Solutions for Class 11 Chemistry: Chapter 06 Thermodynamics
Explore reliable textbook solutions for Chapter 06 Thermodynamics tailored for Class 11 learners. Utilizing these Chemistry answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Practice Class 11 Chemistry Solutions: Chapter 06 Thermodynamics
Access the complete solution PDF for Class 11 Chemistry below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు
Question 1: ఉష్ణగతిక శాస్త్రం అనే పదం ఏమి తెలియజేస్తుంది ?
Answer:
రసాయన, భౌతిక రసాయన, జీవరసాయన ప్రక్రియలలో ‘ఉష్ణానికీ, ఇతర రూపాలలోని ‘శక్తుల’కూ మధ్య ఉండే పరిమాణాత్మక సంబంధాలను గురించి రసాయనశాస్త్రంలో ఉండే ఈ విభాగాన్ని ఉష్ణగతికశాస్త్రము అంటారు.
ముఖ్యముగా ఉష్ణగతికశాస్త్రం అంటే “ఉష్ణం ప్రవహించడం”.
Exam Tips:
a) ‘ఉష్ణగతిక శాస్త్రం’ అంటే ఉష్ణం, ఇతర శక్తి రూపాల మధ్య పరిమాణాత్మక సంబంధాల అధ్యయనం అని ఒక వాక్యంలో రాయండి.
Question 2: ఉష్ణగతికశాస్త్ర నియమాలకు, సమతాస్థితికి మధ్య సంబంధమేమిటి ?
Answer:
ఒక వ్యవస్థ సమతాస్థితిలో ఉన్నప్పుడు లేదా ఒక సమతాస్థితి నుంచి వేరొక సమతాస్థితికి మారుతున్నపుడు మాత్రమే ఉష్ణగతికశాస్త్ర నియమాలు అనువర్తిస్తాయి.
గతిక సమతాస్థితి వద్ద గిబ్స్ శక్తి అత్యల్పంగా ఉంటుంది. ప్రమాణ గిబ్స్ శక్తి మార్పు ΔrG° కు, సమతాస్థితి స్థిరాంకం ‘K’ కు ఉన్న సంబంధం
0 = ΔrG° + RT ln K
లేదా ΔrG° = – RT ln K
లేదా ΔrG° = – 2.303 RT log K
Exam Tips:
a) సమతాస్థితి వద్ద ΔG = 0 అని గుర్తుంచుకొని ΔG° = – RT ln K = – 2.303 RT log K ని ఉత్పాదించండి.
Question 3: వ్యవస్థను నిర్వచించండి. ఉదాహరణ ఇవ్వండి.
Answer:
ఉష్ణగతికశాస్త్ర అధ్యయనానికి ఎంచుకున్న విశ్వంలోని లఘుభాగాన్ని వ్యవస్థ అంటారు.
ఉదా : బీకరులో తీసుకొన్న నీరు, ఒక సిలిండర్‌లో ఉన్న వాయువు.
Exam Tips:
a) వ్యవస్థ = అధ్యయనానికి ఎంచుకున్న విశ్వభాగం; మిగిలినది పరిసరాలు. ఒక ఉదాహరణ తప్పక రాయండి.
Question 4: ఒక వ్యవస్థకు స్థిరోష్ణక గోడ ఉంది, ΔU = wad అని ఇచ్చారు. ఉష్ణం, పని పరంగా దీని అర్థం ఏమిటి ?
Answer:
వ్యవస్థ నుంచి పరిసరాలకు లేదా పరిసరాల నుంచి వ్యవస్థకు ఎలాంటి ఉష్ణశక్తి వినిమయమూ జరగని ప్రక్రియను స్థిరోష్ణక ప్రక్రియ అంటారు. అంటే q = 0, కాబట్టి ΔU = wad. ఈ ప్రక్రియలో వ్యవస్థపై పని జరిగినపుడు వ్యవస్థ అంతరికశక్తి పెరుగుతుంది; వ్యవస్థ పని చేసినపుడు తగ్గుతుంది.
wad = U₂ – U₁ = ΔU
వ్యవస్థపై పని జరిగినపుడు, wad = ధనాత్మకం
వ్యవస్థ పనిచేసినపుడు, wad = ఋణాత్మకం.
Exam Tips:
a) స్థిరోష్ణక ప్రక్రియలో q = 0 కాబట్టి ΔU = w అని మొదట రాయండి, తరువాత పని గుర్తుల సంప్రదాయం చెప్పండి.
Question 5: వ్యవస్థ మీద పని ఏమీ జరగలేదు. వ్యవస్థ ‘q’ పరిమాణంలో ఉష్ణం కోల్పోయింది. ఈ వ్యవస్థ ఎలాంటి గోడను కలిగి ఉంది ?
Answer:
వ్యవస్థ ఉష్ణవాహక గోడను కలిగి ఉంది. ఉష్ణవాహక గోడ ద్వారా ఉష్ణం బదిలీ అవుతుంది. పని ఏమీ జరగలేదు కాబట్టి ΔU = q. వ్యవస్థ ఉష్ణం కోల్పోతుంది కాబట్టి అంతరికశక్తి తగ్గుతుంది; కోల్పోయిన ఉష్ణపరిమాణం q అయితే ΔU = – q.
ఇచ్చట q = బదిలీ అయిన ఉష్ణరాశి, ΔU = అంతరికశక్తిలో మార్పు.
Exam Tips:
a) ఉష్ణవాహక గోడ ద్వారా ఉష్ణం మారుతుంది, స్థిరోష్ణక గోడ ద్వారా మారదు; ఈ తేడాను జవాబులో స్పష్టంగా చెప్పండి.
Question 6: వ్యవస్థకు ‘q’ పరిమాణంలో ఉష్ణం అందించబడింది, వ్యవస్థ పనిచేసింది. ఈ వ్యవస్థ ఏ రకంపై ఎలాంటిదై ఉంటుంది ?
