Step-by-Step Textbook Solutions for Class 11 Chemistry Chapter 10 p-Block Elements - Group 13
Review structured textbook solutions for Class 11 Chemistry Chapter 10 p-Block Elements - Group 13. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download Chapter 10 p-Block Elements - Group 13 Textbook Solutions PDF
View or download the dedicated Chapter 10 p-Block Elements - Group 13 solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Chemistry.
అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు
Question 1: బోరాన్, థాలియం ఆక్సిడేషన్ స్థితుల మార్పు విధానాన్ని చర్చించండి.
Answer:
IIIA గ్రూపు మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns² np¹. ఈ విన్యాసం వలన ఈ మూలకాలన్ని +3 ఆక్సిడేషన్ స్థితిని కనపరుస్తాయి. B, Al మినహా మిగిలిన అన్ని మూలకాలు +1 ఆక్సిడేషన్ స్థితిని చూపిస్తాయి. +3 ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం B నుంచి Tl కు తగ్గుతుంది. +1 ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం వలన పై నుంచి క్రిందకు పెరుగుతుంది.
Exam Tips:
a) +3 స్థితి B → Tl కు తగ్గుతుందని, +1 స్థితి పెరుగుతుందని రెండూ రాయండి; కారణంగా జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావాన్ని తప్పక పేర్కొనండి.
Question 2: Tl Cl₃ అధిక స్థిరత్వాన్ని ఎట్లా వివరిస్తారు ?
Answer:
TlCl₃ అస్థిరమైనది. జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం వలన Tl³⁺ అయాన్ అస్థిరం. థాలియం +1 ఆక్సీకరణ స్థితిలో స్థిరంగా ఉంటుంది. కావున TlCl స్థిరమైనది.
Exam Tips:
a) Tl⁺ స్థిరమైనది, Tl³⁺ అస్థిరం అని స్పష్టంగా రాయండి; కారణం ns² జడ ఎలక్ట్రాన్ జంట.
Question 3: BF₃ లూయీ ఆమ్లంగా ఎందుకు ప్రవర్తిస్తుంది ?
Answer:
BF₃ ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనం.
అష్టక విన్యాసం పొందటం కోసం ఇది ఎలక్ట్రాన్ జంటను స్వీకరిస్తుంది. ఎలక్ట్రాన్ జంటల స్వీకర్తలను లూయీ ఆమ్లాలు అంటారు.
కావున BF₃ లూయీ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది.
Exam Tips:
a) లూయీ ఆమ్లం = ఎలక్ట్రాన్ జంట స్వీకర్త అనే నిర్వచనంతో మొదలుపెట్టండి.
b) BF₃ లో B చుట్టూ 6 ఎలక్ట్రాన్లే ఉంటాయని (అసంపూర్ణ అష్టకం) చెప్పండి.
Question 4: బోరిక్ ఆమ్లం ప్రోటాన్ ఇచ్చే ఆమ్లమా ? వివరించండి.
Answer:
బోరిక్ ఆమ్లం ప్రోటాన్ ఇచ్చే ఆమ్లము కాదు. కాని ఇది లూయీ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది.
ఇది ఎలక్ట్రాన్ జంటను హైడ్రాక్సిల్ అయాన్ నుంచి స్వీకరించి లూయీ ఆమ్లంగా పనిచేస్తుంది.
\( \mathrm{B(OH)_3 + 2HOH \longrightarrow [B(OH)_4]^{-} + H_3O^{+}} \)
Exam Tips:
a) B(OH)₃ H⁺ ను ఇవ్వదు, OH⁻ ను స్వీకరిస్తుంది - ఈ తేడాను సమీకరణంతో చూపండి.
Question 5: బోరిక్ ఆమ్లాన్ని వేడిచేస్తే ఏమవుతుంది ?
Answer:
బోరిక్ ఆమ్లాన్ని 370K కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడిచేస్తే మెటాబోరికామ్లం (HBO₂) ఏర్పడుతుంది. దీనిని ఇంకా వేడిచేస్తే బోరిక్ ఆక్సైడ్ (B₂O₃) ఏర్పడుతుంది.
\( \mathrm{H_3BO_3} \xrightarrow{\Delta} \mathrm{HBO_2} \xrightarrow{\Delta} \mathrm{B_2O_3} \)
Exam Tips:
a) ఉష్ణోగ్రతల క్రమం గుర్తుంచుకోండి: 370 K వద్ద HBO₂, 435 K వద్ద H₂B₄O₇, ఎర్రగా కాల్చితే B₂O₃.
Question 6: BF₃, BH₄⁻ ల ఆకారాలను వర్ణించండి. ఈ కణాలలో బోరాన్ సంకరకరణం రాయండి.
Answer:
BF₃ అణువు ఆకారం సమతల త్రిభుజాకారం. దీనిలో బోరాన్ sp² సంకరీకరణం జరుపుకుంటుంది.
BH₄⁻ అయాన్ ఆకారం టెట్రాహెడ్రల్. దీనిలో బోరాన్ sp³ సంకరీకరణం జరుపుకుంటుంది.
Exam Tips:
a) BF₃ - sp², సమతల త్రిభుజాకారం; BH₄⁻ - sp³, టెట్రాహెడ్రల్ అని జతగా రాయండి.
Question 7: Ga పరమాణు వ్యాసార్ధం Al కంటే ఎందుకు తక్కువ ఉంటుంది ? వివరించండి.
Answer:
గాలియంలో ఉపాంత్యకర్పరంలో పది 3d – ఎలక్ట్రాన్లు ఉంటాయి.
ఈ ఎలక్ట్రాన్ల వలన పరిరక్షక ప్రభావం తక్కువగా ఉంటుంది. కావున ‘Ga’ లో ప్రభావవంతమైన కేంద్రక ఆవేశం పెరుగుతుంది.
కావున Ga యొక్క పరమాణు వ్యాసార్ధం Al కంటే తక్కువగా ఉంటుంది.
Exam Tips:
a) Ga లో 3d¹⁰ ఎలక్ట్రాన్ల పరిరక్షక ప్రభావం బలహీనం కావడమే ముఖ్య కారణం; Z_eff పెరగడం అని ముగించండి.
Question 8: జడజంట ప్రభావాన్ని వివరించండి.
