TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు

Step-by-Step Textbook Solutions for Class 11 Physics Chapter 10 Mechanical Properties of Solids

Review structured textbook solutions for Class 11 Physics Chapter 10 Mechanical Properties of Solids. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Chapter 10 Mechanical Properties of Solids Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 11 Physics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: స్థితిస్థాపకతలో హుక్ నియమాన్ని తెలపండి.

Answer:

స్థితిస్థాపక అవధిలో ప్రతిబలము వికృతికి అనులోమానుపాతంలో ఉండును.
\( \text{ప్రతిబలము} \propto \text{వికృతి} \;\Rightarrow\; \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} = \text{స్థిరాంకం} \)
ఈ స్థిరాంకమును స్థితిస్థాపకతా గుణకము అందురు.

Exam Tips:

a) హుక్ నియమంలో "స్థితిస్థాపక అవధిలో" అనే షరతును తప్పక రాయండి; "ప్రతిబలం ∝ వికృతి" అని సూత్రం కూడా ఇవ్వండి.

 

Question 2: ప్రతిబలానికి మితులు, ప్రమాణాలు తెలపండి.

Answer:

\( \text{ప్రతిబలము} = \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} \)
S.I. పద్ధతిలో ప్రమాణము : న్యూ/మీ² లేదా పాస్కల్. మితిఫార్ములా : ML ⁻¹T⁻²

Exam Tips:

a) ప్రతిబలం = బలం/వైశాల్యం కాబట్టి మితి ML⁻¹T⁻² అని రాయండి; ప్రమాణం N/m² (పాస్కల్).

 

Question 3: స్థితిస్థాపక గుణకానికి ప్రమాణాలు, మితులను తెలపండి.

Answer:

\( \text{స్థితిస్థాపకతా గుణకము} = \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} \)
S.I. ప్రమాణము : న్యూ/మీ² లేదా పాస్కల్. మితిఫార్ములా : ML ⁻¹T⁻²

Exam Tips:

a) స్థితిస్థాపక గుణకానికి ప్రతిబలానికి ఉన్న ప్రమాణాలే ఉంటాయి, ఎందుకంటే వికృతి ఒక నిష్పత్తి (ప్రమాణాలు లేవు).

 

Question 4: యంగ్ గుణకం ప్రమాణాలు, మితులను తెలపండి.

Answer:

\( Y = \frac{\text{అనుదైర్ఘ్య ప్రతిబలము}}{\text{అనుదైర్ఘ్య వికృతి}} = \frac{F/A}{\Delta l/l} = \frac{F}{A}\cdot\frac{l}{\Delta l} \)
మితిఫార్ములా : ML ⁻¹T⁻²
ప్రమాణము : న్యూటన్/మీ² లేదా పాస్కల్

Exam Tips:

a) యంగ్ గుణకం ప్రమాణం N/m² (Pa), మితి ML⁻¹T⁻² అని సూత్రం Y = Fl/AΔl నుండి చూపండి.

 

Question 5: దృఢతా గుణకం ప్రమాణాలు, మితులను తెలపండి.

Answer:

\( G = \frac{\text{విమోటన ప్రతిబలము}}{\text{విమోటన వికృతి}} = \frac{F/A}{\Delta x/x} = \frac{F}{A}\cdot\frac{x}{\Delta x} \)
మితిఫార్ములా : ML ⁻¹T⁻²
ప్రమాణము : న్యూటన్/మీ² లేదా పాస్కల్

Exam Tips:

a) దృఢతా గుణకం (విమోటన గుణకం) G = ప్రతిబలం/విరూపణ వికృతి; విరూపణ వికృతికి ప్రమాణాలు లేవని గుర్తుంచుకోండి.

 

Question 6: ఆయత గుణకం ప్రమాణాలు, మితులను తెలపండి.

Answer:

\( B = \frac{\text{స్థూల ప్రతిబలము}}{\text{స్థూల వికృతి}} = \frac{\Delta P \cdot V}{\Delta V} \)
మితిఫార్ములా : ML ⁻¹T⁻²
ప్రమాణము : న్యూటన్/మీ² లేదా పాస్కల్

Exam Tips:

a) ఆయత గుణకం కోసం ఘనపరిమాణ వికృతి ΔV/V ని వాడాలి; ΔV తగ్గుదల కాబట్టి సూత్రంలో ఋణ గుర్తును గమనించండి.

 

Question 7: సంపూర్ణ స్థితిస్థాపక, ప్లాస్టిక్ కు సమీపంగా ఉండే వస్తువులకు ఉదాహరణలు ఇవ్వండి.

Answer:

సమ సర్పిలాకార స్ప్రింగు సంపూర్ణ స్థితిస్థాపక వస్తువులకు ఉదాహరణ. పిండి లేదా మట్టి ముద్ద ప్లాస్టిక్ వస్తువులకు ఉదాహరణ.

Exam Tips:

a) సమ సర్పిలాకార స్ప్రింగ్ వంటి సంపూర్ణ స్థితిస్థాపక వస్తువు, పిండి/మట్టి ముద్ద వంటి ప్లాస్టిక్ వస్తువు — రెండింటికీ ఒక్కో ఉదాహరణ తప్పక ఇవ్వండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: హుక్ నియమం, అనుపాత అవధి, శాశ్వత స్థితి, విచ్ఛేదన ప్రతిబలం పదాలను నిర్వచించండి.

Answer:

హుక్ నియమము : స్థితిస్థాపక అవధులలో ప్రతిబలము వికృతికి అనులోమానుపాతంలో ఉంటుంది.
\( \text{ప్రతిబలము} \propto \text{వికృతి} \;\Rightarrow\; \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} = \text{స్థిరాంకం} \)
ఈ స్థిరాంకమును స్థితిస్థాపక గుణకము అంటారు.
అనుపాత అవధి : ప్రతిబలము – వికృతి వక్రరేఖపై OA బిందువుల మధ్య భాగం సరళరేఖ ఈ ప్రాంతంలో ప్రతిబలం వికృతికి అనులోమానుపాతంలో ఉంటుంది. బాహ్య బలం తొలగించగానే వస్తువు సంపూర్ణంగా యథాస్థితి పొందుతుంది.
అందువల్ల ‘A’ బిందువును అనుపాత అవధి అంటారు.
శాశ్వత స్థితి : ప్రతిబలం – వికృతి వక్రంలో బాహ్యబలాన్ని ‘C’ బిందువు వరకు పెంచి తొలగిస్తే వస్తువు తన పూర్వ స్థితిని సంపూర్ణంగా పొందలేదు. వస్తువులో కొంత వికృతి శాశ్వతంగా మిగిలిపోతుంది. అందువల్ల ‘C’ బిందువును శాశ్వత స్థితి బిందువు అంటారు.
విచ్ఛేదన ప్రతిబలము : ప్రతిబలం-వికృతి వక్రంలో వస్తువుపై ప్రతిబలాన్ని ఈగే బిందువు దాటి ప్రయోగిస్తే (E బిందువు వరకు) ప్రతిబలంలో స్వల్ప మార్పుకే వికృతి విపరీతంగా పెరిగి E అను బిందువు వద్ద తీగ సన్నబడి తెగిపోతుంది. తీగ తెగిపోవడానికి అవసరమైన E బిందువు వద్ద గల ప్రతిబలాన్ని విచ్ఛేదన ప్రతిబలం అంటారు.

Exam Tips:

a) నాలుగు పదాలనూ వేర్వేరుగా నిర్వచించి, ప్రతిబలం–వికృతి వక్రంలో O, A, C, E బిందువులను సూచించండి.
b) "అనుపాత అవధి" (A) వద్ద వరకు మాత్రమే హుక్ నియమం వర్తిస్తుందని స్పష్టంగా రాయండి.

 

Question 2: స్థితిస్థాపక గుణకం, ప్రతిబలం, వికృతి, ప్వాజూన్ నిష్పత్తులను నిర్వచించండి.

Answer:

\( \text{ప్రతిబలము} \propto \text{వికృతి} \;\Rightarrow\; \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} = \text{స్థిరాంకం} \)
ఈ స్థిరాంకమును స్థితిస్థాపక గుణకము అంటారు.
ప్రతిబలము (σ) : ఏకాంక వైశాల్యంపై పనిచేసే పునఃస్థాపక బలాన్ని ప్రతిబలం అంటారు.
\( \text{ప్రతిబలము} (\sigma) = \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} = \frac{F}{A} \)
ప్రమాణము Nm⁻² లేదా పాస్కల్ మితి ఫార్ములా = ML ⁻¹T⁻²
వికృతి : ప్రమాణ పరిమాణం గల వస్తువు ఆకారంలో వచ్చిన మార్పును వికృతి అంటారు.
\( \text{వికృతి} (\varepsilon) = \frac{\text{వస్తువు ఆకారంలో మార్పు పరిమాణము}}{\text{తొలి పరిమాణము}} \)
ఇది నిష్పత్తి. కావున ప్రమాణాలు, మితులు లేవు.
ప్వాజూన్ నిష్పత్తి (σ) : సాగదీసిన తీగలో పార్శ్వ వికృతి మరియు అనుదైర్ఘ్య వికృతుల నిష్పత్తిని ప్వాజూన్ నిష్పత్తి అంటారు.
ప్వాజూన్ నిష్పత్తి \( (σ) = \frac{\Delta \mathrm{d} / \mathrm{d}}{\Delta l / l} \) దీనికి మితులు, ప్రమాణాలు లేవు.

Exam Tips:

a) ప్వాజూన్ నిష్పత్తి = పార్శ్వ వికృతి/అనుదైర్ఘ్య వికృతి; దీనికి ప్రమాణాలు, మితులు ఉండవని తప్పక రాయండి.
b) ప్రతిబలం, వికృతి నిర్వచనాలకు సూత్రాలు జతచేస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 3: యంగ్ గుణకం, ఆయత గుణకం, దృఢతా గుణకాలను నిర్వచించండి.

