Step-by-Step Textbook Solutions for Class 11 Economics Chapter 10 Basic Statistical Concepts in Economics
Access comprehensive textbook solutions for Chapter 10 Basic Statistical Concepts in Economics using the official curriculum guides for Class 11 Economics. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Download Chapter 10 Basic Statistical Concepts in Economics Textbook Solutions PDF
Navigate directly to the solved Economics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
Question 1: ఏక పరిమాణ చిత్రపటాలను తగిన ఉదాహరణలతో వివరించండి.
Answer:
బార్ పొడవును మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు, వెడల్పు లెక్కించరు. అందువల్ల వీటిని “ఏకపరిమాణ చిత్రం” అంటారు. ఈ ఏకపరిమాణ చిత్రాలు ముఖ్యంగా నాలుగు రకాలు.
1. సాధారణ బార్పటాలు
2. ఉప విభాజిత బార్పటాలు
3. బహుళ బార్పటాలు
4. శాతపు బార్పటాలు
1. సాధారణ బార్పటం:
దీనిని ఒక చలనరాశిలో మార్పు చూపడానికి ఉపయోగిస్తారు.
ఉదా:
| సంవత్సరాలు | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 |
| ధాన్యం ఉత్పత్తి (టన్నులలో) | 50 | 70 | 80 | 90 | 110 | 120 | 140 |
2. ఉపవిభాజిత బార్పటం:
దీనిలో మొత్తం దత్తాంశంలోని భాగాలు బార్ లో చూపించవచ్చు. ఉదా :
| సంవత్సరాలు | 1980 | 1981 | 1982 | 1983 | 1984 |
| పబ్లిక్ కంపెనీలు | 110 | 120 | 140 | 160 | 150 |
| ప్రయివేట్ కంపెనీలు | 70 | 80 | 90 | 90 | 100 |
| మొత్తం | 180 | 200 | 230 | 250 | 250 |
3. బహుళబార్ పటం:
అంతర సంబంధమున్న దత్తాంశం ఒకే పటంలో చూపడానికి బహుళబార్ ఉపయోగిస్తారు.
ఉదా:
4. శాతపు బార్ పటం:
దత్తాంశంలోని మార్పులు సులభంగా గమనించడానికి శాతపు బార్ ఉపయోగిస్తారు. బార్ పొడవు నూరు యూనిట్లుగా విభాగం పొందుతుంది.
ఉదా:
| బాలురు | బాలికలు | |
|---|---|---|
| బడిలో చదువుతున్నవారు | 90 | 55 |
| బడిలో లేనివారు | 10 | 45 |
| మొత్తం | 100 | 100 |
Exam Tips:
a) నాలుగు రకాల బార్ పటాలను (సాధారణ, ఉపవిభాజిత, బహుళ, శాతపు) పేర్కొని ప్రతిదానికి ఒక చిన్న ఉదాహరణ మరియు పటం ఇవ్వండి.
b) బార్ పొడవు మాత్రమే విలువను సూచిస్తుందని, వెడల్పు లెక్కలోకి రాదని మొదట రాయండి.
Question 2: ఈ క్రింది దత్తాంశానికి అంక మధ్యమం కనుగొనండి.
| వయస్సు | 10–19 | 20–29 | 30–39 | 40–49 | 50–59 | 60–69 | 70–79 | 80–89 |
| వ్యక్తుల సంఖ్య | 32 | 42 | 40 | 56 | 20 | 6 | 2 | 2 |
Answer:
పై దత్తాంశం విలీన శ్రేణులకు చెందింది. దీని మినహాయింపు శ్రేణులలోనికి మార్చి వ్రాయగా అనగా తరగతిలో దిగువ అవధిలో 0.5 తీసివేయాలి, ఎగువ అవధికి 0.5 కలపాలి. అలా చేయటం ద్వారా విలీన శ్రేణులను మినహాయింపు శ్రేణులుగా మార్చవచ్చు. పై దత్తాంశాన్ని అలా మార్చి వ్రాయగా
| C.I | f | మధ్యమ విలువ (x) | d′ = (x – A)/C | f·d′ |
|---|---|---|---|---|
| 9.5–19.5 | 32 | 14.5 | -4 | -128 |
| 19.5–29.5 | 42 | 24.5 | -3 | -126 |
| 29.5–39.5 | 40 | 34.5 | -2 | -80 |
| 39.5–49.5 | 56 | 44.5 | -1 | -56 |
| 49.5–59.5 | 20 | 54.5 (A) | 0 | 0 |
| 59.5–69.5 | 6 | 64.5 | 1 | 6 |
| 69.5–79.5 | 2 | 74.5 | 2 | 4 |
| 79.5–89.5 | 2 | 84.5 | 3 | 6 |
| N = 200 | Σfd′ = –374 |
\( \overline{\mathrm{X}}=\mathrm{A}+\frac{\sum \mathrm{fd}^{\prime}} {\mathrm{N}} \times \mathrm{i} \)
ఇక్కడ A = ఊహించిన అంకమధ్యమం = 54.5
Σfd’ = – 374
N = పౌనఃపున్యాల మొత్తం = 200
i = తరగతి అంతరం = 10
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపించగా
\( \bar{x}=54.5+\left(\frac{-374}{200}\right) \times 10 \)
= 54.5 + (- 1.87) × 10
= 54.5 + (- 18.7)
\( \bar{x} = 35.8 \)
Exam Tips:
a) విలీన శ్రేణిని మినహాయింపు శ్రేణిగా మార్చడం మొదటి అడుగు (దిగువ అవధిలో 0.5 తీసివేసి, ఎగువ అవధికి 0.5 కలపాలి).
b) సూత్రం X̄ = A + (Σfd′/N) × i; Σfd′ రుణ విలువ అయితే దాని గుర్తును (–) జాగ్రత్తగా వాడండి.
Question 3: దిగువ పేర్కొన్న దత్తాంశానికి మధ్యగతాన్ని కనుగొనండి.
| తరగతులు | 0–10 | 10–20 | 20–30 | 30–40 | 40–50 | 50–60 |
| వ్యక్తులు | 5 | 10 | 25 | 30 | 20 | 10 |
Answer:
| తరగతులు (C.I) | వ్యక్తులు (f) | CF (సంచిత పౌనఃపున్యాలు) |
|---|---|---|
| 0–10 | 5 | 5 |
| 10–20 | 10 | 15 |
| 20–30 | 25 | 40 (CF) |
| 30–40 (L₁) | 30 (f) | 70 |
| 40–50 | 20 | 90 |
| 50–60 | 10 | 100 |
| N = 100 |
మధ్యగతం \( = L_1 + \left(\frac{\frac{N}{2}-CF}{f}\right) \times i \)
మధ్యగత స్థానం \( = \frac{N}{2} \) వ అంశం
\( = \frac{100}{2} \) వ అంశం = 50 వ అంశం
L₁ = మధ్యగత తరగతి దిగువ అవధి
\( \frac{N}{2} = \) మధ్యగత అంశం = 50
CF = మధ్యగతమైన తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం = 40
f = మధ్యగతమైన తరగతికి సాధారణ పౌనఃపున్యం = 30
i = తరగతి అంతరం = 10
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపించగా \( = 30 + \left(\frac{50-40}{30}\right) × 10 = 30 + \left(\frac{10}{30}\right) × 10 \)
= 30 + (0.33) × 10
= 30 + 3.33 = 33.33
∴ మధ్యగతం = 33.33
Exam Tips:
a) మధ్యగత స్థానం N/2 చూసి, సంచిత పౌనఃపున్యంలో మొదట ఆ విలువను మించే తరగతిని మధ్యగత తరగతిగా గుర్తించండి.
b) సూత్రంలో CF అంటే మధ్యగత తరగతికి ముందున్న తరగతి CF అని గమనించండి.
Question 4: ఈ క్రింది దత్తాంశానికి బహుళకాన్ని కనుగొనండి.
| ఆదాయాలు | 3000 | 4000 | 5000 | 6000 | 7000 | 8000 | 9000 | 10000 |
| వ్యక్తుల సంఖ్య | 20 | 30 | 26 | 40 | 35 | 28 | 06 | 01 |
Answer:
వర్గీకృత పట్టిక (ఆదాయాలు x, పౌనఃపున్యం f):
| ఆదాయం (x) | 3000 | 4000 | 5000 | 6000 | 7000 | 8000 | 9000 | 10000 |
| (1) f | 20 | 30 | 26 | 40 | 35 | 28 | 06 | 01 |
| నిలువు వరుస | సమూహాల మొత్తాలు | గరిష్ఠం (ఆ సమూహంలోని x విలువలు) |
|---|---|---|
| (2)* (ప్రతి రెండు) | 3000+4000 = 50; 5000+6000 = 66; 7000+8000 = 63; 9000+10000 = 07 | 66 (5000, 6000) |
| (3)* (మొదటిదాన్ని వదిలి ప్రతి రెండు) | 4000+5000 = 56; 6000+7000 = 75; 8000+9000 = 34 | 75 (6000, 7000) |
| (4)* (ప్రతి మూడు) | 3000–5000 = 76; 6000–8000 = 103 | 103 (6000, 7000, 8000) |
| (5)* (మొదటిదాన్ని వదిలి ప్రతి మూడు) | 4000–6000 = 96; 7000–9000 = 69 | 96 (4000, 5000, 6000) |
| (6)* (మొదటి రెండింటిని వదిలి ప్రతి మూడు) | 5000–7000 = 101; 8000–10000 = 35 | 101 (5000, 6000, 7000) |
(2)* = ప్రతి రెండు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(3)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదిలి, ప్రతి రెండు అడ్డు
వరుసల పౌనఃపున్యాల సంకలనం.