Answer:
‘W’ పరిమాణంలో వ్యవస్థ ద్వారా పని జరిగి, ‘q’ పరిమాణంలో ఉష్ణశక్తి వ్యవస్థకు
ఇవ్వబడినపుడు, ΔU = q – W. ఇది సంవృత వ్యవస్థ. అంటే వ్యవస్థ నుండి
పరిసరాలకు, లేదా పరిసరాల నుండి వ్యవస్థకు శక్తి మార్పిడి జరుగుతుంది. కాని ద్రవ్యమార్పు జరగదు.
Exam Tips:
a) ఉష్ణం, పని రెండూ మార్పిడి అవుతూ ద్రవ్యం మారకపోతే అది సంవృత వ్యవస్థ; ΔU = q – w రాయండి.
Question 7: ఒక ఆదర్శ వాయువు స్వేచ్ఛా వ్యాకోచంలో ఉత్క్రమణీయ, అనుత్క్రమణీయ ప్రక్రియల్లో వాయువు చేసే పని ఏమిటి ?
Answer:
స్వేచ్ఛావ్యాకోచంలో (Pబాహ్య = 0) కాబట్టి పని ఏమీ జరగదు. ఈ వ్యాకోచం
ఉత్క్రమణీయం కావచ్చు. లేదా అనుత్క్రమణీయం కావచ్చు.
Exam Tips:
a) స్వేచ్ఛా వ్యాకోచంలో బాహ్య పీడనం శూన్యం కాబట్టి w = 0 అని రాయండి.
Question 8: సమీకరణం ΔU = q – p ₑₓΔV నుంచి ఘనపరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు ΔU
విలువ ఎంత ?
Answer:
ΔU = q-pₑₓ × ΔV సమీకరణంలో, ప్రక్రియను స్థిరఘనపరిమాణములో
జరిపించినపుడు (ΔV = 0) అప్పుడు
ΔU = q అవుతుంది. అంటే అంతరిక శక్తిలో మార్పు = అందించబడిన ఉష్ణం.
Exam Tips:
a) స్థిర ఘనపరిమాణంలో ΔV = 0 కాబట్టి ΔU = qv అని రాయండి.
Question 9: సమోష్ణ స్వేచ్ఛా వ్యాకోచం ప్రక్రియలో ఒక ఆదర్శ వాయువుకు q, ΔU విలువలు ఎంత ?
Answer:
q, ΔU ల మధ్య సంబంధం ΔU = q + w. సమోష్ణ స్వేచ్ఛా వ్యాకోచ ప్రక్రియలో w = 0, ఆదర్శ వాయువుకు సమోష్ణ ప్రక్రియలో ΔU = 0, కాబట్టి q = 0. అందువల్ల సమోష్ణ స్వేచ్ఛా వ్యాకోచ ప్రక్రియలో q, ΔU ల విలువలు శూన్యం (0) గా ఉంటాయి.
Exam Tips:
a) ఆదర్శ వాయువుకు సమోష్ణ ప్రక్రియలో ΔU = 0 మరియు స్వేచ్ఛా వ్యాకోచంలో w = 0 అని చూపి q = 0 అని తేల్చండి.
Question 10: సమోష్ణ అనుత్క్రమణీయ ప్రక్రియ మార్పులో ఆదర్శవాయువుకు ‘q’ విలువ ఎంత ?
Answer:
ΔU = q + w సమీకరణాన్ని సమోష్ణక అనుత్క్రమణీయ మార్పులకు అన్వయిస్తే (ఆదర్శ వాయువుకు ΔU = 0),
q = – w = Pబాహ్య × (Vతుది – Vతొలి)
Exam Tips:
a) సమోష్ణ ప్రక్రియలో ΔU = 0 కాబట్టి q = – w; w = – Pబాహ్యΔV ని ప్రతిక్షేపించండి.
Question 11: ఆదర్శ వాయువు సమోష్ణ ఉత్క్రమణీయ మార్పులో ‘q’ విలువ ఎంత ?
Answer:
ఆదర్శ వాయువు సమోష్ణ ఉత్క్రమణీయ మార్పులకు ‘q’ విలువ
\( q = -w = nRT\,\ln\frac{V_{\text{తుది}}}{V_{\text{తొలి}}} = 2.303\,nRT\,\log\frac{V_{\text{తుది}}}{V_{\text{తొలి}}} \)
Exam Tips:
a) సమోష్ణ ఉత్క్రమణీయ మార్పులో q = – w = 2.303 nRT log (V₂/V₁) అని రాయండి.
Question 12: ఆదర్శ వాయువు స్థిరోష్ణక మార్పులో ΔU, w(adiabatic) ల సంబంధమేమిటి ?
Answer:
ΔU, W ల సంబంధం క్రింది విధంగా ఉంటుంది.
ΔU = q + w
ఆదర్శ వాయువు స్థిరోష్ణక మార్పుకు q = 0
అపుడు ΔU = wస్థిరోష్ణక
Exam Tips:
a) స్థిరోష్ణక మార్పులో q = 0 కాబట్టి ΔU = w; ఇదే జవాబు.
Question 13: ఉష్ణగతికశాస్త్రం మొదటి నియమం ఇవ్వండి.
Answer:
“శక్తిని సృష్టింపలేము, నశింపచెయ్యలేము. ఒక రూపములోని శక్తిని వేరొక రూపంలోకి మార్చగలము.” (లేదా) “మొదటి రకం సతతచలన యంత్రనిర్మాణము అసాధ్యం”. (లేదా)
“చక్రీయ ప్రక్రియలో వ్యవస్థ శక్తి మార్పు శూన్యం”.
