TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

Official TS Board Solutions for Class 12 Political Science: Chapter 04 State Government

Review structured textbook solutions for Class 12 Political Science Chapter 04 State Government. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Political Science: Chapter 04 State Government

Navigate directly to the solved Political Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: రాష్ట్ర గవర్నర్ అధికారాలు, విధుల గురించి రాయండి.

Answer:

గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహకశాఖకు రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రపతిచే నియమితుడైన గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీద అమలవుతాయి.
గవర్నర్ అధికారాలు విధులు : గవర్నర్ ముఖ్యమైన అధికారాలు, విధులను నిర్వర్తిస్తాడు. అవి:
1. కార్యనిర్వాహక అధికారాలు – విధులు
2. శాసనాధికారాలు విధులు
3. ఆర్థికాధికారాలు – విధులు
4. న్యాయాధికారాలు – విధులు
5. ఇతర అధికారాలు – విధులు
6. విచక్షణాధికారాలు విధులు
1. కార్యనిర్వాహక అధికారాలు-విధులు:
రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్ అధీనంలో ఉంటాయి. రాజ్యాంగం 154వ ప్రకరణంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ స్వయంగానూ లేదా విధేయులైన కొందరు అధికారుల ద్వారా వినియోగిస్తాడు.
1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు.
2. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
3. మంత్రులకు శాఖలు కేటాయించడం, వాటిని మార్పు చేయడం చేస్తాడు.
4. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను తొలగిస్తాడు.
5. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమిస్తాడు.
6. రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న వివిధ కమిషన్ల ఛైర్మన్, సభ్యులను నియమిస్తాడు. అవి, ఎ) పబ్లిక్ సర్వీస్ కమిషన్ బి) అధికార భాషా సంఘం సి) మైనారిటీ కమిషన్ డి) మహిళా కమీషన్ ఇ) ప్రభుత్వరంగ సంస్థల కమిటీలు
2. శాసన నిర్మాణాధికారాలు:
గవర్నర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగంగా ఉంటాడు.
1. గవర్నర్ రాష్ట్ర శాసన సభలను సమావేశపరుస్తాడు. వాయిదా వేస్తాడు. రాష్ట్ర శాసనసభను రద్దుచేస్తాడు.
2. శాసనసభలో స్వయంగా ప్రసంగిస్తాడు, లేదా తన సందేశాలు పంపుతాడు.
3. శాసనమండలిలో 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు.
4. ఆంగ్లో-ఇండియన్ తెగకు చెందిన వారెవరూ శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆ తెగకు సంబంధించిన ఒకరిని నామినేట్ చేస్తాడు.
5. శాసనసభ తొలివార్షిక సమావేశాన్ని లేదా సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ప్రారంభిస్తాడు.
6. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేస్తాడు. బిల్లులలో మార్పులు లేదా సవరణలు సూచిస్తూ శాసనసభల పునఃపరిశీలనకు పంపుతాడు.
ఆర్థికాధికారాలు:
గవర్నర్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో శాసనసభలో ద్రవ్యబిల్లులు సమర్పించేందుకు అనుమతిస్తాడు. శాసనసభలో సభ్యులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సహకరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ అగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. వివిధ విత్త సంబంధమైన నివేదికలను విధానసభకు సమర్పించేలా చూస్తాడు.
న్యాయాధికారాలు:
గవర్నర్కు న్యాయసంబంధ అధికారాలు, విధులు ఉన్నాయి. జిల్లా న్యాయమూర్తులు, ఇతర అధికారుల నియామకం, పదోన్నతులను గవర్నర్ ప్రభావితం చేస్తాడు. రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా రద్దుచేయడానికి అధికారం ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ రాష్ట్రపతికి సలహాలిస్తాడు. రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాలలోని న్యాయసిబ్బందిని హైకోర్టు సూచనలపై నియమిస్తాడు.
ఇతర అధికారాలు:
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తరువాత ఆ నివేదికపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు పంపుతాడు.
విచక్షణాధికారాలు : ఈ అధికారాలను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ స్వయంగా వినియోగిస్తాడు. అవి :
1. ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం.
2. రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం.
3. శాసన, పరిపాలనా, సంబంధమైన అంశాలపై సమాచారం
అందించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం.
4. శాసనసభను రద్దుపరచడం.
5. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్రపతికి సలహా ఇవ్వడం.
6. శాసనసభ ఆమోదించిన బిల్లుపై సంతకం చేయడానికి తిరస్కరించి, దానిని పునఃపరిశీలన కోసం వెనకకు పంపడం.

