TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

Download TS Board Solutions for Class 12 Commerce Chapter 07 Internal Trade

Access comprehensive textbook solutions for Chapter 07 Internal Trade using the official curriculum guides for Class 12 Commerce. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Access TS Board Solutions and Answers

Navigate directly to the solved Commerce textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

Question 1: వర్తకాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.

Answer:

వర్తకం:వస్తువులను, సేవలను, ద్రవ్యానికి లేదా ద్రవ్యసమానమైన విలువకు కొనడం, అమ్మడాన్ని “వర్తకం” అంటారు.
వర్తకం లక్షణాలు:
1. వర్తకం వాణిజ్యంలో ఒక భాగము.
2. వర్తకంలో వస్తు సేవలు ఉత్పత్తి దారుని నుండి తుది వినియోగదారునికి చేరే ప్రక్రియ ఉంటుంది.
3. వర్తకం వస్తుసేవల మారకం లేదా బదిలీతో సంబంధం కలిగి ఉంటుంది.
4. వర్తకాన్ని స్వదేశీ వర్తకం మరియు విదేశీ వర్తకంగా వర్గీకరించవచ్చు.
5. వర్తకం వినియోగదారుల జీవన ప్రమాణాన్ని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మెరుగుపరుస్తుంది.
6. వర్తకం వస్తువులకు స్థాన ప్రయోజనాన్ని కలిపిస్తుంది.

Exam Tips:

a) నిర్వచనం (వస్తుసేవలను ద్రవ్యానికి లేదా ద్రవ్యసమాన విలువకు కొనడం, అమ్మడం)తో ప్రారంభించి, లక్షణాలను 5–6 పాయింట్లుగా రాయండి; ‘వాణిజ్యంలో ఒక భాగం’ అనే పాయింట్ తప్పక ఉండాలి.
b) వర్తకం–వాణిజ్యం తేడాను గుర్తుంచుకోండి: వాణిజ్యంలో వర్తకంతో పాటు రవాణా, బ్యాంకింగ్, బీమా, గిడ్డంగి వంటి సహాయక సేవలు ఉంటాయి.

 

Question 2: ఉత్పత్తిదారులకు టోకు వర్తకుడు అందజేసే సేవలను పేర్కొనండి.

Answer:

ఉత్పత్తిదారునికి టోకు వర్తకుడు అందజేసే సేవలు:
1. భారీ స్థాయి ఉత్పత్తికి అవకాశమివ్వడం.
2. నష్టభయాన్ని పంచటం / బదిలీ చేయటం.
3. ముందు చెల్లింపులు చేయటం ద్వారా ఆర్థిక సహాయం.
4. మార్కెట్ స్థితిగతుల గురించి సలహాలివ్వటం.
5. స్థాన అవరోధాన్ని తొలగించటం.
6. అవిచ్ఛిన్న ఉత్పత్తికి దోహదపడటం.
7. పంపిణీ బాధ్యతను నిర్వర్తించటం, తద్వారా ఉత్పత్తిదారుని వస్తు ఉత్పత్తిపై దృష్టి ఉంచేటట్లు చూడటం.
8. గిడ్డంగిలో వస్తువులను నిల్వచేసే భారాన్ని తగ్గించటం.

Exam Tips:

a) ఈ ప్రశ్న ‘ఉత్పత్తిదారునికి’ ఇచ్చే సేవల గురించి; చిల్లర వర్తకునికి ఇచ్చే సేవలను కలపవద్దు. భారీ ఉత్పత్తికి అవకాశం, ఆర్థిక సహాయం, నష్టభయ బదిలీ, గిడ్డంగి భారం తగ్గింపు ముఖ్యమైనవి.
b) కనీసం 6–7 సేవలు రాసి, ప్రతి పాయింట్‌కు ఒక వాక్యంలో కారణం చెప్పండి.

 

Question 3: ఉత్పత్తిదారులకు చిల్లర వర్తకుడు అందజేసే సేవలేవి ?

Answer:

చిల్లర వర్తకుడు ఉత్పత్తిదారునికి అందించే సేవలు:
1. వస్తువుల కోసం ఒక సిద్ధంగా ఉన్న మార్కెట్ను తయారుచేయడం (ఏర్పాటుచేయడం).
2. ఉత్పత్తిదారునికి, మార్కెట్ పరిశోధనకర్తలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేయడం
3. నష్టభయాన్ని భరించడం/నష్ట భయాన్ని పంచడం.
4. వస్తువులకు వివిధ ప్రాంతాలకు, మార్కెట్లోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం.

Exam Tips:

a) చిల్లర వర్తకుడు ఉత్పత్తిదారునికి మార్కెట్ సమాచారం (వినియోగదారుల అభిరుచులు, డిమాండ్) అందించడం ముఖ్యమైన సేవ; దీన్ని తప్పక రాయండి.
b) వినియోగదారులకు ఇచ్చే సేవలు (త్వరిత సరఫరా, అరువు సౌకర్యం మొదలైనవి) ఈ ప్రశ్నకు వర్తించవు.

 

Question 4: సెజ్ (SEZ) ధ్యేయాలను పేర్కొనండి.

Answer:

1. సెజ్ అనగా “ప్రత్యేక ఆర్ధిక క్షేత్రాలు/ప్రత్యేక ఆర్ధిక మండలాలు.
2. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి “ప్రత్యేక” ఆర్థిక క్షేత్రాల SEZ భావన ప్రవేశపెట్టబడినది.
3. ఈ క్షేత్రాలలో వ్యాపార, వర్తక చట్టాలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. సెజ్ ధ్యేయాలు:
సెజ్ల ప్రధాన ధ్యేయాలు క్రింది పేర్కొన్న విధంగా ఉంటాయి.
1. అదనపు ఆర్థిక కార్యకలాపాల ఉత్పాదన.
2. వస్తువుల, సేవల ఎగుమతుల పెరుగుదల.
3. స్వదేశీ, విదేశీ మార్గాల ద్వారా పెట్టుబడిని ప్రోత్సహించటం.
4. ఉద్యోగ అవకాశాలను సృష్టించడం.
5. అవస్థాపనకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరచటం.

