Solutions for Class 12 Political Science: Chapter 11 India and the World
Access comprehensive textbook solutions for Chapter 11 India and the World using the official curriculum guides for Class 12 Political Science. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 12 Political Science Solutions: Chapter 11 India and the World
Navigate directly to the solved Political Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
Question 1: భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవేని రెండు లక్షణాలను తెలపండి.
Answer:
1. వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత:
భారత విదేశాంగ విధానం ప్రధానంగా వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల్లో వలసవాద పాలనలో ఉన్న ప్రజలపట్ల భారతదేశం సానుభూతి ప్రకటించింది. వలసవాద పాలన ప్రాంతాల్లో ప్రజలపై నిరంకుశ పాశవిక విధానాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందడానికి రాజకీయ, దౌత్యపర, ఆర్థిక సహాయాలన్నింటినీ భారతదేశం అందించింది.
అగ్రరాజ్యాలు రూపొందించిన సామ్రాజ్యవాద వ్యూహాన్ని కూడా విదేశాంగ విధానం వ్యతిరేకిస్తుంది.
2. జాతి విచక్షణకు వ్యతిరేకత:
సుదీర్ఘకాలంగా భారతదేశం వర్ణ, జాతి, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా జరిగే అన్ని రకాల విచక్షణలను వ్యతిరేకిస్తోంది. జాతి విచక్షణ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో సముచితంగా వివిధ వేదికల్లో, చర్చనీయాంశం చేసింది. దక్షిణాఫ్రికా, కాంగో, రొడీషియా (ఇప్పటి జింబాబ్వే)లలో అనుసరిస్తున్న ప్రభుత్వ జాతి విచక్షణ విధానాన్ని తీవ్రంగా విమర్శించింది.
Exam Tips:
a) విదేశాంగ విధాన లక్షణాలలో రెండు అడిగినప్పుడు రెండింటినే రాసి, ఒక్కొక్కదానికి ఉదాహరణ (దక్షిణాఫ్రికా వర్ణవివక్షకు వ్యతిరేకత) ఇవ్వండి.
b) "వలసవాద–సామ్రాజ్యవాద వ్యతిరేకత", "జాతి విచక్షణ వ్యతిరేకత" అనే శీర్షికలను బోల్డ్‌గా రాయండి.
Question 2: అలీనోద్యమం పాత్రపై ఒక సంక్షిప్త సమాధానం రాయండి.
Answer:
అలీనోద్యమం 1955లో బాండుంగ్లో జరిగిన ఆఫ్రో-ఆసియన్ సమావేశం ద్వారా రూపుదిద్దుకుంది. ఇది ఒక విదేశాంగ విధానంగా పశ్చిమ దేశాల కూటమికి, కమ్యూనిస్టు కూటమికి సమానదూరం పాటించే సంవర్థక విధానంగా వృద్ధి చెందింది. అలీనోద్యమ వ్యవస్థాపక నాయకులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, సుకార్నో, నిక్రోమా, అబ్దుల్ నాజర్ తదితర రాజనీతిజ్ఞులు ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.
అలీనోద్యమ లక్ష్యాలు:
అలీనోద్యమం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తుంది. వాటిలో ప్రధానమైనవి :
1. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ
2. వలసప్రాంతాల ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు
3. జాతివివక్షకు, వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రతీవారికి సమానత్వపు హక్కు
4. ఆర్థిక సమానత్వాన్ని సాధించడం
5. సాంస్కృతిక ఆధిపత్యం లేదా సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం
6. అంతర్జాతీయ వాదాన్ని సమర్ధించడం.
Exam Tips:
a) అలీనోద్యమం: రూపకల్పన (బాండుంగ్ 1955), సమదూరం, ఐదుగురు వ్యవస్థాపక నాయకులు (నెహ్రూ, టిటో, సుకర్ణో, న్క్రూమా, నాజర్) – ఈ మూడింటిని మొదటి పేరాలో రాయండి.
b) లక్ష్యాలను ఆరు పాయింట్లుగా వరుసగా రాయండి (శాంతి–నిరాయుధీకరణ, స్వయం నిర్ణయాధికారం, జాతివివక్ష వ్యతిరేకం మొదలైనవి).
Question 3: సార్క్ అనగానేమి ? వివరించండి.
Answer:
దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (South Asian Association of Regional Co-operation) లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ (SAARC) అని దీనిని వ్యవహరిస్తారు. ఈ సార్క్ ఏర్పాటులో బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియాఉర్ రెహమాన్ (Ziaur Rahman) ఎంతో ప్రధాన పాత్ర పోషించాడు.
