TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

Download TS Board Solutions for Class 11 Political Science Chapter 05 Political Ideologies

Review structured textbook solutions for Class 11 Political Science Chapter 05 Political Ideologies. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access TS Board Solutions and Answers

Access the complete solution PDF for Class 11 Political Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

Question 1: వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏమిటి ? వివరించండి.

Answer:

అర్థం:
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez-faire theory) అని కూడా అంటారు. Laissez-faire అనేది ఫ్రెంచ్ పదం.
దాని అర్థం ‘ఒంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.
వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాంటిది.
రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.
రాజ్యం కింద తెలిపిన పరిమిత విధులను నిర్వహిస్తుంది.
1. వ్యక్తులకు రక్షణ కల్పించటం – విదేశీ దురాక్రమణల నుంచి కాపాడడం.
2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడం.
4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.
సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి:
18వ శతాబ్దం నాటికి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.
ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్ అంతటా విస్తరించింది. దీనిని ఆడమ్ స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.
వ్యక్తిశ్రేయోవాదాన్ని పలు రకాలుగా వివరించవచ్చు.
నైతిక వాదన:
జె.ఎస్.మిల్ అభిప్రాయం ప్రకారం వ్యక్తుల విషయంలో రాజ్యం జోక్యం వారి అభీష్టాలను, అభివృద్ధిని నిరోధిస్తుంది. వ్యక్తులు స్వతహాగా నిర్వహించే బాధ్యతలను రాజ్యం తన భుజస్కందాల మీద వేసుకోవడం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మరచిపోవడమే కాకుండా తమకు తామే కాకుండా పోతారు. దాని పర్యవసానంగా వ్యక్తులు నిస్సారంగా, నిస్సత్తువగా తయారౌతారు.
ఆర్థికవాదన:
వ్యక్తి శ్రేయోవాదానికి మద్దతుగా ఆడమ్ స్మిత్ వాదనను లేవనెత్తాడు. ఆయన అభిప్రాయంలో ప్రతి వ్యక్తి తన అభీష్టం మేరకు శక్తివంచన లేకుండా తన అభివృద్ధికై పాటుపడతాడు. ఒకరకంగా ఆడమ్ స్మిత్ వ్యక్తుల స్వప్రయోజనాలను గురించి ప్రజ్ఞావంతమైన వివరణ ఇచ్చాడని చెప్పవచ్చు.
వ్యక్తుల వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలలో రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని స్మిత్ గట్టిగా వాదించాడు. వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వటంవల్ల స్వచ్ఛందంగా తమ స్వంత శక్తి సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధి చెందుతారు.
కాబట్టి “జోక్యరహిత” (లేజాఫెయిర్) విధానంలో సమాజ అవసరంకంటే వ్యక్తుల అవసరమే ఎక్కువగా ఉందని వీరి వాదన. ఈ సిద్ధాంతం 18వ శతాబ్దపు చివరిభాగం 19వ శతాబ్దపు మొదటి దశలో ఇంగ్లాండులో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.
జీవైకవాదం:
హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త వ్యక్తి శ్రేయోవాదాన్ని సమర్థించే ఉద్దేశంతో జీవైక వాదనను ముందుకు తెచ్చాడు. ఇతని అభిప్రాయంలో ప్రాణికోటిలో ఏదైతే నిలదొక్కుకోగలుగుతుందో ఆ జీవి మాత్రమే మనుగడను కొనసాగించగలుగుతుంది. ఆ విధంగా సమాజంలోని వ్యక్తులు స్వేచ్ఛాయుత పోటీలో నిలబడగలిగే వారే తమ మనుగడను కొనసాగించగలరు.
సహజ న్యాయం ప్రకారం మనుగడకు వారు మాత్రమే సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతారు. రాజ్యం చేయగలిగిందల్లా స్వేచ్ఛాయుత పోటీలో వ్యక్తులకు అనుమతినివ్వటం. పేదలకు, వృద్ధులకు, రోగిష్ఠులకు చేయవలసిన అవసరం రాజ్యానికి ఎంతమాత్రం లేదని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం.
అనుభవిక వాదం:
ఇప్పటివరకు మనం అనుభవంలో చూస్తున్నదేమంటే, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజ్యం పరిశ్రమలను పర్యవేక్షించి నియంత్రిస్తుందో అక్కడ ఫలితాలను వెల్లడించడంలో జాప్యం కలుగుతుంది. అదే విధంగా అసమర్ధత, వస్తువులు వ్యర్థంకావటం జరుగుతుంది.
ఎప్పుడైతే రాజ్యం ప్రజాసమూహాల సాంఘిక, ఆర్థిక జీవన విధానాన్ని నియంత్రించటం లేదా పర్యవేక్షించటానికి చేసే ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. అంతేకాదు, రాజ్యనిర్వహణ అంటేనే ఉద్యోగుల నిర్లక్ష్యం, అనవసరపు జాప్యం, ప్రతికూల ఆర్థిక విధానం, లంచగొండితనం మొదలైనవి ఉంటాయి.

Exam Tips:

a) అర్థం (లేజా ఫేర్ = 'జోక్యం చేసుకోకు'), 'రాజ్యం ఆవశ్యకమైన దయ్యం', రాజ్య పరిమిత విధులు, పుట్టుక–అభివృద్ధి, తరువాత నాలుగు వాదనలు (నైతిక, ఆర్థిక, జీవైక, అనుభవిక) అనే క్రమంలో రాయండి.
b) ప్రతి వాదనతో దాని ప్రతిపాదకుని పేరు (మిల్ – నైతిక, ఆడమ్ స్మిత్ – ఆర్థిక, స్పెన్సర్ – జీవైక) తప్పక రాయండి.

 

Question 2: ఉదారవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన అంశాలను తెలపండి.