Exam Tips:

a) ‘SEZ’ పూర్తి రూపం (ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలు) రాసి, ఏర్పాటు ఉద్దేశం (విదేశీ పెట్టుబడులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం) చెప్పి ధ్యేయాలను జాబితాగా రాయండి.
b) ధ్యేయాలను (ఉద్యోగ కల్పన, ఎగుమతుల పెంపు, పెట్టుబడుల ప్రోత్సాహం, అవస్థాపన) ప్రయోజనాలతో కలపవద్దు.

 

Question 5: సెజ్ (SEZ) ప్రయోజనాలను వివరించండి.

Answer:

సెజ్ ప్రధానమైన ప్రయోజనాలు క్రింది విధంగా ఉంటాయి.
ఎ) ఉద్యోగాల కల్పన:సెజ్లు ఉద్యోగాలను సృష్టించడం కోసం అత్యధిక పటిష్టమైన సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.
బి) ఆర్థికాభివృద్ధి:సెజ్లను ఆర్థికాభివృద్ధికి సంబంధించిన యంత్రాలుగా చూడవచ్చు. సెజ్లను వాస్తవమైన స్ఫూర్తితో అమలు జరిపితే భారతదేశాన్ని ఒక రూపాంతరం చెందిన ఆర్థికవ్యవస్థగా చేయవచ్చు.
సి) శ్రామిక సాంద్రత గల ఉత్పత్తి పరిశ్రమ యొక్క పెరుగుదల:సెజ్ల స్థాపనతో, దేశంలో శ్రామికశక్తితో కూడుకున్న వస్తూత్పత్తి సేవా పరిశ్రమల వేగవంతమైన అభివృద్ధికి దారితీస్తుంది.
డి) సమతౌల్యమైన ప్రాంతీయాభివృద్ధి: సెజ్ల సహాయంతో సమతౌల్యమైన ప్రాంతీయ అభివృద్ధిని సాధించడానికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు రూపొందించబడ్డాయి.
ఇ) సామర్థ్యాన్ని పెంపొందించటం:దృఢమైన సామర్థ్య పెంపుదలకు సెజ్లు ప్రధానమైనవిగా ఉంటాయి, ఎఫ్) ఎగుమతి నిర్వహణ:ఒక దేశం ఎగుమతి నిర్వహణలో సుంకాలు, ఇతర వర్తక అవరోధాల ద్వారా, కార్పొరేట్ పన్ను విధానం మితిమీరిన ఉద్యోగిస్వామ్యం ద్వారా ఎదురయ్యే వికృత మార్పులను తొలగించడానికి, సెజ్లు క్రియాశీలతను ప్రేరేపిస్తాయి.

Exam Tips:

a) ప్రయోజనాలను ఎ, బి, సి శీర్షికలతో (ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి, సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి, ఎగుమతి నిర్వహణ...) రాస్తే పరీక్షకునికి స్పష్టంగా కనిపిస్తుంది.
b) ప్రతి శీర్షిక కింద ‘ఎందుకు ప్రయోజనం’ అనేది ఒక వాక్యంలో వివరించండి.

 

Question 6: విభాగ విక్రయశాలల ప్రయోజనాలు, నష్టాలను రాయండి.

Answer:

విభాగ విక్రయశాలలు, అనగా ఒక యాజమాన్యం క్రింద అనేక విభాగాలను కలిగి ఉన్న ఒక పెద్ద తరహా చిల్లర వర్తక వ్యవస్థగా చెప్పవచ్చు. ప్రతీ విభాగం, ఒక ప్రత్యేక లేదా ఒక శ్రేణి గల వస్తువులతో ప్రావీణ్యత సాధించిన వాటిని విక్రయిస్తుంది. విభాగ విక్రయశాలలకు క్రింది ప్రయోజనాలు, లోపాలు ఉంటాయి.
ప్రయోజనాలు
1. ఇది ఒక కేంద్రీయ స్థానంలో ఏర్పాటు చేయబడి వినియోగదారునికి అందుబాటులో ఉంటాయి.
2. ఇది వివిధ రకాలైన వస్తువులను ఒకే యాజమాన్యం క్రింద ప్రత్యేకత సాధించిన రీతిలో విక్రయిస్తుంది. ఆ ప్రకారంగా ఇది కొనుగోలు దారుకు అనుకూలంగా ఉంటుంది.
3. ఇది భారీస్థాయి పంపిణీ ఆదాలను పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
4. ఇది మధ్యవర్తులను తొలగించడానికి సహాయపడుతుంది.
లోపాలు/నష్టాలు.
1. విభాగ విక్రయశాలల నిర్వహణ వ్యయాలు అధికంగా ఉంటాయి.
2. విక్రయశాలల పరిమాణం పెద్దిగా ఉన్న కారణంగా కొన్ని సమయాలలో ఆయా విభాగాలకు వ్యక్తిగత దృష్టిని ఆకర్షించడానికి కష్టతరమవుతుంది.
3. భారీ స్థాపన ఖర్చులు, భారీ నిర్వహణ మూలధన అవసరాల వల్ల సాధారణంగా ధరలు అధికంగా ఉంటాయి.
4. దీనికి భారీ మూలధనం అవసరమవుతుంది. సాధారణంగా విభాగ విక్రయశాలలు సుదూరమైన ఆడంబర ప్రదేశాలలో నెలకొల్పారు. దాని వల్ల మధ్య తరగతి గృహాలున్న ప్రదేశాలలో నివసించే వ్యక్తులు, ఈ విక్రయశాలలను చేరుకోవటం కష్టతరం కావచ్చు.

Exam Tips:

a) మొదట అర్థం (ఒకే యాజమాన్యం కింద అనేక విభాగాలు ఉన్న పెద్ద తరహా చిల్లర సంస్థ) రాసి, తర్వాత ప్రయోజనాలు, నష్టాలను వేర్వేరు శీర్షికలతో రాయండి.
b) ప్రయోజనాలు, నష్టాలను సమాన సంఖ్యలో (4–4) రాయండి; అధిక ధరలు, భారీ మూలధనం ముఖ్య నష్టాలు.

 

Question 7: బహుళ విక్రయశాలల ప్రయోజనాలు, నష్టాలు ఏవి ?

