని రక్తమాంసాలతో నేను పండగ చేసుకోవచ్చునని మనసులో అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్ళింది. నక్కను చూసిన జింక త్వరగా వచ్చి ఈ వల తాళ్ళను కొరికి నన్ను రక్షించు అని అడిగింది. అలా అనగానే నక్క ఇంకా దగ్గరికి వెళ్లి అయ్యో ! ఈ వల పేగులు, నరములతో చేసినది. ఈ రోజు ఆదివారము, నేను నరములను పంటితో తాకలేను. నన్ను మరోరకంగా అనుకోకు. ఇంక వేరే ఏ పనైనా చేస్తానని చెప్పింది.
Exam Tips:
a) నక్క చెప్పిన కారణం: వల పేగులు, నరాలతో చేసినది; ఆ రోజు ఆదివారం కాబట్టి నరాలను పంటితో తాకనని చెప్పింది.
b) నక్క నిజ ఉద్దేశం (జింక చచ్చాక మాంసం తినడం) గమనించి రాయండి; ఇదే కపటానికి ఉదాహరణ.
Question 4: ఎలాంటి వారి సాంగత్యము వెంటనే మానుకోవాలి ?
Answer:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒక పొలం చూపించి యజమాని పన్నిన వలలో చిక్కుకునేలా చేసింది. రక్షించమని వేడుకున్నా రక్షించలేదు. సాయంకాలమైనా తన మిత్రుడు ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ వచ్చి వలలో ఉన్న జింకను చూసింది. నేను ముందే హెచ్చరించినా నామాట వినక పోతివి. మంచివారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చేవాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు. మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు.
ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అని చెప్పింది. అది విన్న జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోసపోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని నేను ఊహించలేదని చెప్పింది.
Exam Tips:
a) సమాధానంలో ముందు మంచిమాటలు చెప్పి వెనుక మోసం చేసేవారు "పయోముఖ విషకుంభం" వంటివారని పేర్కొనండి.
b) జింక అన్న మాట (సజ్జన సాంగత్యం శ్రేయస్సు, దుర్జన సాంగత్యం అనర్థం) ఉటంకిస్తే సమాధానం బలపడుతుంది.
III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు
Question 1: చిన్నయసూరి జన్మస్థలమేది ?
Answer:
శ్రీ పెరంబుదూరు
Exam Tips:
a) చిన్నయసూరి జన్మస్థలం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీపెరంబుదూరు; జిల్లా పేరు కూడా రాయండి.
b) ఊరి పేరు స్పెల్లింగ్ తప్పకుండా చూసుకోండి.
Question 2: చిన్నయసూరి రాసిన లక్షణ గ్రంథమేది ?
Answer:
శబ్ద లక్షణ సంగ్రహం
Exam Tips:
a) చిన్నయసూరి రాసిన లక్షణ గ్రంథం "శబ్దలక్షణ సంగ్రహం"; బాలవ్యాకరణం, నీతిచంద్రిక ఇతర ముఖ్య రచనలు వేరుగా గుర్తుంచుకోండి.
b) లక్షణ గ్రంథం అని అడిగితే వ్యాకరణ గ్రంథం పేరే రాయండి.
Question 3: నీతిచంద్రికకు ఆధార గ్రంథాలేవి ?
Answer:
విష్ణుశర్మ పంచతంత్రం, నారాయణ పండితుని హితోపదేశం.
Exam Tips:
a) నీతిచంద్రికకు ఆధారాలు రెండు: విష్ణుశర్మ పంచతంత్రం, నారాయణ పండితుని హితోపదేశం; రెండింటి రచయితల పేర్లు జతచేయండి.
b) నీతిచంద్రికలో మిత్రలాభం, మిత్రభేదం అనే రెండు భాగాలున్నాయని గుర్తుంచుకోండి.
Question 4: సుదర్శన మహారాజు ఏ పట్టణాన్ని పరిపాలించాడు ?
Answer:
పాటలీపుత్రం
Exam Tips:
a) సుదర్శన మహారాజు పాలించిన పట్టణం పాటలీపుత్రం (గంగా తీరంలో); పేరు మార్చి రాయకండి.
b) ఈ రాజు కుమారులకు విష్ణుశర్మ కథల ద్వారా నీతి నేర్పాడనే నేపథ్యం గుర్తుంచుకోండి.
Question 5: దయాళువులకు కరస్థమైనది ఏది ?
Answer:
స్వర్గం
Exam Tips:
a) దయగలవారికి స్వర్గం కరస్థం (చేతిలో ఉన్నట్లే) అని పాఠంలో ఉంది; ఒక్క పదంలో "స్వర్గం" అని రాయండి.
b) కరస్థం అంటే చేతిలో ఉన్నది, సులభంగా లభించేది అనే అర్థం.
Question 6: ధర్మశాస్త్రములు ఏమని బోధిస్తున్నవి ?
Answer:
అహింసా పరమోధర్మః
Exam Tips:
a) ధర్మశాస్త్రాల బోధన "అహింసా పరమో ధర్మః"; సంస్కృత వాక్యాన్ని సరైన రూపంలో రాయండి.
b) ఇది సమాధానంగా చాలు; దీనికి భూతదయ గురించి ఒక వాక్యం చేర్చవచ్చు.
Question 7: లోకమే కుటుంబమని భావించు వారెవరు ?
Answer:
మహాత్ములు
Exam Tips:
a) మహాత్ములు లోకాన్నే కుటుంబంగా భావిస్తారు (వసుధైవ కుటుంబకం భావన); ఒక్క పదంలో రాయండి.
b) సంకుచిత భావం కలవారితో పోల్చి చెప్పగలిగితే అదనపు స్పష్టత వస్తుంది.
Question 8: పరులకు హాని చేయగోరువారు ఏమైపోతారు ?
Answer:
చెడిపోతారు
Exam Tips:
a) ఇతరులకు హాని తలపెట్టేవారు తామే చెడిపోతారు అనేది పాఠంలోని నీతి వాక్యం; అదే రూపంలో రాయండి.
b) కథలో నక్క తానే కర్ర దెబ్బకు చావడం ఈ నీతికి ఉదాహరణ; అడిగితే ఉదాహరణగా చూపండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 12 Telugu Chapter 01 Mitralabham
Accessing Chapter 01 Mitralabham Solutions
Explore reliable textbook solutions for Chapter 01 Mitralabham tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.
Concept-Driven Answers for Class 12 Telugu
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 01 Mitralabham concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Maximizing Study Efficiency
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 01 Mitralabham with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం in printable PDF format for offline study on any device.