Answer:
బాహ్యస్థాయిలోని ns² ఎలక్ట్రాన్ జంట బంధంలో పాల్గొనకుండా జడంగా ఉండిపోయే ప్రభావాన్ని జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం అంటారు.
Exam Tips:
a) జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం భారీ మూలకాల (Ga, In, Tl, Pb) లో కనిపిస్తుందని ఉదాహరణ రాయండి.
Question 9: ఈ క్రింది సమీకరణాలను తుల్యంచేసి రాయండి.
a) BF₃ + LiH →
b) B₂H₆ + H₂O →
c) NaH + B₂H₆
d)
\( \mathrm{H_3BO_3} \xrightarrow{\Delta} \)
e)
\( \mathrm{B_2H_6 + NH_3} \xrightarrow{\Delta} \)
Answer:
a) 2BF₃ + 6LiH → B₂H₆ + 6LiF
b) B₂H₆ + 6H₂O → 2 H₃BO₃ + 6H₂
c) 2NaH + B₂H₆ → 2 NaBH₄
d)
\( \mathrm{H_3BO_3} \xrightarrow[373\,K]{\Delta} \mathrm{HBO_2} \xrightarrow{\Delta} \mathrm{B_2O_3} \)
e)
\( 3\mathrm{B_2H_6} + 6\mathrm{NH_3} \longrightarrow 3[\mathrm{BH_2(NH_3)_2}]^{+}[\mathrm{BH_4}]^{-} \xrightarrow{\Delta} 2\mathrm{B_3N_3H_6} + 12\mathrm{H_2} \)
Exam Tips:
a) సమీకరణాల్లో రెండు వైపులా పరమాణువుల సంఖ్య సరిచూసుకోండి; B₂H₆ చర్యలు: జలవిశ్లేషణ, NaH తో NaBH₄, NH₃ తో వేడి చేస్తే బోరజీన్.
Question 10: బోరిక్ ఆమ్లం బహ్వణుకగా ఎందుకు ఉంటుంది ?
Answer:
బోరిక్ ఆమ్లం పొరలవంటి జాలక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ నిర్మాణంలో BO₃ యూనిట్లు హైడ్రోజన్ బంధాలతో కలుపబడి బహ్వణుక (పాలిమర్) అణువుగా ఏర్పడుతుంది.
Exam Tips:
a) పొరల నిర్మాణం + హైడ్రోజన్ బంధాలు = బహ్వణుకం అనే రెండు అంశాలు రాయండి.
Question 11: డైబోరేన్, బోరజీన్లలో బోరాన్ సంకరకరణం ఏమిటి ?
Answer:
డై బోరేన్లో బోరాన్ sp³ సంకరీకరణం జరుపుకుంటుంది.
బోరజీన్‌లో బోరాన్ sp² సంకరీకరణం జరుపుకుంటుంది.
Exam Tips:
a) B₂H₆ - sp³, B₃N₃H₆ - sp² అని గుర్తుంచుకోండి.
Question 12: 13 గ్రూప్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి.
Answer:
13 గ్రూపు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం:
| మూలకం | పరమాణు సంఖ్య | ఎలక్ట్రాన్ విన్యాసం |
| బోరాన్ (B) | 5 | [He] 2s² 2p¹ |
| అల్యూమినియం (Al) | 13 | [Ne] 3s² 3p¹ |
| గాలియం (Ga) | 31 | [Ar] 3d¹⁰ 4s² 4p¹ |
| ఇండియం (In) | 49 | [Kr] 4d¹⁰ 5s² 5p¹ |
| థాలియం (Tl) | 81 | [Xe] 4f¹⁴ 5d¹⁰ 6s² 6p¹ |
Exam Tips:
a) Ga, In, Tl లో (n-1)d¹⁰ ఉంటుందని, Tl లో 4f¹⁴ కూడా ఉంటుందని మర్చిపోకండి.
Question 13: బోరజీన్ సాంకేతికాన్ని రాయండి. దాని సాధారణ నామం ఏమిటి?
Answer:
బోరజీన్ను B₃N₃H₆ అనే ఫార్ములాతో సూచిస్తారు.
దీని నిర్మాణం బెంజీన్ నిర్మాణాన్ని పోలి ఉండటం వలన దీనిని ఇనార్గానిక్ బెంజీన్ అని అంటారు.
Exam Tips:
a) బోరజీన్ B₃N₃H₆; బెంజీన్ లాంటి వలయ నిర్మాణం వల్ల 'ఇనార్గానిక్ బెంజీన్' అని పేరు.
Question 14: (a) బోరాక్స్
(b) కోలిమనైట్ సాంకేతికాలు ఇవ్వండి.
Answer:
a) బోరాక్స్ ఫార్ములా Na₂B₄O₇ · 10H₂O
b) కోలిమనైట్ ఫార్ములా Ca₂B₆O₁₁ · 5H₂O
Exam Tips:
a) బోరాక్స్ లో 10 H₂O (స్ఫటిక జలం) ఉండటం మర్చిపోకండి.
Question 15: అల్యూమినియం ఉపయోగాలు రెండు రాయండి.
Answer:
అల్యూమినియమ్ను మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తారు. విమాన విడిభాగాల తయారీలో ఉపయోగిస్తారు.
పైపులు, ట్యూబులు, రాడ్లు, తీగలు వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు. నిర్మాణాలలో, రవాణా పరిశ్రమల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు.
Exam Tips:
a) రెండు ఉపయోగాలు అడిగారు కాబట్టి రెండింటిని వేర్వేరు పాయింట్లుగా రాయండి.
Question 16: కింది చర్యల్లో ఏమి జరుగుతుంది ?
(a) LiAlH₄, BCl₃ మిశ్రమాన్ని అనార్ద్ర ఈథర్‌లో వేడిచేసినప్పుడు
b) బోరాక్స్‌ను H₂SO₄ తో వేడిచేసినప్పుడు
Answer:
a) LiAlH₄, BCl₃ మిశ్రమాన్ని అనార్ద్ర ఈథర్‌లో వేడిచేసినపుడు డైబోరేన్ ఏర్పడుతుంది.
