TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు

Official TS Board Solutions for Class 11 Chemistry: Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques

Review structured textbook solutions for Class 11 Chemistry Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Chemistry: Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques

Navigate directly to the solved Chemistry textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు

Question 1: బెంజీన్ను మీథైల్ బెంజీన్ గా మార్చడానికి అవసరమైన కారకాలు రాయండి.

Answer:

AlCl₃ ఉత్ప్రేరకం సమక్షంలో బెంజీన్, మిథైల్ క్లోరైడ్ చర్య జరిపితే మిథైల్ బెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C_6H_6 + CH_3Cl \xrightarrow{AlCl_3} C_6H_5CH_3 + HCl} \)

Exam Tips:

a) బెంజీన్ → టోలీన్ ఫ్రీడల్–క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్: కారకాలు CH₃Cl + అనార్ద్ర AlCl₃ అని స్పష్టంగా రాయండి.
b) AlCl₃ లూయీ ఆమ్ల ఉత్ప్రేరకం; ఇది CH₃Cl నుంచి ఎలక్ట్రోఫైల్ CH₃⁺ ను ఏర్పరుస్తుంది.

 

Question 2: నైట్రో బెంజీన్ను ఎలా తయారుచేస్తారు?

Answer:

బెంజీన్ ను 60°C కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాఢ HNO₃ మరియు గాఢ H₂SO₄ ల మిశ్రమంతో వేడిచేస్తే నైట్రోబెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C_6H_6 \xrightarrow[<\,60^\circ C]{conc.\ HNO_3 + conc.\ H_2SO_4} C_6H_5NO_2 + H_2O} \)

Exam Tips:

a) నైట్రేషన్ మిశ్రమం = గాఢ HNO₃ + గాఢ H₂SO₄; ఉష్ణోగ్రత 60°C కంటే తక్కువ ఉండాలని రాయండి (ఎక్కువైతే డైనైట్రో ఉత్పన్నాలు వస్తాయి).
b) ఎలక్ట్రోఫైల్ NO₂⁺ (నైట్రోనియం అయాన్) అని ప్రస్తావిస్తే అదనపు మార్కులు వస్తాయి.

 

Question 3: ఈథేన్ అనురూపకాలను రాయండి.

Answer:

ఈథేన్ – అనురూపాత్మక సాదృశ్యములు : ఈథేన్ అణువులో ఒక కార్బన్ పరమాణువు స్థానమును స్థిరీకరించి రెండవ కార్బన్ పరమాణువును C – C బంధ అక్షముపై చక్ర భ్రమణము చేయుట వలన అనేక ప్రాదేశిక అమరికలు గల రూపములు లభించును. ఈ రూపములను అనురూపాత్మక సాదృశ్యములందురు. ఈథేన్ ప్రధాన అనురూపాత్మక సాదృశ్యములు.
1. గ్రహణ ఆకృతి
2. అస్తవ్యస్త ఆకృతి

Exam Tips:

a) అస్తవ్యస్త (staggered) ఆకృతి అత్యంత స్థిరం, గ్రహణ (eclipsed) ఆకృతి అత్యల్ప స్థిరం; న్యూమన్ ప్రక్షేపాలను చక్కగా గీయండి.
b) అనురూపకాలు C–C ఒంటరి బంధ భ్రమణం వల్ల ఏర్పడతాయి; ఈ భ్రమణంలో ఏ బంధమూ తెగదు.

 

Question 4: ఇథిలీన్ నుంచి ఈథైల్ క్లోరైడ్ను ఎలా తయారుచేస్తారు?

Answer:

ఇథిలీన్ ను HCl తో చర్య జరిపి ఈథైల్ క్లోరైడ్ను తయారు చేస్తారు.
\( \mathrm{CH_2{=}CH_2 + HCl \rightarrow CH_3CH_2Cl} \) (ఈథైల్ క్లోరైడ్)

Exam Tips:

a) ఇథిలీన్ + HCl → ఈథైల్ క్లోరైడ్ ఒక సంకలన చర్య; సమీకరణం CH₂=CH₂ + HCl → CH₃CH₂Cl సమతుల్యంగా రాయండి.

 

Question 5: కింది నిర్మాణాల IUPAC నామాలు రాయండి.
(a) CH₃-CH₂-CH₂-CH=CH₂
(b) \( \mathrm{CH_3CH_2CH_2COCH_3} \) మరియు \( \mathrm{CH_3CH_2COCH_2CH_3} \)
(c) \( \mathrm{O_2N{-}C_6H_4{-}CHO} \) – ఒక నిర్మాణంలో NO₂ మెటా (3-) స్థానంలో, మరొకదానిలో పారా (4-) స్థానంలో ఉంది

Answer:

(a) 1-పెంటీన్
(b) పెంటేన్-2-ఓన్, పెంటేన్-3-ఓన్
(c) 3-నైట్రో బెంజాల్డిహైడ్, 4-నైట్రో బెంజాల్డిహైడ్

Exam Tips:

a) IUPAC నామకరణ క్రమం: ప్రధాన శృంఖలం → ప్రమేయ సమూహానికి తక్కువ సంఖ్య → ప్రతిక్షేపకాలు; (a) లో ద్విబంధం C1 వద్ద కాబట్టి 1-పెంటీన్.
b) కీటోన్లకు ‘-ఓన్’, ఆల్డిహైడ్లకు ‘-ఆల్’ అనే అంత్యప్రత్యయాలు వాడండి; బెంజాల్డిహైడ్ లో CHO కార్బన్ C1 అవుతుంది.

 

Question 6: కింది వాటి నిర్మాణాలను రాయండి.
(i) ట్రైక్లోరో ఇథనాయిక్ ఆమ్లం
(ii) నియోపెంటేన్
(iii) P-నైట్రో బెంజాల్డిహైడ్ (March 2013)

Answer:

(i) ట్రైక్లోరో ఇథనాయిక్ ఆమ్లం – \( \mathrm{CCl_3COOH} \)
(ii) నియోపెంటేన్
\( \mathrm{CH_3{-}C(CH_3)_2{-}CH_3} \)
(iii) P-నైట్రో బెంజాల్డిహైడ్
\( \mathrm{p{-}O_2N{-}C_6H_4{-}CHO} \)

Exam Tips:

a) నియోపెంటేన్ = C(CH₃)₄ (2,2-డైమిథైల్ ప్రొపేన్); ఒక కార్బన్ చుట్టూ నాలుగు CH₃ గ్రూపులు.
b) p-నైట్రోబెంజాల్డిహైడ్ లో CHO, NO₂ గ్రూపులు వలయంలో 1,4 స్థానాల్లో ఉంటాయి; CCl₃COOH లో ఉప సంఖ్యలు మరువకండి.

 

Question 7: లాసైన్ చర్యను వివరించండి.

Answer:

లాసైన్ చర్య : పొడిగా ఉన్న చిన్న Na లోహాన్ని గలన స్థితిలో మారే వరకు గలన నాళికలో వేడి చేయవలెను. ఈ గలన Naకు కర్బన సమ్మేళనం కలిపి ఎర్రగా మారేవరకు వేడి చేయవలెను. చైనా పాత్రలో ఈ ఎర్రగా కాలిన నాళికను వేసి నీటిని కలిపి మరిగించి చల్లబరచి వడపోయవలెను. ఈ వడపోత ద్రావణాన్ని లాసైన్ కషాయం అంటారు. ఈ పరీక్ష N, S, హాలోజన్లను గుర్తించుటకు ఉపయోగపడును. నైట్రోజన్ను గుర్తించుట : కొద్దిగా లాసైన్ ద్రావణాన్ని పరీక్ష నాళికలో తీసుకొని దానికి కొన్ని చుక్కలు NaOH ద్రావణం కలిపి క్షారీకృతం చేసి దానికి అపుడే తయారు చేసిన ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని కలుపుతారు. దీనికి 2 లేక 3 చుక్కలు FeCl₃ ద్రావణం కలిపి చల్లబరిచి గాఢ HCl ద్రావణంతో ఆమ్లీకృతం చేస్తారు. ప్రష్యన్ బ్లూ రంగు ఏర్పడుతుంది.
\( \mathrm{FeSO_4 + 2NaOH \rightarrow Fe(OH)_2 + Na_2SO_4} \)
\( \mathrm{6NaCN + Fe(OH)_2 \rightarrow Na_4[Fe(CN)_6] + 2NaOH} \) (సోడియం ఫెర్రోసైనైడ్)
\( \mathrm{3Na_4[Fe(CN)_6] + 4FeCl_3 \rightarrow Fe_4[Fe(CN)_6]_3 + 12NaCl} \) (ఫెర్రిక్ ఫెర్రోసైనైడ్ = ప్రష్యన్ బ్లూ)

Exam Tips:

a) లాసైన్ కషాయంలో NaCN, Na₂S, NaX ఏర్పడతాయి; N పరీక్షకు ప్రష్యన్ బ్లూ, S కు ఊదా రంగు, హాలోజన్లకు AgNO₃ అవక్షేపం.
b) నైట్రోజన్ పరీక్ష క్రమం: NaOH → FeSO₄ → FeCl₃ → గాఢ HCl; అవసరమైన సమీకరణాలు కూడా రాయండి.

 

Question 8: క్రోమటోగ్రఫీ సిద్ధాంతాన్ని వివరించండి.

Answer:

క్రోమటోగ్రఫీని మిశ్రమ పదార్థాలను వేరు చేయడానికి, కర్బన పదార్థాలను శుద్ధి చేయడానికి, పదార్థాల పరిశుద్ధతను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో పదార్థాల మిశ్రమాన్ని ఒక స్థిర ప్రావస్థ మీద అధిశోషణం చేస్తారు. స్థిర ప్రావస్థగా ఘనపదార్థం కానీ ద్రవపదార్థం కానీ ఉండవచ్చు. స్వచ్ఛమైన ద్రావణి కానీ ద్రావణాల మిశ్రమం కానీ లేదా వాయువును కానీ స్థిరప్రావస్థ మీదకి మెల్లగా పంపిస్తారు. మిశ్రమంలోని పదార్థాలు క్రమంగా ఒకదాని నుంచి మరొకటి వేరు పడతాయి.

Exam Tips:

a) క్రోమటోగ్రఫీలో రెండు ప్రావస్థలు: స్థిర ప్రావస్థ, చలనశీల ప్రావస్థ; అనుఘటకాలు వీటి మధ్య వేర్వేరుగా విభజన (అధిశోషణ/వితరణ) చెందడం వల్ల వేరవుతాయి.

 

Question 9: జలబాష్ప స్వేదనంలో కర్బన ద్రవం దాని బాష్పీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎందుకు ఆవిరిగా మారుతుంది?

Answer:

జలబాష్ప స్వేదనంలో కర్బన ద్రవం బాష్పపీడనం P₁ నీటి ఆవిరి పీడనం P₂ల మొత్తం బాహ్య వాతావరణ పీడనం P కి సమానం అయినప్పుడు ద్రవం మరుగుతుంది. అంటే P = P₁ + P₂. కర్బన ద్రవ బాష్ప పీడనం P₁, P కంటే తక్కువ కాబట్టి అది దాని బాష్పీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద బాష్పీకరణం చెందుతుంది.

Exam Tips:

a) డాల్టన్ నియమం: P = P₁ + P₂; మిశ్రమ బాష్పపీడనం వాతావరణ పీడనానికి సమానమైనప్పుడు మరుగుతుంది కాబట్టి ఉష్ణోగ్రత కర్బన ద్రవ బాష్పీభవన స్థానం కంటే తక్కువ.

 

Question 10: కింది వాటిని వివరించండి.
(a) స్ఫటికీకరణం
(b) స్వేదనం

Answer:

(a) స్ఫటికీకరణం : మలిన పదార్థాన్ని అది కరిగే ద్రావణిలో దాని బాష్పీభవన స్థానం దగ్గర కరిగించి, మరిగించి సంతృప్త ద్రావణాన్ని తయారుచేసి ఆ గాఢ ద్రావణాన్ని చల్లార్చి పరిశుద్ధమైన సమ్మేళనాన్ని దాని స్ఫటిక రూపంలో పొందే ప్రక్రియను స్ఫటికీకరణం అంటారు.
ఈ పద్ధతిని ఘన సమ్మేళనాలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఇవ్వబడిన మలిన ఘన సమ్మేళనాన్ని అది కరిగే ద్రావణిలో దాని బాష్పీభవన స్థానం దగ్గర కరిగించి దాదాపు సంతృప్త ద్రావణం వచ్చే వరకు మరిగించి వడపోయాలి.
ద్రావణాన్ని నెమ్మదిగా చల్లారిస్తే పరిశుద్ధ సమ్మేళనం స్ఫటికాల రూపంలో బయటకు వస్తుంది. కరిగిన మలినాలు ద్రావణంలో మిగిలిపోతాయి.
(b) స్వేదనం : ఈ పద్ధతి
1. బాష్పశీల ద్రవాల నుంచి అబాష్పశీల మలినాలను వేరుచేయడానికి 2. బాష్పీభవన స్థానాలలో సరిపడ తేడా ఉన్న ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగిస్తారు.
విభిన్న బాష్పీభవన స్థానాలు ఉన్న ద్రవాలు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద పూర్తిగా బాష్పాలుగా మారతాయి. ఈ బాష్పాలను చల్లబరిస్తే ఏర్పడే ద్రవాలను వేరుగా సంగ్రహించవచ్చు.
ఉదా : క్లోరోఫారం (బాష్పీభవన స్థానం 334 K) మరియు ఎనిలీన్ (బాష్పీభవన స్థానం 457 K) మిశ్రమాన్ని స్వేదన పద్ధతిలో వేరుచేస్తారు.

Exam Tips:

a) స్ఫటికీకరణ దశలు: ద్రావణిలో కరిగించడం → సంతృప్త ద్రావణం → చల్లార్చడం → స్ఫటికాల వడపోత.
b) స్వేదనానికి ఉదాహరణగా క్లోరోఫారం (334 K) – ఎనిలీన్ (457 K) మిశ్రమం రాయండి.

 

లఘు సమాధాన ప్రశ్నలు

Question 1: కింది చర్యలను పూరించి A, B, C ఉత్పన్నాల నామాలు రాయండి.
\( \mathrm{CaC_2} \) —(H₂O)→ A —(వేడి లోహ గొట్టం)→ B —(AlCl₃ + CH₃Cl)→ C

Answer:

\( \mathrm{CaC_2 \xrightarrow{H_2O} C_2H_2} \) (ఎసిటిలీన్) —(వేడి లోహ గొట్టం)→ \( \mathrm{C_6H_6} \) (బెంజీన్) —(AlCl₃ + CH₃Cl)→ \( \mathrm{C_6H_5CH_3} \) (మిథైల్ బెంజీన్)
A – ఎసిటిలీన్
B – బెంజీన్
C – మిథైల్ బెంజీన్

Exam Tips:

a) A = ఎసిటిలీన్ (CaC₂ + 2H₂O), B = బెంజీన్ (వేడి లోహ గొట్టంలో త్రిపాలిమరీకరణం), C = మిథైల్ బెంజీన్ (ఫ్రీడల్–క్రాఫ్ట్స్ చర్య).

 

Question 2: కింది చర్యలో ఏర్పడిన A, B, C ఉత్పన్నాల పేర్లను రాసి, చర్యా సమీకరణాన్ని రాయండి.
ఇథిలీన్ —(Br₂/CCl₄)→ A —(ఆల్కహాలిక్ KOH)→ B —(Br₂)→ C

Answer:

\( \mathrm{CH_2{=}CH_2 \xrightarrow{Br_2/CCl_4} CH_2Br{-}CH_2Br \xrightarrow[-2HBr]{alc.\ KOH} HC{\equiv}CH \xrightarrow{Br_2} CHBr_2{-}CHBr_2} \)
A – 1,2-డైబ్రోమో ఈథేన్
B – ఎసిటిలీన్
C – 1,1,2,2-టెట్రాబ్రోమో ఈథేన్

Exam Tips:

a) ఇథిలీన్ + Br₂ → 1,2-డైబ్రోమో ఈథేన్; ఆల్కహాలిక్ KOH (–2HBr) → ఎసిటిలీన్; మళ్లీ Br₂ → 1,1,2,2-టెట్రాబ్రోమో ఈథేన్.

 

Question 3: ఎసిటిలీన్ a) బ్రోమిన్ b) హైడ్రోజన్తో ఎట్లా చర్య జరుపుతుంది? పై చర్యలకు సమీకరణాలు రాసి ఉత్పన్నాల పేర్లను తెలపండి.

Answer:

a) ఎసిటిలీన్ CCl₄ సమక్షంలో బ్రోమిన్తో చర్య జరిపి 1, 1, 2, 2 – టెట్రా బ్రోమో ఈథేన్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + Br_2 \xrightarrow{CCl_4} BrCH{=}CHBr \xrightarrow{Br_2/CCl_4} CHBr_2{-}CHBr_2} \) (1,1,2,2-టెట్రాబ్రోమో ఈథేన్)
b) ఎసిటిలీన్ Ni లేదా Pt ఉత్ప్రేరకం సమక్షంలో హైడ్రోజన్తో చర్య జరిపి ఈథేన్ ను ఏర్పరుచును.
\( \mathrm{HC{\equiv}CH + H_2 \xrightarrow{Ni/Pt} CH_2{=}CH_2 \xrightarrow[H_2]{Ni/Pt} CH_3{-}CH_3} \) (ఈథేన్)

Exam Tips:

a) ఎసిటిలీన్ + Br₂ రెండు దశల్లో జరుగుతుంది: 1,2-డైబ్రోమో ఈథీన్ → 1,1,2,2-టెట్రాబ్రోమో ఈథేన్.
b) H₂/Ni లేదా Pt తో మొదట ఈథీన్, తరువాత ఈథేన్ వస్తుంది; రెండు దశల సమీకరణాలు రాయండి.

 

Question 4: ప్రతిక్షేపణ చర్య అంటే ఏమిటి? ఏవైనా రెండు బెంజీన్ ప్రతిక్షేపక చర్యలను తెలపండి.

