TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

Download TS Board Solutions for Class 12 Commerce Chapter 05 Entrepreneurship

Review structured textbook solutions for Class 12 Commerce Chapter 05 Entrepreneurship. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access TS Board Solutions and Answers

View or download the dedicated Chapter 05 Entrepreneurship solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Commerce.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

Question 1: ఎంట్రప్రిన్యూర్ను నిర్వచించి, వారి లక్షణాలను వివరించండి.

Answer:

ఎంట్రప్రిన్యూర్ అర్థం: ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entreprendre” అనే పదం నుండి ఆవిర్భవించింది. దాని అర్థం ఒక కొత్తపనిని చేపట్టడం. అనగా నష్టం భరించి ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్.
ఎంట్రప్రిన్యూర్ నిర్వచనాలు:
1) రిచర్డ్ కాంటిల్లన్ ప్రకారం “నిశ్చితమైన ఖరీదుకు కొన్న ఒక వస్తువును అనిశ్చితమైన ధరకు అమ్మడం, ఈ విధంగా అమ్మడంలో గల లాభ నష్టాలకు సంబంధించిన సమంజసమైన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా వనరులను వినియోగంలోకి తెచ్చే వ్యక్తిని ఎంట్రప్రిన్యూర్ గా నిర్వచించవచ్చు.
2) జె.బి. సే ప్రకారం ఎంట్రప్రిన్యూర్ అనేవాడు ఒక ఆర్థిక ఏజెంట్. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఉత్పత్తి కారకాలను సంఘటీకృతపరిచి, వాటిని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువను నిర్ధారించి దానిలో వేతనాలు, అద్దె, వడ్డీ, లాభాలు అనే భాగాలను విడివిడిగా గుర్తించడమే గాకుండా, తన పెట్టుబడికి పునరుపయోగం కలిగే విధంగా నిర్వహించేవాడు”.
ఎంట్రప్రిన్యూర్ లక్షణాలు:
1. నవకల్పన: నవకల్పన అనగా కొత్త పనులను చేయడం లేదా పాత పనులను కొత్త పద్ధతిలో చేయడం. ఎంట్రప్రిన్యూర్ ప్రస్తుతం లేని ఒక అంశాన్ని ఊహించి, దాన్ని విశ్లేషించి అమలుపరుస్తాడు. పాత భావాలకు స్వస్తి చెప్పడం, కొత్త పద్ధతులకు నాంది పలకడం అతని ముఖ్య లక్షణం.
2. రిస్కు భరించడం: కొత్త వ్యాపారాలేవైనా రిస్కు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ కొత్త వ్యాపారాలలో ఎంట్రప్రిన్యూర్లు విజయం పొందవచ్చు లేదా ఓటమి చవిచూడవచ్చు. రెండింటికి సిద్ధం కావడమే రిస్కును భరించడం.
3. ఆత్మవిశ్వాసం: ఎంట్రప్రిన్యూర్లకు ఆత్మవిశ్వాసమే మొదటిమెట్టు. వారు తమశక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి పోటీని, అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవడమే కాకుండా, పరిస్థితులను తమకనుకూలంగా మార్చుకోగలమనే ధీమా కలిగి ఉంటారు.
4. కఠిన శ్రమ: ఎంట్రప్రిన్యూర్లు కఠిన శ్రమ చేస్తారు. ఇంతకంటే ఎక్కువ శ్రమ చేసేవారు ఉండరనడం అతిశయోక్తి కాదు. అవసరమైన పరిజ్ఞానం, చొరవ, చాకచక్యం కలిగి కఠిన శ్రమ చేయడం వల్ల, వీరి శ్రమకు అత్యధిక విలువ సమకూరుతుంది. లక్ష్యసాధన కోసం వారు ఎన్ని గంటలైనా వరుసగా శ్రమ చేస్తారు.
5. లక్ష్య స్థాపన: లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించడానికి కృషి చేయడంలోనే ఎంట్రప్రిన్యూర్ నిజమైన సంతృప్తిని పొందుతాడు. కానీ అన్ని లక్ష్యాలను అతడు పరిపూర్ణంగా సాధించలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో వారు తమ లక్ష్యాలను లేదా వాటి సాధనకు అవలంబించే పద్ధతులను పునర్నిర్మించుకొని తిరిగి కృషి చేయడం మొదలుపెడతారు. అంతేకాకుండా ఒక లక్ష్యాన్ని సాధించగలిగిన ఒక ఎంట్రప్రిన్యూర్ వెంటనే మరొక లక్ష్యాన్ని రూపొందించుకోవడం పరిపాటి.
6. జవాబుదారీతనం: ఎంట్రప్రిన్యూర్లు జయాపజయాలను సమానంగా స్వీకరిస్తారు. లక్ష్యాలను సాధించగలిగిన వారికి ప్రశంసలు, ఓడినవారికి నిందలు పరిపాటి.
నిజమైన ఎంట్రప్రిన్యూర్ ఓటమిని విజయానికి మెట్టుగా భావించి కొనసాగించవలసి ఉంటుంది. వారు సంపాదించిన లాభాలే వారు సాధించిన విజయాన్ని సూచిస్తాయి.
7. నాయకత్వం:
1) మనిషి యొక్క ఆదర్శవంతమైన గుణానికి ప్రాతినిధ్యం వహించేదే నాయకత్వం. నాయకత్వం అంటే మేనేజర్ తన ఆధీనాధికారులను ఉత్ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉండటం.
2) ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి తమ శాయశక్తులను ఉపయోగించడానికి నాయకుడు తనను అనుసరించే వారికి నిర్దేశకతను, మార్గదర్శకాన్ని చూపిస్తూ, వారిని ప్రభావితం చేస్తాడు. సమిష్టికృషికి ఔత్సాహికుని నాయకత్వం ఒక శక్తిగా పనిచేస్తుంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించడానికి నాయకత్వం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఔత్సాహికుడు విజయవంతమైన ఔత్సాహికుడిగా రాణించాలంటే, అతను తప్పకుండా మంచి నాయకత్వపు గుణాలను కలిగి ఉండాలి.
8. నిర్వహణ నైపుణ్యాలు: ఔత్సాహికునికి నిర్వహణ నైపుణ్యాల అవసరం చాలా ఉంది. నిర్వహణ నైపుణ్యంలో విత్త నిర్వహణ, కార్యాలయ నిర్వహణ, ఉత్పత్తి నిర్వహణ, మార్కెటింగ్ నిర్వహణ, ఫ్యాక్టరీ నిర్వహణ మొదలయిన వ్యాపకాలన్నీ ఇమిడి ఉంటాయి. ఇందుకుగాను ఔత్సాహికులు నిర్వహణ నైపుణ్యాల కింద వివిధ అంశాలను పెంపొందించుకోవాలి. స్పష్టమైన విధానాన్ని బాగా ఆలోచించి, నిర్ణయించి రూపొందించాలి, వివిధ విభాగాలలో పనిచేసే సిబ్బందియొక్క విధులు, బాధ్యతలు, అధికారాలు మరియు హక్కుల మధ్య సమతౌల్యతను సాధించాలి.