Exam Tips:
a) మొదటి నియమాన్ని మూడు రకాలుగా (శక్తి నిత్యత్వం, సతతచలన యంత్రం, చక్రీయ ప్రక్రియ) చెప్పవచ్చు.
Question 14: వ్యవస్థ చేసిన పనికి, వ్యవస్థపై జరిగిన పనికి సంప్రదాయ గుర్తులు ఏమిటి ?
Answer:
ఒక వ్యవస్థ ద్వారా జరిగిన పనిని – pΔV తో సూచిస్తారు. అంటే వ్యవస్థ పనిచేస్తే దానిని ఋణ గుర్తుతో సూచిస్తారు. ఒక వ్యవస్థపై పని జరగడానికి + pΔV తో సూచిస్తారు. అంటే వ్యవస్థపై జరిగిన పనిని ధన గుర్తుతో సూచిస్తారు.
Exam Tips:
a) వ్యవస్థ చేసిన పని ఋణాత్మకం (– pΔV), వ్యవస్థపై జరిగిన పని ధనాత్మకం (+ pΔV) అని ఒక్కొక్క వాక్యంలో రాయండి.
Question 15: ఘనపరిమాణం (V), పీడనం (P), ఉష్ణోగ్రత (T) లు స్థితిప్రమేయాలు. ఇలా చెప్పడం సరైందా ?
Answer:
ఒక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలయిన పీడనం, ఘనపరిమాణం, ఉష్ణోగ్రత మొదలైన వాటి మీద ఆధారపడే ఉష్ణగతిక ప్రమేయాలను స్థితి ప్రమేయాలు అంటారు. ఇవి చర్యామార్గంపై ఆధారపడవు. కేవలం స్థితిపై ఆధారపడతాయి. కాబట్టి V, P, T లు స్థితి ప్రమేయాలే.
Exam Tips:
a) స్థితి ప్రమేయం మార్గంపై ఆధారపడదు, తొలి–తుది స్థితులపైనే ఆధారపడుతుంది; P, V, T లు అవునని ముగించండి.
Question 16: ఉష్ణం పరిసరాల నుంచి వ్యవస్థకు, వ్యవస్థ నుంచి పరిసరాలకు మారినపుడు దాని సంప్రదాయక గుర్తులు ఏమిటి ?
Answer:
పరిసరాల నుంచి వ్యవస్థకు, వ్యవస్థ నుంచి పరిసరాలకు ఉష్ణరాశి మార్పును ΔH తో సూచిస్తారు. ఒక చర్యలో వ్యవస్థ పరిసరాల నుంచి ఉష్ణం గ్రహిస్తే ΔH విలువ ధన గుర్తుతో సూచిస్తారు. అదే వ్యవస్థ పరిసరాలకు ఉష్ణం విడుదల చేస్తే ΔH విలువ ఋణ గుర్తుతో సూచిస్తారు.
Exam Tips:
a) ఉష్ణం గ్రహిస్తే ధనాత్మకం (+), విడుదల చేస్తే ఋణాత్మకం (–) అని రెండు సందర్భాలను వేరువేరుగా రాయండి.
Question 17: పరిసరాల నుంచి వ్యవస్థ ఎలాంటి ఉష్ణం గ్రహించలేదు. అయితే వ్యవస్థ మీద పని జరిగింది. వ్యవస్థకు ఎలాంటి సరిహద్దు గోడ ఉంది ?
Answer:
వ్యవస్థపై పని జరుగుతుంది. కాని వ్యవస్థ ఉష్ణశక్తిని గ్రహించదు. ఈ వ్యవస్థ గోడను స్థిరోష్ణక గోడ అంటారు.
ΔU = wస్థిరోష్ణక
Exam Tips:
a) ఉష్ణం గ్రహించకుండా వ్యవస్థపై పని జరిగితే గోడ స్థిరోష్ణకం; ΔU = wad.
Question 18: వ్యవస్థ మీద పని ఏమీ జరగలేదు. అయితే ‘q’ ఉష్ణం వ్యవస్థ నుంచి పరిసరాలకు మారింది. వ్యవస్థకు ఎలాంటి సరిహద్దు గోడ ఉంది ?
Answer:
వ్యవస్థ మీద పని జరగదు కానీ ‘q’ పరిమాణంలో వ్యవస్థ ఉష్ణశక్తిని పరిసరాలకు కోల్పోతే దానిని ఉష్ణవాహక గోడలు అంటారు.
అప్పుడు ΔU = -q.
Exam Tips:
a) పని లేకుండా ఉష్ణం కోల్పోతే గోడ ఉష్ణవాహకం; ΔU = – q.
Question 19: వ్యవస్థ పనిచేసింది, వ్యవస్థకు ‘q’ ఉష్ణం కూడా ఇవ్వబడింది. ఇది ఎలాంటి వ్యవస్థ ?
Answer:
‘w’ పరిమాణంలో వ్యవస్థ ద్వారా పని జరిగి ‘q’ పరిమాణంలో ఉష్ణశక్తి వ్యవస్థకు ఇవ్వబడినపుడు, ΔU = q – w. ఇది సంవృత వ్యవస్థ.
Exam Tips:
a) ఉష్ణం గ్రహించి పని చేసే వ్యవస్థ శక్తిని మార్పిడి చేస్తుంది కాని ద్రవ్యాన్ని కాదు కాబట్టి సంవృత వ్యవస్థ.
Question 20: q = – w = Pబాహ్య (Vతుది – Vతొలి). ఇది అనుత్క్రమణీయ …… మార్పు.
Answer:
q = – w = Pబాహ్య (Vతుది – Vతొలి) అనేది అనుత్క్రమణీయ సమోష్ణక మార్పు.