Answer:

కర్బన సమ్మేళనంలోని ఏదేని పరమాణువు లేక పరమాణువుల సమూహాన్ని వేరొక పరమాణువు లేదా పరమాణువుల సమూహంతో ప్రతిక్షేపించుటను ప్రతిక్షేపణ చర్య అంటారు. బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు జరుపుకుంటుంది. బెంజీన్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు :
1. హాలోజనీకరణం : బెంజీన్ను FeCl₃ సమక్షంలో క్లోరిన్‌తో చర్య జరపగా క్లోరో బెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C_6H_6 + Cl_2 \xrightarrow[25^\circ C]{FeCl_3} C_6H_5Cl + HCl} \) (క్లోరోబెంజీన్)
2. నైట్రోకరణం : బెంజీన్ను నైట్రేషన్ మిశ్రమంతో (గాఢ HNO₃ + గాఢ H₂SO₄) 60°C కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చర్య జరుపగా నైట్రో బెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C_6H_6 \xrightarrow[<60^\circ C]{conc.\ HNO_3 + conc.\ H_2SO_4} C_6H_5NO_2 + H_2O} \) (నైట్రోబెంజీన్)

Exam Tips:

a) ప్రతిక్షేపణ = ఒక పరమాణువు/సమూహం స్థానంలో మరొకటి రావడం; బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు జరుపుతుంది (Cl⁺, NO₂⁺ ఎలక్ట్రోఫైల్స్).
b) బెంజీన్ నైట్రేషన్ సమీకరణంలో ఉప ఉత్పన్నం H₂O (HCl కాదు).

 

Question 5: డీహైడ్రోహాలోజినేషన్ చర్య అంటే ఏమిటి? ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కీన్ ఏర్పడే చర్యను రాయండి.

Answer:

డీహైడ్రోహాలోజనీకరణం : ఒక సమ్మేళనంలోని ప్రక్క ప్రక్కన గల కార్బన్ పరమాణువుల నుండి హైడ్రోజన్ మరియు హాలోజన్ పరమాణువులను హైడ్రోజన్హాలైడ్ అణువుగా తొలగించు చర్యను డీహైడ్రోహాలోజనీకరణం అంటారు.
ఆల్కైల్ హాలైడ్ను ఆల్కహాలిక్ KOH తో వేడిచేయగా డీహైడ్రో హాలోజనీకరణం చెంది ఆల్కీన్ (ఇథిలీన్) ఏర్పడుతుంది.
\( \mathrm{CH_3CH_2Cl + KOH(alc.) \rightarrow CH_2{=}CH_2 + KCl + H_2O} \)

Exam Tips:

a) డీహైడ్రోహాలోజనీకరణకు ఆల్కహాలిక్ KOH, వేడి అవసరం; సజల KOH అయితే ఆల్కహాల్ వస్తుంది.
b) సమీకరణం: CH₃CH₂Cl + KOH(ఆల్కహాలిక్) → CH₂=CH₂ + KCl + H₂O.

 

Question 6: ఓజోన్తో ఎటువంటి సమ్మేళనాలు చర్యనొందుతాయి? ఏదైనా ఒక ఉదాహరణతో వివరించండి.

Answer:

అసంతృప్త హైడ్రోకార్బన్లు ఓజోన్తో చర్య జరుపుతాయి.
ఇథిలీన్, ఎసిటిలీన్, బెంజీన్ మొదలగునవి. ఓజోన్ తో చర్య జరిపి అస్థిరమైన ఓజనైడ్లను ఏర్పరుస్తాయి. ఇవి జల విశ్లేషణ చెంది కార్బొనైల్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఈ చర్యను ఓజోనీకరణం అంటారు.
ఉదా : ఇథిలీన్, ఓజోన్తో చర్య జరిపి అస్థిర ఇథిలీన్ ఓజోనైడ్‌ను ఏర్పరుస్తుంది. ఇది జలవిశ్లేషణ చెంది ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + O_3 \rightarrow} \) ఇథిలీన్ ఓజోనైడ్ (వలయ నిర్మాణం) \( \mathrm{\xrightarrow{Zn/H_2O} 2HCHO + H_2O_2} \) (ఫార్మాల్డిహైడ్)

Exam Tips:

a) ఓజోనీకరణం: ఆల్కీన్ + O₃ → ఓజోనైడ్; Zn/H₂O తో జలవిశ్లేషణ చేస్తే ఆల్డిహైడ్/కీటోన్ వస్తాయి (Zn, H₂O₂ ను తొలగించి ఆల్డిహైడ్ ఆక్సీకరణాన్ని ఆపుతుంది).

 

Question 7: స్థాన సాదృశ్యానికీ, ప్రమేయ సాదృశ్యానికీ క్రమంగా రెండు ఉదాహరణలు ఇవ్వండి. (March 2013)

Answer:

1) కర్బన శృంఖలంపై ఉన్న ప్రతిక్షేపకం లేదా ప్రమేయ సమూహ స్థానాల్లో భేదం వలన ఏర్పడే సాదృశ్యాన్ని స్థాన సాదృశ్యం అంటారు.
i) \( \mathrm{CH_3CH_2CH_2OH} \) (1-ప్రొపనాల్), \( \mathrm{CH_3{-}CH(OH){-}CH_3} \) (2-ప్రొపనాల్)
ii) \( \mathrm{CH_3CH_2CH{=}CH_2} \) (1-బ్యూటీన్), \( \mathrm{CH_3{-}CH{=}CH{-}CH_3} \) (2-బ్యూటీన్)
2) అణు సంకేతం ఒకటే ఉండి ప్రమేయ సమూహాలు వేరుగా ఉండటం వలన ఏర్పడిన సాదృశ్యాన్ని ప్రమేయ సమూహ సాదృశ్యం అంటారు.
i) \( \mathrm{CH_3CH_2OH} \) (ఈథైల్ ఆల్కహాల్), \( \mathrm{CH_3OCH_3} \) (డై మిథైల్ ఈథర్)
ii) \( \mathrm{CH_3CH_2CHO} \) (ప్రొపనల్), \( \mathrm{CH_3COCH_3} \) (ప్రొపనోన్)

Exam Tips:

a) స్థాన సాదృశ్యం: ప్రమేయ సమూహ స్థానం మారుతుంది (1-ప్రొపనాల్, 2-ప్రొపనాల్); ప్రమేయ సమూహ సాదృశ్యం: ప్రమేయ సమూహమే మారుతుంది (ఇథనాల్, డైమిథైల్ ఈథర్).

 

Question 8: మీథేన్ హాలోజనీకరణం చర్యాగతిని రాయండి.

Answer:

మీథేన్ హాలోజనీకరణం : సూర్యరశ్మి లేదా U.V కాంతి సమక్షంలో మీథేన్ హాలోజన్లతో చర్య జరుపుతుంది. ఈ చర్యలో మీథేన్లోని H పరమాణువులు హాలోజన్పరమాణువులతో ప్రతిక్షేపక చర్య జరిపి మోనో, డై, ట్రై మరియు టెట్రాహలో మీథేన్లు వరసగా ఏర్పడతాయి.
\( \mathrm{CH_4 + Cl_2 \xrightarrow{UV} CH_3Cl + HCl} \) (మోనోక్లోరో మీథేన్)
\( \mathrm{CH_3Cl + Cl_2 \xrightarrow{UV} CH_2Cl_2 + HCl} \) (డైక్లోరో మీథేన్)
\( \mathrm{CH_2Cl_2 + Cl_2 \xrightarrow{UV} CHCl_3 + HCl} \) (ట్రైక్లోరో మీథేన్ = క్లోరోఫామ్)
\( \mathrm{CHCl_3 + Cl_2 \xrightarrow{UV} CCl_4 + HCl} \) (టెట్రాక్లోరో మీథేన్ = కార్బన్ టెట్రాక్లోరైడ్)

Exam Tips:

a) మీథేన్ క్లోరినేషన్ నాలుగు వరుస దశల్లో CH₃Cl, CH₂Cl₂, CHCl₃, CCl₄ ఇస్తుంది; ప్రతి దశలో HCl వెలువడుతుంది, UV కాంతి అవసరం.

 

Question 9: ఈథైల్ ఆల్కహాల్ నుంచి ఇథిలీన్ను ఎట్లా తయారుచేస్తారు?

Answer:

ఈథైల్ ఆల్కహాల్ నుండి ఇథిలీన్ ను తయారు చేయుట :
ఈథైల్ ఆల్కహాల్ నిర్జలీకరణ : ఈథైల్ ఆల్కహాల్ను గాఢ H₂SO₄ తో కలిపి 170°C వద్ద వేడిచేస్తే ఇథిలీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{CH_3CH_2OH \xrightarrow[170^\circ C]{conc.\ H_2SO_4} C_2H_4 + H_2O} \) (ఇథిలీన్)

Exam Tips:

a) ఆల్కహాల్ నిర్జలీకరణ ఉష్ణోగ్రత 170°C (గాఢ H₂SO₄); తక్కువ ఉష్ణోగ్రత (140°C) వద్ద డై ఈథైల్ ఈథర్ ఏర్పడుతుంది.

 

Question 10: కింది వాటితో ఎసిటిలీన్ చర్యలను వివరించండి.
(a) Na/NH₃
(b) క్రోమిక్ ఆమ్లం సమీకరణాలను, ఉత్పన్నాల పేర్లను రాయండి

Answer:

a) ఎసిటిలీన్ సోడియం లోహంతో చర్య జరిపి మోనోసోడియమ్ ఈథనైడ్ మరియు డై సోడియం ఈథనైడు ఏర్పరుస్తుంది.
ఈ చర్య ఎసిటిలీన్ యొక్క ఆమ్ల ధర్మాన్ని వివరిస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + Na \xrightarrow{NH_3} HC{\equiv}C^-Na^+ + \frac{1}{2}H_2} \) (మోనోసోడియమ్ ఈథనైడ్)
\( \mathrm{HC{\equiv}C^-Na^+ + Na \xrightarrow{NH_3} Na^+C^-{\equiv}C^-Na^+ + \frac{1}{2}H_2} \) (డైసోడియమ్ ఈథనైడ్)
b) ఎసిటిలీన్ను క్రోమిక్ ఆమ్లం ఎసిటిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + [O] + H_2O \xrightarrow{chromic\ acid} CH_3COOH} \) (ఎసిటిక్ ఆమ్లం)

Exam Tips:

a) Na/NH₃ చర్య ఎసిటిలీన్ ఆమ్ల ధర్మాన్ని (టెర్మినల్ ≡C–H) చూపిస్తుంది.
b) క్రోమిక్ ఆమ్లం ఎసిటిలీన్ ను ఎసిటిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది; సమీకరణాల్లో [O] చూపండి.

 

Question 11: కర్బన ద్రవాలను శుద్ధి చేసే ప్రక్రియలు – స్ఫటికీకరణం, ఉత్పతనాలను వివరించండి.

Answer:

స్ఫటికీకరణం : మలిన పదార్థాన్ని అది కరిగే ద్రావణిలో దాని బాష్పీభవన స్థానం దగ్గర కరిగించి మరిగించి సంతృప్త ద్రావణాన్ని తయారుచేసి ఆ గాఢ ద్రావణాన్ని చల్లార్చి పరిశుద్ధమైన సమ్మేళనాన్ని దాని స్ఫటిక రూపంలో పొందే ప్రక్రియను స్ఫటికీకరణం అంటారు.
ఈ పద్ధతిని ఘన సమ్మేళనాలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఇవ్వబడిన మలిన ఘన సమ్మేళనాన్ని అది కరిగే ద్రావణిలో దాని బాష్పీభవన స్థానం దగ్గర కరిగించి దాదాపు సంతృప్త ద్రావణం వచ్చే వరకు మరిగించి వడపోయాలి.
ద్రావణాన్ని నెమ్మదిగా చల్లారిస్తే పరిశుద్ధ సమ్మేళనం స్ఫటికాల రూపంలో బయటకు వస్తుంది. కరిగిన మలినాలు ద్రావణంలో మిగిలిపోతాయి.
ఉత్పతనం : కొన్ని ఘనపదార్థాలను వేడిచేస్తే అవి ద్రవస్థితికి రాకుండా నేరుగా బాష్పస్థితికి చేరుకుంటాయి. మరల ఆ బాష్పాలను చల్లారిస్తే ద్రవస్థితిని పొందకుండా నేరుగా ఘనస్థితిని పొందుతాయి. దీనినే ఉత్పతనం అంటారు. ఉదా : అపరిశుద్ధ సమ్మేళనాన్ని ఒక వాచ్ గ్లాసుతో మూసి ఉన్న బీకరులో తీసుకొని ఒక ఎలక్ట్రిక్ ప్లేటు మీద పెట్టి వేడిచేస్తారు. సమ్మేళనం ఉత్పతనం చెంది వాచ్ గ్లాసు అడుగుభాగాన ఘనరూపంలో చేరుకుంటుంది. మలినాలు బీకరులోనే ఉండిపోతాయి.

Exam Tips:

a) ఉత్పతనం చెందే పదార్థాలకు ఉదాహరణలు: కర్పూరం, నాఫ్తలీన్, అయొడిన్, NH₄Cl.
b) స్ఫటికీకరణ ఘనపదార్థాలకు, ఉత్పతనం ఉత్పతనశీల ఘనపదార్థాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంగా రాయండి.

 

Question 12: సమ్మేళనాన్ని శుద్ధిచేసే ద్రావణ నిష్కర్షణాన్ని తెలపండి.

Answer:

ద్రావణ నిష్కర్షణ : ఒక కర్బన పదార్థం ‘X’ నీటిలో కరగని కర్బన ద్రావణిలో, నీటిలో కంటే అధికంగా కరుగుతుంది.
కాని నీటిలో కరిగి ఉన్న ఆ పదార్థపు జల ద్రావణాన్ని కర్బన ద్రావణిలో కలిపి కుదిపితే ‘X’ కర్బన ద్రావణిలోకి అధికంగా వెళ్ళిపోతుంది. కర్బన ద్రావణాన్ని వేరు చేసి స్వేదనం చేస్తే కర్బన ద్రావణి బాష్పరూపంలో కర్బన సమ్మేళనం నుంచి వేరవుతుంది. సమ్మేళనం స్వేదన కుప్పెలో ఉంటుంది.

Exam Tips:

a) కర్బన ద్రావణి నీటిలో కలవకూడదు; వేర్పాటు గరాటులో కుదిపి కర్బన పొరను వేరు చేసి స్వేదనం చేస్తారు.

 

Question 13: కర్బన సమ్మేళనంలోని ఫాస్ఫరస్, సల్ఫర్ల భారశాతాన్ని కనుక్కొనే విధానాలను తెలపండి.

Answer:

కర్బన సమ్మేళనంలోని ఫాస్ఫరస్ భారశాతం కనుక్కొనుట : ఫాస్ఫరస్ భారశాతాన్ని కనుక్కోవడానికి తెలిసిన ద్రవ్యరాశి గల కర్బన పదార్థాన్ని సధూమ నైట్రికామ్లంలో వేడి చేయాలి. ఫాస్ఫరస్ ఫాస్ఫారిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చెందుతుంది. ఈ ఆమ్లానికి అమ్మోనియా, అమ్మోనియం మోలిబేట్ ద్రావణాలు కలిపి అమ్మోనియం ఫాస్ఫోమోలిబ్డేట్ [(NH₄)₃PO₄·12MoO₃]గా అవక్షేపించాలి.
కర్బన సమ్మేళనం ద్రవ్యరాశి = mg
అమ్మోనియం ఫాస్ఫోమోలిబ్డేట్ = m₁g
(NH₄)₃PO₄·12MoO₃ అణు ద్రవ్యరాశి = 1877g
ఫాస్ఫరస్ భారశాతం \( = \frac{31 \times \mathrm{m}_1 \times 100}{1877 \times \mathrm{m}} \)
కర్బన సమ్మేళనంలోని సల్ఫర్ భారశాతం కనుక్కొనుట : కర్బన సమ్మేళనంలోని సల్ఫర్ భారశాతం కనుక్కోవడానికి తెలిసిన భారం గల కర్బన సమ్మేళనాన్ని సోడియం పెరాక్సైడ్ లేదా సధూమ నైట్రికామ్లంతో కేరియస్ నాళికలో వేడిచేస్తారు. సమ్మేళనంలోని సల్ఫర్ H₂SO₄ గా ఆక్సీకరణం చెందుతుంది. ఈ ఆమ్లానికి అధికంగా జల బేరియం క్లోరైడ్ ద్రావణం కలిపి బేరియం సల్ఫేట్గా అవక్షేపింప చేస్తారు. ఈ అవక్షేపాన్ని వడపోత ద్వారా వేరుచేసి, కడిగి, పొడి చేసి భారాన్ని కనుక్కొంటారు.
తీసుకున్న కర్బన పదార్ధ భారం = mg
ఏర్పడిన బేరియం సల్ఫేట్ భారం = m₁g
m₁, gల బేరియం సల్ఫేట్లోని సల్ఫర్ \( = \frac{32 \times m_1}{233} \) g (1 మోల్ BaSO₄ = 233 gm BaSO₄ = 32 gm సల్ఫర్)
సల్ఫర్ భారశాతం \( = \frac{32 \times \mathrm{m}_1 \times 100}{233 \times \mathrm{m}} \)

Exam Tips:

a) %P = 31 × m₁ × 100 / (1877 × m); %S = 32 × m₁ × 100 / (233 × m); అణు ద్రవ్యరాశులు (1877, 233) గుర్తుంచుకోండి.
b) P: సధూమ HNO₃ → H₃PO₄ → అమ్మోనియం ఫాస్ఫోమోలిబ్డేట్ అవక్షేపం; S: కేరియస్ పద్ధతి → BaSO₄ అవక్షేపం.

 

Question 14: ప్రోపీన్ HBr సంకలన చర్యను అయానిక చర్యాగతితో వివరించండి.

Answer:

ప్రోపీన్తో HBr సంకలనం చెంది మార్కొనికాఫ్ నియమము ప్రకారం 2-బ్రోమో ప్రోపెన్ను ఇస్తుంది. కాని బెంజాయిల్ పెరాక్సైడ్ సమక్షంలో ప్రోపీను HBrను కలిపితే 1-బ్రోమో ప్రోపేను ఏర్పడుతుంది. ఇక్కడ యాంటి మార్కొనికాఫ్ నియమము ప్రకారము సంకలనం జరుగుతుంది.
మార్కొనికాఫ్ నియమము : ఒక అసమకారకం ద్విబంధంలో సంకలనం చెందేటపుడు అసమకారకం రుణావేశ భాగం ద్విబంధంలో తక్కువ హైడ్రోజన్లున్న కార్బన్పై సంకలనం చెందుతుంది.
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \rightarrow CH_3{-}CHBr{-}CH_3} \) (2-బ్రోమో ప్రొపేన్)
చర్యావిధానము (ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్య):
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \rightarrow CH_3{-}\overset{+}{C}H{-}CH_3 + Br^-} \)
\( \mathrm{CH_3{-}\overset{+}{C}H{-}CH_3 + Br^- \rightarrow CH_3{-}CHBr{-}CH_3} \)
యాంటి మార్కొనికాఫ్ నియమము : ఒక అసమకారకం ద్విబంధంతో పెరాక్సైడ్ల సమక్షంలో సంకలనం చెందేటపుడు అసమకారకం రుణావేశ భాగం ద్విబంధంలో ఎక్కువ హైడ్రోజన్లున్న కార్బన్పై సంకలనం చెందుతుంది. దీనినే ఖరాష్ ప్రభావం అని కూడా అంటారు.
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \xrightarrow{benzoyl\ peroxide} CH_3{-}CH_2{-}CH_2{-}Br} \) (1-బ్రోమో ప్రొపేన్)
చర్యావిధానం (స్వేచ్ఛా ప్రాతిపదిక సంకలన చర్య) :
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + Br^{\bullet} \rightarrow CH_3{-}\dot{C}H{-}CH_2{-}Br} \)
\( \mathrm{CH_3{-}\dot{C}H{-}CH_2{-}Br + HBr \rightarrow CH_3{-}CH_2{-}CH_2{-}Br + Br^{\bullet}} \)

Exam Tips:

a) మార్కొనికాఫ్: HBr లోని H, ఎక్కువ హైడ్రోజన్లున్న కార్బన్ కు చేరుతుంది; కార్బోకేషన్ స్థిరత్వ క్రమం 3° > 2° > 1°.
b) పెరాక్సైడ్ సమక్షంలో విపరీత సంకలనం (ఖరాష్ ప్రభావం, HBr కు మాత్రమే) స్వేచ్ఛా ప్రాతిపదిక మార్గం.

