TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

Solutions for Class 12 Political Science: Chapter 07 Electoral System in India

Review structured textbook solutions for Class 12 Political Science Chapter 07 Electoral System in India. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 12 Political Science Solutions: Chapter 07 Electoral System in India

Access the complete solution PDF for Class 12 Political Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

Question 1: భారత ఎన్నికల సంఘం నిర్మాణం. అధికారాలు, విధులపై ఒక వ్యాసం రాయండి.

Answer:

ఎన్నికల సంఘం నిర్మాణం:
రాజ్యాంగంలోని 324 నిబంధన ప్రకారం ‘ఎన్నికల సంఘం’ ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత రాష్ట్రపతి కాలానుగుణంగా నిర్దేశించే సంఖ్య ఆధారంగా ఇతర ఎన్నికల కమిషనర్లతో ఏర్పాటవుతుంది. వివిధ నిబంధనలకు అనుగుణంగా భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు. అధికారాలు విధులు :
భారత ఎన్నికల సంఘం విస్తృతమైన అధికారాలను కలిగి, విధులను నిర్వహిస్తుంది.
1. ఎన్నికల సంఘం భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపునిచ్చి, రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉపప్రాంతీయ పార్టీలుగా వర్గీకరిస్తుంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయిస్తుంది.
2. ఎన్నికల నిర్వహణకై ఓటర్ల జాబితాలు రూపొందిస్తుంది. 18 సంవత్సరాలు వయస్సు నిండిన పౌరులందరినీ ఓటర్లుగా నమోదు చేసుకుంటుంది. ఓటర్ల జాబితాకు మార్పులు చేర్పులు చేస్తుంది.
3. సముచిత తేదీలతో ఎన్నికల షెడ్యూళ్ళను ప్రకటిస్తుంది. (సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికలు రెండింటినీ ప్రకటిస్తుంది).
4. ఎన్నికలలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని రూపొందిస్తుంది.
5. దేశంలో ఎన్నికల యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తుంది. ఇతర పరిపాలన శాఖలు, విభాగాల సహాయంతో ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తుంది.
6. ఎన్నికల సమయంలో హింస, రిగ్గింగు వంటి అక్రమాలు జరిగినప్పుడు ఎన్నికలను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం చేస్తుంది.
7. పార్లమెంటు సభ్యులు లేదా రాష్ట్ర శాసన సభ్యుల అనర్హతలకు సంబంధించి భారత రాష్ట్రపతికి లేదా సంబంధిత రాష్ట్ర గవర్నర్కు సలహాలు, సూచనలు చేస్తుంది.
8. ఎన్నికల సంఘం భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీలు, రాష్ట్రశాసన మండలి మొదలైన వాటికి సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. అంతేకాక, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది.
9. ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి ఎన్నికల ట్రిబ్యునళ్ళను నియమిస్తుంది. రాజకీయ పార్టీలకు గుర్తింపు, ఎన్నికల చిహ్నాల కేటాయింపు, ఎన్నికల వివాదాలు తదితర అంశాల్లో వివాదాలను పరిష్కరించడంలో ఒక న్యాయస్థానం వలె పనిచేస్తుంది.

Exam Tips:

a) జవాబును "నిర్మాణం" (ప్రకరణం 324, ప్రధాన ఎన్నికల కమిషనర్ + ఇతర కమిషనర్లు, రాష్ట్రపతి నియామకం) తరువాత "అధికారాలు–విధులు" అని రెండు భాగాలుగా రాయండి.
b) తొమ్మిది అధికారాల జాబితాలో గుర్తింపు–చిహ్నాల కేటాయింపు, ఓటర్ల జాబితా, షెడ్యూల్ ప్రకటన, ప్రవర్తన నియమావళి అనే నాలుగు ముఖ్యమైనవి తప్పక రాయండి.

 

Question 2: భారత రాజకీయ పార్టీల వ్యవస్థ లక్షణాలను వివరించండి.

