TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

Official TS Board Solutions for Class 11 Commerce: Chapter 12 Current Trends in Business

Review structured textbook solutions for Class 11 Commerce Chapter 12 Current Trends in Business. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Commerce: Chapter 12 Current Trends in Business

Access the complete solution PDF for Class 11 Commerce below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

Question 1: e – వ్యాపారాన్ని నిర్వచించి, దాని పరిధిని, స్వభావాన్ని వివరించండి.

Answer:

e – వ్యాపార నిర్వచనం:
1. సంస్థ లేదా కంపెనీ యొక్క కార్యకలాపాలను పెంపొందించడానికి, ICT (Information and Communication Technology) ని వ్యాపార కార్యకలాపాలతో అనుసంధానం చేసే ప్రక్రియనే ‘e – వ్యాపారం’ అంటారు.
2. e – వ్యాపారం అనే పదాన్ని మొదటిసారిగా 1997 సంవత్సరంలో IBM సంస్థ ఉపయోగించింది. ఇది e వ్యాపారాన్ని ఈ విధంగా నిర్వచించింది – “అంతర్జాల సాంకేతికతను ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశల (Key Business Process)తో పరివర్తనను తీసుకురావడం”.
3. “అన్ని వ్యాపార కార్యకలాపాలను వ్యాపార పరిధిని బలపరచడానికి ICT ద్వారా అనుసంధానం చేయటాన్ని e- వ్యాపారంగా నిర్వచించవచ్చు”.
4. e – వ్యాపారం, ICT ని వినియోగించుకుంటూ, వినియోగదారులతో వ్యాపార సంబంధాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. e – వ్యాపార పద్ధతులు వ్యాపార సంస్థల అంతర్గత, బహిర్గత సమాచార వ్యవస్థల మధ్య సంబంధాలను అత్యంత సమర్థవంతంగా, సులభంగా ఏర్పరుస్తూ, వినియోగదారుల అవసరాలను అంచనాలను సంతృప్తి పరచడానికి దోహదం చేస్తుంది. వినియోగదారులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి e -వ్యాపారం వెబ్ ఆధారిత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.
e – వ్యాపార పరిధి (Scope of e – business):
e – వ్యాపార కార్యకలాపాలను క్రింద తెలిపిన విధంగా వర్గీకరించవచ్చు:
ఎ) వ్యాపార సంస్థలో వ్యవహారాలు.
బి) ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు (B2B).
సి) వ్యాపార సంస్థ, వినియోగదారుని మధ్య వ్యవహారాలు (B2C).
డి) వినియోగదారులు, వినియోగదారుల మధ్య (C2C) వ్యవహారాలు.
ఇ) వినియోగదారుడు – వ్యాపార సంస్థల మధ్య (C2B) వ్యవహారాలు.
ఎఫ్) వ్యాపార సంస్థ మరియు ప్రభుత్వం (B2G) మధ్య వ్యవహారాలు.
ఎ) వ్యాపార సంస్థలో వ్యవహారాలు: ఏదైనా సంస్థ విభిన్నమైన వ్యాపారాలను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న సందర్భంలో అంతర్గతంగా ఆన్లైన్ ద్వారా వ్యవహారాలను ఈ పద్ధతి ద్వారా నిర్వహించవచ్చు.
బి) B2B: ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థల మధ్య వస్తు – సేవల మార్పిడి జరిగినట్లయితే దానిని B2B (Business to Business) వ్యవహారాలు అంటారు.
ఉదాహరణకి, ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియా, ఆలిబాబా మొదలైనవి ఈ కోవకు చెందుతాయి.
సి) B2C: వ్యాపార సంస్థకు, వినియోగదారులకు మధ్య వస్తు, సేవల మార్పిడి జరిగినట్లయితే దానిని B2C (Business to Customer) వ్యవహారాలు అంటారు.
ఉదాహరణకి, అమెజాన్. కామ్. నెటిక్స్. కామ్, సులేకా.కామ్ మొదలైనవి ఈ కోవకు చెందుతాయి.