Answer:

యంగ్ గుణకము : అనుదైర్ఘ్య ప్రతిబలము, అనుదైర్ఘ్య వికృతిల నిష్పత్తిని యంగ్ గుణకమందురు.
\( Y = \frac{\text{అనుదైర్ఘ్య ప్రతిబలము}}{\text{అనుదైర్ఘ్య వికృతి}} \)
అనుదైర్ఘ్య ప్రతిబలము \( = \frac{\mathrm{F}}{\mathrm{A}} \); అనుదైర్ఘ్య వికృతి \( = \frac{\Delta \mathrm{L}}{\mathrm{L}} \)
∴ \( Y = \frac{\mathrm{F} / \mathrm{A}}{\Delta \mathrm{L} / \mathrm{L}}=\frac{\mathrm{F}}{\mathrm{A}} \frac{\mathrm{l}}{\Delta \mathrm{L}} \)
ఆయత గుణకము (B) : ఘనపరిమాణాత్మక ప్రతిబలము మరియు ఘనపరిమాణాత్మక వికృతిల నిష్పత్తిని ఆయత గుణకము అందురు.
\( B = \frac{\text{ఘనపరిమాణాత్మక ప్రతిబలము}}{\text{ఘనపరిమాణాత్మక వికృతి}} = \frac{F/A}{\Delta V/V} \)
ఇదే స్థూల గుణకము: \( K = \frac{F/A}{\Delta V/V} = \frac{P V}{\Delta V} \)
విమోటనా గుణకము లేదా దృఢతా గుణకము (G):
స్పర్శీయ ప్రతిబలము మరియు విరూపణా వికృతిలో నిష్పత్తిని విమోటనా గుణకము అందురు.
\( G = \frac{\text{స్పర్శీయ ప్రతిబలము}}{\text{విరూపణ వికృతి}} = \frac{F/A}{\theta} = \frac{F}{A\theta} \)
ఇందులో విరూపణ వికృతి \( \theta = \frac{x}{L} = \frac{\text{ఉపరితల పొర స్థానభ్రంశము}}{\text{నిలువు ఎత్తు}} \)

Exam Tips:

a) మూడు గుణకాలలో ప్రతిదానికీ సంబంధిత ప్రతిబలం, వికృతి పేర్లు (అనుదైర్ఘ్య / ఘనపరిమాణాత్మక / స్పర్శీయ) సరిగా జతపరచండి.
b) మూడింటికీ ప్రమాణాలు ఒకటే (N/m²) అని చివరలో గుర్తుచేయండి.

 

Question 4: ప్రతిబలం నిర్వచనం తెలిపి వివిధ రకాల ప్రతిబలాలను వివరించండి.

Answer:

ప్రతిబలము (σ) : ఏకాంక వైశాల్యంపై పనిచేసే పునఃస్థాపక బలాన్ని ప్రతిబలం అంటారు.
\( \text{ప్రతిబలము} (\sigma) = \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} = \frac{F}{A} \)
ప్రమాణము Nm⁻² లేదా
పాస్కల్ మితి ఫార్ములా = ML ⁻¹T⁻²
ప్రతిబలమునందలి రకాలు : 1) అనుదైర్ఘ్య ప్రతిబలము 2) స్పర్శియ ప్రతిబలము 3) ఘనపరిమాణాత్మక ప్రతిబలము అనుదైర్ఘ్య ప్రతిబలము లేదా తన్యజ ప్రతిబలం : వస్తువుపై దాని పొడవు పెరుగునట్లు బలమును ప్రయోగించిన ప్రమాణ వైశాల్యములోని పునఃస్థాపక బలమును అనుదైర్ఘ్య ప్రతిబలము అంటారు.
\( \text{అనుదైర్ఘ్య ప్రతిబలము} = \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} \) (పొడవు దిశలో)
స్పర్శీయ లేదా విమోటన ప్రతిబలము : తలానికి సమాంతరముగా దాని ఉపరితల పొరలో స్థానభ్రంశము కలుగునట్లు బలమును ప్రయోగించిన ప్రమాణ వైశాల్యములోని పునఃస్థాపక బలమును స్పర్శియ ప్రతిబలము అందురు.
\( \text{స్పర్శీయ లేదా విమోటన ప్రతిబలము} = \frac{\text{స్పర్శీయ బలము}}{\text{వైశాల్యము}} = \frac{F}{A} \)
ఘనపరిమాణాత్మక ప్రతిబలము : ఒక వస్తువుపై అన్ని వైపులా లేదా వస్తువు ఘనపరిమాణమంతటా బలమును ప్రయోగించిన ప్రమాణ వైశాల్యములోని పునఃస్థాపక బలమును ఘనపరిమాణాత్మక ప్రతిబలము అందురు.
\( \text{ఘనపరిమాణాత్మక ప్రతిబలము} = \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} = \frac{F}{A} \)

Exam Tips:

a) ప్రతిబలం నిర్వచనం, ప్రమాణాలు ఇచ్చి, మూడు రకాలను (అనుదైర్ఘ్య, స్పర్శీయ, ఘనపరిమాణాత్మక) పటంతో సహా వివరించండి.
b) ప్రతి రకానికి బలం ఏ దిశలో పనిచేస్తుందో రాయండి.

 

Question 5: వికృతిని నిర్వచించి, వివిధ రకాల వికృతులను వివరించండి.

Answer:

వికృతి : ప్రమాణ పరిమాణం గల వస్తువు ఆకారంలో వచ్చిన మార్పును వికృతి అంటారు.
\( \text{వికృతి} (\varepsilon) = \frac{\text{వస్తువు ఆకారంలో మార్పు పరిమాణము}}{\text{తొలి పరిమాణము}} \)
ఇది నిష్పత్తి. కావున ప్రమాణాలు, మితులు లేవు.
వికృతి నందలి రకాలు : వికృతి మూడు రకములు.
1) అనుదైర్ఘ్య వికృతి 2) స్పర్శీయ లేదా విరూపణ వికృతి 3) ఘనపరిమాణ వికృతి. 1) అనుదైర్ఘ్య వికృతి (ε) : వస్తువు పొడవులో మార్పు (∆l) మరియు తొలి పొడవు (l) లకు గల నిష్పత్తిని అనుదైర్ఘ్య వికృతి అంటారు.
అనుదైర్ఘ్య వికృతి \( (ε) = \frac{\Delta l}{l} \)
2) విరూపణ వికృతి : ఒక వస్తువు తలముపై స్పర్శరేఖ దిశలో బలమును ప్రయోగించిన, దాని ఉపరితలము పొందిన స్థానభ్రంశపు మరియు మొదటి లంబ తలముల మధ్య గల కోణమును విరూపణ వికృతి అంటారు.
విరూపణ వికృతి \( = θ = \left(\frac{\Delta l}{l}\right) = \) tan θ (కోణం చిన్న విలువలకు tan θ = θ)
3) ఘనపరిమాణాత్మక వికృతి : వస్తువు ఘనపరిమాణంలో మార్పు కలుగునట్లు బలమును ప్రయోగించిన ఘనపరిమాణంలో మార్పుకు తొలి ఘనపరిమాణ మార్పుకు గల నిష్పత్తిని ఘనపరిమాణాత్మక వికృతి అందురు.
\( \text{ఘనపరిమాణ వికృతి} (e) = \frac{\text{ఘనపరిమాణములో మార్పు}}{\text{తొలి ఘనపరిమాణము}} = \frac{\Delta V}{V} \)

Exam Tips:

a) మూడు రకాల వికృతులను ఒక్కొక్కటి సూత్రంతో రాయండి: Δl/l, θ = Δx/L, ΔV/V.
b) చిన్న కోణాలకు tan θ ≈ θ అని చెప్పడం మరచిపోకండి.

 

Question 6: వికృతి శక్తి అంటే ఏమిటో తెలిపి, దానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. (మార్చి 2014, మే 2014)

Answer:

వికృతిశక్తి : తీగలో వికృతి కలుగునట్లు బలమును ప్రయోగించినపుడు జరిగిన పని తీగలో స్థితిశక్తిగా నిల్వయుండును. దీనిని వికృతిశక్తి అందురు.
తీగపై ప్రయోగించిన విరూపణ బలమును తొలగించిన వికృతిశక్తి ఉష్ణశక్తిగా మారును.
సమీకరణ ఉత్పాదన : L పొడవు గల ఏకరీతి తీగ ఒక చివరను స్థిర ఆధారము నుండి వ్రేలాడదీసి దానిపై F బలమును ప్రయోగించిన దానిలో సాగుదల dl అనుకొనుము. ∴ జరిగిన పని dW = F dl
తీగ పొడవులో మార్పు ‘0’ నుండి l వరకు పొందుటలో జరిగిన పని \( W = \int dW = \int_0^l F\,dl \)
ఇక్కడ \( F = \frac{YA\,l}{L} \) కావున \( W = \int_0^l \frac{YA}{L}\,l\,dl = \frac{YA}{L}\left(\frac{l^2}{2}\right) = \frac{1}{2}\,\frac{YA\,l}{L} \cdot l \)
∴ \( W = \frac{1}{2} \) × బలము × సాగుదల. ఈ పని తీగలో వికృతిశక్తికి సమానము.
∴ వికృతి శక్తి \( = \frac{1}{2} \) × బలము × సాగుదల.
ప్రమాణ ఘనపరిమాణంలో వికృతి శక్తి
\( = \frac{1}{2} \times \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} \times \frac{\text{సాగుదల}}{\text{తొలిపొడవు}} \)
ప్రమాణ ఘనపరిమాణంలో శక్తి \( = \frac{1}{2} \) × ప్రతిబలము × వికృతి

Exam Tips:

a) ఉత్పాదనలో dW = F dl నుండి ప్రారంభించి 0 నుండి l వరకు సమాకలనం చేయండి; చివరి ఫలితం ½ × బలం × సాగుదల.
b) ప్రమాణ ఘనపరిమాణానికి శక్తి = ½ × ప్రతిబలం × వికృతి అని కూడా రాయండి.

 

Question 7: భారీ పని యంత్రాలలోనూ, నిర్మాణరంగ రూపకల్పనలోనూ రాగి, ఇత్తడి, అల్యూమినియంతో పోల్చితే ఉక్కును ఎందుకు వాడతారు ?

Answer:

ఉక్కుకు యంగ్ గుణకము మరియు దృఢతా గుణకములు రాగి, ఇత్తడి మరియు అల్యూమినియంల కన్న చాలా ఎక్కువ. అందువల్ల ఉక్కు కడ్డీలను సాగదీయడానికి మరియు వంచడానికి చాలా ఎక్కువ ప్రతిబలం కావాలి.
సుమారు 0.1 సెం.మీ² వైశాల్యం గల ఉక్కు తీగను 0.1% సాగదీయటానికి సుమారు 2000 న్యూటన్ల బలం అవసరము. ఇదే సాగుదలకు అల్యూమినియంకు 690 న్యూ, ఇత్తడికి 900 న్యూ మరియు రాగికి 1100 న్యూటన్ల బలం అవసరము. అంటే ఉక్కు స్థితిస్థాపక గుణకము అల్యూమినియం, రాగి, ఇత్తడిల కన్నా ఎక్కువ కాబట్టి ఉక్కుతో కట్టిన కట్టడాలు ఎక్కువ బరువును మోయగల సామర్థ్యాన్ని, దృఢత్వాన్ని కలిగి ఉండటం వల్ల భవన నిర్మాణంలో, భారీ కట్టడాలు కట్టడంలోను ఉక్కును వాడతారు.

Exam Tips:

a) ఉక్కుకు యంగ్ గుణకం ఎక్కువ కాబట్టి ఒకే సాగుదలకు ఎక్కువ బలం కావాలి అనే ముఖ్య కారణాన్ని మొదట రాయండి.
b) వివిధ లోహాలకు అవసరమైన బలాల (ఉక్కు 2000 N, Al 690 N, ఇత్తడి 900 N, రాగి 1100 N) పోలిక ఇవ్వండి.

