Official TS Board Solutions for Class 11 Commerce: Chapter 05 Joint Stock Company
Explore reliable textbook solutions for Chapter 05 Joint Stock Company tailored for Class 11 learners. Utilizing these Commerce answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Chapter-wise Solutions for Commerce: Chapter 05 Joint Stock Company
Navigate directly to the solved Commerce textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
Question 1: జాయింట్ స్టాక్ కంపెనీ నిర్వచించండి. జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలను వివరించండి.
Answer:
జాయింట్ స్టాక్ కంపెనీ – అర్థం: కంపెనీ లేదా జాయింట్ స్టాక్ కంపెనీ అంటే భారీతరహా వాణిజ్య లేదా వ్యాపార కార్యకలాపాలను చేపట్టి, నిర్దిష్ట ధ్యేయాలను సాధించడానికి, కొంతమంది వ్యక్తులచే స్వచ్ఛందంగా ఏర్పడిన సంస్థ. ఇది న్యాయశాస్త్రం ద్వారా సృష్టించబడి, న్యాయస్థానం ద్వారానే రద్దు చేయబడుతుంది. కంపెనీకి ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. సభ్యుల జీవితాలతో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు, ఈ సభ్యులు సమిష్టి ప్రయోజనం కోసం తమవంతు ధనాన్ని మూలధనంగా సమకూర్చుతారు. ఈ మూలధనం చిన్న చిన్న భాగాలుగా (యూనిట్లు) విభజింపబడి ఉంటుంది. ఈ చిన్న చిన్న భాగాలను లేదా యూనిట్లను ‘వాటాలు’ అంటారు. కంపెనీ సభ్యులు ఈ వాటాలను కొనడం ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల వీరిని ‘వాటాదారులు’ అంటారు. కంపెనీ మూలధనాన్ని ‘వాటా మూలధనం’ అంటారు.
నిర్వచనాలు:
1) ఎల్. హెచ్. హేని ప్రకారం
“బదిలీ చేయుచున్న వారితో ప్రారంభించబడిన మూలధనం కలిగి, లాభార్జన ధ్యేయంగా ఏర్పడ్డ వ్యక్తుల స్వచ్ఛంద సంస్థయే కంపెనీ. ఇందులో సభ్యులైన వారు దానికి యజమానులు అవుతారు”.
2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.
3) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.
జాయింట్ స్టాక్ కంపెనీ – లక్షణాలు:
కంపెనీ యొక్క విలక్షణమైన లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
1) చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి: కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన కృత్రిమ వ్యక్తి. న్యాయశాస్త్రమే ప్రాణంగా మనుగడను కొనసాగిస్తుంది. ఇది ఒక అదృశ్యమైన, కంటికి కనిపించని శరీరం, ఆత్మ లేని వ్యక్తి.
2) ప్రత్యేక న్యాయసత్వం: కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి.
కంపెనీ నమోదు చేయగానే దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లభిస్తుంది. అంటే కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. కంపెనీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకొనవచ్చు. సాధారణ వ్యక్తులలాగా ఆస్తులను కొనడం, అమ్మడం చేయవచ్చు. ఉద్యోగస్తులను నియంత్రించవచ్చు. స్వతంత్రంగా న్యాయసమ్మతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.
3) స్థాపన: జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపనకు ముందు పలు ముఖ్యమైన పత్రాలను తయారు చేయడంతో పాటు అనేక చట్టపరమైన నిబంధనలను, షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. భారత కంపెనీల చట్టం, 2013 కింద తప్పనిసరిగా నమోదు చేయించినప్పుడు మాత్రమే కంపెనీ మనుగడలోకి వస్తుంది.