Exam Tips:
a) q = – w = Pబాహ్య(Vతుది – Vతొలి) అనుత్క్రమణీయ సమోష్ణక మార్పుకు; ఖాళీని ‘అనుత్క్రమణీయ సమోష్ణక’ అని నింపండి.
Question 21: q = – w = nRT ln (Vతుది/Vతొలి). ఇది సమోష్ణ …….. మార్పు.
Answer:
q = – w = nRT ln (Vతుది/Vతొలి) అనేది సమోష్ణ ఉత్క్రమణీయ మార్పు.
Exam Tips:
a) q = – w = nRT ln (Vతుది/Vతొలి) సమోష్ణ ఉత్క్రమణీయ మార్పుకు; ఖాళీని ‘ఉత్క్రమణీయ’ అని నింపండి.
Question 22: ΔH కి ఉష్ణమోచక, ఉష్ణగ్రాహక చర్యల్లో సాంప్రదాయిక గుర్తులు ఏమిటి ?
Answer:
ఉష్ణమోచక చర్యలకు, ΔH విలువ ఋణాత్మకం.
ఉష్ణగ్రాహక చర్యలకు, ΔH విలువ ధనాత్మకం.
Exam Tips:
a) ఉష్ణమోచక చర్యలకు ΔH ఋణాత్మకం, ఉష్ణగ్రాహక చర్యలకు ధనాత్మకం.
Question 23: విస్తార (extensive), గహన (intensive) ధర్మాలంటే ఏమిటి ?
Answer:
పదార్థపు పరిమాణంపై ఆధారపడియుండే ధర్మాలను విస్తార ధర్మాలు అంటారు. ఉదా : ద్రవ్యరాశి, ఘనపరిమాణము, అంతరికశక్తి, ఎంథాల్పీ మొదలగునవి. పదార్థం పరిమాణంతో సంబంధం లేని ధర్మాలను గహన ధర్మాలు అంటారు.
ఉదా : ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం మొదలగునవి.
Exam Tips:
a) విస్తార ధర్మాలు పరిమాణంపై ఆధారపడతాయి (ద్రవ్యరాశి, ఘనపరిమాణం, ఎంథాల్పీ); గహన ధర్మాలు ఆధారపడవు (ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం).
Question 24: సమీకరణం q = c · m · ΔT లో ΔT ఉష్ణోగ్రత మార్పు, ‘m’ పదార్థం ద్రవ్యరాశి, ‘q’ కావలసిన ఉష్ణం. అయితే ‘c’ ఏమిటి ?
Answer:
‘c’ ని విశిష్టోష్ణం (విశిష్ట ఉష్ణధారణ) అంటారు.
“ఒక గ్రామ్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచుటకు అవసరమైన ఉష్ణాన్ని విశిష్టోష్ణం అంటారు.”
\( c = \frac{q}{m\,\Delta T} \)
m × c = C (ఉష్ణధారణ) అయితే q = C × ΔT.
Exam Tips:
a) q = c m ΔT లో c విశిష్టోష్ణం (1 g ను 1°C పెంచడానికి కావలసిన ఉష్ణం); c = q/(mΔT).
Question 25: ΔU, ΔH ల సంబంధం తెలిపే సమీకరణం వ్రాయండి.
Answer:
ΔU, ΔH ల మధ్య సంబంధం సూచించే సమీకరణం
ΔH = ΔU + ΔngRT
ΔH = ఎంథాల్పీలోని మార్పు
ΔU = అంతరికశక్తులలో మార్పు
Δng = nP – nR
[nP = వాయు క్రియాజన్యాల మొత్తం మోల్‌ల సంఖ్య
nR = వాయు క్రియాజనకాల మొత్తం మోల్‌ల సంఖ్య].
R = సార్వత్రిక వాయు స్థిరాంకం
T = పరమ ఉష్ణోగ్రత.
Exam Tips:
a) ΔH = ΔU + ΔngRT రాసి Δng = వాయు క్రియాజన్యాల మోల్‌లు – వాయు క్రియాజనకాల మోల్‌లు అని వివరించండి.
Question 26: C ₚ, Cυ ల మధ్య సంబంధం ఏమిటి ?
Answer:
ఒక ఆదర్శ వాయువుకు స్థిర ఘనపరిమాణం దగ్గర ఉష్ణధారణను C Vగాను, స్థిర పీడనం దగ్గర ఉష్ణధారణను Cₚ గాను సూచిస్తే అప్పుడు వాటి మధ్య సంబంధం CP – CV = R
R = వాయు స్థిరాంకం.
Exam Tips:
a) Cp – Cv = R (1 మోల్ ఆదర్శ వాయువుకు); Cp ఎల్లప్పుడూ Cv కంటే ఎక్కువ.
Question 27: బాంబ్ కెలోరిమీటర్లో ఆక్సిజన్ సమక్షంలో 298 K, 1 atm పీడనంలో 1 g గ్రాఫైట్ ఇచ్చిన సమీకరణం ప్రకారం దహనం చెందింది.
C(graphite) + O₂(వా) → CO₂(వా)
చర్య జరగడం వల్ల ఉష్ణోగ్రత 298 K నుండి 299 K కు పెరిగింది. బాంబ్ కెలోరిమీటర్ ఉష్ణధారణ 20.7 kJ K⁻¹. పై చర్యకు 298 K, 1 atm పీడనం వద్ద ఎంథాల్పీ మార్పు ఎంత ?