 

Question 8: క్రమంగా భారం పెంచుతూ పోయినప్పుడు తీగ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో విశదీకరించండి.

Answer:

ఏకరీతి అడ్డుకోత వైశాల్యము గల తీగ ఒక చివరను స్థిరమైన ఆధారానికి బిగించి రెండవ చివర భారమును క్రమంగా పెంచినామనుకొనుము. వస్తువుపై ప్రయోగించిన ప్రతిబలము మరియు వస్తువులోని వికృతికి రేఖాపటం గీయగా అది పటంలో చూపినట్లు ఉంటుంది. ఈ రేఖాపటం నుండి తీగ ప్రవర్తనను వివిధ బిందువుల వద్ద వివరించవచ్చు.

అనుపాత అవధి : ప్రతిబలము వికృతి వక్రరేఖపై OA బిందువుల మధ్య భాగం సరళరేఖ ఈ ప్రాంతంలో ప్రతిబలం వికృతికి అనులోమానుపాతంలో ఉంటుంది. బాహ్య బలం తొలగించగానే వస్తువు సంపూర్ణంగా యథాస్థితి పొందుతుంది.
అందువల్ల ‘A’ బిందువును అనుపాత అవధి అంటారు.
స్థితిస్థాపక అవధి : ప్రతిబలము – వికృతి వక్రంలోని AB ప్రాంతము వక్రరేఖ. ఈ ప్రాంతంలో ప్రతిబలము, వికృతికి రేఖీయ సంబంధం కలిగి ఉండదు. కాని బాహ్యబలాన్ని తొలగించగానే వస్తువు తన యథాస్థితిని సంపూర్ణంగా పొందుతుంది. అందువల్ల B బిందువును ఈగే బిందువు లేదా స్థితిస్థాపక అవధి అంటారు.
ఈగే బిందువును చేరడానికి ప్రయోగించిన బాహ్యబలాన్ని ఈగుడుబలం అంటారు.
శాశ్వత స్థితి : ప్రతిబలం – వికృతి వక్రంలో బాహ్యబలాన్ని ‘C’ బిందువు వరకు పెంచి తొలగిస్తే వస్తువు తన పూర్వ స్థితిని సంపూర్ణంగా పొందలేదు. వస్తువులో కొంత వికృతి శాశ్వతంగా మిగిలిపోతుంది. అందువల్ల ‘C’ బిందువును శాశ్వత స్థితి బిందువు అంటారు.
విచ్ఛేదన ప్రతిబలము : ప్రతిబలం-వికృతి వక్రంలో వస్తువుపై ప్రతిబలాన్ని ఈగే బిందువు దాటి ప్రయోగిస్తే (E బిందువు వరకు) ప్రతిబలంలో స్వల్ప మార్పుకే వికృతి విపరీతంగా పెరిగి E అను బిందువు వద్ద తీగ సన్నబడి తెగిపోతుంది. తీగ తెగిపోవడానికి అవసరమైన E బిందువు వద్ద గల ప్రతిబలాన్ని విచ్ఛేదన ప్రతిబలం అంటారు.

Exam Tips:

a) O, A, B, C, D, E బిందువులతో ప్రతిబలం–వికృతి పటాన్ని తప్పక గీయండి.
b) అనుపాత అవధి, స్థితిస్థాపక (ఈగే) అవధి, శాశ్వత స్థితి, విచ్ఛేదన బిందువులను క్రమంలో వివరించండి.

 

Question 9: ఏనుగు దంతంతో, బంక మట్టితో చేసిన రెండు సర్వసమాన బంతులను కొంత ఎత్తు నుంచి కిందికి వేసినారు. నేలను తాకిన తరువాత రెండింటిలో ఏది ఎక్కువ ఎత్తుకు లేస్తుంది ? ఎందువల్ల ?

Answer:

ఏనుగు దంతంతోను మరియు బంకమట్టితోను తయారుచేసిన రెండు సర్వసమానమైన బంతులను ఒకే ఎత్తు నుంచి జారవిడిచితే ఏనుగు దంతంతో చేసిన బంతి ఎక్కువ ఎత్తుకు లేస్తుంది.
వివరణ : 1) బంకమట్టి ప్లాస్టిక్ పదార్థము. అనగా దీని మీద బాహ్యబలం ప్రయోగిస్తే దాని ఆకారం మారుతుంది. పైనుండి క్రింద పడి నేలను తాకగానే వస్తువుకు గల శక్తి దానిలో విరూపణ కలిగించడానికి సరిపోవడం వల్ల బంకమట్టి ముద్ద దాదాపు సంపూర్ణ అస్థితిస్థాపక అభిఘాతానికి లోనుగావడం వల్ల పైకి లేవదు.
2) ఏనుగు దంతము దృఢమైన నిర్మాణం గల పదార్థంతో చేయబడటం వల్ల ఎక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఫలితంగా నేలను తాకినపుడు దాని ఆకారంలో విరూపణ అతిస్వల్పంగా ఉండి దంతపు బంతి స్థితిస్థాపక అభిఘాతానికి లోనై ఎక్కువ ఎత్తు పైకి లేస్తుంది.

Exam Tips:

a) ఏనుగు దంతం స్థితిస్థాపకం (ఎక్కువ ఎత్తు), మట్టి ప్లాస్టిక్ (లేవదు) అని స్పష్టమైన తీర్పు ఇచ్చి కారణం రాయండి.

 

Question 10: వంతెనలు, భవనాల నిర్మాణంలో భారం వితరణ చెందని స్తంభాల కంటే వితరిత స్తంభాలను వాడతారు. ఎందుకు ?

Answer:

భవనాలు, వంతెనలు వంటి కట్టడాలకు ఆధారంగా ఉండవలసిన దూలాలవంటివి నిర్మించేటపుడు నిర్మాణంలో వాడిన పదార్థాల స్థితిస్థాపక ధర్మాలతో పాటు నిర్మాణపు ఆకారం వల్ల కూడా దృఢత్వం సంతరించు కుంటుంది. స్థంభాలు లేదా కాలమ్స్ విషయంలో కొనలు ఉన్న స్తంభాలు (వితరిత స్తంభాలు), కొనలు లేని (వితరితం చెందని) స్థంభాల కన్నా ఎక్కువ భారం మోయగలుగుతాయి. అందువల్ల పెద్ద పెద్ద నిర్మాణాలలో భార వితరిత కొనలు ఉన్న స్థంభాలను ఎక్కువగా వాడతారు.

Exam Tips:

a) భార వితరణ కొనలు ఉన్న స్తంభాల పటం గీయండి; ఆకారం వల్ల అదే పదార్థంతో ఎక్కువ భారం మోయగలదని రాయండి.

 

Question 11: భూమిపై పర్వతాల గరిష్ఠ ఎత్తు సుమారు 10 కి.మీ. మాత్రమే ఎందుకు ఉంటుందో వివరించండి.

Answer:

రాళ్ళ స్థితి స్థాపక ధర్మాలను పరిగణనలోకి తీసుకొని భూమిపై పర్వతాల గరిష్ఠ ఎత్తు సుమారు 10 కి.మీ. దాటదు అని వివరించవచ్చు.
రాయి స్థితిస్థాపక అవధి సుమారు 30 × 10⁷ న్యూ/మీ² మరియు రాయి
తయారుచేయబడిన పదార్థ సాంద్రత ρ = 3 × 10³ కి.గ్రా./మీ³.
కావున h ఎత్తు గల రాళ్ళ పర్వతాల వల్ల పర్వతం అడుగున ఉన్న రాయిపై
ప్రతిబలము = hρg న్యూ/మీ². ఈ ప్రతిబలము రాయి స్థితిస్థాపక
హద్దులలో గల ప్రతిబలము దాటరాదు. ఒకవేళ దాటితే రాయి స్థితిస్థాపక ధర్మాలు కోల్పోయి పూర్తిగా విరూపణం చెందే అవకాశం ఎక్కువ.
∴ 30 × 10⁷ = hρg లేదా 30 × 10⁷ = h . 3 × 10³ × 10
∴ h = 10⁴ = 10 కి.మీ.
అందువల్ల భూమిపై పర్వతాల ఎత్తు గరిష్ఠంగా 10 కి.మీ.కు మించదు.

Exam Tips:

a) స్థితిస్థాపక అవధి = hρg అని సమీకరించి h = 3×10⁸/(3×10³×10) = 10⁴ m అని చూపండి; ప్రమాణాలు సరిగా రాయండి.

 

Question 12: సాగదీసిన తీగలో స్థితిస్థాపక స్థితిజశక్తి భావనను వివరించి దానికి సమాసాన్ని రాబట్టండి.

Answer:

తీగపై తన్యజ ప్రతిబలం పనిచేసినపుడు అంతరపరమాణు బలాలకు వ్యతిరేకంగా పని జరుగుతుంది. ఈ పని తీగలో స్థితిస్థాపక స్థితిజశక్తిగా మిగిలిపోతుంది.
L పొడవు, A మధ్యచ్ఛేద వైశాల్యం గల తీగపై F బలం ప్రయోగించామనుకోండి. తీగ యంగ్ గుణకము Y, పొడవులో పెరుగుదల l అనుకొనుము.
\( Y = \frac{F/A}{l/L} \) సమీకరణం నుండి \( F = \frac{YAl}{L} \)
తీగ పొడవు dl పెరగడానికి చేసిన పని dW = F dl. కావున తీగను ‘l’ పొడవు సాగదీయడానికి చేసిన పని
\( W = \int dW = \int_0^l F\,dl = \int_0^l \frac{YA\,l}{L}\,dl = \frac{1}{2}\,\frac{YA\,l^2}{L} \)
\( W = \frac{1}{2}\,Y \cdot AL \cdot \frac{l^2}{L^2} = \frac{1}{2} \) × యంగ్ గుణకము × తీగ ఘ.ప. × (వికృతి)² ……………. (1)
\( \text{లేదా } W = \frac{1}{2} \times \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} \) × ఘ.ప. × (వికృతి)² = \( \frac{1}{2} \) × ప్రతిబలము × వికృతి × ఘ.ప.
ప్రమాణ ఘనపరిమాణానికి వికృతి శక్తి \( = W/\text{ఘ.ప.} = \frac{1}{2} \) × ప్రతిబలము (σ) × వికృతి (ε) …………. (2)
పై సమీకరణాలలో తీగను సాగదీయడానికి జరిపిన పని W వస్తువులో గల స్థితిస్థాపక శక్తికి సమానము.

Exam Tips:

a) W = ½ Y·AL·(l/L)² నుండి ప్రమాణ ఘనపరిమాణానికి శక్తి = ½ × ప్రతిబలం × వికృతి అని చేరండి.
b) సమాకలనంలో F = YAl/L ను ప్రతిక్షేపించడం మరచిపోకండి.