4) అధికార ముద్ర: కంపెనీకి భౌతికమైన ఆకారం లేదు. అందువల్ల సహజమైన వ్యక్తిలాగా డైరెక్టర్ల బోర్డు ద్వారా వ్యవహరిస్తుంది. కంపెనీ ఒప్పందాలను కుదుర్చుకొన్నప్పుడు లావాదేవీలు జరిగినప్పుడు సంతకాలు చేయడానికి బదులు, తన అధికారముద్రను ఉపయోగిస్తుంది. ఈ అధికార ముద్ర కంపెనీ సంతకంలాగా చలామణి అవుతుంది. కంపెనీ సంతకానికి బదులు కంపెనీ అధికారముద్రను ముద్రించి, ఇద్దరు డైరెక్టర్లు సాక్షి సంతకాలు చేసినప్పుడు మాత్రమే ఆ పత్రాలలో ఉన్న విషయాల వల్ల కంపెనీకి బాధ్యత ఏర్పడుతుంది. ఈ అధికార ముద్రను తగు జాగ్రత్త మధ్య కంపెనీ కార్యదర్శి వద్ద భద్రపరచవలసి ఉంటుంది.
5) పారంపర్యాధికారం: కంపెనీ వ్యాపార సంస్థకు శాశ్వతమైన మనుగడ ఉంది. అందువల్ల కంపెనీ చిరకాలం కొనసాగుతుంది. కంపెనీ సభ్యులలో ఎవరైనా మరణించినా, వారి వాటాలను అమ్మివేసినా, ఎవరికైనా మతి భ్రమించినా, ఎవరైనా దివాలా తీసినా, కంపెనీ మాత్రం నిరాటంకంగా కొనసాగే అధికారాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడినందువల్ల దానిని మూసివేయడం చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.
6) సభ్యుల రుణబాధ్యత పరిమితం: కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. అందువల్ల కంపెనీ తాను చేసిన అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా వాటాదారుల రుణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువలకు పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు శ్రీను అనే వాటాదారుడు ₹10 విలువ కలిగిన వాటాను కొని వాటాకు ₹8 చెల్లిస్తే అతని రుణబాధ్యత వాటాకు ₹2 కు పరిమితమై ఉంటుంది. దీనికి మించి అతడు కంపెనీకి సంబంధించిన ఎలాంటి రుణాల లేదా నష్టాల చెల్లింపుకు బాధ్యతను కలిగి ఉండదు.
7) వాటాల బదిలీ: పబ్లిక్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలను యథేచ్ఛగా ఇతరులకు తమకు ఇష్టం వచ్చినప్పుడు బదిలీ చేసుకొనవచ్చు. ఈ మేరకు ఇతర వాటాదారుల అంగీకారం అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీల విషయంలో వాటాల బదిలీకి సంబంధించి కొన్ని నిబంధనలను విధించడమైంది.
8) సభ్యత్వం: జాయింట్ స్టాక్ కంపెనీ వ్యవస్థలో ప్రధానంగా ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలుగా పేర్కొనవచ్చు. ప్రైవేట్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 2, గరిష్ఠ సభ్యుల సంఖ్య 50 గాను పబ్లిక్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సభ్యుల సంఖ్య అపరిమితంగాను ఉంటుంది.
9) ప్రజాస్వామ్య నిర్వహణ: వివిధ వర్గాలకు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒక కంపెనీకి మూలధనాన్ని సమకూర్చుతారు. అందువల్ల వీరందరూ కంపెనీ రోజు వారి నిర్వహణలో పాల్గొనలేరు. అందువల్ల కంపెనీ పరిపాలన, నిర్వహణను చూడడానికి వాటాదారులు, డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంది.
10) మహిళ డైరెక్టర్: కంపెనీ చట్టం, 2013 ప్రకారం కొన్ని నిర్దిష్ట పబ్లిక్ కంపెనీలలో కనీసం ఒక మహిళ డైరెక్టర్గా వ్యవహరించాలి.
Exam Tips:
a) నిర్వచనం (హేని, లిండ్, కంపెనీల చట్టం 2013) తరువాత పది లక్షణాలను శీర్షికలుగా రాయండి; ప్రత్యేక న్యాయసత్వం, పరిమిత ఋణబాధ్యత, శాశ్వత మనుగడ ముఖ్యమైనవి.
b) శ్రీను వాటాదారుడి ఉదాహరణ (₹10 వాటా, ₹8 చెల్లింపు, ₹2 వరకే బాధ్యత) ఇస్తే పరిమిత ఋణబాధ్యత స్పష్టంగా అర్థమవుతుంది.