Answer:
దత్తాంశం : కెలోరిమీటర్ ఉష్ణధారణ C = 20.7 kJ K⁻¹; ΔT = 299 – 298 = 1 K
1 g గ్రాఫైట్ దహనంలో వెలువడిన ఉష్ణం = C × ΔT = 20.7 × 1 = 20.7 kJ
గ్రాఫైట్ మోలార్ ద్రవ్యరాశి = 12 g mol⁻¹, కాబట్టి 1 మోల్ దహనంలో వెలువడే ఉష్ణం = 20.7 × 12 = 248.4 kJ
బాంబ్ కెలోరిమీటర్లో ఘనపరిమాణం స్థిరం కాబట్టి ఇది ΔU. చర్యలో Δng = 1 – 1 = 0, కాబట్టి ΔH = ΔU + ΔngRT = ΔU
ΔH = – 248.4 kJ mol⁻¹ (ఉష్ణమోచక చర్య)
Exam Tips:
a) కెలోరిమీటర్ ఉష్ణధారణ × ΔT = 1 g కు వెలువడిన ఉష్ణం; మోలార్ ద్రవ్యరాశి (12 g) తో గుణించి మోల్కు మార్చండి; Δng = 0 కాబట్టి ΔH = ΔU.
Question 28: పై చర్యకు అంతరిక శక్తి మార్పు ΔU ఎంత ?
Answer:
ΔH = ΔU + ΔngRT, ఈ చర్యలో Δng = 0
కాబట్టి ΔU = ΔH = – 248.4 kJ mol⁻¹
Exam Tips:
a) Δng = 0 అయితే ΔU = ΔH; ఋణ గుర్తు మరువకండి.
Question 29: CH₄ (వా) + 2O₂(వా) → CO₂(వా) + 2H₂O(ద్ర) చర్యకు క్రియాజనకాలు, క్రియాజన్యాల మోలార్ ఎంథాల్పీల ఆధారంగా చర్యోష్టం Δ ᵣH ఎంత ?
Answer:
ΔrH = (క్రియాజన్యాల మొత్తం ఎంథాల్పీ) – (క్రియాజనకాల మొత్తం ఎంథాల్పీ)
\( = \sum_i a_i H_m(\text{క్రియాజన్యాలు}) - \sum_i b_i H_m(\text{క్రియాజనకాలు}) \)
\( = [H_m(\mathrm{CO_2},g) + 2H_m(\mathrm{H_2O},l)] - [H_m(\mathrm{CH_4},g) + 2H_m(\mathrm{O_2},g)] \)
Hₘ = ఆయా పదార్ధాల మోలార్ ఎంథాల్పీల సంకేతం
Exam Tips:
a) ΔrH = Σ (క్రియాజన్యాల మోలార్ ఎంథాల్పీలు) – Σ (క్రియాజనకాల మోలార్ ఎంథాల్పీలు), స్టాయికియోమెట్రీ గుణకాలతో.
Question 30: కేవలం ఎంథాల్పీ తగ్గుదల మాత్రమే చర్య అయత్నీకృతానికి కారణం కాదు. ఎందువల్ల ?
Answer:
ఎంథాల్పీ తగ్గుదల (ΔH = ఋణాత్మకం) అయత్నీకృత ప్రక్రియకు కారణం కావచ్చు. కాని అన్ని సందర్భాలలో ఇది నిజం కాదు. ఎందులకనగా
1. ΔH ధనాత్మకంగా గల కొన్ని చర్యలు అయత్నీకృతంగా జరుగుతాయి. ఉదా : H₂O(ఘ) → H₂O(ద్ర); ΔH° = + 6.0 kJ mol⁻¹ (273 K కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అయత్నీకృతం)
2. ΔH = 0 అయినప్పటికీ కొన్ని చర్యలు అయత్నీకృతంగా ఉన్నాయి.
3. అయత్నీకృత చర్య ΔG అనే మరో అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
Exam Tips:
a) ΔH ధనాత్మకమైనా ΔS పెరిగితే ΔG ఋణాత్మకం కావచ్చని ఉదాహరణతో చెప్పండి (ఉదా: మంచు కరగడం).
Question 31: కేవలం ఎంట్రోపీ పెరుగుదల చర్య అయత్నీకృతానికి కారణం కాదు. ఎందువల్ల ?
Answer:
ఎంట్రోపీలో పెరుగుదల మాత్రమే చర్య అయత్నీకృతం అవడానికి కారణం అనేది సరియైనది కాదు. ఎందుకంటే ఎంట్రోపీలో తగ్గుదల (ΔS = – ve) ఉన్న కొన్ని చర్యలు కూడా, ΔH తగినంత ఋణాత్మకమై ΔG = – ve అయితే అయత్నీకృతంగా జరుగుతాయి (ఉదా : తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీరు మంచుగా మారడం). కాబట్టి అయత్నీకృతతను నిర్ణయించేది ΔG = ΔH – TΔS విలువ.
Exam Tips:
a) ఎంట్రోపీ తగ్గే చర్యలు కూడా ΔH తగినంత ఋణాత్మకమైతే అయత్నీకృతాలు; నిర్ణాయకం ΔG.
Question 32: గిబ్స్ శక్తి మార్పు ΔG కు, సమతాస్థితి స్థిరాంకం ‘K’ కు మధ్య సంబంధం తెలపండి.
Answer:
గిబ్స్ సమీకరణము
ΔrG° = – RT ln K
ΔrG° = – 2.303 RT log K
Exam Tips:
a) ΔG° = – RT ln K = – 2.303 RT log K.
Question 33: ΔH°, ΔS° లు తెలిస్తే ΔG° గణించవచ్చు. ఇది నిజమా ? కాదా ? ఎందువల్ల ?
Answer:
గిబ్స్ – హెల్మ్హోల్ట్ సమీకరణము ప్రకారం
ΔG° = ΔH° – TΔS°
ప్రమాణ ఉష్ణోగ్రత 298 K వద్ద ప్రమాణ విలువలు ΔH°, ΔS° మరియు ΔG° గణించవచ్చు.
ΔH° మరియు ΔS° కనుగొనుట సాధ్యమైతే ΔG° ను కూడా పై సమీకరణం ద్వారా లెక్కించవచ్చు. కాబట్టి ఇవ్వబడిన ప్రతిపాదన నిజమే.
