TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ

Download TS Board Solutions for Class 11 Telugu Chapter 04 Bathukamma Festival

Access comprehensive textbook solutions for Chapter 04 Bathukamma Festival using the official curriculum guides for Class 11 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Access TS Board Solutions and Answers

View or download the dedicated Chapter 04 Bathukamma Festival solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు- సమాధానాలు

Question 1: ‘బతుకమ్మ’ పండుగ వెనుక ఉన్న ఆచారసంప్రదాయాలను వివరించండి?

Answer:

బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. దీనిలో బతుకమ్మ పండుగ వెనుక దాగియున్న ఆచార సంప్రదాయాలు వివరించబడ్డాయి.
తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలలో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ జానపదుల సాహిత్య, సంగీత, నృత్య కళారూపాలకు ప్రతీక. స్త్రీలకు సౌభాగ్యాలనిచ్చే తల్లి గౌరమ్మ ఆమె బతుకమ్మ. భయాన్ని గొలిపే స్వరూపం గౌరమ్మది. నవరాత్రుల సమయంలో తెలంగాణ స్త్రీలు సుకుమారమైన అందమైన రూపంగా భావించి అమ్మవారిని కొలుస్తారు.
బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయం అవుతుంది. స్త్రీల సౌందర్యారాధన, అలంకరణ నైపుణ్యం కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పూలతో అలంకరించటంతోనే ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు ఎంగిలి బతుకమ్మను పేర్చటంతో బతుకమ్మ పండుగ ప్రారంభమై మహార్నవమి వరకు సాగుతుంది.
ముత్తైదువులు తెల్లవారుజాముననే లేచి అభ్యంగన స్నానం చేసి అలికి ముగ్గువేసి పూలతో అలంకరిస్తారు. ఉదయం బతుకమ్మను అలంకరించిన సాయంకాలం ఇంటిముందే ఆడతారు. ఆ తరువాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొనివెళ్ళి ఊరి మధ్యలోగాని, చెరువుగట్టుపైగాని ఉంచి స్త్రీలందరూ వలయాకారంలో నిలబడి ఒంగి ఒగురుతూ చేతులను తడుతూ పాటలు పాడతారు. చీకటి పడేవరకు ఆడి బతుకమ్మను కాలువలోగాని, చెరువులోగాని,భావిలోగాని వదిలిపెడతారు.
బతుకమ్మకు వీడ్కోలు చెపుతారు.
నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు
అని పాటలు పాడుతారు. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడానికి కావచ్చు.
ఎర్రమట్టిని త్రిభుజాకారంలోకి మలచి దానిపై వెంపలిచెట్టు కొమ్మనుంచి పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఇలా చేయటం భూమిని స్త్రీ దేవతగా భావించి అర్చించటమే! బతుకమ్మను ఆడేటప్పుడు స్త్రీలు పౌరాణిక, నీతిబోధాత్మక, కథా గేయాలను పాడుకుంటారు. బతుకమ్మపండుగలో పాడే పాటల్లో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో” ఈ గేయంలో పనిలోనే పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీల శ్రమైక జీవనానికి దర్పణం. పనిలోని అలసటను పాటల ద్వారా సులభతరం చేసుకొన్న పరమాత్మ స్వరూపులు స్త్రీలు. పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దింపుకున్న తల్లిదండ్రులు అల్లారుముద్దుగా తమవద్ద పెరిగిన కూతురిని వియ్యాలవారికి అప్పగిస్తున్న పాటలో వారి ఆవేదన అర్థమౌతుంది.
“పెరుగు అన్నము పెట్టి ఉయ్యాలో- పెంచుకోండి సీతను ఉయ్యాలో సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో” ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబంలాగా బతుకమ్మ పండుగలో తెలంగాణా జానపద స్త్రీల జీవన విధానం, మనస్తత్వం కళలు ప్రతిబింబిస్తాయి.

Exam Tips:

a) బతుకమ్మ పండుగ ఏర్పాట్లు క్రమంగా రాయండి: ఎంగిలి బతుకమ్మ (మహాలయ అమావాస్య) నుండి సద్దుల బతుకమ్మ (మహార్నవమి) వరకు.
b) పూలతో పేర్చడం, సాయంత్రం ఆట, ఊరేగింపు, నీటిలో నిమజ్జనం – అనే నాలుగు దశలను విడివిడిగా పేర్కొనండి.
c) వీడ్కోలు పాట (‘నిద్రపో గౌరమ్మా…’), ‘పెరుగు అన్నము పెట్టి…’ పాటలను ఉదాహరణలుగా ఇవ్వండి.

 

Question 2: బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి?