 

Question 15: సోడియం ప్రోపనోయేట్ను సోడా లైమ్ వేడిచేస్తే ఏ ఉత్పన్నం ఏర్పడుతుంది?

Answer:

సోడియం ప్రోపనోయేట్ను సోడాలైమ్తో వేడిచేస్తే ఈథేన్ ఏర్పడుతుంది. సోడాలైమ్ అనగా NaOH + CaO మిశ్రమం.
\( \mathrm{CH_3CH_2COONa + NaOH \xrightarrow[\Delta]{CaO} C_2H_6 + Na_2CO_3} \) (ఈథేన్)

Exam Tips:

a) డీకార్బాక్సిలీకరణం: RCOONa + NaOH/CaO → R–H + Na₂CO₃; కార్బన్ల సంఖ్య ఒకటి తగ్గుతుంది (ప్రొపనోయేట్ → ఈథేన్).

 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

Question 1: హైడ్రోకార్బన్ల వర్గీకరణను వివరించండి.

Answer:

హైడ్రోకార్బన్ల వర్గీకరణ
హైడ్రోకార్బన్లు
1. అలిఫాటిక్ (అచక్రీయ) సమ్మేళనాలు
  (i) సంతృప్త సమ్మేళనాలు (ఆల్కేన్లు) – ఉదా: CH₃–CH₃ (ఈథేన్)
  (ii) అసంతృప్త సమ్మేళనాలు – ఆల్కీన్లు (ఉదా: CH₂=CH₂ ఈథీన్), ఆల్కైన్లు (ఉదా: CH≡CH ఈథైన్)
2. చక్రీయ (వలయ) సమ్మేళనాలు
  (i) కార్బోసైక్లిక్ సమ్మేళనాలు: ఎలిసైక్లిక్ (ఉదా: సైక్లోహెక్సేన్); ఎరోమాటిక్ – బెంజినాయిడ్ (ఉదా: బెంజీన్), నాన్‌బెంజినాయిడ్ (ఉదా: ట్రోపలోన్)
  (ii) హెటిరోసైక్లిక్ సమ్మేళనాలు (ఉదా: ఫ్యూరాన్, థయోఫీన్)

Exam Tips:

a) చార్ట్ రూపంలో అలిఫాటిక్/చక్రీయ → సంతృప్త/అసంతృప్త, కార్బోసైక్లిక్/హెటిరోసైక్లిక్ ఉప విభాగాలు, ప్రతిదానికి ఒక ఉదాహరణ రాయండి.

 

Question 2: కింది సమ్మేళనాల IUPAC నామాలు రాయండి. (a) CH₂ = CH – CH = CH₂
(b) CH₂ = CH – C ≡ C-CH₃
(c) CH₃CH = C(CH₃)₂
(d) \( \mathrm{C_6H_5{-}CH_2{-}CH_2{-}CH{=}CH_2} \)
(e)
\( \mathrm{CH_3{-}CH{=}CH{-}CH_2{-}CH{=}CH{-}CH(C_2H_5){-}CH_2{-}CH{=}CH_2} \)

Answer:

(a) 1, 3 – బ్యూటా డై ఈన్
(b) పెంట్ 1 – ఈన్ – 3 – ఐన్
(c) 2-మిథైల్-2-బ్యూటీన్
(d) 4-ఫినైల్ 1-బ్యూటీన్
(e) 4-ఈథైల్ డెకా 1, 5, 8 ట్రైఈన్

Exam Tips:

a) ప్రధాన శృంఖలంలో అన్ని ద్విబంధాలు/త్రిబంధాలు ఉండాలి; ఈన్, ఐన్ రెండూ ఉంటే సంఖ్యల మొత్తం తక్కువగా వచ్చేలా సంఖ్యలివ్వండి (పెంట్-1-ఈన్-3-ఐన్).
b) (e) లో ప్రతిక్షేపకం (ఈథైల్) స్థానం 4 అని, ద్విబంధాలు 1, 5, 8 అని సరిచూసుకోండి.

 

Question 3: ఈథేన్ ను తయారుచేసే రెండు పద్ధతులను, ఏవైనా ఈథేన్ మూడు చర్యలను రాయండి. (March 2013)

Answer:

ఈథేన్ ను తయారు చేయు పద్ధతులు:
1. ఆల్కైల్ హాలైడ్ల నుంచి : ఈథైల్ హాలైడ్లను Zn, సజల HCl సమక్షంలో క్షయకరణం చెందించి ఈథేన్ తయారుచేస్తారు.
\( \mathrm{CH_3CH_2Cl + H_2 \xrightarrow{Zn + HCl} CH_3{-}CH_3 + HCl} \) (ఈథైల్ క్లోరైడ్ → ఈథేన్)
2. ఉర్ట్ చర్య : మిథైల్ బ్రోమైడ్ను పొడి ఈథర్లో తీసుకుని సోడియంతో వేడిచేస్తే ఈథేన్ ఏర్పడుతుంది. ఈ చర్యనే ఉర్ట్ చర్య అంటారు.
\( \mathrm{CH_3Br + 2Na + BrCH_3 \xrightarrow{dry\ ether} CH_3{-}CH_3 + 2NaBr} \)
ఈథేన్ యొక్క ధర్మాలు : ఈథేన్ సాధారణంగా ప్రతిక్షేపణ చర్యలను జరుపుకుంటుంది. ఈ చర్యలలో ఒక పరమాణువు లేదా సమూహం ఇంకొక పరమాణువు లేదా సమూహంలో ప్రతిక్షేపించబడతాయి.
ఉదా:
1. హాలోజనీకరణం : ఈథేన్ ను UV కిరణాల సమక్షంలో Cl₂ తో చర్య జరిపిస్తే, ఈథేన్ని H పరమాణువులు Cl పరమాణువులతో ప్రతిక్షేపణం చెందుతాయి.
\( \mathrm{C_2H_6 \xrightarrow[Cl_2]{h\nu} C_2H_5Cl \xrightarrow[Cl_2]{h\nu} C_2H_4Cl_2 \xrightarrow[Cl_2]{h\nu} C_2H_3Cl_3 \xrightarrow[Cl_2]{h\nu} C_2H_2Cl_4 \xrightarrow[Cl_2]{h\nu} C_2HCl_5 \xrightarrow[Cl_2]{h\nu} C_2Cl_6} \) (ప్రతి దశలో HCl వెలువడుతుంది)
2. నైట్రేషన్ : ఈథేన్ 400°C వద్ద HNO₃ తో చర్య జరిపి నైట్రో ఈథేన్ను ఏర్పరచును. ఈ చర్యనే నైట్రేషన్ అంటారు.
\( \mathrm{C_2H_6 + HNO_3 \xrightarrow{\Delta} C_2H_5NO_2 + H_2O} \) (నైట్రో ఈథేన్)
3. దహనచర్య : గాలి లేదా డై ఆక్సిజన్ సమక్షంలో ఈథేన్ వేడిచేస్తే CO₂, H₂O లను ఏర్పరుస్తుంది. ఈ చర్యలో అధిక శక్తి విడుదలవుతుంది. ఈ చర్యను దహన చర్య అంటారు.
\( \mathrm{C_2H_6 + \frac{7}{2}O_2 \rightarrow 2CO_2 + 3H_2O} \) + శక్తి

Exam Tips:

a) ఈథేన్ తయారీకి రెండు పద్ధతులు (Zn/HCl క్షయకరణం, ఉర్ట్ చర్య 2CH₃Br + 2Na → C₂H₆ + 2NaBr) రాసి, మూడు చర్యలకు సమతుల్య సమీకరణాలివ్వండి.
b) దహనచర్యలో C₂H₆ + 7/2 O₂ → 2CO₂ + 3H₂O సమతుల్యం చేయడం మరువకండి.

 

Question 4: కింద ఇచ్చిన ఫార్ములాలు ఏర్పరచగలిగిన సాదృశ్యాలను రాసి వాటి నిర్మాణాలు, IUPAC పేర్లు రాయండి :
(a) C₄H₈ (ఒక ద్విబంధం)
(b) C₅H₈ (ఒక త్రిబంధం)
(c) C₅H₁₂ (బహుబంధాలు లేవు)

Answer:

(a) \( \mathrm{C_4H_8} \)
\( \mathrm{CH_2{=}CH{-}CH_2{-}CH_3} \) – 1-బ్యూటీన్
\( \mathrm{CH_3CH{=}CHCH_3} \) – 2-బ్యూటీన్
\( \mathrm{CH_2{=}C(CH_3){-}CH_3} \) – 2-మిథైల్ ప్రోపీన్
(b) \( \mathrm{C_5H_8} \)
\( \mathrm{HC{\equiv}C{-}CH_2{-}CH_2{-}CH_3} \) – 1-పెంటైన్
\( \mathrm{CH_3{-}C{\equiv}C{-}CH_2{-}CH_3} \) – 2-పెంటైన్
\( \mathrm{HC{\equiv}C{-}CH(CH_3){-}CH_3} \) – 3-మిథైల్ 1-బ్యూటైన్
(c) \( \mathrm{C_5H_{12}} \)
\( \mathrm{CH_3{-}CH_2{-}CH_2{-}CH_2{-}CH_3} \) – పెంటేన్
\( \mathrm{CH_3{-}CH(CH_3){-}CH_2{-}CH_3} \) – 2-మిథైల్ బ్యూటేన్
\( \mathrm{CH_3{-}C(CH_3)_2{-}CH_3} \) – 2,2-డై మిథైల్ ప్రోపేన్

Exam Tips:

a) C₄H₈ (ద్విబంధం), C₅H₈ (త్రిబంధం), C₅H₁₂ ప్రతిదానికి 3 సాదృశ్యాలు; నిర్మాణాలతో పాటు IUPAC పేర్లు రాయండి.
b) శృంఖల సాదృశ్యం, స్థాన సాదృశ్యం రకాలను గుర్తించి రాయండి.

 

Question 5: కింది హైడ్రోకార్బన్లు దహనచర్యలో జరిపే చర్యలను సమీకరణ రూపంలో రాయండి. (a) బ్యూటేన్
(b) పెంటీన్
(c) హెక్సెన్

Answer:

(a) బ్యూటేన్ దహనచర్య
\( \mathrm{C_4H_{10} + \frac{13}{2}O_2 \rightarrow 4CO_2 + 5H_2O} \) + శక్తి
(b) పెంటీన్ దహనచర్య
\( \mathrm{C_5H_{10} + \frac{15}{2}O_2 \rightarrow 5CO_2 + 5H_2O} \) + శక్తి
(c) హెక్సెన్ దహనచర్య
\( \mathrm{C_6H_{12} + 9O_2 \rightarrow 6CO_2 + 6H_2O} \) + శక్తి

Exam Tips:

a) ఆల్కేన్ CₙH₂ₙ₊₂ కు (3n+1)/2 O₂, ఆల్కీన్ CₙH₂ₙ కు 3n/2 O₂ అవసరం; హెక్సీన్ C₆H₁₂ (C₆H₁₀ కాదు).
b) ప్రతి సమీకరణంలో C, H, O పరమాణువుల సంఖ్యలను సరిచూడండి.

 

Question 6: ప్రోపీన్ HBr సంకలనం చెంది 2–బ్రోమో ప్రోపేన్ను ఇస్తుంది. అదే బెంజాయిల్పెరాక్సైడ్ సమక్షంలో 1–బ్రోమోప్రోపేన్ ఏర్పడుతుంది. చర్యాగతిని రాసి తేడాను వివరించండి.

Answer:

ప్రోపీన్ తో HBr సంకలనం చెంది మార్కొనికాఫ్ నియమము ప్రకారం 2-బ్రోమో ప్రోపేన్ను ఇస్తుంది. కాని బెంజాయిల్ పెరాక్సైడ్ సమక్షంలో ప్రోపీన్కు HBrను కలిపితే 1-బ్రోమో ప్రోపేన్ ఏర్పడుతుంది. ఇక్కడ యాంటి మార్కొనికాఫ్ నియమము ప్రకారము సంకలనం జరుగుతుంది.
మార్కొనికాఫ్ నియమము : ఒక అసమకారకం ద్విబంధంలో సంకలనం చెందేటపుడు అసమకారకం రుణావేశ భాగం ద్విబంధంలో తక్కువ హైడ్రోజన్లున్న కార్బన్పై సంకలనం చెందుతుంది.
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \rightarrow CH_3{-}CHBr{-}CH_3} \) (2-బ్రోమో ప్రొపేన్)
చర్యావిధానము (ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్య):
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \rightarrow CH_3{-}\overset{+}{C}H{-}CH_3 + Br^-} \)
\( \mathrm{CH_3{-}\overset{+}{C}H{-}CH_3 + Br^- \rightarrow CH_3{-}CHBr{-}CH_3} \)
యాంటి మార్కొనికాఫ్ నియమము : ఒక అసమకారకం ద్విబంధంతో పెరాక్సైడ్సమక్షంలో సంకలనం చెందేటపుడు అసమకారకం రుణావేశ భాగం ద్విబంధంలో ఎక్కువ హైడ్రోజన్లున్న కార్బన్పై సంకలనం చెందుతుంది. దీనినే ఖారాష్ ప్రభావం అని కూడా అంటారు.
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \xrightarrow{benzoyl\ peroxide} CH_3{-}CH_2{-}CH_2{-}Br} \) (1-బ్రోమో ప్రొపేన్)
చర్యావిధానం (స్వేచ్ఛా ప్రాతిపదిక సంకలన చర్య) :
\( \mathrm{C_6H_5^{\bullet} + HBr \rightarrow C_6H_6 + Br^{\bullet}} \)
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + Br^{\bullet} \rightarrow CH_3{-}\dot{C}H{-}CH_2{-}Br} \)
\( \mathrm{CH_3{-}\dot{C}H{-}CH_2{-}Br + HBr \rightarrow CH_3{-}CH_2{-}CH_2{-}Br + Br^{\bullet}} \)

Exam Tips:

a) ప్రోపీన్ + HBr → 2-బ్రోమో ప్రొపేన్ (అయానిక, మార్కొనికాఫ్); పెరాక్సైడ్ సమక్షంలో 1-బ్రోమో ప్రొపేన్ (స్వేచ్ఛా ప్రాతిపదిక); రెండు చర్యావిధానాలు విడివిడిగా రాయండి.

 

Question 7: ఇథిలీన్ తయారుచేయడానికి రెండు విధానాలు తెలపండి. ఇథిలీన్ కింది వాటితో ఏర్పరిచే ఉత్పన్నాల చర్యలను తెలపండి.
(a) ఓజోన్
(b) హైపోహాలస్ ఆమ్లం
(c) చల్లని విలీన క్షార KMnO₄
(d) అధిక పీడనం వద్ద O₂ తో వేడిచేయుట

Answer:

ఇథిలీన్ ను తయారుచేయు పద్ధతులు:
1. డీహైడ్రోహాలోజనీకరణం : ఇథైల్ హాలైడ్లను ఆల్కహాలిక్ KOH తో వేడిచేయగా ఇథిలీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{CH_3CH_2Br + KOH(alc.) \xrightarrow{\Delta} CH_2{=}CH_2 + KBr + H_2O} \)
2. ఇథైల్ ఆల్కహాల్ను గాఢ H₂SO₄ సమక్షంలో 170°C వద్ద వేడిచేస్తే ఇథిలీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{CH_3CH_2OH \xrightarrow[170^\circ C]{conc.\ H_2SO_4} CH_2{=}CH_2 + H_2O} \)
ఇథిలీన్ చర్యలు:
(a) ఓజోన్తో చర్య : ఇథిలీన్ ఓజోన్ తో చర్య జరిపి అస్థిరమైన ఇథిలీన్ ఓజోనైడ్ను ఏర్పరుస్తుంది. ఇది Zn/H₂O సమక్షంలో వియోగం చెంది ఫార్మాల్డిహైడు ఏర్పరుస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + O_3 \rightarrow} \) ఇథిలీన్ ఓజోనైడ్ \( \mathrm{\xrightarrow{Zn/H_2O} 2HCHO + H_2O_2} \) (ఫార్మాల్డిహైడ్)
(b) హైపోహాలస్ ఆమ్లంతో చర్య : ఇథిలీన్ HOCl తో చర్య జరిపి ఇథిలీన్ – క్లోరోహైడ్రిన్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + HOCl \rightarrow CH_2Cl{-}CH_2OH} \) (ఇథిలీన్ క్లోరోహైడ్రిన్)
(c) చల్లని, విలీన, క్షార KMnO₄ తో చర్య : ఇథిలీన్ KMnO₄ తో చర్య జరిపి ఇథిలీన్ గ్లైకాల్‌ను ఇస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + H_2O + [O] \xrightarrow{cold\ dil.\ alk.\ KMnO_4} CH_2OH{-}CH_2OH} \) (ఇథిలీన్ గ్లైకాల్)
(d) అధిక పీడనం వద్ద O₂తో చర్య : అధిక పీడనం వద్ద మరియు 200°C వద్ద ఇథిలీన్ O₂ తో చర్య జరిపిస్తే పాలిమరీకరణం జరుపుకొని పాలిథీన్ ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{nCH_2{=}CH_2 \xrightarrow[200^\circ C,\ 1500-2000\ atm]{O_2} (-CH_2{-}CH_2-)_n} \) (పాలిథీన్)

Exam Tips:

a) ఇథిలీన్ చర్యలు: O₃ → ఫార్మాల్డిహైడ్, HOCl → క్లోరోహైడ్రిన్, చల్లని విలీన క్షార KMnO₄ → ఇథిలీన్ గ్లైకాల్ (బేయర్ పరీక్ష), O₂/అధిక పీడనం → పాలిథీన్.
b) KMnO₄ ఊదా రంగు పోవడం అసంతృప్తతకు పరీక్ష అని ప్రస్తావించండి.