 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

Question 1: స్థితిస్థాపకతలోని హుక్ నియమాన్ని నిర్వచించి, తీగ పదార్థపు యంగ్ గుణకాన్ని కనుక్కొనే ప్రయోగాన్ని వివరించండి.

Answer:

హుక్ సూత్రము:
స్థితిస్థాపక అవధిలో ప్రతిబలము వికృతికి అనులోమానుపాతంలో ఉండును.
\( \text{ప్రతిబలము} \propto \text{వికృతి} \;\Rightarrow\; \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} = \text{స్థిరాంకం } (E) \)
E అనుపాత స్థిరాంకము. దీనిని పదార్థము యొక్క స్థితిస్థాపకతా గుణకము అందురు. పరికరం వర్ణన : యంగ్ గుణకాన్ని కనుగొనే ప్రయోగం అమరికలో సమాన పొడవు, వ్యాసార్థం గల రెండు తీగలను (A, B) దృఢమైన ఆధారం నుండి వ్రేలాడదీసి వాటి చివర ఒక వెర్నియర్ మాపకాన్ని కలుపుతారు. తీగ A ను మాపకం ప్రధాన స్కేలు (M) కు కలిపి దాని క్రింద భాగంలో ఒక స్థిరమైన బరువును కలిపి తీగ A లో నొక్కులు లేకుండా స్థిరంగా ఉండేటట్లు చేస్తారు. తీగ B ని వెర్నియర్ స్కేలుకు కలుపుతారు.. ఈ తీగకు గల పళ్ళెంలో కావలసిన విధంగా బరువులను మార్చవచ్చు. ఈ ప్రయోగంలో ప్రతిసారి ప్రధాన స్కేలు రీడింగు (M.S.R.) మరియు వెర్నియర్ స్కేలు రీడింగు (V.S.R.) లను కొలుస్తారు.
చేయు విధానము : ప్రయోగపు తీగ నొక్కులు లేకుండా ఉండటానికి తగినంత బరువును కొంకి తీగకు తగిలిస్తారు. వెర్నియర్ మాపకం రీడింగులు కొలుస్తారు. కొంకి బరువులను ప్రతిసారి 1/2 కిలో చొప్పున పెంచుతూ సుమారు 3 కి.గ్రా. వరకు బరువు పెంచుతారు. బరువు పెంచేటప్పుడు ప్రతిసారి ప్రధాన స్కేలు రీడింగు (M.S.R)
మరియు వెర్నియర్ స్కేలు రీడింగు (V.S.R) లను కొలుస్తారు.
బరువు 3 కి.గ్రా. వరకు పెంచిన తరువాత క్రమంగా ప్రతిసారి 1/2 కి.గ్రా. చొప్పున తగ్గిస్తారు. బరువు తగ్గించిన ప్రతిసారి ప్రధాన స్కేలు (M.S.R.) మరియు వెర్నియర్స్కేలు (V.S.R.) రీడింగులు కొలుస్తారు. ఈ విలువలు పట్టికలో పొందుపరుస్తారు. మొదటి రీడింగును (M₁ మరియు e₁) లను ఆధారంగా తీసుకొని ప్రతి విలువ (M₂, M₃ మరియు e₂, e₃ వంటివి) నుండి తొలి విలువ (M₁, e₁) లను తీసివేయడం ద్వారా ద్రవ్యరాశిలో మార్పు ‘m’ మరియు దానికి సంబంధించిన సాగుదల ‘e’ లను లెక్కగడతారు.
ద్రవ్యరాశిలో మార్పు m = m₂ – m₁; తీగలో సాగుదల e = e₂ – e₁

క్రమ సంఖ్యభారము 'm'సాగుదలసరాసరి 'e'm/e
బరువులు పెంచినపుడు
M.S.R. + (V.S.R. × L.C.)
బరువులు తగ్గించినపుడు
M.S.R. + (V.S.R. × L.C.)
1\(M_1\)\(e_1\)
2\(M_2\)\(e_2\)
3\(M_3\)\(e_3\)

సరాసరి = m/e; తీగపై బలము = mg
తీగ అడ్డుకోత వైశాల్యము = πr²
r = తీగ వ్యాసార్ధము
సాగుదల = e,
తీగ తొలి పొడవు = l
ప్రతిబలము \( = \left(\frac{\mathrm{F}}{\mathrm{a}}\right)=\frac{\mathrm{mg}}{\pi r^2} \)
వికృతి \( = \left(\frac{\mathrm{e}}{l}\right) \)
యంగ్ గుణకము \( Y = \left(\frac{g l}{\pi r^2}\right)\left(\frac{m}{e}\right) \)

ప్రయోగపూర్వకంగా కనుగొనిన విలువలు l, r, e, m లను ఈ సమీకరణంలో ప్రతిక్షేపించి Y విలువ కనుగొంటారు.
జాగ్రత్తలు:
1. వ్రేలాడదీయు బరువులు స్థితిస్థాపక అవధి కన్న చాలా తక్కువగా ఉండవలెను.
2. ఏకీభవించు వెర్నియర్ స్థానమును పారలాక్సు దోషము లేకుండా కొలవవలెను.

Exam Tips:

a) యంగ్ గుణకం సూత్రం Y = (g l/πr²)(m/e) ను ప్రయోగ విలువలతో ఉపయోగించండి; పటం, పట్టికను తప్పక చూపండి.
b) జాగ్రత్తలు (భారాలు స్థితిస్థాపక అవధి లోపు ఉండాలి, పారలాక్స్ దోషం రాకుండా చూడాలి) రాస్తే అదనపు మార్కులు.

 

లెక్కలు

Question 1: 1 mm వ్యాసం ఉన్న రాగి తీగను 10 N బలం అనువర్తించి సాగదీశారు. ఆ తీగలోని ప్రతిబలం కనుక్కోండి.

Answer:

వ్యాసము d = 1 mm;
బలము F = 10N;
∴ వ్యాసార్ధము r = 0.5 mm = 0.5 × 10⁻³ m
∴ ప్రతిబలము \( = \frac{\mathrm{F}}{\pi \mathrm{r}^2}=\frac{10}{3.141 \times 0.5 \times 0.5 \times 10^{-6}}=\frac{40 \times 10^6}{3.141} = 1.273 × 10⁷ \) Pa

Exam Tips:

a) r = d/2 అని మార్చి మీటర్లలో రాయండి; ప్రతిబలం = F/πr².

 

Question 2: 20 cm పొడవు వున్న టంగ్స్టన్ తీగను 0.1 cm అదనంగా సాగదీశారు. తీగలోని వికృతిని కనుక్కోండి.

Answer:

తీగ పొడవు l = 20cm = 0.2m;
సాగుదల e = 0.1cm = 1 × 10⁻³ m
\( \text{వికృతి} = \frac{\text{సాగుదల}}{\text{తొలిపొడవు}} \)
\( = \frac{1 \times 10^{-3}}{0.2} = 5 × 10⁻³ = 0.005 \)

Exam Tips:

a) వికృతి = సాగుదల/తొలి పొడవు; రెండింటినీ ఒకే ప్రమాణాలలో (మీటర్లు) రాయండి. వికృతికి ప్రమాణాలు లేవు.

 

Question 3: ఇనుప తీగను 1% సాగదీసినట్లయితే దానిలో వచ్చిన వికృతి ఎంత ?

Answer:

పొడవులో పెరుగుదల = e = 1% \( = \frac{1}{100} l \)
\( \text{వికృతి} = \frac{\text{సాగుదల}}{\text{తొలిపొడవు}} \)
\( = \frac{\mathrm{e}}{l}=\frac{1}{100 \times l}=\frac{1}{100} = 0.01 \)

Exam Tips:

a) శాతం సాగుదలను నేరుగా భిన్నంగా మార్చండి: 1% = 0.01.

 

Question 4: 1 mm వ్యాసం, 2m పొడవు ఉన్న ఇత్తడి తీగపై 20 N బలం ప్రయోగించి సాగదీశారు. పొడవులో పెరుగుదల 0.51 mm అయితే, 1) తీగ ప్రతిబలం, 2) వికృతి, 3) యంగ్ గుణకాన్ని కనుక్కోండి.

Answer:

తీగ పొడవు l = 2m;
బలము F = 20N;
వ్యాసము d = 1mm = 10⁻³ m
పొడవులో పెరుగుదల e = 0.51mm = 0.51 × 10⁻³ m
1) ప్రతిబలము \( = \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} = \frac{F}{\pi d^2/4} = \frac{20 \times 4}{3.141 \times 10^{-6}} = 2.546 \times 10^7 \) N/m²
2) వికృతి \( = \frac{\text{సాగుదల}}{\text{పొడవు}} = \frac{e}{L} = \frac{0.51 \times 10^{-3}}{2} = 0.255 \times 10^{-3} \) (వికృతికి ప్రమాణాలు లేవు)
3) యంగ్ గుణకము \( Y = \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} = \frac{2.546 \times 10^7}{0.255 \times 10^{-3}} = 9.984 \times 10^{10} \) N/m²

Exam Tips:

a) వ్యాసం ఇచ్చినపుడు వైశాల్యం = πd²/4 వాడండి; వికృతికి ప్రమాణం రాయకండి.

 

Question 5: రాగి, అల్యూమినియం తీగల పొడవుల నిష్పత్తి 3: 2, వ్యాసాల నిష్పత్తి 2: 3, వీటిపై అనువర్తిత బలాల నిష్పత్తి 4 : 5గా ఉన్నాయి. రెండు తీగల పొడవుల పెరుగుదల నిష్పత్తిని కనుక్కోండి. (YCu = 1.1 × 10¹¹ Nm ⁻², YAl = 0.7 × 10¹¹ Nm ⁻²)

Answer:

పొడవుల నిష్పత్తి l₁ : l₂ = 3 : 2 ;
వ్యాసముల నిష్పత్తి d₁ : d₂ = 2 : 3
బలాల నిష్పత్తి F₁ : F₂ = 4:5
Y₁ = రాగి యంగ్ గుణకము : 1.1 × 10¹¹
Y₂ = అల్యూమినియం యంగ్ గుణకము = 0.7 × 10¹¹
సాగుదల నిష్పత్తి e₁ : e₂ = ?
\( e = \frac{\mathrm{Fl}}{\mathrm{AY}}=\frac{4 \mathrm{~F} l}{\pi \mathrm{d}^2 \mathrm{Y}} \)
∴ \( \frac{\mathrm{e}_1}{\mathrm{e}_2}=\frac{4 \mathrm{~F}_1 l_1}{\pi \mathrm{d}_1^2 \mathrm{Y}_1} \times \frac{\pi \mathrm{d}_2^2 \mathrm{Y}_2}{4 \mathrm{~F}_2 l_2} \)
⇒ \( \frac{\mathrm{e}_1}{\mathrm{e}_2}=\frac{\mathrm{F}_1 l_1 \mathrm{~d}_2^2 \mathrm{Y}_2}{\mathrm{~F}_2 l_2 \mathrm{~d}_1^2 \mathrm{Y}_1}=\frac{4 \times 3 \times 3^2 \times 0.7 \times 10^{11}}{5 \times 2 \times 2^2 \times 1.1 \times 10^{11}}=\frac{189}{110} \)
∴ e₁ : e₂ = 189 : 110

Exam Tips:

a) e = Fl/AY లో A ∝ d² అని వాడి నిష్పత్తులను ఒకేసారి లెక్కించండి.
b) రాగి తీగ Y₁, అల్యూమినియం Y₂ — భాగహారంలో వాటి స్థానం మారకుండా చూడండి.

