TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు

Download TS Board Solutions for Class 11 Commerce Chapter 09 Sources of Business Finance

Access comprehensive textbook solutions for Chapter 09 Sources of Business Finance using the official curriculum guides for Class 11 Commerce. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Access TS Board Solutions and Answers

Navigate directly to the solved Commerce textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

Question 1: మనదేశంలో వ్యాపార సంస్థలకు లభించే వివిధ వ్యాపార విత్త మూలాధారాలను వివరించండి.

Answer:

ఒక వ్యాపార సంస్థ తన మూలధనాన్ని వివిధ మూలాధారాల నుంచి సమకూర్చుకుంటుంది. ఏ మూలాధారము నుంచి వనరులు సమకూర్చుకొనాలి అనేది సంస్థల స్వభావము, పరిమాణం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ తన స్థిర మూలధన అవసరాలకు నిధులను సేకరించవలసివస్తే యాజమాన్యపు నిధుల ద్వారా, ఋణపూర్వక నిధుల ద్వారా సేకరించాలి. రోజువారీ వ్యాపార నిర్వహణ కోసం స్వల్పకాలిక నిధులను సేకరించాలి.
కాల వ్యవధి ఆధారముగా నిధుల మూలాలు మూడు రకాలు.
1. దీర్ఘకాలిక విత్తమూలాలు,
2. మధ్యకాలిక విత్తమూలాలు,
3. స్వల్పకాలిక విత్తమూలాలు.
1. దీర్ఘకాలిక విత్తమూలాలు: 5 సంవత్సరాల కాలపరిమితికి మించి సంస్థలో దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. వీటి ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రోజువారీ ఖర్చులకు శాశ్వత నిర్వహణ మూలధనము, వ్యాపార విస్తరణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారు.
దీర్ఘకాలిక విత్తానికి మూలాధారాలు:
1. ఈక్విటీ వాటాల జారీ
2. ఆధిక్యపు వాటాల జారీ
3. ఋణ పత్రాల జారీ
4. నిలిపి ఉంచిన ఆర్జనలు
2. మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణ, భారీ ప్రకటనలకు, కొత్త వస్తువులు ప్రవేశపెట్టడానికి, కొత్త శాఖలను, ప్రదర్శనశాలను ఏర్పరచుకొనడానికి ఉపయోగిస్తారు.
మధ్యకాలిక విత్తానికి మూలాధారాలు:
1. పబ్లిక్ డిపాజిట్లు
2. బ్యాంకుల నుంచి ఋణము
3. కాలవిత్తము.
3. స్వల్పకాలిక విత్తము: ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్పకాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది.
స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు:
1. బ్యాంకు ఋణము
2. వర్తక ఋణము
3. వాయిదా ఋణము
4. ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
5. వాణిజ్య పత్రాలు

Exam Tips:

a) కాల వ్యవధి ఆధారంగా మూడు రకాలను (దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక) మొదట పేర్కొని, ఒక్కొక్కదానికి కాలపరిమితి (5 సం. పైన / 1–5 సం. / 1 సం. లోపు) రాయండి.
b) ప్రతి రకానికి మూలాధారాల జాబితా ఇవ్వడం మర్చిపోవద్దు.

 

Question 2: కంపెనీలకు లభించే ప్రధానమైన దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక విత్త మూలాధారాల గురించి చర్చించండి.

Answer:

దీర్ఘకాలిక విత్త వనరులు: కంపెనీ తన దీర్ఘకాలిక ఆర్థిక వనరులను దిగువ మూలాల ద్వారా సేకరిస్తుంది.
1. వాటాలు,
2. డిబెంచర్లు,
3. నిలిపి ఉంచిన ఆర్జనలు.
1. వాటాలు: కంపెనీ వ్యవస్థలో మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా లేదా యూనిట్లుగా విభజిస్తారు. ఒక్కొక్క యూనిట్ను వాటా అంటారు. పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడానికి కంపెనీలు రెండు రకాల వాటాలను జారీ చేస్తాయి. అవి i) ఆధిక్యపు వాటాలు ii) ఈక్విటీ వాటాలు.
i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు, కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే హక్కు. కంపెనీలు ఆధిక్యపు వాటాలను సంచిత, అసంచిత, మిగులులో భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.
ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
2. డిబెంచర్లు: వాటా మూలధనమువలె కంపెనీ డిబెంచర్లను జారీ చేస్తుంది.
డిబెంచరు కంపెనీ తీసుకున్న అప్పుకు స్వీకృతి తెలిపే పత్రము. అప్పును అంగీకరిస్తూ ఆ సొమ్మును భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలములో, నిర్ణీత వడ్డీతో చెల్లించడానికి అంగీకరిస్తూ కంపెనీ అధికార ముద్రతో లిఖిత పూర్వకముగా వ్రాసి జారీ చేసిన పత్రాన్ని డిబెంచరు అంటారు. ఈ పత్రాన్ని కొన్నవారిని డిబెంచర్దారులు అంటారు. ఋణధ్రువ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు ఇచ్చే రశీదు. దీనిలో ఋణపత్రదారుని పేరు, అప్పు విలువ, అప్పు షరతులు, అప్పు తీర్చే పద్ధతి మొదలైన వివరాలు ఉంటాయి. కంపెనీ దీర్ఘకాలిక అవసరాలకు డిబెంచర్లను జారీ చేస్తాయి.
3. నిలిపి ఉంచిన ఆర్జనలు: సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండుగా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకై వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని నిలిపి ఉంచిన ఆర్జన అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వునిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించుకోవడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.
స్వల్పకాలిక విత్తవనరులు: ఒక వ్యాపారానికి అవసరమయ్యే నిర్వహణ మూలధన అవసరాలకు స్వల్పకాలిక నిధులు అవసరము. స్వల్పకాలము అంటే ఒక సంవత్సరము కంటే తక్కువ కాలము.
స్వల్పకాలిక నిధులకు మూలాధారాలు:
1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి.
ఎ) ఋణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి.
బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకులు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే చార్జి చేస్తారు.
సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని చార్జి చేస్తారు.
2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్విల్ ఉన్న సంస్థలకు, ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.
3. వాయిదా పరపతి: యంత్రాలు, యంత్రపరికరాల సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంతకంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది.
4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారులు ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు.
5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజుల నుంచి 365 రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.

Exam Tips:

a) దీర్ఘకాలిక (వాటాలు, డిబెంచర్లు, నిలిపి ఉంచిన ఆర్జనలు), స్వల్పకాలిక (బ్యాంకు పరపతి, వర్తక ఋణం, వాయిదా పరపతి, అడ్వాన్సులు, వాణిజ్య పత్రాలు) అని రెండు శీర్షికలుగా విభజించి రాయండి.
b) బ్యాంకు పరపతిలో ఋణం, క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ అనే మూడు పద్ధతులను విడివిడిగా వివరించండి.

 

Question 3: ఒక వ్యాపారసంస్థ ఆర్థికావసరాలకు ఉపయోగపడే వివిధ విత్త మూలాధారాల పద్ధతులను తులనాత్మకంగా వివరించండి.

Answer:

దీర్ఘకాలిక విత్తమూలాలు, స్వల్పకాలిక విత్తమూలాల వివరాలకు పైన ఇచ్చిన Question 2 సమాధానం చూడండి. మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాల కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తమూలాలు అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణకు, భారీ ప్రకటనలకు, కొత్త వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి, ప్రదర్శనశాలను ఏర్పరచుకోవడానికి ఉపయోగిస్తారు.
మధ్యకాలిక విత్తమూలాలు:
1. పబ్లిక్ డిపాజిట్లు: ఒక సంస్థ ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే డిపాజిట్లను పబ్లిక్ డిపాజిట్లు అంటారు. ఈ పబ్లిక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు బ్యాంకు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సంస్థలో డిపాజిట్చేయదలుచుకున్న వ్యక్తి నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించవలెను. ఆ దరఖాస్తును కంపెనీ స్వీకరించి, తీసుకున్న డిపాజిట్కు సాక్ష్యముగా డిపాజిట్ రశీదును జారీ చేస్తుంది. ఇది మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీరుస్తుంది. ఈ డిపాజిట్ల వలన సంస్థకి, డిపాజిట్ చేసే వ్యక్తికి కూడా ఉపయోగకరముగా ఉంటుంది. పెట్టుబడిదారులకు డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగాను, కంపెనీకి ఈ డిపాజిట్ల సేకరణకు అయ్యే వ్యయం, బ్యాంకు నుంచి ఋణాలు పొందడానికి అయ్యే వ్యయము కంటే తక్కువగాను ఉంటుంది. పబ్లిక్ డిపాజిట్ల సేకరణను రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది.
2. వాణిజ్య బ్యాంకులు: కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న రుణాలు అందించడములో బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు ఋణాల ద్వారా, క్యాష్ క్రెడిట్లు, ఓవర్డ్రాఫ్ట్లు, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకులు వివిధ కారకాలపై ఆధారపడి మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. మంజూరు చేసిన ఋణాన్ని ఒకే మొత్తముగాగాని, వాయిదాల రూపములోగాని వసూలు చేస్తుంది. సాధారణముగా బ్యాంకులు మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలనే తీరుస్తాయి. ఋణాన్ని పొందిన సంస్థ ఋణాన్ని పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.
3. కౌలు ద్రవ్యము: ఒక ఆస్తికి యజమాని అయిన వ్యక్తి తన ఆస్తిని వాడుకోవడానికి వేరొకరికి హక్కును ఇచ్చి, ఆ హక్కును బదిలీ చేసినందుకుగాను కొంత ప్రతిఫలము పొందడానికి చేసుకున్న ఒప్పందమే కౌలు ఒప్పందము. ఆస్తి యజమానికి లెస్సార్(కౌలు యజమాని) గాను, అద్దెకు తీసుకున్న వ్యక్తిని లెస్సీ (కౌలుదారని) అని పిలుస్తారు.
కౌలుదారు ఆస్తిని వాడుకున్నందుకు నిర్ణీత కాలవ్యవధులలో యజమానికి కౌలు అద్దెను చెల్లిస్తాడు. కౌలు ఒప్పందానికి సంబంధించిన షరతులు, నిబంధనలు కౌలు ఒప్పందములో ఉంటాయి. కాలపరిమితి పూర్తికాగానే ఆస్తిపై గల హక్కులు యజమానికి బదిలీ అవుతాయి. సంస్థల ఆధునీకరణ, వినూత్నముగా మార్చడానికి అవసరమయ్యే ద్రవ్యము కౌలు ద్రవ్యము. సాంకేతిక పరిజ్ఞానములో వస్తున్న శీఘ్ర మార్పుల కారణముగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడి పోతాయి. కౌలు ద్రవ్యముతో నిర్ణయాలు తీసుకునే ముందు సొంత ఆస్తులను అమర్చుకోవడానికయ్యే వ్యయాన్ని కౌలుకయ్యే వ్యయముతో పోల్చి నిర్ణయాలు తీసుకోవాలి.