(4)* = ప్రతి మూడు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(5)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదలి ప్రతి మూడు అడ్డు
వరుసలతో పౌనఃపున్యాల సంకలనం.
(6)* = మొదటి రెండు అడ్డు వరుసలను వదిలి ప్రతి మూడు పౌనఃపున్యాల
సంకలనం.
ఈ కింద ఉన్న విశ్లేషణ పట్టికకు వర్గీకృత పట్టిక ఆధారంగా చేయటమైనది.
విశ్లేషణ పట్టిక (ప్రతి నిలువు వరుసలో గరిష్ఠ సమూహంలోని విలువలు):
| x | 3000 | 4000 | 5000 | 6000 | 7000 | 8000 | 9000 | 10000 |
|---|---|---|---|---|---|---|---|---|
| మొత్తం (టిక్కుల సంఖ్య) | – | 1 | 3 | 6 | 3 | 1 | – | – |
విశ్లేషణ పట్టికను పరిశీలించినప్పుడు 6000 అనే అంశం అధిక పర్యాయాలు అంటే 6 పర్యాయాలు వచ్చింది.
కాబట్టి బాహుళకం Z = 6000.
Exam Tips:
a) వర్గీకృత పట్టిక (6 నిలువు వరుసలు) మరియు విశ్లేషణ పట్టిక రెండూ చూపిస్తేనే బహుళకానికి పూర్తి మార్కులు వస్తాయి.
b) విశ్లేషణ పట్టికలో ఏ విలువ ఎక్కువసార్లు (ఇక్కడ 6000, ఆరుసార్లు) వచ్చిందో చూసి బహుళకాన్ని చెప్పండి.
Question 5: క్రింది దత్తాంశానికి ‘పై’ (Pie) చిత్రము గీయండి.
| పంటలు | వరి | గోధుమ | రాగి | జొన్నలు | చిరుధాన్యాలు |
| విస్తీర్ణం (హెక్టార్లలో) | 16 | 24 | 10 | 8 | 5 |
Answer:
విస్తీర్ణాన్ని డిగ్రీలలోకి మార్చగా (మొత్తం విస్తీర్ణం = 16 + 24 + 10 + 8 + 5 = 63 హెక్టార్లు):
వరి \( = \frac{16 \times 360}{63} = 91° \)
గోధుమ \( = \frac{24 \times 360}{63} = 137° \)
రాగి \( = \frac{10 \times 360}{63} = 57° \)
జొన్నలు \( = \frac{8 \times 360}{63} = 46° \)
చిరుధాన్యాలు \( = \frac{5 \times 360}{63} = 29° \)
∴ మొత్తం = 360°.
Exam Tips:
a) ప్రతి విలువను డిగ్రీలలోకి మార్చే సూత్రం: (భాగం / మొత్తం) × 360°; చివరిలో డిగ్రీల మొత్తం 360° అయిందో సరిచూడండి.
b) వృత్తం గీసి ప్రతి సెక్టార్‌కు పేరు, డిగ్రీలు రాయండి; రౌండింగ్ వల్ల ఒక డిగ్రీ తేడా వస్తే మొత్తం 360° అయ్యేలా చూడండి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: గణాంక శాస్త్రం అంటే ఏమిటి ? అర్థశాస్త్రంతో దానిక గల సంబంధాన్ని వివరించండి.
Answer:
గణాంక శాస్త్రానికి అనేక శాస్త్రాలతో సన్నిహిత సంబంధముంది. 19వ శతాబ్దం నుంచి గణాంక శాస్త్రం, అర్థశాస్త్రం చాలా సాన్నిహిత్యం పెంపొందించుకున్నాయి. అర్థశాస్త్ర విశ్లేషణ అధ్యయనంలో, సిద్ధాంత నిర్మాణంలో సాంప్రదాయ ఆర్థికవేత్తలు నిగమన పద్ధతిని ఉపయోగించేవారు.
అయితే కాలక్రమేణా ఆర్థిక విషయాల పరిశీలనకు, అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి గణాంకశాస్త్ర పరిజ్ఞానం అవసరమని J.S. మిల్, జీవాన్స్, కీన్స్ లాంటి ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అర్థశాస్త్ర సిద్ధాంతాలను యదార్థ జీవితానికి అన్వయించడానికి, న్యాయబద్ధతను నిర్ణయించడానికి ‘ఆగమన పద్ధతి’ ని ప్రవేశపెట్టడంతో గణాంక, అర్థశాస్త్రాలు సన్నిహితమవడం ప్రారంభమైంది. ‘జీవాన్స్’ సంఖ్యా దత్తాంశాన్ని ఉపయోగించి ‘కాలశ్రేణుల విశ్లేషణ’, సూచీ సంఖ్యల అధ్యయనం చేశారు.
1704లో గ్రెగొరికింగ్ వస్తు సప్లయ్‌కి, వస్తువు ధరకు ఉన్న సంబంధాన్ని గణాంకాల రూపంలో నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. బౌలే, పియర్సన్, W.I. కింగ్, ఫిషర్ మొదలైన గణాంకవేత్తలు తమ సేవలతో గణాంకశాస్త్రాన్ని, అర్థ శాస్త్రానికి మరింత చేరువ చేశారు.
అర్థశాస్త్ర విశ్లేషణ అంతా గణాంక దత్తాంశంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల మొదలైన ఆర్థిక సమస్యల స్వభావం, స్వరూపం, గణాంక వివరాలు లేకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఆర్థిక సమస్యలన్నీ గణాంక పద్ధతుల ద్వారా పరిశీలించడం జరుగుతుంది.
ఆర్థిక విశ్లేషణలో సాంఖ్యక వివరాలు, పద్ధతులు చాలా శక్తివంతమైన పరికరాలు, గణాంక శాస్త్రం అర్థశాస్త్రానికి ముఖ్యంగా ‘మూడు’ విధాలుగా ఉపయోగపడుతుంది.
1. ఆర్థిక సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి.
2. ఆర్థిక సిద్ధాంతాలకు సాంఖ్యారూపమేర్పరచటం, ఆర్థిక సిద్ధాంతాల ఉపకల్పనలను (Hypothesis) పరీక్ష చేయడం.
3. ఆర్థిక సిద్ధాంతాల భవిష్యత్ అంచనాలను పరీక్షించడం.
ఉదా : కీన్స్ ప్రతిపాదించిన వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని కూజెనట్స్ దత్తాంశాన్ని సేకరించి సంఖ్యారూప మేర్పరిస్తే దాని ఆధారంగా వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని మార్పుచేసి డ్యూసెన్బెర్రీ, ఫ్రీడ్మన్ కొత్త రీతులలో ప్రతిపాదించారు.
Exam Tips:
a) గణాంకశాస్త్రం అర్థశాస్త్రానికి ఉపయోగపడే మూడు మార్గాలను (సమస్యల అవగాహన, సిద్ధాంతాల పరీక్ష, భవిష్యత్ అంచనా) తప్పక రాయండి.
b) కీన్స్ వినియోగ ప్రవృత్తి సిద్ధాంతం వంటి ఒక ఉదాహరణ ఇస్తే సమాధానం బలపడుతుంది.
Question 2: తగిన ఉదాహరణలతో సాధారణ, ఉప విభాజిత చిత్రపటాలను వివరించండి.
Answer:
1. సాధారణ (సామాన్య) బార్పటం : దీనిని ఒక చలనరాశిలో మార్పు చూపడానికి ఉపయోగిస్తారు.
ఉదా:
| సంవత్సరాలు | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 |
| ధాన్యం ఉత్పత్తి (టన్నులలో) | 50 | 70 | 80 | 90 | 110 | 120 | 140 |
2. ఉపవిభాజిత బార్పటం : దీనిలో మొత్తం దత్తాంశంలోని భాగాలు బార్ లో చూపించవచ్చు.
ఉదా:
| సంవత్సరాలు | 1980 | 1981 | 1982 | 1983 | 1984 |
| పబ్లిక్ కంపెనీలు | 110 | 120 | 140 | 160 | 150 |
| ప్రయివేట్ కంపెనీలు | 70 | 80 | 90 | 90 | 100 |
| మొత్తం | 180 | 200 | 230 | 250 | 250 |
Exam Tips:
a) సాధారణ బార్ పటానికి మరియు ఉపవిభాజిత బార్ పటానికి విడివిడిగా ఉదాహరణ పట్టిక, పటం ఇవ్వండి.
b) అక్షాలకు పేర్లు, స్కేలు మరియు ప్రతి బార్ విలువలు పటంలో రాయండి.