\( 4\mathrm{BCl_3} + 3\mathrm{LiAlH_4} \xrightarrow{\text{పొడి ఈథర్}} 2\mathrm{B_2H_6} + 3\mathrm{LiCl} + 3\mathrm{AlCl_3} \)
b) బోరాక్స్‌ను H₂SO₄ తో వేడిచేసినపుడు బోరిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
Na₂B₄O₇ + H₂SO₄ + 5H₂O → Na₂SO₄ + 4H₃BO₃
Exam Tips:
a) ప్రతి చర్యకు సమీకరణం కూడా రాయండి; బోరాక్స్ + H₂SO₄ → బోరిక్ ఆమ్లం.
Question 17: ఆర్థోబోరిక్ ఆమ్ల నిర్మాణాన్ని గీయండి.
Answer:
ఆర్థోబోరిక్ ఆమ్లం నిర్మాణం:
Exam Tips:
a) నిర్మాణ పటంలో హైడ్రోజన్ బంధాలను చుక్కల గీతలతో చూపండి; షట్భుజి వలయం స్పష్టంగా ఉండాలి.
Question 18: AlCl₃ ద్విఅణుక నిర్మాణాన్ని రాయండి.
Answer:
AlCl₃ ద్విఅణుక నిర్మాణం:
Exam Tips:
a) Al₂Cl₆ లో రెండు వారధి Cl లు ఉంటాయి; వారధి బంధం (221 pm) అంత్య బంధం (206 pm) కంటే పొడవు.
Question 19: లోహ బోరైడ్లను (¹⁰B) రక్షణ కవచాలుగా వాడతారు. ఎందుకు ?
Answer:
లోహ బోరైడ్లకు (¹⁰B) న్యూట్రాన్లను శోషించుకొనే సామర్థ్యం కలదు. కావున వీనిని న్యూక్లియర్ పరిశ్రమలలో రక్షణ కవచాలుగా వాడతారు.
Exam Tips:
a) ¹⁰B న్యూట్రాన్లను శోషించుకుంటుంది అనే ఒక్క కారణం స్పష్టంగా, న్యూక్లియర్ రియాక్టర్ ఉదాహరణతో రాయండి.
లఘు సమాధాన ప్రశ్నలు
Question 20: అల్యూమినియం ద్విస్వభావ (ఆమ్ఫోటెరిక్) లోహమని రుజువు చేసే చర్యలు రాయండి.
Answer:
అల్యూమినియం ఆమ్ల మరియు క్షారద్రావణాలలో కరుగుతుంది. కావున దీనికి ద్విస్వభావం కలదు.
విలీన ఆమ్లాలలో Al కరిగి H₂ వాయువును విడుదల చేస్తుంది.
2 Al + 6 HCl → 2 AlCl₃ + 3H₂↑
క్షారాలలో Al కరిగి H₂ వాయువును విడుదలచేస్తుంది.
2 Al + 2NaOH + 6H₂O → 2 Na⁺ [Al(OH)₄]⁻ + 3H₂
Exam Tips:
a) Al ఆమ్లం (HCl) తో, క్షారం (NaOH) తో - రెండింటి సమీకరణాలు రాస్తేనే ద్విస్వభావం రుజువవుతుంది.
Question 21: ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలంటే ఏమిటి ? BCl₃ ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనమా ? వివరించండి.
Answer:
అష్టక విన్యాసాన్ని పొందని కేంద్రక పరమాణువులు కలిగి ఉన్న అణువులను ఎలక్ట్రాన్ కొరత గల అణువులు అంటారు.
BCl₃ ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనం. దీనిలో కేంద్రకం B చుట్టూ 6 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి.
BCl₃ అణువులోని కేంద్రక బోరాన్ పరమాణువు అష్టక విన్యాసాన్ని పొందలేదు.
Exam Tips:
a) ఎలక్ట్రాన్ కొరత నిర్వచనం + BCl₃ లో B చుట్టూ 6 ఎలక్ట్రాన్లు అనే లెక్క రెండూ ఇవ్వండి.
Question 22: BF₃, BF₄⁻ లో B – F బంధ దూరాలు వరసగా 130 pm, 143 pm ఎందుకు వేరువేరుగా ఉన్నాయో కారణాలు సూచించండి.
Answer:
BF₃ లో B పరమాణువు sp² సంకరీకరణం జరుపుకుంటుంది. ఇది సమతల త్రిభుజాకృతిని కలిగి ఉంటుంది. BF₃ లో బోరాన్ పరమాణువు ఫ్లోరిన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ జంటను స్వీకరించి దానితో బ్యాక్ బంధం (pπ–pπ)లో పాల్గొంటుంది. కావున B – F బంధము కొంత ద్విబంధ స్వభావాన్ని కలిగి ఉంటుంది.
కాని BF₄⁻ లో B పరమాణువు sp³ సంకరీకరణం జరుపుకుంటుంది. ఇది టెట్రాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉంటుంది. బోరాన్‌కు ఫ్లోరిన్‌కు మధ్య బ్యాక్ బంధం ఉండదు.
కావున BF₃ లో బంధ దూరం 130 pm ఉంటే BF₄⁻ లో 143 pm ఉంటుంది.
Exam Tips:
a) BF₃ లో pπ-pπ బ్యాక్ బంధం వల్ల B–F కు ద్విబంధ స్వభావం వచ్చి బంధం చిన్నదవుతుంది; BF₄⁻ లో ఇది లేదు.
Question 23: B – Cl బంధానికి బంధ భ్రామకం ఉంది కాని BCl₃ అణువుకు ద్విధ్రువ భ్రామకం సున్నా ఉంటుంది. వివరించండి.
Answer:
B – Cl బంధం ధ్రువ బంధం కావున బంధ భ్రామకం ఉంటుంది. కాని BCl₃ అణువు సౌష్టవ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మూడు B – Cl బంధ భ్రామకాలు వ్యతిరేక దిశలలో పనిచేయటం వలన మొత్తం ద్విధ్రువ భ్రామకం సున్నాగా ఉంటుంది.
Exam Tips:
a) సౌష్ఠవ సమతల నిర్మాణం వల్ల బంధ భ్రామకాల సదిశ మొత్తం సున్నా అని రాసి పటం గీయండి.
Question 24: బోరిక్ ఆమ్లం నిర్మాణాన్ని వివరించండి.