Answer:

ఒక నిర్ధిష్టమైన ప్రదేశం లేదా పట్టణం లేదా నగరం యొక్క వివిధ ప్రాంతాలలో ప్రామాణీకృత వస్తువులను విక్రయించే ఒకే రకమైన దుకాణాలను, బహుళ విక్రయశాలలంటారు. బహుళ విక్రయశాలలకు కొన్ని ఉదాహరణలుగా బాస్కిన్ రాబిన్స్, బాంబే డైయింగ్‌ను చెప్పవచ్చు. బహుళ విక్రయశాలలు క్రింది ప్రయోజనాలు, లోపాలు కలిగి ఉంటాయి.
I ప్రయోజనాలు
1. ఇవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి.
2. ఇవి ప్రామాణీకృత వస్తువులను విక్రయిస్తాయి.
3. ఖాతాదారులు ఈ సంస్థల పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే, ఇవి ఎక్కడయినా, ఒకే రకమైన సంస్థలుగా నిర్వహించబడతాయి.
4. ఇవి మధ్యవర్తులను తొలగించడానికి సహాయపడతాయి.
5. ఇవి శ్రమ విభజన చేయడంలో, ప్రత్యేకీకరణ సాధించే విషయంలో సహాయపడతాయి.
II లోపాలు
1. వీటి నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయి.
2. ఇవి పరిమిత రకాలైన వస్తువులను విక్రయిస్తాయి.
3. వీటికి నిల్వచేసే సౌకర్యాలు ఉండవు. వీటికి భారీ మూలధనం అవసరమవుతుంది.
4. బహుళ విక్రయ శాలల నిర్వాహణకు భారీ మూలధనం అవసరం అవుతుంది.

Exam Tips:

a) ‘ఒకే రకమైన ప్రామాణిక వస్తువులు, వివిధ ప్రాంతాల్లో అనేక శాఖలు’ అనే నిర్వచనం ముఖ్యం.
b) విభాగ విక్రయశాలతో తేడా గుర్తుంచుకోండి: విభాగ విక్రయశాల ఒకే చోట అనేక విభాగాలు; బహుళ విక్రయశాలలు అనేక చోట్ల ఒకే రకం దుకాణాలు.

 

Question 8: పోస్టు ద్వారా వర్తకం లాభనష్టాలు ఏమిటో తెలపండి.

Answer:

పోస్టు ద్వారా వర్తకం ప్రయోజనాలు/లాభాలు:
1. దీనికి అవసరమయ్యే మూలధనం సాపేక్షికంగా తక్కువగా ఉంటుంది.
2. వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం రెండింటిలో అనుకూలత ఉంటుంది.
3. వస్తువులు సరసమైన ధరలతో లభ్యమవుతాయి.
4. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
5. ఈ వర్తకంలో మధ్యవర్తులను తొలగించడం జరుగుతుంది.
పోస్టు ద్వారా వర్తకం లోపాలు/నష్టాలు:
1. ఇది కొనుగోలుదారును సంతృప్తిపరచడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే, కొనుగోలుదారుడు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే, వస్తువులను పరిశీలించే వీలుంటుంది.
2. వీటికి సమర్థవంతమైన నిర్వహణ లోపిస్తుంది.
3. వీటికి నిల్వచేసే సౌకర్యం లోపిస్తుంది.
4. ఎలక్ట్రానిక్ చిల్లర వర్తకం, ఎలక్ట్రానిక్ వాణిజ్యం పోస్టు ద్వారా చేసే చిల్లర వ్యాపారాన్ని అధిగమించింది.

Exam Tips:

a) పోస్టు ద్వారా వర్తకంలో కొనుగోలుదారు వస్తువును చూడకుండానే ఆర్డరు ఇస్తాడు; అందువల్ల అతన్ని సంతృప్తిపరచడం కష్టం అనేది ప్రధాన నష్టంగా రాయండి.
b) లాభాలు (తక్కువ మూలధనం, తక్కువ నిర్వహణ ఖర్చు, మధ్యవర్తుల తొలగింపు), నష్టాలను వేర్వేరు శీర్షికల కింద ఇవ్వండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: టోకు వర్తకుడు చిల్లర వర్తకునికి అందించే సేవలు ఏమిటి ?

Answer:

చిల్లర వర్తకునికి అందించే సేవలు:
1. సమయానుకూలంగా వస్తువులు లభ్యమయ్యేటట్లు చూడటం.
2. క్రయవిక్రయాలు జరపడానికి మద్దతు ఇవ్వడం.
3. అరువు (రుణ) సౌకర్యాలను అనుమతించడం.
4. వస్తువులకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని అందించడం.
5. నష్టభయాన్ని చేపడుతూ, నష్ట భయాన్ని పంచిపెట్టడం.

Exam Tips:

a) చిల్లర వర్తకునికి సేవలు: సమయానికి సరఫరా, అరువు సౌకర్యం, నష్టభయ పంపిణీ, ప్రత్యేక పరిజ్ఞానం, క్రయవిక్రయాలకు మద్దతు.
b) ఉత్పత్తిదారునికి ఇచ్చే సేవలతో కలిపి గందరగోళం చేయకండి.

 

Question 2: వర్తకంను ఎలా వర్గీకరించవచ్చు ?

Answer:

1. ద్రవ్యానికి లేదా ద్రవ్యానికి సమానమైన విలువతో వస్తువులను, సేవలను కొనడం, అమ్మకం చేయడాన్ని “వర్తకం” అంటారు.
2. భౌగోళిక సరిహద్దుల ఆధారంగా వర్తకాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
a) స్వదేశీ వర్తకం/అంతర్గత వర్తకం
b) విదేశీ వర్తకం/అంతర్జాతీయ వర్తకం..
3. ఒకేదేశ భౌగోళిక సరిహద్దులలో నిర్వహించే వర్తకాన్ని స్వదేశీ వర్తకం అంటారు. స్వదేశీ వర్తకాన్ని మళ్ళీ a) టోకు వర్తకం మరియు b) చిల్లర వర్తకంగా విభజించవచ్చు.
4. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య కొనుగోలు, అమ్మకాలు జరిగితే దానిని విదేశీ వర్తకం అంటారు. విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా
వర్గీకరించవచ్చు. అవి:
1. ఎగుమతి వర్తకం
2. దిగుమతి వర్తకం
3. మారు వర్తకం.
వర్తకం వర్గీకరణ చార్టు:
1. స్వదేశీ వర్తకం (అంతర్గత వర్తకం): టోకు వర్తకం, చిల్లర వర్తకం
2. విదేశీ వర్తకం (అంతర్జాతీయ వర్తకం): ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, మారు వర్తకం

Exam Tips:

a) వర్గీకరణ చార్టు (వర్తకం → స్వదేశీ/విదేశీ → టోకు, చిల్లర / ఎగుమతి, దిగుమతి, మారు) గీస్తే అదనపు మార్కులు వస్తాయి.
b) ‘భౌగోళిక సరిహద్దుల ఆధారంగా’ వర్గీకరణ అని తప్పక పేర్కొనండి.