Exam Tips:

a) అధికారాలను కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక, న్యాయ, ఇతర, విచక్షణ అనే ఆరు శీర్షికల కింద విడివిడిగా రాయండి; ప్రతి శీర్షికకు కనీసం 2–3 పాయింట్లు ఉండాలి.
b) గవర్నర్ రాష్ట్రపతిచే నియమితుడై, కేంద్ర ప్రతినిధిగా పనిచేస్తాడని, రాజ్యాంగబద్ధ అధిపతి మాత్రమేనని (నిజమైన అధికారం మంత్రిమండలిది) ఆరంభంలో రాయండి.
c) విచక్షణాధికారాలు (ముఖ్యమంత్రి ఎంపిక, శాసనసభ రద్దు, రాష్ట్రపతి పాలనకు సిఫారసు) విడిగా, వివరంగా రాస్తే అదనపు మార్కులు వస్తాయి.

 

Question 2: ముఖ్యమంత్రి అధికారాలు, విధులు వివరించండి.

Answer:

రాజ్యాంగం 164వ ప్రకరణను అనుసరించి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. సాధారణంగా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు.
అధికారాలు విధులు : ముఖ్యమంత్రి ఎన్నో అధికారాలను, విభిన్నమైన విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పరిశీలించవచ్చు.
1. మంత్రిమండలి ఏర్పాటు:
రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి స్వతంత్ర అధికారం, బాధ్యత. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలో కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేట్లు చూస్తాడు.
మంత్రుల శాఖలు కేటాయింపు, మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్కు సలహా ఇస్తాడు. ఎవరినైనా మంత్రిమండలి నుంచి తొలగించవలసిందిగా కూడా గవర్నర్కు సలహా ఇస్తాడు.
2. మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించడం:
ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి అధ్యక్షుడు. ఇతడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మంత్రిమండలి సమావేశాల అజెండాను నిర్ణయిస్తాడు. సమావేశాలలో చర్చలను ప్రారంభిస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు.
3. గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి:
గవర్నర్ – మంత్రిమండలి మధ్య ముఖ్యమంత్రి ప్రధానమైన వారధిగా ఉంటాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను తెలియపరచవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, రాష్ట్రశాసనాల ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలుపుతాడు. గవర్నర్కు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తాడు.
4. శాసనసభ నాయకుడు:
ముఖ్యమంత్రి శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ సభ్యుల నాయకుడిగా ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను ఇతడు శాసనసభలో తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలు మరింత సమర్థవంతంగాను, విజయవంతంగాను అమలయ్యేలా శాసనసభ్యుల మద్దతు కోరతాడు.
5. అధికార ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య విధానాలు, కార్యక్రమాలను ప్రకటిస్తాడు.
శాసనసభ సమావేశాలలోనూ, శాసనసభ వెలుపలా అతడు చేసే ప్రకటనలకు ఎంతో ప్రభావం, చట్టబద్ధత ఉంటాయి.
6. అధికారపార్టీ నాయకుడు:
రాష్ట్రంలో అధికారపార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. పార్టీ సమావేశాలలో అతను పాల్గొంటాడు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పార్టీ సభ్యులకు తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలను విజయవంతంగా, సమర్థవంతంగా అమలుచేయడానికి పార్టీ సభ్యుల సహకారం, మద్దతు కోరతాడు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేకూరుస్తాడు.