Answer:
బోరిక్ ఆమ్లం పొరలవంటి జాలక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
ఈ నిర్మాణంలో BO₃ యూనిట్లు హైడ్రోజన్ బంధాలతో కలపబడి ఉంటాయి. కావున బోరిక్ ఆమ్లం బహ్వణుక అణువుగా ఉంటుంది.
ఆర్థోబోరిక్ ఆమ్లం నిర్మాణం:
Exam Tips:
a) బోరిక్ ఆమ్ల నిర్మాణ పటం తప్పనిసరి; BO₃ యూనిట్లు హైడ్రోజన్ బంధాలతో కలుస్తాయని రాయండి.
Question 25: ఏమి జరుగుతుంది:
a) బోరాక్స్‌ను ప్రబలంగా వేడిచేస్తే,
b) బోరిక్ ఆమ్లాన్ని నీటికి కలిపితే,
c) అల్యూమినియాన్ని సజల NaOH తో వేడిచేస్తే
d) అమ్మోనియాతో BF₃ చర్య జరిపినప్పుడు
e) ఆర్ద్ర అల్యూమినాను సజల NaOH ద్రావణంతో చర్య జరిపినప్పుడు
Answer:
a) బోరాక్స్‌ను ప్రబలంగా వేడిచేస్తే చివరగా గాజువంటి పదార్థం ఏర్పడుతుంది.
\( \mathrm{Na_2B_4O_7 \cdot 10H_2O} \xrightarrow{\Delta} \underset{\text{సోడియం టెట్రాబోరేట్}}{\mathrm{Na_2B_4O_7}} \xrightarrow{\Delta} \underset{\text{గాజువంటి పదార్థం (బోరాక్స్ పూస)}}{2\mathrm{NaBO_2} + \mathrm{B_2O_3}} \)
b) బోరిక్ ఆమ్లానికి నీటిని కలిపితే బోరిక్ ఆమ్లం నీటి నుంచి OH అయాన్లను స్వీకరిస్తుంది.
B(OH)₃ + 2H₂O → [B(OH)₄]⁻ + H₃O⁺
c) Al ను సజల NaOH తో వేడిచేస్తే సోడియం మెటా అల్యూమినేట్తో పాటు H₂ వాయువు విడుదలవుతుంది.
\( 2\mathrm{Al} + 2\mathrm{NaOH} + 2\mathrm{H_2O} \longrightarrow \underset{\text{సోడియం మెటా అల్యూమినేట్}}{2\mathrm{NaAlO_2}} + 3\mathrm{H_2} \uparrow \)
d) BF₃ ను NH₃ తో చర్య జరిపినపుడు NH₃ ఎలక్ట్రాన్ జంటను BF₃ కి దానం చేస్తుంది. రెండింటి మధ్య సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
BF₃ + NH₃ → [BF₃ ← NH₃] లేదా [BF₃ . NH₃]
e) ఆర్ద్ర అల్యూమినాను (Al₂O₃·2H₂O) సజల NaOH ద్రావణంతో చర్య జరిపితే సోడియం మెటా అల్యూమినేట్ ఏర్పడుతుంది.
\( \mathrm{Al_2O_3 \cdot 2H_2O} + 2\mathrm{NaOH} \longrightarrow \underset{\text{సోడియం మెటా అల్యూమినేట్}}{2\mathrm{NaAlO_2}} + 3\mathrm{H_2O} \)
Exam Tips:
a) ప్రతి ఉప ప్రశ్నకు సమీకరణం రాయండి; Al + NaOH చర్యలో H₂O కూడా పాల్గొంటుంది - సమీకరణం తుల్యం చేయండి.
Question 26: కారణాలు తెలపండి:
a) అల్యూమినియం పాత్రలలో గాఢ HNO₃ రవాణా చేయవచ్చు.
b) సజల NaOH, అల్యూమినియం ముక్కల మిశ్రమాన్ని మురుగు కాలువను తెరవడానికి వాడతారు.
c) అల్యూమినియం మిశ్రమలోహాన్ని విమానాలను తయారుచేయడానికి వాడతారు.
d) అల్యూమినియం పాత్రలను రాత్రంతా నీళ్ళలో పెట్టకూడదు.
e) అల్యూమినియం తీగలను ప్రసార కేబుల్ తయారీకి వాడతారు.
Answer:
a) Al మరియు గాఢ HNO₃ కి మధ్య చర్యారాహిత్యం కలదు. అందువలన అల్యూమినియం పాత్రలలో గాఢ HNO₃ని రవాణా చేయవచ్చు.
b) సజల NaOH అల్యూమినియమ్ చర్య జరిపి H₂ వాయువును విడుదలచేస్తుంది. ఈ వాయు పీడనం వలన మురుగు కాలువలు తెరచుకుంటాయి. కావున సజల NaOH, Al మిశ్రమాన్ని మురుగు కాలువను తెరవటానికి వాడతారు.
c) Al తేలికయిన, బలమైన లోహం. గాలిలో క్షయం చెందదు. కావున దీనిని విమాన విడిభాగాలను తయారుచేయటానికి వాడతారు.
d) అల్యూమినియమ్ పాత్రలను రాత్రంతా నీటిలో పెట్టకూడదు. నీటిలోని లవణాలు పాత్ర ఉపరితలంపై ఉన్న ఆక్సైడ్ పొరతో చర్య జరిపి అల్యూమినియమ్యొక్క చర్యాశీలతను పెంచుతాయి. దీనివలన Al నీటితో చర్య జరుపుతుంది.
e) అల్యూమినియమ్ తీగలను ప్రసార కేబుల్ తయారీకి వాడతారు. దీనికి కారణం దాని యొక్క మంచి విద్యుద్వాహకత.
Exam Tips:
a) కారణాలు రాసేటప్పుడు ప్రతి ఉప భాగానికి ఒకటి లేదా రెండు వాక్యాల కారణం సరిపోతుంది; గాఢ HNO₃ లో Al నిష్క్రియత (ఆక్సైడ్ పొర) ముఖ్యం.
Question 27: Ga, In, Tl లలో రుణవిద్యుదాత్మకత భేదం ఎందుకు ఎక్కువగా మారదో వివరించండి.