Answer:

భారతదేశంలో రాజకీయ పార్టీల ప్రధాన లక్షణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.
1. బహుళ పార్టీ వ్యవస్థ:
స్వాతంత్య్రానంతరం అనేక దశాబ్దాల పాటు భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏకపార్టీ ప్రాబల్య వ్యవస్థ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్య వ్యవస్థ ఉండేది. అయితే 1990 దశకం నుంచి జరిగిన అనేక పరిణామాలు భారతదేశం ఒక బహుళపార్టీ వ్యవస్థగా అవతరించడానికి దోహదం చేశాయి. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు 53 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రబలంగా పనిచేస్తున్నాయి.
2. సిద్ధాంత భావజాలాల సమాచారం:
వివిధ రాజకీయ పార్టీలు అనుసరించే రాజకీయ భావజాలాల ప్రాతిపదికన భారతదేశంలోని రాజకీయ పార్టీలను సాంప్రదాయ భావజాల పార్టీలు, వామ పక్ష భావజాల పార్టీలు, మధ్య మార్గ భావజాల పార్టీలుగా వర్గీకరించవచ్చు. భారతీయ జనతా పార్టీ, శివసేన తదితర పార్టీలు భారతీయ సంస్కృతి, వారసత్వం సాంప్రదాయ ప్రతీకలు, గతవైభవవాదం, హిందుత్వ తదితర అంశాలపట్ల విశ్వాసాన్ని కలిగి సాంప్రదాయ భావజాల పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
కమ్యూనిస్టు పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు సామ్యవాద సిద్ధాంత భావజాలాన్ని విశ్వసించి పేదల పక్షం వహించే వామపక్ష పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఈ రెండు ప్రధాన భావజాలాలను, ఇతర భావజాలాలను మేళవించి అనేక ఇతర రాజకీయ పార్టీలు మధ్యేమార్గ భావజాల పార్టీలుగా ప్రచారంలో ఉన్నాయి.
3. కార్యకర్తల బలం గల పార్టీలు – శాశ్వత కార్యకర్తలు లేని పార్టీలు:
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకర్తలు ఇతర నిర్వాహకులను ఎన్నికల సందర్భంగా మాత్రమే నియమించుకుంటాయి. శాశ్వత కార్యకర్తలు లేకపోవడంతో తాత్కాలికంగా ఎన్నికల సమయంలో మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తలను ఈ విధంగా నియమించుకుంటాయి.
అయితే భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు పార్టీ, తెలుగుదేశం పార్టీ తదితర పార్టీలు బలీయమైన కార్యకర్తల వ్యవస్థలను కలిగి ఎన్నికల సమయంలోను, సాధారణ సమయాల్లోను చురుకుగా పనిచేస్తాయి.
4. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం:
భారతదేశంలోని చాలా రాజకీయ పార్టీలు తమతమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వవు. కొన్ని పార్టీలను మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ క్షేత్ర స్థాయిలో గ్రామాల నుంచి, జాతీయ స్థాయిలో కేంద్ర కార్యవర్గం వరకు అన్ని పదవులకు అధిష్టానవర్గం నామినేట్ చేసే నాయకుడే ఎక్కువగా ఉంటారు. ప్రధాన సమస్యలపై పార్టీల్లో చర్చ కూడా ఉండదు. అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యం అవుతుంది.
5. నిరంతర చీలికలు-వర్గవైషమ్యాలు,:
భారతదేశంలోని రాజకీయ పార్టీలు నాయకుల మధ్య విభేదాల కారణంగా చీలికలకు గురి అవుతాయి. నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, సంఘర్షణలు వివిధ పార్టీలలో చీలికలకు, అనేక ఇతర రాజకీయ పార్టీల అవతరణకు దారితీస్తాయి. దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వర్గ వైషమ్యాలు, ముఠాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
6. రాజకీయ సంకీర్ణాలు:
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో రాజకీయ సర్దుబాట్లు, సంకీర్ణాలు, మైత్రికూటములు, ఏర్పరచుకోవడానికి ఆసక్తి కనబరుస్తాయి. ఈ సంకీర్ణాలు, మైత్రీకూటములు ఎన్నికల పూర్వ మైత్రి, ఎన్నికల అనంతర మైత్రి కూటములుగా ఏర్పడతాయి.
7. జనాకర్షక నాయకత్వం:
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఆ పార్టీల్లోని నాయకుల జనాకర్షణ శక్తిపై ఆధారపడతాయి. దీనినే జనాకర్షక నాయకత్వమని వ్యవహరిస్తారు.

