TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం

Official TS Board Solutions for Class 11 Commerce: Chapter 08 Business Finance

Access comprehensive textbook solutions for Chapter 08 Business Finance using the official curriculum guides for Class 11 Commerce. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Chapter-wise Solutions for Commerce: Chapter 08 Business Finance

Access the complete solution PDF for Class 11 Commerce below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

Question 1: వ్యాపార విత్తము అంటే ఏమిటి ? ఒక వ్యాపార సంస్థలో దీని అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని వివరించండి.

Answer:

వ్యాపార విత్తము: ఒక వ్యాపార సంస్థను స్థాపించి, దాన్ని కొనసాగించడానికి అవసరమైన విత్తాన్ని “వ్యాపార విత్తం” అంటారు.
1. వ్యాపార సంస్థ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ద్రవ్య వనరుల సేకరణ, వినియోగము, నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను “వ్యాపార విత్తము” అంటారు.
2. గల్మన్, దగల్ ప్రకారము “వ్యాపారములో ఉపయోగించే నిధుల ప్రణాళికీకరణ, సేకరణ, నియంత్రణ, వాడకాన్నే వ్యాపార విత్తము” అంటారు.
3. ఓస్ బర్న్ “వ్యాపారములో వాడే నిధుల సేకరణ, వాటిని వాడే ప్రక్రియను వ్యాపార విత్తము” గా నిర్వచించినాడు.
వ్యాపార విత్తము – ఆవశ్యకత: సాధారణముగా వ్యాపారములో స్థిరాస్తుల కొనుగోలుకు, దైనందిన కార్యకలాపాల నిర్వహణకు విత్తము అవసరమవుతుంది. లాభార్జనే ప్రధాన లక్ష్యముగా కలిగిన వ్యాపార సంస్థకు ఈ లక్ష్య సాధన నిమిత్తము ఈ దిగువ తెలిపిన కారణాల వలన విత్తము అవసరమవుతుంది.
1) వ్యాపారం యొక్క స్థిర మూలధన అవసరాలను తీర్చడం కోసం వ్యాపార సంస్థ స్థిరాస్థులను అంటే భూమి, భవనాలు, ప్లాంటు, యంత్రాలు, ఫర్నీచర్, బిగింపులు మొదలైనవి కొనుగోలు చేయడం కోసం విత్తం అవసరమవుతుంది.
2) నిర్వహణ మూలధన అవసరాల కోసం: ప్రస్తుత ఆస్తులను కలిగి ఉండటానికి అంటే, సరుకు కొనుగోలు, వేతనాల చెల్లింపులు, రవాణా ఖర్చులు మొదలైన అవసరాల కోసం నిర్వహణా మూలధనం ఉపయోగిస్తారు.
3) వ్యాపార వృద్ధి మరియు విస్తరణకు: వ్యాపారాన్ని వృద్ధి చేయటానికి మరియు విస్తరణకు విత్తం అవసరం. ఉత్పత్తి పెంచటం కోసం, అదనపు యంత్రాల కొనుగోలు కోసం, పరిశోధన, అభివృద్ధి చేపట్టడం కోసం వ్యాపార విత్తం చాలా అవసరం.