Answer:
Ga మరియు In లలో d ఎలక్ట్రాన్ల వలన పరిరక్షక ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే Tl లో ‘d’ మరియు ‘f’ ఎలక్ట్రాన్ల వలన పరిరక్షక ప్రభావం తక్కువగా ఉంటుంది. కావున Ga, In, Tl ల యొక్క పరమాణు పరిమాణంలో పెద్దగా మార్పు ఉండదు. కాని కేంద్రక ఆవేశం మాత్రము పెరుగుతుంది. కావున ఈ మూడు మూలకాల ఋణవిద్యుదాత్మకత విలువలలో భేదం ఎక్కువగా మారదు.
Exam Tips:
a) d, f ఎలక్ట్రాన్ల బలహీన పరిరక్షణ వల్ల Z_eff పెరుగుతుందని, అందువల్ల పరిమాణం దాదాపు స్థిరమని రాయండి.
Question 28: సరైన ఉదాహరణతో బోరాక్స్ పూస పరీక్షను వివరించండి. (మార్చి 2013)
Answer:
బోరాక్స్‌ను వేడిచేస్తే మొదట నీటి అణువులను కోల్పోయి ఉబ్బి పరిమాణంలో పెద్దదవుతుంది. ఇంకా వేడిచేస్తే అది పారదర్శక ద్రవంగా మారి ఘనీభవనం చెంది గాజులాంటి పదార్థంగా మారుతుంది. దీనిలో సోడియం బొరేట్ మరియు B₂O₃ ఉంటాయి. ఈ B₂O₃ ను లోహ ఆక్సైడ్ తో కలిపి వేడి చేస్తే లోహ మెటాబొరేట్లు ఏర్పడతాయి. ఈ మెటాబొరేట్లు ప్రత్యేకమైన రంగును కలిగి ఉంటాయి. వచ్చిన రంగును బట్టి లవణంలోని కాటయాన్ను గుర్తించవచ్చును.
Na₂B₄O₇ + CoO → 2NaBO₂ + Co(BO₂)₂
ఆక్సీకరణ, క్షయకరణ జ్వాలలో వేడి చేసినపుడు ఒక్కొక్క లోహం ఒక్కొక్క రంగుగల మెటాబోరేట్లను ఏర్పరుస్తుంది. దీనిని బోరాన్ పూస పరీక్ష అంటారు.
Exam Tips:
a) ఒక ఉదాహరణతో (CoO - నీలి రంగు) సమీకరణం ఇవ్వండి; బోరాక్స్ → NaBO₂ + B₂O₃ దశలు చూపండి.
Question 29: డైబోరేన్ నిర్మాణాన్ని వివరించండి.
Answer:
డైబోరేన్ నిర్మాణము:
డైబోరేన్‌లో రెండు సమతల BH₂ గ్రూపులు ఉంటాయి. ఈ రెండు BH₂ గ్రూపులను కలుపుతూ రెండు H పరమాణువులు ఉంటాయి. రెండు బోరాన్పరమాణువులకు అతకబడి ఉన్న నాలుగు H లను అంత్య హైడ్రోజన్లు అని, BH₂ గ్రూపులను కలిపే రెండు H పరమాణువులను వారధి (బ్రిడ్జ్) H పరమాణువులని అంటారు.
B₂H₆ లో రెండు బోరాన్ పరమాణువులు sp³ సంకరీకరణం జరుపుకొని నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి. ప్రతి బోరాన్లో నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్లలో ఒక ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్ ఉండదు.
ప్రతి బోరాన్లోని రెండు బంధ ఎలక్ట్రాన్లు గల sp³ సంకర ఆర్బిటాల్స్ రెండు హైడ్రోజన్ల యొక్క s ఆర్బిటాల్స్తో అతిపాతం చెంది సహజమైన B-H బంధాలు (2 – కేంద్రక 2 – ఎలక్ట్రాన్లు) ఏర్పడతాయి.
ఒక బోరాన్లోని బంధ ఎలక్ట్రాన్ గల sp³ సంకర ఆర్బిటాల్, వేరొక బోరాన్లోని ఖాళీ sp³ సంకర ఆర్బిటాల్ మరియు H యొక్క 1s ఆర్బిటాల్‌తో అతిపాతం చెంది B-H-B బ్రిడ్జ్ (వారధి) బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా B₂H₆ లో రెండు B- H-B బ్రిడ్జ్ బంధాలు ఏర్పడతాయి. ఈ బంధాలనే బనానా బంధాలు అని లేదా 3-కేంద్రక-2-ఎలక్ట్రాన్ బంధాలని అంటారు.
Exam Tips:
a) B–H–B వారధి బంధం = 3-కేంద్రక 2-ఎలక్ట్రాన్ (బనానా) బంధం; మొత్తం 4 అంత్య, 2 వారధి H లు అని స్పష్టంగా రాయండి.
Question 30: ఆమ్లాలతో అల్యూమినియం చర్యలను వివరించండి.
Answer:
1. అల్యూమినియమ్ విలీన లేదా గాఢ HCl లో కరిగి H₂ వాయువును విడుదలచేస్తుంది.
2Al + 6HCl → 2AlCl₃ + 3H₂ ↑
2. అల్యూమినియమ్ విలీన H₂SO₄ లో H₂ ను విడుదలచేస్తుంది.
2Al + 3H₂SO₄ → Al₂ (SO₄)₃ + 3H₂ ↑
3. అల్యూమినియమ్ గాఢ H₂SO₄ లో కరిగి SO₂ ను ఇస్తుంది.
2Al + 6H₂SO₄ → Al₂(SO₄)₃ + 3SO₂ + 6H₂O
4. అతి విలీన HNO₃ ని అల్యూమినియమ్ NH₄NO₃ గా క్షయకరణం చేస్తుంది.
8Al + 30HNO₃ → 8Al (NO₃)₃ + 3NH₄NO₃ + 9H₂O
5. గాఢ HNO₃ తో Al క్రియారహితం అవుతుంది. లోహపు ఉపరితలంపై పలుచని ఆక్సైడ్ పొర ఏర్పడటం వలన క్రియారాహిత్యం వస్తుంది.
Exam Tips:
a) విలీన HCl, విలీన H₂SO₄, గాఢ H₂SO₄ (SO₂), అతి విలీన HNO₃ (NH₄NO₃), గాఢ HNO₃ (నిష్క్రియత) - ఐదు చర్యలను క్రమంగా రాయండి.