Exam Tips:

a) ఏడు లక్షణాలను (బహుళ పార్టీ వ్యవస్థ, భావజాలాలు, కార్యకర్తలు, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, చీలికలు, సంకీర్ణాలు, జనాకర్షక నాయకత్వం) శీర్షికలుగా రాసి ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
b) 1990ల నుంచి ఏకపార్టీ ఆధిపత్యం పోయి బహుళ పార్టీ వ్యవస్థ వచ్చిందనే మార్పును ప్రారంభంలోనే ప్రస్తావించండి.

 

Question 3: ఫిరాయింపుల నిరోధక చట్టం లక్షణాలను విశదీకరించండి.

Answer:

ఫిరాయింపుల నిరోధక చట్టం లక్షణాలు:
1. రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు అనర్హులయ్యే సందర్భం :
ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధి. ఎన్నికలలో గెలిచిన తరువాత మరో రాజకీయ పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అనర్హతను ఎదుర్కొంటారు. అంతేకాక, పార్లమెంటుకు లేదా రాష్ట్రశాసన సభలకు ఒక పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుడు ఎ) ఆ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు లేదా బి) తాను ఎన్నికైన పార్టీ జారీ చేసే విప్ (whip) ఆదేశాలకు వ్యతిరేకంగా పార్లమెంటులోగానీ, రాష్ట్రశాసనసభల్లో కానీ ఏదైనా అంశానికి జరిపే ఓటింగ్కు దూరంగా ఉండడం లేదా భిన్నంగా ఓటువేయడం జరిగినప్పుడు, అనర్హత వేటును ఎదుర్కొంటాడు.
2. ఇండిపెండెంట్ సభ్యులు, నామినేషన్ సభ్యులు అనర్హులయ్యే సందర్భం :
పార్లమెంటుకు లేదా రాష్ట్రశాసన సభలకు ఒక సభ్యుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన తరువాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరితే దాని ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఇదే విధంగా పార్లమెంటుకు లేదా రాష్ట్రాల శాసన సభలకు నామినేట్ అయిన సభ్యుడు తాను నామినేట్ అయిన ఆరునెలల తరువాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరినప్పుడు సభ్యత్వానికి అనర్హుడవుతాడు.
3. ఫిరాయింపుల నిరోధక చట్టం-కొన్ని మినహాయింపులు :
ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యులు ఆ పార్టీ సంఖ్యా బలంలో 2/3 వంతు సభ్యులు మరొక పార్టీలో విలీనమైనప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వారికి వర్తించవు.
4. పార్టీనుంచి బహిష్కరణలకు వర్తించని నిబంధనలు :
ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుని ఆ పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు ఆ సభ్యునికి వర్తించవు. ఆ సభ్యుడు అనర్హతను ఎదుర్కొనే అవకాశం లేదు. ఎన్నికైన పదవీకాలాన్ని సభ్యుడు పూర్తి చేయవచ్చు.
5. ఫిరాయింపుల నిరోధక చట్టం నిర్ణయాత్మక అధికారం :
పార్లమెంటు లేదా రాష్ట్రాల శాసనసభల సభాధ్యక్షులకు (స్పీకర్) సభ్యులపై ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. సభ్యుని ఎన్నిక జరిగిన సభ పదవీ కాలంలో అతని అనర్హతలకు సంబంధించిన అన్ని అంశాలపైన నిర్ణయాత్మక అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది.