 

Question 6: 2 mm² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ఇత్తడి తీగ ఒక కొనను ద్రుఢ ఆధారానికి బిగించి రెండో కొనకు 100 cm³ ఘనపరిమాణం ఉన్న వస్తువును కట్టారు. వస్తువును నీటిలో పూర్తిగా ముంచినప్పుడు తీగ పొడవు 0.11 mm తగ్గింది. తీగ సహజ పొడవును
కనుక్కోండి. (Yఇత్తడి : 0.91 × 10¹¹ Nm ⁻², ρనీరు = 10³ kg m ⁻³)

Answer:

అడ్డుకోత వైశాల్యము A = 2mm² = 2 × 10⁻⁶ m²
వస్తువు ఘనపరిమాణము V = 100cc = 100 × 10⁻⁶ m³
పొడవులో తగ్గుదల e’ = 0.11mm = 0.11 × 10⁻³ m
ఇత్తడి యంగ్ గుణకము Y = 0.91 × 10¹¹ N/m²
నీరు సాంద్రత ρ = 1000 kg / m ³; సాగుదల తగ్గుదల e’ \( = \frac{\mathrm{V} \rho \mathrm{g} l} {\mathrm{AY}} \) ని ఉపయోగించగా
తీగ సహజ పొడవు \( l = \frac{\mathrm{e}^{\prime} \mathrm{AY}}{\mathrm{V} \rho \mathrm{g}}=\frac{0.11 \times 10^{-3} \times 2 \times 10^{-6} \times 0.91 \times 10^{11}}{100 \times 10^{-6} \times 1000 \times 9.8} \)
∴ \( l = \frac{20.02}{0.98} = 20.43 \) m

Exam Tips:

a) నీటిలో ముంచినపుడు కొత్త తన్యత తగ్గుదల = ఉత్ప్లవ బలం Vρg; దీనివల్లే సాగుదల తగ్గుతుంది.
b) V = 100 cm³ = 10⁻⁴ m³ అని మార్చడంలో తప్పులు జరగకుండా చూడండి.

 

Question 7: ఒకే పదార్థంతో చేసిన రెండు తీగల వ్యాసార్ధాల, పొడవుల నిష్పత్తులు ఒకే విధంగా ఉన్నాయి. ఆ నిష్పత్తి 1 : 2 రెండింటిలోనూ వచ్చిన దైర్ఘ్యవృద్ధి సమంగా ఉంటే, వాటిపై వేసిన భారాల నిష్పత్తి ఎంత ?

Answer:

పొడవుల నిష్పత్తి l₁ : l₂ = 1 : 2; .
తీగలలో సాగుదలలు సమానము ⇒ e₁ = e₂;
వ్యాసార్ధముల నిష్పత్తి r₁ : r₂ = 1 : 2
రెండు తీగలు ఒకే పదార్థముతో చేయబడినవి ⇒ Y₁ = Y₂
వ్రేలాడదీసిన ద్రవ్యరాశుల నిష్పత్తి m₁ : m₂ = ?
\( Y = \frac{\mathrm{mg}}{\pi \mathrm{r}^2} \frac{\mathrm{l}}{\mathrm{e}} \) ని ఉపయోగించగా
\( \frac{\mathrm{m}_1}{\mathrm{~m}_2}=\frac{\mathrm{Y}_1 \mathrm{r}_1^2 l_2} {l_1 \mathrm{Y}_2 \mathrm{r}_2^2}=\frac{1 \times 2}{1 \times 2^2}=\frac{1}{2} ∴ m₁ : m₂ = 1 : 2 \)

Exam Tips:

a) భారాల నిష్పత్తికి m ∝ Y r² e / l సూత్రం వాడండి; ఇక్కడ Y, e సమానం.

 

Question 8: వేరు వేరు పదార్థాలతో చేసిన రెండు తీగలు ఒకే పొడవు, మధ్యచ్ఛేదాన్ని కలిగి ఉన్నాయి. వీటిపై సమానమైన బలాలను అనువర్తించినప్పుడు రెండింటి పొడవుల పెరుగుదల నిష్పత్తి ఎంత ?
(Y₁ = 0.9 × 10¹¹ Nm ⁻², Y₂ = 3.60 × 10¹¹ Nm ⁻²)

Answer:

రెండు తీగల పొడవులు సమానము ⇒ l₁ = l₂; తీగల అడ్డుకోత వైశాల్యములు
సమానము A₁ = A₂
Y₁ = 0.9 × 10¹¹ Nm⁻²
Y₂ = 3.60 × 10¹¹ Nm⁻²
సాగుదల \( e = \frac{\mathrm{Fl}}{\mathrm{AY}} \)
∴ \( \frac{e_1}{e_2}=\frac{F_1 l_1}{A_1 Y_1} \cdot \frac{A_2 Y_2}{F_2 l_2} (∵ \) ఇందులో F, l మరియు A లు సమానము)
∴ \( \frac{e_1}{e_2}=\frac{Y_2}{Y_1} \)
∴ \( \frac{e_1}{e_2}=\frac{3.60 \times 10^{11}}{0.9 \times 10^{11}}=\frac{4}{1} \) (లేదా) e₁ : e₂ = 4 : 1

Exam Tips:

a) బలం, పొడవు, వైశాల్యం సమానమైతే సాగుదల 1/Y కు అనులోమానుపాతం; కాబట్టి e₁:e₂ = Y₂:Y₁.

 

Question 9: 2.5 m పొడవు, 1.5 × 10⁻⁶ m² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న లోహతీగను 2 mm సాగదీశారు. తీగ యంగ్ గుణకం 1.25 × 10¹¹ Nm⁻² అయితే దానిలో ఉండే తన్యతను కనుక్కోండి.

Answer:

తీగ పొడవు l = 2.5m
సాగుదల e = 2 mm = 2 × 10⁻³ m
అడ్డుకోత వైశాల్యము A = 1.5 × 10⁻⁶ m²
Y = 1.25 × 10¹¹ N/m²
తన్యత T = mg = F = ?
\( Y = \frac{\mathrm{Fl}}{\mathrm{Ae}} ⇒ F = \frac{\mathrm{YAe}}{l} \)
∴ \( T = \frac{1.25 \times 10^{11} \times 1.5 \times 10^{-6} \times 2 \times 10^{-3}} {2.5} = \frac{3.75 \times 10^2}{2.5} = 150 N \)

Exam Tips:

a) F = YAe/l; 10 యొక్క ఘాతాలను జాగ్రత్తగా కూడండి (వైశాల్యం 10⁻⁶ m²).

 

Question 10: ఒకే పొడవు, మధ్యచ్ఛేదం ఉన్న అల్యూమినియం, ఉక్కు తీగల కొనలను కలిపారు. ఈ మిశ్రమ తీగ ఒక కొనను దృఢ ఆధారానికి బిగించి రెండో కొనకు భారాన్ని వేలాడదీశారు. మిశ్రమ తీగ పొడవులో పెరుగుదల 1.35 mm ఉంటే 1) రెండు తీగలపై పనిచేసే ప్రతిబలాల 2) రెండు తీగలలో వచ్చే వికృతుల నిష్పత్తులను కనుక్కోండి.
(YAl = 0.7 × 10¹¹ Nm⁻², Yఉక్కు = 2 × 10¹¹ Nm⁻²)

Answer:

i) రెండు తీగల పొడవులు సమానము ⇒ l₁ = l₂; అడ్డుకోత వైశాల్యములు సమానము ⇒ A₁ = A₂.
సంయోగ తీగలో రెండు తీగలపై ఒకే బలము F పనిచేయును; ∴ ప్రతిబలాల నిష్పత్తి = 1 : 1
ii) మొత్తము సాగుదల e = 1.35 mm = eAl + eS
అల్యూమినియం యంగ్ గుణకము \( Y_{Al} = 0.7 \times 10^{11} \) N/m², ఉక్కు యంగ్ గుణకము \( Y_S = 2 \times 10^{11} \) N/m²
సాగుదల \( e = \frac{Fl}{AY} \) లో F, l మరియు A లు సమానము. ∴ \( e \propto \frac{1}{Y} \) లేదా \( \frac{e_{Al}}{e_S} = \frac{Y_S}{Y_{Al}} = \frac{20 \times 10^{10}}{7 \times 10^{10}} = \frac{20}{7} \)
(అనగా \( e_{Al} = 1.0 \) mm, \( e_S = 0.35 \) mm). తీగల పొడవులు సమానం కావున వికృతుల నిష్పత్తి కూడా సాగుదలల నిష్పత్తికి సమానం.
∴ తీగలలో వికృతుల నిష్పత్తి (Al : ఉక్కు) = 20 : 7

Exam Tips:

a) శ్రేణిలో కలిపిన తీగలలో బలం సమానం కాబట్టి ప్రతిబలాల నిష్పత్తి 1 : 1.
b) పొడవు, వైశాల్యం సమానం కాబట్టి వికృతి ∝ 1/Y.

 

Question 11: ఒక పదార్థంతో చేసిన 2 cm భుజం కలిగిన ఘనంపై ప్రయోగించిన 0.3 N స్పర్శాబలం దాని పై తలాన్ని 0.15 cm స్థానభ్రంశం చెందించింది. ఘనం కింది తలాన్ని స్థిరంగా ఉంచారు. పదార్థం విమోటన గుణకం కనుక్కోండి.

Answer:

ఘనము యొక్క ఒక భుజము పొడవు a = 2.0 cm = 2 × 10⁻² m
∴ ఘనము యొక్క ఒక తలము వైశాల్యము A = 4 × 10⁻⁴ m²
ఉపరితల పొర స్థానభ్రంశం Δx = 0.15 cm = 0.15 × 10⁻² m; స్పర్శీయ బలము F = 0.30 N
విమోటనా గుణకము \( \eta = \frac{F}{A} \cdot \frac{x}{\Delta x} = \frac{0.30}{4 \times 10^{-4}} \times \frac{2 \times 10^{-2}}{0.15 \times 10^{-2}} \)
∴ \( \eta = \frac{0.60 \times 10^{-2}}{0.60 \times 10^{-6}} = 1 \times 10^4 \) N/m²

Exam Tips:

a) విమోటన గుణకం G = (F/A)(x/Δx); ఇక్కడ A = భుజం² (తలం వైశాల్యం).