4) నూతన రంగంలోకి ప్రవేశించడం కోసం: ప్రస్తుతం ఉన్న వ్యాపారం కాకుండా ఇతర రంగాలలోకి ప్రవేశించడం కోసం విత్తం అవసరం. ఉదాహరణకి, ఐటిసి సంస్థ పొగాకు సంబంధించిన వ్యాపారం కాకుండా హోటల్ రంగంలోకి ప్రవేశించడం, క్లాస్మేట్ అనే సంస్థ పుస్తకాల రంగం నుంచి ఇతర స్టేషనరీ రంగంలోకి ప్రవేశించడం. ఒక వ్యాపార సంస్థ ఇతర వ్యాపారంలోకి అడుగు పెట్టడం, ఇతర కొత్త కార్యకలాపాలను చేపట్టడాన్ని వ్యాపార వైవిధ్యీకరణ లేదా డైవర్సిఫికేషన్ అంటారు. ఇతర రంగాలలో ఉన్న వ్యాపార అవసరాలను అందిపుచ్చుకోవటానికి ఈ తరహా విస్తరణాన్ని సంస్థలు చేపడతాయి. వీటికోసం అధిక మొత్తంలో వ్యాపార విత్తం అవసరం ఉంటుంది.
5) మనుగడ కోసము: సంస్థ తాను చేపట్టిన వివిధ కార్యక్రమాలను కొనసాగించటం కోసం ‘విత్తం’ అవసరం. విత్తం లేకుండా వ్యాపార సంస్థలు మనుగడను కొనసాగించలేవు.
6) అప్పులు చెల్లించడం కోసం: సంస్థ తన బాధ్యతలను అనగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక అప్పులను చెల్లించటం కోసం విత్తం అవసరం. ఉదాహరణకి, అప్పుల వాయిదాలను చెల్లించటం, ఋణదాతలకు చెల్లించటం మొదలైనవి.
7) ఖర్చులను చెల్లించటం కోసం: వివిధ ఖర్చులు అంటే జీతాలు, వేతనాలు, పన్నులు, వ్యాపార ప్రకటనలు మరియు అద్దె మొదలైన ఖర్చులను చెల్లించటం కోసం సంస్థలకు విత్తం అవసరం.
8) వ్యాపార ప్రారంభానికి: వ్యాపారాన్ని ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. వ్యాపార స్వరూపము, స్వభావాన్ని బట్టి, సాంకేతిక పరిజ్ఞానము బట్టి ఎంత విత్తము అవసరమో తెలుస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రాథమిక కృషికి విత్తము అవసరము.
9) మరొక వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి లేదా స్వాధీనము చేసుకోవడం కోసము: పోటీని నివారించడానికి, మరింత బలపడడానికి ఒక సంస్థ మరొక సంస్థను స్వాధీనము చేసుకోవడానికి విత్తము అవసరమవుతుంది.
10) వ్యాపారాన్ని కొత్త ప్రదేశానికి తరలించడం కోసం: ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారాన్ని మరొక కొత్త ప్రదేశానికి మార్చవలసినపుడు, ప్రస్తుతము ఉన్న వ్యాపారాన్ని వేరొక ప్రదేశానికి తరలించవలసి వచ్చినపుడు విత్తము అవసరమవుతుంది.