సార్క్‌ను లాంఛనప్రాయంగా డిసెంబర్ 8, 1985న స్థాపించారు. ఈ సంస్థలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఏడు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆ తరువాత ఏప్రిల్ 3, 2007న ఆఫ్ఘనిస్తాన్ సభ్యదేశం కావడంతో ప్రస్తుతం సార్క్‌లో మొత్తం ఎనిమిది దేశాలు సభ్య రాజ్యాలుగా ఉన్నాయి.
సార్క్ లక్ష్యాలు:
1. దక్షిణాసియా ప్రాంతంలో సంక్షేమరంగాన్ని వృద్ధిచేసి జనాభా జీవన పరిస్థితులను గుణాత్మకంగా వృద్ధి చేయడం.
2. దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య సమష్టి స్వావలంబనను బలోపేతం చేయడం.
3. ఆర్థికవృద్ధి, సాంఘిక ప్రగతి, సంస్కృతి అభివృద్ధులను వేగిరపరచడం.
4. సభ్యదేశాలు తమ సమస్యలపట్ల సానుభూతితో పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం.
5. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరస్పర సహాయంతో తోడ్పాటు అందించుకోవడం.
Exam Tips:
a) సార్క్ ఏర్పాటు: ఢాకా శిఖరాగ్ర సమావేశం, 1985 డిసెంబర్ 8; ఏడుగురు వ్యవస్థాపక సభ్యులు + 2007లో ఆఫ్ఘనిస్తాన్ = 8 సభ్య దేశాలు అని స్పష్టంగా రాయండి.
b) జియా ఉర్ రెహమాన్ పాత్రను, లక్ష్యాలను (సంక్షేమం, స్వావలంబన, ఆర్థిక–సాంస్కృతిక అభివృద్ధి) వరుసగా పేర్కొనండి.
Question 4: ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధికారాలు, విధులను వివరించండి.
Answer:
సాధారణ సభ అధికారాలు – విధులు:
1. అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ విషయాలను చర్చించి, సిఫార్సులు చేయడం.
2. అంతర్జాతీయ సాంఘిక-ఆర్థిక సహకారానికి సంబంధించిన విషయాల్లో మార్గనిర్దేశనం చేసి, పర్యవేక్షించడం.
3. స్వయంపాలన చేసుకోలేని ప్రాంతాల పరిపాలనపై సమాచారాన్ని, నివేదికలను సేకరించడం.
4. ఐక్యరాజ్యసమితి నిధులపై ప్రత్యేక నియంత్రణ అధికారాన్ని కలిగి, వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది.
5. భద్రతామండలికి 10 మంది తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. అలాగే ఆర్థిక సాంఘిక మండలికి ప్రతి సంవత్సరం 18 మంది సభ్యులను, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మంది న్యాయమూర్తులను, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని సాధారణ సభ ఎన్నుకుంటుంది.
6. అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదిస్తుంది.
7. ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌కు అవసరమైన సవరణలు చేసే అధికారం సాధారణ సభకు ఉంటుంది.
8. ఐక్యరాజ్యసమితిలోకి కొత్తగా రాజ్యాలను సభ్యులుగా చేర్చుకోడానికి, సస్పెండ్ చేయడానికి, సభ్యరాజ్యాలను తొలగించడానికి సాధారణ సభకు అధికారం ఉంటుంది.
Exam Tips:
a) సాధారణ సభ అధికారాలను వర్గాలుగా రాయండి: చర్చ–సిఫార్సులు, బడ్జెట్ ఆమోదం, ఎన్నికల అధికారం (భద్రతామండలి తాత్కాలిక సభ్యులు, ECOSOC, న్యాయమూర్తులు, ప్రధాన కార్యదర్శి), ఛార్టర్ సవరణ, సభ్యత్వ నిర్ణయం.
b) సాధారణ సభలో ప్రతి సభ్య దేశానికి ఒకే ఓటు ఉంటుందని (వీటో ఉండదని) రాస్తే తేడా స్పష్టమవుతుంది.
Question 5: భద్రతామండలి నిర్మాణాన్ని తెల్పి, దీనికి గల ఏవైనా రెండు అధికారాలను, విధులను తెలపండి.