Question 3: క్రింది దత్తాంశానికి అంక మధ్యమాన్ని కనుగొనండి.
| ఆదాయం | 400 | 600 | 800 | 1000 | 1200 | 1400 | 1600 | 1800 | 2000 |
| వ్యక్తులు | 5 | 7 | 10 | 15 | 20 | 25 | 9 | 6 | 3 |
Answer:
| x | f | d = (x – A) | f·d |
|---|---|---|---|
| 400 | 5 | -800 | -4000 |
| 600 | 7 | -600 | -4200 |
| 800 | 10 | -400 | -4000 |
| 1000 | 15 | -200 | -3000 |
| 1200 (A) | 20 | 0 | 0 |
| 1400 | 25 | 200 | 5000 |
| 1600 | 9 | 400 | 3600 |
| 1800 | 6 | 600 | 3600 |
| 2000 | 3 | 800 | 2400 |
| N = 100 | Σfd = –600 |
\( \overline{X}=A+\frac{\Sigma fd}{N} \)
ఇక్కడ \( \overline{X} \) = అంక మధ్యమం
A = ఊహించిన అంక మధ్యమం = 1200
Σfd = ఊహించిన అంక మధ్యమం నుంచి తీసుకొన్న విచలనాలను (d) వాటి అనురూప పౌనఃపున్యాలతో (f) తో గుణించగా వచ్చిన లబ్దాల సంకలనం = – 600
N = పౌనఃపున్యాల మొత్తం = 100
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపించగా
\( = 1200 + \frac{(-600)}{100} \)
= 1200 + (- 6) = 1194
∴ \( \overline{\mathrm{X}} = 1194. \)
Exam Tips:
a) ఊహించిన మధ్యమం (A)ను మధ్యలో ఉన్న విలువగా తీసుకుంటే లెక్కలు సులభమవుతాయి.
b) సూత్రం: X̄ = A + Σfd/N; Σfd రుణ విలువ అయితే చివరి దశలో తీసివేయండి.
Question 4: క్రింది దత్తాంశానికి మధ్యగతాన్ని కనుగొనండి.
| వేతనాలు (x) | 10 | 20 | 30 | 40 | 50 | 60 | 70 | 80 | 90 |
| కార్మికులు (f) | 5 | 8 | 12 | 20 | 30 | 16 | 10 | 7 | 8 |
Answer:
| x | f | cf (సంచిత పౌనఃపున్యం) |
|---|---|---|
| 10 | 5 | 5 |
| 20 | 8 | 13 |
| 30 | 12 | 25 |
| 40 | 20 | 45 |
| 50 | 30 | 75 |
| 60 | 16 | 91 |
| 70 | 10 | 101 |
| 80 | 7 | 108 |
| 90 | 8 | 116 |
N = 116
మధ్యగత స్థానం \( = \frac{N+1}{2} \) వ అంశం
ఇక్కడ N = పౌనఃపున్యాల మొత్తం = 116
\( = \frac{116+1}{2} \) వ అంశం \( = \frac{117}{2} = 58.5 \) వ అంశం
58.5 అంశం సంచిత పౌనఃపున్యం 75 లో ఉంది. అందువల్ల దాని అనురూప ‘x’ విలువ 50 మధ్యగతం అవుతుంది.
మధ్యగతం = 50.
Exam Tips:
a) మొత్తం అంశాలు N సరి లేదా బేసి చూసి మధ్యగత స్థానం (N+1)/2 వ అంశం అని వాడండి; విలువలు ఆరోహణ క్రమంలో లేకపోతే ముందు అమర్చండి.
b) సంచిత పౌనఃపున్యంలో 58.5 వ అంశం ఉన్న వరుసకు అనురూపమైన x విలువే మధ్యగతం.
Question 5: ఈ క్రింది దత్తాంశానికి బహుళకము లెక్కించండి.
| X | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| f | 3 | 8 | 10 | 12 | 16 | 14 | 10 | 8 | 17 | 5 | 4 | 1 |
Answer:
వర్గీకృత పట్టిక:
| నిలువు వరుస | సమూహాల మొత్తాలు (పై నుంచి కింది వరకు) |
|---|---|
| I (f) | 3, 8, 10, 12, 16, 14, 10, 8, 17, 5, 4, 1 |
| II (ప్రతి రెండు) | 11, 22, 30, 18, 22, 5 |
| III (మొదటిదాన్ని వదిలి ప్రతి రెండు) | 18, 28, 24, 25, 9 |
| IV (ప్రతి మూడు) | 21, 42, 35, 10 |
| V (మొదటిదాన్ని వదిలి ప్రతి మూడు) | 30, 40, 30 |
| VI (మొదటి రెండింటిని వదిలి ప్రతి మూడు) | 38, 32 |
విశ్లేషణ పట్టిక:
| X | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| మొత్తం (టిక్కుల సంఖ్య) | 1 | 3 | 5 | 3 | 1 | 1 |
విశ్లేషణ పట్టికలో X = 6 అనే విలువ అత్యధికంగా 5 పర్యాయాలు వచ్చింది.
∴ బహుళకం Z = 6
Exam Tips:
a) బహుళకం కోసం వర్గీకృత మరియు విశ్లేషణ పట్టికలు తప్పనిసరిగా చూపండి; ఆ పట్టికలలో ఎక్కువ సార్లు వచ్చిన విలువే సమాధానం.
b) సమూహాల మొత్తాలు (ప్రతి రెండు, ప్రతి మూడు) జాగ్రత్తగా కూడండి; ఒక తప్పు మొత్తం ఫలితాన్ని మారుస్తుంది.
Question 6: అంక మధ్యమం అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు, పరిమితులు తెల్పండి.
Answer:
అంక మధ్యమం అంటే అంశాల మొత్తం విలువలను, మొత్తం అంశాల సంఖ్యచే భాగించగా వచ్చేదే అంక మధ్యమం.
ప్రయోజనాలు:
1. అంక మధ్యమాన్ని గణించడం అర్థం చేసుకోవడం చాలా సులభం.
2. దీని గణనలో ప్రతి అంశం పరిగణింపబడుటవలన ప్రతి అంశంచే ఇది ప్రభావితమౌతుంది.
3. దీని గణితాత్మక సమీకరణం దృఢంగా ఉండడంచేత ఏ పద్ధతులలో అంక మధ్యమాన్ని గణన చేసినప్పటికి ఒకే రకమైన సమాధానాన్ని పొందగలం.
4. తదుపరి బీజీయ గణనకు ఇది ఉపకరించును.
5. వివిధ అంశాలను పోల్చుటలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు.
పరిమితులు:
1. గ్రాఫ్‌లో దీని విలువను గుర్తించలేం.
2. ఒక అంశంలో వచ్చిన ఒక చిన్న మార్పు ఫలితాలలో పెద్ద మార్పును
తెస్తుంది. ఉదా : 3, 6, 9ల అంక మధ్యమం విలువ 6. కాని దీనికి 82 అనే అంశాన్ని చేర్చినపుడు అంక మధ్యమం (3 + 6 + 9 + 82) / 4 = 100/4 = 25. మొదటి మూడు అంశాల విలువతో పోల్చినపుడు నాల్గవ అంశం చేరికవల్ల విలువలో ఎక్కువ మార్పు ఏర్పడుటను గమనించవచ్చు.
3. అంకమధ్యమం, శ్రేణులలో గల చిన్న అంశాలకన్న పెద్ద అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది.
4. ఇది మధ్యగతం మరియు బాహుళకం వలే తనిఖీ లేదా పరిశీలన ద్వారా గుర్తించబడదు.
5. ఇది కొన్ని సందర్భాలలో అసంబద్ధమైన ఫలితాలను ఇస్తుంది. ఉదా : ఒక కుటుంబంలో సభ్యుల సగటు ఎంత అన్నపుడు లెక్కించిన అంక మధ్యమం విలువ 4.3 అయితే ఆ విలువ అసంబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల సంఖ్య భిన్నాలలో ఉండదు.
Exam Tips:
a) నిర్వచనం, ప్రయోజనాలు, పరిమితులు మూడు భాగాలుగా రాయండి; పరిమితులకు 3, 6, 9, 82 వంటి సంఖ్యా ఉదాహరణ ఇవ్వండి.
b) విపరీత విలువల ప్రభావం అంక మధ్యమానికి ఎక్కువ అనేది ముఖ్య పరిమితి.
Question 7: మధ్యగతం అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు, పరిమితులు తెల్పండి.
Answer:
ఒక విభాజనాన్ని ఏ విలువైతే రెండు సమభాగాలుగా విభజిస్తుందో, అంటే ఏ విలువకు అటు, ఇటు విభాగాన్ని పొందిన అంశాల సంఖ్య సమానంగా ఉంటుందో ఆ విలువను ‘మధ్యగతం’ అంటారు. దీనినే ‘స్థాన మాన సగటు’ (Positional averge) అని కూడా అంటారు.
మధ్యగతాన్ని లెక్కించడానికి దిగువ పేర్కొన్న పద్ధతిని ఉపయోగిస్తారు.
1) ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా ఆవరోహణ క్రమంలో రాసుకోవాలి.