Exam Tips:

a) ఎంట్రప్రిన్యూర్ అర్థం (ఫ్రెంచి పదం 'entreprendre'), రెండు నిర్వచనాలు (కాంటిల్లన్, జె.బి.సే) తరువాత లక్షణాలను సంఖ్యలతో రాయండి.
b) నవకల్పన, రిస్కు భరించడం, ఆత్మవిశ్వాసం, కఠిన శ్రమ, లక్ష్య స్థాపన, జవాబుదారీతనం, నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలు అనే ఎనిమిదింటినీ గుర్తుంచుకోండి.

 

Question 2: ఎంట్రప్రిన్యూర్ విధులను వివరించండి.

Answer:

1. నవకల్పన:
1. ఎంట్రప్రిన్యూర్ అనే పదం ‘నవకల్పన’తో ముడిపడి ఉంటుంది.
“నవకల్పన” అంటే కొత్తపనులను చేయడం, లేదా పాతపనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం.
2. ఇందులో కొత్త వస్తువుల ఉత్పత్తి, కొత్త మార్కెట్లు సృష్టి, కొత్త ఉత్పత్తి పద్ధతులను అమలులోకి తేవడం, ముడిసరుకుల సప్లైలో కొత్త మార్గాలను అన్వేషించడం, ఒక కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని రూపొందించడం మొదలయినవి కలసి ఉంటాయి.
2. రిస్కు భరించడం:
1. వినియోగదారుల అభిరుచులలో, ఉత్పత్తి పద్ధతులలో, ప్రభుత్వ విధానాలలో మార్పులు రావడం వల్ల, కొత్త వస్తువులు కనుగొనడం వల్ల చేస్తున్న వ్యాపారాలకు నష్టాలు ఏర్పడవచ్చు. ఈ నష్టాలను భరించడానికి ఎంట్రప్రిన్యూర్ సిద్ధంగా ఉండాలి.
2. పై మార్పులవల్ల ప్రయోజనాలు కలిగితే వీటిని ఎంట్రప్రిన్యూర్ అనుభవిస్తాడు. కాబట్టి నష్టాన్ని కూడా అతనే భరించాలి.
3. జె.బి.సే ప్రకారం రిస్కును భరించడమనేది ఎంట్రప్రిన్యూర్ ప్రత్యేక విధి.
3. వ్యవస్థీకరణ, నిర్వహణ:
1. ఎంట్రప్రిన్యూర్ తాను అందించదలచిన వస్తుసేవల రకాలు, వాటి స్వభావాలు ముందుగా నిర్ణయించవలసి ఉంటుంది. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఈ ఉత్పత్తి కారకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి.
ఎంట్రప్రిన్యూర్ వాటిని సేకరించి వస్తువు సేవల ఉత్పత్తికి వీలుగా వాటిని మలచుకొనవలసి ఉంటుంది.
2. వ్యాపార సంస్థ పరిమాణంలో గానీ, స్థల నిర్ణయంలోగానీ, ఉత్పత్తి పద్ధతులలోగానీ అవసరమైన మార్పులు చేయడమేగాక, రోజువారీ నిర్వహణకు అవసరమైన ఉత్పత్తి ప్రణాళికలు, అమ్మకాల ‘నిర్వహణ, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన విధులను కూడా అతడు చేపట్టవలసి ఉంటుంది.
3. ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వ్యవస్థీకరణ, నిర్వహణ అనేవి ఎంట్రప్రిన్యూర్ ముఖ్య విధులు.
4. వ్యాపార ప్రణాళికలు:
1) ఔత్సాహికుడు ఒక క్రమబద్ధమైన పద్ధతిని రూపొందించి, వాస్తవ విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి పరిణామాలను ఊహిస్తూ భవిష్యత్ను అంచనా వేయాలి.
2) వ్యాపార కార్యకలాపాలను ప్రణాళికీకరణ చేయడానికి, ముడిసరుకు అవసరాన్ని గుర్తించడం, సిబ్బంది అవసరాలను అంచనావేయడం, ఉత్పత్తి షెడ్యూళ్ళను నిర్ణయించడం, అమ్మకాలు, ఇన్వెంటరీ, వ్యాపార ప్రకటనలు, బడ్జెట్ల కేటాయింపు వినియోగదారుల అవసరాలు, పోటీదారులు బలాలు, బలహీనతలు మొదలయినవి అధ్యయనం చేయాలి.
3) క్రమబద్ధమైన వ్యాపార ప్రణాళికీకరణను రూపొందించాలంటే, ఔత్సాహికుడు తప్పకుండా వ్యాపార లక్ష్యాలను, విధానాలను, వ్యాపార సరళిని, కార్యక్రమాలను, బడ్జెట్లను దృష్టిలో ఉంచుకోవాలి.
4) సరైన ప్రణాళికను రూపొందించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా, క్రమరీతిలో వ్యాపార కార్యకలాపాలను చేపట్టవచ్చు. ముందుగా నిర్ణయించిన విధంగా వ్యాపారానికి మార్గదర్శకం ఏర్పడుతుంది. తద్వారా ఇతర నిర్వహణ విధులు సమర్థవంతంగా నిర్వర్తించబడతాయి. కాబట్టి ఔత్సాహికులు ఈ వ్యాపార ప్రణాళికీకరణ విధులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది.
5. నిర్ణయాలు తీసుకోవడం:
1. ఔత్సాహికుడు నిర్వర్తించాల్సిన మరొక ముఖ్యమైన విధి, నిర్ణయాలు తీసుకోవడం.
2. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వ్యాపార సంస్థను కొనసాగించడానికి లేదా నిర్వహించడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలి.
3. ఏ వ్యాపారసంస్థ అయినా విజయవంతం కావాలంటే, పురోగతిని సాధించాలంటే ఔత్సాహికుని నిర్ణయాలు ఎక్కువగా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి.