Answer:

బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదాహరణం.
సుఖదుఃఖాలతో ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూల మయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనందపారవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.
అలంకరణ:
బతుకమ్మను అలంకరించటమే ఒక కళ. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గునుగుపూల చివరలను కత్తిరించి వాటికి రంగులను పూసి ముత్యాలపూలను గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.
పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపంచేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మను సాగనంపుతారు.
పాట- నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటారు.
నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు
అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపదస్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అందులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం.
ఈ కథనం తెలంగాణ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్రనియమాలుండవు. అవి చతురస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.
స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మక గీతాలు, కథాగేయాలను పాడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృతమౌతుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరి సతిగూడి ఉయ్యాలో” వారు పనిచేసే పనిలోని శ్రమను మరచి పోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. పనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్య నాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

Exam Tips:

a) సంగీత, సాహిత్య, నృత్య కళాంశాలను శీర్షికలుగా (అలంకరణ, పాట–నాట్యం) విభజించి రాయండి.
b) ఉయ్యాలో, వలలో, చందమామ పల్లవులు; చతురస్రగతిలో ‘కిటతక’ మాత్రలు – ఈ విశేషాలు తప్పక రాయండి.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు

Question 1: రావిప్రేమలత రచనలను తెలుపండి?

Answer:

బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావిప్రేమలతచే రచించబడిన, ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
రావిప్రేమలత సిద్ధాంత వ్యాసం తెలుగు జానపదసాహిత్యం – పురాగాథలు తొలిరచన. ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ వ్యాససంపుటి. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ అనే వైవిధ్య భరితమైన గ్రంథాన్ని రాశారు. ఇది బిరుదురాజు రామరాజు జానపదవిజ్ఞాన బహుమతిని, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకున్నది.
ఈమె రాసిన ‘వ్యాసలతిక’ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతినందుకున్నది. డా. కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India- Andhra Pradesh అన్న కథా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఈమె రచనలన్నీ జానపద సాహిత్యం తోనే ముడిపడి ఉండటం ముదావహం.

Exam Tips:

a) రచయిత్రి సిద్ధాంత వ్యాసం ‘తెలుగు జానపద సాహిత్యం – పురాగాథలు’, ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’, ‘వ్యాసలతిక’, ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ – గ్రంథ పేర్లను సరిగా రాయండి.
b) ఒక్కో గ్రంథానికి లభించిన బహుమతి ప్రస్తావిస్తే అదనపు మార్కులు.

 

Question 2: బతుకమ్మను పేర్చే విధానాన్ని వర్ణించండి?

Answer:

బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు. ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు.
ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖరంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు. పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది.
బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో సద్దుల పులిహోర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్టించటంగా భావిస్తారు.

Exam Tips:

a) పేర్చే క్రమం: ఇత్తడి పళ్ళెం → గుమ్మడి ఆకులు → తంగేడు పూలు → గునుగు, ముత్యాల పూలు → గన్నేరు, రుద్రాక్ష, గోరింట → శిఖరంపై గుమ్మడి పూలు → పసుపు త్రికోణం.
b) త్రికోణం స్త్రీ చిహ్నం; పసుపు ముద్ద గౌరీదేవి ప్రతిష్ఠ – ఈ భావాన్ని చివరిలో రాయండి.

 

Question 3: బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి?

Answer:

‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.
బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దానిపై వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది.
బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీ మూర్తిగా భావించి అర్చించటమే! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులు వినోదాలతో పాటలతో జరుపబడుతుంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.

Exam Tips:

a) బొడ్డెమ్మ ఆట బతుకమ్మకు పూర్వరంగం; వినాయక చవితి నుండి మహాలయ అమావాస్య వరకు జరుగుతుందని కాలాన్ని పేర్కొనండి.
b) ఎర్రమట్టి ముద్ద త్రిభుజాకారంలో – భూమిని స్త్రీ మూర్తిగా పూజించడం అనే సంకేతాన్ని వివరించండి.

 

Question 4: బతుకమ్మ పాటలోని విశేషాలు ఏమిటి?

Answer:

బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి గ్రహించబడింది. బతుకమ్మ పండుగ ఆట పాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడిదుడుకులు లేక క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతాయి. కంఠస్వర నాళాలకు, గర్భాశయానికి హాని కలుగని మధ్యమస్థాయిలో స్త్రీలు పాటలు పాడుతుంటారు.
సహజ సంగీతంతో సాగిపోయే బతుకమ్మ పాటలను సంగీత శాస్త్ర నియమాలు, లక్షణాలతో పనిలేదు. వీరి పాట నాట్యాన్ని అనుసరించి ఉంటుంది. బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. వీరి పాటలు పౌరాణిక గీతాలుగా, నీతి బోధకాలుగా, కథాగేయాలుగా ఉంటాయి. వారి పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ అన్న పల్లవులు ఆవృతాలవుతుంటాయి. సూర్యాస్తమయ సమయంలో బతుకమ్మ పాటలు పాడతారు కాబట్టి “చందమామ” అని, గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కావున “వలలో” అని ‘ఊయలవలె’ ఊగుతూ పాడతారు కావున “ఉయ్యాలో” అన్న పదాలుంటాయి.
బతుకమ్మకు వీడ్కోలు చెప్తున్న ఈ పాటలో
“నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు…..”
ఈ పాటలో జగజ్జననికి జనని జానపదయువతి. స్త్రీది మాతృ హృదయం. చిన్నారి పాపను జో కొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది.
బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
ఉదాహరణకు.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో” పనులలో అలుపు సొలుపు తెలియకుండా పాడే ఈ పాటలు పరమాత్మ స్వరూపాలు.