Question 2: కంపెనీల వర్గీకరణను వివరించండి.
Answer:
జాయింట్ స్టాక్ కంపెనీలు వివిధ అంశాల ప్రాతిపదికపై వర్గీకరించడమైంది.
1. వ్యవస్థాపన ఆధారంగా (నమోదు ఆధారంగా):
ఎ) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1694), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.
బి) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి.
ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.
సి) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.
2. ప్రజాశక్తి ఆధారంగా:
ఎ) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్ కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేధించబడ్డాయి.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:
1. కనీసపు చెల్లించిన మూలధనం ₹1,00,000.
2. కనీస సభ్యుల సంఖ్య 2.
3. గరిష్ట సభ్యుల సంఖ్య 50.
4. ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
5. వాటాలను బదిలీ చేయరాదు.
పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.
కంపెనీల చట్టం, 2013 ప్రకారం ప్రయివేట్ కంపెనీలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
i) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్-2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.
1. కంపెనీ వాటా మూలధనం ₹50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) ₹5 కోట్లకు మించరాదు.
2. కంపెనీ టర్నోవర్ ₹2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) ₹20 కోట్లకు మించరాదు.
ii) ఏక వ్యక్తి కంపెనీ: కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు.
నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.
బి) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.
1. కనీసపు చెల్లించిన మూలధనం ₹5,00,000.
2. కనీస సభ్యుల సంఖ్య 7.
3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.
ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.
3) యాజమాన్యం ఆధారంగా:
ఎ) ప్రభుత్వ కంపెనీలు: కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
బి) ప్రభుత్వేతర కంపెనీలు: ప్రభుత్వ కంపెనీల లక్షణాలను కల్గిలేని కంపెనీలన్నీ ప్రభుత్వేతర కంపెనీలుగా గుర్తింపబడతాయి.
4) రుణబాధ్యత ఆధారంగా:
ఎ) వాటా పరిమిత కంపెనీలు: ఏ కంపెనీలో అయితే వాటాదారుల రుణబాధ్యత, వారు తీసుకున్న వాటాల ముఖ విలువలకు పరిమితమై ఉంటుందో ఆ కంపెనీని వాటా పరిమిత కంపెనీ అంటారు.
బి) పూచీ పరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో సభ్యులు సంస్థాపన పత్రంలో సూచించిన విధంగా తమ రుణబాధ్యతను కొంత మొత్తానికే పరిమితమై ఆస్తులను సమకూరుస్తారు. అట్టి పూచీ ఇచ్చిన మొత్తాన్ని పరిసమాప్త దశలో మాత్రమే చెల్లిస్తారు.
సి) అపరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో అపరిమిత కంపెనీ సభ్యులు రుణాలు చెల్లించడానికి తమ సొంత ఆస్తులను కూడా జత చేయవలసి వస్తుంది. ఈ రకమైన కంపెనీలలో కోర్టు అనుమతి లేకుండానే ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా సులభంగా మూలధన మార్పులు చేసుకోవచ్చు.
5) అధికారం ఆధారంగా:
ఎ) హోల్డింగ్ కంపెనీలు: ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు. ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.
బి) అనుబంధ కంపెనీ: ఒక కంపెనీ వేరొక కంపెనీ నిర్వాహణ, నియంత్రణలో ఉన్నప్పుడు ఆ కంపెనీని అనుబంధ కంపెనీ అంటారు. ఉదాహరణకు A అనే కంపెనీ B కంపెనీ వాటా మూలధనంలో 51% కన్నా ఎక్కువ లేదా 51% వాటా కలిగి ఉన్నప్పుడు B కంపెనీ A కంపెనీకి అనుబంధ కంపెనీ అగును.
6. జాతీయత ఆధారంగా:
స్వదేశీ కంపెనీ: ఒక కంపెనీ మన దేశంలోని కంపెనీల చట్టం ప్రకారం నమోదై వ్యాపార కార్యకలాపాలను జరిపినప్పుడు దానిని స్వదేశీ కంపెనీ అని అంటారు.