Exam Tips:

a) ఫిరాయింపుల నిరోధక చట్టం పదవ షెడ్యూల్‌లో ఉంది (52వ సవరణ, 1985) అని మొదట రాయండి; అనర్హత నిర్ణయాధికారం సభాపతికి ఉంటుందని చివర్లో చెప్పండి.
b) నాలుగు సందర్భాలను (పార్టీ సభ్యులు, స్వతంత్రులు/నామినేటెడ్ సభ్యులు, విలీన మినహాయింపు, సభాపతి అధికారం) వరుస సంఖ్యలతో రాయండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరించండి.

Answer:

భారతదేశంలో ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యాంగంలోని 324 నిబంధన ప్రకారం, “ఎన్నికల సంఘం” ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత రాష్ట్రపతి కాలానుగతంగా నిర్దేశించే సంఖ్య ఆధారంగా ఇతర ఎన్నికల కమిషనర్లతో ఏర్పాటవుతుంది. వివిధ నిబంధనలకు అనుగుణంగా భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ ను, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు.
ఈ విధంగా భారతదేశంలో ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది. భారతదేశంలోని అన్ని రకాల ఎన్నికలను నిర్వహించి, పర్యవేక్షించి, నియంత్రణ చేసే అధికారాలను రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. వీరిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.
సాధారణంగా వీరి పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా వారి వయస్సు 65 సంవత్సరాలు వచ్చేవరకు ఉంటుంది. రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు. వారు తమ పదవికి రాజీనామా చేయవచ్చు. అలాగే అసమర్థత, అనుచిత ప్రవర్తన, రాజ్యాంగ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేకపోవడం తదితర కారణాలపై వారిని పదవి నుంచి తొలగించవచ్చు.
ఈ తొలగింపు ప్రక్రియలో భాగంగా పార్లమెంటులోని రెండు సభలు ఒక తీర్మానాన్ని ఒక్కొక్క సభలో హాజరై, ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు ప్రత్యేక మెజారిటీతో (సభ మొత్తం సభ్యులలో మెజారిటీ, హాజరై ఓటు వేసినవారిలో 2/3 వంతు) ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

Exam Tips:

a) ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే పద్ధతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతితో సమానం అని రాస్తే మార్కులు పెరుగుతాయి.
b) పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయస్సు (ఏది ముందైతే అది) అని స్పష్టంగా రాయండి.

 

Question 2: భారతదేశంలో ఎన్నికల సంస్కరణలపై ఒక సంక్షిప్త వ్యాఖ్య రాయండి.

Answer:

భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు:
1. రాజకీయాలు నేరపూరితం కావటం-నివారణ చర్యలు:
దేశంలో రాజకీయాలు కొన్ని ప్రాంతాలలో నేరపూరితం అయ్యే ధోరణి వృద్ధి చెందింది. ఈ సమస్యను నివారించేందుకై సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలతోపాటు, వారిపై ఉన్న నేరారోపణలకు సంబంధించిన కేసుల వివరాలను జతపరచాలి.
2. ఎన్నికలలో ధనప్రభావం విపరీతంగా పెరగటం – ఎన్నికల వ్యయంపై పరిమితులు:
భారతదేశ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. ఎన్నికలలో అవాంఛనీయమైన అక్రమాలు నివారించటానికి 2003 సంవత్సరం నుండి ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయంపై పరిమితులు విధిస్తూ వస్తోంది.
3. ఎన్నికలలో కులం, మతం తదితర అంశాల వినియోగం:
ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులు కులం, మతం, లింగపర తెగలు మొదలగు అంశాలతో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎన్నికల సంఘం నివారణాచర్యలు చేపట్టింది.
4. ఎన్నికల ప్రవర్తన నియమావళి:
భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు, అధికారులు, సాధారణ ప్రజలు పాటించవలసిన ప్రవర్తన నియమావళికి కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించటం జరిగింది.

Exam Tips:

a) ఎన్నికల సంస్కరణలను నాలుగు శీర్షికలుగా (నేరమయ రాజకీయాలు, ధన ప్రభావం, కులం–మతం వినియోగం, ప్రవర్తన నియమావళి) రాయండి.
b) నామినేషన్‌తో పాటు నేర చరిత్ర వివరాలు ఇవ్వాలనే నిబంధన సుప్రీంకోర్టు తీర్పు ఫలితమని చెప్పండి.