Answer:

ఉదారవాదం చాలా విశాలమైన సిద్ధాంతం, వ్యక్తి శ్రేయోవాదం, ఉపయోగితావాదం, సంక్షేమ రాజ్యభావన మొదలైనవి దీనిలో అంతర్భాగమైనవే. వ్యక్తి శ్రేయోవాదాన్ని సాంప్రదాయిక ఉదారవాదంలో భాగంగానే చూస్తారు. వ్యక్తి శ్రేయోవాదం ఉద్దేశంలో వ్యక్తి చాలా హేతుబద్ధమైన జీవి.
తనకు కావల్సినవన్నీ సమకూర్చుకునే సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి రాజ్యం కేవలం తనకు రక్షణ కవచంగా ఉంటే చాలు అని భావిస్తాడు. దీన్నే సంప్రదాయ ఉదారవాదం అంటారు. ఉదారవాదం రెండు రకాలు, అవి : సాంప్రదాయిక ఉదారవాదం మొదటిదికాగా ఆధునిక ఉదారవాదం రెండవది.
ఆధునిక ఉదారవాదం 19వ శతాబ్దపు ఉదారవాదానికి భిన్నమైనది. 20వ శతాబ్దంలో ఉదారవాదం ఎంతో పరిణతి చెందింది. ఎందుకంటే మధ్యతరగతి వర్గ సిద్ధాంతం నుంచి ఒక జన బాహుళ్య సిద్ధాంతంగా మార్పు చెందింది. ముఖ్యంగా టి.హెచ్. గ్రీన్ వివరించిన నైతిక కోణాన్ని తనలో ఇముడ్చుకొని ఆధునిక ఉదారవాదంగా పరిణతి చెందింది.
అదే విధంగా మరికొంత మంది శాస్త్రవేత్తలైన హాబ్ హౌస్, హెచ్.జె. లాస్కీ వంటివారి అభిప్రాయాలతో ప్రభావితమై 20వ శతాబ్దపు అర్ధభాగంలో వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల వైఖరిని ఏర్పరచుకొని పాజిటివ్ ఉదారవాదం లేదా ఆధునిక ఉదారవాదంగా గుర్తింపు పొందింది.
అర్థం, నిర్వచనాలు:
ఎంతోమంది అభిప్రాయాలతో అనేక పరిణామాల మధ్య మూడు శతాబ్దాలపాటు పరిణామం చెందిన ఉదారవాదాన్ని నిర్దిష్టంగా నిర్వచించటం చాలా కష్టం.
సాంప్రదాయక వైఖరి ప్రకారం ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛలను కాపాడటం, ప్రజాస్వామిక సంస్థల స్థాపన, స్వేచ్ఛా ఆర్థిక విధానం లక్షణాలను కలిగి ఉండేది. ఆధునిక ఉదారవాదం ప్రకారం వ్యక్తి వికాసానికి కావాల్సినంత రక్షణను కల్పిస్తూ సానుకూల వైఖరిని కలిగి ఉంది.
వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం వ్యక్తుల హక్కులను, స్వేచ్ఛలను రాజకీయ, ఆర్థిక, ఉద్యోగస్వామ్య ఆధిపత్యాల నుంచి కాపాడే సిద్ధాంతమే ఉదారవాదం. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రగతిశీలమైన వ్యవస్థగా తీర్చిదిద్దటానికి కావల్సిన సైద్ధాంతిక భూమికయే ఉదారవాద సిద్ధాంతం.
మౌలిక అంశాలు:
1. వ్యక్తి సహేతుకమైన జీవి, సమాజ శ్రేయస్సుకు కావల్సిన సహాయ సహకారం అందివ్వగలడు. అదేవిధంగా తన అభివృద్ధిని పెంచుకోగలడు. వ్యక్తి పుట్టుకతోనే కొన్ని సహజ హక్కులను కలిగి ఉన్నాడు. వాటిని ఏ అధికార శక్తీ తొలగించలేదు.
2. వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. నిజానికి, పలు రకాల వ్యక్తుల ప్రయోజనాలను సమన్వయం చేయడంవల్లనే సమష్టి ప్రయోజనాలు ఏర్పడతాయి.
3. పౌర సమాజం, రాజ్యం వ్యక్తుల ద్వారా నిర్మితమైన యాంత్రికమైన సంస్థలు. అవి సమష్టి ప్రయోజనాలను కాపాడతాయి.
4. ఉదారవాదం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం వ్యక్తుల సామాజిక జీవనానికి ఎంతో అవసరమైనవి.
5. ఉదారవాదం, వ్యక్తుల పౌర స్వేచ్ఛలను కాపాడుతుంది. వాటిని పెంపొందించటానికి కావల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
6. ఉదారవాదం వ్యక్తులు తమ సమ్మతి మేరకు వ్యక్తులతో గాని, సంస్థలతోగాని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
7. ఉదారవాదం సమాజంలోని వివిధ సమూహాల సమష్టి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ విధానాలు రూపొందించాలని ఆశిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఉదారవాదం మార్కెట్ సమాజాన్ని కోరుకుంటుంది. రాజ్యం వ్యక్తుల ఆస్తులకు, ఒప్పందాలకు, కనీసపు సేవలు అందివ్వటానికి తనవంతు బాధ్యతను నెరవేరుస్తుంది. ఉదారవాదం వ్యక్తి ప్రయోజనాలకు లక్ష్యంగానూ వాటిని కాపాడటానికి కావాల్సిన సాధనంగానూ రాజ్యాన్ని గుర్తిస్తుంది. రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాన్ని ఉదారవాదం వ్యతిరేకిస్తుంది.