 

Question 12: 1000 cm³ ఘనపరిమాణం ఉన్న గోళాకార బంతిపై 10 atm పీడనాన్ని ప్రయోగించారు. ఘనపరిమాణంలో వచ్చిన మార్పు 10⁻² cm³. బంతిని ఇనుముతో తయారుచేసినట్లైతే దాని ఆయత గుణకాన్ని కనుక్కోండి. (1 atm = 1 × 10⁵ Nm⁻²)

Answer:

గోళాకార బంతి ఘనపరిమాణము V = 1000 cm³ = 10⁻³ m³ (∵ 1 m³ = 10⁶ cm³)
పీడనము P = 10 atm = 10 × 10⁵ Pa = 10⁶ Pa (∵ 1 atm = 10⁵ Pa)
ఘనపరిమాణములో మార్పు ΔV = 10⁻² cm³ = 10⁻⁸ m³; ఆయత గుణకము K = ?
\( K = \frac{PV}{\Delta V} = \frac{10^6 \times 10^{-3}}{10^{-8}} = 1 \times 10^{11} \) N/m²

Exam Tips:

a) పీడనాన్ని atm నుండి Pa లోకి, ఘనపరిమాణాన్ని cm³ నుండి m³ లోకి మార్చండి.

 

Question 13: 1 cm భుజం ఉన్న రాగి ఘనాన్ని 100 atm పీడనానికి గురిచేశారు. రాగి ఆయత గుణకం 1.4 × 10¹¹ Nm⁻² అయితే ఘనపరిమాణంలో వచ్చే మార్పును కనుక్కోండి. (1 atm = 1 × 10⁵ Nm ⁻²)

Answer:

ఒక రాగి ఘనము ఒక్కొక్క భుజము పొడవు ‘a’ 1 సెం.మీ. = 10⁻² m
∴ ఘనము ఘనపరిమాణము = 10⁻⁶ m³
పీడనము P = 100 అట్మాస్పియర్లు = 100 × 10⁵ = 10⁷ పాస్కల్లు
స్థూల గుణకము K = 1.4 × 10¹¹ N/m ²;
ఘనపరిమాణములో మార్పు ∆\( V = \frac{P . V}{K}=\frac{10^7 \times 10^{-6}}{1.4 \times 10^{11}}=\frac{10^{-10}}{1.4} \)
= 0.7143 × 10⁻¹⁰ m³ (= 7.143 × 10⁻¹¹ m³)

Exam Tips:

a) ΔV = PV/K; ఘనం ఘనపరిమాణం 10⁻⁶ m³ అని మార్చడం మరచిపోకండి.

 

Question 14: ఇచ్చిన నీటి ఘనపరిమాణాన్ని 2% తగ్గించడానికి ఎంత పీడనం అవసరమవుతుంది ? నీటి ఆయత గుణకం 2.2 × 10⁹ Nm ⁻².

Answer:

స్థూల వికృతి \( = \frac{\Delta \mathrm{V}}{\mathrm{V}} = 2\% ⇒ ∆V = \frac{2}{100} V \)
స్థూల గుణకము _ K = 2.2 × 10⁹ Nm⁻²
∴ కావలసిన పీడనము \( P = \frac{K\,\Delta V}{V} = \frac{2.2 \times 10^9 \times 2V}{V \times 100} = 4.4 \times 10^7 \) పాస్కల్

Exam Tips:

a) P = K(ΔV/V); ΔV/V = 2% = 0.02 ని నేరుగా వాడండి, V విలువ అవసరం లేదు.

 

Question 15: 20 cm పొడవు ఉన్న ఉక్కు తీగను సాగదీసి దాని పొడవును 0.2 cm పెంచారు. ఉక్కు ప్వాజూన్ నిష్పత్తి 0.19 అయితే, తీగలో వచ్చే పార్శ్వ వికృతి ఎంత ?

Answer:

తీగ పొడవు l = 20cm = 0.20m, ప్వాజూన్ నిష్పత్తి σ = 0.19
పొడవులో సాగుదల ∆l = 0.2 cm = 2 × 10⁻³ m;
పార్శ్వీయ వికృతి = ?
పార్శ్వ వికృతి = σ × అనుదైర్ఘ్య వికృతి ‘e’;
కాని \( e = \frac{\Delta l}{l} \)
∴ పార్శ్వీయ వికృతి \( = σ \frac{\Delta l}{l} = \frac{0.19 \times 2 \times 10^{-3}} {0.20} = 1.9 × 10⁻³ = 0.0019 \) (వికృతికి ప్రమాణాలు లేవు)

Exam Tips:

a) పార్శ్వ వికృతి = ప్వాజూన్ నిష్పత్తి × అనుదైర్ఘ్య వికృతి; cm ను m గా మార్చి లేదా నిష్పత్తిగా వాడండి.

 

ముఖ్యమైన అదనపు లెక్కలు

Question 1: 4.7 m పొడవు, 3.0 × 10⁻⁵ m² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ఉక్కు తీగ, 3.5 m పొడవు, 4.0 × 10⁻⁵ m² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న రాగి తీగ రెండూ ఇచ్చిన భారం వల్ల సమానంగా సాగాయి. ఉక్కు, రాగి యంగ్ గుణకాల నిష్పత్తి ఎంత ?

Answer:

ఉక్కు తీగకు \( a_1 = 3.0 \times 10^{-5} \) m²; \( l_1 = 4.7 \) m; \( \Delta l_1 = \Delta l \); \( F_1 = F \)
రాగి తీగకు \( a_2 = 4.0 \times 10^{-5} \) m²; \( l_2 = 3.5 \) m; \( \Delta l_2 = \Delta l \); \( F_2 = F \)
\( Y_1, Y_2 \) లను వరుసగా ఉక్కు, రాగి యంగ్ గుణకాలు అనుకొనుము.
\( \therefore\ Y_1 = \frac{F_1}{a_1} \times \frac{l_1}{\Delta l_1} = \frac{F}{3.0 \times 10^{-5}} \times \frac{4.7}{\Delta l} \) ………… (i)
మరియు \( Y_2 = \frac{F_2 \times l_2}{a_2 \times \Delta l_2} = \frac{F}{4.0 \times 10^{-5}} \times \frac{3.5}{\Delta l} \) ………… (ii)
\( \therefore\ \frac{Y_1}{Y_2} = \frac{4.7 \times 4.0 \times 10^{-5}}{3.5 \times 3.0 \times 10^{-5}} = 1.79 \approx 1.8 \); కావున \( Y_1 : Y_2 = 1.8 : 1 \)

Exam Tips:

a) రెండు తీగలకు F, Δl సమానం కాబట్టి Y₁/Y₂ = (l₁ a₂)/(l₂ a₁) అని సూత్రీకరించి లెక్కించండి.

 

Question 2: పటంలో ఒక పదార్థం వికృతి-ప్రతిబలం వక్రం చూపించడమైనది. ఈ పదార్థం ఎ) యంగ్ గుణకం, బి) ఉజ్జాయింపు ఈగే సామర్థ్యం ఎంత ?

Answer:

ఎ) గ్రాఫ్ నుండి ప్రతిబలము = 150 × 10⁶ Nm⁻², వికృతి = 0.002
\( Y = \frac{\text{ప్రతిబలము}}{\text{వికృతి}} = \frac{150 \times 10^6}{0.002} \) = 7.5 × 10¹⁰ Nm⁻²
బి) ఉజ్జాయింపుగా ఈగే సామర్థ్యము అది భరించగల అత్యధిక ప్రతిబలానికి సమానము.
∴ ఉజ్జాయింపుగా ఈగే సామర్థ్యము
= 300 × 10⁶ Nm⁻² = 3 × 10⁸ Nm⁻²

Exam Tips:

a) గ్రాఫ్ సరళ భాగం నుండి ఒక బిందువు తీసుకుని Y = ప్రతిబలం/వికృతి లెక్కించండి; ఈగే సామర్థ్యం కోసం గ్రాఫ్‌లో ఎత్తైన ప్రతిబలం చదవండి.

 

Question 3: రెండు పదార్థాలు A, B ప్రతిబలం – వికృతి వక్రాలను పటంలో ఇవ్వడమైంది. రెండు వక్రాలను ఒకే స్కేలు ప్రకారం గీశారు.
ఎ) రెండు పదార్థాల్లో ఏ పదార్థం యంగ్ గుణకం ఎక్కువ ?
బి) రెండు పదార్థాల్లో ఏది బలమైనది ?

Answer:

ఎ) ఇచ్చిన రెండు ప్రతిబలము – వికృతి రేఖాపటాలలో A గ్రాఫ్ ప్రతిబలము B కన్న ఎక్కువ కావున A కి యంగ్ గుణకము ఎక్కువ (Y = ప్రతిబలము/వికృతి కావున).
బి) ఒక వస్తువు యొక్క దృఢత్వము దానిని తెంపటానికి కావలసిన ప్రతిబలంపై ఆధారపడును. A కి విచ్ఛేదన ప్రతిబలం ఎక్కువ కావున A బలమైనది.

Exam Tips:

a) యంగ్ గుణకం = వక్రం ఏటవాలు; బలం = విచ్ఛేదన ప్రతిబలం — ఈ రెండింటినీ వేర్వేరుగా గుర్తుంచుకోండి.

 

Question 4: కింద ఇచ్చిన రెండు ప్రవచనాలను జాగ్రత్తగా చదివి అది తప్పా, ఒప్పా కారణాలతో వివరించండి.
ఎ) రబ్బరు యంగ్ గుణకం ఉక్కు కంటే ఎక్కువ.
బి) తీగ చుట్ట సాగుదలను దాని విమోటన గుణకం ఆధారంగా నిర్ణయించవచ్చు.

Answer:

ఎ) ఈ వాక్యము అబద్ధము. ఒకే ప్రతిబలానికి స్టీలు కన్న రబ్బరుకు వికృతి ఎక్కువ. స్థితిస్థాపక గుణకము వికృతికి విలోమానుపాతంలో ఉండును (Y ∝ 1/వికృతి).
బి) ఈ వాక్యము నిజము. స్ప్రింగ్ను సాగదీస్తే మనం వాడిన బలం తీగ పొడవు మారకుండా స్ప్రింగ్ ఆకారాన్ని మారుస్తుంది. అందువల్ల ఈ ప్రక్రియలో దృఢతా గుణకము లెక్కలోనికి వస్తుంది.

Exam Tips:

a) రబ్బరుకు వికృతి ఎక్కువ కాబట్టి Y తక్కువ; స్ప్రింగ్ సాగదీతలో విమోటన గుణకమే నియంత్రిస్తుంది.

 

Question 5: పటంలో చూపించినట్లు 0.25 cm వ్యాసం ఉన్న ఉక్కు, ఇత్తడి తీగలను భారయుతం చేశారు. భారరహిత స్థితిలో ఉక్కుతీగ పొడవు 1.5 m, ఇత్తడి తీగ పొడవు 1.0 m. ఉక్కు, ఇత్తడి తీగలలో వచ్చే దైర్ఘ్యవృద్ధి లెక్కించండి.