Exam Tips:

a) నియామకం (164వ అధికరణం) తో ఆరంభించి ఆరు పాత్రలను (మంత్రిమండలి ఏర్పాటు, అధ్యక్షత, గవర్నర్–మంత్రిమండలి వారధి, శాసనసభ నాయకుడు, అధికార ప్రతినిధి, పార్టీ నాయకుడు) శీర్షికలతో రాయండి.
b) ముఖ్యమంత్రిని "సమానులలో ప్రథముడు" (ప్రధానమంత్రి విషయంలో వాడే పదం) లాగా కాకుండా రాష్ట్ర పరిపాలనలో అసలైన కార్యనిర్వాహక అధిపతిగా పేర్కొనండి.

 

Question 3: రాష్ట్ర మంత్రిమండలి అధికారాలను తెలపండి.

Answer:

రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్ర మంత్రిమండలి అంతర్భాగం. మంత్రి మండలిలో ఒకటి లేదా అంతకుమించిన పార్టీలకు చెందిన శాసన సభ్యులు ఉండవచ్చు. వారందరూ సమిష్టిగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తారు.
నిర్మాణం:
రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, కేబినేట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ గవర్నర్చే నియమించబడతారు. రాష్ట్ర శాసనసభలో తన పార్టీకి చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నరు నివేదించి, వారిని మంత్రులుగా నియమించవలసిందిగా ముఖ్యమంత్రి గవర్నర్కు తగిన సూచనలిస్తాడు.
అధికారాలు – విధులు:
రాష్ట్ర మంత్రిమండలికి క్రింద పేర్కొన్న అధికారాలు విధులు ఉంటాయి.
1. రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన:
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి, ఖరారు చేసి అమలులో ఉండే బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్వహణ కోసం మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ సందర్భంలో మంత్రిమండలి సభ్యులు అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. ముఖ్యంగా కేబినెట్ మంత్రులు అనేక పర్యాయాలు సమావేశమై మొత్తం మంత్రిమండలి పేరుతో విధానపరమైన నిర్ణయాలు తీసుకొంటారు.
2. పరిపాలన నిర్వహణ:
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధి విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలు, చట్టాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన నిర్వహిస్తారు. ప్రతీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకు మించిన శాఖల పరిపాలనపై నియంత్రణను, బాధ్యతను కలిగి ఉంటాడు.
3. సమన్వయ విధి:
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య సమన్వయం సాధిస్తుంది. ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాఫీగా నిర్వహించటం సాధ్యంకాదు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలలో తీసుకొన్న నిర్ణయాలను మంత్రులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి, మద్దతునిస్తారు.
4. నియామక అధికారాలు:
రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులనందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది.
మంత్రిమండలి నియామకాలు జరిపే వారిలో అడ్వకేట్ జనరల్, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులు మొదలైనవి అనేకం ఉంటాయి.
5. శాసన నిర్మాణంలో పాత్ర:
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనకు సంబంధించిన విషయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వాస్తవానికి మంత్రిమండలే నిర్ణయిస్తుంది.
శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసననిర్మాణ విషయంలో కీలకమైన సంస్థగా కొనసాగుతుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు సలహాలిస్తుంది.

Exam Tips:

a) మొదట నిర్మాణం (ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు) తరువాత అధికారాలు అనే క్రమం పాటించండి.
b) సమిష్టి బాధ్యత (మంత్రిమండలి శాసనసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది) అనే సూత్రాన్ని ఒక వాక్యంలో ప్రస్తావిస్తే జవాబు నిండుగా ఉంటుంది.

 

Question 4: రాష్ట్ర శాసనమండలి నిర్మాణాన్ని వివరించండి.