డి) C2C: వినియోగదారులు వేరొక వినియోగదారులచే వివిధ ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా అందించబడిన వస్తుసేవలను C2C (Customer to Customer) వ్యవహారాలు అంటారు. ఉదాహరణకు ఓఎల్ఎక్స్, క్వికర్ మొదలైనవి.
ఇ) C2B: ఈ పద్ధతిలో వినియోగదారులు వ్యాపార సంస్థలకు వస్తు సేవలను అందించడం జరుగుతుంది. ఫలితంగా వ్యాపార సంస్థలు వారు అందించిన సేవలకు సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకు గూగుల్ ఆడెసెన్స్లాంటి ఆన్లైన్ వ్యాపార ప్రకటనల సంస్థలు, అమెజాన్ అనుబంధ కార్యక్రమాలు ఈ కోవలోకి వస్తాయి. ఆన్లైన్ సర్వేలు, గోజింగ్ సర్వేలు, సర్వే స్కౌటు మరియు సర్వే మంకీ మొదలైనవి C2B కి మరికొన్ని ఉదాహరణలు.
ఎఫ్) B2G: వ్యాపార సంస్థ, ప్రభుత్వము లేదా ప్రభుత్వరంగ సంస్థల మధ్య జరిగే వ్యాపార వ్యవహారాలను B2G (Business to Government) గా వ్యవహరించవచ్చు. ప్రజాసేకరణ విధానం, లైసెన్సింగ్ పద్ధతులు, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు ఇంటర్నెట్ ద్వారా చేపట్టడం అనేవి B2G కోవకు చెందుతాయి. ఉదాహరణకి వస్తు సేవలను ప్రభుత్వానికి అమ్మటం, నివేదికలను అవసరం మేరకు సమర్పించడం మొదలైనవి.
e – వ్యాపారానికి సంబంధించిన అంశాలైన e – వాణిజ్యం, e – వేలం, e – బ్యాంకింగ్, e – మార్కెటింగ్, e – వర్తకం మొదలైనవి e – వ్యాపార పరిధిలోకి వస్తాయి.
అవి ఈ క్రింద వివరించబడ్డాయి:
1. e – వాణిజ్యం (e – Commerce): అంతర్జాలం (Internet) ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e వాణిజ్యం అంటారు. దీనినే ఎలక్ట్రానిక్ వాణిజ్యంగా వ్యవహరిస్తారు. అంటే, ఆన్లైన్ ద్వారా వస్తువులు లేదా సేవలు కొనుగోలు అమ్మకం చేసే ఏదైనా వ్యాపార కార్యకలాపం ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో నిర్వహించడాన్ని e – వాణిజ్యం అంటారు.
2. e – వేలం (e – Auctioning): ఇంటర్నెట్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత సమయం వృధా కాకుండా వేలంలో పాల్గొనవచ్చును. e – వేలంలో ఎవరైతే పాల్గొనదలిచారో, వారు సంబంధిత వెబ్సైట్ను సందర్శించి, తాము కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయవచ్చును. అదే విధంగా తమ వస్తువులను వెబ్ పేజీలలో ఉంచి e – వేలం ద్వారా వాటిని అమ్మవచ్చును.
3. e- బాంకింగ్ (e – Banking): ఎలక్ట్రానిక్ బాంకింగ్ అనేది విజయవంతమైన ఆన్లైన్వ్యాపారాలలో ముఖ్యమైంది. బాంకు వెబ్సైట్ను ఉపయోగిస్తూ, బాంకు ఖాతాదారులు తమ ఖాతాలను నిర్వహించుకోవచ్చు, చెల్లింపులకు ఆజ్ఞలను ఇవ్వవచ్చు. ఆన్లైన్బాంకింగ్ సహాయంతో ఖాతాదారులు, బాంకును సందర్శంచవలసిన అవసరం లేకుండానే తమకు అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చును, ఖాతాల నిల్వలను తెలుసు కోవచ్చును. నగదు బదిలీ చేయవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు.
4. e – మార్కెటింగ్ (e – Marketing): ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొనుగోలు, అమ్మకాలు ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా అంటే ఆన్లైన్లో చేపట్టడాన్ని e- మార్కెటింగ్ అంటారు. ఎలాంటి సమయాభావం లేకుండా ఖాతాదారుల డిమాండ్కు కంపెనీలు స్పందించే విధంగా అంతర్జాలం సహాయం చేస్తుంది.
5. e – వర్తకం (e – Trading): e వర్తకంని ‘ఆన్లైన్ వర్తకం’ లేదా ‘e – బ్రోకింగ్’ అని కూడా అంటారు. ఇది స్టాక్ ఎక్ఛ్సేంజిలలో సెక్యూరిటీలను అమ్మటానికి, కొనటానికి ఉపయోగపడుతుంది.