విదేశీ కంపెనీ: విదేశాలలో నమోదై, భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినప్పుడు దానిని విదేశీ కంపెనీ అంటారు.
7. ప్రాంతం ఆధారంగా:
జాతీయ కంపెనీ: కంపెనీ తమ వ్యాపార కార్యకలాపాలను ఒక దేశపు ఎల్లను దాటకుండా చేపట్టినప్పుడు దానిని జాతీయ కంపెనీ అంటారు.
బహుళ జాతి కంపెనీ: నమోదైన దేశంలో కాక దేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తించే కంపెనీని బహుళజాతి కంపెనీ అంటారు.
8. వ్యాపారాన్ని ప్రారంభించడం ఆధారంగా:
ఎ) డార్మెంట్ కంపెనీ (నిద్రాణమైన కంపెనీ): ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు. ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును.
బి) డీఫంక్ట్ కంపెనీ: కంపెనీ నమోదు చేసుకున్న సంవత్సరం లోపు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంలో విఫలమై ఎలాంటి ఆస్తులు, అప్పులు లేకుండా ఉన్నప్పుడు దానిని డీఫంక్ట్ కంపెనీగా పిలుస్తారు. ఇలాంటి కంపెనీ బహిరంగంగా లేదా ప్రయివేట్ వ్యాపార కార్యకలాపాలను భవిష్యత్తులో కొనసాగించకుండా నిషేధించబడును.
Exam Tips:
a) వర్గీకరణను ఆధారాల వారీగా (నమోదు, ప్రజాసంబంధం, యాజమాన్యం, ఋణబాధ్యత, అధికారం, జాతీయత, ప్రాంతం, వ్యాపార ప్రారంభం) శీర్షికలుగా రాయండి.
b) ప్రతి రకానికి ఒక్కో ఉదాహరణ (ఉదా: SAIL పబ్లిక్ కంపెనీ, STC ప్రభుత్వ కంపెనీ) ఇవ్వండి.
Question 3: ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
Answer:
ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్య గల వ్యత్యాసాలు
| తేడాకు గల ఆధారం | ప్రైవేట్ కంపెనీ | పబ్లిక్ కంపెనీ |
| 1. కనీస సభ్యుల సంఖ్య | కంపెనీ ప్రారంభానికి ఇద్దరు (2) వ్యక్తులు అవసరం. | కంపెనీ ప్రారంభానికి ఏడుగురు (7) వ్యక్తులు అవసరం. |
| 2. గరిష్ఠ సభ్యుల సంఖ్య | కంపెనీలో గరిష్ఠంగా యాభై (50) సభ్యులకు పరిమితం. | కంపెనీలో అపరిమితంగా సభ్యులు చేరవచ్చు. |
| 3. కనీస చెల్లించిన మూలధనం | ₹1,00,000. | ₹5,00,000. |
| 4. గుర్తింపు | కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని రాయాలి. | కంపెనీ పేరు చివర “పబ్లిక్ లిమిటెడ్” అని రాయాలి. |
| 5. వాటాల బదిలీ | యథేచ్ఛగా వాటాలను బదిలీ చేయరాదు. | యథేచ్ఛగా వాటాలను బదిలీ చేయవచ్చు. |
| 6. ప్రజలకు మూలధనం జారీ | ప్రజలకు వాటాలు జారీ చేయడం ద్వారా మూలధనం సేకరించరాదు. | ప్రజలకు వాటాలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సేకరించవచ్చు. |
| 7. వ్యాపార ప్రారంభం | కంపెనీగా నమోదు కాగానే వ్యాపార కార్యకలాపాలను చేపట్టడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. | కంపెనీగా నమోదు అయిన తర్వాత వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని కూడా పొందిన తర్వాతనే వ్యాపారాన్ని ప్రారంభించాలి. |
| 8. డైరెక్టర్ల బోర్డు | డైరెక్టర్ల కనీస సంఖ్య – ఇద్దరు (2), గరిష్ఠ సంఖ్య – అపరిమితం. | డైరెక్టర్ల కనీస సంఖ్య – ముగ్గురు (3), గరిష్ఠ సంఖ్య – 20. |
| 9. డైరెక్టర్ల నియామకం, పదవీ విరమణ | డైరెక్టర్ల నియామకం, పదవీ విరమణను కేవలం ఒక్క తీర్మానం ద్వారా జరపవచ్చు. | డైరెక్టర్ల నియామకానికి, డైరెక్టర్ల విరమణకు వేర్వేరుగా తీర్మానాలను చేయవలసి ఉంటుంది. |