 

Question 3: చిల్లర వర్తకుడు వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాడు ?

Answer:

వినియోగదారులకు అందించే సేవలు:
1. వస్తువులను త్వరితంగా, సమయానికి సప్లయి చేయడం.
2. వస్తువులను విస్తృతమైన రకాలలో లభ్యమయ్యేటట్లు చూడటం.
3. ఖాతాదారులకు నిపుణతతో కూడుకొన్న మార్గదర్శకత్వాన్ని అందించడం.
4. వినియోగదారులకు ముఖాముఖి సంభాషణతో పాటు, వస్తు ప్రదర్శన ఏర్పాటు చేయడం.
5. విక్రయానంతర సేవ గృహం వద్ద బట్వాడా.
6. అనువైన మొత్తాలలో లేదా పరిమాణాలలో వస్తువులను సప్లయి చేయడం.
7. అనుకూలమైన స్థానం/ప్రాంతంలో ఏర్పాటవడం.
8. అరువు (రుణ) సౌకర్యాలను అనుమతించడం.

Exam Tips:

a) 8 సేవల్లో కనీసం 5 రాయండి: త్వరిత సరఫరా, వివిధ రకాల వస్తువులు, నిపుణ మార్గదర్శకత్వం, విక్రయానంతర సేవ, అరువు సౌకర్యం.
b) వినియోగదారునితో ప్రత్యక్ష సంబంధం ఉండటమే చిల్లర వర్తకుని ప్రత్యేకత; దీన్ని ప్రస్తావించండి.

 

Question 4: స్వదేశీ వర్తకం లక్షణాలు ఏమిటి ?

Answer:

అంతర్గత వర్తకానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి:
1. ఒక దేశపు సరిహద్దులలో వస్తువుల కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతాయి.
2. స్వదేశంలోగల కొనుగోలుదారు వస్తు ధర చెల్లింపును అమ్మకందారుకు స్వదేశీ ద్రవ్య రూపంలో జరుపుతాడు.
3. వర్తకుడు కొన్ని లాంఛనాలను (నియమాలను) మాత్రమే పూర్తిచేయాల్సిన ఆవశ్యకతతో ఉంటాడు.
4. వస్తువు లక్షణాలపై ఖాతాదారులకు పూర్తి అవగాహన ఉంటుంది.
5. విస్తృతంగా విస్తరించబడి ఉన్న స్థానికత సాధించిన స్వదేశీ మార్కెట్ల నుంచి, వస్తు డిమాండులో సంభవించే మార్పుల కారణంగా, నష్టభయం అధికంగా ఉంటుంది.
6. విదేశీ వర్తకంతో సరిపోల్చినప్పుడు, దేశ రాజకీయ, న్యాయాత్మక, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక పరిసరాల ప్రభావం తక్కువగా ఉంటుంది.
7. స్వదేశీ వినియోగదారుల అవసరాల ప్రకారం వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. కొనుగోలుదారుల వద్ద నుంచి నిర్దిష్టమైన సలహాలను స్వీకరించరు.
8. స్వదేశీ రవాణా పద్ధతిని మాత్రమే ఉపయోగిస్తూ, వస్తువు ఉత్పత్తయ్యే స్థానం నుంచి, వినియోగించబడే స్థానం వరకు, వస్తు ప్రవాహాన్ని కల్పించడం.

Exam Tips:

a) స్వదేశీ ద్రవ్యంలో చెల్లింపు, తక్కువ లాంఛనాలు, దేశ సరిహద్దుల్లోనే వర్తకం – ఈ మూడు లక్షణాలు తప్పక రాయండి.
b) విదేశీ వర్తకంతో పోల్చి (రాజకీయ, న్యాయ, సాంస్కృతిక పరిసరాల ప్రభావం తక్కువ) రాస్తే స్పష్టత పెరుగుతుంది.

 

Question 5: సంచార వర్తకులు అంటే ఎవరు ?

Answer:

1. వస్తువుల విక్రయానికి ఎలాంటి స్థిరమైన ప్రదేశం లేని చిల్లర వర్తకులను “సంచార చిల్లర వర్తకులు” అంటారు.
2. సంచార వర్తకులకు ఉదాహరణ:వీధి విక్రయదారులు, వీధి దుకాణాలు, నియత కాలిక సంచారకులు, చౌకధరల విక్రయదారులు.
3. వివిధ రకాల సంచార చిల్లర వర్తకులను కింద వివరించడమైనది.
A) వీధి విక్రయదారులు:ఈ రకపు సంచార వర్తకులు తమ ఖాతాదారులను వెతికే ఉద్దేశంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతారు. వీరు సాధారణంగా స్వల్పవెల కలిగిన వస్తువులను అమ్ముతారు.
B)నియత కాలిక సంచారకులు:నియత కాలిక సంచారకులు క్రమబద్ధంగా లభ్యమయ్యే వస్తువులతో కొన్ని సందర్భాలకు అనుకూలించే వస్తువులతో వ్యాపారం సాగిస్తారు. దీనిని స్థానిక పరిభాషలో “సంత” లేదా “వారానికొకసారి జరిపే మార్కెట్” అంటారు.
C) వీధి దుకాణాలు:పట్టణ ప్రాంతాలలో వీధి వర్తకులు తమ వస్తువులను కాలి బాటలపై వివిధ ప్రాంతాల వీధి మూలలో ప్రదర్శనకు ఉంచుతారు. వీరు సాధారణంగా తమ వ్యాపారాన్ని రైల్వేస్టేషన్, ఫుట్పాత్, వీధి మూలభాగాలు, తదితర సార్వజనీన ప్రదేశాల దగ్గర నిర్వహిస్తారు.
D) చౌక ధర విక్రయదారులు:చౌక ధర విక్రయదారులు, ఒక నిర్ధిష్టమైన కాలానికి సంబంధించి, అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల నుంచి, తమ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో తమ వర్తకం సక్రమంగా జరగడం లేదని భావించిన వెంటనే మరొక ప్రాంతానికి తరలి వెళ్ళిపోతారు.