Exam Tips:

a) మొదట e-వ్యాపార నిర్వచనం (IBM 1997), తర్వాత పరిధి (B2B, B2C, C2C, C2B, B2G – ప్రతిదానికీ ఒక ఉదాహరణ), చివరగా స్వభావం (e-వాణిజ్యం, e-వేలం, e-బ్యాంకింగ్, e-మార్కెటింగ్, e-వర్తకం) రాయండి.
b) B2B కు ఇండియామార్ట్, B2C కు అమెజాన్, C2C కు OLX, B2G కు ప్రభుత్వ ఇ-టెండర్లు వంటి ఉదాహరణలు మార్కులు తెస్తాయి.

 

Question 2: e-వ్యాపారం యొక్క ప్రయోజనాలను వివరించండి.

Answer:

e- వ్యాపారము వలన వినియోగదారులకు, వ్యాపార సంస్థలకు, సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు:
1. e– వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలను కల్పిస్తాయి.
3. e- వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు, సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
4. e- వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో, క్షణాలలో పొందవచ్చును.
6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e- వ్యాపారము సహాయపడుతుంది.
7. e- వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేట్లు చేస్తుంది.
8. e- వ్యాపారము వ్యాపారం మధ్య పోటీతత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.
వ్యాపార సంస్థకు ప్రయోజనాలు:
1. e– వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
2. e– వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెస్చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, సమాచారాన్ని సేకరించడానికి, ఇన్వెంటరీ, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
3. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకము వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
4. బిజినెస్ ప్రాసెస్, రీ – ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
5. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ కంటే వ్యయము తక్కువగా ఉంటుంది.
సమాజానికి ప్రయోజనాలు:
1. ఇంటి నుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీని వలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్లో లభించని వస్తు సేవలను ఆ వ్యాపారము ద్వారా పొందవచ్చు.
4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

Exam Tips:

a) ప్రయోజనాలను మూడు శీర్షికల కింద (వినియోగదారులు, వ్యాపార సంస్థలు, సమాజం) వేరు వేరుగా రాయండి; శీర్షికలు లేకుండా కలిపి రాయవద్దు.
b) ప్రతి వర్గానికి కనీసం 3–4 పాయింట్లు రాయండి.

 

Question 3: 21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు ఉన్న అవకాశాలను తెలపండి.

Answer:

21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు గల అవకాశాలు:
1) సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ: LPG రూపములో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సంస్కరణలు, భారతదేశములోని వ్యాపార సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించినది. ఈ పరిస్థితులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడానికి, పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ వర్తకములో పెరుగుదలకు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు, ఆంక్షలు లేని మూలధన ప్రవాహానికి దారితీసింది.