2) వరుస క్రమంలో మధ్యస్థ విలువ లేదా సంఖ్యే మధ్యగతం, ఇవ్వబడిన అంశాల సంఖ్య N బేసి (odd) సంఖ్య అయినట్లయితే,
\( \left(\frac{\mathrm{n}+1}{2}\right)^{\text {th }} \) వ అంశం మధ్యగతం
అవుతుంది.
ఇలాంటి స్థితిలో మధ్యగతం ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది. ఇందుకు భిన్నంగా, అంశాల సంఖ్య సరి (even) సంఖ్య అయితే, వరుస క్రమంలో ఉన్న రెండు సంఖ్యల మధ్యస్థ విలువను మధ్యగతం విలువగా పరిగణిస్తారు. కాబట్టి ఈ పరిస్థితిలో మధ్యగతం లెక్కించడానికి \( \left(\frac{\mathrm{n}} {2}\right)^{\text {th }},\left(\frac{\mathrm{n}}{2}+1\right)^{\mathrm{th}} \) వ అంశాలను పరిగణించాలి.
ప్రయోజనాలు:
1. మధ్యగతం దృఢంగా నిర్వచింపబడుతుంది.
2. ఒక శ్రేణిలో గల అంశాలలో ఒక అంశం విలువ ఇతర అంశాల విలువలకు భిన్నంగా అత్యధికంగా ఉన్నప్పటికినీ మధ్యగతం విపరీత అంశాల విలువలచే ప్రభావం కాదు.
3. మధ్యగతాన్ని రేఖాచిత్రం ద్వారా కూడా గణన చేయడానికి వీలు కలుగుతుంది.
4. మధ్యగతాన్ని అర్థం చేసుకోవడం, గణించడం చాలా సులభం
పరిమితులు:
1. మధ్యగతం – స్థానపు సగటు కాబట్టి, దాని గణన శ్రేణిలోని ప్రతి అంశం యొక్క విలువపైన ఆధారపడి ఉండదు. కాబట్టి మధ్యగతం విలువ శ్రేణిలో గల అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పలేం.
2. మధ్యగతం తదుపరి బీజగణిత విశ్లేషణకు ఉపయోగపడదు.
3. అవిచ్ఛిన్న శ్రేణులలో దీనిని అంతర్వేశనం (Interpolated) చేయాల్సి ఉంటుంది.
4. సరిసంఖ్య గల అంశాలు శ్రేణిలో ఉన్నప్పుడు, రెండు మధ్య విలువల అంక మధ్యమమే మధ్యగతం అవుతుంది.
Exam Tips:
a) మధ్యగతం ఒక స్థాన సగటు అని, N బేసి అయితే (N+1)/2 వ అంశం, సరి అయితే మధ్యలోని రెండు అంశాల సగటు అని స్పష్టంగా రాయండి.
b) విపరీత విలువల వల్ల ప్రభావితం కాకపోవడం ప్రధాన ప్రయోజనం.
Question 8: బహుళకం అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు, లోపాలేవి ?
Answer:
ఒక విభాజనంలో ఒక అంశం విలువ తరచూ ఎక్కువ పర్యాయాలు కనిపించడాన్ని బహుళకం తెలుపుతుంది. శ్రేణులలో ఉన్న అంశాలలో ఏ విలువ అతి తరచుగా వస్తుందో ఆ విలువను, ఇంకా ఏ విలువ చుట్టూ అత్యధికంగా ఇతర విలువల పంపిణీ జరుగుతుందో ఆ విలువను ‘బహుళకంగా’ నిర్వచించవచ్చు.
ప్రయోజనాలు:
1. బహుళకం శ్రేణులలో అధిక పర్యాయాలు కనిపించే విలువ. మధ్యగతం మాదిరి దీని విలువ విడిగా (isalated) ఉండదు, శ్రేణిలోలేని అంశాల విలువను తెలిపే అంకమధ్యమంలాగా ఉండదు.
2. విపరీత అంశాల ప్రభావం దీనిపై ఉండదు. అందువల్ల ఇది శ్రేణిలోని అంశాలకు ప్రాతినిధ్యం వహించును.
3. రేఖా చిత్రం ద్వారా కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
4. విస్తృత అవధులు ఉన్న తరగతులలో కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
5. దత్తాంశంలోని గుణాత్మక విలువలను వర్గీకరించవలసినపుడు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది.
6. బహుళకాన్ని అర్థం చేసుకోవడం, గణించడం సులభం.
7. ఇది నిత్య జీవితంలో తరచుగా ఉపయోగించే సగటు. ఉదాహరణకు తరగతి మార్కుల సగటు, ఒక విభాగంలో విద్యార్థుల సంఖ్యను కనుగొనుట మొదలైనవి.
లోపాలు:
1. ద్విబహుళకం, బహుళ బహుళకం శ్రేణులలో బహుళకాన్ని లెక్కించడం చాలా కష్టం.
2. కేంద్రీకృత విలువలపై మాత్రమే బహుళకం ఆధారపడుతుంది. బహుళకం విలువ కంటే అధిక విలువలు కలిగిన ఇతర అంశాలు ఉన్నా అవి పరిగణింపబడవు. అవిచ్ఛిన్న శ్రేణులలో కేవలం తరగతి అంతరాల అవధులు మాత్రమే పరిగణింపబడతాయి.
3. బహుళకం ప్రతిచయన మార్పులకు ఎక్కువగా గురవుతుంది.
4. బహుళకాన్ని వివిధ పద్ధతులలో లెక్కించినపుడు అంకమధ్యమం వలె ఒకే విలువ రాదు. గణనకు అనేక సూత్రాలు ఉన్నాయి. ఏది ఉపయోగించాలి అని సందేహం తలెత్తుతుంది.
5. ఇది బీజీయ ప్రస్తావనకు పనికి రాదు. అంకమధ్యమం వలె ఉమ్మడి బహుళక గణన సాధ్యం కాదు.
6. శ్రేణిలోని అంశాల సంఖ్య అత్యధికంగా ఉన్నప్పుడే బహుళకం ఆ శ్రేణిలోని విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
Exam Tips:
a) బహుళకం అంటే ఎక్కువసార్లు వచ్చే విలువ; ప్రయోజనాలు, లోపాలను వేర్వేరు శీర్షికలతో రాయండి.
b) ద్విబహుళకం/బహుళ బహుళకం శ్రేణులలో కనుగొనడం కష్టం అనే లోపాన్ని మరచిపోకండి.
Question 9: ఆదర్శ లేదా మంచి సగటుకు ఉండవలసిన లక్షణాలను తెల్పండి ?
Answer:
ఆదర్శ లేదా మంచి సగటుకు ఉండవలసిన లక్షణాలు:
1. మంచి సగటు నిర్దిష్టంగా నిర్వచింపబడి ఉండాలి అంటే ఎవ్వరు తెలిపినా ఒకే అర్థం కలిగి ఉండాలి.
2. దత్తాంశంలోని మొత్తం అంశాలకు ప్రాతినిధ్యం వహించాలి.
3. బీజగణిత విశ్లేషణకు అనువుగా ఉండాలి.
4. దత్తాంశంలోని ఒకే ఒక అంశం లేదా కొన్ని అంశాలవల్ల ప్రభావితం కాకూడదు. అధిక విలువలు కలిగిన అంశాలు సగటును ప్రభావితం చేస్తే, ఆ సగటు శ్రేణిలో గల అన్ని అంశాలకు ప్రాతినిధ్యం వహించదు.
5. మంచి సగటు లెక్కించడానికి సులభంగా ఉండి, సామాన్య మానవునికి కూడా సులభంగా అర్థమయ్యేట్లు ఉండాలి. దాని గణనకు క్లిష్టమైన గణిత ప్రక్రియలు అధిక మొత్తంలో ఉంటే అది సులభంగా అర్థం కాదు. అందువల్ల దాని ఉపయోగిత పరిమితంగా ఉంటుంది.
6. ప్రతిచయన స్థిరత్వం కలిగి ఉండాలి. అంటే ప్రతిచయన మార్పులకు సగటు ప్రభావితం కాకూడదు. ఒకే జనాభా నుంచి తీసుకున్న వేరు వేరు ప్రతి చయనాల సగటులలో పెద్దగా తేడా లేకుండా పరస్పరం దగ్గరగా ఉండాలి.
Exam Tips:
a) ఆదర్శ సగటు లక్షణాలను (నిర్దిష్ట నిర్వచనం, అన్ని అంశాలకు ప్రాతినిధ్యం, బీజగణిత విశ్లేషణకు అనుకూలం, విపరీత విలువల ప్రభావం లేకపోవడం, సులభంగా అర్థమవడం, ప్రతిచయన స్థిరత్వం) వరుసగా రాయండి.
b) కనీసం 5 లక్షణాలు రాస్తే పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువ.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: అర్థశాస్త్ర అధ్యయనంలో గణాంక శాస్త్ర ప్రాధాన్యతను తెలపండి ?
Answer:
ఆర్థిక విశ్లేషణలో గణాంక వివరాలు, గణాంక పద్ధతులు చాలా శక్తివంతమైన పరికరాలు. గణాంకశాస్త్రం, అర్థశాస్త్రానికి ముఖ్యంగా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది.