Exam Tips:

a) నిర్వచనంలో ‘స్థిరమైన విక్రయ ప్రదేశం లేకపోవడం’ ప్రధాన పదం.
b) నాలుగు రకాలను (వీధి విక్రయదారులు, నియత కాలిక సంచారకులు, వీధి దుకాణాలు, చౌకధర విక్రయదారులు) ఒక్కొక్కదానికి ఒక వాక్యం వివరణతో రాయండి.

 

Question 6: వినియోగదారుల సహకార విక్రయశాలల లాభనష్టాలు ఏమిటి ?

Answer:

వినియోగదారుల సహకార విక్రయశాలలు:
1. కొనడానికి, అమ్మడానికి, సహకార సూత్రాలపై ఆధారపడి ఏర్పడిన, ఒక ఐచ్ఛికమైన వ్యక్తుల సముదాయాన్ని ఒక వినియోగదారుల సహకార విక్రయశాలగా” నిర్వచించవచ్చు.
2. వినియోగదారుల సహకార విక్రయశాల కింద పేర్కొన్న ప్రయోజనాలను, లోపాలను, కలిగి ఉంటుంది.
I. ప్రయోజనాలు / లాభాలు:
1. వీటిలో అవసరమయ్యే మూలధనం సాపేక్షికంగా తక్కువగా ఉంటుంది.
2. విక్రయశాలలో కొనడం, అమ్మడం, రెండింటిలో కూడా అనుకూలత ఉంటుంది.
3. వీటిలో వస్తువులు సరసమైన ధరలకు లభ్యమవుతాయి.
4. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
5. విక్రయశాలల నుంచి మధ్యవర్తులను తొలగించడం జరుగుతుంది.
6. వీటి ద్వారా పెద్ద తరహా పంపిణీ యొక్క ఆదాలు లభ్యమవుతాయి.
7. సహకార సంఘాలు ప్రభుత్వం నుంచి కొన్ని లాభాలను ప్రోత్సాహకాలను అనుభవిస్తాయి.
II. లోపాలు/నష్టాలు:
1. వీటిలో మూలధనం పరిమితంగా ఉంటుంది.
2. వీటిలో సమర్థవంతమైన నిర్వహణ లోపిస్తుంది.
3. వీటికి నిల్వ చేసే సౌకర్యం లోపిస్తుంది.

Exam Tips:

a) సహకార సూత్రాల ఆధారంగా ఏర్పడిన స్వచ్ఛంద వ్యక్తుల సముదాయం అని నిర్వచించి, లాభాలు, నష్టాలను వేర్వేరుగా రాయండి.
b) తక్కువ నిర్వహణ ఖర్చు, మధ్యవర్తుల తొలగింపు ముఖ్య లాభాలు; పరిమిత మూలధనం, నిల్వ సౌకర్యం లోపం ముఖ్య నష్టాలు.

 

Question 7: SEZ ల ద్వారా కవర్ చేయబడే జోన్లు ఏమిటి ?

Answer:

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి ‘ప్రత్యేక ఆర్థిక క్షేత్రాల’ భావన ప్రవేశ పెట్టబడింది. ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలకు సంబంధించిన చట్టాలు, ప్రోత్సాహకాలను రాష్ట్రాలు కాలానుగుణంగా ప్రకటించాయి.
సెజ్ల కింద ఉండే మండలాలు/జోన్లు:
1. ఉచిత వర్తక మండలాలు
2. ఎగుమతుల ప్రోసెసింగ్ క్షేత్రాలు
3. స్వతంత్ర క్షేత్రాలు
4. పారిశ్రామిక సముదాయాలు
5. స్వేచ్ఛాపూర్వక ఓడరేవులు
6. పట్టణ సంస్థల క్షేత్రాలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది రంగాలకు సంబంధించి 29 SEZ లు ఉన్నాయి:
1. బయోటెక్నాలజి
2. సమాచార, సాంకేతిక ఆధార సేవలు
3. ఔషధ సూత్రీకలు
4. ఏరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్
5. ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్.

Exam Tips:

a) ఆరు రకాల మండలాలను (ఉచిత వర్తక మండలాలు, ఎగుమతుల ప్రోసెసింగ్ క్షేత్రాలు మొదలైనవి) జాబితాగా రాయండి.
b) తెలంగాణలోని రంగాలను (బయోటెక్నాలజీ, ఐటీ, ఔషధాలు...) ఉదాహరణగా చేర్చండి; సెజ్‌ల సంఖ్యను మీ పాఠ్యపుస్తకంలో ఉన్నట్లే రాయండి.

 

అదనపు సమాధాన ప్రశ్నలు

Question 1: అంతర్జాతీయ వర్తకం (విదేశీ వర్తకం).

Answer:

అంతర్జాతీయ/విదేశీ వర్తకం:
1. రెండు లేదా అంతకుమించిన దేశాల వర్తకుల మధ్య కొనుగోలు, అమ్మకం జరపడాన్ని అంతర్జాతీయ వర్తకం అంటారు. “విదేశీ వర్తకం” అని కూడా పిలువవచ్చు.
2. విదేశీ వర్తకాన్ని మళ్లీ ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, మారు వర్తకంగా ఉపవిభజన చేయవచ్చు.
ఎ) ఎగుమతి వర్తకం:
1. ఒక నిర్దిష్టమైన దేశానికి చెందిన అంటే స్వదేశానికి చెందిన ఒక వర్తకుడు తన వస్తువులను మరొక దేశంలో నివసిస్తున్న ఒక వర్తకునికి లేదా ఒక ఖాతాదారునికి అమ్మినప్పుడు, దానినే ‘ఎగుమతి వర్తకం’ అని అంటారు.
2. ఉదా: భారతదేశానికి చెందిన ఒక వర్తకుడు తన వస్తువులను, ఇరాన్ లోని ఒక ఖాతాదారుకు విక్రయించడం.
బి) దిగుమతి వర్తకం:
1. ఒక వర్తకుడు స్వదేశంలో తన వర్తకాన్ని నిర్వహిస్తూ, మరొక దేశంలో నివసిస్తున్న ఒక వర్తకుని వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేయడాన్ని, దానినే ‘దిగుమతి వర్తకం’ అని అంటారు.
2. ఉదా:భారతదేశం నుంచి ఒక వర్తకుడు సింగపూర్కు చెందిన ఒక వర్తకుని వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేయడం.
సి) మారు వర్తకం:
1. ఒక దేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను వేరే దేశానికి ఎగుమతి చేయడాన్ని మారు వర్తకం అంటారు.