 

Question 8: కింది వాటితో ఇథిలీన్ చర్యలు రాయండి. సమీకరణాలు రాసి ఉత్పన్నాల పేర్లు రాయండి.
(a) హైడ్రోజన్ హాలైడ్
(b) హైడ్రోజన్
(c) బ్రోమీన్
(d) నీరు
(e) సిల్వర్ సమక్షంలో 200°C వద్ద ఆక్సిజన్తో చర్య

Answer:

ఇథిలీన్ – చర్యలు
(a) హైడ్రోజన్ హాలైడ్తో
చర్య: ఇథిలీన్ హైడ్రోజన్ హాలైడ్తో చర్యజరిపి ఇథైల్హాలైడ్లనిస్తుంది.
CH₂ = CH₂ + HX → CH₃ – CH₂X
ఉదా:
\( \mathrm{CH_2{=}CH_2 + HBr \rightarrow CH_3CH_2Br} \) (ఈథైల్ బ్రోమైడ్)
(b) హైడ్రోజన్తో చర్య : ఇథిలీన్ నికెల్ సమక్షంలో H₂ తో చర్యజరిపి ఈథేన్ ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + H_2 \xrightarrow{Ni} CH_3{-}CH_3} \) (ఈథేన్)
(c) బ్రోమీన్ చర్య : ఇథిలీన్ CCl₄ సమక్షంలో బ్రోమిన్తో చర్యజరిపి 1, 2 – డైబ్రోమో ఈథేన్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + Br_2 \xrightarrow{CCl_4} CH_2Br{-}CH_2Br} \) (1,2-డైబ్రోమో ఈథేన్)
(d) నీటితో చర్య ఇథిలీన్ ఆమ్లీకృత నీటితో చర్య జరిపి ఈథైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + H_2O \xrightarrow{dil.\ H_2SO_4} CH_3CH_2OH} \) (ఈథైల్ ఆల్కహాల్)
(e) సిల్వర్ సమక్షంలో 200°C O₂ తో చర్య : ఇథిలీన్ 200-400°C వద్ద సిల్వర్సమక్షంలో ఆక్సిజన్తో చర్య జరిపి ఇథిలీన్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + \frac{1}{2}O_2 \xrightarrow[200-400^\circ C]{Ag} C_2H_4O} \) (ఇథిలీన్ ఆక్సైడ్ – మూడు సభ్యుల ఈథర్ వలయం)

Exam Tips:

a) ఇథిలీన్ చర్యలన్నీ సంకలన చర్యలు; (d) లో ఆమ్ల ఉత్ప్రేరకం (విలీన H₂SO₄) అవసరం; (e) లో Ag, 200–400°C వద్ద ఇథిలీన్ ఆక్సైడ్ వస్తుంది.

 

Question 9: ‘A’ అను ఆల్కీన్ ఓజోనాలిసిస్ చర్యలో పాల్గొని ఇథనల్, పెంటేన్-3-ఓన్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. చర్యను రాసి, ఉత్పన్నాల, ఆల్కీన్ -Aల నిర్మాణాలు రాసి వాటి IUPAC పేరును తెల్పండి.

Answer:

\( \mathrm{CH_3CH{=}C(C_2H_5)_2 + O_3 \rightarrow} \) ఓజోనైడ్ \( \mathrm{\xrightarrow{Zn/H_2O} CH_3CHO + CH_3CH_2COCH_2CH_3} \)
ఆల్కీన్ (A) = \( \mathrm{CH_3CH{=}C(C_2H_5)_2} \); IUPAC నామం: 3-ఈథైల్ పెంట్-2-ఈన్; ఉత్పన్నాలు: అసిటాల్డిహైడ్, పెంటేన్-3-ఓన్

Exam Tips:

a) ఓజోనైడ్ ఉత్పన్నాల C=O లను ద్విబంధంగా కలిపి ఆల్కీన్ ను కనుగొనండి: CH₃CHO + C₂H₅COC₂H₅ → CH₃CH=C(C₂H₅)₂ (3-ఈథైల్ పెంట్-2-ఈన్).

 

Question 10: ‘A’ అనే ఆల్కీన్లో మూడు C – C ఎనిమిది C – H బంధాలు, ఒక C=C ద్విబంధం ఉన్నాయి. ఓజోనాలిసిస్ చర్యలో ‘A’ ఆల్కీన్ రెండు అణువుల ఆల్డిహైడ్
(అణుభారం 44)ను ఏర్పరుస్తుంది. ‘A’ యొక్క IUPAC పేరును రాయండి.

Answer:

\( \mathrm{CH_3{-}CH{=}CH{-}CH_3 + O_3 \rightarrow} \) ఓజోనైడ్ \( \mathrm{\xrightarrow{Zn/H_2O} 2CH_3CHO} \)
ఆల్కీన్ (A) = 2-బ్యూటీన్

Exam Tips:

a) అణుభారం 44 గల ఆల్డిహైడ్ CH₃CHO; రెండు అణువులు వస్తే ఆల్కీన్ సౌష్టవంగా ఉండే 2-బ్యూటీన్ (C₄H₈).
b) 3 C–C, 8 C–H, 1 C=C ఆధారంగా C₄H₈ అని నిర్ధారించండి.

 

Question 11: ఎసిటిలీన్ తయారుచేయడానికి రెండు పద్ధతులను తెలపండి. ఎసిటిలీన్ నీటితో, ఓజోన్ తో జరుపు చర్యలు రాయండి.

Answer:

ఎసిటిలీన్ తయారుచేయు పద్ధతులు:
1. కాల్షియంకార్బైడ్ నుండి : కాల్షియం కార్బైడు జలవిశ్లేషణ చేయుట ద్వారా పారిశ్రామికంగా ఎసిటిలీన్ ను తయారు చేయవచ్చు.
\( \mathrm{CaC_2 + 2H_2O \rightarrow HC{\equiv}CH + Ca(OH)_2} \)
2. అయొడీఫారం నుండి : అయొడీఫారంను సిల్వర్ పొడితో వేడిచేయగా ఎసిటిలీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{2CHI_3 + 6Ag \xrightarrow{\Delta} HC{\equiv}CH + 6AgI} \)
రసాయన ధర్మాలు:
1. నీటితో చర్య : ఎసిటిలీన్ HgSO₄ మరియు H₂SO₄ సమక్షంలో 60°C వద్ద నీటితో చర్య జరిపి అస్థిర వినైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. ఇది పునర్వ్యవస్థీకరణం చెంది అసిటాల్డిహైడ్ ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + H_2O \xrightarrow[60^\circ C]{HgSO_4/H_2SO_4} [CH_2{=}CH{-}OH] \rightarrow CH_3CHO} \) (వినైల్ ఆల్కహాల్ → అసిటాల్డిహైడ్)
2. ఓజోన్ చర్య : ఎసిటిలీన్ ఓజోన్ తో సంకలనం చెంది అస్థిర ఎసిటిలీన్ ఓజోనైడ్ను ఏర్పరుస్తుంది. ఇది Zn/H₂O సమక్షంలో వియోగం చెంది గైఆక్సాల్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + O_3 \rightarrow} \) ఎసిటిలీన్ ఓజోనైడ్ \( \mathrm{\xrightarrow{Zn/H_2O} (CHO)_2 + H_2O_2} \) (గ్లైఆక్సాల్)

Exam Tips:

a) CaC₂ + 2H₂O → C₂H₂ + Ca(OH)₂; 2CHI₃ + 6Ag → C₂H₂ + 6AgI.
b) నీటి సంకలనంలో వినైల్ ఆల్కహాల్ అస్థిరం కాబట్టి వెంటనే ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది.

 

Question 12: ఎసిటిలీన్ కిందివానితో ఏ విధంగా చర్య జరుపుతుంది? ఉత్పన్నాల పేర్లను రాసి చర్యలు రాయండి.
(a) ఎసిటిక్ ఆమ్లం
(b) నీరు
(c) హైడ్రోజన్
(d) హాలోజన్లు
(e) హైడ్రోజన్ హాలైడ్
(f) అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్, Cu₂Cl₂

Answer:

(a) ఎసిటిక్ ఆమ్లంతో చర్య : ఎసిటిలీన్, Hg⁺² అయాన్ల సమక్షంలో ఎసిటిక్ ఆమ్లంతో చర్య జరిపి మొదట వినైల్ ఎసిటేట్ ను తరువాత ఇథిలిడీన్ డైఎసిటేట్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + CH_3COOH \xrightarrow{Hg^{2+}} [CH_2{=}CH{-}OCOCH_3] \xrightarrow[CH_3COOH]{Hg^{2+}} CH_3{-}CH(OCOCH_3)_2} \)
(వినైల్ ఎసిటేట్; ఇథిలిడీన్ డై ఎసిటేట్)
(b) నీటితో చర్య : ఎసిటిలీన్ HgSO₄ మరియు H₂SO₄ సమక్షంలో 60°C వద్ద నీటితో చర్య జరిపి అస్థిర వినైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తుంది. ఇది పునర్వ్యవస్థీకరణం చెంది అసిటాల్డిహైడు ఏర్పరుస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + H_2O \xrightarrow[60^\circ C]{HgSO_4 + H_2SO_4} [CH_2{=}CH{-}OH] \rightarrow CH_3{-}CHO} \) (వినైల్ ఆల్కహాల్; ఎసిటాల్డిహైడ్)
(c) హైడ్రోజన్ చర్య : ఎసిటిలీన్ Ni ఉత్ప్రేరకం సమక్షంలో H₂ తో వేడిచేయగా సంకలనం చెంది మొదట ఇథిలీన్ ను తరువాత ఈథేన్ ను ఏర్పరుస్తుంది. ఈ చర్యను సెబాటియర్ – సెండరెన్స్ చర్య అంటారు.
\( \mathrm{HC{\equiv}CH + H_2 \xrightarrow[\Delta]{Ni} H_2C{=}CH_2 \xrightarrow[\Delta]{H_2/Ni} H_3C{-}CH_3} \) (ఇథిలీన్; ఈథేన్)
(d) హాలోజన్తో చర్య : ఎసిటిలీన్ క్లోరిన్తో సంకలన చర్య జరిపి మొదట 1, 2 – డైక్లోరో ఈథీన్‌ను తరువాత 1, 1, 2, 2 – టెట్రాక్లోరో ఈథేన్‌ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + Cl_2 \xrightarrow{CCl_4} CHCl{=}CHCl \xrightarrow{Cl_2/CCl_4} CHCl_2{-}CHCl_2} \)
(1,2-డైక్లోరో ఈథీన్; 1,1,2,2-టెట్రాక్లోరో ఈథేన్)
(e) హైడ్రోజన్ హాలైడ్తో చర్య : ఎసిటిలీన్ HCl తో చర్య జరిపి మొదట వినైల్ క్లోరైడ్ను ఆ తరువాత ఇథిలిడీన్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{HC{\equiv}CH + HCl \rightarrow CH_2{=}CHCl \xrightarrow{HCl} CH_3{-}CHCl_2} \) (వినైల్ క్లోరైడ్; ఇథిలిడీన్ క్లోరైడ్)
(f) అమ్మోనికల్ AgNO₃ మరియు Cu₂ Cl₂ తో చర్యలు :
ఎసిటిలీన్ వాయువును అమ్మోనికల్ AgNO₃ ద్రావణం గుండా పంపినపుడు, సిల్వర్ఎసిటిలైడ్ అవక్షేపం ఏర్పడుతుంది.
\( \mathrm{HC{\equiv}CH + 2AgNO_3 + 2NH_4OH \rightarrow AgC{\equiv}CAg + 2NH_4NO_3 + 2H_2O} \) (సిల్వర్ ఎసిటిలైడ్)
ఎసిటిలీన్ వాయువును అమ్మోనికల్ Cu₂Cl₂ ద్రావణం గుండా పంపినపుడు, క్యూప్రస్ఎసిటిలైడ్ అవక్షేపం ఏర్పడుతుంది.
\( \mathrm{HC{\equiv}CH + Cu_2Cl_2 + 2NH_4OH \rightarrow Cu{-}C{\equiv}C{-}Cu + 2NH_4Cl + 2H_2O} \) (క్యూప్రస్ ఎసిటిలైడ్)

Exam Tips:

a) టెర్మినల్ ఆల్కైన్ (HC≡C–) మాత్రమే అమ్మోనికల్ AgNO₃ / Cu₂Cl₂ తో అవక్షేపం ఇస్తుంది.
b) Ni తో హైడ్రోజనీకరణాన్ని సెబాటియర్–సెండరెన్స్ చర్య అంటారు; హాలోజన్ సంకలనం రెండు దశల్లో జరుగుతుంది.

 

Question 13: బెంజీన్ను తయారుచేసే ఏవైనా రెండు పద్ధతులను రాసి వాటి సమీకరణాలు రాయండి. బెంజీన్ ఆల్కీన్ లక్షణాలను చూపించదు – ఎందుకని? బెంజీన్ నుంచి మీథైల్ బెంజీన్ ను ఎలా తయారుచేస్తారు?

Answer:

బెంజీన్ ను తయారు చేయు పద్ధతులు
(a) డీ కార్బాక్సిలీకరణం : సోడియం బెంజోయేట్ను సోడాలైమ్ (NaOH + CaO) తో వేడిచేయగా బెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C_6H_5COONa + NaOH \xrightarrow[\Delta]{CaO} C_6H_6 + Na_2CO_3} \) (సోడియం బెంజోయేట్ → బెంజీన్)
(b) ఫినోల్ క్షయకరణం : ఫినోల్ను జింక్ పొడితో వేడిచేయగా అది క్షయకరణం చెంది బెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C_6H_5OH + Zn \xrightarrow{\Delta} C_6H_6 + ZnO} \)
బెంజీన్ అణుఫార్ములా ఆల్కీన్ల వలె అసంతృప్తను తెలియచేసినప్పటికి, ఇది అత్యంత స్థిరంగా ఉంటూ సంకలన చర్యల కంటే ప్రతిక్షేపణ చర్యలను ఎక్కువగా జరుపుతుంది. కారణం
1. బెంజీన్లోని π – ఎలక్ట్రాన్లు అస్థానీకృతం చెందుతాయి.
2. బెంజీన్ కున్న అధిక రెజోనెన్స్ శక్తి వలన దానికి అధిక స్థిరత్వం వస్తుంది. కావున ఇది ఆల్కీన్ల వలె ప్రవర్తించదు.
(c) బెంజీన్ నుంచి మిథైల్ బెంజీన్ ను తయారు చేయుట : బెంజీన్ అనార్ద్ర AlCl₃ సమక్షంలో మిథైల్ క్లోరైడ్తో చర్య జరిపి మిథైల్ బెంజీన్ లేక టోలిన్ ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{C_6H_6 + CH_3Cl \xrightarrow{anhyd.\ AlCl_3} C_6H_5{-}CH_3 + HCl} \) (మిథైల్ బెంజీన్)

Exam Tips:

a) బెంజీన్ అసంతృప్తమైనా సంకలనానికి బదులు ప్రతిక్షేపణ చూపుతుంది: కారణం π ఎలక్ట్రాన్ల అస్థానీకరణ, అధిక రెజోనెన్స్ శక్తి.
b) తయారీ పద్ధతులు: సోడియం బెంజోయేట్ డీకార్బాక్సిలీకరణం, ఫినోల్ + Zn.

 

Question 14: ఎసిటిలీన్ నుంచి బెంజీన్ ఎట్లా ఏర్పడుతుంది? సమీకరణం రాయండి. బెంజీన్యొక్క హాలోజినేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ చర్యలను వివరించండి.

Answer:

ఎసిటిలీన్ నుండి బెంజీన్ ను తయారు చేయుట : ఎసిటిలీన్ వాయువును ఎర్రగా కాలుచున్న కాపర్ గొట్టాల గుండా పంపినపుడు అది పాలిమరీకరణ చెంది బెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{3C_2H_2 \xrightarrow[600^\circ C]{Cu} C_6H_6} \) (బెంజీన్)
బెంజీన్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు :
1. హాలోజినేషన్ (హాలోజనీకరణం) : బెంజీన్ను FeCl₃ సమక్షంలో క్లోరిన్తో చర్య జరపగా క్లోరో బెంజీన్ ఏర్పడుతుంది..
\( \mathrm{C_6H_6 + Cl_2 \xrightarrow[25^\circ C]{FeCl_3} C_6H_5Cl + HCl} \) (క్లోరోబెంజీన్)
2. ఆల్కైలేషన్ (ఆల్కైనీకరణం) : బెంజీన్ AlCl₃ సమక్షంలో ఆల్కైల్ హాలైడ్లతో చర్య జరిపి ఆల్కైల్ బెంజీన్ ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{C_6H_6 + CH_3Cl \xrightarrow{AlCl_3} C_6H_5CH_3 + HCl} \) (మిథైల్ బెంజీన్)
3. ఎసైలేషన్ : బెంజీన్, AlCl₃ సమక్షంలో ఎసైల్ క్లోరైడ్తో చర్య జరిపి ఎసైల్ బెంజీన్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{C_6H_6 + CH_3COCl \xrightarrow{AlCl_3} C_6H_5COCH_3 + HCl} \) (ఎసిటైల్ క్లోరైడ్; ఎసిటోఫినోన్)
4. నైట్రేషన్ (నైట్రోకరణం) : బెంజీన్ ను నైట్రేషన్ మిశ్రమంతో (గాఢ HNO₃ + గాఢ H₂SO₄) 60°C కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చర్య జరుపగా నైట్రో బెంజీన్ ఏర్పడుతుంది.
\( \mathrm{C_6H_6 \xrightarrow[<60^\circ C]{conc.\ HNO_3 + conc.\ H_2SO_4} C_6H_5NO_2 + H_2O} \) (నైట్రోబెంజీన్)
5. సల్ఫోనేషన్ (సల్ఫోనీకరణం): బెంజీన్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి బెంజీన్సల్ఫోనిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది.
\( \mathrm{C_6H_6 + H_2SO_4 \rightarrow C_6H_5SO_3H + H_2O} \) (బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లం)

Exam Tips:

a) ఎలక్ట్రోఫైల్స్: Cl⁺ (FeCl₃), R⁺ (AlCl₃), RCO⁺ (AlCl₃), NO₂⁺ (నైట్రేషన్ మిశ్రమం), SO₃ (H₂SO₄).
b) 3C₂H₂ → C₆H₆ (ఎర్రగా కాలే గొట్టంలో) సమీకరణం మరువకండి.

 

Question 15: నిర్మాణ సాదృశ్యాలు, త్రిమితీయ సాదృశ్యాల మధ్య తేడాలు వివరించండి.