Answer:

శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. ప్రస్తుతం కేవలం ఏడు రాష్ట్రాలలోనే శాసనమండలి ఉంది. అవి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్ము అండ్ కాశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు.
శాసనమండలి సభ్యత్వ సంఖ్య కనీసం 40 లేదా శాసనసభ సభ్యులలో 1/3 వంతు మించరాదు. శాసనమండలి ఏర్పాటు లేదా రద్దు. విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన సిఫారసును భారత పార్లమెంట్ ఆమోదిస్తుంది.
అర్హతలు : శాసనమండలి సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థి కింది అర్హతలు కలిగి ఉండాలి.
1. భారత పౌరుడై ఉండాలి.
2. 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
3. కాలానుగుణంగా పార్లమెంట్ చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయసభలలోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు.
కాలపరిమితి:
శాసనమండలి శాశ్వతసభ. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ప్రతీ సభ్యుడు ఆరు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు. ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు శాసనమండలి సమావేశమవ్వాలి. రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలల వ్యవధి మించరాదు.
నిర్మాణం : శాసనమండలికి ఎన్నికయ్యే సభ్యులు అయిదు విభిన్న రకాలుగా ఎన్నుకోబడతారు.
1. మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికలగణం ఎన్నుకొంటుంది.
2. మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకొంటారు.
3. మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం మూడేళ్ళపాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకొంటుంది.
4. మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకొంటుంది.
5. మిగిలిన సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తాడు. గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక, సేవారంగాలకు సంబంధించిన వారై ఉంటారు.
శాసనమండలి సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ప్రకారం ఒక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. సభా నిర్వహణ కోసం ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు ఉంటారు. శాసనమండలి సభ్యుల ద్వారా వీరు ఎన్నికవుతారు. శాసనసభ సభ్యులకున్న అధికారాలే శాసనమండలి సభ్యులకు ఉంటాయి.
శాసనమండలి అవిశ్వాస తీర్మానం ఆమోదించడం ద్వారా ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను పదవి నుంచి తొలగించవచ్చు. దీనిని సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది.

Exam Tips:

a) సభ్యుల ఎన్నిక పద్ధతిని 1/3, 1/3, 1/12, 1/12, మిగిలినవి గవర్నర్ నామినేషన్ అని భిన్నాలతో సహా సరిగా రాయండి – ఇవి పరీక్షలో తరచుగా అడిగే అంశాలు.
b) అర్హతలు (భారత పౌరుడు, 30 ఏళ్లు), పదవీకాలం (6 ఏళ్లు, ప్రతి 2 ఏళ్లకు 1/3 వంతు పదవీ విరమణ), శాశ్వత సభ అనే అంశాలను విడిగా రాయండి.

 

Question 5: రాష్ట్ర శాసనసభలపై ఒక నోట్ రాయండి.

Answer:

ప్రజాస్వామ్యయుతమైన శక్తిమంతమైన, ప్రజామోదం పొందిన శాసనసభ సభ్యులను రాష్ట్ర ప్రజలు ఎన్నుకొంటారు.
నిర్మాణం:
ప్రతీ రాష్ట్రానికి శాసనసభ ఉంటుంది. శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శాసనసభ సభ్యత్వం సంఖ్య 60-500 మధ్య ఉంటుంది. శాసనసభ సభ్యులను రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన ఓటర్లు ఎన్నుకొంటారు. శాసనసభ సభ్యత్వ సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది.
శాసనసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రతినిధులకు కేటాయించబడ్డాయి. ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారికి శాసనసభలో ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావిస్తే ఆ తెగకు చెందిన ఒకరిని నామినేట్ చేస్తాడు. అర్హతలు : శాసనసభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థికి కింది అర్హతలు ఉండాలి.
1. భారత పౌరుడై ఉండాలి.
2. 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
3. లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండరాదు.
4. కాలానుగుణంగా పార్లమెంట్ చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి.
ఒకే వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయసభలలోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు.
కాలపరిమితి:
లోకసభలాగా శాసనసభ కూడా శాశ్వతసభ కాదు. దీని సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఏ సమయంలోనైనా గవర్నర్ దీన్ని రద్దు చేయవచ్చు. 356 వ ప్రకరణం ఆధారంగా రాష్ట్రపతి శాసనసభను సస్పెన్షన్లో ఉంచడం లేదా రద్దు పరచడం చేయవచ్చు.
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో శాసనసభ కాలపరిమితిని పార్లమెంట్ చట్టం ద్వారా ఆరునెలలు పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ఆరునెలలలోపు శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ :
శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు ఇద్దరు ఎన్నుకోబడ్డ సభా నిర్వహణాధిపతులు ఉంటారు. ఒకరు స్పీకర్, మరొకరు డిప్యూటీ స్పీకర్. శాసనసభా నిర్వహణకు సంబంధించిన స్థానం, అధికారాలు, విధులు స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు ఒకే విధంగా ఉంటాయి.
వీరిని శాసనసభ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. అలాంటి తీర్మానాన్ని శాసనసభలో సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. ప్రతీ ఏటా శాసనసభ కనీసం రెండుసార్లు సమావేశమవుతుంది.
సమావేశాల మధ్య ఆరునెలలు మించిన వ్యవధి ఉండకూడదు.

Exam Tips:

a) శాసనసభ సభ్యుల సంఖ్య (60–500), కనీస వయస్సు (25 ఏళ్లు), కాలపరిమితి (5 ఏళ్లు) సంఖ్యలను సరిగ్గా రాయండి; శాసనమండలి (30 ఏళ్లు, శాశ్వతం)తో గందరగోళపడకండి.
b) స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, తొలగింపు, సమావేశాల మధ్య 6 నెలల వ్యవధి వంటి అంశాలను చివరలో చేర్చండి.

 

Question 6: హైకోర్టు యొక్క అధికారాలు మరియు విధులను వివరించండి.

Answer:

హైకోర్టు అధికారాలు, విధులు:
హైకోర్టు ఈ కింది అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
ప్రాథమిక అధికార పరిధి:
1. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన చట్టాలు, ఆదేశాలు, వివాహాలు, విడాకులు, కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు ప్రాథమిక అధికార పరిధిని కలిగి ఉంటుంది.
2. అధికరణ 226 ప్రకారం హైకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరి, కో-వారెంటో మరియు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై నిషేధపు ఉత్తర్వులు వాటి రిట్లను జారీచేసే అధికారం కలిగి ఉంటుంది.
3. పార్లమెంట్, శాసనసభల సభ్యుల ఎన్నికల వివాదాలను పరిష్కరించడం.
అప్పీళ్ళ అధికార పరిధి :
1. పౌర వివాదాలు:
జిల్లా కోర్టు లేదా కిందిస్థాయి కోర్టు యొక్క తీర్పుపై హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. 5,000 రూపాయలకు మించిన విలువగల కేసులను చట్టానికి సంబంధించిన కేసులను హైకోర్టు స్వీకరిస్తుంది.
2. క్రిమినల్ వివాదాలు:
సెషన్స్ కోర్టు ద్వారా 4 సంవత్సరాలకంటే ఎక్కువ శిక్ష పడిన కేసులు, పెద్ద శిక్షలను కలిగి ఉన్న అన్ని కేసులను హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. సెషన్ కోర్టు ద్వారా విధించబడ్డ మరణ శిక్ష హైకోర్టు ద్వారా ఆమోదించబడవలసి ఉంటుంది.
3. కోర్ట్ ఆఫ్ రికార్డ్ (Court of Record) :
హైకోర్టు యొక్క నిర్ణయాలు, తీర్పులు నమోదు చేయబడి భద్రపరచబడతాయి. న్యాయపరంగా ప్రామాణికంగా భావించబడతాయి.
4. ధృవీకరించే అధికారం (Power of Certification) :
చాలా కేసులలో హైకోర్టు తన తీర్పులపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి ఒక ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది.
5. న్యాయసమీక్షాధికారం (Judicial Review):
హైకోర్టుకు ఏ చట్టాన్నైనా, ఆర్డినెన్సునైనా పునఃపరిశీలించి దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకమైనదిగా ప్రకటించే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని సంరక్షించడానికి భారత న్యాయవ్యవస్థ న్యాయ సమీక్షాధికారాన్ని కలిగిఉంది.
ఇందుకోసమే కాకుండా ప్రభుత్వంలోని అన్ని అంగాలు రాజ్యాంగ అధికార పరిధి కింద పని చేస్తాయని హామీ ఇవ్వడం కూడా న్యాయ సమీక్షాధికారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రాథమిక హక్కులను ప్రత్యేకంగా ఆస్తిహక్కును కాపాడుతుంది.
6. పరిపాలన అధికారాలు (Administrative Functions) :
అధికరణ 227 ప్రకారం ప్రతీకోర్టు తన కింది కోర్టులను పర్యవేక్షించే అధికారం కలిగి ఉంది.
1. ఇది తన కింది కోర్టులో వ్యవహారాల్లో అనుసరించాల్సిన నియమాలను, వాటి విధానాలను తయారుచేసి క్రమబద్దం చేయవచ్చు.
2. తన కింది కోర్టులకు సంబంధించిన వివరాలను, సమాచారాన్ని తెప్పించుకోవచ్చు.
3. ఒక కేసుని ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకి బదిలీ చేయగలదు (అధికరణ 228) లేదా ఆ వివాదాన్ని తన వద్దకు బదిలీ చేయించుకుని తీర్పు ఇవ్వగలదు.
4. తన కింది న్యాయస్థానాలకు సంబంధించిన దస్త్రాలు, రికార్డులను పరిశోధించే పరిశీలించే అధికారం కలిగి ఉంది.
5. కింది కోర్టులో ఉద్యోగులను నియమించి, వారి వేతనం, ఇతర సదుపాయాలు, పని నియమాలను నిర్ణయించే అధికారం హైకోర్టుకి ఉంది.

Exam Tips:

a) హైకోర్టు అధికారాలను ప్రాథమిక, అప్పీళ్ల, కోర్ట్ ఆఫ్ రికార్డ్, న్యాయసమీక్ష, పరిపాలన అనే శీర్షికలుగా విభజించి రాయండి; 226వ అధికరణం కింద రిట్లు (ఐదు) ప్రత్యేకంగా పేర్కొనండి.
b) పర్యవేక్షణ అధికారం 227వ అధికరణం, కేసుల బదిలీ 228వ అధికరణం అని అధికరణం సంఖ్యలను తప్పక రాయండి.

 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ.

Answer:

రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ:
భారత రాజ్యాంగంలోని 153 నుంచి 167 వరకు ఉన్న 15 అధికరణాలు రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ గురించి పేర్కొన్నాయి. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో
1. గవర్నర్
2. ముఖ్యమంత్రి
3. రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు కొందరు ఉంటారు.

Exam Tips:

a) కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన అధికరణాలు 153–167 (గవర్నర్ 153 నుంచి) అని సంఖ్యలు ఇవ్వడం మర్చిపోకండి.
b) జవాబు చిన్నదే కాబట్టి మూడు అంగాలు (గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి) ఒక్కో పంక్తిలో ఇవ్వండి.

 

Question 2: గవర్నర్కు ఉన్న రెండు శాసనాధికారాలు.

Answer:

గవర్నర్కు రెండు శాసన నిర్మాణాధికారాలు. గవర్నర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం.
1. అతడు రాష్ట్ర శాసనసభ్యులను సమావేశపరుస్తాడు. వాయిదా వేస్తాడు, రాష్ట్ర శాసననిర్మాణ శాఖలోని విధాన సభను రద్దు చేస్తాడు.
2. విధాన సభలో స్వయంగా ప్రసంగిస్తాడు. లేదా తన సందేశాలను పంపుతాడు.
3. విధాన పరిషత్లోని ఆరోవంతు సభ్యులను నామినేట్ చేస్తాడు.

