TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక

Solutions for Class 11 History: Chapter 11 Arrival of the Europeans

Explore reliable textbook solutions for Chapter 11 Arrival of the Europeans tailored for Class 11 learners. Utilizing these History answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Practice Class 11 History Solutions: Chapter 11 Arrival of the Europeans

Access the complete solution PDF for Class 11 History below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

Question 1: బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపనను వర్ణించండి.

Answer:

రెండో కర్ణాటక యుద్ధం సందర్భంగా క్లైవ్ తీసుకున్న నిర్ణయాలు యుద్ధ నిర్వహణలో చూపిన చురుకుదనం, ఇంగ్లీష్ విజయానికి కారణమైంది. కర్ణాటక రాజ్య రాజధానియైన ఆర్కాట్ను ఆక్రమించాడు. ఈ విజయం రెండో కర్ణాటక యుద్ధ గమనాన్ని మార్చింది. ఫ్రెంచి వారి పరాజయానికి నాంది పలికింది. ఫ్రెంచివారి భవిష్యత్కు, డూప్లేకు ఈ యుద్ధం తీరని నష్టం కలిగించింది. బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్ వ్యూహాలకు ఈ విజయం మార్గం సుగమం చేసింది.
ప్లాసీ యుద్ధం (క్రీ.శ. 1757, 23 జూన్) : భారతదేశంలో ఆంగ్లేయుల లేదా తూర్పు ఇండియా కంపెనీ వారి అధికార విస్తరణకు కర్ణాటక విజయాలు ఎంత దోహదం చేసాయో, భవిష్యత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు, పేరు ప్రతిష్ఠలు ఇనుమడింపచేయడానికి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ సేనాధిపత్యంలో చేసిన ప్లాసీయుద్ధం (క్రీ.శ. 1757) అంత కంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని చరిత్రకారుల వాదన. ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్దౌలా (అలీవర్దీఖాన్ మనవడు), బ్రిటిష్ సైన్యాలకు జరిగింది. ఈ యుద్ధానికి ముఖ్య కారణాలు (1) బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక, (2) ఫ్రెంచి వారితో బెంగాల్నవాబ్లకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, (3) బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యాన్ని అంతం చేయడం, (4) సిరాజ్ ఉద్దౌలా స్థానంలో బెంగాల్ నవాబుగా తమకు అనుకూలమైన వ్యక్తిని నవాబుగా చేయాలన్న ఆంగ్లేయుల కోరిక.