2) భారీ తరహా, విస్తరణ అవకాశాలు: 21వ శతాబ్దపు వ్యాపార సంస్థలు భారీతరహా, ఎక్కువ విస్తరణకు అవకాశాలు గల సంస్థల లక్షణాలు కలిగి ఉన్నవి. భారీ తరహా సంస్థ, ఉత్పత్తిలో పెరుగుదల వలన కంపెనీ ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.
3) తలసరి ఆదాయంలో పెరుగుదల: తలసరి ఆదాయము పెరుగుదలలో మనదేశము ప్రపంచవ్యాప్తముగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినది. తలసరి ఆదాయము దేశములోని ప్రజల జీవన ప్రమాణస్థాయిని తెలుపుతుంది. పెరుగుతున్న తలసరి ఆదాయము వలన దేశములో వ్యాపార అవకాశాలు పెరగడానికి అవకాశము ఉన్నది.
4) మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు: భారతదేశము 125 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ప్రపంచవ్యాప్తముగా పారిశ్రామిక, వర్తక సేవారంగాలను ఆకర్షిస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు భారతదేశ మార్కెట్ ఆదాపూర్వక మార్కెట్గా రూపొందినది. దాని ఫలితముగా దేశములోని వ్యాపార సంస్థలకు అనేక వ్యాపార అవకాశాలు లభిస్తున్నవి.
5) e – వాణిజ్యము – ప్రపంచ మార్కెట్ కు గేట్వే: ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు e- వాణిజ్యం ప్రయోజనాలను గుర్తిస్తున్నాయి. నగదు ప్రవాహములో పెరుగుదల, ఖాతాదారుల నిలుపుదల, సేవా సంతృప్తి e – వాణిజ్యం ద్వారా లభించిన ప్రయోజనాలు.
6) సాంకేతిక పురోభివృద్ధి: 21వ శతాబ్దములో వ్యాపార సంస్థలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నవి. దీనివలన వ్యాపార సంస్థలు సమాజానికి అవసరమైన వస్తు సేవలను తక్కువ వ్యయానికి అందిస్తున్నవి.
7) విత్త సేవల విస్తరణ: 21వ శతాబ్దములో విత్త సేవారంగము చాలా వేగముగా పెరుగుతున్నది. బ్యాంకింగ్, భీమా, రుణ, ఈక్విటీ, ఫైనాన్సింగ్, సూక్ష్మ విత్త రంగాలు ప్రజలలో పొదుపు అలవాట్ల పెరుగుదల, భవిష్యత్ అవసరాలకు సరళమైన ఋుణాలు పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నవి. ఈ ఆర్థిక రంగములో కంపెనీలకు వ్యాపార విస్తరణ అవకాశాలకు దారితీసాయి.
8) వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్: వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ అనేది వ్యయాల నియంత్రణకు ఉపయోగించే వ్యూహము. ఇది వ్యాపార ప్రక్రియలను స్వయం చలితం చేయడమే కాక అధిక సామర్థ్యాన్ని పొందడం, వ్యాపార అవసరాలకు మార్పులను ఆపాదించుకోవడం, మానవ తప్పిదాలను తగ్గించడం ద్వారా పని ప్రవాహాన్ని మెరుగుపరచడం చేస్తుంది.
9) పెరుగుతున్న కలయికలు, సముపార్జనలు, విదేశీ కొలాబరేషన్లు: కలయికలు, సముపార్జనలు, నవకల్పనల అభివృద్ధి, లాభదాయకత, మార్కెట్ వాటా, కంపెనీ వాటా విలువలలో పెరుగుదలకు ఆధునిక వ్యాపార సంస్థలకు అనుకూలించే వ్యూహము. ఇదే తరహాను అనుసరించే ప్రతిఫలాలలో పెరుగుదలకు, అధిక సమర్ధతకు, వ్యయాల నియంత్రణకు దోహదం చేస్తుంది.
10) అంతర్జాతీయ వ్యవస్థాపన: 21వ శతాబ్దములో అనేక సంస్థలు, వ్యాపార ప్రపంచీకరణను, తయారీ, సేవల, మూలధన వనరుల, ప్రతిభ సంపాదనకి రక్షణ వ్యూహంగా పరిగణిస్తున్నది. వినియోగదారుల అవసరాలకు. సరిపడేందుకు కొత్త ఉత్పత్తులు, సేవలు సృష్టించడానికి ఒకటి కంటే ఎక్కువ దేశాలలో వ్యాపార అవకాశాలు కనుగొంటున్నాయి.