Exam Tips:

a) ఎగుమతి, దిగుమతి, మారు వర్తకం – మూడింటినీ రాయాలి; ఏదైనా వదిలేస్తే మార్కులు తగ్గుతాయి.
b) ప్రతి దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి (ఉదా: భారత వర్తకుడు ఇరాన్‌లోని ఖాతాదారుకు అమ్మడం – ఎగుమతి).

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: అంతర్గత (స్వదేశీ) వర్తకం.

Answer:

1. ఒక నిర్దిష్టమైన దేశ భౌగోళిక సరిహద్దులోపల నిర్వహించే వర్తకాన్ని అంతర్గత వర్తకం అంటారు. దీనినే “స్వదేశీ వర్తకం” అని కూడా అంటారు.
2. అంతర్గత వర్తకాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.’ అవి: A) టోకు వర్తకం B) చిల్లర వర్తకం.

Exam Tips:

a) నిర్వచనం (ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో వర్తకం) + రెండు రకాలు (టోకు, చిల్లర) – మూడు నాలుగు వాక్యాల్లో ముగించండి.

 

Question 2: టోకు వర్తకం.

Answer:

1. వస్తువులను అధిక పరిమాణంలో కొనుగోలు చేసి చిన్న పరిమాణాలలో చిల్లర వర్తకులకు అమ్మడాన్ని టోకు వర్తకం అంటారు.
2. టోకు వర్తకుడు ఉత్పత్తిదారునికి, చిల్లర వర్తకునికి మధ్య వారధిగా ఉంటాడు,

Exam Tips:

a) ‘అధిక పరిమాణంలో కొని, చిన్న పరిమాణాల్లో చిల్లర వర్తకులకు అమ్మడం’ అనే వాక్యం కీలకం.
b) ఉత్పత్తిదారునికి, చిల్లర వర్తకునికి మధ్య వారధి అని రాయండి.

 

Question 3: చిల్లర వర్తకం.

Answer:

1. టోకు వర్తకుని నుండి వస్తువులను కొనుగోలుచేసి అతిస్వల్ప పరిమాణాలలో తుది వినియోగదారులకు అమ్మడాన్ని చిల్లర వర్తకం అంటారు.
2. చిల్లర వర్తకుడు టోకు వర్తకునికి, వినియోగదారునికి మధ్యగా ఉంటాడు.

Exam Tips:

a) తుది వినియోగదారులకు అతి స్వల్ప పరిమాణంలో అమ్మడం అని నిర్వచించండి.
b) టోకు వర్తకంతో తేడా: టోకు వర్తకుడు చిల్లర వర్తకులకు, చిల్లర వర్తకుడు వినియోగదారులకు అమ్ముతాడు.

 

Question 4: సంచార వర్తకులు.

Answer:

1. వస్తువుల విక్రయానికి ఎలాంటి స్థిర ప్రదేశంలేని చిల్లర వర్తకులను “సంచార చిల్లర వర్తకులు” అంటారు.
2. వివిధ రకాల సంచార వర్తకులు:వీధి విక్రయాదారులు, వీధి దుకాణాలు, నియతకాలిక సంచారకులు, చౌక ధర విక్రయాలు.

Exam Tips:

a) స్థిర ప్రదేశం లేకపోవడం ప్రధాన లక్షణం; నాలుగు రకాల పేర్లను తప్పక రాయండి.

 

Question 5: వీధుల వెంట తిరిగి అమ్మే వ్యక్తులు (వీధి విక్రయదారులు).

Answer:

వీధి విక్రయదారులు:
1. ఈ రకపు సంచార వర్తకులు తమ ఖాతాదారులను వెతికే ఉద్దేశంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతారు.
2. ఈ వీధుల వెంట తిరిగి విక్రయించే వ్యక్తుల ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి:
a) వారు కూరగాయలు, రకరకాల ఆట బొమ్మలు, పూవులు మొదలైన స్వల్ప వెల కలిగిన వస్తువులను అమ్ముతారు.
b) వారు సాధారణంగా వ్యాపార చిహ్నం (గుర్తింపు) లేదా స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులను విక్రయిస్తారు.

Exam Tips:

a) ఖాతాదారులను వెతుక్కుంటూ తిరగడం, తక్కువ వెల వస్తువులు (కూరగాయలు, బొమ్మలు, పూలు) అమ్మడం – ఈ రెండు పాయింట్లకు ఉదాహరణలు ఇవ్వండి.

 

Question 6: నియత కాలిక సంచారకులు.

Answer:

నియత కాలిక సంచారకులు:
1) నియతకాలిక సంచారకులు క్రమబద్ధంగా లభ్యమయ్యే వస్తువులతో, కొన్ని సందర్భాలకు అనుకూలించే వస్తువులతో వ్యాపారం సాగిస్తారు. స్థానిక పరిభాషలో, దీన్ని ‘సంత’ లేదా “వారానికొకసారి జరిపే మార్కెట్” అంటారు.
2) ఈ నియతకాలిక సంచార వర్తకుల లక్షణాలు కింది విధంగా ఉంటాయి:
వారు సాధారణంగా తమ వస్తువులను వివిధ మార్కెట్లో వారంలో ఒకరోజు చొప్పున విక్రయిస్తారు.
వారు దీపావళి సందర్భంగా మట్టితో తయారు చేసే వస్తువులు, సంక్రాంతి సమయంలో గాలి పటాలు మొదలైన సందర్భాలలో వినియోగించే వస్తువులను అమ్మడానికి కూడా దుకాణాలను స్థాపిస్తారు.