సిరాజ్ ఉద్దౌలా సేనాధిపతియైన మీర్ జాఫర్, అమీర్ చంద్ అనే వ్యాపారి మొదలైన సిరాజ్ ద్రోహులను తమ వైపు త్రిప్పుకున్న రాబర్ట్ క్లైవ్ యుద్ధానికి సిద్ధమైనాడు. పైన పేర్కొన్న వారితోపాటు మాణిక్ చంద్, జగత్ సేఠ్ (బ్యాంకర్లు), రాయ్ దుర్లభ్లు సిరాజ్ను మోసగించి, రాబర్ట్ క్లైవ్ పక్షం చేరారు. ఇరుపక్షాల సేనలకు, జూన్ 23, 1757న, ప్లాసీ వద్ద నామమాత్రం యుద్ధం జరిగింది. నమ్మకద్రోహం చేసిన మీర్ జాఫర్ క్లైవ్కు విజయం చేకూర్చాడు. సిరాజ్ ఉద్దౌలా ఓడింపబడి వధింపబడ్డాడు. మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఫ్రెంచి వారి స్థావరమైన చంద్రనగర్ను బ్రిటిష్వారు ఆక్రమించడంతో బెంగాల్లో ఫ్రెంచివారి ప్రాభల్యం అంతరించింది. బెంగాల్లో కంపెనీ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, రాజ్యాధికారాన్ని సంపాదించింది. కలకత్తా సమీపంలోని 24 పరగణాల జమీందారీని పొందింది.
బక్సార్ యుద్ధం (22 అక్టోబర్ 1764) : మీర్ జాఫర్ నేతృత్వంలోని, బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దోపిడి చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అన్ని రకాలు నష్టపోయారు. మద్రాస్, బొంబాయిలలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చులు కూడా బెంగాల్పై రుద్దారు. మీర్ జాఫర్కు బెంగాల్ నవాబగిరి ముల్లకంచెగా మారింది. బెంగాల్ కొత్త గవర్నర్గా నియమించబడిన వాన్సిటార్ట్ మీర్ జాఫర్ను నవాబ్ పదవి నుంచి తొలగించి, అతని అల్లుడైన మీర్ ఖాసింను నవాబుగా చేశాడు. దీనికి బదులుగా కొత్త బెంగాల్ నవాబ్ ఆంగ్లేయులకు బర్ద్వాన్, మిడాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను అప్పగించాడు. కంపెనీ అధికారులకు మీర్ ఖాసిం 29 లక్షలు చెల్లించాడు. మీర్ ఖాసిం కొంతకాలం తరువాత బెంగాల్ రాష్ట్ర ప్రజల హితాన్ని కోరి చేపట్టిన వివిధ సంస్కరణలు బ్రిటీష్ వారికి నచ్చలేదు. దీనితో ఆగ్రహించిన కంపెనీ అధికారులు అతడిని పదవి నుంచి తొలగించారు. మళ్ళీ మీర్ జాఫర్ను బెంగాల్ నవాబ్ చేశారు. చివరికి పదవికోల్పోయిన మీర్ ఖాసిం, మొగల్ చక్రవర్తి షాఆలం, అవధ్ నవాబ్ షుజా ఉద్దౌలా మొదలైనవారి సహకారం, సేనలతో బక్సార్ వద్ద క్రీ.శ. 1764 అక్టోబర్ 22న, బ్రిటీష్ సేనలతో యుద్ధం చేశాడు. బ్రిటీష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో పరాజయం పొందాడు. చివరికి యుద్ధంలో మొగల్ చక్రవర్తి షా ఆలం, అవద్ నవాబ్లు ఓడిపోయారు. క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్వారు పొందారు. సివిల్ అధికారులు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విధంగా క్రీ.శ. 1757, 1764లలో జరిగిన ప్లాసీ, బక్సార్ యుద్ధాల్లో బెంగాల్ నవాబ్ పరాజయం, భవిష్యత్లో బ్రిటీష్ అధికార విస్తరణకు బీజాలు వేసింది. స్వదేశీ ప్రజల కష్టాలు రెట్టింపైనాయి. ఈ యుద్ధం భారతీయ పాలకుల సైనిక బలహీనతను తెలియజేసింది. ఈ యుద్ధంలో మొగల్ చక్రవర్తి కూడా ఓడిపోయాడు. కంపెనీ దివానీ అధికారాన్ని పొందడంతో ఇండియాలో ఇంగ్లీష్ వారి అధికారం స్పష్టంగా స్థాపించడం జరిగింది.