Exam Tips:

a) అవకాశాలను LPG సంస్కరణలు, e-వాణిజ్యం, సాంకేతిక పురోగతి, విత్త సేవల విస్తరణ వంటి శీర్షికలతో సంఖ్యలు వేసి రాయండి.
b) ప్రశ్న 'అవకాశాలు' గురించి; సవాళ్లను ఇక్కడ కలపవద్దు.

 

Question 4: 21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే సవాళ్ళను తెలపండి.

Answer:

21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఈ క్రింది సవాళ్ళను ఎదుర్కోవాలి.
1) సాంకేతిక పరిజ్ఞానము సవాళ్ళు: సాంకేతిక పరిజ్ఞానములో వేగముగా వస్తున్న మార్పులు చిన్న వ్యాపార సంస్థలకు ఖర్చు, సమయము ఒక ముప్పుగా ఏర్పడినది. ఈ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానములో వచ్చిన మార్పులకు అనుగుణముగా ప్లాంటు, యంత్రాలు, పరికరాలు, ఉత్పత్తి విధానాలను ఆధునీకరించుకుంటున్నాయి.
లేకపోతే సంస్థలు తమ ఉనికిని కోల్పోయి, మార్కెట్ నుంచి తొలగిపోతాయి.
2) పెరుగుతున్న వినియోగదారుల అవగాహన: ఉత్పత్తులు, సేవల పట్ల వినియోగదారుల అవగాహన పెరుగుతున్నది. వినియోగదారులను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా కోల్పోకుండా నివారించేందుకు వినియోగదారుల డిమాండ్లకు స్పందించవలసిన అవసరమున్నది.
3) ప్రపంచీకరణ సవాళ్ళు: ప్రపంచీకరణ వ్యాపార వాతావరణములో మిశ్రమ సంస్కృతులు, భాషలు మొదలైన వ్యూహాత్మక సవాళ్ళకు దారితీసింది. ఫలితముగా ప్రపంచ పోటీ, వస్తు సేవల ధరలు పెరిగినవి.
4) సహజ వనరుల క్షీణత: చాలా రకములైన ఉత్పత్తి సంస్థలు సహజ వనరులు ముఖ్యంగా ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. ఖనిజాలు, అడవులు, ఇంధనాలు, సారవంతమైన నేలలు మొదలైన సహజ వనరులు క్షీణించిపోవడం వలన రాబోయే కాలములో వ్యాపార సంస్థలపై దీని ప్రభావము ఉంటుంది.
5) ఆర్థిక మాంద్యము: ప్రపంచవ్యాప్తముగా అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మార్పు చెందుతోంది. అమెరికా, ఐరోపాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యము ఇతర దేశాలలో పనితీరుపై ప్రభావాన్ని చూపుతోంది.
6) పర్యావరణ సవాళ్ళు: వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో పర్యావరణ క్షీణత అతి పెద్ద సవాలు. ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన పరిసరాలు వేగముగా మారుతున్నాయి.
7) సమాచార సవాళ్ళు: నిర్వహణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా ఇంటర్నెట్ ఉపయోగము, వైర్లెస్ సమాచారము, సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన e – వాణిజ్యం వ్యాపార సంస్థలకు పెద్ద సవాళ్ళు. అత్యధిక ద్రవ్యోల్బణ రేటు, అధిక వడ్డీరేట్లు, తక్కువ ఆర్థిక పెరుగుదల, నిత్యావసర వస్తువుల పెరుగుదల వ్యాపార సంస్థలను ప్రభావితం చేస్తున్నవి.
8) అవినీతి, అధికారుల అడ్డంకులు: ఈ రోజులలో అవినీతి అనేది వ్యాపార సంస్థలకు పెద్ద అడ్డంకి. దేశములో అవినీతి బాగా పాతుకొనిపోయి, రోజువారీ జీవితములో అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నది.
9) పారదర్శకత, పరిపాలన: కార్పొరేటు పరిపాలన వ్యక్తుల, సంస్థల ఆసక్తులను కాపాడటానికి ఉపయోగపడుతుంది. కార్పొరేటు సంస్థలు తీసుకునే నిర్ణయాలు, అవి పొందుపరుచుకున్న ఆసక్తులు ప్రభావాన్ని చూపుతాయి. కంపెనీల పరిపాలన, పారదర్శకత, ప్రభుత్వ నిఘా ఉంటుంది.
10) కార్పొరేటు సామాజిక బాధ్యత: CSR ఆచరణ, అమలులో అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. CSR మన దేశములో ప్రారంభ దశలో ఉన్నది. CSR పై అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన ఉద్యోగుల తక్కువ సంఖ్య, విధాన అంశాలు, కవరేజి మొదలైన అంశాలు CSR కు అడ్డంకులు.
11) విదేశీ ద్రవ్యం మార్పిడి సమస్య: వ్యాపార సంస్థల నిర్వహణ సమస్యల విదేశీ మారకపు రేట్లలో అస్థిరత. ఇది మార్పిడిరేట్లు, ఎగుమతులు, దిగుమతులు, రాజకీయ అంశాల కారణముగా ఏర్పడినది.
12) మానవ వనరుల సవాళ్ళు: సరైన సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం, వారిని నిలిపి ఉంచడం, HR విభాగపు నిధులు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానము కారణముగా IT నైపుణ్యము, సమస్య పరిష్కార నైపుణ్యం, రీజనింగ్ నైపుణ్యం గల అర్హులైన సిబ్బందిని నియమించడానికి సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నవి.
13) భద్రత సమస్యలు: e- కామర్స్, వర్చువల్ ఆఫీసు వ్యాప్తిలో ముప్పులు ఎదురవుతాయి. ఈ ముప్పులు సమాచార భద్రత, ఇంటర్నెట్ భద్రత, భౌతిక భద్రత, కంపెనీ wireless access నెట్వర్క్, చట్టాలలో గోప్యత మొదలైన రూపా నీ జరుగుతుంది.

Exam Tips:

a) సవాళ్లను (సాంకేతిక మార్పులు, పర్యావరణం, అవినీతి, CSR, మానవ వనరులు, భద్రత) శీర్షికలతో రాయండి; ఒక్కో దానికి 2 వాక్యాలు చాలు.
b) ప్రశ్న 3 (అవకాశాలు), ప్రశ్న 4 (సవాళ్లు) తారుమారు కాకుండా చూసుకోండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: e-వ్యాపారం యొక్క పరిధిని వివరించండి.