Exam Tips:

a) శాసనాధికారాలలో సమావేశపరచడం–వాయిదా–రద్దు, ప్రసంగం, శాసనమండలిలో 1/6 వంతు సభ్యుల నామినేషన్ అనే మూడు స్పష్టంగా రాయండి.
b) "1/6 వంతు" అనే భిన్నాన్ని శాసనమండలి ఎన్నికల 1/3, 1/12 లతో కలపకుండా జాగ్రత్తగా రాయండి.

 

Question 3: రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం.

Answer:

రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం:
రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, కొందరు కాబినెట్ హోదా ఉన్న మంత్రులు, స్టేట్ హోదా ఉన్న మంత్రులు ఉంటారు.
కొన్నిసార్లు దానిలో డిప్యూటీ మంత్రులు కూడా ఉంటారు.

Exam Tips:

a) ముఖ్యమంత్రి + కేబినెట్ హోదా మంత్రులు + రాష్ట్ర హోదా మంత్రులు (+ కొన్నిసార్లు ఉప మంత్రులు) అనే నాలుగు వర్గాలను సూటిగా రాస్తే చాలు.
b) ముఖ్యమంత్రి సహా మంత్రులందరినీ గవర్నర్ నియమిస్తాడని, వారు శాసనసభకు సమిష్టిగా బాధ్యులని ఒక వాక్యం చేర్చండి.

 

Question 4: గవర్నర్ విచక్షణాధికారాలు.

Answer:

గవర్నర్ విచక్షణాధికారాలు:
1. ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం.
2. రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం.
3. శాసన, పరిపాలనా సంబంధమైన అంశాలపై సమాచారం
అందించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం.
4. విధాన సభను రద్దు చేయడం మొదలైనవి.

Exam Tips:

a) విచక్షణాధికారాలు అంటే మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ స్వయంగా వాడగల అధికారాలు అని మొదట నిర్వచనం ఇచ్చి నాలుగు ఉదాహరణలు ఇవ్వండి.
b) రాష్ట్రపతి పాలనకు సిఫారసు (356వ అధికరణం) ను ఉదాహరణగా పేర్కొంటే ప్రత్యేక మార్కు వస్తుంది.

 

Question 5: ముఖ్యమంత్రి నియామకం.

Answer:

ముఖ్యమంత్రి నియామకం:
రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. విధాన సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. కొన్నిసార్లు విధానసభలో ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ లభించకపోతే, స్థిరత్వంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో గవర్నర్అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తాడు.
విధాన సభలో మిగిలిన పార్టీల శాసన సభ్యులతో సహా మెజారిటీ సభ్యుల మద్దతును పొందగలిగే పార్టీ లేదా పార్టీల నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తాడు.

Exam Tips:

a) 164వ అధికరణం, మెజారిటీ పార్టీ నాయకుడు అనే రెండు కీలక పదాలు తప్పక ఉండాలి; హంగ్ అసెంబ్లీ (ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు) గవర్నర్ పాత్రను కూడా రాయండి.
b) నియామకం గవర్నర్ చేస్తాడు కానీ వాస్తవానికి శాసనసభ విశ్వాసం పొందేవారినే నియమించాలి అనే విషయం చెప్పండి.

 

Question 6: శాసనసభ.

Answer:

శాసనసభనే రాష్ట్ర విధానసభ అని, అసెంబ్లీ అని, ప్రజాప్రతినిధుల సభ అని వ్యవహరిస్తారు. రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో దిగువ సభ విధానసభ, అందులో రాష్ట్రంలోని ఓటర్లచే ఎన్నుకోబడిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

Exam Tips:

a) శాసనసభకు ఉన్న ఇతర పేర్లు (విధానసభ, అసెంబ్లీ, ప్రజాప్రతినిధుల సభ), దిగువ సభ, ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నిక అనే మూడు అంశాలు రాస్తే సరిపోతుంది.
b) సభ్యుల కనీస వయస్సు 25 ఏళ్లు, కాలపరిమితి 5 ఏళ్లు అనే సంఖ్యలను జోడిస్తే జవాబు బలపడుతుంది.