Exam Tips:

a) బతుకమ్మ పాటల విశేషాలు: ఒకే స్వరం, మధ్యమ స్థాయి, సంగీత శాస్త్ర నియమాలు లేకపోవడం, నాట్యాన్ని అనుసరించడం.
b) పల్లవులకు కారణం (చందమామ–సూర్యాస్తమయం, వలలో–నీటిలో ఓలలాడించడం, ఉయ్యాలో–ఊయల) స్పష్టంగా రాయండి.

 

III. ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

Question 1: రావిప్రేమలత పిహెచ్.డి పరిశోధనాంశం పేరేమిటి?

Answer:

“తెలుగు జానపద సాహిత్యం – పురాగాథలు” రావిప్రేమలత పిహెచ్. డి పరిశోధనాంశం.

Exam Tips:

a) పరిశోధనాంశం: ‘తెలుగు జానపద సాహిత్యం – పురాగాథలు’ (పిహెచ్.డి.) – పేరు పూర్తిగా రాయండి.

 

Question 2: తెలుగు స్త్రీల ముగ్గులపై రావిప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి?

Answer:

“తెలుగు స్త్రీల చిత్రలిపి” రావిప్రేమలత స్త్రీల ముగ్గులపై వ్రాసిన గ్రంథం.

Exam Tips:

a) ముగ్గులపై పరిశోధన గ్రంథం ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ – ‘చిత్రలిపి’ అక్షరదోషం లేకుండా రాయండి.

 

Question 3: రావిప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది?

Answer:

ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.

Exam Tips:

a) ‘వ్యాసలతిక’కు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ గ్రంథ పురస్కారం – సంస్థ పేరు కూడా రాయండి.

 

Question 4: బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు?

Answer:

‘తంగేడు’ పూలకు బతుకమ్మ పండుగలలో అగ్రస్థానం ఇస్తారు.

Exam Tips:

a) బతుకమ్మలో అగ్రస్థానం ‘తంగేడు’ పూలకు; గునుగు, ముత్యాల పూలు వాటి తరువాత.

 

Question 5: గుమ్మడికాయ, గుమ్మడిపూలు దేనికి సంకేతం?

Answer:

గుమ్మడికాయ, గుమ్మడిపూలు ‘సఫలతాశక్తికి’ సంకేతం.

Exam Tips:

a) గుమ్మడికాయ, గుమ్మడిపూలు సఫలతాశక్తికి సంకేతం; త్రికోణం స్త్రీకి సంకేతం – రెండింటినీ కలపకండి.

 

Question 6: బతుకమ్మ పాటలలోని పల్లవులు ఏవి?

Answer:

ఉయ్యాలో, వలలో, చందమామ అనునవి బతుకమ్మ పాటలలో పల్లవులు.

Exam Tips:

a) మూడు పల్లవులు: ఉయ్యాలో, వలలో, చందమామ – మూడూ రాయండి.

 

Question 7: బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి?

Answer:

బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.

Exam Tips:

a) ఒదిగి ఉండేవి: స్త్రీల మనోభావాలు, జీవిత (జీవన) విధానాలు – రెండూ పేర్కొనండి.

 

Question 8: పప్పుధాన్యాలను పొడిచేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు?

Answer:

‘సద్దులు’ అంటారు.

Exam Tips:

a) నైవేద్యం పేరు ‘సద్దులు’ – సద్దుల బతుకమ్మ (తొమ్మిదో రోజు)తో కలిపి గుర్తుంచుకోండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 11 Telugu Chapter 04 Bathukamma Festival

Official TS Board Solutions for Chapter 04 Bathukamma Festival

Explore reliable textbook solutions for Chapter 04 Bathukamma Festival tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Step-by-Step Explanations for Chapter 04 Bathukamma Festival

Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Next Steps in Your Telugu Revision

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 04 Bathukamma Festival with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Telugu. You can access TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Telugu Study Material Chapter 4 బతుకమ్మ పండుగ in printable PDF format for offline study on any device.