Answer:

నిర్మాణాత్మక సాదృశ్యము:
1. అణువులోని పరమాణువుల లేదా సమూహాల అమరికలో తేడా వలన నిర్మాణాత్మక సాదృశ్యము ఏర్పడుతుంది. ఈ సాదృశ్యములకు ఒకే అణు ఫార్ములా ఉండి వేరు వేరు నిర్మాణాత్మక ఫార్ములాలు ఉంటాయి.
2. శృంఖల సాదృశ్యం, స్థానసాదృశ్యం, వలయశృంఖల సాదృశ్యం, ప్రమేయ సమూహ సాదృశ్యం, మెటామెరిజం, టాటామెరిజం మొదలగునవి నిర్మాణాత్మక సాదృశ్య రకానికి చెందినవి.
3. ఇవి ద్విమితీయంగా ఉంటాయి.
త్రిమితీయ సాదృశ్యము:
1. ఒకే అణుఫార్ములా మరియు నిర్మాణాత్మక ఫార్ములా కలిగి ఉండి, త్రిమితీయంగా పరమాణువులు లేదా గ్రూపుల ప్రాదేశిక అమరికలో భేదం వలన వచ్చు సాదృశ్యమును త్రిమితీయ సాదృశ్యము అంటారు.
2. క్షేత్ర సాదృశ్యము, దృక్ సాదృశ్యము, అనురూపక సాదృశ్యము మొదలగునవి త్రిమితీయ సాదృశ్య రకానికి చెందినవి.
3. ఇవి త్రిమితీయంగా ఉంటాయి.

Exam Tips:

a) రెండు సాదృశ్య రకాలను పట్టికలో పోల్చండి: నిర్మాణాత్మక (ద్విమితీయ, ఫార్ములా ఒకటి, నిర్మాణం వేరు) – త్రిమితీయ (నిర్మాణం ఒకటే, ప్రాదేశిక అమరిక వేరు).

 

Question 16: సరళ శృంఖలాలు అనురూపత, విన్యాసంలందు తేడా ఏమిటి?

Answer:

అనురూపత లేదా అనురూపక సాదృశ్యాలు:
1. ఇవి త్రిమితీయ సాదృశ్యాలు. ఒక రూపం నుండి మరొక రూపంలోనికి C – C బంధాల భ్రమణం వలన మార్పు చెందుతాయి. ఇవి ఒకదానితో ఒకటి గతిక సమతాస్థితిలో ఉంటాయి.
2. సాధారణ పరిస్థితులలో వీటిని వేరు చేయలేము.
ఉదా : ఈథేన్ యొక్క E and S నిర్మాణాలు

విన్యాసం లేదా విన్యాస సాదృశ్యాలు:
1. ఇవి కూడా త్రిమితీయ సాదృశ్యాలు. ఇవి స్థిరమైనవి. ఇవి ఒక రూపం నుండి వేరొక రూపంలోకి మార్పు చెందవు.
2. ఒక రూపం నుండి వేరొక రూపంలోనికి మార్పు చెందుటకు బంధాలు విడిపోయి కలవవలెను. ఇవి రెండు రకాలు.
1. క్షేత్ర సాదృశ్యాలు : ఈ సాదృశ్యాలలో ద్విబంధంతో బంధించబడి ఉన్న కార్బన్పరమాణువుల చుట్టూ ఉన్న పరమాణువుల లేక గ్రూపుల అమరికలో తేడా ఉంటుంది.
ఉదా : సిస్ 2-బ్యూటీన్ మరియు ట్రాన్స్ 2-బ్యూటీన్

2. దృశా సాదృశ్యాలు (ఆప్టికల్ ఐసోమర్లు) : ఈ సాదృశ్యాలలో అణువులోని కార్బన్పరమాణువును అతకబడిన నాలుగు విభిన్న పరమాణువుల లేక రాడికల్స్ ప్రాదేశిక అమరికలో తేడా ఉంటుంది.

Exam Tips:

a) అనురూపకాలు C–C బంధ భ్రమణంతో మారతాయి, వేరు చేయలేము; విన్యాస సాదృశ్యాలు బంధాలు తెగితేనే మారతాయి, వేరు చేయవచ్చు.

 

Question 17: క్షేత్ర సాదృశ్యం అంటే ఏమిటి? 2-బ్యూటీన్ క్షేత్ర సాదృశ్యాలను రాయండి.

Answer:

ద్విబంధంతో బంధింపబడి ఉన్న కార్బన్ పరమాణువుల చుట్టూ ఆవరించి ఉన్న పరమాణువుల లేక గ్రూపుల అమరికలో తేడా వలన ఏర్పడే సాదృశ్యాన్ని క్షేత్ర సాదృశ్యం అంటారు.
ఉదా : 2-బ్యూటీన్కు క్రింది క్షేత్ర సాదృశ్యాలు ఉన్నాయి.

ఒకే రకమైన సమూహాలు ద్విబంధానికి ఒకే వైపున బంధాలేర్పరచి ఉంటే ఆ సాదృశ్యమును సిస్ సాదృశ్యమని, ఒకే రకమైన సమూహాలు ద్విబంధానికి వ్యతిరేకదిశలో బంధాలు ఏర్పరచి ఉంటే ట్రాన్స్ సాదృశ్యమని అంటారు.

Exam Tips:

a) క్షేత్ర సాదృశ్యానికి ద్విబంధంలోని ప్రతి కార్బన్ కు రెండు వేర్వేరు గ్రూపులు ఉండాలి; ఒకే వైపు = సిస్, వ్యతిరేక వైపు = ట్రాన్స్.

 

Question 18: E-Z విన్యాసాలను గుర్తించే పద్ధతిని తెలిపి, CHCl = CFBr అణువుకు క్షేత్ర
సాదృశ్యాలను రాయండి.

Answer:

ఈ పద్ధతి పరమాణు సంఖ్యల విలువలపై ఆధారపడి ఉంటుంది. ద్విబంధ కార్బన్లలో ప్రతి ఒక్క కార్బన్ పై ఉన్న రెండు పరమాణువులలో అధిక పరమాణు సంఖ్య గల పరమాణువును గుర్తిస్తారు. ఆ రెండు పరమాణువులు ద్విబంధానికి ఒకే వైపున ఉంటే దానిని ‘Z’ విన్యాసం అనీ, వ్యతిరేక వైపులా ఉంటే దానిని ‘E’ విన్యాసం అని అంటారు.
ఉదా : CHCl = CFBr
Z – విన్యాసం: అధిక పరమాణు సంఖ్య గల Cl, Br లు ద్విబంధానికి ఒకే వైపు ఉన్నాయి.
E – విన్యాసం: అధిక పరమాణు సంఖ్య గల Cl, Br లు ద్విబంధానికి వ్యతిరేక వైపులా ఉన్నాయి.

Exam Tips:

a) ప్రతి ద్విబంధ కార్బన్ పై అధిక పరమాణు సంఖ్య గల పరమాణువును గుర్తించండి (CHCl లో Cl; CFBr లో Br); ఒకే వైపు = Z, వ్యతిరేక వైపు = E.

 

Question 19: ఒక ఆల్కీన్లో ద్విబంధం వద్ద ఉన్న కార్బన్లపై Cl, Br, –CH₂CH₂OH, –CH(CH₃)₂ సమూహాలుంటే దాని E, Z విన్యాసాలు రాయండి.

Answer:

E – విన్యాసం: అధిక ప్రాధాన్య గ్రూపులు (Br, –CH(CH₃)₂) ద్విబంధానికి వ్యతిరేక వైపులా ఉన్నాయి.
Z – విన్యాసం: అధిక ప్రాధాన్య గ్రూపులు (Br, –CH(CH₃)₂) ద్విబంధానికి ఒకే వైపు ఉన్నాయి.

Exam Tips:

a) కాన్–ఇంగోల్డ్–ప్రిలాగ్ ప్రాధాన్యం: Br > Cl; –CH(CH₃)₂ (C,C,H) > –CH₂CH₂OH (C,H,H); ఈ ప్రాధాన్యాల ఆధారంగా E, Z తేల్చండి.

 

Question 20: కింది వాటిని వివరించండి.
(a) స్వేదనం
(b) అంశిక స్వేదనం
(c) తక్కువ పీడనంలో స్వేదనం
(d) జలబాష్ప స్వేదనం

Answer:

(a) స్వేదనం : ఈ పద్ధతి
1) బాష్పశీల ద్రవాల నుంచి అబాష్పశీల మలినాలను వేరుచేయడానికి
2) బాష్పీభవన స్థానాలలో సరిపడ తేడా ఉన్న ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగిస్తారు.
విభిన్న బాష్పీభవన స్థానాలు ఉన్న ద్రవాలు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద పూర్తిగా బాష్పాలుగా మారతాయి. ఈ బాష్పాలను చల్లబరిస్తే ఏర్పడే ద్రవాలను వేరుగా సంగ్రహించవచ్చు.
ఉదా : క్లోరోఫారం (బాష్పీభవన స్థానం 334K) మరియు ఎనిలీన్ (బాష్పీభవన స్థానం 457K) మిశ్రమాన్ని స్వేదన పద్ధతిలో వేరుచేస్తారు.
(b) పాక్షిక అంశిక స్వేదనం : మిశ్రమంలోని రెండు ద్రవాల బాష్పీభవన స్థానాలలో తేడా తక్కువగా ఉన్నప్పుడు వీటి బాష్పాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఏర్పడి ఒకేసారి ద్రవీకరణం చెందుతాయి. ఈ ద్రవాలను వేరు చేయడానికి పాక్షిక అంశిక స్వేదనాన్ని ఉపయోగిస్తారు.
ఈ పద్ధతిలో ద్రవాల మిశ్రమ బాష్పాలను ద్రవీకరణానికి ముందు అంశీకరణ నాళిక ద్వారా పంపించాలి. అంశిక నాళికను స్వేదన కుప్పె మూతికి బిగించాలి. ఇక్కడ ముఖ్య సూత్రం మిశ్రమ బాష్పాలు పొడవాటి అంశిక నాళికలో ప్రయోగించినపుడు ఎక్కువ బాష్పీభవన స్థానం ఉన్న ద్రవపు బాష్పం ముందుగా చల్లబడి ద్రవీకరణం చెంది స్వేదన కుప్పెలో చేరగా, తక్కువ బాష్పీభవన స్థానం ఉన్న ద్రవపు బాష్పం కండెన్సర్ ద్వారా ప్రయాణించి చల్లబడి ద్రవీకరణం చెంది సంగ్రహణ పాత్రను చేరుతుంది.
(c) తక్కువ పీడనంలో స్వేదనం : ఈ విధానం అధిక బాష్పీభవన స్థానాలున్న ద్రవాల్ని లేదా బాష్పీభవన స్థానాల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్దనే వియోగం చెందే ద్రవాల్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. బాష్పపీడనం తగ్గిస్తే ద్రవం తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఎటువంటి వియోగమూ చెందకుండా బాష్పీభవనం చెందుతుంది. వచ్చిన బాష్పాల్ని చల్లబరచి పరిశుద్ధ ద్రవాన్ని పొందవచ్చు.
మలినాలు స్వేదనం కుప్పెలో మిగులుతాయి.
ఉదా : గ్లిసరాలు సబ్బు పరిశ్రమలో ఉపయోగించిన గాఢ క్షార ద్రావణం నుంచి ఈ పద్ధతిలో వేరు చేయవచ్చు.
(d) జలబాష్ప స్వేదనం : ఈ పద్ధతిలో నీటిలో కరగని, జలబాష్పంతో బాష్పశీలత పొందే ద్రవాల్ని శుద్ధి చేస్తారు. ఈ విధానంలో వేడి మలిన ద్రవంలోకి నీటి ఆవిరిని పంపిస్తారు. ఈ నీటి ఆవిరి ద్రవబాష్పం రెండూ కండెన్సర్ ద్వారా ప్రయాణించి ద్రవ మిశ్రమమై సంగ్రహణ పాత్రలో చేరతాయి. అవి ఒకదానితో ఒకటి కలిసిపోవు. కాబట్టి వేర్పాటు గరాటుతో నీటి నుంచి పదార్థాన్ని వేరుచేయవచ్చు.
ఉదా : ఈ పద్ధతిలో ఎనిలీన్ ను ఎనిలీన్-నీరు మిశ్రమం నుంచి వేరు చేయవచ్చు.

Exam Tips:

a) సాధారణ స్వేదనం: బా.స్థాన తేడా ఎక్కువ; అంశిక స్వేదనం: తేడా తక్కువ; తగ్గిన పీడనం: వియోగం చెందే ద్రవాలు (గ్లిసరాల్); జలబాష్ప స్వేదనం: నీటిలో కలవని ద్రవాలు (ఎనిలీన్).

 

Question 21: క్రోమటోగ్రఫీని విశదీకరించండి.

Answer:

ఒక మిశ్రమంలోని అనుఘటకాలను స్థిరప్రావస్థ, చలనశీల ప్రావస్థ అనే రెండు ప్రావస్థల మధ్య వేరు పరిచే విధానాన్ని క్రోమటోగ్రఫీ అంటారు.
క్రోమటోగ్రఫీలో క్రింది మూడు దశలు ఇమిడి ఉంటాయి.
1. స్థిర ప్రావస్థ మిశ్రమంలోని అనుఘటకాలను శోషించుకుని స్థిరంగా పట్టి ఉంచుతుంది. చలన శీల ప్రావస్థ ఆ అధిశోషించుకోబడిన అనుఘటకాలను వేరు పరచి స్థిర ప్రావస్థపై విభిన్న దూరాలకు తీసుకుపోతుంది.
2. పై విధంగా వేరు పరచబడిన అనుఘటకాలను చలనశీల ప్రావస్థను ఆపకుండా పంపి తిరిగి పొందడం. దీనిని నిక్షాళన అంటారు.
3. గుణాత్మక, పరిమాణాత్మక విశ్లేషణల ద్వారా నిక్షాళనం చేసి సాధించిన సమ్మేళనాలను తెలుసుకోవడం. అధిశోషణి, చలనశీల ప్రావస్థల భౌతిక స్థితులపై ఆధారపడి క్రోమటోగ్రఫీ పద్ధతులు అనేక రకాలుగా వర్గీకరింపబడ్డాయి.

క్రోమటోగ్రఫీ పద్ధతిస్థిర ప్రావస్థచలనశీల ప్రావస్థ
1. కాలమ్ క్రోమటోగ్రఫీఘనంద్రవం
2. ద్రవ – ద్రవ వితరణ క్రోమటోగ్రఫీద్రవంద్రవం
3. పేపర్ క్రోమటోగ్రఫీద్రవంద్రవం
4. పలుచని పొర క్రోమటోగ్రఫీద్రవం లేక ఘనంద్రవం
5. వాయు – ద్రవం క్రోమటోగ్రఫీద్రవంవాయువు
6. వాయు – ఘనం క్రోమటోగ్రఫీఘనంవాయువు
7. అయాన్ వినిమయ క్రోమటోగ్రఫీఘనంద్రవం

సాధారణ క్రోమటోగ్రఫీలో రెండు పద్ధతులు ఉన్నాయి. అవి
1. అధిశోషణ క్రోమటోగ్రఫీ
2. వితరణ క్రోమటోగ్రఫీ
అధిశోషణ క్రోమటోగ్రఫీ మరల రెండు రకాలు. అవి 1. కాలమ్ క్రోమటోగ్రఫీ
2. పలుచనిపొర క్రోమటోగ్రఫీ.

Exam Tips:

a) క్రోమటోగ్రఫీ = స్థిర, చలనశీల ప్రావస్థల మధ్య విభజన; అధిశోషణ (కాలమ్, TLC), వితరణ (పేపర్) రకాలను పట్టికతో చూపండి.

 

Question 22: కింది వాటిని వివరించండి:
(a) కాలమ్ క్రోమటోగ్రఫీ
(b) పలచని పొర క్రోమటోగ్రఫీ
(c) వితరణ క్రోమటోగ్రఫీ

Answer:

(a) కాలమ్ క్రోమటోగ్రఫీ : దీనిలో స్టాప్ కాక్ అమరిక గల ఒక గాజు గొట్టంలో నింపి ఉన్న అధిశోషకం (స్థిరప్రావస్థ)పై భాగాన అనుఘటకాల మిశ్రమాన్ని ఉంచాలి. సరియైన నిక్షాలకాన్ని కాలమ్ పై నుండి కిందికి నెమ్మదిగా ప్రవహింపచేయాలి. అప్పుడు మిశ్రమంలోని అనుఘటకాలు విభిన్న అవధులలో అధిశోషణం చెంది వేరు అవుతాయి.

(b) పలచని పొర క్రోమటోగ్రఫీ : ఈ పద్ధతిలో అధిశోషకంగా వాడే సిలికాజెల్ను లేక అల్యూమినాను ఒక గాజు ప్లేటుపై పలుచని పొరగా పూత పూస్తారు. దీనిని TLC ప్లేట్ అంటారు. అనుఘటకాలను కలిగి ఉన్న మిశ్రమ ద్రావణాన్ని TLC ప్లేట్ కింది నుండి 2 లేక 3 సెం.మీ. దూరంలో ఒక చిన్న చుక్కగా ఉంచుతారు. ఈ ప్లేటును నిక్షాలకం కలిగి ఉన్న మూసిన పాత్రలో ఉంచుతారు. నిక్షాలకం పైకి ప్రవహిస్తూ తనతో పాటు మిశ్రమంలోని అనుఘటకాలను తీసికొని పోతుంది. కాని అనుఘటకాల అధిశోషణ అవధులపై ఆధారపడి అవి వివిధ దూరాలు ప్రయాణించి వేరువేరు చోట్ల అధిశోషితం అవుతాయి.
ఒక అనుఘటకం సాపేక్ష అధిశోషణం దాని మందన గుణకం Rf తో తెలుపుతారు.
Rf = (అనుఘటకం ఆధారపీఠ గీత నుండి ప్రయాణించిన దూరం) ÷ (ద్రావణి ఆధారపీఠ గీత నుండి ప్రయాణించిన దూరం)
ఈ పద్ధతి ద్వారా రంగులున్న అనుఘటకాలను తేలికగా గుర్తిస్తారు. రంగులేని వాటిని వాటి ప్రతిదీప్తి ధర్మం ఆధారంగా చేసుకొని UV కిరణాలను ఉపయోగించి గుర్తిస్తారు.
(c) వితరణ క్రోమటోగ్రఫీ : దీనిలో క్రోమటోగ్రఫీ పేపర్ను తీసికొని నీటిని దానిలో ఉంచుతారు. ఈ నీరు స్థిర ప్రావస్థగా పనిచేస్తుంది. ఈ పేపర్ ఆధారపీఠ గీతపై అనుఘటకాల మిశ్రమ ద్రావణాన్ని చుక్కగా పెట్టి దానిని సరియైన ద్రావణిలో వ్రేలాడదీస్తారు. ద్రావణి చలనశీల ప్రావస్థగా పనిచేస్తుంది. ద్రావణి, పేపర్ పైకి ప్రయాణించి మిశ్రమ బొట్టు మీదుగా పోతుంది. అప్పుడు పేపరు విభిన్న అనుఘటకాలను ప్రత్యేకంగా తనపై నిలుపుకొంటుంది. అనుఘటకాలు వాటి అభిలాక్షణిక ధర్మాలపై ఆధారపడి స్థిర ప్రావస్థ చలన శీల ప్రావస్థల మధ్య వేర్వేరుగా వితరణ చెందుతాయి. విడగొట్టబడిన రంగుల అనుఘటకాల చుక్కలను పేపరుపై గుర్తించవచ్చు. రంగులేని అనుఘటకాలను ఇతర కారకాలను చల్లడం వంటి ప్రయత్నాల ద్వారా గుర్తించవచ్చు.