Exam Tips:

a) ముందు పట్టిక లేదా శీర్షికలతో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక మూలాలను వేరు చేసి చూపండి.
b) మధ్యకాలిక మూలాలు: పబ్లిక్ డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, కౌలు విత్తం – మూడింటినీ రాయండి.

 

Question 4: ప్రత్యేకత ఉన్న ఆర్థిక సహాయ సంస్థలు అంటే ఏమిటో వివరించండి. వాటి ఆవశ్యకతల గురించి తెలపండి.

Answer:

దేశములో ఆర్థిక కార్యకలాపాలు వేగముగా విస్తరించడం వలన విత్తరంగములో ఎన్నో వ్యవస్థాపూర్వక మార్పులు చోటుచేసుకున్నాయి. వర్తక, వాణిజ్యాలకు అనుగుణముగా వెంచర్ మూలధనము, క్రెడిట్ రేటింగ్, కౌలు విత్తములాంటి విత్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త విత్తసంస్థలు ఏర్పడినాయి. వీటిని ప్రత్యేక విత్తసంస్థలుగా వ్యవహరిస్తారు.
1. IFCI వెంచర్ మూలధన నిధుల లిమిటెడ్: కొత్త ఉద్యమదారులు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రారంభించడం కోసం వారికి వడ్డీలేని ఋణాలుగాని, తక్కువ వడ్డీకి ఋణాలుగాని ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించే ఉద్దేశముతో 1975లో భారత పారిశ్రామిక సంస్థ I.F.C.I రిస్క్ కాపిటల్ను ప్రారంభించినది. 1988 జనవరిలో రిస్క్ కాపిటల్ అండ్టెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్గా మార్చడమైనది. ఈ సంస్థ ప్రాధాన్యము ఉన్న నూతన సాంకేతిక పద్ధతులు, ఉత్పత్తులు, ప్రక్రియలు, మార్కెట్ సేవలు, సాంకేతిక పరమైన పెంపుదల, శక్తి సంరక్షణ ఏర్పాట్లకు ప్రాధాన్యతనిస్తూ విత్తసహాయం అందిస్తుంది.
2. ICICI వెంచర్ ఫండ్స్ లిమిటెడ్: 1989లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించినారు. కొత్తగా సాహసంతో ప్రాజెక్టులకు విత్త సహాయము అందించడం దీని ప్రధాన ఆశయము. కంప్యూటర్లు, రసాయనాలు, పాలిమర్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెలికాం, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాలకు సహాయాన్ని అందించినది. ప్రస్తుతం ఈ సంస్థను ICICI వెంచర్ ఫండ్స్ పేరుతో పిలవబడుతున్నది.
3. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: దేశములో పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యముతో కేంద్ర ప్రభుత్వము టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా లిమిటెడ్ను నెలకొల్పినది. సంప్రదాయ పర్యాటక ప్రాజెక్టులకే కాకుండా అమ్యూజ్మెంట్ పార్కులు, రోప్వేలు, కార్ రెంటల్ సేవలు, నీటి రవాణా, ఫెర్రీరీలు లాంటి సంప్రదాయేతర పర్యాటక ప్రాజెక్టులకు కూడా ఈ సంస్థ విత్త సహాయాన్ని అందిస్తుంది.

Exam Tips:

a) ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం, లక్ష్యం, అందించే సహాయం సంక్షిప్తంగా రాయండి.
b) IFCI, ICICI వెంచర్, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ – పేర్లు, సంక్షిప్త రూపాలు తప్పులేకుండా రాయండి.

 

Question 5: వివిధ రకాల వాటాల జారీవల్ల (ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు) కలిగే ప్రయోజనాలను, పరిమితులను విమర్శనాత్మకంగా వివరించండి.

Answer:

ఆధిక్యపు వాటాల వలన కలిగే ప్రయోజనాలు:
1. పెట్టుబడి మీద స్థిర ఆదాయముతో పాటు, పెట్టుబడి సురక్షితముగా ఉండాలని కోరుకునే వారికి ఇవి లాభదాయకము.
2. తక్కువ నష్ట భయముతో, పెట్టుబడి మీద స్థిర ఆదాయమును కోరుకునే వారికి ఈ వాటాలు అనువైనవి.
3. కంపెనీ దీర్ఘకాలిక మూలధనాన్ని పొందవలసివస్తే ఈ వాటాల జారీ దోహదపడుతుంది.
4. కంపెనీకి శాశ్వత మూలధనము అవసరము లేకపోతే, అభివృద్ధి తరువాత విమోచనీయ ఆధిక్యపు వాటాలను వాపసు చేయవచ్చు.
5. కంపెనీకి అధిక లాభాలు వచ్చినపుడు, వీటి డివిడెండు రేటు స్థిరము కాబట్టి కంపెనీ ఈక్విటీలో ట్రేడింగ్ చేయవచ్చు.
6. కంపెనీని రద్దు చేసినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు ఆధిక్యపు వాటాదారులకు మూలధనం వాపసు చేస్తారు.
7. ఆధిక్యపు వాటాల జారీకి కంపెనీ ఆస్తుల తనఖా అవసరము లేదు.
ఆధిక్యపు వాటాలకు గల పరిమితులు:
1. స్వభావరీత్యా ఎంతటి నష్టాన్నైనా భరించగలిగే ధైర్యసాహసాలు ఉన్న పెట్టుబడిదారులు, సముచితమైన ప్రతిఫలాన్ని పొందాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఆధిక్యపు వాటాలను అంతగా ఇష్టపడరు.
2. కంపెనీ ఆస్తులపై ఈక్విటీ వాటాదారులకు ఉన్న హక్కు ఆధిక్యపు వాటా మూలధనము వలన పలచబడే అవకాశమున్నది.
3. డిబెంచర్లతో పోలిస్తే ఆధిక్యపు వాటాల జారీకి ఖర్చు ఎక్కువ.
4. ఈ వాటాలపై డివిడెండు రేటు స్థిరము కాబట్టి కంపెనీపై శాశ్వత భారాన్ని మోపుతుంది.
5. ఈ వాటాలపై ఓటింగ్ హక్కు ఉండదు, కాబట్టి ఆధిక్యపు వాటాదారులు నిర్వహణలో పాల్గొనలేరు.
6. ఈక్విటీ వాటాలతో పోలిస్తే ఆధిక్యపు వాటాల జారీకయ్యే ఖర్చు తక్కువైనా డిబెంచర్లతో పోలిస్తే వీటిపై ఖర్చు ఎక్కువ.
7. ఈ వాటాలపై డివిడెండును కంపెనీ లాభాలను ఆర్జించినపుడే చెల్లిస్తారు. కంపెనీకి లాభాలు రాకపోతే పెట్టుబడిదారులకు ఎలాంటి హామీ ఉండదు. అందువలన పెట్టుబడిదారులను ఆకర్షించవు.
ఈక్విటీ వాటాల వలన కలిగే ప్రయోజనాలు:
1. ఈక్విటీ వాటాలపై స్థిరమైన రేటు ప్రకారము డివిడెండ్ చెల్లించనవసరము లేదు. కంపెనీకి తగినన్ని లాభాలు వచ్చినపుడే డివిడెండ్ చెల్లిస్తారు. అందువలన కంపెనీకి శాశ్వత భారాన్ని మోపవు.
2. ఈ రకమైన వాటాల జారీకి కంపెనీ ఆస్తులను తనఖా పెట్టనక్కర్లేదు.
3. కంపెనీని మూసివేస్తే తప్ప ఈక్విటీ మూలధనమును వాపసు చేయనవసరము లేదు.
4. ఈక్విటీ వాటాదారులు కంపెనీ యజమానులు. వీరికి ఓటు హక్కు ఉంటుంది. నిర్వహణలో పాల్గొనవచ్చు.
5. కంపెనీకి అధిక లాభాలు వచ్చినప్పుడు ఈక్విటీ వాటాదారులు ఎక్కువ డివిడెండుతో పాటు వాటా విలువ పెరిగినందు వలన కలిగే లాభాన్ని కూడా పొందవచ్చును.
ఈక్విటీ వాటాలకు గల పరిమితులు:
1. స్థిరమైన, నిలకడ ఉన్న ఆదాయాన్ని కోరుకునేవారు, ముందుచూపుగల పెట్టుబడిదారులు ఈక్విటీ వాటాలలో పెట్టుబడి పెట్టడానికి అంతగా ఇష్టపడరు.
2. ఇతర వనరుల ద్వారా లభించే విత్త సేకరణకు అయ్యే వ్యయం కంటే ఈక్విటీ వాటాల ద్వారా సేకరించే నిధులకు అయ్యే వ్యయం ఎక్కువ, మరియు వీటి జారీకి ఎన్నో లాంచనాలను, విధానాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది.
3. కంపెనీకి తగినంత లాభాలు రాకపోతే వీరికి డివిడెండ్ ఉండదు.
4. ఎక్కువ సంఖ్యలో అదనముగా ఈక్విటీ వాటాలను జారీ చేస్తే, ఓటింగ్ హక్కులు తగ్గి, వారి ఆర్జన కూడా తగ్గుతుంది.
5. ఈక్విటీ వాటాల జారీపై ఎక్కువగా ఆధారపడితే అతి మూలధనీకరణ జరిగే ప్రమాదము ఉన్నది.
6. కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించినపుడు, డివిడెండ్ రేటు పెరిగి, స్పెక్యులేషన్కు దారితీయవచ్చు.
7. ఎక్కువ ఈక్విటీ వాటాలు కలిగిన కొద్దిమంది కంపెనీపై నియంత్రణ సాధించవచ్చును.