1. ఆర్థిక సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి.
2. ఆర్థిక సిద్ధాంతాలకు సంఖ్యా రూపం ఏర్పరచడం, వాటి పరికల్పనలను (Hypothesis) పరీక్షించడం.
3. ఆర్థిక సిద్ధాంతాల భవిష్యత్ అంచనాలను పరీక్షించడం.
Exam Tips:
a) మూడు ఉపయోగాలు రాస్తే సరిపోతుంది: సమస్యల అవగాహన, సిద్ధాంతాల పరీక్ష, భవిష్యత్ అంచనా.
b) ఒక్కొక్క ఉపయోగానికి ఒక వాక్యం ఇవ్వండి.
Question 2: చిత్రపటాల ఉపయోగాలు ఏమిటి ?
Answer:
గణాంక ఫలితాలను నమ్మకంగా, ఆకర్షణీయంగా సమర్పించడానికి చిత్రపటాలు ఉపయోగపడతాయి. చిత్రపటాలను సక్రమంగా నిర్మించినట్లయితే అవి దత్తాంశ ఫలితాలను స్పష్టంగా చూపిస్తాయి. చిత్రపటాల ఉపయోగాలను క్రింది విధంగా వివరించవచ్చు.
1. ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా ఉంటాయి.
2. ప్రత్యేక గణితశాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు.
3. దత్తాంశ సమర్పణ తేలిక.
4. పోల్చడం తేలిక.
5. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.
Exam Tips:
a) చిత్రపటాల ఉపయోగాలను పాయింట్ల రూపంలో రాయండి (ఆకర్షణీయం, గణిత పరిజ్ఞానం అవసరం లేదు, పోల్చడం తేలిక, జ్ఞాపకశక్తి).
b) రెండు మార్కుల ప్రశ్నకు 4–5 పాయింట్లు చాలు.
Question 3: “పై” (Pie) చిత్రం అంటే ఏమిటి ?
Answer:
‘పై’ చిత్రాన్ని వృత్తాలు అంటారు. దత్తాంశంలోని వివిధ అంశాలను లేదా భాగాలను చూపడానికి మరియు సరిపోల్చడానికి ఉపయోగించే వలయాలను వృత్తాలు అంటారు. ఇది ద్విపరిమాణ చిత్ర పటంలోనిది.
Exam Tips:
a) ‘పై’ చిత్రం వృత్తం రూపంలో ఉండే ద్విపరిమాణ చిత్రమని, భాగాలను సెక్టార్లుగా చూపుతుందని రాయండి.
b) అవసరమైతే డిగ్రీల సూత్రం (భాగం/మొత్తం × 360°) కూడా ఇవ్వండి.
Question 4: ఉప విభాజిత పటాల ఉపయోగాలు ఏమిటి ?
Answer:
దత్తాంశంలోని వివిధ భాగాలను ఒకే బార్లో చూపించడానికి ఈ విధమైన బార్ పటాలను గీస్తారు. ఈ పటాన్ని ‘అంశాల బార్ పటం’ (component bar diagram) అని కూడా అంటారు. ఈ పటాలు దత్తాంశపు మొత్తం వివరాలను వివిధ భాగాలుగా విభజించి గీయబడతాయి. వివిధ భాగాలను వేరుగా చూపడానికి వివిధ రంగులను ఉపయోగిస్తారు.
Exam Tips:
a) ఉపవిభాజిత బార్ పటాన్ని ‘అంశాల బార్ పటం’ అని కూడా అంటారని రాయండి.
b) భాగాలను వేరుగా చూపడానికి వేర్వేరు రంగులు/షేడింగ్ వాడతారని చెప్పండి.
Question 5: క్రింది విలువలకు మధ్యగతం కనుగొనండి 5, 7, 7, 8, 9, 10, 12, 15, 21
Answer:
ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో వ్రాయగా
| క్రమసంఖ్య | x |
|---|---|
| 1 | 5 |
| 2 | 7 |
| 3 | 7 |
| 4 | 8 |
| 5 | 9 |
| 6 | 10 |
| 7 | 12 |
| 8 | 15 |
| 9 | 21 |
మధ్యగతం \( = \frac{N+1}{2} \) వ అంశం
ఇక్కడ N = అంశాల సంఖ్య = 9
మధ్యగతం \( = \frac{9+1}{2} \) వ అంశం
\( = \frac{10}{2} \) వ అంశం = 5వ అంశం
5వ అంశానికి అనురూపంగా ఉన్న విలువ = 9
∴ మధ్యగతం = 9
Exam Tips:
a) విలువలను ముందు ఆరోహణ క్రమంలో రాయండి; N = 9 బేసి కాబట్టి (N+1)/2 = 5 వ అంశమే మధ్యగతం.
b) ఇచ్చిన క్రమం ఇప్పటికే ఆరోహణంలో ఉందో లేదో సరిచూసి, తరువాత స్థానం చెప్పండి.
Question 6: బహుళకం భావన గురించి తెలపండి.
Answer:
ఆంగ్లభాషలో బహుళకాన్ని Mode అంటారు. మోడ్ అనే మాట ల-మోడ్ అనే ఫ్రెంచ్ పదం నుండి గ్రహించబడింది. దీని అర్థం ‘ఫ్యాషన్’. బహుళకాన్ని శ్రేణులలో ఉన్న అంశాలలో ఏ విలువ అతి తరచుగా వస్తుందో ఆ విలువ ఇంకా ఏ విలువ చుట్టూ అత్యధికంగా ఇతర విలువల పంపిణీ జరుగుతుందో ఆ విలువలను ‘బహుళకం’ అంటారు.
Exam Tips:
a) బహుళకాన్ని ఇంగ్లీషులో Mode అంటారని, ఎక్కువ సార్లు వచ్చే విలువ అని రాయండి.
b) ప్రశ్న భావన గురించి కాబట్టి సూత్రాలు అవసరం లేదు.
Question 7: హరమధ్యమం యొక్క ఉపయోగాలు తెలపండి.
Answer:
కాలం, దూరం, రేట్లు మొదలైన సమస్యల పరిష్కారానికి హరమధ్యమాన్ని ఉపయోగిస్తారు.
Exam Tips:
a) హరమధ్యమం ముఖ్యంగా వేగం, కాలం, దూరం, రేట్లకు సంబంధించిన సమస్యలలో వాడతారని రాయండి.
b) ఒక చిన్న ఉదాహరణ (సగటు వేగం) ఇస్తే మంచిది.
Question 8: గుణమధ్యమం భావన గురించి తెలపండి.
Answer:
గుణ మధ్యమం ఒక ప్రత్యేక రకమైన సగటు. శ్రేణిలో రెండు అంశాలు ఇచ్చినట్లయితే రెండు అంశాల లబ్దానికి వర్గమూలం (Square root) మూడు అంశాలు ఇచ్చినట్లయితే మూడు అంశాల లబ్దానికి ఘనమూలం (Cube root) ‘n’ అంశాలు ఇచ్చినట్లయితే N వ మూలాన్ని లెక్కిస్తాం. “శ్రేణులలోని N అంశాల లబ్దానికి Nవ మూలాన్ని గుణమధ్యమం” అంటారు.
ఉదా : 2, 8ల గుణమధ్యమం = రెండు అంశాల లబ్దానికి వర్గమూలం, అంటే \( \sqrt{2 \times 8} = \sqrt{16} = 4 \)
ఉదా : 2, 3, 6ల గుణమధ్యమం = మూడు అంశాల లబ్దానికి ఘనమూలం, అంటే \( \sqrt[3]{2 \times 3 \times 6} = \sqrt[3]{36} = 3.3 \)
\( G.M. = \sqrt[n]{X_1 \cdot X_2 \cdot X_3 \cdots X_n} \)
G.M. = గుణ మధ్యమం
n = అంశాల సంఖ్య
X = అంశాల విలువలు.
Exam Tips:
a) గుణమధ్యమం = N అంశాల లబ్దానికి N వ మూలం; రెండు అంశాలకు వర్గమూలం, మూడింటికి ఘనమూలం అని రాయండి.
b) ఒక సంఖ్యా ఉదాహరణ ఇవ్వండి (2, 8 → 4).
Question 9: మధ్యగతం యొక్క ప్రయోజనాలను తెలపండి.
Answer:
1. మధ్యగతం దృఢంగా నిర్వచింపబడుతుంది.
2. ఒక శ్రేణిలో గల అంశాలలో ఒక అంశం విలువ ఇతర అంశాల విలువలకు భిన్నంగా అత్యధికంగా ఉన్నప్పటికినీ మధ్యగతం విపరీత అంశాల విలువలచే ప్రభావం కాదు.
3. మధ్యగతాన్ని రేఖాచిత్రం ద్వారా కూడా గణన చేయడానికి వీలు కలుగుతుంది.
4. మధ్యగతాన్ని అర్థం చేసుకోవడం, గణించడం చాలా సులభం.
Exam Tips:
a) మధ్యగతం యొక్క ప్రయోజనాలను పాయింట్లుగా రాయండి: దృఢంగా నిర్వచించబడుతుంది, విపరీత విలువల ప్రభావం ఉండదు, రేఖాచిత్రం ద్వారా కనుగొనవచ్చు, సులభం.
b) ప్రతి పాయింట్‌కు ఒక వాక్యం చాలు.