Exam Tips:

a) ప్లాసీ (1757) నుంచి బక్సార్ (1764), అలహాబాద్ సంధి (1765), దివానీ హక్కులు అనే క్రమంలో రాయండి.
b) ప్లాసీ యుద్ధంలో మీర్ జాఫర్ వంటి ద్రోహుల పాత్రను, సిరాజ్ ఉద్దౌలా ఓటమిని స్పష్టంగా చెప్పండి.

 

Question 2: ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిశిస్తు విధానాలను వివరించండి.

Answer:

1785కు పూర్వం బెంగాల్లో ప్రతి ఏటా భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలం పాట ద్వారా అత్యధిక రేటు చెల్లించడానికి సిద్ధమైన వారికి ఇచ్చేవారు. వీరినే జమీందార్లు అనేవారు. దీనివల్ల కంపెనీకి అనేక నష్టాలుండేవి. ఈ సమస్య పరిష్కారానికి ‘వారెన్ హేస్టింగ్స్’ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ‘ఐదు సంవత్సరాల ఒడంబడిక’ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాని ఇంగ్లాండ్లోని గృహ ప్రభుత్వం ‘వార్షిక రెవిన్యూ ఒడంబడిక పద్దతినే సమర్థించింది. క్రీ.శ. 1786వ సంవత్సరంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్గా భారతదేశం వచ్చిన లార్డ్ కారన్వాలీస్ బెంగాల్లో అమలులో ఉన్న భూమిశిస్తు విధానాన్ని సరిదిద్దడానికి కొత్త విధానాన్ని రూపొందించాడు.
క్రీ.శ. 1786లో ‘కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ కారన్వాలీస్ను, పదిఏండ్ల భూమిశిస్తు ఒడంబడిక చేసుకోవల్సిందిగా సూచించింది. దీన్నే తరువాత కాలంలో ‘శాశ్వత భూమిశిస్తు’ విధానంగా వర్ణించారు. సర్ జాన్ షోర్ సహకారంతో క్రీ.శ. 1786-1789 మధ్యకాలంలో కారన్వాలీస్ బెంగాల్లో భూమి సర్వే, రికార్డుల పరిశీలన, అంతవరకు అమలులో ఉన్న పద్దతులు మొదలైనవి అధ్యయనం చేశాడు. 1793లో శాశ్వత భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో కారన్వాలీస్ గతంలో కేవలం భూమిశిస్తు వసూలు అధికారాలు పొందిన జమీందార్లను, సమాజంలో అత్యంత ప్రభావవంతులైన వారిగా మార్చాడు. వారిని బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిరక్షణకు, వలసవాద పరిరక్షణకు భారతదేశంలో సరైన ఏజెంటులుగా మార్చాడు. ప్రతి జమీందారు ప్రభుత్వానికి నిర్ధారించిన భూమిశిస్తు మొత్తాన్ని పదేండ్లకాలానికి ముందుగానే నిర్ణయించిన కాలానికే చెల్లించేట్లు అంగీకరింపచేశాడు. దీనివల్ల భూమిపై జమీందార్కు గతంలో కంటే ఎక్కువ యాజమాన్యపు హక్కు చేకూరింది. అన్ని రకాలుగా కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. రైతాంగం జమీందార్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చింది. వారి కష్టనష్టాలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశాలు అంతరించాయి. బ్రిటీష్వారికి వినయంగా, విధేయులుగా ఉన్నంతకాలం ఈ జమీందార్లు తమ ప్రాంతాల్లో అధికారం చెలాయించారు. క్రమంగా ఈ జమీందార్లు వంశపారంపర్యపు హక్కులు పొందారు. కంపెనీకి ఈ కొత్త భూమి శిస్తు విధానం వల్ల అన్ని రకాల లాభాలు సమకూరాయి. భారతదేశంలో బ్రిటీష్ అధికార రక్షకులుగా ఈ జమిందార్లు ఎదిగారు. 1857 తిరుగుబాటుకాలంలో వారు చేసిన సహాయాన్ని బ్రిటీష్ అధికారులు స్వయంగా ప్రశంసించారు.