Exam Tips:

a) ఆధిక్యపు, ఈక్విటీ వాటాల ప్రయోజనాలు, పరిమితులను నాలుగు వేర్వేరు శీర్షికల కింద రాయండి.
b) 'విమర్శనాత్మకంగా' అని అడిగారు కాబట్టి ప్రయోజనాలతో పాటు పరిమితులను కూడా సమానంగా రాయండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: స్వల్పకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?

Answer:

ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్ప కాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది.
స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు:
1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి.
ఎ) రుణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి.
బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే ఛార్జి చేస్తారు.
సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని ఛార్జి చేస్తారు.
2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్వెల్ ఉన్న సంస్థలకు, ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.
3. వాయిదా పరపతి: యంత్రాలు, యంత్రపరికరాలు సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంత కంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది.
4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారుల ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు.
5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజులనుంచి 365 రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.

Exam Tips:

a) స్వల్పకాలిక వనరులు ఐదు: బ్యాంకు పరపతి, వర్తక ఋణం, వాయిదా పరపతి, అడ్వాన్సులు, వాణిజ్య పత్రాలు.
b) ఋణం, క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ మధ్య తేడాను వడ్డీ లెక్కింపు ఆధారంగా చూపండి.

 

Question 2: దీర్ఘకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?

Answer:

5 సంవత్సరాల కాలపరిమితికి మించి సంస్థలో దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. వీటి ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రోజువారీ ఖర్చులకు శాశ్వత నిర్వహణ మూలధనము, వ్యాపార విస్తరణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారు.
దీర్ఘకాలిక విత్తానికి మూలాధారాలు:
I. వాటాల జారీ:
i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు, కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే హక్కు. కంపెనీలు ఆధిక్యపు వాటాలను సంచిత, అసంచిత, మిగులులో భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.
ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
II. డిబెంచర్లు: వాటా మూలధనమువలె కంపెనీ డిబెంచర్లను జారీ చేస్తుంది.
డిబెంచరు కంపెనీ తీసుకున్న అప్పుకు స్వీకృతి తెలిపే పత్రము. అప్పును అంగీకరిస్తూ ఆ సొమ్మును భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలములో, నిర్ణీత వడ్డీతో చెల్లించడానికి అంగీకరిస్తూ కంపెనీ అధికార ముద్రతో లిఖిత పూర్వకముగా వ్రాసి జారీ చేసిన పత్రాన్ని డిబెంచరు అంటారు. ఈ పత్రాన్ని కొన్నవారిని డిబెంచర్దారులు అంటారు. ఋణధ్రువ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు ఇచ్చే రశీదు. దీనిలో ఋణపత్రదారుని పేరు, అప్పు విలువ, అప్పు షరతులు, అప్పు తీర్చే పద్ధతి మొదలైన వివరాలు ఉంటాయి. కంపెనీ దీర్ఘకాలిక అవసరాలకు డిబెంచర్లను జారీ చేస్తాయి.
III. నిలిపి ఉంచిన ఆర్జనలు: సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండుగా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకై వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని ‘నిలిపి ఉంచిన ఆర్జన’ అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వునిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించుకోవడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.

Exam Tips:

a) దీర్ఘకాలిక వనరులు: వాటాలు (ఆధిక్యపు, ఈక్విటీ), డిబెంచర్లు, నిలిపి ఉంచిన ఆర్జనలు; కాలపరిమితి 5 సంవత్సరాలకు పైన అని రాయండి.

 

Question 3: మధ్యకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?

Answer:

ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణ, భారీప్రకటనలకు, కొత్త వస్తువులు ప్రవేశపెట్టడానికి, కొత్త శాఖలకు, ప్రదర్శన శాలను ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
మధ్యకాలిక విత్తానికి మూలాలు:
1. పబ్లిక్ డిపాజిట్లు: ఒక సంస్థ ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే డిపాజిట్లను పబ్లిక్ డిపాజిట్లు అంటారు. ఈ పబ్లిక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు బ్యాంకు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సంస్థలో డిపాజిట్చేయదలుచుకున్న వ్యక్తి నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించవలెను. ఆ దరఖాస్తును కంపెనీ స్వీకరించి, తీసుకున్న డిపాజిట్కు సాక్ష్యముగా డిపాజిట్ రశీదును జారీ చేస్తుంది. ఇది మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీరుస్తుంది. ఈ డిపాజిట్ల వలన సంస్థకి, డిపాజిట్ చేసే వ్యక్తికి కూడా ఉపయోగకరముగా ఉంటుంది. పెట్టుబడిదారులకు డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగాను, కంపెనీకి ఈ డిపాజిట్ల సేకరణకు అయ్యే వ్యయం, బ్యాంకు నుంచి ఋణాలు పొందడానికి అయ్యే వ్యయము కంటే తక్కువగాను ఉంటుంది. పబ్లిక్ డిపాజిట్ల సేకరణను రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది.
2. వాణిజ్య బ్యాంకులు: కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న రుణాలు అందించడములో బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు ఋణాల ద్వారా, క్యాష్ క్రెడిట్లు, ఓవర్డ్రాఫ్ట్లు, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకులు వివిధ కారకాలపై ఆధారపడి మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.
మంజూరు చేసిన ఋణాన్ని ఒకే మొత్తముగా గాని, వాయిదాల రూపములోగాని వసూలు చేస్తుంది. సాధారణముగా బ్యాంకులు మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలనే తీరుస్తాయి. ఋణాన్ని పొందిన సంస్థ ఋణాన్ని పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.
3. కౌలు విత్తము: ఒక ఆస్తికి యజమాని అయిన వ్యక్తి తన ఆస్తిని వాడుకోవడానికి వేరొకరికి హక్కును ఇచ్చి, ఆ హక్కును బదిలీ చేసినందుకుగాను కొంత ప్రతిఫలము పొందడానికి చేసుకున్న ఒప్పందమే కౌలు ఒప్పందము. ఆస్తి యజమానికి లెస్సార్(కౌలు యజమాని) గాను, అద్దెకు తీసుకున్న వ్యక్తిని లెస్సీ (కౌలుదారని) అని పిలుస్తారు.
కౌలుదారు ఆస్తిని వాడుకున్నందుకు నిర్ణీత కాలవ్యవధులలో యజమానికి కౌలు అద్దెను చెల్లిస్తాడు. కౌలు ఒప్పందానికి సంబంధించిన షరతులు, నిబంధనలు కౌలు ఒప్పందములో ఉంటాయి. కాలపరిమితి పూర్తికాగానే ఆస్తిపై గల హక్కులు యజమానికి బదిలీ అవుతాయి. సంస్థల ఆధునీకరణ, వినూత్నముగా మార్చడానికి అవసరమయ్యే ద్రవ్యము కౌలు ద్రవ్యము. సాంకేతిక పరిజ్ఞానములో వస్తున్న శీఘ్ర మార్పుల కారణముగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడి పోతాయి. కౌలు ద్రవ్యముతో నిర్ణయాలు తీసుకునే ముందు సొంత ఆస్తులను అమర్చుకోవడానికయ్యే వ్యయాన్ని కౌలుకయ్యే వ్యయముతో పోల్చి నిర్ణయాలు తీసుకోవాలి.

Exam Tips:

a) మధ్యకాలిక వనరులు మూడు: పబ్లిక్ డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకుల ఋణాలు, కౌలు విత్తం.
b) కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు అని మొదటి వాక్యంలోనే చెప్పండి.

 

Question 4: ప్రత్యేక సహాయ సంస్థల ఆవశ్యకతను వివరించండి.