Exam Tips:

a) ఉదారవాదం రెండు రకాలు – సాంప్రదాయ, ఆధునిక – ఈ తేడాను మొదట స్పష్టంగా చెప్పి, తరువాత నిర్వచనం (వెబ్‌స్టర్ నిఘంటువు), ఆ తరువాత ఏడు మౌలిక అంశాలు రాయండి.
b) ఆధునిక ఉదారవాదానికి టి.హెచ్. గ్రీన్, హాబ్‌హౌస్, లాస్కీల ప్రభావాన్ని పేర్కొనండి.

 

Question 3: సామ్యవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన సూత్రాలను పరిశీలించండి.

Answer:

సామ్యవాదం ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవాల తరువాత ప్రచారంలోకి వచ్చింది. ఫ్రెంచి విప్లవం సాంఘిక విప్లవాన్ని లేవదీస్తే, పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది. సామ్యవాదాన్ని ప్రచారం చేసిన వారిలో రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్లు ముఖ్యులు.
రాబర్ట్ ఓవెన్ సామ్యవాదాన్ని కాల్పనిక సామ్యవాదంగా ఇంగ్లండ్లో ప్రచారం చేసాడు. ఈ సామ్యవాదాన్నే మార్క్స్, ఏంజెల్సు అనే తత్త్వవేత్తలు శాస్త్రీయ సామ్యవాదంగా రూపొందించారు.
నిర్వచనం వివరణ:
సామ్యవాదం “సోషియస్” (Socious) అనే పదం నుంచి ఉద్భవించింది. అయితే సామ్యవాదాన్ని నిర్వచించటం చాలా కష్టం. అయినా నిఘంటువు ప్రకారం “ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. జార్జి బెర్నాడ్ షా సామ్యవాదమంటే “ఆదాయాలను సమానం చేయటం” అని అన్నాడు. సామ్యవాదులకు విప్లవం కన్న సంస్కరణల ద్వారా మార్పును తేవటం ఇష్టం. సిద్ధాంతపరమైన సంఘర్షణకన్న నిర్మాణాత్మకమైన కృషిపైన, ఫలితాలపైన వారికి నమ్మకం ఎక్కువ.
ప్రధానసూత్రాలు:
సామ్యవాదపు ప్రధానసూత్రాలను కింది విధంగా చెప్పవచ్చు.
1. సమాజానికి ప్రాముఖ్యత:
సామ్యవాదం వ్యక్తికంటే సమాజానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సమాజ ప్రయోజనాలకంటే వ్యక్తి ప్రయోజనాలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రజలందరి అవసరాలకు సంబంధించిన వస్తూత్పత్తికే మిక్కిలి ప్రాధాన్యతనిస్తుంది. సుఖభోగాలకు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి అవసరమైనదిగా భావిస్తుంది. లాభాపేక్షగల వస్తూత్పత్తికంటే సహకార సేవలు అందివ్వగలిగే వస్తూత్పత్తి జరగాలని కోరుకుంటుంది.
2. సామాజిక ఐక్యతను కోరుకుంటుంది:
పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికులు, కార్మికులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోతారని సామ్యవాదం పేర్కొంది. సామ్యవాద సమాజంలో మాత్రమే ప్రజలందరికీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో పాటు సమాన అవకాశాలు కల్పించబడతాయని ఈ సిద్ధాంతం నొక్కి చెబుతుంది.
పెట్టుబడిదారీ సమాజంలో కొంతమంది సంపన్నులు మాత్రమే అన్నిరకాల అవకాశాలను పొందుతారని ఎక్కువమంది అనేక అవకాశాలను కోల్పోతారంటుంది. సామ్యవాద సమాజంలో ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేని విధంగా సంపూర్ణప్రయోజనం పొందుతారు.
3. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన:
పెట్టుబడిదారీ విధానం సంపూర్ణంగా నిర్మూలించబడాలని సామ్యవాదం కోరుకుంటుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీచేస్తూ అధికసంపదను ప్రోగుచేసుకుంటుంది. చట్టం ప్రకారం కార్మిక వర్గానికి చెందాల్సిన సౌకర్యాలనుగాని, ఇతరత్రా ప్రయోజనాలను గాని పెట్టుబడిదారి విధానం కల్పించదు.
దీని పర్యవసానంగా కార్మికవర్గం తీవ్రమైన దుర్భరపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటిరీత్యా పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కచ్చితంగా జరగాలని సామ్యవాదం అభిప్రాయపడింది.
4. పోటీతత్వాన్ని నిర్మూలించటం:
ఆర్థికరంగంలో ముఖ్యంగా ఉత్పత్తి సంబంధ విషయాలలో పోటీతత్వం సమూలంగా నిర్మూలించబడాలని సామ్యవాద ఆకాంక్ష. పోటీతత్వానికి బదులుగా సహకారం ఉండాలంటుంది. పోటీతత్వం, లంచగొండితనాన్ని, ఏకస్వామ్యాన్ని, అసాంఘిక చర్యలను, విలువలు దిగజారుడుతనాన్ని పెంచిపోషిస్తుందని సామ్యవాదం విమర్శిస్తుంది. అందువల్ల పోటీతత్వం స్థానంలో సహకారం ఎంతో అవసరమని సామ్యవాదం భావిస్తుంది.
5. సమానత్వంపై సంపూర్ణవిశ్వాసం:
సామ్యవాదం సమానత్వ సూత్రాన్ని నమ్ముతుంది. అయితే, సామ్యవాదం సైతం సంపూర్ణ సమానత్వాన్ని సమర్థించదు. వ్యక్తుల ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు మరియు నైపుణ్యాల రీత్యా అసమానతలుంటాయని అంగీకరిస్తుంది.
అయినంతమాత్రాన ఉద్దేశపూర్వకమైన అసమానతలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామ్యవాదం నొక్కి చెబుతుంది.
6. ప్రయివేటు ఆస్తికి వ్యతిరేకం:
సామ్యవాదం ప్రయివేటు ఆస్తి కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది. భూమిమీద, పరిశ్రమలమీద, ఇతర ఉత్పత్తి సాధనాలమీద ప్రయివేటు యాజమాన్యపు హక్కులను సామ్యవాదం వ్యతిరేకిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రజలందరూ సమానంగా వినియోగించుకోవాలని సామ్యవాదం కోరుకుంటుంది.
7. వస్తూత్పత్తిపై సామూహిక యాజమాన్యం:
సమస్త వస్తూత్పత్తి సామూహిక యాజమాన్య ఆధీనంలో ఉండాలని సామ్యవాదం ఆశిస్తుంది. సమాజంలోని సంపదనంతా జాతీయం చేయాలని కోరుకుంటుంది. ప్రయివేటు ఆస్తి సంపాదన అంటే దొంగతనంగా కూడగట్టుకున్నదేనని చెబుతుంది. దీన్ని తొలగించడానికి పరిశ్రమలమీద, మైనింగ్ మీద సమష్టి యాజమాన్యం ఉండాలంటుంది.
8. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఉండాలి:
కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని సామ్యవాద భావన. శీఘ్ర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికా వ్యవస్థే పట్టుకొమ్మవంటిదని చెబుతుంది.