Exam Tips:

a) విధులను శీర్షికలతో రాయండి: నవకల్పన, రిస్కు భరించడం, వ్యవస్థీకరణ-నిర్వహణ, వ్యాపార ప్రణాళిక, నిర్ణయాలు తీసుకోవడం.
b) రిస్కు భరించే విధిని జె.బి.సే, వ్యవస్థీకరణ విధిని ఆల్ఫ్రెడ్ మార్షల్ పేర్లతో ముడిపెట్టి రాస్తే మంచిది.

 

Question 3: వివిధ రకాల ఎంట్రప్రిన్యూర్ల గురించి వివరంగా తెలపండి.

Answer:

I. డాన్హాఫ్ ప్రకారం ఎంట్రప్రిన్యూర్ల వర్గీకరణ:
అమెరికాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో డాన్హాఫ్ ఎంట్రప్రిన్యూర్లను నాలుగు రకాలుగా విభజించినాడు.
1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు
4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.
1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు: నవకల్పన కర్త షుంపీటర్ దృష్టిలో ఎంట్రప్రిన్యూర్ అంటే కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడం, కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంభించడం, కొత్తమార్కెట్లను రూపొందించే వ్యక్తి. కొత్తగా ప్రయోగాలు చేసి, విజయవంతమైన వాటిని విస్తరింపజేసి, ఆకర్షణీయ అవకాశాలన్నింటిని అమలుపరచడం ఇతడికి నిత్యకృత్యం.
2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు: వీరు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులను ఉత్పత్తి చేస్తారు.
3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు, వేగవంతమైన మార్పులను వీరు అంగీకరించరు. వారి పూర్వికులు, సీనియర్లు అవలంబించిన మార్గాలను సులభంగా వాడతారు. కొత్త పద్ధతులు, కొత్తభావాలు, ఒకే మారు కాకుండా నిదానంగా అమలు పరుస్తారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజవేస్తారు.
4. స్థిరచిత్తపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్లు కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూసివేయడానికైనా సిద్ధపడతారు.
II. ఇతర రకాల ఎంట్రప్రిన్యూర్లు:
1. వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్లు: వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్లు ఎక్కువగా చిన్న తరహా వ్యాపార సంస్థను నిర్వహిస్తూ ఉంటారు. ఒక వ్యాపారసంస్థను స్థాపించి, దానికవసరమైన మూలధనాన్ని సమకూర్చి దానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి, అందులో ఉన్న రిస్కును భరించేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తిని వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్ అంటారు.
2. సంస్థాగత ఎంట్రప్రిన్యూర్లు: సంక్లిష్టమైన వ్యవస్థ కలిగిన భారీతరహా సంస్థలను, పరిశ్రమలను స్థాపించడానికి ఒక వ్యక్తి యొక్క శక్తి సరిపోనప్పుడు కొంతమంది వ్యక్తుల సమూహంగానీ, ఒక సంస్థగానీ ఈ పనిని చేపట్టవచ్చు. ఈ విధమైన సంస్థాగత ఎంట్రప్రిన్యూర్లకు సాంకేతిక పరిజ్ఞానం, మూలధనం సేకరించడం సులభం. అంతేగాక ఎంత ఎక్కువ రిస్కునైనా భరించి, మార్పులను అమలుపరచడం కూడా వీరికి సాధ్యం.
3. వారసత్వపు ఎంట్రప్రిన్యూర్లు: వారసత్వపు ఎంట్రప్రిన్యూర్లు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తారు. వారి కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించి నడిపిస్తుంటారు. వీరిని రెండవతరపు ఎంట్రప్రిన్యూర్లు అని కూడా అంటారు.
4. నిర్బంధపు ఎంట్రప్రిన్యూర్లు: కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎంట్రప్రిన్యూర్లుగా మారిన వారిని “నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు” అంటారు.
సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగ వ్యక్తులు, వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలపట్ల ఆకర్షితులైన వారు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ ఈ వర్గానికి చెందుతారు.
5. వ్యాపార ఎంట్రప్రిన్యూర్లు: వారికున్న గత అనుభవంవల్ల గానీ, శిక్షణద్వారా గానీ ఒక కొత్త వస్తువునుగానీ, సేవనుగానీ, అందించాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తిని వ్యాపార ఎంట్రప్రిన్యూర్ అంటారు. ఇతడు తనకు కలిగిన భావం ఆధారంగా ఒక చిన్న సంస్థనైనా ప్రారంభించి, తన భావానికి కార్యరూపం ఇచ్చేందుకు కృషి చేస్తాడు.
6. పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు: ఇతడు ఉత్పత్తిదారు, పరిశోధన ద్వారాగానీ, ఇతర రకాలుగాగానీ వినియోగదారుల అవసరాలను, కోరికలను అంచనావేసి, తదనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసేవాడిని పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్ అంటారు.
7. స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు: స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్ తన లక్ష్యసాధనకై, తన సామర్ధ్య నిరూపణకై కృషి చేస్తాడు. తనకంటూ ఒక గుర్తింపు, హోదా సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తూ అందుకు తన శాయశక్తులా కృషిచేస్తాడు.
8. ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు: ప్రభుత్వంగానీ, ప్రభుత్వేతర సంస్థలుగానీ అందించే ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని రాయితీలను, సబ్సిడీలను, శిక్షణలను, ఇతర ప్రయోజనాలను పొందడానికై ప్రేరేపించబడి ఎంట్రప్రిన్యూర్‌గా అవతరించే వ్యక్తిని ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్ అంటారు.

Exam Tips:

a) డాన్హాఫ్ వర్గీకరణ (నవకల్పన, అనుకరణ, నిదానపు, స్థిరచిత్తపు) మరియు ఇతర రకాలను (వ్యక్తిగత, సంస్థాగత, వారసత్వపు, నిర్బంధపు, వ్యాపార, పారిశ్రామిక, స్వచ్ఛమైన, ప్రేరేపిత) రెండు భాగాలుగా రాయండి.
b) ప్రతి రకానికి ఒక వాక్యంలో ముఖ్య లక్షణం చెప్పండి.

 

Question 4: ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్‌ల మధ్య వ్యత్యాసాలు తెలుపండి.

Answer:

ఎంట్రప్రిన్యూర్
1. ఎంట్రప్రిన్యూర్ ఒక వ్యక్తి.
2. ఎంట్రప్రిన్యూర్ పరిపాలనాకర్త.
3. ఎంట్రప్రిన్యూర్ రిస్క్ ను భరిస్తాడు.
4. ఎంట్రప్రిన్యూర్ నవకల్పన కర్త.
5. ఎంట్రప్రిన్యూర్ ఉత్పత్తికారకాల సమ్మేళన పరుస్తాడు.
6. ఎంట్రప్రిన్యూర్ ప్రారంభకుడు, చొరవ తీసుకునే వ్యక్తి.
7. ఎంట్రప్రిన్యూర్ నాయకుడు.
ఎంట్రప్రిన్యూర్ షిప్
1. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక కార్యాచరణ ప్రణాళిక.
2. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది ఒక పరిపాలనాంశం.
3. ఎంట్రప్రిన్యూర్షిప్ రిస్కుతో కూడిన చర్య.
4. ఎంట్రప్రిన్యూర్షిప్ నవకల్పన ప్రక్రియ.
5. ఎంట్రప్రిన్యూర్షిప్ ఉత్పత్తికారకాల వినియోగ ప్రక్రియ.
6. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది సంస్థను ప్రారంభం చేయడం, చొరవతీసుకునే చర్య.
7. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది నాయకత్వమే.

Exam Tips:

a) రెండు కాలమ్‌ల పట్టికలో 'ఎంట్రప్రిన్యూర్ = వ్యక్తి', 'ఎంట్రప్రిన్యూర్షిప్ = ప్రక్రియ' అనే భేదాన్ని స్పష్టంగా చూపండి.
b) కనీసం ఐదు వ్యత్యాసాలు రాయండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: వ్యాపార ప్రణాళికీకరణ అంటే ఏమిటి ?