| 10. నిర్వహణ పారితోషికం | డైరెక్టర్లకు, మేనేజింగ్ డైరెక్టర్లకు చెల్లించవలసిన పారితోషికాన్ని నిర్ణయించడంలో ఎలాంటి ఆంక్షలు లేవు. | డైరెక్టర్లకు, మేనేజింగ్ డైరెక్టర్లకు చెల్లించవలసిన పారితోషికాన్ని నిర్ణయించడంలో పలు ఆంక్షలు ఉన్నాయి. |
| 11. న్యాయవిధమైన నియంత్రణ | వ్యాపార ప్రారంభానికి న్యాయవిధమైన నియంత్రణ, నిబంధనలు తక్కువ. | వ్యాపార ప్రారంభానికి న్యాయవిధమైన నియంత్రణ, నిబంధనలు విధిగా పాటించాలి. |
| 12. రుణాల సేకరణ | ప్రైవేట్ కంపెనీ నుండి డైరెక్టర్లు రుణాలు పొందవచ్చు. | పబ్లిక్ కంపెనీ నుండి డైరెక్టర్లు రుణాలు పొందరాదు. |
| 13. కోరం | సమావేశానికి కనీసం ఇద్దరు (2) సభ్యులు హాజరు కావాలి. | సమావేశానికి కనీసం ఐదుగురు (5) హాజరు కావాలి. |
| 14. అర్హత వాటాలు | డైరెక్టర్లు అర్హత వాటాలు పొందనవసరం లేదు. | డైరెక్టర్లు తప్పనిసరిగా అర్హత వాటాలు తీసుకోవాలి. |
Exam Tips:
a) పట్టికలో 14 తేడాలను (సభ్యుల సంఖ్య, మూలధనం, వాటాల బదిలీ, డైరెక్టర్లు, కోరం, అర్హత వాటాలు మొదలైనవి) క్రమం తప్పకుండా రాయండి.
b) ప్రైవేట్ కంపెనీ: 2 నుంచి 50 సభ్యులు; పబ్లిక్ కంపెనీ: కనీసం 7, గరిష్ఠ పరిమితి లేదు అనే అంకెలను గుర్తుంచుకోండి.
Question 4: జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలను సవివరంగా వివరించండి.
Answer:
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.
2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.
3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.
4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.
5. ద్రవ్యత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరులు అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.
6. సమర్థవంతమైన నిర్వహణ: కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.
7. పరిశోధన మరియు అభివృద్ధి: ఒక కంపెనీ ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, నూతన వస్తువుల రూపకల్పనకు, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ విస్తరణ కంపెనీలలోనే సాధ్యము.
8. పన్ను ఆదాలు: కంపెనీలు ఆదాయపు పన్ను ఎక్కువ కట్టవలసి వచ్చినప్పటికి, ఎన్నో పన్ను మినహాయింపులు ఇవ్వడం వలన వీటికి పన్ను చెల్లించే బాధ్యత మొత్తంమీద తగ్గుతుంది.
9. ఉద్యోగ అవకాశాలు: ఒక కంపెనీ పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి మరియు దేశం మొత్తం జీవన ప్రమాణం మెరుగుపడుతుంది.
10. సమతుల్య ప్రాంతీయాభివృద్ధి: అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో కంపెనీల యొక్క విస్తరణ మరియు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, రాయితీల వల్ల ఒక ఔత్సాహిక వ్యవస్థాపకుడు వెనుకబడిన ప్రాంతాలలో మరియు అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలలో కంపెనీని స్థాపించడానికి సిద్ధమవుతాడు. ఇలాంటి కంపెనీలు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందని ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తుంది.