Answer:

e – వ్యాపార పరిధి: e – వ్యాపార కార్యకలాపాలను క్రింది విధముగా విభజించవచ్చు:
1. వ్యాపార సంస్థలో వ్యవహారాలు.
2. ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు (B2B).
3. వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు (B2C).
4. వినియోగదారుడు – వినియోగదారుని మధ్య వ్యవహారాలు (C2C).
5. వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు (C2B).
6. వ్యాపార సంస్థ మరియు ప్రభుత్వానికి మధ్య వ్యవహారాలు (B2G).
e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది:
1) e – వాణిజ్యము: ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని e – వాణిజ్యము అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e – వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e – వాణిజ్యము అనవచ్చు.
2) e – వేలం: ఇంటర్నెట్ సహాయముతో ప్రజలు వేలములో పాల్గొనవచ్చు. e – వేలములో పాల్గొనదలచినవారు సంబంధిత వెబ్సైట్ను సందర్శించి వేలం కోసం ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్పేజీలలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా వస్తువులను అమ్మకము చేయవచ్చు.
3) e – బ్యాంకింగ్: ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపులు ఆజ్ఞ ఇవ్వడానికి e – బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించ వచ్చును. నగదును బదిలీ చేయవచ్చును.
4) e – మార్కెటింగ్: ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్ను కంపెనీలు స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయం చేస్తుంది. దీనికి వినియోగదారులు ఉండే ప్రాంతముతో సంబంధము లేదు.
5) e – వర్తకము: e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి ఉపయోగపడుతుంది.

Exam Tips:

a) ముందుగా ఆరు రకాల వ్యవహారాలను (సంస్థ లోపల, B2B, B2C, C2C, C2B, B2G) జాబితాగా రాసి, తర్వాత e-వాణిజ్యం, e-వేలం, e-బ్యాంకింగ్, e-మార్కెటింగ్, e-వర్తకం వివరించండి.

 

Question 2: e – వ్యాపారంవల్ల సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏవి ?

Answer:

వ్యాపార సంస్థకు ప్రయోజనాలు (Benefits to Organisations):
1. సరిహద్దులు దాటి వ్యాపారం: e – వ్యాపారం వల్ల సంస్థలు తమ మార్కెట్లను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరింపచేసుకుని తక్కువ వ్యవధిలో తమ అమ్మకాలను లేదా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చును.
2. ఖర్చులలో పొదుపు: e వ్యాపారం వల్ల, వస్తువులను సృష్టించటం, ప్రాసెస్చేయటం, పంపిణీ, స్టోరేజీ, సమాచార సేకరణలాంటి ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చును. తద్వారా సరుకు నిల్వ, పరోక్ష ఖర్చులు కూడా తగ్గుతాయి,
3. పోటీతత్వ ప్రయోజనం: e – వ్యాపారం వల్ల వినియోగదారులు తాము ఎంచుకున్నసేవలను, అందుబాటులో ఉన్న పోటీదారుల వస్తువులతో పోల్చి చూసుకోవచ్చును. దీని వల్ల వినియోగదారులు తమకు నచ్చిన వస్తుసేవలను చాలా తక్కువ సమయంలో ఎంపిక చేసుకొని పోటీతత్వ ప్రయోజనాలు పొందవచ్చును.
4. పెట్టుబడి తిరిగి పొందే సమయాన్ని తగ్గించడం: e – వ్యాపారం పెట్టుబడికి, వస్తుసేవల నుండి ఆదాయం పొందటానికి మధ్య ఉన్న సమయాన్ని తగ్గిస్తుంది.

Exam Tips:

a) సంస్థలకు ప్రయోజనాలు: మార్కెట్ విస్తరణ, ఖర్చుల పొదుపు, పోటీతత్వ ప్రయోజనం, పెట్టుబడి తిరిగి పొందే సమయం తగ్గడం – ఈ నాలుగు గుర్తుంచుకోండి.

 

Question 3: e – వ్యాపారంవల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏవి ?

Answer:

e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు (Benefits to Consumers):
1. సౌకర్యవంతమైన షాపింగ్: e – వ్యాపారం వల్ల వినియోగదారులు ఏ ప్రాంతంనుండైనను, ఏ సమయంలో అయినా, రోజులో 24 గంటలు, సంవత్సరంలోని అన్ని రోజులు వారి సౌలభ్యం మేరకు షాపింగ్ చేసుకోవచ్చును.
2. విస్త్రుత ప్రత్యామ్నాయాలు: e – వ్యాపారం, వినియోగదారులకు అనేక ప్రత్యామ్నాయ వస్తువులను, సేవలను మరియు అవకాశాలను కల్పిస్తాయి.
3. ధర ప్రయోజనం: e – వ్యాపారం ద్వారా వినియోగదారులు మార్కెట్లలోని వస్తు- సేవలను పోల్చి చూసుకోవడం వల్ల తమకు కావలసిన వస్తువులను తక్కువ ధరకు పొందగలుగుతారు. e – వ్యాపారం సప్లయర్ల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడం వల్ల వినియోగదారులు ధరలలో ప్రయోజనం పొందుతారు.
4. సమాచార మార్పిడి: e – వ్యాపారం వల్ల వినియోగదారులు ఇతర వినియోగదారులతో మార్కెట్లో లభ్యమయ్యే వస్తు, సేవలకు సంబంధించి తమ అభిప్రాయాలు, అనుభవాలు, ఆలోచనలు పంచుకోవటం వల్ల సరైన సమాచారాన్ని క్షణాలలో పొందవచ్చును.