 

Question 3: భారత జాతీయ కాంగ్రెస్ గురించి పేర్కొనండి.

Answer:

భారత జాతీయ కాంగ్రెస్‌ను 1885లో ఏర్పరచారు. భారత జాతీయోద్యమంలో ఈ పార్టీ గణనీయమైన పాత్ర పోషించింది. కొద్దిమంది చరిత్రకారులు భారత జాతీయోద్యమ చరిత్రను భారత జాతీయ కాంగ్రెస్తో సరిపోల్చారు. స్వాతంత్ర్యానంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఆధిపత్య పార్టీగా 1980 దశకం వరకు కొనసాగింది.
ఈ పార్టీ స్వాతంత్రానంతరం తొలి మూడు దశాబ్దాల కాలం కేంద్ర ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యంతో అధికారంలో కొనసాగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి జవహర్లాల్నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి తదితరులు నాయకత్వం వహించి, దేశ ప్రధాన మంత్రులుగా ఉండేవారు. అదే సందర్భంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. అనతికాలంలోనే 1980 ఎన్నికలలో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలోను అనేక రాష్ట్రాల్లోను అధికారంలోకి వచ్చింది.
1984లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి హత్యకు గురయ్యారు. తదనంతరం జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా తిరిగి అధికారంలోకి వచ్చారు.

Exam Tips:

a) కాంగ్రెస్ స్థాపన (1885), ఏకపార్టీ ఆధిపత్యం (1980ల వరకు), ప్రధానమంత్రుల పేర్లు – మూడింటిని కాలక్రమంలో రాయండి.

 

Question 4: భారతీయ జనతా పార్టీ గురించి చర్చించండి.

Answer:

భారతీయ జనతా పార్టీని 1980 ఏప్రిల్, 6న లాంఛనప్రాయంగా ఏర్పరిచారు. అటల్బిహారీ వాజ్పాయ్ నాయకత్వంలో ఈ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సాంఘిక-సాంస్కృతిక సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి.
హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉంటుంది. పార్టీ అవతరణ మొదలు ఈ పార్టీ క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. లోక్ సభలో ఆధిక్యం సంపాదించడం ద్వారా కేంద్రంలో 1998, 1999, 2014, 2019 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అటల్ బిహారీ వాజ్పాయ్, నరేంద్రమోడీ ఈ పార్టీ తరఫున ప్రధానమంత్రులుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్యకూటమిని (National Democratic Alliance-NDA) ఏర్పరచింది. ఈ పార్టీ సిద్ధాంత భావజాలాలలో సురక్ష (భద్రత), సూచిత (పరిశుద్ధ-పారదర్శకత), స్వదేశీ (దేశీయ వస్తువుల వినియోగానికి ప్రోత్సాహం), సంరక్ష (సంక్షేమం) తదితర అంశాలు ఉన్నాయి.
భారతదేశ సాంస్కృతిక జాతీయవాదంపట్ల ఈ పార్టీకి విశ్వాసం ఉంది. గాంధేయ సామ్యవాదాన్ని విశ్వసిస్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, భారతదేశంలోని ఉన్నత పదవులు చేపట్టకుండా విదేశాలలో జన్మించిన వారిని అడ్డుకోవడం, పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్లు ఈ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మానిఫెస్టో)లో ప్రధానంగా ప్రస్తావించింది.

Exam Tips:

a) భారతీయ జనతా పార్టీ ఏర్పాటు (1980 ఏప్రిల్ 6), వాజ్‌పేయి నాయకత్వం, RSS సంబంధం, NDA – ఈ నాలుగు పాయింట్లు తప్పక ఉండాలి.
b) పార్టీ మానిఫెస్టోలోని ప్రధాన అంశాలను (రామమందిరం, మహిళా రిజర్వేషన్ మొదలైనవి) ఉదాహరణలుగా ఇవ్వండి.

 

Question 5: నమూనా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎం.సి.సి) అనగానేమి ?