Exam Tips:

a) ఫ్రెంచ్ విప్లవం–పారిశ్రామిక విప్లవం నేపథ్యం, కాల్పనిక (ఓవెన్) – శాస్త్రీయ (మార్క్స్–ఏంజెల్స్) సామ్యవాదాల తేడా రాసి, ఎనిమిది సూత్రాలను శీర్షికలతో ఇవ్వండి.
b) 'సంపూర్ణ సమానత్వం కాదు, ఉద్దేశపూర్వక అసమానతల తొలగింపు' అనే సూక్ష్మ విషయాన్ని తప్పక రాయండి.

 

Question 4: గాంధీవాదంపై ఒక వ్యాసం రాయండి.

Answer:

మోహన్దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్ పట్టణంలో 1869 సంవత్సరంలో జన్మించాడు. గాంధీని మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘మహాత్మ’ అని సంబోధించాడు. మహాత్ముడు భారతదేశ పితామహుడుగా కూడా విఖ్యాతినొందాడు. ప్రాచీన భారతీయ భావాలైన అహింస సత్యాగ్రహం, సత్యం లాంటివాటిని సాధనాలుగా ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించాడు. తాను ఏదైతే పాటించాడో దాన్నే బోధించాడు.
గాంధీయిజం – ప్రధాన సూత్రాలు:
1. అతిభౌతిక ఆదర్శవాదం:
ఉపనిషత్ భావాలైన ‘దైవికభావన’ సజీవ నిర్జీవ సమస్త ప్రాణికోటిలో నిక్షిప్తమై ఉండే సార్వజనీన ఆత్మ, అన్ని చోట్ల నిరంతరం వెలిగే దైవిక వెలుతురు మొదలైనవి గాంధీ తాత్విక భావాలు. గాంధీ అభౌతిక ఆదర్శవాదం వేదాంత చింతనతో కూడిన నైతికత, ధార్మిక, అభౌతిక జైన, బౌద్ధ, వైష్ణవ సూత్రాలు. వీటన్నింటి సమ్మిళితమే గాంధీయిజం.
2. నైతిక నిరపేక్షత:
గాంధీ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. గాంధీ నైతిక వేదాంతంలోని ‘రిత’ లో మనం చూడవచ్చు. ‘రిత’ విశ్వజనీనమైంది. సర్వాంతర్యామి అయినట్టి భగవంతుడికి విధేయులుగా ఉండునట్లు చేస్తుంది.
3. అహింస – సిద్ధాంతం:
అహింస అంటే ‘హింస చేయకుండుటం’. అంటే ఎవరినీ ‘చంపటానికి వీలులేదు’ అనేది విస్తృత అర్థంలో వాడతాం.
గాంధీ ‘అహింసా’ భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు. దయ, ప్రేమ, భయంలేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీ వివరించాడు.
అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధంకాదు, సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.
గాంధీజీ అభిప్రాయంలో స్వరాజ్యం లేదా ప్రజాస్వామ్యాన్ని హింస ద్వారా సాధించలేం. ఎందుకంటే హింసతో ఎవరినీ సంపూర్ణంగా ఓడించలేం. వ్యక్తి స్వేచ్ఛ అంటే హింస కాదు. ఒక్క అహింసా విధానంవల్ల మాత్రమే వ్యక్తిస్వేచ్ఛకు వాస్తవ రూపం వస్తుంది.
గాంధీజీ అభిప్రాయంలో హింసకు నాలుగు కారణాలున్నాయి. అవి :
1. వ్యవస్థీకృతమైన అధికారం లేదా శక్తి
2. అంతర్గత వైరుధ్యాలు
3. విదేశీ దురాక్రమణలు
4. కుటుంబ వ్యవస్థ
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.
అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Force) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హింసా’ పద్ధతిలో శిక్షించకూడదు. ఒకడి దృష్టిలో ‘పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు.
సత్యాన్ని అన్వేషించటమంటే అహింసావాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి. సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.
సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం:
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.
1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.
సత్యాగ్రహం సూత్రాలు:
నిజమైన సత్యాగ్రాహి కింది సూత్రాలను పాటించాల్సి ఉంటుంది.
1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
2. అహింస అంటే హింసచేయకుండుట, ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీగాని, పురుషుడుగాని ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
5. దొంగతనం చేయరాదు.
6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
9. అంటరానితనాన్ని పాటించరాదు.
10. మతపరమైన సహనం ఉండాలి.
సత్యాగ్రహం – వివిధ రూపాలు:
1. సహాయ నిరాకరణ
2. శాసనోల్లంఘనం
3. నిరాహారదీక్ష
4. హర్తాల్
5. హిజరత్
ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని, మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.
అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ – నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.
5. మతం రాజకీయాలు:
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని – రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.
రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.
6. లక్ష్య సాధనాలు:
గాంధీజీ ఉద్దేశంలో సాధనాలు అనేవి ఉదాత్తమైనవి అయి ఉండాలి. అవి అనుకున్న లక్ష్యాలను సాధించేవిగా ఉండాలి. పాశ్చాత్య తత్వవేత్తలు హింసాపూరితమైన సాంఘిక, రాజకీయ విప్లవాలను ప్రతిపాదించారన్నాడు. వాటి ద్వారానే సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమౌతాయని వారు పేర్కొన్నారు.
అయితే, ఒక్క టాల్ స్టాయ్ మాత్రం హింసను వ్యతిరేకించి “సార్వజనీన ప్రేమ”ను ప్రతిపాదించాడు.
గాంధీజీ, టాల్ స్టాయ్ వీరిరువురు సాంఘిక, రాజకీయ లక్ష్యాలను సాధించటానికి ప్రేమ, కరుణ, దయ వంటి వాటిని ప్రతిపాదించారు. సాధనం అంటే విత్తనం లాంటిది. లక్ష్యం అంటే చెట్టులాంటిది. మంచి విత్తనం నాటితే మంచిదైన చెట్టు పెరిగి మంచి ఫలాన్నిస్తుంది అంటారు గాంధీజీ.
7. ధర్మకర్తృత్వం:
గాంధీజీ, అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు. ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