Question 10: మధ్యగతం యొక్క పరిమితులను తెలపండి.
Answer:
1. మధ్యగతం – స్థానపు సగటు కాబట్టి, దాని గణన శ్రేణిలోని ప్రతి అంశం యొక్క విలువపైన ఆధారపడి ఉండదు. కాబట్టి మధ్యగతం విలువ శ్రేణిలో గల అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పలేం.
2. మధ్యగతం తదుపరి బీజగణిత విశ్లేషణకు ఉపయోగపడదు.
3. అవిచ్ఛిన్న శ్రేణులలో దీనిని అంతర్వేశనం (Interpolated) చేయాల్సి ఉంటుంది.
4. సరిసంఖ్య గల అంశాలు శ్రేణిలో ఉన్నప్పుడు, రెండు మధ్య విలువల అంక మధ్యమమే మధ్యగతం అవుతుంది.
Exam Tips:
a) పరిమితులు: స్థాన సగటు కాబట్టి అన్ని అంశాలపై ఆధారపడదు, బీజగణిత విశ్లేషణకు పనికిరాదు, అవిచ్ఛిన్న శ్రేణులలో అంతర్వేశనం అవసరం.
b) ప్రయోజనాలు, పరిమితులను కలిపి రాయకండి.
Question 11: బహుళకం యొక్క ప్రయోజనాలను తెలపండి.
Answer:
1. బహుళకం శ్రేణులలో అధిక పర్యాయాలు కనిపించే విలువ. మధ్యగతం మాదిరి దీని విలువ విడిగా (isalated) ఉండదు, శ్రేణిలోలేని అంశాల విలువను తెలిపే అంకమధ్యమంలాగా ఉండదు.
2. విపరీత అంశాల ప్రభావం దీనిపై ఉండదు. అందువల్ల ఇది శ్రేణిలోని అంశాలకు ప్రాతినిధ్యం వహించును.
3. రేఖా చిత్రం ద్వారా కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
4. విస్తృత అవధులు ఉన్న తరగతులలో కూడా బహుళకాన్ని లెక్కించవచ్చు.
5. దత్తాంశంలోని గుణాత్మక విలువలను వర్గీకరించవలసినపుడు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది.
6. బహుళకాన్ని అర్థం చేసుకోవడం, గణించడం సులభం.
7. ఇది నిత్య జీవితంలో తరచుగా ఉపయోగించే సగటు. ఉదాహరణకు తరగతి మార్కుల సగటు, ఒక విభాగంలో విద్యార్థుల సంఖ్యను కనుగొనుట మొదలైనవి.
Exam Tips:
a) బహుళకం ప్రయోజనాలు: సులభం, విపరీత విలువల ప్రభావం లేదు, రేఖాచిత్రం ద్వారా కనుగొనవచ్చు, గుణాత్మక దత్తాంశానికి ఉపయుక్తం.
b) నిత్య జీవితంలో ఉపయోగం గురించి ఒక ఉదాహరణ ఇవ్వండి.
Question 12: బహుళకం యొక్క పరిమితులను తెలపండి.
Answer:
1. ద్విబహుళకం, బహుళ బహుళకం శ్రేణులలో బహుళకాన్ని లెక్కించడం చాలా కష్టం.
2. కేంద్రీకృత విలువలపై మాత్రమే బహుళకం ఆధారపడుతుంది. బహుళకం విలువ కంటే అధిక విలువలు కలిగిన ఇతర అంశాలు ఉన్నా అవి పరిగణింపబడవు. అవిచ్ఛిన్న శ్రేణులలో కేవలం తరగతి అంతరాల అవధులు మాత్రమే పరిగణింపబడతాయి.
3. బహుళకం ప్రతిచయన మార్పులకు ఎక్కువగా గురవుతుంది.
4. బహుళకాన్ని వివిధ పద్ధతులలో లెక్కించినపుడు అంక మధ్యమం వలె ఒకే విలువ రాదు. గణనకు అనేక సూత్రాలు ఉన్నాయి. ఏది ఉపయోగించాలి అని సందేహం తలెత్తుతుంది.
5. ఇది బీజీయ ప్రస్తావనకు పనికి రాదు. అంకమధ్యమం వలె ఉమ్మడి బహుళక గణన సాధ్యం కాదు.
6. శ్రేణిలోని అంశాల సంఖ్య అత్యధికంగా ఉన్నప్పుడే బహుళకం ఆ శ్రేణిలోని విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
Exam Tips:
a) బహుళకం పరిమితులు: ద్విబహుళకం ఉన్నప్పుడు కష్టం, బీజగణిత విశ్లేషణకు పనికిరాదు, ప్రతిచయన మార్పులకు ఎక్కువగా గురవుతుంది.
b) ఇంకా ఒకటి రెండు పరిమితులు రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
Question 13: ఈ కింది దత్తాంశానికి బహుళకం విలువను కనుగొనండి.
| వేతనాలు | 380 | 430 | 480 | 480 | 480 | 480 | 520 | 590 | 600 | 600 |
Answer:
ఇచ్చిన దత్తాంశం ప్రకారం ₹ 480 నాలుగు సార్లు వచ్చింది. కనుక బాహుళకం = 480.
Exam Tips:
a) ఇది ముడి (వర్గీకరించని) శ్రేణి: ఏ విలువ ఎక్కువసార్లు వచ్చిందో లెక్కించి బహుళకం చెప్పండి.
b) ఇక్కడ 480 నాలుగు సార్లు వచ్చింది; విలువలను జాగ్రత్తగా లెక్కించండి.
Question 14: హరమధ్యమం భావన గురించి తెల్పండి.
Answer:
ఇచ్చిన శ్రేణిలోని అంశాల వ్యుత్క్రమాల (reciprocal) అంక మధ్యమానికి వ్యుత్క్రమమే ఆ అంశాల హరమధ్యమం. ఇంకొక విధంగా చెప్పాలంటే అంశాల సంఖ్యను, వాటి వ్యుత్క్రమాల మొత్తంచే భాగించగా వచ్చిన ఫలితమే హరమధ్యమం. దీనిని దిగువ తెలిపిన సమీకరణం ద్వారా కనుగొనవచ్చు.
\( H.M. = \text{Reciprocal}\left[\frac{\frac{1}{X_1}+\frac{1}{X_2}+\ldots+\frac{1}{X_n}}{N}\right] \) లేదా
\( = \frac{N}{\frac{1}{X_1}+\frac{1}{X_2}+\ldots+\frac{1}{X_n}} \) లేదా
\( = \frac{N}{\sum\left(\frac{1}{X}\right)} \)
Exam Tips:
a) హరమధ్యమం = వ్యుత్క్రమాల అంక మధ్యమానికి వ్యుత్క్రమం; సూత్రం N / Σ(1/X) తప్పక రాయండి.
b) నిర్వచనంతో పాటు సూత్రాన్ని కూడా ఇవ్వండి.
Question 15: 4, 6, 12ల హరమధ్యమం విలువను లెక్కించండి.
Answer:
హరమధ్యమం కనుగొనవలసిన విలువలు : 4, 6, 12
| క్రమసంఖ్య | X | 1/X |
|---|---|---|
| 1 | 4 | 0.2500 |
| 2 | 6 | 0.1667 |
| 3 | 12 | 0.0833 |
| N = 3 | Σ(1/X) = 0.5000 |
\( H.M. = \frac{N}{\sum\left(\frac{1}{X}\right)} = \frac{3}{0.5} = 6 \)
∴ హరమధ్యమం = 6
Exam Tips:
a) ప్రతి విలువకు 1/X లెక్కించి (0.25, 0.1667, 0.0833) వాటి మొత్తం 0.5 అని కూడండి; తరువాత N/0.5 = 3/0.5 = 6.
b) దశాంశ రౌండింగ్ వల్ల తప్పులు రాకుండా కనీసం నాలుగు దశాంశ స్థానాలు వాడండి.
Question 16: 4, 16ల గుణమధ్యమం విలువను లెక్కించండి.
Answer:
గుణమధ్యమం కనుగొనవలసిన విలువలు : 4, 16 ; N = 2
\( G.M. = \sqrt[N]{X_1 \cdot X_2} = \sqrt{4 \times 16} = \sqrt{64} = 8 \)
∴ గుణమధ్యమం = 8
Exam Tips:
a) రెండు అంశాలకు గుణమధ్యమం = √(4×16) = √64 = 8; సూత్రం రాసి విలువలు ప్రతిక్షేపించండి.
b) చివరి సమాధానం సాధారణంగా పూర్ణాంకమై ఉంటుంది, కాబట్టి సరిచూసుకోండి.
పాఠ్యపుస్తక ఉదాహరణలు (Textual Examples)
Question 1: ఒక కళాశాలలో విదేశీ భాషలను చదువుతున్న విద్యార్థుల వివరాలు కింది పట్టికలో ఇవ్వడమైంది. ఈ దత్తాంశం సహాయంతో బహుళ బార్ పటాన్ని గీయండి.