Answer:

1) ఔత్సాహికుడు ఒక క్రమబద్ధమైన పద్ధతిని రూపొందించి, వాస్తవ విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి పరిణామాలను ఊహిస్తూ భవిష్యత్తును అంచనా వేయాలి.
2) వ్యాపార కార్యకలాపాలను ప్రణాళికీకరణ చేయడానికి, ముడిసరుకు అవసరాన్ని గుర్తించడం, సిబ్బంది అవసరాలను అంచనావేయడం, ఉత్పత్తి షెడ్యూళ్ళను నిర్ణయించడం, అమ్మకాలు, ఇన్వెంటరీ, వ్యాపార ప్రకటనలు, బడ్జెట్ల కేటాయింపు వినియోగదారుల అవసరాలు, పోటీదారులు బలాలు, బలహీనతలు మొదలయినవి అధ్యయనం చేయాలి.
3) క్రమబద్ధమైన వ్యాపార ప్రణాళికీకరణను రూపొందించాలంటే, ఔత్సాహికుడు తప్పకుండా వ్యాపార లక్ష్యాలను, విధానాలను, వ్యాపార సరళిని, కార్యక్రమాలను, బడ్జెట్లను దృష్టిలో ఉంచుకోవాలి.
4) సరైన ప్రణాళికను రూపొందించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా, క్రమరీతిలో వ్యాపార కార్యకలాపాలను చేపట్టవచ్చు. ముందుగా నిర్ణయించిన విధంగా వ్యాపారానికి మార్గదర్శకం ఏర్పడుతుంది. తద్వారా ఇతర నిర్వహణ విధులు సమర్థవంతంగా నిర్వర్తించబడతాయి. కాబట్టి ఔత్సాహికులు ఈ వ్యాపార ప్రణాళికీకరణ విధులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది.

Exam Tips:

a) వ్యాపార ప్రణాళికీకరణలో లక్ష్యాలు, విధానాలు, బడ్జెట్లు, ముడిసరుకు-సిబ్బంది అవసరాల అంచనా అనే అంశాలను పేర్కొనండి.
b) ప్రణాళిక వల్ల వ్యయాలు తగ్గి కార్యకలాపాలు క్రమబద్ధమవుతాయని ముగించండి.

 

Question 2: ఎంట్రప్రిన్యూర్ రిస్కును భరించే విధులు ఏమిటి ?

Answer:

1. వినియోగదారుల అభిరుచులలో, ఉత్పత్తి పద్ధతులలో, ప్రభుత్వ విధానాలలో మార్పులు రావడం వల్ల, కొత్త వస్తువులు కనుగొనడం వల్ల చేస్తున్న వ్యాపారాలకు నష్టాలు ఏర్పడవచ్చు. ఈ నష్టాలను భరించడానికి ఎంట్రప్రిన్యూర్ సిద్ధంగా ఉండాలి.
2. పై మార్పులవల్ల ప్రయోజనాలు కలిగితే వీటిని ఎంట్రప్రిన్యూర్ అనుభవిస్తాడు. కాబట్టి నష్టాన్ని కూడా అతనే భరించాలి.
3. జె.బి.సే ప్రకారం రిస్కును భరించడమనేది ఎంట్రప్రిన్యూర్ ప్రత్యేక విధి.

Exam Tips:

a) రిస్కు భరించడం అనేది ఎంట్రప్రిన్యూర్ ప్రత్యేక విధి అని జె.బి.సే అభిప్రాయం; లాభాన్ని అనుభవించేవాడే నష్టాన్ని భరించాలని రాయండి.

 

Question 3: నవకల్పన అనే విధితో ఏ విధంగా సృష్టించడం విభేదిస్తుందో తెలపండి.

Answer:

1. నవకల్పన అంటే కొత్త పనులను చేయడం, లేదా పాత పనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం ఇందులో కొత్త వస్తువులు ఉత్పత్తి, కొత్త మార్కెట్ల సృష్టి, కొత్త ఉత్పత్తి పద్దతులను అమలులోకి తేవడం మొదలైనవి ఇమిడి ఉంటాయి.
2. సృష్టించడం అంటే కొత్త భావాలు, సిద్ధాంతాలను రూపొందించడం, కొత్త పద్ధతులు కనుగొనడం.
3. సృష్టించడంలో కొత్త పద్ధతులను, సిద్ధాంతాలను కనుగొంటే నవకల్పనలో ఆ కనుగొన్న కొత్త సిద్ధాంతాలను, పద్ధతులను వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవడం జరుగుతుంది.

Exam Tips:

a) నవకల్పన = ఉన్న ఆలోచనను వాణిజ్యంగా వినియోగంలోకి తేవడం; సృష్టి = కొత్త ఆలోచన/సిద్ధాంతం కనుగొనడం. ఈ భేదాన్ని స్పష్టంగా రాయండి.

 

Question 4: డాన్హాఫ్ ఔత్సాహికులను ఏ విధంగా వర్గీకరించాడో తెలియజేయండి.