Exam Tips:

a) గాంధీ పరిచయం, తరువాత సూత్రాలను (అతిభౌతిక ఆదర్శవాదం, నైతిక నిరపేక్షత, అహింస, సత్యాగ్రహం, మతం–రాజకీయాలు, లక్ష్య సాధనాలు, ధర్మకర్తృత్వం) క్రమంగా వివరించండి.
b) 'సాధనం = విత్తనం, లక్ష్యం = చెట్టు' అనే గాంధీ ఉపమానాన్ని, టాల్‌స్టాయ్ ప్రభావాన్ని ప్రస్తావించండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: వ్యక్తి శ్రేయోవాదాన్ని చర్చించండి.

Answer:

అర్థం:
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez-faire Theory) అని కూడా అంటారు. (Laissez-faire) అనేది ఫ్రెంచ్ పదం, దాని అర్థం ‘ఒంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.
వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాంటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.
రాజ్యం కింద తెలిపిన పరిమిత విధులను నిర్వహిస్తుంది.
1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణలనుంచి కాపాడటం.
2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడం.
4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.
సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి:
18వ శతాబ్దం నాటి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.
ఆర్థికపరమైన వ్యక్తి శ్రేయోవాదానికి 18వ శతాబ్దంలో ఫిజియోక్రాట్స్ పునాదులు వేశారు. పరిశ్రమలను, వాణిజ్య వ్యాపారాలను పర్యవేక్షిస్తూ వాటికి సంపూర్ణ మద్దతును తెలిపే విధానాలను సమర్థించే మార్కెంటలిజాన్ని ఫిజియోక్రాట్స్ వ్యతిరేకించారు. ఈ ఫిజియోక్రాట్సే లేజాఫెయిర్ (జోక్యరహిత) సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్ అంతటా విస్తరించింది. దీనిని ఆడమ్ స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

Exam Tips:

a) అర్థం, రాజ్యం చేసే నాలుగు పరిమిత విధులు, పుట్టుక (లాక్, రూసో, ఫిజియోక్రాట్స్, ఆడమ్ స్మిత్) – ఈ మూడు భాగాలు చాలు; వాదనల వివరాలు అవసరం లేదు.
b) 'రాజ్యం ఒక ఆవశ్యకమైన దయ్యం' అనే వ్యక్తి శ్రేయోవాదుల వాక్యం తప్పక రాయండి.

 

Question 2: సామ్యవాదంలోని లోపాలపై ఒక నోట్ రాయండి.

Answer:

సామ్యవాదం లోపాలు:
సామ్యవాదం ఎంతో ఉపయోగకరమైన సిద్ధాంతమైనా దాంట్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని క్రింది విధంగా చెప్పవచ్చు.
1. సామ్యవాద సిద్ధాంతం వ్యక్తికిగల సృజనాత్మక శక్తిని అణచివేస్తుంది. ఉత్పత్తి విధానంలో వ్యక్తిపాత్రను తక్కువచేసి చూపుతుంది.
2. కొన్ని సామ్యవాద సూత్రాలు ఆచరణ సాధ్యంకానివి. ఉదాహరణకు, ఆర్థిక అసమానతలు తొలగించటం, సాంఘిక వివక్షతలు, సమష్టి యాజమాన్యం, ప్రయివేటు ఆస్తి మొదలైనవి.
3. సామ్యవాదం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తుంది. సమాజానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
4. ఆర్థిక వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని సమర్థించడంవల్ల సత్వర ఆర్థికాభివృద్ధి సాధించటం అసాధ్యమౌతుంది.
సామ్యవాదం – ప్రాముఖ్యత:
సామ్యవాదం ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిద్ధాంతం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి ఇది ఏర్పరచుకొన్న లక్ష్యాలు – సాధనాలు ఉదాత్తమైనవి. భౌతిక పరిస్థితులను చక్కదిద్దుకోవటం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచుకోవచ్చని సామ్యవాదం భావిస్తుంది. శ్రామికులు, కార్మికులు, నిరుద్యోగులు మరియు అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కేవలం సామ్యవాదం ద్వారానే సాధ్యమౌతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది.
సామ్యవాద సిద్ధాంతం సమసమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తుంది. దోపిడీ, అణచివేత, ఆకలి, దారిద్య్రం వంటి వివక్షత రూపుమాపాలంటే సామ్యవాద సిద్ధాంతం ద్వారానే సాధ్యమౌతుందని చెబుతుంది. ప్రయివేటు ఆస్తిని రద్దుచేసి దున్నేవాడిదే భూమి అని నినదించింది.
సామ్యవాద భావాలు భారత రాజకీయాలలో, అమలుచేయబడ్డాయి. రాజ్యాంగ పీఠికలోని అనేక అంశాలలో సామ్యవాదం ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటిదేశాలు సామ్యవాదం సిద్ధాంతాల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాయి.