Exam Tips:

a) ‘సంత’ లేదా ‘వారానికొకసారి జరిగే మార్కెట్’ అనే స్థానిక పదాన్ని తప్పక రాయండి.
b) పండుగ ఉదాహరణలు (దీపావళి సమయంలో మట్టి వస్తువులు, సంక్రాంతికి గాలిపటాలు) మార్కులు తెస్తాయి.

 

Question 7: వీధి విక్రయశాలలు.

Answer:

1. ఈ రకపు చిల్లర వర్తకులు తమ వస్తువులను బల్లపై ప్రదర్శించడం లేదా గుడారాల కింద ఉంచుతారు. కాబట్టి వీటిని ‘వీధి విక్రయశాలలుగా’ పిలుస్తారు.
2. ఈ వీధి విక్రయశాలల లక్షణాలు కింది విధంగా ఉంటాయి:
ఈ దుకాణాలను పరిమిత స్థలంలో ఏర్పాటు చేస్తారు.
ఇవి తమ వస్తువులను ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో లేదా బల్లపై ప్రదర్శిస్తారు.

Exam Tips:

a) బల్లపై లేదా గుడారం కింద వస్తువులు ప్రదర్శించడం, పరిమిత స్థలంలో దుకాణం ఏర్పాటు – ఈ రెండు పాయింట్లు రాయండి.

 

Question 8: చౌకధర విక్రయదారులు.

Answer:

1. చౌకధర విక్రయదారులు, ఒక నిర్దిష్టమైన కాలానికి సంబంధించి, అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల నుంచి, తమ వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
2. ఈ రకపు సంచార వర్తకం లక్షణాలు ఈ ప్రకారంగా ఉంటాయి.
వారు తమ వర్తకాన్ని అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల ద్వారా నిర్వహిస్తారు.
ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో తమ వర్తకం సక్రమంగా జరగడం లేదని భావించిన వెంటనే మరొక ప్రాంతానికి తరలి వెళ్లిపోతారు.

Exam Tips:

a) అద్దె దుకాణాలు, నిర్ణీత కాలం, వ్యాపారం సరిగా జరగకపోతే వేరే ప్రాంతానికి మారిపోవడం – ప్రధాన లక్షణాలు.

 

Question 9: స్థిర దుకాణా చిల్లర వర్తకులు.

Answer:

1. వస్తు విక్రయానికి సంబంధించి ఒక స్థిరమైన ప్రదేశం కలిగి ఉన్న చిల్లర వర్తకులను ‘స్థిర దుకాణ చిల్లర వర్తకులు’గా చెప్పవచ్చు.
2. వారిని మళ్ళీ “చిన్న తరహా స్థిర చిల్లర స్థాయి దుకాణాలు, “పెద్ద తరహా స్థిర దుకాణాలు” గా వర్గీకరించవచ్చు.

Exam Tips:

a) చిన్న తరహా, పెద్ద తరహా అనే రెండు వర్గాలను తప్పక పేర్కొనండి.

 

Question 10: సాధారణ విక్రయశాలలు.

Answer:

1. వీటిని సాధారణంగా నివాసయోగ్యమైన ప్రాంతాలలో చిన్న దుకాణాలుగా, సంస్థలుగా నెలకొల్పుతారు. ఇవి సాధారణంగా అత్యవసర వస్తువులను విక్రయిస్తాయి.
2. సాధారణ విక్రయశాల లక్షణాలు:
ఇవి అనేక రకాలైన వినియోగదారుల వస్తువులతో వ్యవహరిస్తాయి. ఇవి వస్తువుల నగదుపై, అరువు ఆధారంగా కూడా వ్యవహరిస్తాయి.

Exam Tips:

a) నివాస ప్రాంతాల్లోని చిన్న దుకాణాలు, అత్యవసర వస్తువులు, నగదు–అరువు రెండింటిపై అమ్మకాలు – ఈ మూడు అంశాలు రాయండి.

 

Question 11: ఏకైక వస్తుశ్రేణి విక్రయశాలలు.

Answer:

1. ఒకే రకపు/ఒకే విధమైన వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహించే చిల్లర వర్తకులను ఏకైక వస్తుశ్రేణి విక్రయశాలలు అంటారు.
2. ఈ విక్రయశాలల్లో ఒకే శ్రేణిలో వివిధ రకాలైన వస్తువులు అమ్ముతారు. ఉదాహరణకు కూరగాయలు, బేకరి వస్తువులు, పాదరక్షలు, ప్లాస్టిక్ వస్తువులు మొదలైన వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహిస్తారు.

Exam Tips:

a) ఒకే శ్రేణిలోని వివిధ రకాల వస్తువులు (కూరగాయలు, బేకరీ, పాదరక్షలు) అనే ఉదాహరణలతో రాయండి.
b) ప్రత్యేకత సాధించిన విక్రయశాలతో కలపవద్దు; నిర్వచనం, ఉదాహరణ రెండూ ఇవ్వండి.

 

Question 12: ప్రత్యేకత సాధించిన విక్రయశాలలు.

Answer:

ప్రత్యేకత కలిగిన విక్రయశాలలు:
1. ప్రత్యేకత కలిగిన విక్రయశాల, ఒక ప్రత్యేక రకానికి చెందిన వస్తువులతో వ్యాపారం చేస్తుంది. ఇవి ఒకే రకపు వస్తువులను మాత్రమే విక్రయించే ప్రత్యేకతను (ప్రావీణ్యత) కలిగి ఉంటాయి.
2. ఉదాహరణకు, రొట్టెను విక్రయించే ఒక చిల్లర వర్తకుడు, మోడ్రన్, బ్రిటానియా, స్పెన్సర్, హెరిటేజ్ లాంటి వివిధ కంపెనీలు తయారు చేసిన రొట్టెలను విక్రయించవచ్చు.

Exam Tips:

a) ఒకే రకం వస్తువులతో మాత్రమే వ్యాపారం చేయడం ప్రత్యేకత; వివిధ కంపెనీల రొట్టెల ఉదాహరణను నిర్వచనంతో జతచేయండి.