Answer:

అమెరికాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో డాన్హాఫ్ ఎంట్రప్రిన్యూర్లను నాలుగు రకాలుగా విభజించినాడు.
1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు
4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.
ఎ. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు:
1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్ అంటే కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడం. కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంబించడం, కొత్త మార్కెట్లను రూపొందించే వ్యక్తి. 2. కొత్తగా ప్రయోగాలు చేసి, విజయవంతమైన వాటిని విస్తరింపజేసి, ఆకర్షణీయ అవకాశాలన్నింటినీ అమలుపరచడం ఇతడికి నిత్యకృత్యం.
బి. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు:
1. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులనే ఉత్పత్తి చేస్తుంటారు.
2. ఇతర దేశాలలో, ఇతర మార్కెట్లలో విజయవంతమైన వస్తువులు, అభివృద్ధి చెందని దేశాలలో పూర్తిగా వినియోగించే అవకాశం లేనపుడు అలాంటి వస్తువులలో స్వల్పమైన మార్పులను చేసి ఈ ఎంట్రప్రిన్యూర్లు తమ దేశాలలో తమ మార్కెట్లో ప్రవేశపెడతారు.
సి. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు:
1. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. వేగవంతమైన మార్పులను వీరు అంగీకరించరు.
2. వారి పూర్వీకులు, సీనియర్లు అవలంబించిన మార్గాలను సులభంగా వీడలేరు. కొత్త పద్ధతులు, కొత్త భావాలను ఒకేమారు కాకుండా నిదానంగా అమలుపరుస్తుంటారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.
డి. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు:
1. వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్ల కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు.
2. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూసివేయడానికైనా సిద్ధపడతారు. కానీ మార్పులకు అంగీకరించరు.

Exam Tips:

a) నాలుగు రకాల పేర్లు రాసి, ప్రతిదానికి రెండు పాయింట్లు వివరించండి.
b) ఇది అమెరికా వ్యవసాయ రంగ అధ్యయనం ఆధారంగా చేసిన వర్గీకరణ అని పేర్కొనండి.

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entreprendre” అనే పదం నుండి ఆవిర్భవించింది. అంటే ఒక కొత్త పనిని చేపట్టడం అని అర్థం. అనగా నష్టం భరించి ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టే వాడే ఎంట్రప్రిన్యూర్.
2. జె.బి. సే ప్రకారం ఎంట్రప్రిన్యూర్ అనేవాడు ఒక ఆర్థిక ఏజెంట్. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఉత్పత్తి కారకాలను సంఘటీకృతపరిచి, వాటిని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువను నిర్థారించి దానిలో వేతనాలు, అద్దె, వడ్డీ, లాభాలు అనే భాగాలను విడివిడిగా గుర్తించడమే గాకుండా, తన పెట్టుబడికి పునరుపయోగం కలిగే విధంగా నిర్వహించేవాడినే ఎంట్రప్రిన్యూర్ గా పేర్కొనవచ్చు.

Exam Tips:

a) ఫ్రెంచి మూలం 'entreprendre' = చేపట్టడం అని చెప్పి, తరువాత జె.బి.సే నిర్వచనం రాయండి.

 

Question 2: సంస్థ నిర్వచనం.

Answer:

1. నష్టభయంతో కూడిన, సంక్లిష్టమైన, కష్టతరమైన పనిని అనేక మంది చేపట్టే వ్యాపకాన్ని లేదా ప్రాజెక్టును, ‘ఎంటర్ప్రైస్’గా నిర్వచించవచ్చు.
2. సాహసంతో కూడిన వ్యాపారాన్ని చేయడానికి సృష్టించబడిన వ్యవస్థనే ‘ఎంటర్ప్రైస్’ అంటారు. వ్యాపార వ్యవస్థలో ఇది ఒక ప్రత్యేకమైన వ్యాపకం లేదా ఆర్థిక సంబంధం కలిగిన వ్యవహారంగా పేర్కొంటారు.
3. ఔత్సాహికుడు చేపట్టే వ్యాపారాన్నే ‘ఎంటర్ప్రైస్’ లేదా “వ్యాపార సంస్థగా” పేర్కొంటారు.

Exam Tips:

a) 'ఎంటర్ప్రైస్' అనేది ఎంట్రప్రిన్యూర్ చేపట్టే వ్యాపార సంస్థ అని స్పష్టం చేయండి; ఎంట్రప్రిన్యూర్‌తో కలపకండి.

 

Question 3: ఎంట్రప్రిన్యూర్షిప్.

Answer:

1. ఉత్పత్తికారకాలను అత్యల్పస్థాయిలో వినియోగించి, వాటివల్ల ప్రయోజనాలను అత్యధిక స్థాయిలో పొందగలడమనే శక్తి లేదా సామర్థ్యమే ఎంట్రప్రిన్యూర్షిప్ అని పేర్కొనవచ్చు.
2. ఎ.హెచ్.కోల్ ప్రకారం “ఎంట్రప్రిన్యూర్షిప్. అంటే ఒక వ్యక్తిగానీ, వ్యక్తుల సముదాయం గానీ చేపట్టిన ఒక అర్థవంతమైన చర్య. ఆర్థిక వస్తుసేవల ఉత్పత్తి లేదా పంపిణీలను ప్రారంభించడం లేదా నిర్వహించడం ద్వారా లాభార్జన కోసం, ఉద్దేశించినదే “ఎంట్రప్రిన్యూర్”.
3. దేశ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం, రిస్క్ ను భరించడం, ఏదో ఒక కొత్తదనాన్ని సృష్టించడం, వనరులను సమీకృతం చేసి వాటి మధ్య సమన్వయాన్ని సాధించడమనేది ఎంట్రప్రిన్యూర్షిప్ ముఖ్య విధులు.