Answer:
నిర్మాణం:
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా భద్రతామండలిని పేర్కొనవచ్చు. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. వీటిలో 5 రాజ్యాలను శాశ్వత దేశాలనీ, వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలనీ చెప్పవచ్చు. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ రెండు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నుకుంటుంది. ఈ పది తాత్కాలిక దేశాలలో అయిదు ఆఫ్రికా-ఆసియా ఖండాలనుంచి, ఒకటి తూర్పు యూరోపు నుంచి, రెండు లాటిన్ అమెరికా ఖండం నుంచి, రెండు పశ్చిమ యూరోపు తదితర ప్రాంతాలనుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికవుతాయి.
ఇవేకాక, ఏదేని వివాదానికి సంబంధించిన ఏదేని ఒక సభ్యరాజ్యాన్నైనా, రాజ్యేతర సభ్యులు కానీ చర్చలలో పాల్గొనమని భద్రతామండలి కోరవచ్చు. భద్రతామండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్యరాజ్యాల మధ్య అక్షర క్రమంలో ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. భద్రతామండలికి సహాయం అందించడానికి మూడు స్థాయీ సంఘాలు ఉంటాయి.
అధికారాలు – విధులు:
అంతర్జాతీయ శాంతిభద్రతలు – రక్షణ వ్యవహారాల నిర్వహణలో ఐక్యరాజ్యసమితికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. భద్రతామండలి అధికారాలు – విధులు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.
1. భద్రతా మండలి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
2. అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు కార్యాచరణను అమలుచేసి, శాంతికి విఘాతం కలిగించే వాటిపై నివారక చర్యలు చేపడుతుంది.
Exam Tips:
a) భద్రతామండలి నిర్మాణం: 5 శాశ్వత (వీటో అధికారం గలవి) + 10 తాత్కాలిక సభ్యులు (2 ఏళ్ల కాలానికి) = 15 – ఈ సంఖ్యలు తప్పనిసరి.
b) శాశ్వత సభ్యుల పేర్లు (అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్) రాయండి; ప్రశ్నలో రెండు అధికారాలే అడిగినందున రెండు మాత్రమే వివరంగా రాయండి.
Question 6: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికారాలు-విధులను సంక్షిప్తంగా రాయండి.
Answer:
ప్రధాన కార్యదర్శి అధికారాలు – విధులు:
ఐక్యరాజ్యసమితి ఛార్టర్ నిర్దేశించిన పరిధిలోని అనేక విధులను-బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారు. వీటిలో ప్రధానమైనవి:
1. అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అన్ని విషయాలను ప్రధాన కార్యదర్శి సాధారణ సభ భద్రతామండలి ముందు నివేదిస్తాడు.
2. ఐక్యరాజ్యసమితి వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్యసమితి పనితీరుపై నివేదికను ప్రతి సంవత్సరం తయారుచేస్తాడు.
3. భద్రతామండలి వినతిపైగాని, ఐక్యరాజ్యసమితి మెజారిటీ సభ్యుల కోరికపైగాని, సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేస్తారు.
4. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు రిజిష్టర్ చేసే అధికారిలాగా వ్యవహరిస్తారు.
5. వివిధ సందర్భాలలో ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన శాంతి పరిరక్షణ దళాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.
Exam Tips:
a) ప్రధాన కార్యదర్శి అధికారాలలో భద్రతామండలికి నివేదించడం, బడ్జెట్ రూపకల్పన, వార్షిక నివేదిక, శాంతి పరిరక్షణ దళాల పర్యవేక్షణ అనే నాలుగింటిని తప్పక రాయండి.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
Question 1: బిమ్స్టెక్ (BIMSTEC) అనగానేమి ?
Answer:
ఈ సంస్థను 1997వ సంవత్సరంలో బంగాళాఖాత (సముద్ర) తీరప్రాంతదేశాలైన దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. “బంగాళాఖాత తీరప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ” పేరుతో ఏర్పడిన ఈ సంస్థలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా (మియన్మార్), థాయ్లాండ్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బిమ్స్టెక్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది.
Exam Tips:
a) BIMSTEC: ఏర్పాటు 1997, 7 సభ్య దేశాలు (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్), ప్రధాన కార్యాలయం ఢాకా.
Question 2: సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం గురించి రాయండి.
Answer:
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం ఖాట్మండ్లో నవంబరు 27, 2014న జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాలు అన్ని రంగాల్లో సహకారం అందించుకోవడానికి ముందుండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
ఈ సహకారం ప్రజలు పరస్పరం ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సహాయం, సహకారాలు ప్రతి రంగంలో సాధ్యమౌతాయని భారతదేశం భావిస్తోంది.
Exam Tips:
a) సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం (ఖాట్మండు, 2014 నవంబర్ 26–27) లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలోని అంశాలు (ప్రజల మధ్య సంబంధాలు, సమాచార అనుసంధానం) రాయండి.