 

Question 7: శాసనసభ మండలి (లేదా) విధాన పరిషత్తు.

Answer:

విధానపరిషత్తు లేదా శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో రెండోసభ లేదా ఎగువసభ. ప్రస్తుతం భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో విధానపరిషత్తులు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్ము & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు.
విధాన పరిషత్తు సభ్యత్వ సంఖ్యలో మూడోవంతు మించకూడదు. విధానపరిషత్తు ఏర్పాటు లేదా రద్దు విషయంలో భారత పార్లమెంటు తీర్మానం చేస్తుంది.

Exam Tips:

a) శాసనమండలిని ఎగువ సభ / రెండో సభ అని, శాశ్వత సభ అని, దాని ఏర్పాటు/రద్దుకు రాష్ట్ర శాసనసభ తీర్మానం + పార్లమెంటు చట్టం అవసరమని (169వ అధికరణం) రాయండి.
b) సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యులలో 1/3 వంతు మించకూడదు, కనీసం 40 అనే నియమం తప్పక పేర్కొనండి.

 

Question 8: శాసనసభ స్పీకర్.

Answer:

సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధాన సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకొంటారు. స్పీకరు పదవీకాలం 5 సంవత్సరములు. స్పీకర్ విధానసభ సభ్యుల హక్కులు, స్వేచ్ఛలకు సంరక్షకుడిగా వ్యవహరిస్తాడు. సభలో క్రమశిక్షణా చర్యలు అమలు అధికారం అతడికి ఉంటుంది.

Exam Tips:

a) స్పీకర్ ఎన్నిక (సభ్యుల ద్వారా), పదవీకాలం, సభా క్రమశిక్షణ, సభ్యుల హక్కుల రక్షణ అనే నాలుగు అంశాలు రాయండి.
b) స్పీకర్ పక్షపాతరహితంగా వ్యవహరించాలి అనే ప్రధాన సూత్రాన్ని చివరి వాక్యంగా రాస్తే బాగుంటుంది.

 

Question 9: హైకోర్టు నిర్మాణాన్ని తెలపండి.

Answer:

హైకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను కల్గి ఉంటుంది. రాజ్యాంగం రెండు సంవత్సరాలకు మించకుండా తాత్కాలిక న్యాయమూర్తులను నియమించడానికి వెసులుబాటు కల్పించింది. ఈ తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టులో అధికమైన పనిభారాన్ని నిర్వహించడానికి నియమించబడతారు.

Exam Tips:

a) హైకోర్టు = ప్రధాన న్యాయమూర్తి + ఇతర న్యాయమూర్తులు (+ గరిష్ఠంగా 2 ఏళ్ల వరకు తాత్కాలిక, అదనపు న్యాయమూర్తులు) అని సూత్రంలా రాయండి.
b) న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తాడని, నియామకం రాష్ట్రపతి చేస్తారని ఒక వాక్యం జోడించండి.

 

Free study material for Political Science

Political Science Class 12 Curriculum Solutions: Chapter 04 State Government

Accessing Chapter 04 State Government Solutions

Explore reliable textbook solutions for Chapter 04 State Government tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Political Science.

Concept-Driven Answers for Class 12 Political Science

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 04 State Government concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Political Science.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం is available for free on StudiesToday.com. These solutions for Class 12 Political Science are as per latest TS Board curriculum.

Are the Political Science TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Political Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Political Science. You can access TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం in both English and Hindi medium.

Is it possible to download the Political Science TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం in printable PDF format for offline study on any device.