పట్టిక : విదేశీ భాషలను చదువుతున్న విద్యార్థులు
| భాషలు | 1960 | 1970 | 1980 | 1990 | 2000 | 2010 |
|---|---|---|---|---|---|---|
| ఫ్రెంచి | 15 | 17 | 12 | 6 | 17 | 22 |
| జర్మన్ | 8 | 7 | 5 | 12 | 14 | 17 |
Answer:
ప్రతి సంవత్సరానికి ఫ్రెంచి, జర్మన్ విద్యార్థుల సంఖ్యను చూపే రెండు బార్లను పక్కపక్కనే గీయాలి (పై పట్టిక ప్రకారం).
Exam Tips:
a) బహుళ బార్ పటంలో ప్రతి సంవత్సరానికి రెండు భాగాలను పక్కపక్కనే గీయండి.
b) సూచిక (Legend) ఇవ్వడం మరచిపోకండి.
Question 2: క్రింది దత్తాంశానికి ‘పై’ (Pie) చిత్రము గీయండి.
| పంటలు | వరి | గోధుమ | రాగులు | జొన్నలు | తృణధాన్యాలు |
| భూ విస్తీర్ణం (హెక్టార్లలో) | 16 | 24 | 10 | 8 | 5 |
Answer:
మొత్తం విస్తీర్ణం = 16 + 24 + 10 + 8 + 5 = 63
మొత్తం భూవిస్తీర్ణాన్ని డిగ్రీలలోకి మార్చినట్లయితే :
వరి \( = \frac{16 \times 360}{63} = 91° \)
గోధుమ \( = \frac{24 \times 360}{63} = 137° \)
రాగులు \( = \frac{10 \times 360}{63} = 57° \)
జొన్నలు \( = \frac{8 \times 360}{63} = 46° \)
తృణ ధాన్యాలు \( = \frac{5 \times 360}{63} = 29° \)
∴ మొత్తం = 360°.
Exam Tips:
a) భూ విస్తీర్ణం మొత్తం 63 హెక్టార్లు; ప్రతి పంటకు (పంట విస్తీర్ణం/63) × 360° లెక్కించండి.
b) మొత్తం 360° అయిందో సరిచూసి, పటంలో పేర్లు రాయండి.
Question 3: దిగువ తెలిపిన దత్తాంశం బడికి వెళ్తున్న, బడి మానేసిన బాల బాలికలకు సంబంధించింది. ఈ దత్తాంశానికి శాతపు బార్ పటాన్ని గీయండి.
| వివరాలు | బాలురు | బాలికలు |
|---|---|---|
| బడిలో చదువుతున్నవారు | 90 | 55 |
| బడిలో లేనివారు | 10 | 45 |
| మొత్తం | 100 | 100 |
Answer:
బాలురు, బాలికలకు రెండు బార్లు గీసి, ప్రతి బార్లో బడిలో చదువుతున్నవారిని, బడిలో లేనివారిని శాతాలలో చూపాలి.
Exam Tips:
a) శాతపు బార్ పటంలో ప్రతి బార్ 100% ఎత్తు ఉంటుంది; భాగాలను శాతాలలో చూపండి.
b) బాలురు, బాలికలకు రెండు బార్లు గీసి సూచిక ఇవ్వండి.
Question 4: దిగువ ఇచ్చిన దత్తాంశం ఆరుగురు విద్యార్థులు ఒక పరీక్షలో పొందిన మార్కులకు సంబంధించింది అంక మధ్యమాన్ని గణన చేయండి.
మార్కులు (X): 70, 80, 40, 50, 65, 45
Answer:
| క్రమ సంఖ్య | X |
|---|---|
| 1 | 70 |
| 2 | 80 |
| 3 | 40 |
| 4 | 50 |
| 5 | 65 |
| 6 | 45 |
N = 6, ΣX = 350
\( \overline{X}=\frac{\Sigma X}{N}=\frac{350}{6} = 58.3 \)
∴ \( \overline{X} = 58.3 \)
Exam Tips:
a) ముడి శ్రేణిలో అంక మధ్యమం = ΣX / N; ఇక్కడ 350/6 = 58.3.
b) N విలువను సరిగ్గా లెక్కించండి (ఇక్కడ 6 విద్యార్థులు).
Question 5: కింది దత్తాంశానికి అంక మధ్యమాన్ని గణన చేయండి.
| మార్కులు (X) | 20 | 30 | 40 | 50 | 60 | 70 |
| విద్యార్థుల సంఖ్య (f) | 8 | 12 | 20 | 10 | 6 | 4 |
Answer:
| X | పౌనఃపున్యం (f) | d = (X – A) | fd |
|---|---|---|---|
| 20 | 8 | -20 | -160 |
| 30 | 12 | -10 | -120 |
| 40 | 20 | 0 | 0 |
| 50 | 10 | 10 | 100 |
| 60 | 6 | 20 | 120 |
| 70 | 4 | 30 | 120 |
| N = 60 | Σfd = +60 |
(ఋణ విచలనాల మొత్తం = –280, ధన విచలనాల మొత్తం = +340)
గమనిక : పై సమస్య సాధనలో ఊహించిన సగటు (A) 40గా తీసుకోబడింది.
\( \overline{X}=A+\frac{\sum fd}{N} \)
ఇక్కడ, N = 60, Σfd = 60, A = 40 ఈ విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
\( \overline{X} = 40 + \frac{60}{60} = 40 + 1 = 41 \)
∴ \( \overline{X} = 41 \)
Exam Tips:
a) ఊహించిన మధ్యమం A = 40 తీసుకుని d = X – A, fd లెక్కించండి; Σfd = –280 + 340 = 60.
b) X̄ = A + Σfd/N = 40 + 60/60 = 41.
Question 6: క్రింది దత్తాంశానికి అంక మధ్యమాన్ని కనుగొనండి.
| వేతనాలు | 130–140 | 140–150 | 150–160 | 160–170 | 170–180 | 180–190 |
| శ్రామికులు | 3 | 15 | 10 | 8 | 3 | 1 |
Answer:
| తరగతులు (వేతనాలు) | పౌనఃపున్యం (f) | మధ్యస్థ విలువ (x) | d′ = (x – A)/i | fd′ |
|---|---|---|---|---|
| 130–140 | 3 | 135 | -2 | -6 |
| 140–150 | 15 | 145 | -1 | -15 |
| 150–160 | 10 | 155 (A) | 0 | 0 |
| 160–170 | 8 | 165 | 1 | 8 |
| 170–180 | 3 | 175 | 2 | 6 |
| 180–190 | 1 | 185 | 3 | 3 |
| N = 40 | Σfd′ = –4 |
\( \overline{X}=A+\frac{\sum fd'}{N} \times C \)
ఇక్కడ, \( \overline{X} \) = అంక మధ్యమం
A = ఊహించిన అంక మధ్యమం = 155
Σ fd’ = ఊహించిన అంక మధ్యమం నుంచి తీసుకొన్న సోపాన విచలనాలను \( \left[d'_i = \frac{x_i-A}{i}\right] \) వాటి అనురూప పౌనఃపున్యాలతో గుణించగా వచ్చిన లబ్ధాల సంకలనం = – 4
N = పౌనఃపున్యాల మొత్తం = 40
C = తరగతి అంతరం = 10
ఈ విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
\( = 155 + \frac{-4}{40} \times 10 \)
\( = 155 + \frac{-40}{40} \)
= 155 – 1 = 154
∴ \( \overline{X} = 154 \)
Exam Tips:
a) సోపాన విచలన పద్ధతి: d′ = (x – A)/i; ఇక్కడ A = 155, i = 10, Σfd′ = –4.
b) X̄ = 155 + (–4/40) × 10 = 154; తరగతి అంతరం గుణించడం మరచిపోకండి.
Question 7: కింది దత్తాంశం ఏడుగురు వ్యక్తుల ఆదాయాలకు సంబంధించింది. మధ్యగతాన్ని గణన చేయండి.
ఆదాయాలు (X) : 80, 90, 100, 140, 150, 160, 170
Answer:
ఇవ్వబడిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో రాయగా,
| క్రమ సంఖ్య | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| X | 80 | 90 | 100 | 140 | 150 | 160 | 170 |
మధ్యగతం \( = \left(\frac{N+1}{2}\right) \) వ అంశం, ఇక్కడ N = అంశాల సంఖ్య = 7
\( = \frac{7+1}{2} = \frac{8}{2} = 4 \) వ అంశం
4వ అంశానికి అనురూపంగా ఉన్న విలువ = 140,
కాబట్టి ∴ మధ్యగతం = 140.
Exam Tips:
a) N = 7 బేసి కాబట్టి మధ్యగతం = (7+1)/2 = 4 వ అంశం; ముందు విలువలను ఆరోహణ క్రమంలో రాయండి.
b) 4 వ అంశానికి అనురూపమైన విలువ 140.