Answer:

భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, అధికారులు, సాధారణ ప్రజలు పాటించవలసిన ప్రవర్తన నియమావళిని కొన్ని మార్గదర్శకాల రూపంలో విడుదల చేస్తుంది. దీనినే నమూనా ఎన్నికల నియమావళిగా పేర్కొంటారు.
వీటిలో, ప్రభుత్వం ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా నిరోధించడం, ప్రభుత్వ సంస్థలు ఎన్నికల సమయంలో కొత్త నియామకాలు చేపట్టకుండా నివారించడం, ఎన్నికల ప్రచారంపై హేతుబద్ధమైన పరిమితులు విధించడం, సాధారణ జనజీవనం ఎన్నికల సమయంలో ఎలాంటి గందరగోళం ఎదుర్కోకుండా చూడడం, ఎన్నికలలో మద్యం, సారా తదితర, మత్తు పదార్థాలు పంపిణీ చేయకుండా నిరోధించడం, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగం చేయకుండా నివారించడం తదితర అంశాలు ఉన్నాయి. పోలింగ్ రోజున అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల అధికారులు, సిబ్బందికి తమవంతు పూర్తి సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో అభ్యర్ధులు తమ తమ ఎన్నికల చిహ్నాలను, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ప్రదర్శించడం నిషేధం, ఎన్నికల నమూనా ప్రవర్తన నియమావళి పూర్తిగా అమలుచేయడానికి ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తుంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు ఎన్నికల పరిశీలకులకు సమర్పించవచ్చు.

Exam Tips:

a) నమూనా ప్రవర్తన నియమావళి (MCC) ఎన్నికల తేదీల ప్రకటన నుంచి ఫలితాల వరకు అమలులో ఉంటుందని రాయండి.
b) కొత్త ప్రాజెక్టులు, నియామకాలపై నిషేధం, పోలింగ్ రోజు ప్రచార నిషేధం – ఈ ఉదాహరణలను ఇవ్వండి.

 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు అనగానేమి ?

Answer:

ముద్రణ చేసిన బ్యాలట్ పేపర్ పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. వీటిని ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీను) గా వ్యవహరిస్తారు. వీటిలో బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అనే పరికరాలు ఉంటాయి. బ్యాలట్ యూనిట్లో ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు, వారి ఎన్నికల చిహ్నాలు ఉంటాయి. ఓటర్లు బ్యాలట్ యూనిట్ ద్వారా ఓటు వేస్తారు. కంట్రోల్ యూనిట్ను బ్యాలట్ యూనిట్తో అనుసంధానిస్తారు.
భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013 సంవత్సరంలో నోటా (NOTA) అనే బటన్ ఏర్పాటు చేశారు. ఒక ఓటరు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులెవ్వరూ సరైన వారు కాదని భావించినప్పుడు పైన పేర్కొన్న అభ్యర్థులెవ్వరూ కాదు (None of the Above) అనే బటన్ వినియోగించుకోవచ్చు.

Exam Tips:

a) EVM లో బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అనే రెండు భాగాలను పేర్కొనండి. NOTA (2013) ను తప్పక ప్రస్తావించండి.
b) NOTA అంటే "None Of The Above" అని పూర్తి రూపం రాయండి.

 

Question 2: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?

Answer:

భారతదేశంలో ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పరచారు.
ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters Day) గా పాటిస్తారు. దేశంలోని యువకులు ఓటర్లుగా నమోదై, రాజకీయ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనే విధంగా వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

Exam Tips:

a) జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25 అని, ఎన్నికల సంఘం ఏర్పడిన రోజు (1950) గుర్తుగా జరుపుతారని రాయండి.

 

Question 3: ఎన్నికలలో ధన ప్రభావం వృద్ధిచెందడాన్ని వివరించండి.