Exam Tips:

a) నిర్వచనంతో పాటు కనీసం ఇద్దరు రచయితల నిర్వచనాలను (గల్మన్–దగల్, ఓస్‌బర్న్) ఉటంకించండి.
b) విత్తం అవసరమయ్యే కారణాలను (స్థిర మూలధనం, నిర్వహణ మూలధనం, విస్తరణ, వైవిధ్యీకరణ, ప్రారంభం మొదలైనవి) క్రమసంఖ్యలతో రాయండి.

 

Question 2: వివిధ విత్త మూలాధారాల ఎంపికను ప్రభావితము చేయు కారకాలను పేర్కొనండి.

Answer:

ఒక సంస్థకు ఆర్థికపరమైన అవసరాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, స్థిర మూలధన, నిర్వహణ మూలధన అవసరాలుగా చెప్పవచ్చును. అందువలన వ్యాపార సంస్థలు వివిధ అవసరాలకు వివిధ విత్త మూలాధారాలను అన్వేషించవలసి ఉంటుంది. స్వల్పకాలిక నిధుల సేకరణ వ్యయము తక్కువ. కాని అనేక కారణాల వలన దీర్ఘకాలిక నిధులు అవసరమవుతాయి. వివిధ విత్త మూలాధారాలను ఎంపిక చేయడానికి క్రింది కారకాలను పేర్కొనవచ్చును.
1) వ్యయము: వ్యయం రెండు రకాలుగా ఉంటుంది. నిధుల సేకరణ వ్యయం, నిధులను ఉపయోగించేటపుడు అయ్యే వ్యయము. ఒక సంస్థ విత్త మూలాధారాలను ఎంపిక చేసేటప్పుడు ఈ రెండు వ్యయాలను లెక్కలోకి తీసుకొనవలెను.
2) ఆర్థిక పటిష్టత, కార్యకలాపాల స్థిరత్వం: సంస్థ ఆర్థిక పటిష్టత నిధుల సేకరణలో కీలకమైనది. వ్యాపార సంస్థ ఆర్థికముగా పటిష్టముగా ఉన్నప్పుడే తీసుకున్న ఋణాలను వడ్డీతో సహా చెల్లించగలదు.
3) వ్యాపార సంస్థ రకం, న్యాయాత్మక స్థితి: ఒక వ్యాపార సంస్థ తరహా నిధులను సేకరించే ఎంపికను ప్రభావితం చేస్తుంది.
ఉదా: భాగస్వామ్య సంస్థ వాటాలను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించలేదు. కంపెనీలు మాత్రమే వాటాలను జారీ చేస్తాయి.
4) ఆవశ్యకత, కాలపరిమితి: ఒక వ్యాపార సంస్థకు ఎంత కాలానికి నిధులు అవసరము అవుతాయో ముందుగానే అంచనా వేయగలగాలి.
ఉదా: స్వల్పకాలిక నిధులను తక్కువ వడ్డీరేటుకు వర్తక ఋణం, వాణిజ్య పత్రాల ద్వారా సేకరించవచ్చు. దీర్ఘకాలిక విత్తాన్ని వాటాలు, డిబెంచర్ల జారీ ద్వారా సేకరించవచ్చు.
5) నష్టభయము: వ్యాపార సంస్థ తనకు అందుబాటులో ఉన్న ప్రతి విత్త మూలాధారాన్ని నష్టభయం దృష్ట్యా పరిశీలించవలెను.
ఉదా: ఈక్విటీ వాటాల ద్వారా మూలధనాన్ని సేకరిస్తే నష్టభయం తక్కువ. ఎందుకంటే ఈక్విటీ మూలధనాన్ని కంపెనీ రద్దు అయితే తప్ప వాపసు చేయనవసరం లేదు. లాభాలు రాకపోతే డివిడెండ్లు చెల్లించనక్కరలేదు. అదే ఋణ సేకరణ ద్వారా నిధులు సమకూర్చుకుంటే అసలును, లాభనష్టాలతో ప్రమేయం లేకుండా వడ్డీని చెల్లించాలి.
6) నియంత్రణ: ఒక ప్రత్యేక నిధుల మూలాధారము సంస్థ నిర్వహణపై ఉన్న యాజమాన్య అధికారాన్ని ప్రభావితము చేయవచ్చు. ఈక్విటీ వాటాల జారీ సంస్థ నియంత్రణాధికారాన్ని పలుచన చేస్తుంది.
7) ఆర్థిక పటిష్టతపై ప్రభావము: వ్యాపార సంస్థ కొన్ని రకాల విత్త వనరులపై ఆధారపడినపుడు మార్కెట్లో ఆ సంస్థ ఆర్థిక పటిష్టతపై ప్రభావాన్ని చూపుతుంది. ఉదా: హామీగల డిబెంచర్లను జారీచేస్తే, హామీలేని ఋణదాతలకు కంపెనీ పట్ల ఆసక్తి తగ్గి, పరపతిని పొడిగించడానికి ఇష్టపడకపోవచ్చు.
8) సరళత, సౌలభ్యము: వ్యాపార సంస్థలు ఆర్థిక సహాయక సంస్థల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నిబంధనలు, లాంఛనాలను పూర్తి చేయవలసి ఉంటుంది. ఉదా: బ్యాంకుల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇతరుల నుంచి ఋణాలను తేలికగా పొందడానికి సౌలభ్యము ఉంటే వాణిజ్య బ్యాంకుల కంటే ఇతర విత్త వనరులను ఎన్నుకోవచ్చు.
9) పన్ను ప్రయోజనాలు: పన్ను ఆదాలను దృష్టిలో ఉంచుకొని నిధులు ఆధారాలను ఎంపిక చేసేటప్పుడు కొన్ని మూలాలు మనకు అందుబాటులో ఉండవచ్చు.
ఉదా: ఆధిక్యపు వాటాలపై డివిడెండు పన్ను నుంచి మినహాయించలేము. కాని డిబెంచర్ల వడ్డీ చెల్లింపును పన్ను నుంచి మినహాయించవచ్చును.