Exam Tips:
a) ΔG° = ΔH° – TΔS° ఉపయోగించి ‘నిజమే’ అని ముగించండి.
Question 34: సమతాస్థితి స్థిరాంకం ‘K’ ని ప్రయోగశాలలో ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఖచ్చితంగా కొలిస్తే ΔG° ని వేరే ఏ ఉష్ణోగ్రత వద్దనైనా కొలవవచ్చా ? ఎట్లా ?
Answer:
సమతాస్థితి స్థిరాంకం (K) మరియు ΔG° లు ఒకదానితో ఒకటి క్రింది విధంగా సంబంధితమై ఉంటాయి.
ΔG° = – 2.303 RT log K
ఇచ్చిన ఉష్ణోగ్రత (T₁) వద్ద K ని నిర్ణయిస్తే, అదే ఉష్ణోగ్రత వద్ద ΔG° ను పై సమీకరణం ద్వారా లెక్కించవచ్చు. వేరొక ఉష్ణోగ్రత (T₂) వద్ద ΔG° కావాలంటే, ఆ ఉష్ణోగ్రత వద్ద K ని మళ్ళీ నిర్ణయించాలి; లేదా ΔH°, ΔS° లు తెలిసి, అవి ఉష్ణోగ్రతతో మారవని అనుకొంటే ΔG° = ΔH° – T₂ΔS° ద్వారా లెక్కించవచ్చు.
Exam Tips:
a) K ని కొలిచిన అదే ఉష్ణోగ్రత వద్ద ΔG° = – 2.303 RT log K; వేరే ఉష్ణోగ్రతకు ΔH°, ΔS° అవసరం.
Question 35: NO(వా) ఉష్ణగతిక స్థిరత్వాన్ని క్రింది చర్యల ఆధారంగా వివరించండి.
½N₂(వా) + ½O₂(వా) → NO(వా), ΔrH° = 90 kJ mol⁻¹
NO(వా) + ½O₂(వా) → NO₂(వా), ΔrH° = – 74 kJ mol⁻¹
Answer:
ఉష్ణమోచక పదార్థాలు స్థిరంగా ఉంటాయి. అలాగే ఉష్ణగ్రాహక పదార్థాలు అస్థిరంగా ఉంటాయి.
NO అనేది ఉష్ణగ్రాహక పదార్థం (ఏర్పడేటపుడు 90 kJ mol⁻¹ గ్రహిస్తుంది) కాబట్టి అస్థిరంగా ఉంటుంది.
NO₂ అనేది ఉష్ణమోచక చర్యలో ఏర్పడుతుంది కాబట్టి స్థిరంగా ఉంటుంది. అందువల్ల NO ఆక్సిజన్‌తో కలిసి NO₂ గా మారుతుంది.
Exam Tips:
a) ఉష్ణగ్రాహక సమ్మేళనం (NO) అస్థిరం, ఉష్ణమోచక సమ్మేళనం (NO₂) స్థిరం.
Question 36: 1.00 మోల్ H₂O(ద్ర) ప్రమాణ పరిస్థితుల్లో ఏర్పడితే పరిసరాల ఎంట్రోపి మార్పు ఎంత ?
ΔfH°[H₂O(ద్ర)] = – 286 kJ mol⁻¹
Answer:
పరిసరాల ఎంట్రోపీ మార్పు
\( \Delta S_{\text{పరిసరాలు}} = \frac{\Delta H_{\text{పరిసరాలు}}}{T} = \frac{-\Delta H_{\text{వ్యవస్థ}}}{T} \)
పరిసరాల ఎంథాల్పీ ఎంత పెరుగుతుందో వ్యవస్థ ఎంథాల్పీ అంతే తగ్గుతుంది, కాబట్టి ΔHపరిసరాలు = + 286 kJ mol⁻¹
ΔSపరిసరాలు = (286 × 10³ J mol⁻¹)/(298 K) = + 959.7 J K⁻¹ mol⁻¹
Exam Tips:
a) ΔSపరిసరాలు = – ΔHవ్యవస్థ/T; kJ ని J కు మార్చడం (× 10³) మరువకండి.
Question 37: ఒక చర్యకు సమతాస్థితి స్థిరాంకం విలువ 10. ΔG° విలువ ఎంత ? R = 8.314 J K⁻¹ mol⁻¹, T = 300 K.
Answer:
ΔG° = – 2.303 RT log K
= – 2.303 × 8.314 × 300 × log 10
= – 2.303 × 8.314 × 300 × 1 = – 5744 J mol⁻¹ = – 5.744 kJ mol⁻¹
Exam Tips:
a) ΔG° = – 2.303 RT log K లో log 10 = 1; ఫలితాన్ని kJ mol⁻¹ లో ఇవ్వండి.
Question 38: ఉష్ణగతికశాస్త్రం మూడో నియమం ఏమిటి ?
Answer:
“పరిపూర్ణ శుద్ధ స్ఫటిక పదార్థాల ఎంట్రోపి విలువ పరమశూన్య ఉష్ణోగ్రత (0 K లేదా – 273°C) సమీపించేకొద్దీ శూన్య విలువకు సమీపిస్తుంది”.
Exam Tips:
a) పరమశూన్యం = 0 K = – 273°C వద్ద పరిపూర్ణ స్ఫటిక ఎంట్రోపీ శూన్యం.
లఘు సమాధాన ప్రశ్నలు
Question 39: వివృత (open), సంవృత (closed), వివిక్త (isolated) వ్యవస్థలంటే ఏమిటి ?