Exam Tips:

a) ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక ప్రక్రియ అని, దాని ముఖ్య విధులను (నిర్వహణ, రిస్కు భరించడం, నవకల్పన, సమన్వయం) రాయండి.

 

Question 4: సమతుల్య ప్రాంతీయాభివృద్ధి.

Answer:

అభివృద్ధి చెందని వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్నే సమతుల్య ప్రాంతీయాభివృద్ధి అంటారు. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశ సమతుల్య ప్రాంతీయాభివృద్ధి ఎంతో అవసరం.

Exam Tips:

a) వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన వల్ల ఉపాధి, ఆదాయ సమతుల్యత వస్తుందని ఒక వాక్యం జోడించండి.

 

Question 5: నాయకత్వం.

Answer:

1. మనిషి యొక్క ఆదర్శవంతమైన గుణానికి ప్రాతినిధ్యం వహించేదే నాయకత్వం. నాయకత్వం అంటే మేనేజర్ తన ఆధీనాధికారులను ఉత్ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉండటం.
2. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి తమ శాయశక్తులను ఉపయోగించడానికి నాయకుడు తనను అనుసరించే వారికి నిర్దేశకతను, మార్గదర్శకాన్ని చూపిస్తూ, వారిని ప్రభావితం చేస్తాడు. సమిష్టికృషికి ఔత్సాహికుని నాయకత్వం ఒక శక్తిగా పనిచేస్తుంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించడానికి నాయకత్వం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

Exam Tips:

a) నాయకత్వం అంటే అనుచరులను ప్రేరేపించి లక్ష్యం వైపు నడిపించే సామర్థ్యం అని సంక్షిప్తంగా రాయండి.

 

Question 6: నవకల్పన.

Answer:

1. “నవకల్పన” అంటే కొత్తపనులను చేయడం, లేదా పాతపనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం.
2. ఇందులో కొత్త వస్తువుల ఉత్పత్తి, కొత్త మార్కెట్లు సృష్టి, కొత్త ఉత్పత్తి పద్ధతులను అమలులోకి తేవడం, ముడిసరుకుల సప్లైలో కొత్త మార్గాలను అన్వేషించడం, ఒక కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని రూపొందించడం మొదలయినవి కలసి ఉంటాయి.

Exam Tips:

a) నవకల్పనలో నాలుగు అంశాలు: కొత్త ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, కొత్త పద్ధతులు, కొత్త సరఫరా మార్గాలు.

 

Question 7: అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులనే ఉత్పత్తి చేస్తుంటారు.
2. ఇతర దేశాలలో, ఇతర మార్కెట్లలో విజయవంతమైన వస్తువులు, అభివృద్ధి చెందని దేశాలలో పూర్తిగా వినియోగించే అవకాశం లేనపుడు అలాంటి వస్తువులలో స్వల్పమైన మార్పులను చేసి ఈ ఎంట్రప్రిన్యూర్లు తమ దేశాలలో తమ మార్కెట్లో ప్రవేశపెడతారు.

Exam Tips:

a) అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటారు; ఇతరుల విజయవంతమైన వస్తువులను కొద్ది మార్పులతో అనుకరిస్తారని రాయండి.

 

Question 8: నిదానపు ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. వేగవంతమైన మార్పులను వీరు అంగీకరించరు.
2. వారి పూర్వీకులు, సీనియర్లు అవలంబించిన మార్గాలను సులభంగా వీడలేరు. కొత్త పద్ధతులు, కొత్త భావాలను ‘ఒకేమారు కాకుండా నిదానంగా అమలుపరుస్తుంటారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

Exam Tips:

a) నిదానపు ఎంట్రప్రిన్యూర్లు జాగ్రత్తపరులు, మార్పును నెమ్మదిగా అంగీకరిస్తారు, రిస్కుకు వెనుకంజ వేస్తారు అని రాయండి.

 

Question 9: స్థిరచిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్ల కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు.
2. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూసివేయడానికైనా సిద్ధపడతారు. కానీ మార్పులకు అంగీకరించరు.

Exam Tips:

a) నిదానపు ఎంట్రప్రిన్యూర్ల కంటే వీరు మొండివారని, మార్పులను అస్సలు అంగీకరించరని తేడాను చెప్పండి.

 

Question 10: నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎంట్రప్రిన్యూర్లుగా మారిన వారిని “నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు’ అంటారు.
2. సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగ వ్యక్తులు, వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలపట్ల ఆకర్షితులైన వారు, నాన్- రెసిడెంట్ ఇండియన్స్ ఈ వర్గానికి చెందుతారు.

Exam Tips:

a) నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు పరిస్థితుల ప్రభావంతో అయిష్టంగా వ్యాపారంలోకి వచ్చినవారు; ఉదాహరణలు (నిరుద్యోగులు, NRIలు) ఇవ్వండి.

 

Question 11: పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు ఉత్పత్తిదారులు.
2. పరిశోధన ద్వారా గాని, ఇతర రకాలుగా వినియోగదారుల అవసరాలను, కోరికలను అంచనావేసి, తదనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసేవారిని పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు అంటారు.

Exam Tips:

a) పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు ఉత్పత్తిదారులు; వినియోగదారుల అవసరాలను అంచనా వేసి వస్తువులను తయారు చేస్తారని రాయండి.