Answer:

భారతదేశ ఎన్నికలలో ధనప్రభావం విపరీతంగా పెరుగుతోంది. ప్రభుత్వానికి లెక్కలు చూపని నల్లధనం ఉపయోగించి కొద్దిమంది అభ్యర్థులు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడటం జరుగుతోంది. ధనాన్ని ఉపయోగించి కొద్దిమంది నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఓట్లు కొనుగోలు చేయటం, ఓటర్లకు క్రికెట్ కిట్లు, చీరలు, మొదలైన బహుమతులను ఎరవేయటం, కుల సంఘాలకు, ఇతర సంఘాలకు భారీగా విరాళాలు ఇవ్వటం సర్వసాధారణమైంది.

Exam Tips:

a) ధన ప్రభావానికి మూడు ఉదాహరణలు (ఓట్ల కొనుగోలు, బహుమతులు, భారీ విరాళాలు) ఇవ్వండి; పరిష్కారంగా ఎన్నికల వ్యయ పరిమితులను ప్రస్తావించండి.

 

Question 4: ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (E.P.I.C) లను వివరించండి.

Answer:

ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డులనే ఓటరు గుర్తింపు కార్డులని పేర్కొంటారు. భారత ఎన్నికల సంఘం ఓటర్లకు వారి ఫొటో, అడ్రస్ తదితర వివరాలతో కూడిన గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. పోలింగ్ జరిగే రోజు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ ఓటరు గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.
ఈ కార్డుకు ప్రత్యామ్నాయంగా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా ఓటర్లు పోలింగ్ కేంద్రంలో చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికలలో జరిగే బోగస్ ఓటింగ్ నివారించడానికి ఈ గుర్తింపు కార్డు పద్ధతిని ఒక ఎన్నికల సంస్కరణగా ప్రవేశపెట్టారు.

Exam Tips:

a) EPIC అనేది ఓటరు గుర్తింపు కార్డు; బోగస్ ఓటింగ్‌ను నివారించడం దీని లక్ష్యం అనే ముఖ్య ఉద్దేశాన్ని ఒక వాక్యంలో రాయండి.

 

Question 5: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గురించి తెలపండి.

Answer:

భారత కమ్యూనిస్టు పార్టీలో 1964లో ఏర్పడిన చీలిక ఫలితంగా మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) ఏర్పడింది. పార్టీ ఏర్పడిన అనతికాలంలోనే ఒక బలీయమైన శక్తిగా మారి విస్తరించింది. ఈ పార్టీ ఏర్పరిచిన సంకీర్ణాల ఆధారంగా కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.
ఈ పార్టీ సిద్ధాంత భావజాల అంశాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, ప్రాథమిక హక్కుల్లో పనిచేసే హక్కు చేర్చడం, బహుళజాతి సంస్థలను జాతీయకరణ చేయడం, కార్మికులు, సంఘాల హక్కుల పరిరక్షణ, భూసంస్కరణలు తదితరాలు ప్రధానమైనవి.

Exam Tips:

a) CPI(M) ఏర్పడిన సంవత్సరం 1964, CPI నుంచి చీలిక ఫలితంగా అని తప్పనిసరిగా రాయండి. అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు: కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర.

 

Question 6: శివసేనపై ఒక లఘు వ్యాఖ్య రాయండి.

Answer:

శివసేన పార్టీని మహారాష్ట్రలో బాలా థాకరే 1966లో స్థాపించారు. మరాఠి ప్రజల సంస్కృతి, గౌరవ మర్యాదల పరిరక్షణ ధ్యేయంగా ఈ పార్టీ ఏర్పడింది. దీనితో బాటు హిందుత్వ భావజాలానికి కట్టుబడి, అల్పసంఖ్యాక వర్గాలను సంతృప్తిపరచే విధానాలను వ్యతిరేకిస్తుంది. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే 2019 నుంచి 2022 వరకు ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపారు.

Exam Tips:

a) శివసేన స్థాపకుడు బాలా థాకరే, స్థాపన 1966, ధ్యేయం మరాఠీ ప్రజల గౌరవం – ఈ మూడు సమాచారాలు కీలకం.

 

Question 7: సిఫాలజీ అనగానేమి ?