Exam Tips:
a) ప్రయోజనాలను వాటి కారణాలతో (పరిమిత ఋణబాధ్యత, భారీ ఆర్థిక వనరులు, శాశ్వత మనుగడ, ద్రవ్యత్వం) జతచేసి రాయండి.
b) 'పెద్దతరహా ఆదాలు', 'పరిశోధన, అభివృద్ధి' వంటి ప్రత్యేక పాయింట్లు మార్కులు తెస్తాయి.
Question 5: జాయింట్ స్టాక్ కంపెనీ నష్టాలను విశ్లేషించండి.
Answer:
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతిబంధకాలవుతాయి.
2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.
3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.
4) కొద్దిమంది ద్వారా పరిపాలన: సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.
5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారులు కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.
6) అనుచితమైన స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.
7) మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ: కంపెనీ నిర్వహణలో అనేక నిబంధనలు పాటించాలి. వార్షిక నివేదికలు, తనిఖీ చేసిన లెక్కలను విధిగా రిజిస్ట్రారుకు సమర్పించాలి. డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వ అనుమతి పొందాలి. కంపెనీ ధ్యేయాలు మార్పు చేయడానికి అనేక చట్టబద్ధమైన లాంఛనాలు పాటించాలి.
8) వ్యాపార రహస్యాల వెల్లడి: వ్యాపార నిర్వహణ వాటాదారులు, డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలో ఉంటుంది. కాబట్టి కంపెనీ రహస్యాలను కాపాడటానికి వీలులేదు.
9) ఆసక్తుల సంఘర్షణ: ఈ తరహా వ్యాపారములో ఆసక్తులకు సంబంధించి నిరంతరము సంఘర్షణ జరుగుతుంది. సాధారణముగా వాటాదారులు, డైరెక్టర్ల మధ్య లేదా వాటాదారులు, ఋణదాతల మధ్య లేదా మేనేజ్మెంట్, సిబ్బందికి మధ్య ఎప్పుడూ కలహాలు కొనసాగుతూనే ఉంటాయి.
10) గుత్తాధిపత్యము: కంపెనీలు గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహిస్తుంది. వీరు వినియోగదారులను, శ్రామికులను దోచుకోవడం జరుగును.
Exam Tips:
a) నష్టాలను పది శీర్షికలుగా రాయండి; అవినీతి నిర్వహణ, స్పెక్యులేషన్, అల్పసంఖ్యాకుల పాలన, ప్రభుత్వ నియంత్రణ అనేవి తప్పక ఉండాలి.
b) ప్రయోజనాలు, నష్టాలు రెండూ అడిగితే రెండు భాగాలుగా విడగొట్టి రాయండి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) ప్రయోజనాలను వివరించండి.
Answer:
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.
2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.
3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.
4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.
5. ద్రవ్యత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరుల అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.
6. సమర్థవంతమైన నిర్వహణ: కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.
Exam Tips:
a) ఐదు ప్రయోజనాలను ఎంచుకుని ఒక్కొక్కదానికి 2-3 వాక్యాల వివరణ ఇవ్వండి.
b) పరిమిత ఋణబాధ్యత, శాశ్వత మనుగడ, భారీ వనరులు వంటి సులభమైన వాటిని ఎంచుకోండి.
Question 2: జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) పరిమితులను వివరించండి.
Answer:
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతిబంధకాలవుతాయి.
2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.
3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.
4) కొద్దిమంది ద్వారా పరిపాలన: సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.
5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారుల కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.
6) వాటాలలో అనుచిత స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.
Exam Tips:
a) ఐదు పరిమితులను (ఆంక్షలు ఎక్కువ, ఆసక్తి లోపం, నిర్ణయాల జాప్యం, అల్పసంఖ్యాక పాలన, అవినీతి) ఎంచుకోండి.
b) ప్రతి పరిమితికి ఒక కారణం, ఒక ఫలితం రాయండి.
Question 3: ప్రైవేట్ కంపెనీ లక్షణాలను తెలపండి.
Answer:
ప్రైవేట్ కంపెనీ లక్షణాలు:
1) స్థాపన: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన కంపెనీని ప్రైవేట్ కంపెనీ అంటారు.