ఒక్కొక్కదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
Answer:
1. వివృత (లేదా) తెరచిన వ్యవస్థ : పరిసరాల నుంచి వ్యవస్థకు లేదా వ్యవస్థ నుంచి పరిసరాలకు శక్తి, ద్రవ్యం రెండూ మార్పిడి జరిగితే అటువంటి దానిని వివృత వ్యవస్థ అంటారు.
ఉదా : తెరచి ఉంచిన బీకరులో తీసుకున్న ద్రవం
2. సంవృత (లేదా) మూసిన వ్యవస్థ : వ్యవస్థ నుంచి పరిసరాలకు (లేదా)
పరిసరాల నుంచి వ్యవస్థకు శక్తి మార్పిడి మాత్రమే జరిగితే అటువంటి వ్యవస్థను సంవృత వ్యవస్థ అంటారు.
ఉదా : మూసి ఉంచిన వాహక పాత్ర (రాగి లేదా స్టీలు పాత్ర)లో తీసుకున్న ద్రవం
3. వివిక్త (లేదా) బంధిత వ్యవస్థ : వ్యవస్థకు, పరిసరాలకు మధ్య శక్తి గానీ, ద్రవ్యం గానీ ఏదీ కూడా వినిమయం చెందని వ్యవస్థను వివిక్త వ్యవస్థ అంటారు. ఉదా : థర్మాస్ ఫ్లాస్క్
Exam Tips:
a) మూడు రకాల వ్యవస్థలను (వివృత, సంవృత, వివిక్త) శక్తి, ద్రవ్య మార్పిడి ఆధారంగా వేరు చేసి ఒక్కో ఉదాహరణ ఇవ్వండి.
Question 40: స్థితిప్రమేయాలు (state functions), స్థితి చరాంశాలు (state variables) వీటిని నిర్వచించండి. ఉదాహరణ ఇవ్వండి.
Answer:
స్థితి ప్రమేయాలు : ఏ ధర్మాలు వ్యవస్థ యొక్క తొలి మరియు తుది స్థితులపై ఆధారపడి ఆ చర్య నడిచే మార్గముపై ఆధారపడవో వాటిని స్థితి ప్రమేయాలు అంటారు.
ఉదా : శక్తి, ఎంథాల్పీ, గిబ్స్ శక్తి
స్థితి చరాంశాలు : వ్యవస్థ గురించిన పూర్తి వివరణ ఇచ్చుటకు ఉపయోగపడే చరరాశులైన P, V, T లను స్థితి చరాంశాలు అంటారు.
Exam Tips:
a) స్థితి ప్రమేయాలు (U, H, G) మార్గంపై ఆధారపడవు; స్థితి చరాంశాలు (P, V, T) వ్యవస్థ స్థితిని వివరిస్తాయి.
Question 41: “అంతరిక శక్తి ఒక స్థితి ప్రమేయం” వివరించండి.
Answer:
ఒక రసాయన వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు ఎంత శక్తి విడుదలవుతుంది లేదా గ్రహించబడుతుందీ తెలుసుకోవడానికి ఆ వ్యవస్థ మొత్తం శక్తిని తెలిపే పరిమాణాన్ని అంతరిక శక్తి అంటారు. దీనిని ‘U’ తో సూచిస్తారు.
ఈ క్రింది మార్పులు జరిగినపుడు వ్యవస్థ అంతరిక శక్తి ‘U’ లో మార్పు వస్తుంది. 1. వ్యవస్థ పని చేసినప్పుడు లేదా వ్యవస్థపై పని జరిగినప్పుడు
2. ఉష్ణశక్తి వ్యవస్థ నుంచి బయటకు లేదా బయట నుండి వ్యవస్థకు ప్రవహించినప్పుడు
3. ద్రవ్యం వ్యవస్థ నుండి బయటకు లేదా బయట నుండి వ్యవస్థకు చేరేటప్పుడు
4. అంతరిక శక్తి ‘U’ లో మార్పు వ్యవస్థ అనుసరించిన మార్గం మీద ఆధారపడదు. ఇది స్థితి ప్రమేయం. తొలి మరియు తుది స్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంతరిక శక్తి స్థితి ప్రమేయం.
Exam Tips:
a) U మార్పు వ్యవస్థ అనుసరించిన మార్గంపై ఆధారపడదని చెప్పి స్థితి ప్రమేయమని ముగించండి.
Question 42: “పని స్థితి ప్రమేయం కాదు” వివరించండి.
Answer:
ఒక వ్యవస్థ ఒక స్థితి నుండి వేరొక స్థితికి మారినపుడు పని జరుగుతుంది. వ్యవస్థలో జరిగే ఈ స్థితి మార్పు వివిధ మార్గాలలో జరుగవచ్చు. కాబట్టి పని పరిమాణం వివిధ రకాలుగా ఉంటుంది. అన్ని మార్గాలలో జరిగే పని ఒకే విధంగా ఉండదు. అంటే జరిగే పని పరిమాణం వ్యవస్థ అనుసరించే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్థితి ప్రమేయం కాదు. మార్గ ప్రమేయం.
Exam Tips:
a) పని వేర్వేరు మార్గాల్లో వేర్వేరుగా ఉంటుంది కాబట్టి అది మార్గ ప్రమేయం.
Question 43: ఉష్ణం అంటే ఏమిటో వివరించండి.
Answer:
భిన్న ఉష్ణోగ్రతల వద్ద ఉండే రెండు వస్తువుల మధ్య పరివర్తనం చెందే శక్తిని ఉష్ణం అంటారు.
ఉష్ణం అనేది శక్తి ఒక రూపం. ఇది మార్గ ప్రమేయం. స్థితి ప్రమేయం కాదు. దీనిని కెలోరి లేదా జౌల్స్లో కొలుస్తారు. 1 కెలోరి = 4.18 జౌల్స్. దీనిని ‘q’ తో సూచిస్తారు. వ్యవస్థ నుండి పరిసరాలకు ఉష్ణం వినిమయం అయితే అపుడు ‘q’ విలువ
ఋణాత్మకం. పరిసరాల నుండి వ్యవస్థ ఉష్ణం గ్రహించినపుడు ‘q’ విలువ ధనాత్మకం.