Exam Tips:

a) లోపాలను (సృజనాత్మకత అణచివేత, ఆచరణ సాధ్యం కాని సూత్రాలు, స్వేచ్ఛ నిరాకరణ, ఆర్థికాభివృద్ధికి ఆటంకం) సంఖ్యలతో రాసి, 'ప్రాముఖ్యత' ను కూడా క్లుప్తంగా చెప్పి ముగించండి.
b) ప్రశ్న 'లోపాల'పై ఉన్నా సమతుల్యత కోసం ప్రాముఖ్యత ప్రస్తావన అదనపు మార్కులు తెస్తుంది.

 

Question 3: సత్యాగ్రహ భావనను తెలపండి.

Answer:

గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు, అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు. అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Force) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హింసా’ పద్ధతిలో శిక్షించకూడదు.
ఒకడి దృష్టిలో ‘పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు. సత్యాన్ని అన్వేషించటమంటే అహింసా వాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి, సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.
సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం:
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.
1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.
సత్యాగ్రహం సూత్రాలు:
1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
2. అహింస అంటే హింసచేయకుండుట. ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీగాని, పురుషుడుగాని, ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
5. దొంగతనం చేయరాదు.
6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
9. అంటరానితనాన్ని పాటించరాదు.
10. మతపరమైన సహనం ఉండాలి.
సత్యాగ్రహం – వివిధ రూపాలు:
1. సహాయ నిరాకరణ
2. శాసనోల్లంఘనం
3. నిరాహారదీక్ష
4. హర్తాల్
5. హిజరత్.
ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.
అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

Exam Tips:

a) సత్యాగ్రహం అంటే 'ప్రేమ శక్తి – ఆత్మ శక్తి' (Love Force, Soul Force); దక్షిణాఫ్రికాలో ఆవిర్భావం; మూడు రాజకీయ నమ్మకాలు; సూత్రాలు – క్రమంగా రాయండి.
b) తప్పు చేసినవాడిని శిక్షించడం కాదు, తనకు తాను క్షోభ అనుభవించి మార్పు తేవడం అనే సారాంశం తప్పక రాయండి.

 

Question 4: మతం – రాజకీయాలపై గాంధీజీ భావాలను వివరించండి.

Answer:

గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.
రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా, మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

Exam Tips:

a) గాంధీ ప్రకారం 'మతం లేని రాజకీయాలు' నైతికత లేనివి; మతం అంటే గుడ్డి విశ్వాసం కాదు, నైతిక విలువలతో కూడిన విశ్వాసం; రాజ్యపరమైన మతానికి ఆయన వ్యతిరేకి – ఈ మూడు పాయింట్లు రాయండి.
b) 'రాజకీయాలను మతం నుంచి విడదీయలేము' అనే గాంధీ మాటను ఉటంకించండి.

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: వ్యక్తి శ్రేయోవాదం.

Answer:

వ్యక్తి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతం వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వ్యాప్తికి దోహదం చేసినవారు జాన్ స్టూవర్ట్ మిల్, హెర్బర్ట్ స్పెన్సర్. ప్రథమంగా ఈ సిద్ధాంతం లేజాఫేయిర్ (Laissez-faire) సిద్ధాంతంగా పేర్కొనడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో లేజాఫేయిర్ అంటే “జోక్యంచేసుకోకు” అని అర్థం. వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంత ప్రధాన లక్ష్యం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యమిచ్చి, రాజ్యం జోక్యాన్ని అధికారాన్ని పరిమితం చేయటం.

Exam Tips:

a) లేజా ఫేర్ అర్థం, ముఖ్య ప్రతిపాదకులు (మిల్, స్పెన్సర్), లక్ష్యం (రాజ్య జోక్యం పరిమితం) – ఈ మూడు చాలు.
b) నిర్వచనం ఒకే పేరాలో ఉండాలి.

 

Question 2: నయా ఉదారవాదం.

Answer:

నయా ఉదారవాదాన్ని ఒకరకంగా సమకాలీన సాంప్రదాయ ఉదారవాదంగా చెప్పవచ్చు. జోక్యరహిత (“లేజాఫెయిర్”) వ్యక్తి శ్రేయోవాదంగా కూడా పరిగణించవచ్చు. ఇది సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తుల ఆర్థిక కార్యకలాపం మీద ఎటువంటి నియంత్రణలు ఉండకూడదంటుంది.
నయా – ఉదారవాదాన్ని ముఖ్యంగా కింద పేర్కొన్న శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఆస్ట్రియా తత్త్వవేత్త ఎఫ్.ఎ. హాయక్ (1899 – 1992), అమెరికా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్మన్ (1912 – 2006), అమెరికా రాజనీతి తత్త్వవేత్త అయిన రాబర్ట్ నోజిక్ (1938 – 2002) మొదలైనవారు.

Exam Tips:

a) నయా ఉదారవాదం = సమకాలీన సాంప్రదాయ ఉదారవాదం; ఆర్థిక కార్యకలాపాలపై నియంత్రణ వద్దంటుంది; హాయక్, ఫ్రీడ్మన్, నోజిక్ ప్రతిపాదకులు.
b) ముగ్గురు ప్రతిపాదకుల పేర్లు తప్పక రాయండి.