Answer:

భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంస్థల పాత్ర కీలకమైనది. ఒక దేశ ఆర్థికాభివృద్ధి కేవలము స్వల్పకాలిక రుణ సదుపాయాన్ని అందించే సంస్థలు ఉంటే సరిపోదని వివిధ రకాలైన మూలధన స్వరూపాలతో, వివిధ ధ్యేయాలతో ప్రత్యేకీకరణలతో వివిధ సంస్థలను, పెట్టుబడి సంస్థలను స్థాపించడం జరిగినది. పారిశ్రామిక విత్తాన్ని చౌకగా, సులువుగా లభ్యమయ్యేటట్లు చూడడానికి ప్రభుత్వము అనేక కార్పొరేషన్లను స్థాపించినది. వాటిలో ముఖ్యమైనవి:
1. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు: భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును 1964 జూలై 1న స్థాపించినారు. మన దేశములో పారిశ్రామికాభివృద్ధి కోసం ఏర్పడిన పారిశ్రామిక విత్త సంస్థలలో ఇది శిఖర సంస్థ. ప్రత్యక్ష ధన సహాయముతో పారిశ్రామిక సంస్థలకు ప్రాజెక్టు ఋణాలు, సరళ ఋణాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి ఋణాల మంజూరు, పారిశ్రామిక వాటాలు, డిబెంచర్ల జారీకి, చందాపూచీ ఇవ్వడం, పారిశ్రామిక సంస్థలు తీసుకున్న ఋణాలకు హామీలు ఇవ్వడం. పరోక్ష విత్త సహాయము అంటే పారిశ్రామిక సంస్థలకు ఇచ్చిన ఋణాలకు రీఫైనాన్సింగ్, వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటుంది.
2. భారత పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థ: భారత పారిశ్రామిక ద్రవ్య సహాయక చట్టము, 1948 ప్రకారము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక, మధ్యకాలిక ఋణాలను అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యము. మన దేశ, విదేశీ కరెన్సీలతో విత్త సహాయాన్ని చేయడం, పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలకు, ఋణాలకు చందాపూచీదారుగా ఉండడమేకాక వారి వాటాలను, బాండ్లను, ఋణపత్రములను ప్రత్యక్షముగా కొనుగోలు చేస్తుంది.
మర్చంట్ బ్యాంకింగ్ సేవలు, పునరావాస కార్యక్రమాలు, కంపెనీల సంయోగాలు మొదలైనవి అందించడం ఈ సంస్థ చేస్తుంది.
3. భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు: భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు 100% ప్రభుత్వ అనుబంధ సంస్థగా, పార్లమెంటులో ప్రత్యేక శాసనము ద్వారా 1990 లో భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించినది. చిన్నతరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి అవసరమయ్యే ఆర్థిక సహాయం చేసే సంస్థలలో ఇది ప్రధానమైనది. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము చేసే సంస్థలను సమన్వయపరచడం, ఆర్ధికాభివృద్ధికి తోడ్పడటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటం ఈ సంస్థ ముఖ్య ధ్యేయాలు.
4. భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు ఖాయిలాపడిన (Sick) పరిశ్రమల పునర్నిర్మాణం, ఆధునీకరణ, పునర్వ్యవస్థీకరణ, విస్తరణ లాంటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం ప్రధాన లక్ష్యముగా భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకును స్థాపించారు. 1973 లో పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పొరేషన్గా ప్రారంభమై 1985లో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వము పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుగాను, మరల 1997 భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా స్థిరపరిచినారు.

Exam Tips:

a) ప్రత్యేక సంస్థలు (IDBI, IFCI, SIDBI, IRBI) ఏర్పాటైన సంవత్సరం, లక్ష్యం స్పష్టంగా రాయండి.
b) ఈ సంస్థల అవసరం: దీర్ఘకాలిక చౌక విత్తం అందించడం – ఈ పాయింట్ రాయండి.

 

Question 5: విత్త మూలాధారంగా ఈక్విటీ వాటాలకు ఉన్న ప్రయోజనాలను, పరిమితులను వివరించండి.

Answer:

ఈక్విటీ వాటా వలన కలుగు ప్రయోజనాలు:
1. ఈక్విటీ వాటాలపై స్థిరమైన రేటు ప్రకారము డివిడెండు చెల్లించనవసరము లేదు. కంపెనీకి తగినన్ని లాభాలు వచ్చినపుడే డివిడెండ్ చెల్లిస్తారు. అందువలన కంపెనీకి శాశ్వత భారాన్ని మోపవు.
2. ఈ రకమైన వాటాల జారీకి కంపెనీ ఆస్తులను తనఖా పెట్టనక్కర్లేదు.
3. కంపెనీని మూసివేస్తే తప్ప ఈక్విటీ వాటా మూలధనాన్ని వాపసు చేయనవసరము లేదు.
4. ఈక్విటీ వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరికి ఓటు హక్కు ఉంటుంది. నిర్వహణలో పాల్గొనవచ్చు.
5. కంపెనీకి అధిక లాభాలు వచ్చినప్పుడు ఈక్విటీ వాటాదారులు ఎక్కువ డివిడెండ్తోపాటు వాటా విలువ పెరగడం వలన కలిగే లాభాన్ని కూడా పొందవచ్చును.
ఈక్విటీ వాటాలకు గల పరిమితులు:
1. స్థిరమైన నిలకడ ఉన్న ఆదాయాన్ని కోరుకునేవారు, ముందుచూపుగల పెట్టుబడిదారులు ఈక్విటీ వాటాలలో పెట్టుబడి పెట్టడానికి అంతగా ఇష్టపడరు.
2. ఇతర వనరుల ద్వారా లభించే విత్తసేకరణకు అయ్యే వ్యయము కంటే ఈక్విటీ వాటాల ద్వారా సేకరించే నిధులకు వ్యయం ఎక్కువ, మరియు వీటి జారీకి ఎన్నో లాంఛనాలను, విధానాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది.
3. కంపెనీకి తగినంత లాభాలు రాకపోతే వీరికి డివిడెండ్ ఉండదు.
4. ఎక్కువ సంఖ్యలో అదనముగా ఈక్విటీ వాటాలను జారీచేస్తే ఓటింగ్ హక్కులు తగ్గి, వారి ఆర్జన కూడా తగ్గుతుంది.
5. ఈక్విటీ వాటాల జారీపై ఎక్కువగా ఆధారపడితే అతి మూలధనీకరణ జరిగే ప్రమాదము ఉన్నది.
6. కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించినపుడు డివిడెండ్ రేటు పెరిగి, స్పెక్యులేషన్కు దారి తీయవచ్చు.
7. ఎక్కువ ఈక్విటీ వాటాలు గల కొద్దిమంది కంపెనీపై నియంత్రణను సాధించవచ్చు.

Exam Tips:

a) ప్రయోజనాలు, పరిమితులను వేర్వేరు శీర్షికలుగా రాయండి; ఒక్కొక్కటి కనీసం 4–5 పాయింట్లు ఉండాలి.
b) ఈక్విటీ వాటాలకు ఓటు హక్కు, స్థిర డివిడెండ్ లేకపోవడం ముఖ్య అంశాలు.

 

Question 6: ఈక్విటీ వాటాలకు, ఆధిక్యపు వాటాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలపండి.

Answer:

ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలకు గల వ్యత్యాసాలు:

తేడాకు ఆధారంఈక్విటీ వాటాలుఆధిక్యపు వాటాలు
1) వాటా జారీకి అవకాశంకంపెనీ ఈక్విటీ వాటాలను తప్పనిసరిగా జారీ చేయాలి.ఆధిక్యపు వాటాలను జారీ చేయనవసరము లేదు.
2) డివిడెండు చెల్లింపు క్రమముఆధిక్యపు వాటాల మీద డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు.ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా వీరికి డివిడెండ్ను చెల్లిస్తారు.
3) డివిడెండ్ రేటుఈక్విటీ వాటాలపై డివిడెండు రేటు స్థిరముగా ఉండదు. ప్రతి సంవత్సరం డైరెక్టర్లు ఈ రేటును తెలియచేయడం వలన మారుతూ ఉంటుంది.డివిడెండ్ రేటు స్థిరముగా ముందే నిర్ణయించబడి తెలియజేయబడుతుంది.
4) మూలధన వాపసుకంపెనీ పరిసమాప్తి చెందినపుడు ఆధిక్యపు వాటా మూలధనాన్ని చెల్లించిన తర్వాత వీరికి చెల్లిస్తారు.కంపెనీ పరిసమాప్తి చెందినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా వీరి మూలధనం వాపసు చేస్తారు.
5) ఓటింగ్ హక్కుఈక్విటీ వాటాదారులు సంపూర్ణ ఓటు హక్కు ఉన్న నిజమైన యజమానులు.ఆధిక్యపు వాటాదారులకు ఓటింగ్ హక్కు పరిమితముగా ఉంటుంది.
6) నష్టభయంనష్టభయం ఎక్కువ.నష్టభయం తక్కువ.
7) స్పెక్యులేషన్ఈ వాటాల విషయములో స్పెక్యులేషన్ అవకాశము ఉన్నది.స్పెక్యులేషన్‌కు అవకాశము లేదు.
8) బోనస్ వాటాలులాభాల మూలధనీకరణలో భాగముగా ఈక్విటీ వాటాదారులకు బోనస్ వాటాలు జారీ చేస్తారు.ఆధిక్యపు వాటాదారులకు బోనస్ వాటాలు జారీ చేయరు.