 

Question 13: వీధి దుకాణాలు..

Answer:

పట్టణ ప్రాంతాలలో వీధి వర్తకులు తమ వస్తువులను కాలిబాటలపై, వివిధ ప్రాంతాల వీధి మూలలలో ప్రదర్శనకు ఉంచుతారు. వారు సాధారణంగా తమ వ్యాపారాన్ని రైల్వేస్టేషన్లు, వీధి మూలభాగాలు, తదితరమైన సార్వజనీన ప్రదేశాల దగ్గర నిర్వహిస్తారు.

Exam Tips:

a) రైల్వేస్టేషన్, కాలిబాటలు, వీధి మూలలు వంటి బహిరంగ ప్రదేశాలను ఉదాహరణలుగా రాయండి.

 

Question 14: ఒకసారి ఉపయోగించిన వస్తు విక్రయశాలలు.

Answer:

ఒకసారి ఉపయోగించిన వస్తువుల దుకాణాలు లోగడవాడిన వస్తువులతో లేదా పాత వస్తువులతో వ్యాపారం చేస్తారు. వీరు ఒకసారి ఉపయోగించిన వస్తువులతో వ్యాపారం నిర్వహిస్తారు. అందువల్ల వస్తువులను తక్కువ ధరకు అమ్ముతారు.

Exam Tips:

a) పాత (లోగడ వాడిన) వస్తువులతో వ్యాపారం చేయడం, అందువల్ల తక్కువ ధరకు అమ్మడం – ఈ రెండు వాక్యాలు చాలు.

 

Question 15: లోపాలున్న వస్తువు విక్రయించే దుకాణాలు.

Answer:

1. నాణ్యత లోపించిన, లోపాలున్న వస్తువులను విక్రయించే దుకాణాలను లోపాలున్న వస్తువు విక్రయించే దుకాణాలు అంటారు.
2. లోపాలున్న వస్తువులను డిస్కౌంట్ చేసిన ధరకు విక్రయిస్తారు.

Exam Tips:

a) నాణ్యత లోపించిన వస్తువులను డిస్కౌంట్ ధరకు అమ్మడం అని నిర్వచించండి.

 

Question 16: పెద్ద తరహా స్థిరమైన చిల్లర దుకాణాలు.

Answer:

పెద్ద తరహా స్థిరమైన చిల్లర వర్తకులు భారీ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వాటిని అధిక పెట్టుబడితో నెలకొల్పుతారు. అవి భారీ మొత్తంలో గల వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. ఈ చిల్లర వ్యాపార సంస్థలకు, విక్రయశాలల ఏర్పాటుకు అధిక మొత్తాలు అవసరమవుతాయి.
ఉదా:బహుళ విక్రయశాలలు, విభాగ విక్రయశాలలు మొదలైనవి.

Exam Tips:

a) అధిక పెట్టుబడి, భారీ స్థాయి వ్యాపారం; ఉదాహరణలు: బహుళ విక్రయశాలలు, విభాగ విక్రయశాలలు.

 

Question 17: బహుళ విక్రయశాలలు.

Answer:

1. ఒక నిర్దిష్టమైన ప్రదేశం లేదా పట్టణం లేదా నగరం యొక్క వివిధ ప్రాంతాలలో ప్రామాణీకృత వస్తువులను విక్రయించే ఒకే రకమైన దుకాణాలను, బహుళ విక్రయశాలలంటారు.
2. బహుళ విక్రయశాలలకు కొన్ని ఉదాహరణలుగా బాస్కిన్ రాబిన్స్, బాంబే డైయింగ్ను చెప్పవచ్చు.

Exam Tips:

a) ఒకే రకమైన ప్రామాణిక వస్తువులు, వివిధ ప్రాంతాల్లో శాఖలు; ఉదాహరణలను పాఠ్యపుస్తకం ప్రకారం ఇవ్వండి.

 

Question 18: వినియోగదారుల సహకార విక్రయశాలలు.

Answer:

1. వస్తువులను కొనడానికి, అమ్మడానికి, సహకార సూత్రాలపై ఆధారపడి ఏర్పడిన ఒక ఐచ్ఛికమైన వ్యక్తుల సముదాయాన్ని “వినియోగదారుల సహకార విక్రయశాలలు” అంటారు.
2. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి మరియు వీటికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.

Exam Tips:

a) సహకార సూత్రాలపై ఏర్పడటం, తక్కువ నిర్వహణ ఖర్చు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు – మూడు పాయింట్లు రాయండి.

 

Question 19: SEZ (సెజ్).

Answer:

1. సెజ్ అనగా ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలు/ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు.
2. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి సెజ్లను ప్రవేశపెట్టారు.

Exam Tips:

a) పూర్తి రూపం (ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలు) + ఏర్పాటు ఉద్దేశం (విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం) – రెండు వాక్యాలు చాలు.

 

Question 20: మారువర్తకం.

Answer:

1. ఒకదేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను వేరే దేశానికి ఎగుమతి చేయడాన్ని మారు వర్తకం అంటారు.
2. సూక్ష్మంగా చెప్పాలంటే, దిగుమతి చేసుకున్న వస్తువులను తిరిగి ఎగుమతి చేసే పద్ధతినే మారువర్తకం అంటారు.

Exam Tips:

a) దిగుమతి చేసుకున్న వస్తువులను తిరిగి వేరే దేశానికి ఎగుమతి చేయడం అని స్పష్టంగా రాయండి; సాధారణ ఎగుమతి వర్తకంతో తేడా చూపండి.

 

Free study material for Commerce

Step-by-Step Textbook Answers: Class 12 Commerce Chapter 07 Internal Trade

Textbook Solutions for Class 12 Commerce Chapter 07 Internal Trade

Access structured TS Board textbook solutions for Chapter 07 Internal Trade. Designed in alignment with the latest academic curriculum for Class 12 Commerce, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 12 Commerce module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 07 Internal Trade with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం is available for free on StudiesToday.com. These solutions for Class 12 Commerce are as per latest TS Board curriculum.

Are the Commerce TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Commerce concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Commerce. You can access TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం in both English and Hindi medium.

Is it possible to download the Commerce TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం in printable PDF format for offline study on any device.