Exam Tips:

a) Rf = అనుఘటకం ప్రయాణించిన దూరం ÷ ద్రావణి ప్రయాణించిన దూరం (విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ).
b) పేపర్ క్రోమటోగ్రఫీలో నీరు స్థిర ప్రావస్థ, ద్రావణి చలనశీల ప్రావస్థ.

 

Question 23: కర్బన సమ్మేళనంలో ఉన్న నైట్రోజన్ భార శాతాన్ని కింది విధానాలలో కనుక్కొనే పద్ధతిని రాయండి.
(a) డ్యూమాస్ పద్ధతి
(b) జెల్దాల్ పద్ధతి

Answer:

1. డ్యూమాస్ పద్ధతి : ఈ పద్ధతిలో తెలిసిన భారం ఉన్న కర్బన పదార్థానికి ముతక CuO కలిపి బాగా వేడి చేస్తారు. కార్బన్, హైడ్రోజన్లు CO₂, H₂O (ఆవిర్లు) గా ఆక్సీకరణం చెందుతాయి. నైట్రోజన్ N₂ వాయువుగా మారుతుంది. కొంత నైట్రోజన్ ఆక్సైడ్లుగా మారినా, ఆ ఆక్సైడ్లను వేడిగా ఉన్న కాపర్ జాలకం, N₂ వాయువుగా క్షయకరణం చెందిస్తుంది. ఉత్పన్న వాయువులను KOH ద్రావణం గుండా పంపుతారు. CO₂ వాయువు KOH ద్రావణంలో శోషణం చెందుతుంది. KOH ద్రావణంపై చేరుకున్న N₂ వాయువు ఘనపరిమాణాన్ని కొలుస్తారు.

గణన : గది ఉష్ణోగ్రత TK వద్ద a గ్రా.ల సమ్మేళనం V మి.లీ. N₂ వాయువును ఇచ్చినదని అనుకొనుము.
ప్రయోగ పరిస్థితులు
P₁ = (P – p) మి. మీ
ఇచ్చట p = నీటి ఆవిరి పీడనం
T₁ = TK
V₁ = V మి.లీ.
STP పరిస్థితులు
P₂ = 760 మి. మీ
T₂ = 273 K
V₂ = ?
T₁ = TK
V₁ = V మి.లీ.
\( \frac{P_1 V_1}{T_1} = \frac{\mathrm{P}_2 \mathrm{~V}_2}{\mathrm{~T}_2} \therefore V_2 = \frac{P_1 V_1 T_2}{P_2 T_1} = \frac{(\mathrm{P}-\mathrm{p}) \times \mathrm{V} \times 273}{760 \times \mathrm{T}} = x \) మి.లీ.
22400 మి.లీ. N₂ వాయువు STP వద్ద 28 గ్రా. బరువు కలిగి ఉంటుంది
∴ x మి.లీ. N₂ …….. ?
\( = \frac{x \times 28}{22400} \) గ్రా. N₂
‘a’ గ్రా.ల పదార్థంలో \( \mathrm{\frac{28 \times x}{22400}} \) గ్రా. N₂ ఉన్నది.
∴ 100 గ్రా.ల పదార్థంలో నైట్రోజన్ భారశాతం \( \mathrm{= \frac{100}{a} \times \frac{28 \times x}{22400}} \) %
2. జెల్దాల్ పద్ధతి : ఈ పద్ధతిలో తెలిసిన భారం గల కర్బన సమ్మేళనాన్ని CuSO₄ సమక్షంలో గాఢ H₂SO₄ తో వేడి చేస్తారు. అప్పుడు కర్బన సమ్మేళనంలోని నైట్రోజన్అంతా పరిమాణాత్మకంగా అమ్మోనియం సల్ఫేటుగా మారుతుంది. ప్రయోగ పాత్రలోని అనుఘటకాలను వేరే పాత్రలోనికి మార్చి అధిక NaOH ద్రావణంతో వేడి చేస్తారు. అమ్మోనియా వాయువు విడుదల అవుతుంది. ఈ అమ్మోనియా వాయువును తెలిసిన ఘ.ప. మరియు గాఢత గల అధిక గాఢ H₂SO₄ లోకి పంపి శోషణం చెందిస్తారు.

మిగిలిన ఆమ్లాన్ని ప్రమాణ క్షారంతో అంశమాపనం చేస్తారు. దీని నుండి అమ్మోనియాను తటస్థీకరించడానికి పట్టిన ఆమ్ల ప్రమాణాన్ని గణిస్తారు. దీని నుంచి ఎంత అమ్మోనియా ఏర్పడిందో గణించి దాని నుండి N₂ భారశాతాన్ని లెక్కిస్తారు. చర్యలు : కర్బన సమ్మేళనం + H₂SO₄ → (NH₄)₂SO₄
(NH₄)₂SO₄ + 2NaOH → Na₂SO₄ + 2H₂O + 2NH₃
2NH₃ + H₂SO₄ → (NH₄)₂SO₄
గణన : కర్బన సమ్మేళనం భారం = a గ్రా. మొదటిగా తీసుకున్న H₂SO₄ ఘ.ప. = V మి.లీ.
H₂SO₄ మొలారిటి = M, పూర్తి తటస్థీకరణానికి పట్టిన ఘ.ప. = V₁ మి.లీ.
NaOH మొలారిటి = M
2NaOH + H₂SO₄ → Na₂SO₄ + 2H₂O
\( \mathrm{\frac{V_1M_1}{n_1} = \frac{V_2M_2}{n_2}} \) (NaOH, H₂SO₄) (లేక) \( \mathrm{\frac{MV_1}{2} = \frac{MV_2}{1}} \) (లేక) \( \mathrm{V_2 = \frac{V_1}{2}} \) మి.లీ.
NH₃ చేత తటస్థీకరించబడిన H₂SO₄ ఘ.ప. \( \mathrm{= \left(V-\frac{V_1}{2}\right)} \) మి.లీ.
\( \mathrm{= 2\left(V-\frac{V_1}{2}\right)} \) మి.లీ. 1M NH₃ ద్రావణం
1000 మి.లీ. 1M NH₃ ద్రావణంలో 17 గ్రా. NH₃ (లేదా) 14 గ్రా. N ఉన్నది.
∴ \( \mathrm{2\left(V-\frac{V_1}{2}\right)} \) మి.లీ. 1M NH₃ ద్రావణంలో ...... ?
\( \mathrm{= \frac{14 \times M \times 2\left(V-\frac{V_1}{2}\right)}{1000}} \) గ్రా.ల N
∴ % నైట్రోజన్ \( \mathrm{= \frac{14 \times M \times 2\left(V-\frac{V_1}{2}\right)}{1000} \times \frac{100}{a}} \)

Exam Tips:

a) డ్యూమాస్: V ని STP కి మార్చి %N = 28 × V₂ × 100 / (22400 × a); జెల్దాల్: %N = 1.4 × M × 2(V − V₁/2) / a.
b) నైట్రో, అజో సమ్మేళనాలకు, వలయంలో N ఉన్న సమ్మేళనాలకు జెల్దాల్ పద్ధతి వర్తించదు.

 

Question 24: ప్రేరేపక ప్రభావాన్ని ఒక ఉదాహరణ ఇచ్చి వివరించండి.

Answer:

CH₃ – CH₂ – CH₂ – Cl అణువును తీసుకుంటే అందులో కార్బన్ – క్లోరిన్ పరమాణువుల మధ్య σ సమయోజనీయ బంధం ఉన్నది. అధిక ఋణ విద్యుదాత్మక Cl పరమాణువు ఎలక్ట్రాను తనవైపు ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీనివల్ల ‘C’ పరమాణువు కంటె Cl పరమాణువు మీద ఋణ విద్యుదావేశ సాంద్రత ఎక్కువగా
\( \mathrm{\overset{\delta+}{C} \rightarrow \overset{\delta-}{Cl}} \)
ఉంటుంది. దీనిని (లేక) –C → Cl గా చూపిస్తారు. అయితే క్లోరిన్ బంధం ఏర్పరచిన కార్బన్ పరమాణువు తిరిగి వేరే కార్బన్తో బంధం ఏర్పరచి ఉండటం వల్ల ఈ ప్రభావం ఇతర కార్బన్ పరమాణువులకు కూడా ప్రసారం అవుతుంది.
\( \mathrm{H_3\overset{3}{C}{-}\overset{2}{C}H_2{-}\overset{1}{C}H_2 \rightarrow Cl} \)
క్లోరిన్ ఎలక్ట్రాన్ ఆకర్షణ ఫలితంగా C₁ కార్బన్కు కొంత ఎలక్ట్రాన్ న్యూనత ఏర్పడుతుంది. దీనిని సరిచేసికోవడానికి C₁ తిరిగి C₁–C₂ సమయోజనీయ బంధంలోని ఎలక్ట్రాన్ జంటను తనవైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు C₂ కార్బన్కు ఎలక్ట్రాన్ న్యూనత ఏర్పడుతుంది. అయితే ఈ ప్రభావం C₁ – Cl మధ్యకంటే C₁ – C₂ మధ్య తక్కువ. ఈ ప్రభావం చాలా వేగంగా పడిపోతూ C₃ తరువాత అతి తక్కువగా ఉండడం వల్ల గుర్తించదగ్గది కాదు. ఆ బంధాల ఎలక్ట్రాన్ పంపకంపై కనిపించే ఈ ప్రభావాన్ని ప్రేరేపక ప్రభావం అంటారు. ప్రేరేపక ప్రభావం, కార్బన్పై ఉన్న ప్రతిక్షేపకాల ఎలక్ట్రాన్ సాంద్రతను దానం చేసే లేదా ఆకర్షించే స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఈ స్వభావం ఆధారంగా ప్రతిక్షేపకాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి
1. ఎలక్ట్రాన్ ఆకర్షక గ్రూపులు
2. ఎలక్ట్రాన్ దాన గ్రూపులు. ఎలక్ట్రాన్ దాన గ్రూపులు ధన ప్రేరక ప్రభావాన్ని, ఎలక్ట్రాన్ ఆకర్షక గ్రూపులు ఋణ ప్రేరక ప్రభావాన్ని చూపిస్తాయి.
ప్రేరక ప్రభావం రసాయన చర్యాశీలతల మీద మరియు భౌతిక ధర్మాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది.

Exam Tips:

a) –I ప్రభావం: Cl, NO₂ వంటి ఎలక్ట్రాన్ ఆకర్షక గ్రూపులు; +I ప్రభావం: ఆల్కైల్ గ్రూపులు; ప్రభావం కార్బన్ల వెంట వేగంగా తగ్గిపోతుంది.

 

Question 25: మీసోమరిక్ ప్రభావాన్ని వివరించండి.

Answer:

ఒక శృంఖలంలో సంయుగ్మ విధానంలో ఒక పరమాణువు లేదా గ్రూపు ఎలక్ట్రాన్జంటలను స్థానభ్రంశం చేసే విధానాన్ని మీసోమరిక్ ప్రభావం అంటారు.
మీసోమరిక్ ప్రభావం ప్రధాన లక్షణాలు:
1. ఇది స్థిరమైన ప్రభావం. అణువు భూస్థితిలో ఉన్నప్పుడు జరుగుతుంది.
2. ఒంటరి జతలు, π ఎలక్ట్రాన్లతో సంయుగ్మ విధానంలో ఎలక్ట్రాన్ స్థానభ్రంశం జరుగుతుంది.
3. ఇది భౌతిక ధర్మాన్ని, చర్యావేగాన్ని ప్రభావితం చేస్తుంది.
ఏ గ్రూపులైతే మిగిలిన అణుభాగంలో ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచుతాయో వాటికి +M ప్రభావం ఉన్నదని అంటారు. ఆ గ్రూపులలో ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది.
ఉదా: \( \mathrm{H_2N{-}C{=}C{-}} \) దీనిలో –NH₂ గ్రూపుకు +M ప్రభావం ఉన్నది.
ఏ గ్రూపులైతే ఎలక్ట్రాన్లను తమవైపుకు ఆకర్షించి మిగిలిన అణుభాగంపై ఎలక్ట్రాన్ సాంద్రతను తగ్గిస్తాయో వాటికి (–M) ప్రభావం ఉన్నదని అంటారు.
ఉదా: \( \mathrm{{-}C{=}C{-}C{=}O} \) దీనిలో C=O గ్రూపుకు –M ప్రభావం ఉన్నది.

Exam Tips:

a) +M: ఒంటరి జత ఉన్న గ్రూపులు (–NH₂, –OH, –Cl); –M: –NO₂, C=O, –CN; ఇది శాశ్వత ప్రభావం, π వ్యవస్థతో సంయుగ్మనం అవసరం.

 

Question 26: రెజోనెన్స్ ప్రభావాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.

Answer:

ఒక అణువు ధర్మాలన్నింటిని కేవలం ఒక నిర్మాణంతో వివరించలేము. అటువంటి సందర్భంలో అణువుకు అనేక నిర్మాణాలు ఇవ్వవలసి వస్తుంది. ప్రతి ఒక్క నిర్మాణం అణువు యొక్క కొన్ని ధర్మాలను వివరిస్తుంది. అన్ని నిర్మాణాలు కలిసి అణువు యొక్క అన్ని ధర్మాలను వివరిస్తాయి. దీనినే రెజోనెన్స్ అంటారు. ఆ విధంగా అణువుకు ఊహించిన అన్ని నిర్మాణాలను రెజోనెన్స్ నిర్మాణాలు లేక కెనోనికల్ అంటారు.
రెజోనెన్స్ నిర్మాణాలకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు :
1. అవి దాని నుంచి ఇంకొకటిగా మార్చేందుకు వీలుగా ఉంటాయి.
2. దీనిలో ఎలక్ట్రాన్ స్థానభ్రంశాలు తప్ప కేంద్రకాల స్థానాలలో ఎలాంటి మార్పులూ ఉండవు.
3. అణువులోని పరమాణువులన్నీ ఒకే తలంలో ఉంటాయి.
4. అన్ని నిర్మాణాలలోనూ, జత కూడిన లేక జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకే విధంగా ఉండాలి.
5. కెనోనికల్ నిర్మాణాలన్నింటికి సాధ్యమైనంత వరకూ దాదాపు సమానశక్తి ఉండాలి.
6. రెజోనెన్స్ నిర్మాణం ఎంత ఎక్కువ స్థిరమైనదైతే అది అసలు నిర్మాణంలో అంత ఎక్కువగా పాల్గొంటుంది.
7. ఎలక్ట్రాన్లు ఎంత ఎక్కువ అస్థానీకృతం చెందితే స్థిరత్వం అంత ఎక్కువగా ఉంటుంది.
8. సమయోజనీయ బంధాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ నిర్మాణం అంతస్థిరమైనది.
రెజోనెన్స్ ఫలితం : పక్క పక్క పరమాణువుల మధ్య రెండు π బంధాల లేదా ఒక π బంధం, ఒక ఒంటరి జంట మధ్య జరిగే అంతర చర్యల వల్ల ఉత్పన్నమయిన ధ్రువణాన్ని రెజోనెన్స్ ఫలితం అంటారు. ఈ ఫలితం శృంఖలం ద్వారా ప్రసారం అవుతుంది.
ఎలక్ట్రాన్ల బదలాయింపు ప్రతిక్షేపక పరమాణువు లేదా గ్రూపు నుండి అణువుపైకి సంయుగ్మ వ్యవస్థ ద్వారా జరిగితే దానిని (+R) తో సూచిస్తారు. అదే ఎలక్ట్రాన్ బదలాయింపు ప్రతిక్షేపక పరమాణువు లేక గ్రూపు వైపుకు అయితే దానిని (−R) తో సూచిస్తారు.
అనిలీన్ లో NH₂ ఒంటరి జత బెంజీన్ వలయం వైపు స్థానభ్రంశం చెంది ఆర్థో, పారా స్థానాలపై ఋణావేశం ఉన్న రెజోనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి (+R); నైట్రోబెంజీన్ లో NO₂ ఆకర్షణ వల్ల ఆర్థో, పారా స్థానాలపై ధనావేశం ఉన్న నిర్మాణాలు ఏర్పడతాయి (–R).
రెజోనెన్స్ శక్తి : అసలైన నిర్మాణం (రెజోనెన్స్ సంకర రూపం) శక్తికి, అత్యంత స్థిరమైన రెజోనెన్స్ నిర్మాణం శక్తికి మధ్య గల భేదాన్ని రెజోనెన్స్ శక్తి అంటారు.

Exam Tips:

a) రెజోనెన్స్ నిర్మాణాల మధ్య ద్విముఖ బాణం (↔) వాడండి; నిజమైన నిర్మాణం వాటి సంకరం.
b) అనిలీన్ లో +R ప్రభావం, నైట్రోబెంజీన్ లో –R ప్రభావం ఉదాహరణలుగా రాయండి.

 

Question 27: కర్బన రసాయన చర్యలు ఎన్ని రకాలో వివరించండి.