Answer:

ఉక్కుతీగపై మొత్తం బలము (4 kg + 6 kg భారాలు)
F₁ = 4 + 6 = 10 kg f = 10 × 9.8 N;
l₁ = 1.5 m, ∆l₁ = ?; 2r₁ = 0.25 cm
లేదా r₁ = (0.25/2) cm = 0.125 × 10⁻² m;
Y₁ = 2.0 × 10¹¹ Pa
ఇత్తడి తీగకు F₂ = 6.0 kg f = 6 × 9.8 N; 2r₂ = 0.25 cm
లేదా r₂ = (0.25/2) cm = 0.125 × 10⁻² m;
Y₂ = 0.91 × 10¹¹ Pa, l₂ = 1.0 m, ∆l₂= ?
\( Y₁ = \frac{\mathrm{F}_1 \times l_1}{\mathrm{a}_1 \times \Delta l_1}=\frac{\mathrm{F}_1 \times l_1}{\pi \mathrm{r}_1^2 \times \Delta l_1} \)
లేదా \( \Delta l_1 = \frac{F_1 \times l_1}{\pi r_1^2 \times Y_1} = \frac{(10 \times 9.8) \times 1.5 \times 7}{22 \times (0.125 \times 10^{-2})^2 \times 2 \times 10^{11}} = 1.49 \times 10^{-4} \) m
మరియు \( \Delta l_2 = \frac{F_2 \times l_2}{\pi r_2^2 \times Y_2} = \frac{(6 \times 9.8) \times 1.0 \times 7}{22 \times (0.125 \times 10^{-2})^2 \times (0.91 \times 10^{11})} = 1.3 \times 10^{-4} \) m

Exam Tips:

a) ఉక్కు తీగ దిగువన ఉన్న రెండు భారాలనూ (4+6 kg) మోస్తుంది, ఇత్తడి తీగ 6 kg మాత్రమే — బలాన్ని సరిగా కనుక్కోండి.

 

Question 6: అల్యూమినియం ఘనం అంచు పొడవు 10 cm. ఘనం ఒక తలాన్ని నిలువు గోడకు గట్టిగా బిగించారు. ఘనం ఎదురు తలానికి 100 kg ద్రవ్యరాశిని తగిలించారు. అల్యూమినియం విమోటన గుణకం 25 GPa. ఈ తలం నిట్టనిలువు అపవర్తనం ఎంత ?

Answer:

A = 0.10 × 0.10 = 10⁻² m ²; F = mg = 100 × 10 N
విమోటన వికృతి \( = \frac{\Delta \mathrm{L}}{\mathrm{L}} = \frac{(\mathrm{F} / \mathrm{A})}{\mathrm{G}} \) or ∆\( L = \frac{\mathrm{FL}}{\mathrm{AG}} = \frac{(100 \times 10) \times 0.10}{10^{-2} \times\left(25 \times 10^9\right)} = 4 × 10⁻⁷ m. \)

Exam Tips:

a) విమోటన బలం ప్రతిబలం F/A, వికృతి ΔL/L; ΔL = FL/AG, G = 25×10⁹ Pa.

 

Question 7: 50,000 kg ద్రవ్యరాశి ఉన్న భారీ కట్టడానికి ఆధారంగా నాలుగు బోలు స్థూపాకార, మృదు ఉక్కుస్తంభాలు ఉన్నాయి. ప్రతీ స్తంభం లోపలి, బాహ్య వ్యాసార్ధాలు వరుసగా 30, 60 cm గా ఉన్నాయి. భార వితరణ ఏకరీతిగా ఉన్నదనుకొని ప్రతీ స్తంభంలో వచ్చే సంపీడన వికృతిని కనుక్కోండి.

Answer:

\( F = \frac{50{,}000}{4} \) kg wt \( = \frac{50{,}000 \times 9.8}{4} \) N
ఒక్కొక్క స్తంభం మధ్యచ్ఛేద వైశాల్యం \( A = \pi (r_2^2 - r_1^2) = \frac{22}{7}\left[(0.60)^2 - (0.30)^2\right] = \frac{22}{7} \times 0.27 \) m²
సంపీడన వికృతి \( = \frac{F/A}{Y} = \frac{F}{AY} = \frac{50{,}000 \times 9.8}{4 \times \frac{22}{7} \times 0.27 \times 2.0 \times 10^{11}} = 7.21 \times 10^{-7} \)

Exam Tips:

a) ఒక్కో స్తంభానికి భారం = మొత్తం బరువు/4; వైశాల్యం = π(r₂²−r₁²) (బోలు స్థూపం).

 

Question 8: 15.2 mm × 19.1 mm కొలతలు ఉన్న దీర్ఘచతురస్రాకార రాగి ముక్కను 44,500 N తన్యత బలంతో కేవలం స్థితిస్థాపక విరూపణ కలిగే విధంగా లాగారు. దాని మూలంగా కలిగే ఫలిత వికృతిని గణించండి.

Answer:

దత్తాంశం నుండి A = 15.2 × 19.1 × 10⁻⁶ m² = 2.903 × 10⁻⁴ m²; F = 44,500 N; రాగి యంగ్ గుణకము Y = 1.1 × 10¹¹ Nm⁻²
తన్యత వికృతి \( = \frac{F/A}{Y} = \frac{F}{AY} = \frac{44500}{(15.2 \times 19.1 \times 10^{-6}) \times (1.1 \times 10^{11})} = 1.39 \times 10^{-3} \)

Exam Tips:

a) తన్యత వికృతికి యంగ్ గుణకం వాడాలి, విమోటన గుణకం కాదు; mm² ను m² గా మార్చండి.

 

Question 9: స్కీయింగ్ ప్రాంతంలో ఉన్న చైర్ లిఫ్ట్ను మోసే ఉక్కు కేబుల్ వ్యాసార్ధం 1.5cm. గరిష్ట ప్రతిబలం విలువ 10⁸ Nm⁻² ను దాటకూడదు. అంటే, కేబుల్ గరిష్ఠంగా ఎంత బరువును మోయగలదు ?

Answer:

గరిష్ఠ భారము = గరిష్ఠ ప్రతిబలము × అడ్డుకోత వైశాల్యము
= 10⁸ × πr² = 10⁸ × (22/7) × (1.5 × 10 ⁻²)² = 7.07 × 10⁴ N

Exam Tips:

a) గరిష్ఠ భారం = గరిష్ఠ ప్రతిబలం × వైశాల్యం; వ్యాసార్ధం cm నుండి m కి మార్చండి.

 

Question 10: 15 kg ద్రవ్యరాశి ఉన్న ద్రుఢమైన కడ్డీని సౌష్ఠవంగా అమర్చి ఉన్న మూడు తీగలు మోస్తున్నాయి. ప్రతి తీగ పొడవు 2.0 m. రెండు చివరల ఉన్న తీగలు రాగికి కాగా, మధ్యలో తీగ ఇనుముతో తయారయింది. అన్ని సమాన తన్యతను కలిగి ఉండాలంటే, వాటి వ్యాసాల నిష్పత్తులు ఎలా ఉండాలి ?

Answer:

ప్రతీ తీగ ఒకే తన్యత T ను కల్గి ఉన్నందున, అవి ద్రుఢమైన కడ్డీ ద్రవ్యరాశి కారణంగా ఒకే విధమైన సాగుదలను కలిగి ఉంటాయి. ప్రతీ తీగ ఒకే పొడవు కలిగి ఉన్నందున వాటికి సమాన వికృతి ఉంటుంది. తీగ వ్యాసం D అయితే
\( Y = \frac{4 \mathrm{~F} / \pi \mathrm{D}^2}{\text { వికృతి }} \) (లేదా) D² ∝ 1/Y ∴ \( \frac{D_{\mathrm{cu}}}{\mathrm{D}_{\mathrm{iron}}} = \sqrt{\frac{Y_{\text {iron }}}{Y_{\mathrm{Cu}}}} = \sqrt{\frac{190 \times 10^9}{110 \times 10^9}} = \sqrt{\frac{19}{11}} = 1.31 \)

Exam Tips:

a) సమాన సాగుదల, సమాన పొడవు అంటే వికృతి సమానం; కాబట్టి D² ∝ 1/Y.

 

Question 11: 1.0 m సహజ పొడవు ఉన్న ఉక్కు తీగ ఒక చివర 14.5 kg ద్రవ్యరాశిని కట్టి నిలువు తలంలో వృత్తాకారంగా తిప్పారు. దాని కనిష్ఠ బిందువు వద్ద కోణీయ వేగం 2 rev/s. తీగ మధ్యచ్ఛేద వైశాల్యం 0.065 cm ². ద్రవ్యరాశి వృత్తాకార పథంలో కనిష్ఠ బిందువు వద్ద ఉన్నప్పుడు తీగలో వచ్చే దైర్ఘ్యవృద్ధిని లెక్కించండి.

Answer:

దత్తాంశం నుండి m = 14.5 kg; l = r = 1 m; v = 2 rps; A = 0.065 × 10⁻⁴ m²
నిలువు వృత్తంలో కనిష్ఠ బిందువు వద్ద మొత్తము బలము
F = mg + mr ω² = mg + mr 4 π² v² = 14.5 × 9.8 + 14.5 × 1 × 4 × (22/7)² × 2² = 142.1+ 2291.6 = 2433.7 N
\( Y =\frac{\mathrm{F}}{\mathrm{A}} \times \frac{l}{\Delta l} \) or ∆l =
\( \frac{\mathrm{Fl}}{\mathrm{AY}}=\frac{2433.7 \times 1}{\left(0.065 \times 10^{-4}\right) \times\left(2 \times 10^{11}\right)} = 1.87 × 10⁻³ m = 1.87mm \)

Exam Tips:

a) కనిష్ఠ బిందువు వద్ద తన్యత = mg + mrω²; ω = 2πν (ν = 2 rev/s).

 

Question 12: క్రింద ఇచ్చిన దత్తాంశం సహాయంతో నీటి ఆయత గుణకాన్ని కనుక్కోండి. తొలి ఘనపరిమాణం = 100.0 litre, పీడనం పెరుగుదల = 100.0 atm (1 atm = 1.013 × 10⁵ Pa), తుది ఘనపరిమాణం = 100.5 litre. నీటి ఆయత గుణకాన్ని గాలి (స్థిర ఉష్ణోగ్రత వద్ద) ఆయత గుణకంతో పోల్చండి. ఈ నిష్పత్తి ఎందుకు చాలా అధికంగా ఉంటుందో సులభరీతిలో వివరించండి.