Exam Tips:

a) పట్టికలో కనీసం 6–8 తేడాలు (డివిడెండ్ రేటు, ఓటు హక్కు, మూలధన వాపసు, నష్టభయం మొదలైనవి) రాయండి.
b) ఒక్కొక్క అంశానికి రెండు రకాల వాటాలను పక్కపక్కనే పోల్చండి.

 

Question 7: వాటాలకు, డిబెంచర్లకు మధ్య ఉన్న తేడాలను వివరించండి.

Answer:

వాటాలకు, డిబెంచర్లకు మధ్య ఉన్న వ్యత్యాసము:

వాటాలుడిబెంచర్లు
1. వాటా యాజమాన్యపు మూలధనములో ఒక భాగము.1. తీసుకున్న అప్పుకు డిబెంచర్ సాక్ష్యముగా ఉంటుంది.
2. వాటాలపై వాటాదారులకు డివిడెండు చెల్లిస్తారు.2. డిబెంచర్లపై డిబెంచర్ దారులకు వడ్డీని చెల్లిస్తారు.
3. విభాజనీయ లాభాలపై చెల్లించవలసిన డివిడెండ్ రేటు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించిన విధముగా మారుతూ ఉంటుంది.3. లాభనష్టాలతో నిమిత్తము లేకుండా డిబెంచర్లపై ఒక స్థిరమైన రేటు ప్రకారము వడ్డీని చెల్లిస్తారు.
4. వాటాదారులకు ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపెనీని నియంత్రించగలరు.4. డిబెంచర్దారులకు ఓటు హక్కు లేదు. వీరు కేవలము కంపెనీకి ఋణదాతలు మాత్రమే.
5. కంపెనీ తన జీవిత కాలములో వాటాలను (విమోచనీయ ఆధిక్యపు వాటాలను తప్ప) విమోచనము చేయనవసరము లేదు.5. ఒక నిర్దిష్ట కాలము తర్వాత డిబెంచర్లను విమోచనము చేయవలసి ఉంటుంది.
6. కంపెనీ పరిసమాప్తి చెందినపుడు బయట వారికి అప్పులను చెల్లించిన తర్వాత వాటా మూలధనాన్ని చెల్లిస్తారు.6. వాటా మూలధనము కంటే ముందుగానే డిబెంచర్లను చెల్లించవలసి ఉంటుంది.
7. వాటాదారులకు కంపెనీ ఆస్తులపై ఎటువంటి ఛార్జ్ ఉండదు.7. డిబెంచర్దారులకు కంపెనీ ఆస్తులపై ఛార్జ్ ఉంటుంది.
8. సాహసోపేతమైన పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటాయి.8. జాగ్రత్తపరులైన పెట్టుబడిదారులు ఇష్టపడతారు.

Exam Tips:

a) వడ్డీ/డివిడెండ్, ఓటు హక్కు, విమోచనం, ఆస్తులపై ఛార్జ్ – ఈ నాలుగు తేడాలు తప్పనిసరిగా రాయండి.

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: వ్యాపార విత్తం.

Answer:

1. ఒక వ్యాపార సంస్థ తమ లక్ష్యాలను సాధించడానికి వ్యాపార కార్యకలాపాల నియంత్రణ, నిర్వహణకు అవసరమైన మొత్తాన్ని “వ్యాపార విత్తం” అంటారు.
2. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి, తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపములను వ్యాపార విత్తం అంటారు.
3. ఒక వ్యాపారాన్ని ప్రారంభించటానికి, విస్తరించడానికి, మార్కెట్లో తన వాటాను పదిలపరుచుకోవడానికి ప్రతి సంస్థకు విత్తం అవసరము.

Exam Tips:

a) నిర్వచనంతో పాటు వ్యాపార విత్తం ఎందుకు అవసరమో (ప్రారంభం, విస్తరణ, నిర్వహణ) ఒక వాక్యంలో చెప్పండి.

 

Question 2: బ్యాంకు రుణం.

Answer:

1. ఏదైనా ఆస్తిని హామీగా ఉంచుకొని, బ్యాంకు వారు కొంత నిర్దిష్ట మొత్తాన్ని నేరుగా అందజేస్తే దానిని బ్యాంకు ఋణము అంటారు.
2. బ్యాంకు అప్పుకు సంబంధించి బ్యాంకరు ఖాతాదారుకు నిర్దిష్టమైన మొత్తాన్ని కేటాయిస్తారు. బ్యాంకువారు ఇచ్చిన అప్పును ఖాతాదారునకు నగదు రూపములోగాని, ఖాతాదారుని, ఖాతాకు జమచేయడం జరుగుతుంది. ఖాతాదారుడు అప్పు మొత్తాన్ని వాయిదాల పద్ధతిలోగాని లేదా ఒకే మొత్తముగాగాని వడ్డీ కలుపుకొని చెల్లిస్తాడు.

Exam Tips:

a) ఆస్తిని హామీగా ఉంచి బ్యాంకు ఇచ్చే నిర్దిష్ట మొత్తమే బ్యాంకు ఋణం అని నిర్వచించండి.

 

Question 3: డిబెంచర్లు.

Answer:

1. అప్పును ఒప్పుకుంటూ అధికార ముద్ర వేసి ఇచ్చిన పత్రాన్ని డిబెంచర్ అంటారు. ఈ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు సాక్ష్యంగా ఉంటుంది.
2. ఈ పత్రములో కంపెనీ పేరు, డిబెంచర్దారుని పేరు, అప్పు మొత్తము, వడ్డీరేటు, కాలపరిమితి, పూచీలు, షరతులు మొదలైనవి స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. వాటాల మాదిరిగా డిబెంచర్లను కూడా నిర్ణీతమైన విలువతో జారీ చేస్తారు. వీటిని కూడా సమమూల్యముతోగాని, ప్రీమియంతోగాని, డిస్కౌంటుతోగాని జారీ చేయవచ్చు.
3. డిబెంచరు ముద్రిత మూల్యాన్ని దరఖాస్తు, కేటాయింపు, పిలుపులపై వసూలు చేయవచ్చు. కాని ఆచరణలో డిబెంచర్ మూల్యాన్ని ఒకేసారి వసూలు చేయడం జరుగుతుంది.

Exam Tips:

a) డిబెంచరు = కంపెనీ తీసుకున్న అప్పుకు సాక్ష్యంగా అధికార ముద్రతో జారీ చేసే పత్రం – ఈ నిర్వచనం రాయండి.

 

Question 4: వర్తక రుణం.

Answer:

1. ఒక వర్తకుడు తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతాడు. దీనినే వర్తక రుణము అంటారు.
2. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. కొన్ని వాయిదాలుగా చెల్లించవచ్చు. ఆర్థిక పుష్టి, గుడ్విల్ ఉన్న సంస్థలకు, ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.

Exam Tips:

a) వర్తక ఋణంలో నగదు చెల్లింపు లేకుండా సరుకు అరువుపై లభిస్తుందని పేర్కొనండి.

 

Question 5: ఈక్విటీ వాటా.

Answer:

1) యాజమాన్యపు మూలధనములో ప్రధానమైనది ఈక్విటీ వాటా మూలధనము. వీటినే “సాధారణ వాటాలు” లేదా యాజమాన్యపు వాటాలు అంటారు.
2) ప్రతి కంపెనీ మూలధన సేకరణ కోసం తప్పనిసరిగా ఈక్విటీ వాటాలను జారీ చేస్తుంది. కంపెనీ నిర్వహణలో పాలుపంచుకునేందుకు ఓటు హక్కు కలిగిన నిజమైన యజమానులు ఈక్విటీ వాటాదారులు. కంపెనీ వైఫల్యము చెంది, నష్టాలు పొందితే అధికముగా నష్టపోయేది ఈక్విటీ వాటాదారులే.
3) వీరికి కంపెనీ వ్యవహారాలు నిర్వహించి, నియంత్రించే డైరెక్టర్లను ఎన్నుకొనుటకు ఓటు హక్కు ఉంటుంది. డివిడెండుకు సంబంధించి ఎటువంటి ఆధిక్యతగాని, గ్యారంటీగాని లేదు. కంపెనీకి లాభాలు వస్తేనే డివిడెండు చెల్లిస్తుంది.

Exam Tips:

a) ఈక్విటీ వాటాదారులు కంపెనీ యజమానులని, ఓటు హక్కు ఉంటుందని, లాభాలు ఉంటేనే డివిడెండ్ అని రాయండి.

 

Question 6: ఆధిక్యపు వాటా.

Answer:

1. ఈక్విటీ వాటాదారుల కంటే కొన్ని ఆధిక్యమైన హక్కులు, ప్రత్యేక సదుపాయాలు కలిగి ఉన్న వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు.
2. భారత కంపెనీల చట్టం ప్రకారం దిగువ పేర్కొన్న రెండు లక్షణాలు కలిగి ఉన్న వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు.
ఎ) స్థిరమైన డివిడెండు చెల్లించే విషయములో ఆధిక్యపు హక్కు కలిగి ఉండటము.
బి) కంపెనీ పరిసమాపన సమయములో వాటాదారులకు వారి మూలధనాన్ని తిరిగి చెల్లించడంలో ఆధిక్యపు హక్కు కలిగి ఉండటము.
3. వీరికి డివిడెండును స్థిరమైన రేటుతో ఈక్విటీ వాటాదారుల కంటే ముందు చెల్లిస్తారు. అలాగే కంపెనీ రద్దయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు మూలధనము వాపసు పొందుతారు.

Exam Tips:

a) ఆధిక్యపు వాటాలకు ఉండే రెండు ఆధిక్యపు హక్కులను (డివిడెండ్, మూలధన వాపసు) తప్పక రాయండి.