కారన్వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమిశిస్తు విధానం రైతాంగం పాలిట శాపంగా మారింది. వారిపై పన్ను భారం పెరిగింది. భూమిపై ఎలాంటి హక్కు లేకుండాపోయింది. కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి కాలాల్లో కూడా రైతాంగం తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది.
వ్యవసాయం భారంగా, లాభహీనంగా మారింది. రైతులు, రైతుకూలీలు నష్టపోయారు. రైత్వారీ విధానం : ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన భూమిశిస్తు (రెండో) విధానం రైత్వారీ పద్ధతి. దీన్ని సర్ థామస్ మన్రో, మద్రాస్ ప్రసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. దీనికి ఆనాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ అంగీకరించాడు. రైతుతో ప్రత్యక్ష ఒడంబడిక చేసుకోవాలన్నది రైత్వారీ పద్ధతి అతి ముఖ్య లక్ష్యం. క్రీ.శ. 1792లో ముందుగా ఈ పద్ధతిని బారామహల్ (సేలం)లో ప్రవేశపెట్టారు. దీనికి కెప్టెన్ రీడ్ మూలసూత్రధారి. కెప్టెన్ రీడ్ అనుచరుల్లో ఒకడైన థామస్ మన్రో 1800 సంవత్సరంలో సీడెడ్ జిల్లాల (దత్తమండలాల) కలెక్టర్గా నియమించబడ్డాడు.
అక్కడ దీన్ని మన్రో విజయవంతంగా అమలుచేశాడు. రైత్వారీ పద్దతిని మన్రో రైతు సంక్షేమ దృష్టితో అమలు చేశాడు. దీని వల్ల రైతులే భూమికి యజమానులయ్యారు. పండించిన పంటలో 1/3 వంతు ప్రభుత్వం శిస్తు రేటుగా నిర్ణయించింది.
రైతులందరికీ ‘పట్టాలు’ ఇప్పించాడు. దీనివల్ల వారికి రక్షణ చేకూరింది. ఆ తరువాత కాలంలో దక్షిణ భారతదేశంలోని తంజావూర్, ఆర్కాట్, కోయంబత్తూర్, మలబార్ మొదలైన ప్రాంతాల్లో ఈ రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. క్రీ.శ. 1818 నాటి మూడో మరాఠా ఆంగ్లో యుద్ధం తరువాత బొంబాయి ప్రసిడెన్సీలోని అత్యధిక ప్రాంతాలపై కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. ఇక్కడ కూడా ‘రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ పండిన పంటలో 55% ప్రభుత్వ వాటాగా (శిస్తు రేటుగా)
నిర్ణయించారు.
వాస్తవానికి ఈ రైత్వారీ భూమిశిస్తు పద్ధతి జమీందారీ వ్యవస్థ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ప్రతిరైతు, గ్రామాలు లాభపడ్డాయి. సామాజిక చైతన్యానికి రైత్వారీ పద్ధతి పునాదులు వేసింది. సమాజంలో అంతవరకు కొనసాగిన భూమి ఆధారిత యాజమాన్యపు హక్కు, సామాజిక హోదా తగ్గింది. కాని గవర్నమెంట్ ఏజెంట్లు రైతాంగాన్ని మళ్ళీ పీడించారు. ఫలితంగా ఆర్థికంగా రైతులు పూర్తిస్థాయిలో పేదరిక చక్రం నుంచి విముక్తి పొందలేకపోయారు. సీడెడ్ జిల్లాలో మన్రో ప్రయత్నం గొప్ప విజయాలు సాధించినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మధ్యవర్తుల, ఏజెంట్ల స్వార్థం, లంచగొండతనం వల్ల విఫలమైంది.