Answer:

దత్తాంశం నుండి V = 100 litre = 100 × 10⁻³ m ³; p = 100 atm = 100 × 1.013 × 10⁵ Pa.
V + ∆V = 100.5 లీటర్లు (లేదా) ∆V = (V + ∆V) – V = 100.5 – 100 = 0.5 litre = 0.5 ×10⁻³ m ³.
ఆయత గుణకము\( , B = \frac{\mathrm{pV}}{\Delta \mathrm{V}} = \frac{100 \times 1.013 \times 10^5 \times 100 \times 10^{-3}}{0.5 \times 10^{-3}} = 2.026 × 10⁹ \) Pa
గాలి ఆయత గుణకము 1.0 × 10⁵ Pa
\( \frac{\text{నీటి ఆయత గుణకం}}{\text{గాలి ఆయత గుణకం}} = \frac{2.026 \times 10^9}{1.0 \times 10^5} = 2.026 \times 10^4 \)
వాయువులలో అణువుల మధ్య దూరము చాలా ఎక్కువ. వాటి మధ్య గల బంధాలు చాలా బలహీనమైనవి. అందువల్ల ద్రవాల కన్నా వాయువుల ఆయత గుణకం చాలా తక్కువ.

Exam Tips:

a) ఘనపరిమాణంలోని మార్పు |ΔV| = 0.5 లీటర్ (తగ్గుదల); B = pV/ΔV, లీటర్లను m³ లోకి మార్చండి.

 

Question 13: ఉపరితలంపై నీటి సాంద్రత 1.03 × 10³ kg m⁻³ గా ఉన్నట్లయితే, 80.00 atm పీడనం ఉండే లోతులో నీటి సాంద్రత ఎంత ఉంటుంది ?

Answer:

దత్తాంశం నుండి p = 80.00 atm = 80.0 × 1.013 × 10⁵ Pa; సంపీడ్యత \( \frac{1}{B} = 45.8 \times 10^{-11} \) Pa⁻¹
ఉపరితలం వద్ద నీటి సాంద్రత ρ = 1.03 × 10³ kg m⁻³
M ద్రవ్యరాశి గల నీటికి ఉపరితలం వద్ద మరియు ఇచ్చిన లోతు వద్ద నీటి ఘనపరిమాణాలు
\( V = \frac{M}{\rho} \) మరియు V’ \( = \frac{\mathrm{M}}{\rho^{\prime}} \)
∴ ఘనపరిమాణంలో మార్పు \( \Delta V = V - V^{\prime} = M\left(\frac{1}{\rho} - \frac{1}{\rho^{\prime}}\right) \)
∴ ఘనపరిమాణ వికృతి \( \frac{\Delta V}{V} = M\left(\frac{1}{\rho} - \frac{1}{\rho^{\prime}}\right) \times \frac{\rho}{M} = 1 - \frac{\rho}{\rho^{\prime}} \) (లేదా) \( \frac{\Delta V}{V} = 1 - \frac{1.03 \times 10^3}{\rho^{\prime}} \) ………… (i)
ఆయత గుణకం \( B = \frac{pV}{\Delta V} \) లేదా \( \frac{\Delta V}{V} = \frac{p}{B} \)
∴ \( \frac{\Delta V}{V} = (80.0 \times 1.013 \times 10^5) \times 45.8 \times 10^{-11} = 3.712 \times 10^{-3} \)
ఈ విలువ సమీకరణం (i) లో రాయగా
\( 1 - \frac{1.03 \times 10^3}{\rho^{\prime}} = 3.712 \times 10^{-3} \) (లేదా) \( \rho^{\prime} = \frac{1.03 \times 10^3}{1 - 3.712 \times 10^{-3}} = 1.034 \times 10^3 \) kg m⁻³

Exam Tips:

a) ΔV/V = p/B సమీకరణం నుండి సాంద్రత మార్పును ρ′ = ρ/(1 − ΔV/V) గా రాబట్టండి.

 

Question 14: 10 atm హైడ్రాలిక్ పీడనానికి గురిచేసిన గాజు పలక ఘనపరిమాణంలో వచ్చే అంశిక మార్పు కనుక్కోండి.

Answer:

దత్తాంశం నుండి p = 10 atm = 10 × 1.013 × 10⁵ Pa; B = 37 × 10⁹ Nm⁻²
ఘనపరిమాణ వికృతి \( = \frac{\Delta \mathrm{V}}{\mathrm{V}}=\frac{\mathrm{p}} {\mathrm{B}}=\frac{10 \times 1.013 \times 10^5}{37 \times 10^9} = 2.74 × 10⁻⁵ ∴ \) ఘనపరిమాణంలో అంశిక మార్పు \( = \frac{\Delta \mathrm{V}}{\mathrm{V}} = 2.74 × 10⁻⁵ \)

Exam Tips:

a) ఘనపరిమాణ వికృతి ΔV/V = p/B; atm ను Pa లోకి మార్చడం మరచిపోకండి.

 

Question 15: 7.0 × 10⁶ Pa హైడ్రాలిక్ పీడనానికి గురయిన 10 cm భుజం ఉన్న ఘన రాగి ఘనం ఏర్పడే ఘనపరిమాణ సంకోచాన్ని నిర్ణయించండి.

Answer:

దత్తాంశం నుండి L = 10 cm = 0.10 m; p = 7 × 10⁶ Pa; B = 140 GPa = 140 × 10⁹ Pa
\( B = \frac{\mathrm{pV}}{\Delta \mathrm{V}}=\frac{\mathrm{p} L^3}{\Delta \mathrm{V}} \) or ∆\( V = \frac{\mathrm{pL}^3}{\mathrm{~B}}=\frac{\left(7 \times 10^6\right) \times(0.10)^3}{140 \times 10^9} = 5 × 10⁻⁸ m³ = 5 × 10⁻² cm³ \)

Exam Tips:

a) ΔV = pL³/B; ఫలితాన్ని m³ లో ఇచ్చి cm³ లేదా mm³ లోకి మార్చండి (1 m³ = 10⁹ mm³).

 

Question 16: ఒక లీటరు నీటిని 0.10% సంపీడనం చెందించడానికి ఎంత పీడనం అవసరం ? (నీటి ఆయత గుణకం B = 2.2 × 10⁹ Pa)

Answer:

దత్తాంశం నుండి V = 1 లీటరు = 10⁻³ m ³; ∆V/V = 0.10/100 = 10⁻³
\( B = \frac{\mathrm{pV}}{\Delta \mathrm{V}} \) (లేదా) \( p = B\frac{\Delta V}{V} = (2.2 \times 10^9) \times 10^{-3} = 2.2 \times 10^6 \) Pa

Exam Tips:

a) ΔV/V = 0.10% = 10⁻³; P = B × (ΔV/V).

 

Question 17: అధిక పీడనాల వద్ద పదార్థాల ప్రవర్తనను తెలుసుకోవడానికి పటంలో చూపిన ఆకృతిలో ఉన్న ఏక స్పటిక వజ్రం (స్వర్ణకారులు వాడేది) దాగిలి (Anvil) ని వాడతారు. సన్నకొన వద్ద ఉండే సమతలం వ్యాసం 0.50mm. వెడల్పు కొనను 50,000 N సంపీడ్యత బలానికి గురిచేశారు. దాగిలి మొన (tip) పై పనిచేసే పీడనం ఎంత ?

Answer:

దత్తాంశం నుండి D = 0.5 mm = 0.5 × 10⁻³ m = 5 × 10⁻⁴ m
F = 50,000 N = 5 × 10⁴ N
దాగిలి మొనపై పీడనము\( , P = \frac{\mathrm{F}}{\pi \mathrm{D}^2 / 4}=\frac{4 \mathrm{~F}}{\pi \mathrm{D}^2} \)
∴ \( P = \frac{4 \times\left(5 \times 10^4\right)}{(22 / 7) \times\left(5 \times 10^{-4}\right)^2} = 2.5 × 10¹¹ \) Pa

Exam Tips:

a) పీడనం = బలం/వైశాల్యం; సన్నని కొన వ్యాసం ఇచ్చినపుడు వైశాల్యం πD²/4.

 

Question 18: రెండు లోహ పలకలను ఒకదానితో ఒకటి చివరల నాలుగు రివెట్లనుపయోగించి బిగించారు. ప్రతి రివెట్ వ్యాసం 6.0 mm. ప్రతి రివెట్పై విమోటన ప్రతిబలం 6.9 × 10⁷ Pa దాటకూడదు. రివెట్లు కట్టిన లోహ పలకల వల్ల కలిగే గరిష్ఠ తన్యత ఎంత ? ప్రతి రివెట్ భారంలో నాలుగో వంతును భరిస్తుందనుకోండి.

Answer:

దత్తాంశం నుండి వ్యాసార్ధం r = 6/2 = 3 mm = 3 × 10⁻³ m; గరిష్ఠ ప్రతిబలము = 6.9 × 10⁷ Pa; రివెట్ పై గరిష్ఠ భారము = గరిష్ఠ ప్రతిబలము × అడ్డుకోత వైశాల్యము = 6.9 × 10⁷ × (22/7) × (3 × 10⁻³ )²
∴ గరిష్ఠ తన్యత \( = 4\left[6.9 \times 10^7 \times \frac{22}{7} \times 9 \times 10^{-6}\right] = 7.8 \times 10^3 \) N

Exam Tips:

a) ప్రతి రివెట్ భరించే గరిష్ఠ బలం = ప్రతిబలం × πr²; నాలుగు రివెట్ల వల్ల మొత్తం తన్యత నాలుగు రెట్లు.

 

Question 19: పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మరీనా అగాధం లోతు ఒక చోట ఉపరితలం నుంచి 11 km ఉంటుంది. అగాధం అడుగు భాగంలో ద్రవ పీడనం సుమారు 1.1 × 10⁸ Pa గా ఉంటుంది. సముద్రంలో 0.32 m³ తొలి ఘనపరిమాణం ఉన్న ఉక్కు బంతిని వదిలినప్పుడు అది అగాధం అడుగుకు చేరుకొంది. అక్కడ బంతి ఘనపరిమాణంలో వచ్చే మార్పు ఎంత ?

Answer:

దత్తాంశం నుండి p = 1.1 × 10⁸ Pa; V = 0.32 m ³; B = 1.6 × 10¹¹ Pa
\( \Delta V = \frac{pV}{B} = \frac{(1.1 \times 10^8) \times 0.32}{1.6 \times 10^{11}} = 2.2 \times 10^{-4} \) m³

Exam Tips:

a) ΔV = pV/B; ఉక్కు ఆయత గుణకం విలువను సరిగా తీసుకోండి, పీడన విలువ 1.1×10⁸ Pa.

 

Free study material for Physics

Step-by-Step Textbook Answers: Class 11 Physics Chapter 10 Mechanical Properties of Solids

Chapter Exercise Answers for Class 11 Physics

Explore reliable textbook solutions for Chapter 10 Mechanical Properties of Solids tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Physics.

Detailed Answer Guides for Chapter 10 Mechanical Properties of Solids

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Physics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Complete Preparation Kit for Class 11 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Physics.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.

Are the Physics TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు in both English and Hindi medium.

Is it possible to download the Physics TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 10 ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు in printable PDF format for offline study on any device.