Answer:

రాజనీతిశాస్త్రం అధ్యయనంలో భాగంగా ఎన్నికల పరిమాణాత్మక విశ్లేషణ మరియు బ్యాలెటింగ్, ఎన్నికలను శాస్త్రీయంగా వివరించి, విశ్లేషించటాన్ని ‘సిఫాలజీ’ అంటారు. దీనిలో భాగంగా ఓటర్ల ఎన్నికల ప్రవర్తన, మనోగతాలను అధ్యయనం చేయడం జరుగుతుంది.

Exam Tips:

a) సిఫాలజీ అంటే ఎన్నికల శాస్త్రీయ విశ్లేషణ; ఓటర్ల ప్రవర్తన అధ్యయనం అని రెండు వాక్యాల్లో నిర్వచించండి.

 

Question 8: ఎన్నికల సంస్కరణలపై ఏర్పడిన ఏవేని రెండు కమిటీలు లేదా కమిషన్లు పేర్కొనండి.

Answer:

ఎ) సంయుక్త పార్లమెంటరీ కమిటీ (1972).
బి) తార్కండే కమిటీ (1975).

Exam Tips:

a) సంయుక్త పార్లమెంటరీ కమిటీ (1972), తార్కుండే కమిటీ – ఈ రెండు పేర్లతో పాటు దినేశ్ గోస్వామి కమిటీ వంటి ఇతర కమిటీలు కూడా గుర్తుంచుకోండి.

 

Question 9: ఎన్నికల సర్వేలు అనగానేమి ?

Answer:

ఎన్నికల సందర్భంగా వివిధ పరిశోధన సంస్థలు, మీడియా విభాగాలు ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునే విధంగా సర్వే చేపట్టడం జరుగుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులపై ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సర్వేలు వివరించే ప్రయత్నం చేస్తాయి. ఈ సర్వేలు మూడు రకాలు.
1. ఎన్నికల పూర్వ సర్వే (Pre Poll Survey)
2. ఎగ్జిట్ పోల్ సర్వే (Exit Poll Survey)
3. ఎన్నికల అనంతర సర్వే (Post Poll Survey)

Exam Tips:

a) ఎన్నికల సర్వేలు మూడు రకాలు: ఎన్నికల పూర్వ, ఎగ్జిట్ పోల్, ఎన్నికల అనంతర. మూడింటినీ ఆంగ్ల పదాలతో రాయండి.

 

Question 10: బహుజన సమాజ్ పార్టీపై ఒక లఘువ్యాఖ్య రాయండి.

Answer:

బహుజన సమాజ్ పార్టీ దేశంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, అల్పసంఖ్యాక వర్గాలు తదితరుల సంక్షేమానికి పాటుపడుతుంది. ఈ పార్టీ దేశంలోని దళితులు, సమాజంలో అణచివేతకు గురైన పీడితవర్గాలు తదితరుల అభ్యున్నతికి కంకణం కట్టుకుంది. బహుజన సమాజ్ పార్టీని 1984లో కాన్షీరాం స్థాపించారు.
ఆ తరువాత పార్టీ నాయకత్వం మాయావతి చేతికి వచ్చింది. ఈ పార్టీకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో ఎంతో పలుకుబడి ఉంది. బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలో కొనసాగింది. అనేకసార్లు కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల చిహ్నం ఏనుగు.

Exam Tips:

a) BSP నినాదం బహుజనుల అభివృద్ధి; ఎన్నికల చిహ్నం ఏనుగు; నాయకత్వం కాన్షీరాం నుంచి మాయావతికి వచ్చింది – ఈ మూడు అంశాలు తప్పక రాయండి.

 

Free study material for Political Science

Political Science Class 12 Curriculum Solutions: Chapter 07 Electoral System in India

Accessing Chapter 07 Electoral System in India Solutions

Review comprehensive exercise answers for Class 12 Political Science Chapter 07 Electoral System in India. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 12 Political Science

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 07 Electoral System in India concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 07 Electoral System in India with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ is available for free on StudiesToday.com. These solutions for Class 12 Political Science are as per latest TS Board curriculum.

Are the Political Science TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Political Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Political Science. You can access TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ in both English and Hindi medium.

Is it possible to download the Political Science TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ in printable PDF format for offline study on any device.