 

Question 3: లేజాఫేయర్ (జోక్యరహితవాదం).

Answer:

వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతమని అంటారు.
లేజాఫేయర్ (Laissez-faire) అనేది ఫ్రెంచిపదం. దాని అర్థం “ఒంటరిగా వదిలేయ్” అంటే సాంఘికజీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగివుండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

Exam Tips:

a) లేజా ఫేర్ ఫ్రెంచ్ పదం – 'ఒంటరిగా వదిలేయ్'; వ్యక్తి కేంద్ర బిందువు; రాజ్యం సమర్థించాలి గాని నియంత్రించకూడదు.
b) మూడు నాలుగు వాక్యాల్లో ముగించండి.

 

Question 4: జె.యస్.మిల్.

Answer:

జాన్ స్టువర్ట్ మిల్ 19వ శతాబ్దపు ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతడు వ్యక్తి శ్రేయోవాది మరియు ప్రజా స్వామ్యవాది. ఇతడు రచించిన “ఆన్ లిబర్టీ” అనే గ్రంథము వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకు ఇతడిచ్చినంత ప్రాధాన్యత ఇంతకుముందు ఏ రాజనీతి శాస్త్రవేత్త ఇవ్వలేదు. జె.యస్. మిల్ వ్యక్తి శారీరక, మానసిక నైతిక వికాసానికి స్వేచ్ఛ చాలా అవసరమని భావించాడు. సమాజ శ్రేయస్సుకోసం వ్యక్తి స్వేచ్ఛ చాలా అవసరమని, అందువలన వ్యక్తి వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యము పరిమితంగా వుండాలని చెప్పెను.

Exam Tips:

a) జె.ఎస్. మిల్: 'ఆన్ లిబర్టీ' గ్రంథకర్త; వ్యక్తి స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యం; ప్రభుత్వ జోక్యం పరిమితం అనే మూడు విషయాలు రాయండి.
b) 19వ శతాబ్దపు ఆంగ్ల తత్త్వవేత్త అని పేర్కొనండి.

 

Question 5: సామ్యవాదం అర్థం.

Answer:

సామ్యవాదం వ్యక్తివాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు సమాజపరంగా నిర్వహించే విధానమే సామ్యవాదం. ఇది ఒక విప్లవాత్మక సిద్ధాంతం. ఒక రాజకీయ విధానమే గాక, సామ్యవాదం ఒక జీవిత విధానం కూడా. దీనిని అనేక మంది నిర్వచించారు. సి.యి.యమ్. జోడ్ అనే రచయిత సామ్యవాదం ఒక టోపీ వంటిదని, దానిని అందరూ ధరించటం వలన అసలు రూపమే పోయిందని అంటారు.
నిర్వచనాలు:
“ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. – ఎన్సైక్లోపీడియా.
“ఆదాయాలను సమానం చేయడం సామ్యవాదం”. – జార్జ్ బెర్నార్డ్ షా.

Exam Tips:

a) సామ్యవాదం = వ్యక్తివాద వ్యతిరేకం; ఉత్పత్తి, పంపిణీ సమాజ నియంత్రణలో; ఒక నిర్వచనం (బెర్నార్డ్ షా) ఉటంకించండి.
b) విప్లవం కన్నా సంస్కరణలను ఇష్టపడుతుందని చెప్పడం అదనపు పాయింట్.

 

Question 6: పెట్టుబడిదారీ విధానం.

Answer:

వ్యక్తివాదం వలన పెట్టుబడిదారీ విధానము పెరిగింది. వ్యక్తులు ఉత్పత్తి సాధనాలను తమ ఆధీనంలో ఉంచుకొని లాభాలను ఆర్జించడము కోసం ఆర్థిక రంగాన్ని నియంత్రణ చేయడము ఇందలి ముఖ్య లక్షణం.
లక్షణాలు:
1. వ్యక్తుల యాజమాన్యం : ఉత్పత్తి సాధనాలు వ్యక్తి ఆధీనంలో ఉంటాయి. దీని వలన వ్యక్తులు శ్రద్ధతో పనిచేస్తారు.
2. ఆర్థిక రంగంలో స్వేచ్ఛ: యజమానులు లాభదాయకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వేచ్ఛ వుంటుంది. లాభ, నష్టాలకు వ్యక్తులే బాధ్యులు.
3. వినియోగదారునికి స్వేచ్ఛ : వినియోగదారుడు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు.
4. పోటీ : ఉత్పత్తి వాణిజ్యాలలో తీవ్రమైన పోటీ ఉంటుంది.

Exam Tips:

a) పెట్టుబడిదారీ విధానం: ఉత్పత్తి సాధనాలపై వ్యక్తుల యాజమాన్యం, లాభం కోసం ఉత్పత్తి; లక్షణాలు – యాజమాన్యం, ఆర్థిక స్వేచ్ఛ, వినియోగదారు స్వేచ్ఛ, పోటీ.
b) నాలుగు లక్షణాలను సంఖ్యలతో రాయండి.

 

Question 7: మార్క్సిజం.

Answer:

కారల్ మార్క్స్, ఏంజెల్స్ దీనిని ప్రబోధించారు. ఆర్థిక సమానత్వం దీని ప్రధాన లక్ష్యం. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని, ఆస్తి హక్కును వ్యతిరేకిస్తుంది.
కమ్యూనిజంలో కార్మిక నియంతృత్వం ద్వారా ప్రభుత్వం చేపట్టి, సంపదనంతా జాతీయంచేసి, విప్లవం ద్వారా ఆర్థిక సమానత్వం తేవాలి.
పేదరికం, నిరుద్యోగం కూడా నిర్మూలింపబడాలి. ప్రజలు తమ అవసరాలను బట్టి సంపద వాడుకుంటారు. కమ్యూనిజం లక్ష్యం నెరవేరిన తరువాత రాజ్యం అంతరిస్తుందని కమ్యూనిస్టుల వాదన. దీనిని శాస్త్రీయ సామ్యవాదం అని కూడా అంటారు.