Answer:

కర్బన రసాయన చర్యలు నాలుగు రకాలు. అవి
(1) సంకలన చర్యలు
(2) ప్రతిక్షేపణ చర్యలు
(3) విలోపన చర్యలు
(4) అణు పునరమరికలు.
1. సంకలన చర్యలు : ఈ చర్యలలో క్రియాధారం, కారకం రెండూ కలసి ఉత్పన్నాన్ని ఇస్తాయి.
ఉదా:
\( \mathrm{CH_2{=}CH_2 + Br_2 \rightarrow CH_2Br{-}CH_2Br} \) (ఇథిలీన్)
2. ప్రతిక్షేపణ చర్యలు : ఈ చర్యలలో ఒక పరమాణువు లేదా గ్రూపు క్రియాధారంలోని వేరే పరమాణువు లేదా గ్రూపును స్థానభ్రంశం చేసి క్రియాధారంతో బంధం ఏర్పరుస్తుంది.
ఉదా:
\( \mathrm{CH_4 + Cl_2 \xrightarrow{h\nu} CH_3Cl + HCl} \)
3. విలోపన చర్యలు : ఇచ్చట రెండు లేక అంతకంటె ఎక్కువ పరమాణువులు లేదా గ్రూపులు క్రియాధారం నుండి విలోపనం చెందుతాయి. దీనివల్ల ద్విబంధం (లేక) త్రిబంధం ఉత్పన్నంలో ఏర్పడతాయి.
\( \mathrm{CH_3{-}CH_2X + KOH \rightarrow CH_2{=}CH_2 + KX + H_2O} \) (ఇచ్చట X = హాలోజన్ పరమాణువు)
4. అణువుల పునరమరికలు : దీనిలో తక్కువ స్థిరత్వం గల ఒక కర్బన పదార్థం స్థిరత్వం గల వేరొక కర్బన పదార్థంగా పునరమరిక చెందుతాయి. దీనిలో ఒకస్థానం నుండి వేరొక స్థానానికి ఒక పరమాణువు లేదా సమూహం బదిలీ అయి వెళ్ళిపోతుంది.
ఉదా:
1)
\( \mathrm{CH_3CH_2CH_2CH_3 \xrightarrow[573\,K]{AlCl_3/HCl} CH_3{-}CH(CH_3){-}CH_3} \) (n-బ్యూటేన్ → ఐసోబ్యూటేన్)
ఉదా:
2)
\( \mathrm{(C_6H_5)_2C{=}NOH \xrightarrow[\Delta]{SOCl_2} C_6H_5{-}CO{-}NH{-}C_6H_5} \) (బెంజోఫినోన్ ఆక్సిమ్ → బెంజానిలైడ్)

Exam Tips:

a) నాలుగు రకాలకు ఒక్కో ఉదాహరణ సమీకరణం: సంకలనం (ఇథిలీన్ + Br₂), ప్రతిక్షేపణ (CH₄ + Cl₂), విలోపనం (ఆల్కైల్ హాలైడ్ + KOH), పునరమరిక (n-బ్యూటేన్ → ఐసోబ్యూటేన్).

 

Question 28: ఈథేన్ అనురూపకాలను రాసి వాటిలో దేనికి స్థిరత్వం ఎక్కువో తెలపండి.

Answer:

ఈథేన్ – అనురూపాత్మక సాదృశ్యములు : ఈథేన్ అణువులో ఒక కార్బన్ పరమాణువు స్థానమును స్థిరీకరించి రెండవ కార్బన్ పరమాణువును C – C బంధ అక్షముపై చక్ర భ్రమణము చేయుట వలన అనేక ప్రాదేశిక అమరికలు గల రూపములు లభించును. ఈ రూపములను అనురూపాత్మక సాదృశ్యములందురు. ఈథేన్ ప్రధాన అనురూపాత్మక సాదృశ్యములు.
1) గ్రహణ ఆకృతి
2) అస్తవ్యస్త ఆకృతి
అస్తవ్యస్త ఆకృతి (staggered form), గ్రహణ ఆకృతి (eclipsed form) కన్నా స్థిరమైనది. కారణం గ్రహణ ఆకృతిలో రెండు కర్బన పరమాణువులపై గల హైడ్రోజన్ పరమాణువులు అతి సున్నితంగా ఉండుట వలన వీటి మధ్య వికర్షణ బలములు అధికము. కావున ఈ రూపమునకు స్థిరత్వము తక్కువ.
అస్తవ్యస్త ఆకృతిలో రెండు కర్బన పరమాణువులపై గల హైడ్రోజన్ పరమాణువులు వీలయినంత దూరంగా ఉండుటవలన, ఈ రూపములో వికర్షణ బలములు అతి స్వల్పము. కనుక శక్తి తక్కువ కావున దీనికి స్థిరత్వము అధికము.

Exam Tips:

a) అస్తవ్యస్త ఆకృతిలో H పరమాణువుల మధ్య వికర్షణ అతి తక్కువ కాబట్టి అది స్థిరమైనది (శక్తి తేడా సుమారు 12 kJ/mol).

 

Question 29: బెంజీన్ యొక్క ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలను వివరించండి.

Answer:

బెంజీన్ యొక్క ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యా విధానము : బెంజీన్యొక్క ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య రెండు దశలలో జరుగుతుంది. 1. మొదటి దశలో ఎలక్ట్రోఫైల్ ఒక బెంజీన్ అణువులోని కార్బన్పై చర్య జరిపి కార్బోకాటయాన్ను ఏర్పరుస్తుంది. ఇది రెజోనెన్స్ ద్వారా స్థిరత్వం పొందుతుంది.
\( \mathrm{C_6H_6 + E^+ \rightarrow} \) కార్బోకాటయాన్ (ఎరీనియం అయాన్) – ధనావేశం రెజోనెన్స్ ద్వారా ఆర్థో, పారా స్థానాలపై వితరణ చెందుతుంది
రెండవదశలో ఎరీనియం అయాన్ ఒక ప్రోటాన్ను కోల్పోతుంది.
\( \mathrm{[C_6H_5(H)E]^+ + A^- \rightarrow C_6H_5E + H{-}A} \)

Exam Tips:

a) రెండు దశలు: (1) ఎలక్ట్రోఫైల్ దాడి → ఎరీనియం అయాన్ (నెమ్మది, రేటు నిర్ణయ దశ); (2) H⁺ తొలగింపు → ఆరోమాటిక్ స్థిరత్వం తిరిగి వస్తుంది.

 

Question 30: ఇథిలీన్ సంకలన చర్యలను (ఎలక్ట్రోఫిలిక్) చర్యాగతిని వివరించండి.

Answer:

ఇథిలీన్ ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యా విధానము: ఇథిలీన్ C – C మధ్య ఉన్న ద్విబంధంలోని π ఎలక్ట్రాన్లు ఎలక్ట్రోఫైల్కు అందుబాటులో ఉంటాయి. ద్విబంధంపై ఎలక్ట్రోఫైల్ సంకలన చర్యలో రెండు క్రొత్త σ బంధాలు ఏర్పడతాయి.
మొదటిదశ : ఇథిలీన్పై ఎలక్ట్రోఫైల్ చర్యలో కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + E{-}Nu \xrightarrow{slow} {}^+CH_2{-}CH_2{-}E + Nu^-} \) (కార్బోనియం అయాన్)
పై దశలో ఏర్పడిన కార్బోనియం అయాన్పై న్యూక్లియోఫైల్ (Nu) చర్యలలో అంతిమ ఉత్పన్నమేర్పడుతుంది.
\( \mathrm{{}^+CH_2{-}CH_2{-}E + Nu^- \rightarrow Nu{-}CH_2{-}CH_2{-}E} \) (ఉత్పన్నం)
ఉదా : ఇథిలీన్, HBr తో సంకలనం చెంది ఇథైల్ బ్రోమైడ్‌ను ఇస్తుంది.
\( \mathrm{CH_2{=}CH_2 + HBr \rightarrow CH_3{-}CH_2{-}Br} \) (ఈథైల్ బ్రోమైడ్)
చర్యావిధానం:
1. \( \mathrm{CH_2{=}CH_2 + HBr \rightarrow {}^+CH_2{-}CH_3 + Br^-} \)
2. \( \mathrm{{}^+CH_2{-}CH_3 + Br^- \rightarrow CH_2Br{-}CH_3} \)

Exam Tips:

a) ఇథిలీన్ π ఎలక్ట్రాన్లు ఎలక్ట్రోఫైల్ ను ఆకర్షిస్తాయి → కార్బోనియం అయాన్ (నెమ్మది) → న్యూక్లియోఫైల్ దాడి (వేగంగా).

 

Question 31: చర్యా సంవిధానం (Mechanism of the reaction) ద్వారా ఆల్కేన్ స్వేచ్ఛా ప్రాతిపదిక హాలోజినేషన్ చర్యను వివరించండి.

Answer:

ఆల్కేన్ స్వేచ్ఛా ప్రాతిపదిక హాలోజినేషన్ (హాలోజనీకరణం) : స్వేచ్ఛాప్రాతిపదికా విధానంలో క్లోరినీకరణ మూడు దశల్లో జరుగుతుంది.
1. శృంఖల చర్య ప్రారంభ చర్య : ఇక్కడ క్లోరిన్ అణువు శక్తిని గ్రహించి క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికలుగా విడిపోతుంది.
\( \mathrm{Cl{-}Cl \xrightarrow{h\nu} 2Cl^{\bullet}} \) (క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికలు)
2. శృంఖల చర్య వ్యాప్తి : పైన ఏర్పడిన క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఈథేన్ అణువుతో చర్య జరుపుతాయి.
\( \mathrm{CH_3{-}CH_3 + Cl^{\bullet} \rightarrow CH_3{-}\dot{C}H_2 + HCl} \)
\( \mathrm{CH_3{-}\dot{C}H_2 + Cl{-}Cl \rightarrow CH_3{-}CH_2{-}Cl + Cl^{\bullet}} \)
ఈ చర్యలు అనేక మార్లు పునరావృతమై చర్యను శృంఖల చర్యగా మారుస్తాయి. ఈ చర్యలను చర్యావ్యాప్తి చర్యలు అంటారు.
3. శృంఖల చర్యల ముగింపు : స్వేచ్ఛా ప్రాతిపదికలు నేరుగా కలిసిపోయి శృంఖల చర్యలు అంతమవుతాయి.
\( \mathrm{Cl^{\bullet} + Cl^{\bullet} \rightarrow Cl_2} \)
\( \mathrm{C_2H_5^{\bullet} + C_2H_5^{\bullet} \rightarrow C_4H_{10}} \)
\( \mathrm{CH_3{-}\dot{C}H_2 + Cl^{\bullet} \rightarrow CH_3{-}CH_2{-}Cl} \)

Exam Tips:

a) మూడు దశలు: ప్రారంభం, వ్యాప్తి, ముగింపు; ప్రారంభంలో Cl–Cl బంధం కాంతి (hν) వల్ల హోమోలైటిక్ గా విచ్ఛేదనం చెందుతుంది.

 

Question 32: మార్కొనికాఫ్ నియమం, ఖరాష్ ప్రభావాల్ని వివరించండి.

Answer:

ప్రోపీన్తో HBr సంకలనం చెంది మార్కొనికాఫ్ నియమము ప్రకారం 2–బ్రోమో ప్రోపేన్ను ఇస్తుంది. కాని బెంజాయిల్ పెరాక్సైడ్ సమక్షంలో ప్రోపీన్కు HBrను కలిపితే 1-బ్రోమో ప్రోపేన్ ఏర్పడుతుంది. ఇక్కడ యాంటి మార్కొనికాఫ్ నియమము ప్రకారము సంకలనం జరుగుతుంది.
మార్కొనికాఫ్ నియమము : ఒక అసమకారకం ద్విబంధంలో సంకలనం చెందేటపుడు అసమకారకం రుణావేశ భాగం ద్విబంధంలో తక్కువ హైడ్రోజన్లున్న కార్బన్పై సంకలనం చెందుతుంది.
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \rightarrow CH_3{-}CHBr{-}CH_3} \) (2-బ్రోమో ప్రొపేన్)
చర్యావిధానము (ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్య) :
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \rightarrow CH_3{-}\overset{+}{C}H{-}CH_3 + Br^-} \)
\( \mathrm{CH_3{-}\overset{+}{C}H{-}CH_3 + Br^- \rightarrow CH_3{-}CHBr{-}CH_3} \)
యాంటి మార్కొనికాఫ్ నియమము : ఒక అసమకారకం ద్విబంధంతో పెరాక్సైడ్సమక్షంలో సంకలనం చెందేటపుడు అసమకారకం రుణావేశ భాగం ద్విబంధంలో ఎక్కువ హైడ్రోజన్లున్న కార్బన్పై సంకలనం చెందుతుంది. దీనినే ఖరాష్ ప్రభావం అని కూడా అంటారు.
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + HBr \xrightarrow{peroxide} CH_3{-}CH_2{-}CH_2{-}Br} \) (1-బ్రోమో ప్రొపేన్)
చర్యావిధానం (స్వేచ్ఛా ప్రాతిపదిక సంకలన చర్య) :
\( \mathrm{C_6H_5^{\bullet} + HBr \rightarrow C_6H_6 + Br^{\bullet}} \)
\( \mathrm{CH_3{-}CH{=}CH_2 + Br^{\bullet} \rightarrow CH_3{-}\dot{C}H{-}CH_2{-}Br} \)
\( \mathrm{CH_3{-}\dot{C}H{-}CH_2{-}Br + HBr \rightarrow CH_3{-}CH_2{-}CH_2{-}Br + Br^{\bullet}} \)

Exam Tips:

a) మార్కొనికాఫ్ → ఎలక్ట్రోఫిలిక్ (అయానిక) మార్గం; ఖరాష్ ప్రభావం → పెరాక్సైడ్ సమక్షంలో స్వేచ్ఛా ప్రాతిపదిక మార్గం (HBr కు మాత్రమే).

 

Question 33: కింది సమ్మేళనాలను బెంజీన్ నుంచి ఎలా మార్చవచ్చు?
(a) క్లోరోబెంజీన్
(b) టోలీన్
(c) p–నైట్రోటోలీన్

Answer:

(a) క్లోరోబెంజీన్ : బెంజీన్ క్లోరిన్తో FeCl₃ సమక్షంలో చర్య జరిపి క్లోరోబెంజీన్ ను ఏర్పరచవచ్చు.
\( \mathrm{C_6H_6 + Cl_2 \xrightarrow{FeCl_3} C_6H_5Cl + HCl} \) (క్లోరోబెంజీన్)
(b) టోలీన్ : బెంజీన్ ను CH₃Cl తో AlCl₃ సమక్షంలో చర్య జరిపి టోలీన్ ను ఏర్పంచవచ్చు. (ఫ్రీడల్–క్రాఫ్ట్స్ చర్య)
\( \mathrm{C_6H_6 + CH_3Cl \xrightarrow{AlCl_3} C_6H_5CH_3 + HCl} \) (టోలీన్)
(c) P-నైట్రోటోలీన్ : బెంజీన్ నుంచి p – నైట్రో టోలీన్ ను ఈ క్రింది విధంగా తయారు చేయవచ్చు.
\( \mathrm{C_6H_6 \xrightarrow{CH_3Cl,\ AlCl_3} C_6H_5CH_3 \xrightarrow{conc.\ HNO_3 + conc.\ H_2SO_4} p{-}O_2N{-}C_6H_4{-}CH_3} \) (టోలీన్ → p-నైట్రో టోలీన్)

Exam Tips:

a) (a) Cl₂/FeCl₃, (b) CH₃Cl/AlCl₃, (c) టోలీన్ నైట్రేషన్ ఆర్థో, పారా మిశ్రమాన్ని ఇస్తుంది – పారా ఉత్పన్నాన్ని వేరు చేయాలి.

 

Question 34: బేసి సంఖ్యలో కార్బన్లున్న ఆల్కేన్లను ఉర్ట్ చర్య ద్వారా ఎందుకు తయారుచేయలేరు? ఏదైనా ఉదాహరణతో వివరించండి.

Answer:

ఉర్ట్ చర్య : ఆల్కైల్ హాలైడ్ సోడియం లోహంతో పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపి ఆల్కేన్లను ఏర్పరచే చర్యను ఉర్ట్ చర్య అంటారు. R – X + 2Na + R – X→ R – R + 2NaX ఉర్ట్ చర్యను బేసి సంఖ్యలో కార్బన్లు ఉన్న ఆల్కేన్లను తయారుచేయుటకు ఎక్కువగా ఉపయోగించరు. బేసి సంఖ్యలో కార్బన్లు ఉన్న ఆల్కేనులను తయారుచేయుటకు రెండు విభిన్నమైన ఆల్కైల్ హాలైడ్లను తీసుకోవలెను. ఈ విధంగా తీసుకొనుట వలన ఏర్పడే ఉత్పన్నం మిశ్రమ రూపంలో ఉంటుంది.
అంతేకాకుండా ఉత్పన్నం తక్కువ మొత్తంలో ఏర్పడుతుంది.
ఉదా: \( \mathrm{CH_3Br + C_2H_5Br + 2Na \rightarrow CH_3{-}C_2H_5 + 2NaBr} \) (ప్రొపేన్) వస్తుంది, కానీ దానితో పాటు \( \mathrm{CH_3{-}CH_3} \) (ఈథేన్), \( \mathrm{C_2H_5{-}C_2H_5} \) (బ్యూటేన్) కూడా ఏర్పడతాయి.

Exam Tips:

a) ఒకే ఆల్కైల్ హాలైడ్ తో R–R (సరి సంఖ్య కార్బన్లు) వస్తుంది; రెండు వేర్వేరు హాలైడ్లు వాడితే R–R, R–R′, R′–R′ మిశ్రమం ఏర్పడుతుంది కాబట్టి బేసి ఆల్కేన్లకు ఉర్ట్ చర్య అనువు కాదు.

 

Question 35: కర్బన సమ్మేళనాలలో నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్లను గుణాత్మకంగా విశ్లేషించే సమీకరణాలను రాయండి.

Answer:

నైట్రోజన్ను గుర్తించుట : కొద్దిగా లాసైన్ ద్రావణాన్ని పరీక్ష నాళికలో తీసికొని దానికి కొద్ది చుక్కలు NaOH ద్రావణం కలిపి క్షారీకృతం చేసి దానికి అపుడే తయారు చేసిన ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని కలుపుతారు. దీనికి 2 లేక 3 చుక్కలు FeCl₃ ద్రావణం కలిపి చల్లబరిచి గాఢ HCl ద్రావణంతో ఆమ్లీకృతం చేస్తారు. ప్రష్యన్ బ్లూ లేదా ఆకుపచ్చని రంగు లేదా అవక్షేపం వస్తే నైట్రోజన్ ఉన్నట్లుగా గుర్తించాలి.
\( \mathrm{FeSO_4 + 2NaOH \rightarrow Fe(OH)_2 + Na_2SO_4} \)
\( \mathrm{6NaCN + Fe(OH)_2 \rightarrow Na_4[Fe(CN)_6] + 2NaOH} \) (సోడియం ఫెర్రోసైనైడ్)
\( \mathrm{3Na_4[Fe(CN)_6] + 4FeCl_3 \rightarrow Fe_4[Fe(CN)_6]_3 + 12NaCl} \) (ఫెర్రిక్ ఫెర్రోసైనైడ్)
సల్ఫర్ను గుర్తించుట : కొద్దిగా లాసైన్ ద్రావణాన్ని పరీక్ష నాళికలో తీసికుని దానికి తాజాగా తయారు చేసిన సోడియం నైట్రోప్రుస్సైడ్ ద్రావణం కలపాలి. ముదురు ఊదా రంగు వస్తుంది. సల్ఫర్ ఉన్నట్లుగా గుర్తించాలి.
\( \mathrm{Na_2S + Na_2[Fe(CN)_5NO] \rightarrow Na_4[Fe(CN)_5NOS]} \) (ఊదా రంగు)
హాలోజన్లను గుర్తించుట : కొద్దిగా లాసైన్ ద్రావణాన్ని పరీక్ష నాళికలో తీసికొని నత్రికామ్లంతో ఆమ్లీకృతం చేసి AgNO₃ ద్రావణాన్ని కలపాలి.
Ag⁺ + X⁻ → AgX
తెల్లని అవక్షేపం ఏర్పడి అది NH₄OH ద్రావణంలో కరిగితే ఆ హాలైడ్ Cl⁻
లేత పసుపుపచ్చ అవక్షేపం ఏర్పడి అది NH₄OH లో పాక్షికంగా కరిగితే ఆ హాలైడ్ Br⁻
పసుపు పచ్చ అవక్షేపం ఏర్పడి అది NH₄OH లో కరగకపోతే ఆ హాలైడ్ I⁻.