Exam Tips:

a) వినియోగదారులకు ప్రయోజనాలు: సౌకర్యవంతమైన షాపింగ్ (24x7), ఎక్కువ ఎంపికలు, ధర ప్రయోజనం, సమాచార మార్పిడి – శీర్షికలను అండర్‌లైన్ చేయండి.

 

Question 4: e – వ్యాపార వ్యవహారాల వల్ల కలిగే నష్ట భయాలను తెలపండి.

Answer:

e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలు:
1. ఇంటర్నెట్ వాడకములో సమాచారము అనధికారికముగా
మార్చివేయబడడం అనే నష్టభయమున్నది.
2. రహస్యముగా ఉంచవలసిన వ్యక్తిగత సమాచారము మరియు క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ లాంటి బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన నష్టభయాలు.
3. e-వాణిజ్యం ద్వారా జరిగే వ్యవహారాలకు భౌతిక ఆధారాలు లేని కారణముగా చట్టబద్ధతకు సంబంధించిన నష్టభయాలు ఎక్కువ.
4. ఎలక్ట్రానిక్ సమాచారం అందించడములో వైఫల్యం, మొత్తము వ్యాపారము ముగింపుకు దారితీసే నష్టభయాలు.
5. నిర్వాహక వర్గం, e – వాణిజ్య వ్యవహారాలు తన అదుపులో ఉంచుకొని, సరి చూసుకొని మరియు తగిన సమాచార పద్ధతులు ఎంచుకోవడంలోని నష్ట భయాలు.
6. వైరస్లు, హ్యాకింగ్ లాంటి సాంకేతికపరమైన నష్ట భయాలు.

Exam Tips:

a) నష్టభయాలను భద్రత (హ్యాకింగ్, వైరస్‌లు), గోప్యత (క్రెడిట్ కార్డు వివరాలు), చట్టపరమైన అంశాలు అని వర్గీకరించి రాస్తే స్పష్టంగా ఉంటుంది.

 

Question 5: e వ్యాపార వ్యవహారాల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు తెలపండి.

Answer:

e – వ్యాపారం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు (Benefits to Society):
1. పర్యావరణ ఉపయోగాలు: వినియోగదారులు తమకు కావలసిన వస్తువులను లేదా సేవలను ఇంటర్నెట్ ద్వారా తాము పనిచేస్తున్న స్థలం నుండి లేదా తమ ఇంటి నుండి షాప్లకు వెళ్లనవసరం లేకుండానే కొనుగోలు చేయవచ్చును. దీని వలన ట్రాఫిక్ సమస్యలు తగ్గటమే కాకుండా వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి.
2. ప్రజా సంక్షేమం: వ్యాపారస్థులు తమ వస్తువులను అంతర్జాలం ద్వారా తక్కువ ధరకు అమ్మటం వల్ల పేదవారికి ప్రయోజనం చేకూరుతుంది.
3. వస్తువుల లభ్యత: e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కావలసినన్ని విభిన్నమైన, వివిధ రకాల వస్తుసేవలు వారి కోరిక మరియు అవసరం మేరకు లభ్యమవుతాయి. అలాగే ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని వస్తువునైనా సులభంగా కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది.
4. జీవన ప్రమాణాల పెరుగుదల: e – వ్యాపారం వల్ల తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను దేశవిదేశాల నుండి కొనవచ్చు. దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

Exam Tips:

a) సమాజానికి ప్రయోజనాలు: పర్యావరణ ఉపయోగాలు (తక్కువ ట్రాఫిక్, కాలుష్యం), పేదలకు తక్కువ ధరలు, వస్తువుల లభ్యత, జీవన ప్రమాణాల పెరుగుదల.

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: e – వ్యాపారం.

Answer:

1. e- వ్యాపారం అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e – వ్యాపారము అంటే ‘ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడం’.
2. అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology సహకారాన్ని ఇంటర్నెట్ల ద్వారా తీసుకోవడం e – వ్యాపారముగా నిర్వచించవచ్చు.
3. వ్యాపార కార్యకలాపాల నిర్వహణ అంటే వస్తువుల రూపకల్పన, వ్యవహారాల నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఇతర సేవలను ఎలక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించి, వివిధ ఆసక్తిదారులకు అందించడమే e- వ్యాపారం.