Exam Tips:

a) వ్యయం, ఆర్థిక పటిష్టత, సంస్థ రకం, కాలపరిమితి, నష్టభయం, నియంత్రణ, సరళత, పన్ను ప్రయోజనం – కారకాలను శీర్షికలతో రాసి ఒక్కొక్కదానికి ఉదాహరణ ఇవ్వండి.
b) ఈక్విటీ వాటాలు నియంత్రణను పలుచన చేస్తాయి, డిబెంచర్ల వడ్డీ పన్ను మినహాయింపు పొందుతుంది – ఈ ఉదాహరణలు మార్కులు తెస్తాయి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: ఒక వ్యాపార సంస్థకు అవసరమైన వివిధ రకాల మూలధనాన్ని పేర్కొనండి.

Answer:

వ్యాపార సంస్థ ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. దీనినే మూలధనం అంటారు. మూలధనము ఎంత అవసరము అవుతుంది అనేది వ్యాపార సంస్థ యొక్క స్వభావము, పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మూలధనమును రెండు రకాలుగా విభజించవచ్చును. అవి: 1. స్థిర మూలధనము 2. నిర్వహణ మూలధనము.
1) స్థిర మూలధనము:
1. ఒక వ్యాపార సంస్థ స్థాపనకు స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను సేకరించడానికి ఉపయోగించే మూలధనమును స్థిర మూలధనము అంటారు.
2. ఇలాంటి మూలధనము లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు.
వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము.
3. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటిమీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోను, వ్యాపారము చేసే దుస్తుల పంపిణీ సంస్థలో తక్కువ మొత్తములో అవసరము ఉంటుంది.
2) నిర్వహణ మూలధనము:
1) ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, ఋణగ్రస్తులు, సరుకు నిల్వ, వసూలు బిల్లుల వంటి స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు.
2) ప్రస్తుత ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంవత్సరములోపు నగదు రూపములో తిరిగి పొందే అవకాశమున్నది. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని వ్యాపార సంస్థలకు ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణము వంటి అంశాలనాధారముగా ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనం అవసరమవుతుంది.

Exam Tips:

a) స్థిర మూలధనం (దీర్ఘకాలిక, స్థిరాస్తుల కొనుగోలుకు), నిర్వహణ మూలధనం (స్వల్పకాలిక, రోజువారీ ఖర్చులకు) – రెండింటినీ వేర్వేరు శీర్షికలతో రాయండి.
b) నిర్వహణ మూలధనం అన్ని సంస్థలకు సమానంగా ఉండదని, అమ్మకాల టర్నోవర్‌పై ఆధారపడుతుందని పేర్కొనండి.

 

Question 2: వ్యాపార విత్తమూలాల వర్గీకరణను వివరించండి.

Answer:

1) కాల వ్యవధి ఆధారముగా: కాల వ్యవధి ఆధారముగా విత్తాన్ని సేకరించడానికి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక వ్యవధిగా విభజించవచ్చు.
ఎ) దీర్ఘకాలిక విత్తము: దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది. సేకరించడానికి వనరులు – వాటాలు, డిబెంచర్ల జారీ; దీర్ఘకాలిక ఋణాలు; ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు; నిలిపి ఉంచిన ఆర్జనలు; ప్రభుత్వ గ్రాంట్లు.
బి) మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. వీటిని ఈ క్రింది వనరుల నుంచి సేకరించవచ్చును.
వాణిజ్య బ్యాంకులు
పబ్లిక్ డిపాజిట్లు
లీజు విత్తము
ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
సి) స్వల్పకాలిక విత్తము: ఈ తరహా విత్తాన్ని స్వల్పకాలము అంటే ఒక సంవత్సరములోపు అవసరాల నిమిత్తం సేకరిస్తారు. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు: వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు; వాయిదా ఋణాలు; ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు; వాణిజ్య పత్రాలు.
2. యాజమాన్యము ఆధారముగా: నిధులపై యాజమాన్యపు హక్కు ఆధారము రెండు రకాలు.
ఎ. యాజమాన్యపు నిధులు
బి. ఋణాత్మక నిధులు
ఎ) యాజమాన్యపు నిధులు: దీనిలో యజమానుల మూలధనమే కాకుండా నిలిపి ఉంచిన ఆర్జనలు కూడా చేరి ఉంటాయి.
బి) ఋణపూర్వక నిధులు: ఋణాల ద్వారా సమకూర్చుకునే నిధులు. వీటికి మూలాలు వాణిజ్య బ్యాంకుల నుంచి, ఆర్థిక ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, డిబెంచర్ల జారీ, పబ్లిక్ డిపాజిట్లు, వర్తకపు ఋణాలు.
3. విత్తము ఉత్పన్నమయ్యే మూలాల ఆధారముగా: మూలధన వనరులు అంతర్గత లేదా బహిర్గత మూలాల నుంచి లభించవచ్చు. అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యేవి. లాభాల పునరాకర్షణ, నిలిపి ఉంచిన ఆర్జనలు, వసూలు బిల్లులపై వసూళ్ళు, మిగిలిన సరుకు అమ్మివేయడం, నిధులను వెనుకకు మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.
బహిర్గత మూలాలు అంటే సంస్థ వెలుపలి నుంచి లభ్యమయ్యే వనరులు.
ఉదా: వాటాలు, డిబెంచర్లు, పబ్లిక్ డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, సరుకు సరఫరాదారులు అందించే వర్తక ఋణము, పెట్టుబడిదారులు, ఋణదాతలు.

Exam Tips:

a) వర్గీకరణ మూడు ఆధారాలపై: కాలవ్యవధి, యాజమాన్యం, ఉత్పన్నమయ్యే మూలం – మొదట ఈ మూడింటినీ జాబితా చేయండి.
b) ప్రతి ఆధారం కింద ఉప-రకాలు మరియు ఉదాహరణలు రాయండి (దీర్ఘ/మధ్య/స్వల్ప; యాజమాన్యపు/ఋణపూర్వక; అంతర్గత/బహిర్గత).

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: వ్యాపార విత్తము

Answer:

1. ఒక వ్యాపార సంస్థ తన లక్ష్యాలను సాధించడానికి వ్యాపార కార్యకలాపాల నియంత్రణ, నిర్వహణకు అవసరమైన విత్తాన్ని “వ్యాపార విత్తం” అంటారు.
2. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపాలను వ్యాపార విత్తము అంటారు.
3. ఒక వ్యాపారము ప్రారంభించడానికి, విస్తరణకు, మార్కెట్ తన వాటాను పంచుకొనడానికి ప్రతి సంస్థకు విత్తము అవసరము.

Exam Tips:

a) నిర్వచనంతో పాటు వ్యాపార విత్తం ఎందుకు అవసరమో ఒక వాక్యంలో చెప్పండి.

 

Question 2: స్థిర మూలధనము

Answer:

1. ఒక వ్యాపార సంస్థ స్థాపనకు స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించే మూలధనమును “స్థిర మూలధనము” అంటారు.
2. ఇలాంటి మూలధనం లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు, మనుగడను సాగించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము.
3. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోనూ, వ్యాపారము చేసే సంస్థలో తక్కువ మొత్తములో అవసరమవుతుంది.

Exam Tips:

a) స్థిర మూలధనం = స్థిరాస్తుల కొనుగోలుకు దీర్ఘకాలిక మూలధనం; పరిమాణం సంస్థ స్వభావంపై ఆధారపడుతుందని రాయండి.

 

Question 3: నిర్వహణ మూలధనము

Answer:

1. వ్యాపార సంస్థ రోజువారీ వివిధ రకాల ఖర్చులను చెల్లించుటకు అవసరమైన మూలధనాన్ని “నిర్వహణ మూలధనం” లేదా “చర మూలధనం” అంటారు.
2. ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, సరుకు మొదలైన స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు.
3. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని సంస్థలలో ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణాన్నిబట్టి ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనము అవసరమవుతుంది.