 

Question 7: నిలిపి ఉంచిన ఆర్జనలు.

Answer:

1. సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్గా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని నిలిపి ఉంచిన ఆర్జనలు అంటారు.
2. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వు నిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.

Exam Tips:

a) నిలిపి ఉంచిన ఆర్జనలు = లాభాల నుంచి వేరు చేసిన రిజర్వు; దీనినే 'లాభాల పునరాకర్షణ' అంటారు.

 

Question 8: విలంబిత వాటాలు.

Answer:

1. విలంబిత వాటాదారులకు ఈక్విటీ వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాతనే చెల్లిస్తారు. మూలధన వాపసు విషయములో ఇదే పద్ధతిని అవలంబిస్తారు. కంపెనీపై విశ్వాసము ఎక్కువగా ఉన్నవారు ఈ వాటాలను తీసుకుంటారు.
2. సాధారణముగా వ్యవస్థాపకులచే ఈ వాటాలను తీసుకోవడం జరుగుతుంది. అందువలన వీటిని వ్యవస్థాపక వాటాలు అంటారు.

Exam Tips:

a) విలంబిత వాటాలను వ్యవస్థాపక వాటాలు అని కూడా అంటారు; ఈక్విటీ వాటాదారుల తర్వాతే డివిడెండ్ వస్తుందని చెప్పండి.

 

Question 9: రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ.

Answer:

1. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము అందించే ఉద్దేశ్యముతో 1951 లో భారతదేశ ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక సహాయక సంస్థల చట్టమును రూపొందించినది. 1952 లో ఆ చట్టం అమలులోకి వచ్చింది.
2. కారణము ఈ సంస్థలకు ధన సహాయము భారత పారిశ్రామిక ఆర్థిక సంస్థ పరిధిలో లేదు. ఈ సంస్థలు నూతన కంపెనీల స్థాపనకు, అమలులో ఉన్న పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రస్తుతము ప్రతి రాష్ట్రములో రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలను ఏర్పాటు చేయడం జరిగినది.

Exam Tips:

a) రాష్ట్ర ఆర్థిక సహాయక సంస్థల చట్టం 1951లో చేసి 1952లో అమలైందని సంవత్సరాలతో రాయండి.

 

Question 10: వాణిజ్య బ్యాంకులు.

Answer:

1) కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న ఋణాలు అందించడములో వాణిజ్య బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు రుణాల ద్వారా క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి.
2) బ్యాంకు తాను మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఋణగ్రహీత వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాన్ని పొందడానికి హామీగా ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.

Exam Tips:

a) వాణిజ్య బ్యాంకులు ఋణం, క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్, బిల్లుల డిస్కౌంట్ ద్వారా సహాయం చేస్తాయని జాబితా చేయండి.

 

Question 11: ద్రవ్య సహాయక సంస్థలు

Answer:

1) భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంస్థల పాత్ర కీలకమైనది. ఒక దేశ ఆర్థికాభివృద్ధి కేవలము స్వల్పకాలిక ఋణ సదుపాయాన్ని అందించే సంస్థలుంటే సరిపోదని, వివిధ రకాలైన మూలధన స్వరూపాలతో, వివిధ ధ్యేయాలతో, ప్రత్యేకీకరణలతో వివిధ సంస్థలను, పెట్టుబడి సంస్థలను స్థాపించడము జరిగినది.
2) పారిశ్రామిక విత్తాన్ని చౌకగా, సులభముగా లభ్యమయ్యేటట్లు చూడడానికి ప్రభుత్వము అనేక కార్పొరేషన్లను స్థాపించడం జరిగినది. వీటినే “ద్రవ్య సహాయ సంస్థలు” అంటారు.

Exam Tips:

a) ద్రవ్య సహాయక సంస్థలు పారిశ్రామిక విత్తాన్ని చౌకగా, సులభంగా అందించడానికి ఏర్పడ్డాయని రాయండి.

 

అదనపు సమాధాన ప్రశ్నలు

Question 1: ఆధిక్యపు వాటాల రకాలను వివరించండి.

Answer:

ఆధిక్యపు వాటాలు రకాలు:
1. సంచిత ఆధిక్యపు వాటాలు: ఈ తరహా వాటాల మీద ఏదైనా సంవత్సరంలో తగినన్ని లాభాలు రాకపోయినా లేదా నష్టాలు వచ్చినా డివిడెండ్లను చెల్లించకపోతే ఆ సంవత్సరం డివిడెండ్ను తరువాత సంవత్సరాల లాభాల నుంచి రాబట్టుకొనే అవకాశం (సంచితమవడం) కల్పిస్తే, అలాంటి వాటాలను సంచిత ఆధిక్యపు వాటాలు అంటారు.
2. అసంచిత ఆధిక్యపు వాటాలు: ఇలాంటి వాటాల మీద డివిడెండ్ చెల్లింపు ఏ కారణంగానైనా ఒక సంవత్సరంలో చెల్లించకపోతే దాన్ని ఆ తరువాత సంవత్సరంలో వచ్చే లాభాల నుంచి రాబట్టుకొనే హక్కు (అవకాశం) ఉండదు. అంటే ఏ సంవత్సరంలోనైనా డివిడెండ్ చెల్లించకపోతే వాటాదార్లు ఆ మొత్తాన్ని ఎప్పటికీ పొందలేరు.
3. మిగులులో భాగాన్ని పంచుకునే ఆధిక్యపు వాటాలు: సాధారణంగా ఆధిక్యపు వాటాలపై స్థిరమైన శాతం ప్రకారం స్థిరమైన డివిడెండ్ను చెల్లిస్తారు. అయితే ఈ రకం వాటాలపై స్థిర డివిడెండ్తో పాటు మిగులు లాభాలలో ఈక్విటీ వాటాలతోపాటు అదనపు డివిడెండును కూడా చెల్లిస్తారు.
4. మిగులులో భాగాన్ని పంచుకోవడానికి వీలు లేని ఆధిక్యపు వాటాలు: ఇలాంటి వాటాలపై స్థిర డివిడెండ్ మాత్రమే చెల్లిస్తారు. మిగులు లాభాలలో అదనపు వాటాను పంచడం జరగదు.
5. మార్చదగిన ఆధిక్యపు వాటాలు: నిర్ణీత కాలవ్యవధి తరువాత ఆధిక్యపు వాటాలను ఈక్విటీ వాటాలలోకి మార్చుకోవడానికి అవకాశం ఉన్న వాటాలను మార్చదగిన ఆధిక్యపు వాటాలు అంటారు.
6. మార్చడానికి వీలు లేని ఆధిక్యపు వాటాలు: ఈ ఆధిక్యపు వాటాలను కంపెనీ ఎప్పటికీ ఈక్విటీ వాటాలుగా మార్చుకోవడానికి వీలుండదు.
7. విమోచనీయ ఆధిక్యపు వాటాలు: ఒక నిర్ణీత గడువు ముగిసిన తరువాత లేదా కంపెనీ తన వీలును బట్టి వాటాదారులకు ముందుగా నోటీసు ఇచ్చి ఆధిక్యపు వాటా మూలధనాన్ని వాటాదారులకు తిరిగి చెల్లించే అవకాశం ఉన్న వాటాలను ‘విమోచనీయ ఆధిక్యపు వాటాలు’ అంటారు.
8. అవిమోచనీయ ఆధిక్యపు వాటాలు: ఇలాంటి వాటాలపై మూలధనాన్ని కంపెనీ జీవితకాలంలో తిరిగి చెల్లించడం జరగదు. కంపెనీ పరిసమాప్తి సందర్భంలో మాత్రమే తిరిగి చెల్లిస్తారు.

Exam Tips:

a) ఎనిమిది రకాలను జతలుగా (సంచిత/అసంచిత, భాగస్వామ్య/భాగస్వామ్యం లేని, మార్చదగిన/మార్చలేని, విమోచనీయ/అవిమోచనీయ) గుర్తుంచుకోండి.

 

Question 2: నిలిపి ఉంచిన ఆర్జనలు అంటే ఏమిటి ? వాటి ప్రయోజనాలు మరియు పరిమితులను రాయండి.