Exam Tips:

a) అతి స్వల్ప జవాబులో IBM, 1997, ICT అనే కీలక పదాలు తప్పక ఉండాలి; 3–4 వాక్యాలు చాలు.

 

Question 2: e – బ్యాంకింగ్.

Answer:

1. ఎలక్ట్రానిక్ సాధనాలైన ఇంటర్నెట్, మొబైల్ ఫోను ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడాన్ని “e – బాంకింగ్” అంటారు.
2. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్వెబ్సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపులు, ఆజ్ఞ ఇవ్వడానికి e – బ్యాంకింగ్ సహాయము చేస్తుంది.
3. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చును. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

Exam Tips:

a) ఇంటర్నెట్/మొబైల్ ద్వారా బ్యాంకు సేవలు; ఖాతా నిల్వ తెలుసుకోవడం, నగదు బదిలీ, బిల్లుల చెల్లింపు, ATM – ఈ ఉపయోగాలు పేర్కొనండి.

 

Question 3: e – వాణిజ్యం.

Answer:

1. ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e-వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యమును e – వాణిజ్యం అని వ్యవహరిస్తారు.
2. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి ఉదాహరణ. అంతేకాకుండా e – వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e – వాణిజ్యం అనవచ్చు.

Exam Tips:

a) e-వాణిజ్యం = ఇంటర్నెట్ ద్వారా వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు; ఉదాహరణగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రాయండి.

 

Question 4: e – వేలం.

Answer:

1. ఇంటర్నెట్ని ఉపయోగిస్తూ, తమ వ్యక్తిగత సమయము వృధా కాకుండా వేలంలో పాల్గొనే పద్ధతిని అంటారు.
2. e – వేలంలో పాల్గొనదలచిన వారు సంబంధిత వెబ్సైట్ని సందర్శించి తాము కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయవచ్చును. అదే విధంగా తమ వస్తువులను e ద్వారా అమ్మవచ్చును.

Exam Tips:

a) e-వేలంలో వ్యక్తిగత సమయం వృధా కాదని, వెబ్‌సైట్ ద్వారా వస్తువులు కొనవచ్చు/అమ్మవచ్చని రాయండి.

 

Question 5: e – వర్తకం.

Answer:

1. e-వర్తకాన్ని “ఆన్లైన్ వర్తకం” లేదా “e – బ్రోకింగ్” అని కూడా వ్యవహరిస్తారు.
2. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి సహాయపడుతుంది.

Exam Tips:

a) e-వర్తకానికి మరో పేరు 'ఆన్‌లైన్ వర్తకం' లేదా 'e-బ్రోకింగ్'; స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సెక్యూరిటీల క్రయవిక్రయాలకు ఉపయోగపడుతుందని చెప్పండి.

 

Question 6: e – మార్కెటింగ్

Answer:

1. కొనుగోలు, అమ్మకాలు, వ్యాపార ప్రకటనలు లాంటి మార్కెటింగ్ విధులను ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా నిర్వర్తించడాన్ని e – మార్కెటింగ్ అంటారు.
2. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచ వ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది.
3. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారులు డిమాండ్కు కంపెనీ స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయము చేస్తుంది.

Exam Tips:

a) e-మార్కెటింగ్ ప్రత్యేకత: భౌగోళిక అడ్డంకులు లేకపోవడం, సమయ పరిమితి లేకపోవడం – ఈ రెండింటినీ పేర్కొనండి.

 

Question 7: విదేశీ మారక నష్టభయం.

Answer:

1. వ్యాపార సంస్థలు నిర్వహణలోని సమస్యలకు విదేశీ మారకపు రేట్ల స్థిరమైన అస్థిరత మరొక కారణంగా చెప్పవచ్చును.
2. మార్పిడి రేట్లు, ఎగుమతులు, దిగుమతుల మొత్తం, రాజకీయ అంశాలు బాహ్యకారకాలుగా ఏర్పడుతున్నాయి.

Exam Tips:

a) విదేశీ మారక నష్టభయం = మారకపు రేట్ల అస్థిరత వల్ల ఎగుమతి దిగుమతులపై కలిగే ప్రభావం; రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించండి.

 

Free study material for Commerce

Commerce Class 11 Curriculum Solutions: Chapter 12 Current Trends in Business

Accessing Chapter 12 Current Trends in Business Solutions

Review comprehensive exercise answers for Class 11 Commerce Chapter 12 Current Trends in Business. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 11 Commerce

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Commerce module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 12 Current Trends in Business with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Commerce are as per latest TS Board curriculum.

Are the Commerce TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Commerce concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Commerce. You can access TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు in both English and Hindi medium.

Is it possible to download the Commerce TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు in printable PDF format for offline study on any device.