Exam Tips:

a) N: ప్రష్యన్ బ్లూ; S: సోడియం నైట్రోప్రుస్సైడ్ తో ఊదా రంగు (లెడ్ ఎసిటేట్ తో నల్లని PbS); హాలోజన్లు: AgCl తెలుపు, AgBr లేత పసుపు, AgI పసుపు.

 

Question 36: కర్బన సమ్మేళనంలో కార్బన్, హైడ్రోజన్ల భారశాతాన్ని కనుక్కోవడానికి అనువైన సమీకరణాలను రాయండి.

Answer:


సాధారణ సమీకరణం: \( \mathrm{C_xH_y + \left(x+\frac{y}{4}\right)O_2 \rightarrow xCO_2 + \frac{y}{2}H_2O} \)
తెలిసిన భారం గల కర్బన పదార్థానికి CuO ను కలిపి ఆ మిశ్రమాన్ని దహన నాళికలో తీసికొని అధికమైన గాలి సమక్షంలో పూర్తిగా దహనం చెందిస్తారు. అపుడు కర్బన పదార్థంలోని కార్బన్ CO₂ గానూ, హైడ్రోజన్ H₂O గానూ మారతాయి. ఆ విధంగా లభించిన CO₂, H₂O లను ముందుగా తూచిన నిర్జల CaCl₂, కాస్టిక్ పొటాష్లతో ఉన్న విడివిడి U – గొట్టాలలోకి పంపుతారు. CaCl₂ గొట్టంలో పెరిగిన బరువు వెలువడిన నీటి ఆవిరి బరువుగానూ, కాస్టిక్ పొటాష్ గొట్టంలో పెరిగిన బరువు వెలువడిన CO₂ భారంగానూ గుర్తించాలి.
గణన :’ ‘a’ గ్రా.ల కర్బన సమ్మేళనాన్ని దహనం చెందిస్తే ‘b’ గ్రా. ల నీటి ఆవిరి, ‘c’ గ్రా.ల CO₂ వచ్చాయి అనుకోండి.
కార్బన్ భారశాతం:
44 గ్రా. CO₂ లో 12 గ్రా. ‘C’ ఉన్నది.
∴ c గ్రా.ల CO₂ …………?
\( = \frac{12 \times c}{44} \) గ్రా. కార్బన్
‘a’ గ్రా.ల కర్బన సమ్మేళనంలో \( \frac{12 \times c}{44} \) గ్రా. కార్బన్ ఉన్నది.
∴ 100 గ్రా.ల కర్బన సమ్మేళనంలో ………… ?
∴ కార్బన్ భారశాతం \( = \frac{100 \times 12 \times c}{44 \times a} \) %
హైడ్రోజన్ భారశాతం:
18 గ్రా. H₂O లో 2 గ్రా. ‘H’ ఉన్నది.
∴ b గ్రా.ల H₂O ……..
\( = \frac{2 \times b}{18} \) గ్రా. ‘H’
‘a’ గ్రా.ల కర్బన సమ్మేళనంలో \( \frac{2 \times b}{18} \) గ్రా. ‘H’ ఉన్నది.
∴ 100 గ్రా.ల కర్బన సమ్మేళనంలో …… ?
∴ ‘H’ భారశాతం \( = \frac{100 \times 2 \times b}{18 \times a} \) %

Exam Tips:

a) %C = 12 × c × 100 / (44 × a); %H = 2 × b × 100 / (18 × a); CaCl₂ గొట్టం నీటిని, KOH గొట్టం CO₂ ను శోషిస్తుంది (ఈ క్రమం మారకూడదు).

 

Question 37: నైట్రోజన్ భారశాతాన్ని డ్యూమాస్, జెల్దాల్ పద్ధతిలో కనుక్కొనే విధానాన్ని వివరించండి.

Answer:

1. డ్యూమాస్ పద్ధతి : ఈ పద్ధతిలో తెలిసిన భారం ఉన్న కర్బన పదార్థానికి ముతక CuO కలిపి బాగా వేడి చేస్తారు. కార్బన్ హైడ్రోజన్లు CO₂, H₂O (ఆవిర్లు) గా ఆక్సీకరణం చెందుతాయి. నైట్రోజన్ N₂ వాయువుగా మారుతుంది. కొంత నైట్రోజన్ ఆక్సైడ్లుగా మారినా, ఆ ఆక్సైడ్లను వేడిగా ఉన్న కాపర్ జాలకం, N₂ వాయువుగా క్షయకరణం చెందిస్తుంది. ఉత్పన్న వాయువులను KOH ద్రావణం గుండా పంపుతారు. CO₂ వాయువు KOH ద్రావణంలో శోషణం చెందుతుంది. KOH ద్రావణంపై చేరుకున్న N₂ వాయువు ఘనపరిమాణాన్ని కొలుస్తారు.

గణన : గది ఉష్ణోగ్రత TK వద్ద a గ్రా.ల సమ్మేళనం V మి.లీ. N₂ వాయువును ఇచ్చినదని అనుకొనుము.
ప్రయోగ పరిస్థితులు
P₁ = (P-p) మి . మీ
ఇచ్చట p = నీటి ఆవిరి పీడనం
T₁ = TK
V₁ = V మి.లీ.
STP పరిస్థితులు
P₂ = 760 మి.మీ.
T₂ = 273 K
V₂ = ?
T₁ = TK
V₁ = V మి.లీ.
\( \frac{P_1 V_1}{T_1} = \frac{\mathrm{P}_2 \mathrm{~V}_2}{\mathrm{~T}_2} \therefore V_2 = \frac{P_1 V_1 T_2}{P_2 T_1} = \frac{(P-p) \times V \times 273}{760 \times T} = x \) మి.లీ.
22,400 మి.లీ. N₂ వాయువు STP వద్ద 28 గ్రా. బరువు కలిగి ఉంటుంది.
∴ x మి.లీ. N₂ ……… ?
\( = \frac{x \times 28}{22400} \) గ్రా.లు.
‘a’ గ్రా.ల పదార్థంలో \( \frac{28 \times x}{22400} \) గ్రా. N₂ ఉన్నది.
∴ 100 గ్రా.ల పదార్థంలో నైట్రోజన్ భారశాతం \( = \frac{100}{a} \times \frac{28 \times x}{22400} \) %
2. జెల్దాల్ పద్ధతి : ఈ పద్ధతిలో తెలిసిన భారం గల కర్బన సమ్మేళనాన్ని CuSO₄ సమక్షంలో గాఢ H₂SO₄ తో వేడి చేస్తారు. అప్పుడు కర్బన సమ్మేళనంలోని నైట్రోజన్అంతా పరిమాణాత్మకంగా అమ్మోనియం సల్ఫేటుగా మారుతుంది. ప్రయోగ
పాత్రలోని అనుఘటకాలను వేరే పాత్రలోనికి మార్చి అధిక NaOH ద్రావణంతో వేడి చేస్తారు. అమ్మోనియా వాయువు విడుదల అవుతుంది. ఈ అమ్మోనియా వాయువును తెలిసిన ఘ.ప. మరియు గాఢత గల అధిక గాఢ H₂SO₄ లోకి పంపి శోషణం చెందిస్తారు. మిగిలిన ఆమ్లాన్ని ప్రమాణ క్షారంతో అంశమాపనం చేస్తారు.
దీని నుండి అమ్మోనియాను తటస్థీకరించడానికి పట్టిన ఆమ్ల ప్రమాణాన్ని గణిస్తారు. దీని నుంచి ఎంత అమ్మోనియా ఏర్పడిందో గణించి దాని నుండి N₂ భారశాతాన్ని లెక్కిస్తారు.
చర్యలు : కర్బన సమ్మేళనం + H₂SO₄ → (NH₄)₂SO₄
(NH₄)₂SO₄ + 2NaOH → Na₂SO₄ + 2H₂O + 2NH₃
2NH₃ + H₂SO₄ → (NH₄)₂SO₄
గణన : కర్బన సమ్మేళనం భారం = a గ్రా. మొదటిగా తీసుకున్న H₂SO₄ ఘ.ప. = V మి.లీ.
H₂SO₄ మొలారిటి = M, పూర్తి తటస్థీకరణానికి పట్టిన ఘ.ప. = V₁ మి.లీ.
NaOH మొలారిటి = M
2NaOH + H₂SO₄ → Na₂SO₄ + 2H₂O
\( \mathrm{\frac{V_1M_1}{n_1} = \frac{V_2M_2}{n_2}} \) (NaOH, H₂SO₄) (లేక) \( \mathrm{\frac{MV_1}{2} = \frac{MV_2}{1}} \) (లేక) \( \mathrm{V_2 = \frac{V_1}{2}} \) మి.లీ.
NH₃ చేత తటస్థీకరించబడిన H₂SO₄ ఘ.ప. = \( \mathrm{\left(V-\frac{V_1}{2}\right)} \) మి.లీ.
= \( \mathrm{2\left(V-\frac{V_1}{2}\right)} \) మి.లీ. NH₃ ద్రావణం
1000 మి.లీ. 1M NH₃ ద్రావణంలో 17 గ్రా. NH₃ (లేదా) 14 గ్రా. N ఉన్నది.
∴ \( \mathrm{2\left(V-\frac{V_1}{2}\right)} \) మి.లీ. 1M NH₃ ద్రావణంలో ...... ?
\( \mathrm{= \frac{14 \times M \times 2\left(V-\frac{V_1}{2}\right)}{1000}} \) గ్రా.ల N
∴ % నైట్రోజన్ \( \mathrm{= \frac{14 \times M \times 2\left(V-\frac{V_1}{2}\right)}{1000} \times \frac{100}{a}} \)

Exam Tips:

a) డ్యూమాస్ లో నీటి ఆవిరి పీడనం తీసివేసి (P − p) వాయు సమీకరణం P₁V₁/T₁ = P₂V₂/T₂ ద్వారా V ని STP కి మార్చండి.
b) జెల్దాల్ గణన: NH₃ తో చర్య జరిపిన H₂SO₄ ఘ.ప. = (V − V₁/2) మి.లీ.; 1M NH₃ 1000 మి.లీ. లో 14 గ్రా. N.

 

Question 38: కర్బన సమ్మేళనంలోని సల్ఫర్, ఫాస్ఫరస్, ఆక్సిజన్ల పరిమాణాత్మక విశ్లేషణను వివరించండి.

Answer:

కర్బన సమ్మేళనంలోని ఫాస్ఫరస్ భారశాతం కనుక్కొనుట : ఫాస్ఫరస్ భారశాతాన్ని కనుక్కోవడానికి తెలిసిన ద్రవ్యరాశి గల కర్బన పదార్థాన్ని సధూమ నైట్రికామ్లంలో వేడి చేయాలి. ఫాస్ఫరస్ ఫాస్ఫారిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చెందుతుంది. ఈ ఆమ్లానికి అమ్మోనియా, అమ్మోనియం మోలిబేట్ ద్రావణాలు కలిపి అమ్మోనియం ఫాస్ఫోమోలిబ్డేట్ [(NH₄)₃PO₄·12MoO₃]గా అవక్షేపించాలి.
కర్బన సమ్మేళనం ద్రవ్యరాశి = mg
అమ్మోనియం ఫాస్ఫోమోలిబ్డేట్ = m₁g
(NH₄)₃PO₄·12MoO₃ అణు ద్రవ్యరాశి = 1877g
ఫాస్ఫరస్ భారశాతం \( = \frac{31 \times \mathrm{m}_1 \times 100}{1877 \times \mathrm{m}} \)
కర్బన సమ్మేళనంలోని సల్ఫర్ భారశాతం కనుక్కొనుట : కర్బన సమ్మేళనంలోని సల్ఫర్ భారశాతం కనుక్కోవడానికి తెలిసిన భారం గల కర్బన సమ్మేళనాన్ని సోడియం పెరాక్సైడ్ లేదా సధూమ నైట్రికామ్లంతో కేరియస్ నాళికలో వేడిచేస్తారు. సమ్మేళనంలోని సల్ఫర్ H₂SO₄ గా ఆక్సీకరణం చెందుతుంది. ఈ ఆమ్లాన్ని అధికంగా జల బేరియం క్లోరైడ్ ద్రావణం కలిపి బేరియం సల్ఫేట్గా అవక్షేపింప చేస్తారు. ఈ అవక్షేపాన్ని వడపోత ద్వారా వేరుచేసి, కడిగి, పొడి చేసి భారాన్ని కనుక్కొంటారు.
తీసుకున్న కర్బన పదార్థ భారం = mg
ఏర్పడిన బేరియం సల్ఫేట్ భారం = m₁g
m₁, g ల బేరియం సల్ఫేట్లోని సల్ఫర్ \( = \frac{32 \times m_1}{233} \) g (1 మోల్ BaSO₄ = 233gm BaSO₄ = 32 gm సల్ఫర్)
సల్ఫర్ భారశాతం \( = \frac{32 \times m_1 \times 100}{233 \times m} \)
ఆక్సిజన్ పరిమాణాత్మక విశ్లేషణ : తెలిసిన ద్రవ్యరాశి గల కర్బన సమ్మేళనాన్ని నైట్రోజన్ వాయువు సమక్షంలో వేడిచేస్తారు. వెలువడిన ఉత్పన్న ఆక్సైడ్ వాయువుల మిశ్రమాన్ని ఎర్రటి వేడి బొగ్గు పైకి పంపి మొత్తం ఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ను CO గా మారుస్తారు. ఆ తరువాత మిశ్రమ వాయువులను వేడిగా ఉన్న I₂O₅ మీదుగా పంపుతారు. అపుడు CO తిరిగి CO₂ గా మారుతుంది. అయొడిన్ వెలువడుతుంది.
కర్బన సమ్మేళన భారం = a g
CO₂ భారం = b g
88 g CO₂ లో 32 g O₂ ఉన్నది.
∴ b g CO₂ లో \( \mathrm{\frac{b \times 32}{88}} \) g O₂
a g పదార్థంలో \( \mathrm{\frac{b \times 32}{88}} \) g O₂ ఉంటే
100 g పదార్థంలో O₂ భారశాతం \( \mathrm{= \frac{100 \times b \times 32}{88 \times a}} \) %

Exam Tips:

a) సల్ఫర్: కేరియస్ పద్ధతి → BaSO₄ (233); ఫాస్ఫరస్: అమ్మోనియం ఫాస్ఫోమోలిబ్డేట్ (1877); ఆక్సిజన్: %O = 32 × b × 100 / (88 × a).

 

Question 39: కేరియస్ పద్ధతిలో జరిపే కర్బన సమ్మేళనంలోని హాలోజన్ ను పరిమాణాత్మక విశ్లేషణ వివరించండి.

Answer:

కేరియస్ పద్ధతిలో హాలోజన్ల పరిమాణాత్మక విశ్లేషణ : ఈ పద్ధతిలో తెలిసిన భారం గల కర్బన సమ్మేళనాన్ని సధూమ HNO₃ తో AgNO₃ సమక్షంలో ఒక ప్రత్యేకమైన బలమైన గాజు నాళికలో వేడి చేస్తారు. అప్పుడు సమ్మేళనంలోని C, H లు CO₂, H₂O లుగా ఆక్సీకరణం చెందుతాయి. హాలోజన్లు సిల్వర్ హాలైడ్లుగా మారతాయి. సిల్వర్హాలైడ్లను వడపోత ద్వారా వేరుచేసి, కడిగి, పొడిగా చేసి భారం కనుక్కొంటారు. గణన : కర్బన సమ్మేళన భారం = a g
సిల్వర్ హాలైడ్ భారం = b g
1 మోల్ AgX లో 1 మోల్ X ఉన్నది.
∴ b g AgX లో హాలోజన్ ….. ?
= \( \mathrm{\frac{M_X \times b}{M_{AgX}}} \) = ‘c’ g
a g ల కర్బన సమ్మేళనంలో c g హాలోజన్ ఉన్నది.
∴ హాలోజన్ భారశాతం \( \mathrm{= \frac{100 \times c}{a} = \frac{100 \times b \times M_X}{a \times M_{AgX}}} \)
(MX = X యొక్క పరమాణు ద్రవ్యరాశి, MAgX = AgX యొక్క అణు ద్రవ్యరాశి)

Exam Tips:

a) కేరియస్: AgNO₃ + సధూమ HNO₃, మూసిన గొట్టం; %X = (X పరమాణు ద్రవ్యరాశి × b × 100) / (AgX అణు ద్రవ్యరాశి × a).

 

Question 40: కార్సినోజెనిసిటీ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలతో వివరించండి.

Answer:

బెంజీన్, ఇంకా అనేక బహుకేంద్రక వలయాల హైడ్రోకార్బన్లు విషపదార్థాలే కాక క్యాన్సర్ కారకాలు. వాటిలో ఎక్కువ పదార్థాలు పొగాకు, పెట్రోలియం, బొగ్గు వంటి కర్బన పదార్థాలు పూర్తిగా దహనం చెందకుంటే ఏర్పడతాయి. ఇవి మానవ శరీరాల్లో అనేక రసాయన చర్యలకు లోనై DNA ను నాశనం చేసి క్యాన్సర్ను కలుగజేస్తాయి. దీనినే కార్సినోజెనిసిటీ అంటారు.
ఉదా:
1,2-బెంజో ఆంత్రసీన్ మరియు 3-మిథైల్ కోలాంత్రీన్

Exam Tips:

a) కార్సినోజెన్లు బహుచక్రీయ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (1,2-బెంజో ఆంత్రసీన్, 3-మిథైల్ కోలాంత్రీన్); అసంపూర్ణ దహనం వీటికి మూలం.

 

Free study material for Chemistry

Free TS Board Textbook Explanations: Class 11 Chemistry Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques

Official TS Board Solutions for Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques

Review comprehensive exercise answers for Class 11 Chemistry Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Step-by-Step Explanations for Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 13 Organic Chemistry - Some Basic Principles and Techniques concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Chemistry Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Chemistry.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest TS Board curriculum.

Are the Chemistry TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు in both English and Hindi medium.

Is it possible to download the Chemistry TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Chemistry Study Material Chapter 13 కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు in printable PDF format for offline study on any device.