Exam Tips:

a) శాశ్వత భూమిశిస్తు (కారన్వాలీస్, 1793), రైత్వారీ (థామస్ మన్రో) అనే రెండు పద్ధతులను వేర్వేరు శీర్షికలతో రాయండి.
b) ప్రతి పద్ధతిలో ఒడంబడిక ఎవరితో (జమీందార్లు / రైతులు), శిస్తు రేటు, ఫలితాలను పోల్చి చెప్పండి.

 

Question 3: కర్ణాటక యుద్ధాలకు దారితీసిన కారణాలు, ఫలితాలను చర్చించండి.

Answer:

ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాల – క్రమంలో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచి వారి మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచి వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. నాటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు ఎదురులేకపోయింది. మొదటి కర్ణాటక యుద్ధం (1744 – 48) : 1742లో ‘డూప్లే’ ఫ్రెంచ్ గవర్నర్ గా నియమించబడ్డాడు. భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారి స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనితో ఫ్రెంచి వారు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సహాయం కోరారు. దీనితో ఆంగ్లేయులు యుద్ధవిరమణ చేశారు. ఇట్టి పరిస్థితుల్లో ఫ్రెంచి సైన్యం లా బూర్డొనే నాయకత్వంలో భారతదేశం వచ్చింది. ఆ ధైర్యంతో 1746లో ఫ్రెంచివారు ఆంగ్లేయుల సెయింట్ జార్జ్ కోటను (మద్రాస్) స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులను అన్వరుద్దీన్ చేరాడు. దాంతో నవాబు ఫ్రెంచి వారిని వైదొలగమని హెచ్చరించాడు. ‘సెయింట్ థోమ్’ వద్ద నవాబు సైన్యం ఫ్రెంచి సైన్యానికి జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ఓటమి పాలయ్యాడు. ఈలోగా యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. దానితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాస్ను ఆంగ్లేయులకు అప్పగించారు. రెండవ కర్ణాటక యుద్ధం (1749 – 1754) : 1748లో హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ మరణించటంతో, సింహాసనం కోసం కుమారుడు నాసిర్ జంగ్, మనుమడు ముజఫర్ జంగ్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అలాగే కర్ణాటక సింహాసనం కోసం చందాసాహెబ్కు అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్, ముజఫర్ జంగ్లు ఫ్రెంచి గవర్నర్ డూప్లే సాయాన్ని కోరారు. వీరికి సహాయం చేసి దక్కన్లో తమ ప్రాభవాన్ని పెంచుకుందామని డూప్లే భావించాడు. 1749లో ఆంబూర్ వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. నాసిర్ జంగ్ ఆంగ్లేయుల సాయంతో ముజఫర్ జంగ్ను ఓడించాడు, కానీ ఫ్రెంచి వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచివారు ముజఫర్ జంగ్ను నవాబును చేసారు. ‘బుస్సీ’ హైదరాబాద్లో రక్షణగా ఉన్నాడు. 1751లో జరిగిన యుద్ధంలో ఫ్రెంచివారు ఓడారు. తరువాత 1752లో రాబర్ట్ క్లైవ్ కర్ణాటకలో చందాసాహెబ్ను ఓడించి వధించాడు. ఈ స్థితిలో డూప్లే స్థానంలో గోడేహ్యూను నియమించారు. దీంతో కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం (1756 – 63) : ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. ఫ్రెంచి గవర్నర్గా కౌంట్ డి లాలీ నియమితుడయ్యాడు. ఇతడు కడలూర్ ఆంగ్లేయుల కోటను ఆక్రమించి మద్రాసు ఆక్రమించడానికి విఫలయత్నం చేశాడు. ఆంగ్లేయులకు సర్ ఐర్ కూట్ నాయకత్వం వహించాడు. బుస్సీని సాయం రమ్మని ఆజ్ఞాపించాడు. దాంతో ఆంగ్లేయులు నైజాంతో ఒప్పందం చేసుకున్నారు. 1760లో ‘వాండివాష్’ వద్ద జరిగిన యుద్ధంలో ఫ్రెంచి సైన్యాన్ని ఓడించి పుదుచ్చేరిని ఆక్రమించి ‘లాలీ’ని బందీగా ఇంగ్లాండ్ పంపాడు. 1763లో సప్తవర్ష సంగ్రామం ముగియడంతో మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది.

Exam Tips:

a) మొదటి, రెండో, మూడో కర్ణాటక యుద్ధాలను సంవత్సరాలతో వేర్వేరు పేరాలుగా రాయండి.
b) ముఖ్య వ్యక్తులను (డూప్లే, క్లైవ్, బుస్సీ, లాలీ, ఐర్ కూట్) పేర్కొని, చివరలో ఫ్రెంచి శక్తి పతనాన్ని ఫలితంగా చెప్పండి.

 

లఘు సమాధాన ప్రశ్నలు

Question 1: మైసూర్ యుద్ధాలపై ఒక లఘు వ్యాసం రాయండి.

Answer:

ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంతో క్రీ.శ. 1766 నుంచి 1799 మధ్య నాలుగు యుద్ధాల్లో తలపడ్డారు. మొదటి మైసూర్ యుద్ధం క్రీ.శ. 1766 – 1769 మధ్యకాలంలో హైదర్అలీ సేనలకు, ఈస్ట్ ఇండియా సేనలకు జరిగింది. హైదర్ అలీ కంపెనీ సేనలను, వారి మిత్ర రాజ్యాల సేనలను ఓడించాడు. మద్రాస్ సంధి షరతులను కంపెనీ అంగీకరించింది. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం (క్రీ.శ. 1780 – 1784) : రెండోసారి 1780వ సంవత్సరంలో మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్వారు ఉల్లంఘించినందువల్ల, మైసూర్ పాలకుడైన హైదర్ అలీ యుద్ధానికి సిద్ధమైనాడు. ఇదే కాలంలో మరాఠా సేనలతో హైదర్ నిమగ్నమై ఉండగా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి సహాయం అందించలేదు. మద్రాస్ సంధి షరతులను ఉల్లంఘించింది. అందువల్ల, హైదరాలీ, తన కుమారుడై టిప్పుతో కలిసి రెండోసారి యుద్ధానికి సిద్ధమైనాడు. యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే హైదరాలీ కాన్సర్ వ్యాధితో మరణించాడు. టిప్పు సుల్తాన్ బాధ్యతలు స్వీకరించాడు. చివరికి మంగళూరు సంధితో టిప్పు యుద్ధాన్ని విరమించాడు. ఇరువర్గాలు తాము జయించిన ప్రాంతాలను పరస్పరం తిరిగి ఇచ్చుకోవడానికి, యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించాయి. మూడో మైసూర్ యుద్ధం : మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790లో మైసూర్ రాజ్యంపై యుద్ధం ప్రకటించాయి. లార్డ్ కారన్వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్థభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.
నాల్గో మైసూర్ యుద్ధం (క్రీ.శ 1798 – 1799) : ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్లకు మధ్య శ్రీరంగపట్టణం సంధి శాశ్వత శాంతిని ప్రసాదించలేదు. 1798 – 1799లో చివరిసారిగా టిప్పుసుల్తాన్ సైన్యం, ఆంగ్ల సేనలతో తలపడింది. దీన్నే నాల్గో మైసూర్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టిప్పు ప్రాణాలు కోల్పోయాడు. పూర్వపు ఒడియార్ వంశానికి చెందిన ఒక మైనర్ బాలున్ని కంపెనీ మైసూర్ పాలకునిగా నియమించింది. మైసూర్ రాజ్యం సైన్య సహకార ఒప్పందంలో చేరింది.

Exam Tips:

a) నాలుగు యుద్ధాలను సంవత్సరాలతో (1766–69, 1780–84, 1790–92, 1798–99) వరుసగా రాయండి.
b) ప్రతి యుద్ధం చివర సంధి పేరు (మద్రాస్, మంగళూరు, శ్రీరంగపట్టణం) రాయండి.

 

Question 2: ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి న్యాయవ్యవస్థను వివరించండి.

Answer:

బ్రిటీష్ వారు, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నూతన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. రాబర్ట్ క్లైవ్, వారెన్ హేస్టింగ్స్, కారన్వాలీస్ సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి అనేక స్థాయిల్లో కోర్టులను ఏర్పాటు చేశారు. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలో సుప్రీంకోర్టు నెలకొల్పబడింది. 1781 నాటికి సుప్రీంకోర్టు అధికారులు, పనితీరు మొదలైన అంశాలు నిర్ధారించారు. వారెన్ హేస్టింగ్స్ కాలంలో జిల్లాస్థాయిలో దివాన్ – ఇ – అదాలత్, ఫౌజ్ దారీ ఇ – అదాలత్ను ఏర్పాటు చేశారు. దివాన్ అదాలత్ సివిల్ కేసులను, కలెక్టర్ నేతృత్వంలో విచారించేది. ఫౌజ్దారీ ఇ – అదాలత్ భారతీయ సంతతి అధికారుల ఆధ్వర్యంలో ముఫ్తీలు, ఖాజీల సలహాలతో పనిచేసేది.
లార్డ్ కారన్వాలీస్ కాలంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విషయంలో గ్రేడింగ్లను ఏర్పాటు చేశారు. మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయనిపుణులను మున్సిఫ్ కోర్టు అధికారులుగా నియమించారు. కారన్వాలీస్ బెంగాల్, బీహార్లలో సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేశాడు. ఇతడు కార్యనిర్వాహక శాఖ అధికారాలను, న్యాయశాఖ అధికారాలను విభజించాడు. క్రిమినల్ కేసులు నవాబ్ బాధ్యత. గవర్నర్జనరల్ క్రిమినల్ కేసుల తీర్పుల విషయంలో అత్యున్నత న్యాయాధికారి. ‘కారన్వాలీస్ న్యాయస్మృతి’గా పేరుగాంచిన కోడ్ (సివిల్, క్రిమినల్ సూత్రాలు) ఇతని కాలంలోనే భారతీయ (హిందూ – ఇస్లామిక్) న్యాయసూత్రాలను అమలు చేసే విధానాన్ని న్యాయాధికారులకు వివరించే ప్రయత్నం జరిగింది. న్యాయశాఖలో చాలా వరకు విచక్షణ లేకుండా చేశాడు కారన్వాలీస్.
లార్డ్ వెల్లస్లీ కాలంలో సదర్ – నిజామత్ అదాలత్లో రెగ్యులర్ జడ్జీలను నియమించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. విలియం బెంటింక్ కాలంలో బెంగాల్లో లార్డ్ కారన్వాలీస్ నెలకొల్పిన నాలుగు సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు. అతడు బెంగాల్ను 20 డివిజన్లుగా విభజించాడు. ప్రతి డివిజన్కు ఒక న్యాయాధికారిని నియమించాడు. వీరందరిపై అధికారి కమీషనర్. ప్రజాసంక్షేమానికి వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. జమిందార్ల, భూస్వాముల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Exam Tips:

a) హేస్టింగ్స్, కారన్వాలీస్, వెల్లస్లీ, బెంటింక్ కాలాల వారీగా మార్పులను రాయండి.
b) కోర్టుల పేర్లు (దివాన్-ఇ-అదాలత్, ఫౌజ్దారీ-ఇ-అదాలత్, సర్క్యూట్ కోర్టులు, మున్సిఫ్ కోర్టులు) తప్పక ఉదహరించండి.

 

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

Question 1: అలహాబాద్ సంధి షరతులు.

Answer:

క్రీ.శ. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం
బెంగాల్లో ద్వంద్వపాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అనగా భూమిశిస్తు వసూలు అధికారం బ్రిటీష్ వారు పొందారు. సివిల్ అధికారాలు నవాబ్కు ఇచ్చారు. కారా, అలహాబాద్ జిల్లాలను అయోధ్య నుండి వేరు చేసి మొగల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయలు కంపెనీ, చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది.

Exam Tips:

a) 1765, పక్షాలు (కంపెనీ – షా ఆలం – అవధ్ నవాబు), దివానీ హక్కు – ఈ అంశాలు రాయండి.
b) ఇచ్చిన భూభాగాలు (కారా, అలహాబాద్), వార్షిక చెల్లింపు (26 లక్షలు) పాయింట్లుగా ఇవ్వండి.

 

Question 2: శ్రీ రంగపట్టణం సంధి షరతులు.

Answer:

మూడోసారి బ్రిటీష్ సేనలు క్రీ.శ. 1790లో మైసూర్ రాజ్యంపై యుద్ధం ప్రకటించాయి.
లార్డ్ కారన్వాలీస్ బ్రిటీష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పుసేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. క్రీ.శ. 1792లో టిప్పు శ్రీరంగపట్టణం సంధి షరతులను అంగీకరించాడు. ఈ సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్ధభాగం కోల్పోయింది. టిప్పుసుల్తాన్ 3.30 కోట్లు యుద్ధ నష్ట పరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారులను జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది.

Exam Tips:

a) సంవత్సరం 1792, లార్డ్ కారన్వాలీస్, టిప్పు సుల్తాన్ – పక్షాలను చెప్పండి.
b) షరతులను సంఖ్యలతో రాయండి: రాజ్యంలో సగభాగం కోల్పోవడం, 3.30 కోట్ల నష్టపరిహారం, ఇద్దరు కుమారులు బందీలు.

 

Question 3: డూప్లే విజయాలు.

Answer:

క్రీ.శ. 1697లో జన్మించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే సమర్థుడైన పాలనావేత్త. తండ్రి ప్రభావంతో ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ కొలువులో చేరి ఫ్రెంచి ప్రభుత్వం తరపున పాండిచ్ఛేరికి చేరాడు. తన శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలతో చంద్రనగర్లో ఫ్రెంచి గవర్నర్గా నియమించబడ్డాడు.
డ్యూమస్ తరువాత డూప్లే ఫ్రెంచి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు.
ఆంగ్లేయులకు, ఫ్రెంచివారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక యుద్ధాల్లో డూప్లే తన దౌత్యనీతిని ప్రదర్శించాడు.
క్రీ.శ. 1741 నాటికి గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించాడు. రెండో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి సేనల పరాజయం ఇతని పతనానికి దారి తీసింది.