Question 8: కింది దత్తాంశానికి మధ్యగతాన్ని లెక్కించండి.
| రాబడి (X) | 10 | 20 | 30 | 40 | 50 | 60 | 70 | 80 | 90 |
| పనివారు (f) | 5 | 8 | 12 | 20 | 30 | 16 | 10 | 7 | 8 |
Answer:
| x | f | cf (సంచిత పౌనఃపున్యం) |
|---|---|---|
| 10 | 5 | 5 |
| 20 | 8 | 13 |
| 30 | 12 | 25 |
| 40 | 20 | 45 |
| 50 | 30 | 75 |
| 60 | 16 | 91 |
| 70 | 10 | 101 |
| 80 | 7 | 108 |
| 90 | 8 | 116 |
N = 116
మధ్యగత స్థానం \( = \left(\frac{N+1}{2}\right) \) వ అంశం
ఇక్కడ, N = పౌనఃపున్యాల మొత్తం = 116
\( = \left(\frac{116+1}{2}\right) \) వ అంశం = \( \frac{117}{2} \) వ అంశం = 58.5 వ అంశం
58.5 వ అంశం సంచిత పౌనఃపున్యం 75లో ఉంది. అందువల్ల దాని అనురూప ‘X’ విలువ 50 మధ్యగతం అవుతుంది.
∴ మధ్యగతం = 50.
Exam Tips:
a) వివిక్త శ్రేణిలో (N+1)/2 = 58.5 వ అంశాన్ని సంచిత పౌనఃపున్యంలో వెతకండి.
b) 58.5 మొదట 75 లో ఉంది కాబట్టి మధ్యగతం 50.
Question 9: కింది దత్తాంశానికి మధ్యగతాన్ని లెక్కించండి.
| మార్కులు | 0–9 | 10–19 | 20–29 | 30–39 | 40–49 | 50–59 | 60–69 | 70–79 | 80–89 |
| విద్యార్థులు | 9 | 42 | 61 | 140 | 250 | 102 | 71 | 23 | 02 |
Answer:
పై దత్తాంశం విలీన (inclusive) శ్రేణులకు చెందింది. దీన్ని మినహాయింపు (exclusive) శ్రేణులలోకి మార్చి రాయాలి. ఇందుకోసం తరగతిలో ప్రతి దిగువ అవధిలో నుంచి 0.5 తీసివేయాలి. అలాగే ఎగువ అవధికి 0.5ను కలపాలి. అలా చేయడం ద్వారా విలీన శ్రేణులను మినహాయింపు (exclusive) శ్రేణులుగా మార్చవచ్చు. పై దత్తాంశాన్ని అలా మార్చి రాయగా,
| మార్కులు | f | c.f (సంచిత పౌనఃపున్యాలు) |
|---|---|---|
| –0.5 – 9.5 | 9 | 9 |
| 9.5 – 19.5 | 42 | 51 |
| 19.5 – 29.5 | 61 | 112 |
| 29.5 – 39.5 | 140 | 252 = CF |
| 39.5 – 49.5 (L₁) | 250 = f | 502 (మధ్యగత తరగతి) |
| 49.5 – 59.5 | 102 | 604 |
| 59.5 – 69.5 | 71 | 675 |
| 69.5 – 79.5 | 23 | 698 |
| 79.5 – 89.5 | 02 | 700 |
| N = 700 |
350 వ అంశం సంచిత పౌనఃపున్యం 502 లో ఉంది. దాని అనురూపమైన తరగతి 39.5 – 49.5 కాబట్టి మధ్యగతం విలువ ఈ మధ్యగత తరగతి 39.5 – 49.5 లో ఉంటుంది.
Med \( = L_1 + \left[\frac{\frac{N}{2}-CF}{f}\right] \times i \)
ఇక్కడ, Med = మధ్యగతం (Median)
L₁ = 39.5,
\( \frac{N}{2} = 350 \)
CF = 252
f = 250
i = 10
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
\( = 39.5 + \frac{350-252}{250} × 10 \)
\( = 39.5 + \frac{98}{250} \times 10 \)
\( = 39.5 + \frac{980}{250} \)
= 39.5 + 3.92 = 43.42
∴ మధ్యగతం = 43.42.
Exam Tips:
a) తరగతులు విలీన రూపంలో ఉంటే ముందు మినహాయింపు రూపంలోకి మార్చండి (±0.5).
b) N/2 = 350 మధ్యగత తరగతి 39.5–49.5 లో ఉంది; సూత్రంలో L₁ = 39.5, CF = 252, f = 250, i = 10.
Question 10: కింది దత్తాంశానికి బహుళకాన్ని లెక్కించండి.
| హాజరుకాని రోజులు | 0–5 | 5–10 | 10–15 | 15–20 | 20–25 | 25–30 | 30–35 | 35–40 | 40–45 |
| విద్యార్థుల సంఖ్య | 29 | 195 | 241 | 117 | 52 | 10 | 6 | 3 | 2 |
Answer:
వర్గీకృత పట్టిక:
| నిలువు వరుస | సమూహాల మొత్తాలు (పై నుంచి కింది వరకు) |
|---|---|
| (1) f | 29, 195, 241, 117, 52, 10, 6, 3, 2 |
| (2)* (ప్రతి రెండు) | 224, 358, 62, 9 |
| (3)* (మొదటిదాన్ని వదిలి ప్రతి రెండు) | 436, 169, 16, 5 |
| (4)* (ప్రతి మూడు) | 465, 179, 11 |
| (5)* (మొదటిదాన్ని వదిలి ప్రతి మూడు) | 553, 68 |
| (6)* (మొదటి రెండింటిని వదిలి ప్రతి మూడు) | 410, 19 |
(2)* = ప్రతి రెండు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(3)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదిలి, ప్రతి రెండు అడ్డు వరుసల పౌనఃపున్యాల సంకలనం.
(4)* = ప్రతి మూడు అడ్డు వరుసలలో గల పౌనఃపున్యాల సంకలనం.
(5)* = మొదటి అడ్డు వరుసలో గల పౌనఃపున్యాన్ని వదిలి ప్రతి మూడు అడ్డు
వరుసలతో పౌనఃపున్యాల సంకలనం.
(6)* = మొదటి రెండు అడ్డు వరుసలను వదిలి ప్రతి మూడు అడ్డు వరుసల
పౌనఃపున్యాల సంకలనం.
విశ్లేషణ పట్టిక:
| తరగతి | 0–5 | 5–10 | 10–15 | 15–20 | 20–25 | 25–30 | 30–35 | 35–40 | 40–45 |
|---|---|---|---|---|---|---|---|---|---|
| మొత్తం (టిక్కుల సంఖ్య) | 1 | 3 | 6 | 3 | 1 | – | – | – | – |
వర్గీకృత పట్టిక, విశ్లేషణ పట్టిక ప్రకారం 10-15 తరగతి ఎక్కువ పర్యాయాలు కనిపించింది. కాబట్టి బహుళకపు విలువ 10 – 15 తరగతిలో ఉంటుంది.
| తరగతులు | పౌనఃపున్యం (f) |
|---|---|
| 0–5 | 29 |
| 5–10 | 195 (f₀) |
| 10–15 | 241 (f₁) – బహుళక తరగతి |
| 15–20 | 117 (f₂) |
| 20–25 | 52 |
| 25–30 | 10 |
| 30–35 | 6 |
| 35–40 | 3 |
| 40–45 | 2 |
వర్గీకృత, విశ్లేషణ పట్టికల తర్వాత బహుళకం కనుగొనడానికి ఈ కింది సూత్రాన్ని ఉపయోగిస్తారు.
\( Z = L_1 + \frac{\Delta_1}{\Delta_1+\Delta_2} \times i \)
ఇక్కడ, Z = బహుళకం = ?
L₁ = బహుళ తరగతి దిగువ అవధి = 10
f₀ = బహుళక తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యం = 195
f₁ = బహుళక తరగతి పౌనఃపున్యం = 241
f₂ = బహుళక తరగతి తరువాత తరగతి పౌనఃపున్యం = 117
i = తరగతి అంతరం = 5
∆₁ = f₁ – f₀
= 241 – 195 = 46
∆₂ = f₁ – f₂
= 241 – 117 = 124
విలువలను పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే,
\( = 10 + \frac{46}{46+124} \times 5 \)
\( = 10 + \frac{230}{170} \)
= 10 + 1.35
= 11.35
∴ Z = 11.35.
Exam Tips:
a) వర్గీకృత పట్టిక, విశ్లేషణ పట్టికల ద్వారా బహుళక తరగతి (10–15) గుర్తించి Z = L₁ + Δ₁/(Δ₁+Δ₂) × i వాడండి.
b) Δ₁ = f₁ – f₀ = 46, Δ₂ = f₁ – f₂ = 124; Z = 10 + (46/170) × 5 = 11.35.
Free study material for Economics
TS Board Solutions for Class 11 Economics Chapter 10 Basic Statistical Concepts in Economics
Accessing Chapter 10 Basic Statistical Concepts in Economics Solutions
Explore reliable textbook solutions for Chapter 10 Basic Statistical Concepts in Economics tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Economics.
Concept-Driven Answers for Class 11 Economics
Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Economics text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Maximizing Study Efficiency
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 10 Basic Statistical Concepts in Economics with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 1st Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Economics are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Economics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Economics. You can access TS Inter 1st Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Economics Study Material Chapter 10 అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంకశాస్త్ర భావనలు in printable PDF format for offline study on any device.