Answer:

నిలిపి ఉంచిన ఆర్జనలు:
1) సాధారణంగా ఒక కంపెనీ తను ఆర్జించిన లాభాలనంతటిని వాటాదారులకు డివిడెండ్లుగా పంచిపెట్టదు. భవిష్యత్ అవసరాల నిమిత్తం ఈ నికర ఆదాయంలో కొంత భాగాన్ని వ్యాపారంలోనే వేరుగా ఉంచి పెడుతుంది. ఈ విధంగా వేరుగా తీసి ఉంచిన మొత్తాన్ని “నిలిపి ఉంచిన ఆదాయం” అని అంటారు.
2) ఈ విధంగా లాభాల నుంచి రిజర్వునిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించుకోవడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు. ఒక సంస్థలో ఈ లాభాల పునరాకర్షణకు లభించే లాభం, ఆ కంపెనీకి వచ్చే నికర లాభం, ఆ కంపెనీ అనుసరించే డివిడెండ్ విధానం, కంపెనీ వయసు లాంటి కారకాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రయోజనాలు: ఒక మూలధన విత్తంగా ఉపయోగపడే నిలిపి ఉంచిన ఆర్జనలవల్ల కింది ప్రయోజనాలు ఉన్నాయి.
1. నిలిపి ఉంచిన ఆర్జనలు కంపెనీకి శాశ్వతంగా లభించే మూలధన వనరులలో ప్రధానమైంది.
2. మూలధన వనరులుగా వీటిని ఉపయోగించినప్పుడు కంపెనీ వాటిపై అదనంగా ఎలాంటి వ్యయాలను వడ్డీ రూపంలో లేదా డివిడెండ్లుగా లేదా మూలధన సేకరణ వ్యయాలుగా చెల్లించనవసరం లేదు.
3. ఈ నిధులు సంస్థలోనే అంతర్గతంగా లభించడంవల్ల కంపెనీకి ఆర్థిక పటిష్టత పెరగడమే కాకుండా, కంపెనీ విస్తరణ కార్యకలాపాలను సరళతరంగా, సజావుగా, యధేచ్ఛగా చేపట్టగలవు.
4. అనిశ్చిత పరిస్థితులవల్ల ఏర్పడే నష్టాలను ఎదుర్కొనడానికి అవసరమైన శక్తిని కంపెనీ ఈ నిలిపి ఉంచిన ఆర్జనల ద్వారా పొందుతుంది.
5. నిలిపి ఉంచిన ఆర్జనల వల్ల ఈక్విటీ వాటాల మార్కెట్ విలువ పెరుగుతుంది.
పరిమితులు:
1. లాభాలను అధిక మొత్తంలో నిలిపి ఉంచడంవల్ల వాటాదారులకు చెల్లించే డివిడెండ్ మొత్తం తగ్గుతుంది. దీనివల్ల వాటాదారులలో అసంతృప్తి కలుగుతుంది.
2. ఇది ఒక అనిశ్చితమైన విత్త మూలాధారం. ఎందుకంటే కంపెనీకి లాభాలు ఎల్లప్పుడు ఒకేలాగా ఉండవు.
3. ఈ నిధులతో ముడిపడి ఉన్న అవకాశవ్యయాన్ని చాలా సంస్థలు గుర్తించకపోవడంవల్ల నిధుల అభిలషణీయమైన వినియోగాన్ని తగ్గిస్తుంది.

Exam Tips:

a) నిలిపి ఉంచిన ఆర్జనల అర్థం, ప్రయోజనాలు, పరిమితులను మూడు శీర్షికలుగా రాయండి.

 

Question 3: డిబెంచర్ల రకాలను వివరించండి.

Answer:

డిబెంచర్ల రకాలు: కంపెనీలు వివిధ రకాల డిబెంచర్లను జారీ చేస్తాయి. వాటిలో ప్రధానమైన వాటిని కింది విధంగా వివరించడమైంది.
1. తనఖా డిబెంచర్లు (తాకట్టు డిబెంచర్లు): వీటినే హామీ ఉన్న డిబెంచర్లు అంటారు. వీటిమీద వడ్డీని, అసలును చెల్లించడానికి కంపెనీ హామీ ఇస్తుంది. దీనికి కంపెనీ ఆస్తులపై పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ తాకట్టు ఉంటుంది.
2. సాధారణ డిబెంచర్లు: ఈ రకం డిబెంచర్ల మీద వడ్డీగాని, అసలుగానీ చెల్లించడానికి కంపెనీ ఆస్తులపై ఎలాంటి హామీ ఉండదు. వీటినే ‘తాకట్టు లేని రుణ పత్రాలు’ అంటారు.
3. విమోచనీయ డిబెంచర్లు: ఒక నిర్ణీత కాలవ్యవధి ముగిసిన తరువాత చెల్లించవలసిన డిబెంచర్లను విమోచనీయ డిబెంచర్లు అంటారు. ఉదాహరణకు 5, 10 మరియు 15 సంవత్సరాల కాలపరిమితి ఉన్న డిబెంచర్లను ఆ గడువు తీరగానే వాటి మొత్తాన్ని డిబెంచర్దారులకు చెల్లించడం జరుగుతుంది.
4. అవిమోచనీయ డిబెంచర్లు: కంపెనీ పరిసమాప్తి సందర్భంలో మాత్రమే డిబెంచర్లపై మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. కంపెనీ జీవించి ఉన్నంతకాలం వీటి మొత్తాన్ని చెల్లించడం జరగదు. అందువల్ల వీటిని ‘శాశ్వత డిబెంచర్లు’ అని కూడా అంటారు.
5. రిజిష్టర్డ్ డిబెంచర్లు (నమోదైన డిబెంచర్లు): రుణ పత్రాలను జారీ చేసేటప్పుడు డిబెంచర్దారుని పేరు, చిరునామా, ఇతర వివరాలను కంపెనీ పుస్తకాల్లో నమోదు చేస్తారు. ఈ డిబెంచర్లను బదిలీ చేసేటప్పుడు ఆ విషయాన్ని కంపెనీ దృష్టికి తేవాలి. అప్పుడు కంపెనీ పుస్తకాలలో తగిన మార్పులు చేస్తారు.
6. బేరర్ డిబెంచర్లు: కంపెనీ పుస్తకాలలో నమోదు కానటువంటి డిబెంచర్లను బేరర్ డిబెంచర్లు అంటారు. ఈ డిబెంచర్లు ఎవరి వద్ద ఉంటాయో వారికే వీటిపై సర్వహక్కులు లభిస్తాయి. వీటిని కేవలం విడుదల చేయడం ద్వారా ఇతరులకు బదిలీ చేయవచ్చు.
7. మార్పిడి చేయదగిన డిబెంచర్లు: నిర్ణీత కాలవ్యవధి పూర్తయిన తరువాత ఈక్విటీ వాటాలుగానీ, ఆధిక్యపు వాటాలు గానీ లేదా ఇతర డిబెంచర్లలోకి గానీ పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ మార్చుకొనే వీలున్న డిబెంచర్లను ‘మార్పిడికి వీలున్న డిబెంచర్లు’ అంటారు.
8. మార్పిడికి వీలు లేని డిబెంచర్లు: భవిష్యత్తులో వాటాలలోకి మార్చుకోవడానికి వీలులేని డిబెంచర్లను ‘మార్చడానికి వీలు లేని డిబెంచర్లు’ అంటారు.

Exam Tips:

a) ఎనిమిది రకాల డిబెంచర్లను కారకం (తాకట్టు, విమోచన, నమోదు, మార్పిడి) వారీగా జతలుగా రాయండి.

 

Question 4: అంతర్జాతీయ విత్తమూలాలను వివరించండి.

Answer:

దేశంలో సరళీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియలు 1991లో ప్రారంభమైనప్పటి నుంచి మనదేశంలోకి విదేశాల నుంచి పెట్టుబడులు రావడం, అలాగే మనదేశం నుంచి ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టడం మొదలైంది. అప్పటి నుంచే మనకు విత్త మూలాధారాలు అంతర్జాతీయంగా కూడా లభిస్తున్నాయి.
కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ విత్త మూలాలను కింద వివరించడమైంది.
1) అమెరికన్ డిపాజిటరీ రశీదులు (American Depository Receipts – ADRs):
అమెరికన్ డిపాజిటరీ రశీదులను యునైటెడ్ స్టేట్స్లో ఏ బ్యాంకు అయినా జారీ చేస్తుంది. మొట్టమొదటి ADR ని 1927లో బ్రిటిష్ రిటైల్ వర్తకులకు జె.పి. మోర్గాన్వారిచే ప్రవేశపెట్టబడింది. ప్రాథమికంగా ఇది ఒక నెగోషబుల్ పత్రం. యు.ఎస్.లో స్టాక్ ఎక్స్ఛేంజ్లో వర్తకమయ్యే వాటాలు నిర్దిష్ట సంఖ్యను ఈ రశీదు సూచిస్తుంది. వీటిని జారీ చేసిన కంపెనీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా వ్యవహరిస్తారు.
ADR ల ధరలు ప్రతి వాటాకు 10 డాలర్ల నుంచి 100 డాలర్ల మధ్య ఉంటాయి.
అమెరికన్ డిపాజిటరీ రశీదులను న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో, అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లేదా నాస్ డాక్ లో జాబితాలో చేర్చబడుతుంది. అయితే ADR లకు ఎలాంటి ఓటింగ్ హక్కులు ఉండవు. వీటిపై డివిడెండ్లను యు.ఎస్. డాలర్లలో చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగు ప్రధాన వాణిజ్య బ్యాంకులు డిపాజిటరీ బాంకు సేవలను అందిస్తున్నాయి. అవి: BNY మెలన్, J.P. మోర్గాన్, సిటీ గ్రూప్ మరియు డష్ బాంకు.
2) గ్లోబల్ డిపాజిటరీ రశీదులు (GDRs): విదేశీ కంపెనీలలో వాటాల కోసం గ్లోబల్డిపాజిటరీ (GDR) లను ఒకటి కంటే ఎక్కువ దేశాలలో జారీ చేస్తారు. ఈ GDR కూడా ఒక బాంకు రశీదు. ప్రపంచవ్యాప్తంగా 900 – GDR లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితాలో చేర్చడం జరిగింది. ప్రధానంగా ఈ GDR లు ఫ్రాంక్ ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్, లక్సెంబర్గ్ మరియు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజిలలో చేర్చబడ్డాయి. ఈ GDRలు వాటాలలో వర్తకానికి అనువుగా ఉంటాయి. వీటిని పలు అంతర్జాతీయ బాంకులు అంటే, సిటీ గ్రూప్, జె.పి. మోర్గాన్, బాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదలయినవి జారీ చేస్తాయి. GDR లను కలిగి ఉన్నవారికి ఓటింగ్ హక్కులు ఉండవు.
3) భారత డిపాజిటరీ రశీదులు (IDRs): మనదేశంలో ఈక్విటీ వాటాలను జారీ చేసే కంపెనీలు వాటాలకు బదులు ఈ డిపాజిటరీ రశీదులను జారీ చేస్తాయి.
మనదేశంలో ఈ IDR లను స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో చేరుస్తారు. వీటిని సులభంగా ఇతరులకు బదిలీ చేయవచ్చు. ఈ IDR లను జారీ చేయడానికి ముందుగా SEBI (సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) అనుమతిని పొందాలి. వీటి జారీకి ముందు 90 రోజులకు ముందే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఒక IDR ఇండియన్ రూపాయలలో ఉంటుంది.
SEBI జారీచేసిన నియమాల ప్రకారం ఏ కంపెనీలు అయితే దేశీయ మార్కెట్లో కనీసం మూడు సంవత్సరాలు జాబితాలో చేర్చబడి ఉండి, గత అయిదు సంవత్సరాలు లాభాలను ఆర్జించినప్పుడు మాత్రమే ఆ కంపెనీలకు ఈ డిపాజిటరీ రశీదులను జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ చార్టర్డ్ మనదేశంలో IDR లను మొట్టమొదటగా జారీ చేసింది. ఈ IDR లు ఈక్విటీ వాటాలను పోలి ఉంటాయి. వీటిని కలిగి ఉన్నవారికి ఈక్విటీ వాటాదారులకు ఉన్న హక్కులే ఉంటాయి.
4) విదేశీ ద్రవ్య మార్పిడి బాండ్లు (Foreign Currency Convertible Bonds) (FCCBs): ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో, FCCB లు వివిధ బహుళ జాతి కంపెనీల కోసం గొప్ప ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించు కొన్నాయి. ఈ FCCB ఒక మార్పిడి బాండ్. వీటిని జారీ చేసే కంపెనీ దేశీయ కరెన్సీకి భిన్నంగా వివిధ దేశాల కరెన్సీలతో బాండ్లను జారీ చేస్తుంది. వివిధ విదేశీ కరెన్సీల రూపంలో ద్రవ్యాన్ని FCCB ల కార్పొరేట్ జారీ ద్వారా సేకరిస్తుంది. ఈ FCCB లు ఈక్విటీ, డెట్ FCCB (రుణాల) ల కలయికగా ఉంటుంది. వీటిని గడువు తేదీన విమోచన చేయవలసి ఉంటుంది లేదా ఈక్విటీగా మార్చవచ్చు.