Exam Tips:

a) జననం 1697, ఫ్రెంచి గవర్నర్ (1741), కర్ణాటక యుద్ధాల్లో దౌత్యనీతి – ముఖ్యాంశాలు.
b) ఇతని పతనానికి రెండో కర్ణాటక యుద్ధ పరాజయం కారణమని ముగించండి.

 

Question 4: రాబర్ట్ క్లైవ్ సేవలు.

Answer:

భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్. క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య స్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రలో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానం.

Exam Tips:

a) క్లైవ్ గుమస్తాగా మొదలై గవర్నర్ స్థాయికి ఎదిగిన విషయాన్ని, కంపెనీ సామ్రాజ్య స్థాపకుడిగా అతని స్థానాన్ని ప్రస్తావించండి.
b) సమయం ఉంటే ఆర్కాట్ ముట్టడి, ప్లాసీ యుద్ధం వంటి అతని విజయాలను ఒక్కో వాక్యంలో చేర్చండి.

 

Question 5: కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచి వారి ఓటమికి కారణాలు.

Answer:

1. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంపై ఆధారపడిన కంపెనీ.
2. ఆంగ్లేయులు మాతృదేశం నుంచి శీఘ్రగతిలో అన్ని రకాల సహాయం పొందారు. ఫ్రాన్స్ పాలకులు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇలాంటి సహకారం అందించలేదు.
3. ఆంగ్లేయుల వద్ద సమర్థవంతమైన సేనాధిపతులు ఐర్ కూట్, రాబర్ట్ క్లైవ్, లారెన్స్లు ఉండేవారు, డూప్లే, బుస్సీలు వీరికి ఏ విధంగా పోలికలేదు. 4. ఆంగ్లేయులకు మూడు కేంద్రాలు (మద్రాస్, కలకత్తా, బొంబాయి) ఉండగా, ఫ్రెంచి వారికి కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే ఉంది. మూడో కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఫ్రెంచి వారి రాజకీయ సామ్రాజ్యవాదానికి తెరదించింది.

Exam Tips:

a) కారణాలను నంబరింగ్‌తో పాయింట్లుగా రాయండి: ప్రైవేట్ కంపెనీ – ప్రభుత్వ ఆధారిత కంపెనీ, మాతృదేశ సహాయం, సేనాధిపతులు, స్థావరాలు.
b) చివరలో మూడో కర్ణాటక యుద్ధం ఫ్రెంచి రాజకీయ ఆశలకు తెరదించిందని ముగించండి.

 

Question 6: చీకటిగది ఉదంతం.

Answer:

కలకత్తాలోని ఫోర్ట్ విలియంలోని ఒక చిన్న జైలు గది. జూన్ 20, 1756న సిరాజ్ ఉద్దౌలా అనుచరులు బ్రిటీష్ సైనికులు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను దాదాపు 146 మందిని చిన్న గదిలో కుక్కారు. వీరిలో దాదాపు 123 మంది ఊపిరి ఆడక మరణించారు. దీనినే చీకటి గది ఉదంతం అంటారు.

Exam Tips:

a) తేదీ (జూన్ 20, 1756), ప్రదేశం (ఫోర్ట్ విలియం), సిరాజ్ ఉద్దౌలా, 146 మందిలో 123 మంది మరణం – ఈ వివరాలు రాయండి.
b) ఈ సంఖ్యలపై చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలున్నాయని ఒక వాక్యం చేర్చవచ్చు.

 

Free study material for History

Step-by-Step Textbook Answers: Class 11 History Chapter 11 Arrival of the Europeans

Accessing Chapter 11 Arrival of the Europeans Solutions

Access structured TS Board textbook solutions for Chapter 11 Arrival of the Europeans. Designed in alignment with the latest academic curriculum for Class 11 History, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 11 History

Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 History text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 History.

FAQs

Where can I find the latest TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక is available for free on StudiesToday.com. These solutions for Class 11 History are as per latest TS Board curriculum.

Are the History TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the History concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 History. You can access TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక in both English and Hindi medium.

Is it possible to download the History TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year History Study Material Chapter 11 యూరోపియన్ల రాక in printable PDF format for offline study on any device.