Question 3: ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి ?
Answer:
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో 193 సభ్య రాజ్యాలు ఉన్నాయి.
Exam Tips:
a) ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల సంఖ్య మారుతూ ఉంటుంది కాబట్టి సంఖ్యతో పాటు "ప్రస్తుతం" అని రాయండి (2011లో దక్షిణ సూడాన్ చేరిక తరువాత 193).
Question 4: సార్క్ లోని సభ్యదేశాలు ఏవి ?
Answer:
సార్క్ లోని సభ్యదేశాలు
1. బంగ్లాదేశ్
2. ఇండియా
3. మాల్దీవులు
4. నేపాల్
5. పాకిస్తాన్
6. శ్రీలంక
7. భూటాన్
2007లో ఆఫ్ఘనిస్తాన్ కూడా సభ్యదేశం కావటంతో ప్రస్తుతం సార్క్‌లో ఎనిమిది సభ్యదేశాలు ఉన్నాయి.
Exam Tips:
a) సార్క్ సభ్య దేశాలను అక్షర క్రమంలో లేదా ఏడు+ఒకటి (ఆఫ్ఘనిస్తాన్ 2007) గా రాయండి; మొత్తం 8 అని చివరలో చెప్పండి.
Question 5: ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి ?
Answer:
1. సాధారణ సభ
2. భద్రతా మండలి
3. ఆర్థిక-సాంఘిక మండలి
4. ధర్మకర్తృత్వ సంఘం
5. అంతర్జాతీయ న్యాయస్థానం
6. సచివాలయం.
వీటిలో ప్రస్తుతం ధర్మకర్తృత్వమండలి పనిచేయటం లేదు.
Exam Tips:
a) ఐక్యరాజ్యసమితి ఆరు ప్రధాన అంగాలను జాబితాగా రాసి, ధర్మకర్తృత్వ మండలి ప్రస్తుతం పనిచేయడం లేదని (1994 నుంచి) సూచించండి.
Question 6: ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?
Answer:
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పోర్చుగీసుకు చెందిన ‘ఆంటోనియో గుటెరెస్’ (2017 నుంచి).
Exam Tips:
a) ప్రధాన కార్యదర్శి పేరుతో పాటు దేశం (పోర్చుగల్), పదవిలో చేరిన సంవత్సరం (2017) రాస్తే సంపూర్ణ జవాబు అవుతుంది. పదవీకాలం ముగిసినప్పుడు తాజా పేరు చూసుకోండి.
Question 7: బ్రిక్స్లోని సభ్యదేశాలేవి ?
Answer:
1. బ్రెజిల్ (Brazil)
2. రష్యా (Russia)
3. ఇండియా (India)
4. చైనా (China)
5. దక్షిణాఫ్రికా (South Africa)
ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో బ్రిక్స్ (BRICS) అనే పదబంధంతో ఈ సంస్థ ఏర్పడింది. (2024 నుంచి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యు.ఎ.ఇ. వంటి మరికొన్ని దేశాలు కూడా సభ్యులుగా చేరాయి.)
Exam Tips:
a) BRICS = Brazil, Russia, India, China, South Africa; ఆంగ్ల పేర్లను బ్రాకెట్లలో ఇవ్వండి.
Question 8: పంచశీల సూత్రాలను వివరించండి.
Answer:
1. రాజ్యాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవడం.
2. రాజ్యాలు పరస్పర దురాక్రమణకు పాల్పడకుండా ఉండడం.
3. ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం.
4. రాజ్యాల మధ్య సమానత్వం, పరస్పర ప్రయోజనాత్మక సహకారం.
5. శాంతియుత సహజీవనం.
Exam Tips:
a) పంచశీల (1954, నెహ్రూ–చౌ ఎన్‌లై) అయిదు సూత్రాలను సంఖ్యలతో రాయండి; భారత–చైనా ఒప్పందంతో దాని సంబంధాన్ని ప్రస్తావిస్తే అదనపు మార్కులు.
Free study material for Political Science
Step-by-Step Textbook Answers: Class 12 Political Science Chapter 11 India and the World
Official TS Board Solutions for Chapter 11 India and the World
Review comprehensive exercise answers for Class 12 Political Science Chapter 11 India and the World. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Chapter 11 India and the World
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 12 Political Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Next Steps in Your Political Science Revision
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Political Science.
FAQs
The complete and updated TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు is available for free on StudiesToday.com. These solutions for Class 12 Political Science are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Political Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Political Science. You can access TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు in printable PDF format for offline study on any device.