Exam Tips:

a) మార్క్సిజం: ప్రతిపాదకులు మార్క్స్–ఏంజెల్స్; ఆర్థిక సమానత్వం లక్ష్యం; కార్మిక నియంతృత్వం; రాజ్యం అంతరించడం; దీనినే శాస్త్రీయ సామ్యవాదం అంటారు.
b) పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకమని తప్పక రాయండి.

 

Question 8: అహింసా సిద్ధాంతం.

Answer:

అహింస అంటే “హింస చేయకుండటం” అంటే ఎవరినీ “చంపటానికి వీలులేదు” అనేది విస్తృత అర్థంలో వాడతాం. గాంధీ అహింసా భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు.
దయ, ప్రేమ, భయం లేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీజీ వివరించాడు. అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్ వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధం కాదు. సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

Exam Tips:

a) అహింస = హింస చేయకుండా ఉండటం; సత్యం, నిర్భయత దాని కారకాలు; బ్రిటిష్‌పై మాత్రమే కాక సామాజిక రుగ్మతలపై కూడా ఆయుధంగా వాడవచ్చు.
b) 'తనకు తాను విధించుకునే శిక్ష' అనే గాంధీ మాట ప్రస్తావించండి.

 

Question 9: సత్యాగ్రహం.

Answer:

గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీ పాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.
అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి. సత్యాగ్రహం అంటే తప్పుచేసినవాడిని క్షోభపెట్టడం కాదు. దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటివాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

Exam Tips:

a) సత్యాగ్రహం = ప్రేమ శక్తి + ఆత్మ శక్తి; దక్షిణాఫ్రికాలో ఆవిష్కరణ; తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, తాను క్షోభపడి మార్పు తేవడం.
b) రెండు మూడు వాక్యాలలో ముగించండి.

 

Question 10: ధర్మకర్తృత్వం.

Answer:

గాంధీజీ అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు.
ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

Exam Tips:

a) ధర్మకర్తృత్వం: ఆస్తిని, పరిశ్రమలను సమాజం కోసం ధర్మకర్తగా నిర్వహించడం; అవసరానికి మించింది ఇతరులకివ్వడం; కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం.
b) రామరాజ్యం, సర్వోదయ పదాలు రాయండి.

 

Question 11: సహాయ నిరాకరణ.

Answer:

సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. వాటిలో సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారత జాతీయోద్యమ కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1920-22 మధ్యకాలంలో నిర్వహించాడు.
అహింసాయుత సహాయ నిరాకరణోద్యమము ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ, ప్రభుత్వ బిరుదులను పరిత్యజించుట, శాసన సభలను, న్యాయస్థానాలను, విద్యాలయాలను బహిష్కరించుట మొదలగు కార్యకలాపాలను గాంధీజీ నాయకత్వాన విజయవంతంగా చేయడము జరిగింది. అయితే ఈ ఉద్యమము 4, ఫిబ్రవరి 1922న చౌరీ చౌరా సంఘటనతో హింసాయుతమైన మలుపు తీసుకోవడంతో గాంధీజీ కలత చెంది ఉద్యమాన్ని నిలుపుదల చేసినాడు.

Exam Tips:

a) సహాయ నిరాకరణ: 1920–22; విదేశీ వస్తు బహిష్కరణ, బిరుదుల త్యాగం, కోర్టులు–విద్యాలయాల బహిష్కరణ; చౌరీ చౌరా సంఘటనతో ఉద్యమం ఆపివేత.
b) సంవత్సరాలు, చౌరీ చౌరా వివరాలు సరిగా రాయండి.

 

Question 12: శాసనోల్లంఘనం.

Answer:

సత్యాగ్రహ రూపాలలో శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగాగాని, సామూహికంగాగాని తెలియజేయవచ్చు. గాంధీజీ 1930వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమము నుండి “దండి” అనే గుజరాత్ సముద్ర తీరప్రాంత గ్రామానికి తన సహచరులతో పాదయాత్ర నిర్వహించాడు.
సముద్ర తీరంలో ఉప్పు తయారుచేసి, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఆనాటి బ్రిటీష్ ఉప్పు శాసనాన్ని ధిక్కరించెను. ఈ శాసనోల్లంఘన కార్యక్రమములో గాంధీజీతోపాటు 60 వేల మంది ప్రజలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనిరి. అందువలననే దీనిని సామూహిక శాసనోల్లంఘన ఉద్యమంగా అభివర్ణించడం జరిగింది.

Exam Tips:

a) శాసనోల్లంఘనం: 1930 ఉప్పు సత్యాగ్రహం; సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పాదయాత్ర; ఉప్పు శాసనం ధిక్కరణ; సామూహిక ఉద్యమంగా వర్ణన.
b) కీలక సంవత్సరం (1930), ప్రదేశాలు (సబర్మతి, దండి) తప్పక రాయండి.

 

Free study material for Political Science

Free TS Board Textbook Explanations: Class 11 Political Science Chapter 05 Political Ideologies

Textbook Solutions for Class 11 Political Science Chapter 05 Political Ideologies

Explore reliable textbook solutions for Chapter 05 Political Ideologies tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Political Science.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Political Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Political Science.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Political Science are as per latest TS Board curriculum.

Are the Political Science TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Political Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Political Science. You can access TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు in both English and Hindi medium.

Is it possible to download the Political Science TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు in printable PDF format for offline study on any device.