2) సభ్యుల సంఖ్య: కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ఠ సభ్యుల సంఖ్య 50.
3) చెల్లించిన మూలధనం: కనీస చెల్లించిన మూలధనం ₹1,00,000.
4) వాటాల బదిలీపై ఆంక్షలు: వాటాలను యథేచ్ఛగా బదిలీ చేయరాదు.
5) ప్రజల నుండి చందా నిషేధం: ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు; ప్రజల నుండి మూలధనం సేకరించరాదు.
6) పేరు: కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక రాయాలి.
7) డైరెక్టర్లు: కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి; డైరెక్టర్ల నియామకం, పదవీ విరమణ ఒకే తీర్మానంతో జరపవచ్చు.
8) తక్కువ నియంత్రణ: వ్యాపార ప్రారంభానికి న్యాయవిధమైన నియంత్రణ, నిబంధనలు తక్కువ; నమోదు కాగానే వ్యాపారం ప్రారంభించవచ్చు.
9) కోరం: సమావేశానికి కనీసం ఇద్దరు సభ్యులు హాజరైతే చాలు.
Exam Tips:
a) ప్రైవేట్ కంపెనీకి 2 నుంచి 50 సభ్యులు, వాటాల బదిలీపై ఆంక్షలు, ప్రజల నుంచి చందా నిషేధం, 'ప్రైవేట్ లిమిటెడ్' పేరు అనే నాలుగు లక్షణాలు తప్పనిసరి.
b) పబ్లిక్ కంపెనీతో తేడాను చూపిస్తూ రాస్తే మార్కులు పెరుగుతాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: కంపెనీ చట్టం, 2013 ప్రకారం కంపెనీని నిర్వచించండి.
Answer:
1) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.
2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.
Exam Tips:
a) కంపెనీల చట్టం, 2013 నిర్వచనం రాసి, అవసరమైతే లిండ్ నిర్వచనాన్ని జతచేయండి.
b) 'నమోదు చేయబడిన సంస్థ' అనే పదబంధం కీలకం.
Question 2: శాశ్వత మనుగడ అంటే ఏమిటి ?
Answer:
1. కంపెనీల చట్టం ప్రకారం కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వం ఉంటుంది. అందువల్ల కంపెనీ నిరాటంకంగా కొనసాగుతోంది. దీనినే శాశ్వత మనుగడ అంటారు.
2. కంపెనీ సభ్యుల జీవితాలకు, కంపెనీ జీవితానికి సంబంధం లేదు.
వాటాదారుని మరణంగాని, దివాలాగాని, మతిస్థిమితాన్ని కోల్పోవడం గానీ కంపెనీ భవిష్యత్తును మార్చలేవు. అందువల్ల సుదీర్ఘమైన, నిరాటంకమైన వ్యాపారానికి అవకాశం ఉంటుంది.
Exam Tips:
a) శాశ్వత మనుగడ అంటే సభ్యుల మరణం, దివాలా వల్ల కంపెనీపై ప్రభావం ఉండదు అని రాయండి.
b) 'కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వం ఉండటమే' దీనికి కారణం అని చెప్పండి.
Question 3: చిన్న కంపెనీ అంటే ఏమిటి ?
Answer:
కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.
1. కంపెనీ వాటా మూలధనం ₹50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) ₹5 కోట్లకు మించరాదు.
2. కంపెనీ టర్నోవర్ ₹2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) ₹20 కోట్లకు మించరాదు.
Exam Tips:
a) చిన్న కంపెనీ: పబ్లిక్ కంపెనీ కాని కంపెనీ; మూలధనం, టర్నోవర్ పరిమితులను అంకెలతో రాయండి.
b) సెక్షన్ 2(85) ను ప్రస్తావించండి.
Question 4: ఏక వ్యక్తి కంపెనీ అంటే ఏమిటి ?
Answer:
1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.
2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.
Exam Tips:
a) ఏక వ్యక్తి కంపెనీ = ఒకే ఒక సభ్యుడు ఉండే కంపెనీ; నామినీ (నామమాత్రపు సభ్యుడు) ఉంటాడు.
b) నామమాత్రపు సభ్యుడి ఋణబాధ్యత పరిమితం అని గుర్తుంచుకోండి.