Question 31: గ్రూపు 13లో బోరాన్ అసంగత ప్రవర్తనను సంక్షిప్తంగా రాయండి.
Answer:
బోరాన్ పరమాణు సైజు చిన్నది కావటం, అయొనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండటం వలన మిగిలిన మూలకాలతో అసంగత ప్రవర్తనను చూపిస్తుంది. ఉదా : బోరాన్ అలోహం, Al ద్విస్వభావ లోహం, Ga, In, Tl లు లోహాలు. బోరాన్ ఎల్లప్పుడు కోవలంట్ సమ్మేళనాలను ఇస్తుంది. కాని మిగిలిన మూలకాలు అయానిక సమ్మేళనాలను ఇస్తాయి.
బోరాన్‌కు సిలికాన్‌తో కర్ణ సంబంధం ఉంటుంది. మిగిలిన మూలకాలు ఈ కర్ణ సంబంధాన్ని చూపవు.
ఆమ్లాల నుండి బోరాన్ H₂ ను స్థానభ్రంశం చేయదు. కాని మిగిలిన మూలకాలు H₂ స్థానభ్రంశం చెందిస్తాయి. బోరాన్ ఆక్సైడ్ ఆమ్ల ఆక్సైడ్. కాని మిగిలిన మూలకాల ఆక్సైడ్లు ద్విస్వభావ ఆక్సైడ్లుగా గాని క్షార ఆక్సైడ్లుగా గాని ఉంటాయి.
సరళ బోరేట్లు, సిలికేటులు తేలికగా పాలిమరీకరణం చెంది పాలీ ఆమ్లాలను ఇస్తాయి. మిగిలిన మూలకాలు పాలిమర్ ఆమ్లాలను ఇవ్వవు.
బోరాన్ అత్యధిక కో వేలన్సీ 4. ఇతర మూలకాల అత్యధిక కోవలన్సీ 6.
బోరాన్ స్థిరమైన కోవలెంట్ హైడ్రైడ్లను (బోరేన్లు) ఇస్తుంది. మిగిలిన మూలకాలు స్థిరమైన హైడ్రైడ్లను ఇవ్వవు.
Exam Tips:
a) బోరాన్ చిన్న పరిమాణం, అధిక అయనీకరణ శక్తి మూల కారణాలు; అలోహం, కోవలెంట్ సమ్మేళనాలు, Si తో కర్ణ సంబంధం వంటి పాయింట్లను పట్టిక లాగా రాయండి.
Question 32: అల్యూమినియం సజల HNO₃ తో చర్య జరుపుతుంది కాని గాఢ HNO₃ తో చర్య జరపదు. వివరించండి.
Answer:
విలీన HNO₃ తో అల్యూమినియమ్ చర్యజరిపి HNO₃ ని NH₄ NO₃ గా క్షయకరణం చేస్తుంది.
8Al + 30HNO₃ → 8Al(NO₃)₃ + 3NH₄NO₃ + 9H₂O
కాని గాఢ HNO₃ కి అల్యూమినియమ్ను కలిపినపుడు లోహపు తలంపై పలుచని ఆక్సైడ్పొర ఏర్పడుతుంది. ఈ ఆక్సైడ్ పొర రక్షిత పొరగా పనిచేసి Al ని HNO₃ తో చర్య జరగకుండా అడ్డుకుంటుంది. కావున గాఢ HNO₃ తో Al క్రియారహితం అవుతుంది.
Exam Tips:
a) విలీన HNO₃: NH₄NO₃ ఏర్పడుతుంది; గాఢ HNO₃: రక్షిత Al₂O₃ పొర వల్ల చర్య జరగదు.
Question 33: డైబోరేన్ ను తయారుచేసే రెండు పద్ధతులు రాయండి.
Answer:
డైబోరేన్ [B₂H₆] ను తయారుచేయు పద్ధతులు:
బోరాన్ ట్రై ఫ్లోరైడు లిథియమ్ అల్యూమినియమ్ హైడ్రైడ్తో డైఈథైల్ ఈథర్‌లో చర్య జరిపి డైబోరేన్ను తయారుచేస్తారు.
4BF₃ + 3LiAlH₄ → 2B₂H₆ + 3LiF + 3AlF₃
ప్రయోగశాలలో సోడియం బోరోహైడ్రైడు, అయోడిన్ ఆక్సీకరణం చేసి డైబోరేన్ను తయారుచేస్తారు.
2NaBH₄ + I₂ → B₂H₆ + 2NaI + H₂
పారిశ్రామికంగా డైబోరేన్ను ఉత్పత్తి చేయడానికి BF₃ ని సోడియం హైడ్రైడ్తో చర్య జరిపిస్తారు.
\( 2\mathrm{BF_3} + 6\mathrm{NaH} \xrightarrow{450\,K} \mathrm{B_2H_6} + 6\mathrm{NaF} \)
Exam Tips:
a) రెండు పద్ధతులు అడిగితే రెండు తుల్య సమీకరణాలు రాయండి (LiAlH₄ తో, NaBH₄ + I₂ తో లేదా NaH తో).
Question 34: డైబోరేన్ ఈ కింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది ?
a) H₂O
b) CO
c) N(CH₃)₃
Answer:
a) డైబోరేన్ నీటితో చర్య : డైబోరేన్ నీటిలో జలవిశ్లేషణ చెంది బోరిక్ ఆమ్లాన్ని ఇస్తుంది.
\( \mathrm{B_2H_6} + 6\mathrm{H_2O} \longrightarrow \underset{\text{బోరిక్ ఆమ్లం}}{2\mathrm{B(OH)_3}} + 6\mathrm{H_2} \)
b) డైబోరేన్ CO తో చర్య : డైబోరేన్ 1000°C ఉష్ణోగ్రత మరియు 2 atm పీడనం వద్ద CO తో చర్య జరిపి బోరేన్ కార్బొనైల్ను ఏర్పరుస్తుంది.
\( \mathrm{B_2H_6} + 2\mathrm{CO} \xrightarrow[2\,atm]{1000^\circ C} 2(\mathrm{BH_3 \cdot CO}) \)
c) డైబోరేన్ N(CH₃)₃ తో చర్య : డైబోరేన్ N(CH₃)₃ తో చర్య జరిపి బోరాన్ సంకలితాన్ని ఏర్పరుస్తుంది.