Exam Tips:

a) నిర్వహణ మూలధనాన్ని 'చర మూలధనం' అని కూడా అంటారని పేర్కొనండి.

 

Question 4: దీర్ఘకాలిక విత్తము

Answer:

1. దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది.
2. దీర్ఘకాలిక విత్తమును సేకరించడానికి వనరులు:
వాటాలు, డిబెంచర్ల జారీ
దీర్ఘకాలిక ఋణాలు
ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
నిలిపి ఉంచిన ఆర్జనలు
ప్రభుత్వ గ్రాంట్లు.

Exam Tips:

a) దీర్ఘకాలిక విత్తం కాలపరిమితి 5 సంవత్సరాల పైన – ఈ సంఖ్యను మర్చిపోవద్దు.

 

Question 5: స్వల్పకాలిక విత్తము.

Answer:

1. స్వల్ప కాలానికి అంటే ఒక సంవత్సరము లోపు అవసరాల నిమిత్తము సేకరించిన విత్తాన్ని స్వల్పకాలిక విత్తము అంటారు.
2. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు:
వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు
వాయిదా పరపతి
ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
వాణిజ్య పత్రాలు

Exam Tips:

a) స్వల్పకాలిక విత్తం కాలపరిమితి ఒక సంవత్సరం లోపు అని రాసి, నాలుగు వనరులను జాబితా చేయండి.

 

Question 6: అంతర్గత విత్త మూలాధారాలు.

Answer:

1. అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యే వనరులు.
2. అవి:
లాభాల పునరాకర్షణ
నిలిపి ఉంచిన ఆర్జనలు
వసూలు బిల్లులపై వసూళ్ళు
మిగిలిన సరుకు అమ్మకాలు
నిధులను వెనక్కి మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.

Exam Tips:

a) అంతర్గత మూలాలు: లాభాల పునరాకర్షణ, నిలిపి ఉంచిన ఆర్జనలు మొదలైనవి – సంస్థలోనే లభిస్తాయని స్పష్టం చేయండి.

 

Question 7: బహిర్గత నిధులకు మూలాలు

Answer:

1. సంస్థ వెలుపలి నుంచి లభించే వనరులను బహిర్గత వనరులు అంటారు.
2. ఉదాహరణలు:
వాటాలు
డిబెంచర్లు
పబ్లిక్ డిపాజిట్లు
వాణిజ్య బ్యాంకులు
ద్రవ్య సహాయక సంస్థలు
సరుకు సప్లయిదారులకు అందించే ఋణం
పెట్టుబడిదారులు
ఋణదాతలు

Exam Tips:

a) బహిర్గత మూలాలు సంస్థ బయటి నుంచి వస్తాయి; వాటాలు, డిబెంచర్లు, బ్యాంకు ఋణాలను ఉదాహరణలుగా రాయండి.

 

అదనపు ప్రశ్నలు

Question 1: మధ్యకాలిక విత్తం.

Answer:

1. ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తం అంటారు.
2. ఉదాహరణలు: వాణిజ్య బ్యాంకుల నుండి ఋణాలు, పబ్లిక్ డిపాజిట్లు, కౌలు ద్వారా విత్తాన్ని సమకూర్చటం, ఆర్థిక సంస్థల నుండి రుణాలు.

Exam Tips:

a) మధ్యకాలిక విత్తం కాలపరిమితి 1–5 సంవత్సరాలు అని రాసి మూడు నాలుగు మూలాలు ఇవ్వండి.

 

Free study material for Commerce

TS Board Solutions for Class 11 Commerce Chapter 08 Business Finance

Accessing Chapter 08 Business Finance Solutions

Explore reliable textbook solutions for Chapter 08 Business Finance tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Commerce.

Concept-Driven Answers for Class 11 Commerce

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Commerce module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Commerce.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Commerce are as per latest TS Board curriculum.

Are the Commerce TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Commerce concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Commerce. You can access TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం in both English and Hindi medium.

Is it possible to download the Commerce TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం in printable PDF format for offline study on any device.