Question 5: ప్రభుత్వ కంపెనీ అంటే ఏమిటి ?
Answer:
కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైనవి.
Exam Tips:
a) కనీసం 51% వాటా మూలధనం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండాలి అనే అంకెను తప్పక రాయండి.
b) ఉదాహరణ: స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
Question 6: హోల్డింగ్ కంపెనీ అంటే ఏమిటీ ?
Answer:
1. ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు.
2. ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.
Exam Tips:
a) హోల్డింగ్ కంపెనీ మరో కంపెనీ (అనుబంధ కంపెనీ) నిర్వహణను నియంత్రిస్తుంది; సగానికి మించి వాటా కలిగి ఉంటుంది.
b) A, B కంపెనీల ఉదాహరణను ఇవ్వండి.
Question 7: డార్మెంట్ కంపెనీ అంటే ఏమిటి ?
Answer:
1. ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు.
2. ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును.
Exam Tips:
a) రెండు సంవత్సరాల పాటు ఎలాంటి అకౌంటింగ్ లావాదేవీ జరగని కంపెనీ అని రాయండి.
b) రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసి 'డార్మెంట్' గా గుర్తింపు పొందవచ్చని చేర్చండి.
అదనపు సమాధాన ప్రశ్నలు
Question 1: ఏవైనా ఓ కంపెనీలను వివరించండి.
Answer:
1) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1694), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.
2) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి.
ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.
3) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.
4) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేధించబడ్డాయి.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:
1. కనీసపు చెల్లించిన మూలధనం ₹1,00,000.
2. కనీస సభ్యుల సంఖ్య 2.
3. గరిష్ట సభ్యుల సంఖ్య 50.
4. ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
5. వాటాలను బదిలీ చేయరాదు.
పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.
ఎ) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.
1. కంపెనీ వాటా మూలధనం ₹50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) ₹5 కోట్లకు మించరాదు.
2. కంపెనీ టర్నోవర్ ₹2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) ₹20 కోట్లకు మించరాదు.
బి) ఏక వ్యక్తి కంపెనీ:
1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.
2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.
5) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.
1. కనీసపు చెల్లించిన మూలధనం ₹5,00,000.
2. కనీస సభ్యుల సంఖ్య 7.
3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.
ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.
Exam Tips:
a) మీరు ఎంచుకున్న కంపెనీలను నిర్వచనం, ఉదాహరణతో రాయండి (చార్టెర్డ్ - ఈస్ట్ ఇండియా కంపెనీ; శాసనాత్మక - RBI).
b) చిన్న కంపెనీ, ఏక వ్యక్తి కంపెనీ, పబ్లిక్ కంపెనీలలో అంకెల పరిమితులను జాగ్రత్తగా రాయండి.
Question 2: పబ్లిక్ కంపెనీ.
Answer:
భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.
1. కనీసపు చెల్లించిన మూలధనం ₹5,00,000.
2. కనీస సభ్యుల సంఖ్య 7.
3. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.
ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.
Exam Tips:
a) పబ్లిక్ కంపెనీ: కనీసం 7 సభ్యులు, గరిష్ఠ పరిమితి లేదు, పేరు చివర 'పబ్లిక్ లిమిటెడ్' లేదా 'లిమిటెడ్'.
b) SAIL, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ఉదాహరణలు ఇవ్వండి.
Free study material for Commerce
Commerce Class 11 Curriculum Solutions: Chapter 05 Joint Stock Company
Official TS Board Solutions for Chapter 05 Joint Stock Company
Review comprehensive exercise answers for Class 11 Commerce Chapter 05 Joint Stock Company. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Chapter 05 Joint Stock Company
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Commerce module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Next Steps in Your Commerce Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Commerce.
FAQs
The complete and updated TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Commerce are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Commerce concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Commerce. You can access TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Commerce Study Material Chapter 5 జాయింట్ స్టాక్ కంపెనీ in printable PDF format for offline study on any device.