 

Question 12: స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు తమ నమ్మకాన్ని సామర్ధ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
2. వీరు ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లకు భిన్నమైన వారు. స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు ఇతరులచే ప్రేరేపించబడరు.

Exam Tips:

a) స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు తమ సొంత నమ్మకంతో, ఇతరుల ప్రేరణ లేకుండా వ్యాపారం ప్రారంభిస్తారు; ప్రేరేపిత రకానికి ఇదే వ్యత్యాసం.

 

Question 13: స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు తమ లక్ష్యసాధనకై, తమ సామర్ధ్య నిరూపణకై కృషి చేస్తారు.
2. తమకంటూ ఒక గుర్తింపు, హోదా సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తూ అందుకు తమ శాయశక్తులా కృషి చేస్తారు.

Exam Tips:

a) స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు గుర్తింపు, హోదా కోసం కృషి చేస్తారనే పాయింట్‌ను తప్పక రాయండి.

 

Question 14: కార్పోరేట్ ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

1. ఒక కంపెనీని ప్రారంభించే వ్యక్తిని కార్పొరేట్ ఎంట్రప్రిన్యూర్ అంటారు. ఇతడినే వ్యవస్థాపకుడు అని కూడా అంటారు.
2. ఇతడు కంపెనీల చట్టం కింద ఒక కంపెనీని రూపొందించి, నమోదుచేయించి, దానికి న్యాయబద్ధమైన అస్తిత్వాన్ని కల్పించడం జరుగుతుంది.

Exam Tips:

a) కార్పొరేట్ ఎంట్రప్రిన్యూర్ కంపెనీల చట్టం కింద కంపెనీని నమోదు చేయించి న్యాయబద్ధ అస్తిత్వం కల్పిస్తాడని రాయండి.

 

Question 15: ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

ప్రభుత్వంగాని, ప్రభుత్వేతర సంస్థలు గానీ అందించే ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని, రాయితీలు, సబ్సిడీలను, శిక్షణలను, ఇతర ప్రయోజనాలను పొందడానికై ప్రేరేపించబడి ఎంట్రప్రిన్యూర్గా అవతరించే వ్యక్తిని ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు అంటారు.

Exam Tips:

a) ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు, శిక్షణ వంటి ప్రోత్సాహకాల వల్ల వ్యాపారంలోకి వస్తారని రాయండి.

 

Question 16: వృత్తిరీత్యా ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడమే వృత్తిగా కలిగి ఉంటారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని మరొకరికి అమ్మివేసి, మరొక వ్యాపారాన్ని ప్రారంభించే సన్నాహాలు మొదలుపెడతారు. స్వయంగా స్థాపించిన వ్యాపారాన్నైనా నిర్వహణ చేసే ఆసక్తి వీరికి ఉండదు.

Exam Tips:

a) వృత్తిరీత్యా ఎంట్రప్రిన్యూర్లు వ్యాపారాన్ని స్థాపించి అమ్మివేసి మరొకటి ప్రారంభిస్తారు; నిర్వహణపై ఆసక్తి ఉండదు.

 

Question 17: పాత తరం ఎంట్రప్రిన్యూర్లు.

Answer:

వీరు తమకు రావలసిన ఆర్థిక లాభాల గురించి తప్ప సంస్థ వృద్ధిని పట్టించుకోరు. సంస్థలో వృద్ధి లేకున్నా తమకు గరిష్ఠ లాభాలుంటే చాలని కోరుకుంటారు.

Exam Tips:

a) పాత తరం ఎంట్రప్రిన్యూర్లు సంస్థ వృద్ధి కంటే తమ లాభాలకే ప్రాధాన్యం ఇస్తారని రాయండి.

 

Question 18: చిన్న తరహా పరిశ్రమ ఔత్సాహికులు.

Answer:

పరిశ్రమ వర్గీకరణ ఆధారంగా ఔత్సాహికులను భారీ తరహా, మధ్యతరహా, చిన్నతరహా పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లుగా విభజించారు. వారికున్న గత అనుభవం వల్లగాని, శిక్షణద్వారా గానీ ఒక కొత్త వస్తువునుగాని సేవనుగానీ అందించాలనే ఉద్దేశం కలిగి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులను చిన్న తరహా పరిశ్రమ ఔత్సాహికులు అంటారు.

Exam Tips:

a) చిన్న తరహా పరిశ్రమల ఔత్సాహికులు చిన్న తరహా సంస్థలను స్థాపించే వారు; పరిశ్రమ పరిమాణం ఆధారంగా చేసిన వర్గీకరణ అని చెప్పండి.

 

Free study material for Commerce

Free TS Board Textbook Explanations: Class 12 Commerce Chapter 05 Entrepreneurship

Official TS Board Solutions for Chapter 05 Entrepreneurship

Access structured TS Board textbook solutions for Chapter 05 Entrepreneurship. Designed in alignment with the latest academic curriculum for Class 12 Commerce, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Chapter 05 Entrepreneurship

Clear, methodical explanations accompany every challenging problem within the Class 12 Commerce text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Next Steps in Your Commerce Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Commerce.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్ for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్ is available for free on StudiesToday.com. These solutions for Class 12 Commerce are as per latest TS Board curriculum.

Are the Commerce TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Commerce concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్ will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Commerce. You can access TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్ in both English and Hindi medium.

Is it possible to download the Commerce TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్ in printable PDF format for offline study on any device.