Exam Tips:

a) ADR, GDR, IDR, FCCB – నాలుగింటిని సంక్షిప్త రూపం, పూర్తి పేరు, జారీ చేసే చోటుతో రాయండి.

 

Question 5: భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు

Answer:

1) భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును 1964 జూలై 1న స్థాపించినారు. మన దేశములో పారిశ్రామికాభివృద్ధి కోసం ఏర్పడిన పారిశ్రామిక విత్త సంస్థలలో ఇది శిఖర సంస్థ.
2) ప్రత్యక్ష ధన సహాయముతో పారిశ్రామిక సంస్థలకు ప్రాజెక్టు ఋణాలు, సరళ ఋణాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి ఋణాల మంజూరు, పారిశ్రామిక వాటాలు, డిబెంచర్ల జారీకి, చందాపూచీ ఇవ్వడం, పారిశ్రామిక సంస్థలు తీసుకున్న ఋణాలకు హామీలు ఇవ్వడం. పరోక్ష విత్త సహాయము అంటే పారిశ్రామిక సంస్థలకు ఇచ్చిన ఋణాలకు రీఫైనాన్సింగ్, వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటుంది.

Exam Tips:

a) IDBI స్థాపన తేదీ (1964 జూలై 1), శిఖర సంస్థ, ప్రత్యక్ష/పరోక్ష సహాయం రాయండి.

 

Question 6: భారత పారిశ్రామిక ద్రవ్య సంస్థ

Answer:

1) భారత పారిశ్రామిక ద్రవ్య సహాయక చట్టము, 1948 ప్రకారము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక, మధ్యకాలిక ఋణాలను అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యము.
2) మన దేశ, విదేశీ కరెన్సీలతో విత్త సహాయాన్ని చేయడం, పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలకు, ఋణాలకు చందాపూచీదారుగా ఉండడమేకాక వారి వాటాలను, బాండ్లను, ఋణపత్రములను ప్రత్యక్షముగా కొనుగోలు చేస్తుంది. మర్చంట్ బ్యాంకింగ్ సేవలు, పునరావాస కార్యక్రమాలు, కంపెనీల సంయోగాలు మొదలైనవి అందించడం ఈ సంస్థ చేస్తుంది.

Exam Tips:

a) IFCI 1948 చట్టం ప్రకారం ఏర్పడిందని, దీర్ఘ–మధ్యకాలిక ఋణాలు ఇస్తుందని పేర్కొనండి.

 

Question 7: భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ

Answer:

1) భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు 100% ప్రభుత్వ అనుబంధ సంస్థగా, పార్లమెంటులో ప్రత్యేక శాసనము ద్వారా 1990 లో భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించినది. చిన్నతరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి అవసరమయ్యే ఆర్థిక సహాయం చేసే సంస్థలలో ఇది ప్రధానమైనది. 2) చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము చేసే సంస్థలను సమన్వయపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటం ఈ సంస్థ ముఖ్య ధ్యేయాలు.

Exam Tips:

a) SIDBI స్థాపన సంవత్సరం (1990), 100% ప్రభుత్వ అనుబంధ సంస్థ అని పేర్కొనండి.

 

Question 8: భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు

Answer:

1) ఖాయిలాపడిన (Sick) పరిశ్రమల పునర్నిర్మాణం, ఆధునీకరణ, పునర్వ్యవస్థీకరణ, విస్తరణ లాంటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం ప్రధాన లక్ష్యముగా భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకును స్థాపించారు. 2) 1973 లో పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పొరేషన్గా ప్రారంభమై 1985లో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వము పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుగాను, మరల 1997 భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా స్థిరపరిచినారు.

Exam Tips:

a) IRBI ప్రధాన లక్ష్యం ఖాయిలాపడిన పరిశ్రమల పునర్నిర్మాణం; 1973, 1985, 1997 సంవత్సరాలను క్రమంగా రాయండి.

 

Question 9: గ్లోబల్ డిపాజిటరీ రశీదులు

Answer:

1) విదేశీ కంపెనీలలో వాటాల కోసం ఈ గ్లోబల్ డిపాజిటరీ రశీదులను (GDR) ఒకటి కంటే ఎక్కువ దేశాలలో జారీ చేస్తారు. ఈ GDR ఒక బ్యాంకు రశీదు.
ప్రపంచవ్యాప్తముగా 900 GDR లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చేర్చబడినవి. ఈ GDR లు ఫ్రాంక్ ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్, లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజి, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చేర్చబడినవి.
2) ఈ GDR లు వాటాలలో వర్తకానికి అనువుగా ఉంటాయి. వీటిని పలు అంతర్జాతీయ బ్యాంకులు అంటే సిటీబ్యాంకు, జె.పి. మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదలైనవి జారీ చేస్తాయి. GDR కలిగి ఉన్న వారికి ఓటింగ్ హక్కులు ఉండవు. ఈ GDR కలిగి ఉన్న వ్యక్తులు వాటిని వాటాలుగా (GDR లపై సూచించే సంఖ్య ప్రకారం)
మార్చుకోవచ్చు. GDR లను ఈక్విటీ వాటాలుగా మార్చుకోవడానికి ఎలాంటి చెల్లింపులు అవసరము లేదు.

Exam Tips:

a) GDR కలిగినవారికి ఓటింగ్ హక్కులు ఉండవు, వాటిని ఈక్విటీ వాటాలుగా మార్చుకోవచ్చు – ఈ రెండు అంశాలు తప్పక రాయండి.

 

Question 10: వాణిజ్య పత్రాలు.

Answer:

1. స్వల్పకాలిక నిధులను మూలాధారంగా మన దేశంలో 1990 నుంచి వాణిజ్య పత్రాలను ఉపయోగించడం ప్రారంభమైంది.
2. ఒక సంస్థ స్వల్పకాలిక నిధులను అంటే 90 రోజుల నుండి 364 రోజుల కాలవ్యవధితో సేకరించడానికి జారీచేసే హామీ లేని ప్రామిసరీ నోటు ఈ వాణిజ్య పత్రాన్ని పేర్కొనవచ్చు.

Exam Tips:

a) వాణిజ్య పత్రం = హామీ లేని ప్రామిసరీ నోటు, స్వల్పకాలిక నిధుల కోసం; మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే జారీ చేస్తాయి.

 

Free study material for Commerce

Commerce Class 11 Curriculum Solutions: Chapter 09 Sources of Business Finance

Accessing Chapter 09 Sources of Business Finance Solutions

Review comprehensive exercise answers for Class 11 Commerce Chapter 09 Sources of Business Finance. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 11 Commerce

Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Commerce text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Commerce.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Commerce are as per latest TS Board curriculum.

Are the Commerce TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Commerce concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Commerce. You can access TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు in both English and Hindi medium.

Is it possible to download the Commerce TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Commerce Study Material Chapter 9 వ్యాపార విత్తం – మూలాధారాలు in printable PDF format for offline study on any device.