\( \mathrm{B_2H_6} + 2\mathrm{N(CH_3)_3} \longrightarrow \underset{\text{బోరాన్ సంకలితం}}{2\mathrm{BH_3 \cdot N(CH_3)_3}} \)
Exam Tips:
a) నీరు: B(OH)₃ + H₂; CO: BH₃·CO; N(CH₃)₃: BH₃·N(CH₃)₃ - ఉత్పన్నాలను సరిగా గుర్తుంచుకోండి.
Question 35: Al₂O₃ ద్విస్వభావం కలదని సరైన చర్యలతో వివరించండి.
Answer:
Al₂O₃ కు ద్విస్వభావం కలదు. ఇది ఆమ్లాలతో మరియు క్షారాలతో చర్య జరిపి లవణాలను ఏర్పరుస్తుంది.
ఆమ్లాలతో చర్య : Al₂O₃ ఆమ్లాలతో ఈ క్రింది విధంగా చర్య జరుపుతుంది.
Al₂O₃ + 6HCl → 2AlCl₃ + 3H₂O
క్షారాలతో చర్య : Al₂O₃ క్షారాలతో ఈ క్రింది విధంగా చర్య జరుపుతుంది.
Al₂O₃ + 2NaOH → 2NaAlO₂ + H₂O
Exam Tips:
a) Al₂O₃ ఆమ్లంతో (AlCl₃) మరియు క్షారంతో (NaAlO₂) చర్య జరుపుతుంది; రెండు సమీకరణాలు తుల్యంగా రాయండి.
Question 36: Na₂B₄O₇ + గాఢ H₂SO₄ → A → (i) C₂H₅OH, (ii) వెలిగించండి → B (ఆకుపచ్చని అంచుజ్వాల). A, B లను గుర్తించండి. (సూచన: A = H₃BO₃, B = (C₂H₅)₃BO₃)
Answer:
\( \mathrm{Na_2B_4O_7} + \mathrm{H_2SO_4} + 5\mathrm{H_2O} \longrightarrow \mathrm{Na_2SO_4} + \underset{(A)}{4\mathrm{H_3BO_3}} \)
\( \mathrm{H_3BO_3} + 3\mathrm{C_2H_5OH} \xrightarrow{\text{వేడి}} \underset{(B)}{(\mathrm{C_2H_5})_3\mathrm{BO_3}} + 3\mathrm{H_2O} \)
కావున A = H₃BO₃ (బోరిక్ ఆమ్లం), B = (C₂H₅)₃BO₃ (ఈథైల్ బోరేట్)
Exam Tips:
a) బోరిక్ ఆమ్లం + ఇథనాల్ → ఈథైల్ బోరేట్; ఇది ఆకుపచ్చ అంచు జ్వాలతో మండటం బోరాన్ గుర్తింపు పరీక్ష.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 37: బోరాక్స్‌ను, బోరిక్ ఆమ్లాన్ని ఎలా తయారుచేస్తారు ? వాటిమీద ఉష్ణం చర్యను వివరించండి.
Answer:
బోరాక్స్ తయారీ : బోరిక్ ఆమ్లంను వేడిచేయగా టెట్రాబోరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దీనిని NaOH తో చర్య జరపగా బోరాక్స్ ఏర్పడును.
\( 4\mathrm{H_3BO_3} \xrightarrow{435\,K} \mathrm{H_2B_4O_7} + 5\mathrm{H_2O} \)
\( \mathrm{H_2B_4O_7} + 2\mathrm{NaOH} \longrightarrow \mathrm{Na_2B_4O_7} + 2\mathrm{H_2O} \)
బోరాక్స్‌ను అధికంగా వేడిచేస్తే గాజులాంటి పదార్థంగా మారుతుంది. దీనినే బోరాక్స్ పూస అంటారు.
\( \mathrm{Na_2B_4O_7 \cdot 10H_2O} \xrightarrow{\Delta} \underset{\text{సోడియం టెట్రాబోరేట్}}{\mathrm{Na_2B_4O_7}} \xrightarrow{\Delta} \underset{\text{గాజువంటి పదార్థం (బోరాక్స్ పూస)}}{2\mathrm{NaBO_2} + \mathrm{B_2O_3}} \)
బోరిక్ ఆమ్లం తయారీ : బోరాక్స్‌ను గాఢ H₂SO₄ తో చర్య జరిపినపుడు బోరిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
\( \mathrm{Na_2B_4O_7} + \mathrm{H_2SO_4} + 5\mathrm{H_2O} \longrightarrow 4\mathrm{H_3BO_3} + \mathrm{Na_2SO_4} \)
బోరిక్ ఆమ్లంను వేడిచేయగా మెటాబోరికామ్లం ఏర్పడుతుంది. దీనిని ఇంకా వేడిచేస్తే బోరిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది.
\( \underset{\text{బోరిక్ ఆమ్లం}}{\mathrm{H_3BO_3}} \xrightarrow{\Delta} \underset{\text{మెటాబోరికామ్లం}}{\mathrm{HBO_2}} \xrightarrow{\Delta} \underset{\text{బోరిక్ ఆక్సైడ్}}{\mathrm{B_2O_3}} \)
Exam Tips:
a) తయారీ, తర్వాత ఉష్ణ చర్య అని రెండు భాగాలుగా రాయండి; ప్రతి దశకు ఉష్ణోగ్రత, సమీకరణం ఇవ్వండి.
Question 38: డైబోరేన్ ను ఎలా తయారుచేస్తారు ? దాని నిర్మాణాన్ని వివరించండి.
Answer:
డైబోరేన్ [B₂H₆] ను తయారుచేయు పద్ధతులు:
బోరాన్ ట్రై ఫ్లోరైడ్‌ను లిథియమ్ అల్యూమినియమ్ హైడ్రైడ్తో డైఈథైల్ ఈథర్‌లో చర్య జరిపి డైబోరేన్ ను తయారుచేస్తారు.
4BF₃ + 3LiAlH₄ → 2B₂H₆ + 3LiF + 3AlF₃
ప్రయోగశాలలో సోడియం బోరోహైడ్రైడ్న, అయోడిన్‌తో ఆక్సీకరణం చేసి డైబోరేన్ తయారుచేస్తారు.
2NaBH₄ + I₂ → B₂H₆ + 2NaI + H₂
పారిశ్రామికంగా డైబోరేన్ను ఉత్పత్తి చేయడానికి BF₃ ని సోడియం హైడ్రైడ్తో చర్య జరిపిస్తారు.
\( 2\mathrm{BF_3} + 6\mathrm{NaH} \xrightarrow{450\,K} \mathrm{B_2H_6} + 6\mathrm{NaF} \)
డైబోరేన్ నిర్మాణము:
డైబోరేన్‌లో రెండు సమతల BH₂ గ్రూపులు ఉంటాయి. ఈ రెండు BH₂ గ్రూపులను కలుపుతూ రెండు H పరమాణువులు ఉంటాయి. రెండు బోరాన్పరమాణువులకు అతకబడి ఉన్న నాలుగు H లను అంత్య హైడ్రోజన్లు అని, BH₂ గ్రూపులను కలిపే రెండు H పరమాణువులను వారధి (బ్రిడ్జ్) H పరమాణువులని అంటారు.
B₂H₆ లో రెండు బోరాన్ పరమాణువులు sp³ సంకరీకరణం జరుపుకొని నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి. ప్రతి బోరాన్లో నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్లలో ఒక ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్ ఉండదు.
ప్రతి బోరాన్లోని రెండు బంధ ఎలక్ట్రాన్లు గల sp³ సంకర ఆర్బిటాల్స్ రెండు హైడ్రోజన్ల యొక్క s – ఆర్బిటాల్స్తో అతిపాతం చెంది సహజమైన B – H బంధాలు (2 – కేంద్రక 2 – ఎలక్ట్రాన్లు) ఏర్పడతాయి.
ఒక బోరాన్లోని బంధ ఎలక్ట్రాన్ గల sp³ సంకర ఆర్బిటాల్, వేరొక బోరాన్లోని ఖాళీ sp³ సంకర ఆర్బిటాల్ మరియు H యొక్క 1s ఆర్బిటాల్‌తో అతిపాతం చెంది B-H-B బ్రిడ్జ్ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా B₂H₆ లో రెండు B- H-B బ్రిడ్జ్ బంధాలు ఏర్పడతాయి. ఈ బంధాలనే బనానా బంధాలు అని లేదా 3-కేంద్రక-2-ఎలక్ట్రాన్ బంధాలని అంటారు.
Exam Tips:
a) తయారీ పద్ధతులు + నిర్మాణ పటం (వారధి H, అంత్య H) రెండూ రాస్తేనే పూర్తి మార్కులు.
Question 39: డైబోరేన్ను తయారుచేసే ఏవైనా రెండు పద్ధతులు రాయండి. అది ఈ కింది వాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది?
a) కార్బన్ మోనాక్సైడ్
b) అమ్మోనియా
Answer:
డైబోరేన్ [B₂H₆] ను తయారుచేయు పద్ధతులు:
బోరాన్ ట్రై ఫ్లోరైడ్‌ను లిథియమ్ అల్యూమినియమ్ హైడ్రైడ్ డైఈథైల్ ఈథర్‌లో చర్య జరిపి డైబోరేన్ను తయారుచేస్తారు.
4BF₃ + 3LiAlH₄ → 2B₂H₆ + 3LiF + 3AlF₃
ప్రయోగశాలలో సోడియం బోరోహైడ్రైడ్న, అయోడిన్‌తో ఆక్సీకరణం చేసి డైబోరేన్ ను తయారుచేస్తారు.
2NaBH₄ + I₂ → B₂H₆ + 2NaI + H₂
పారిశ్రామికంగా డైబోరేన్ను ఉత్పత్తి చేయడానికి BF₃ ని సోడియం హైడ్రైడ్తో చర్య జరిపిస్తారు.
\( 2\mathrm{BF_3} + 6\mathrm{NaH} \xrightarrow{450\,K} \mathrm{B_2H_6} + 6\mathrm{NaF} \)
a) డైబోరేన్ కార్బన్ మోనాక్సైడ్‌తో చర్య : డైబోరేన్ 1000°C ఉష్ణోగ్రత మరియు 2 atm పీడనం వద్ద CO తో చర్య జరిపి బోరేన్ కార్బొనైల్ అనే బోరాన్ సంకలితాన్ని ఏర్పరుస్తుంది.
\( \mathrm{B_2H_6} + 2\mathrm{CO} \xrightarrow[2\,atm]{1000^\circ C} 2(\mathrm{BH_3 \cdot CO}) \)
b) డైబోరేన్ అమ్మోనియాతో చర్య డైబోరేన్ అమ్మోనియాతో చర్యనొంది మొదట B₂H₆·2NH₃ ని ఇస్తుంది. దీనినే [BH₂(NH₃)₂]⁺ [BH₄]⁻ గా కూడా వ్రాయవచ్చు. దీనిని ఇంకా వేడిచేస్తే బోరజీన్ ఏర్పడుతుంది. బోరజీన్కు బెంజీన్ వంటి వలయ నిర్మాణం ఉంటుంది. కావున దీనిని ఇనార్గానిక్ బెంజీన్ అని కూడా అంటారు.
\( 3\mathrm{B_2H_6} + 6\mathrm{NH_3} \longrightarrow 3[\mathrm{BH_2(NH_3)_2}]^{+}[\mathrm{BH_4}]^{-} \xrightarrow{\Delta} \underset{\text{బోరజీన్}}{2\mathrm{B_3N_3H_6}} + 12\mathrm{H_2} \)
Exam Tips:
a) తయారీ పద్ధతులు రెండు, తర్వాత CO, NH₃ తో చర్యలు; NH₃ తో వేడి చేస్తే బోరజీన్ (B₃N₃H₆) అని ముగించండి.
Free study material for Chemistry
Chemistry Class 11 Curriculum Solutions: Chapter 10 p-Block Elements - Group 13
Chapter Exercise Answers for Class 11 Chemistry
Review comprehensive exercise answers for Class 11 Chemistry Chapter 10 p-Block Elements - Group 13. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Detailed Answer Guides for Chapter 10 p-Block Elements - Group 13
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Chemistry module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Complete Preparation Kit for Class 11 Exams
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Chemistry.
FAQs
The complete and updated TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Chemistry Study Material Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ in printable PDF format for offline study on any device.