Exam Tips:
a) ఉష్ణం = ఉష్ణోగ్రత భేదం వల్ల బదిలీ అయ్యే శక్తి; మార్గ ప్రమేయం; ప్రమాణం జౌల్ (1 cal = 4.18 J).
Question 44: సమోష్ణక ఉత్క్రమణీయ చర్యకు ‘wrev’ ను ఉత్పాదించండి.
Answer:
ఉత్క్రమణీయ పరిస్థితులలో పనిని p(వా) ను ఉపయోగించి క్రింది విధంగా వ్రాయవచ్చు.
\( w_{\text{ఉత్క్రమణీయ}} = -\int_{V_{\text{తొలి}}}^{V_{\text{తుది}}} p_{\text{బాహ్య}}\,dV = -\int_{V_{\text{తొలి}}}^{V_{\text{తుది}}} (p_{\text{(వా)}} \pm dp)\,dV \)
dp, dV విలువలు చాలా తక్కువ. అందువల్ల dp × dV ఇంకా తక్కువ కాబట్టి ఉపేక్షణీయం అవుతుంది.
\( w_{\text{ఉత్క్రమణీయ}} = -\int_{V_{\text{తొలి}}}^{V_{\text{తుది}}} p_{\text{(వా)}}\,dV \)
ఆదర్శవాయు సమీకరణం pV = nRT అయితే \( p = \frac{nRT}{V} \)
స్థిర ఉష్ణోగ్రత వద్ద, అంటే సమోష్ణ ప్రక్రియలో
\( w_{\text{ఉత్క్రమణీయ}} = -nRT\int_{V_{\text{తొలి}}}^{V_{\text{తుది}}} \frac{dV}{V} = -nRT\,\ln\frac{V_{\text{తుది}}}{V_{\text{తొలి}}} \)
\( w_{\text{ఉత్క్రమణీయ}} = -2.303\,nRT\,\log\frac{V_{\text{తుది}}}{V_{\text{తొలి}}} \)
Exam Tips:
a) w = – ∫p dV నుండి ప్రారంభించి p = nRT/V ప్రతిక్షేపించి ln రూపంలో ముగించండి.
Question 45: 10 atm పీడనం వద్ద 2L ఆదర్శ వాయువు సమోష్ణక విధానంలో 20L కు శూన్యంలోకి వ్యాకోచం చెందుతుంది. ఈ వ్యాకోచంలో ఎంత ఉష్ణం గ్రహించబడుతుంది ? ఎంత పని జరుగుతుంది ?
Answer:
వాయువు శూన్యంలోకి స్వేచ్ఛగా వ్యాకోచించింది. అప్పుడు బాహ్య పీడనం (Pబాహ్య) = 0, Vతుది = 20 L, Vతొలి = 2 L
q = – w = Pబాహ్య (Vతుది – Vతొలి)
= 0 × (20 – 2) = 0
అంటే పని ఏమీ జరగదు. అదేవిధంగా ఉష్ణం ఏమీ గ్రహించబడదు.
Exam Tips:
a) శూన్యంలోకి వ్యాకోచంలో Pబాహ్య = 0 కాబట్టి w = 0, q = 0.
Question 46: పై సమస్యలోని ఆదర్శ వాయువులు 1 atm స్థిరపీడనానికి వ్యతిరేకంగా వ్యాకోచిస్తే ‘q’ విలువ ఎంత ?
Answer:
q = – w = Pబాహ్య(V₂ – V₁)
= 1 (20 – 2)
= 18 L. atm.
Exam Tips:
a) q = – w = Pబాహ్యΔV = 1 × 18 = 18 L atm.
Question 47: పై 45వ ప్రశ్నలోని ఆదర్శ వాయువు 20 L ఘనపరిమాణానికి ఉత్క్రమణీయంగా వ్యాకోచం చెందితే ‘q’ విలువ ఎంత ?
Answer:
ఆదర్శ వాయువుకి PV = nRT
P = 10 atm.
V = 2L
10 × 2 = nRT
nRT = 20 L. atm
q = -w= 2.303 nRT log \( \frac{V_2}{V_1} \)
= 2.303 × 20 log \( \frac{20}{2} \)
= 46.06 L. atm
Exam Tips:
a) nRT = PV = 20 L atm; q = 2.303 × 20 × log 10 = 46.06 L atm.
Question 48: స్థితి ప్రమేయం ‘H’ ను వివరించండి. ΔU, ΔH ల మధ్య సంబంధం ఏమిటి ?
Answer:
1. స్థిరపీడనం, ఉష్ణోగ్రతల వద్ద ఒక వ్యవస్థ పరిసరాలతో వినిమయం చేసుకొన్న ఉష్ణరాశి పరిమాణాన్ని ఎంథాల్పీ (H) అంటారు.
2. ఒక ప్రక్రియను స్థిరపీడనం దగ్గర జరిపిస్తే, వ్యవస్థ ఘనపరిమాణం మారుతుంది. జరిగిన పని పీడనం – ఘనపరిమాణం పని అయితే w ను – pΔV తో సూచిస్తారు.
3. మొదటి నియమము ప్రకారము
ΔU = qp – pΔV = qp – p(V₂ – V₁)
U₂ – U₁ = qp – p(V₂ – V₁)
qp = (U₂ + pV₂) – (U₁ + pV₁)
ఇక్కడ qp స్థిరపీడనం దగ్గర గ్రహించిన ఉష్ణరాశి. (U + pV) ను ఎంథాల్పీ అంటారు: H = U + pV
4. గ్రీకు పదం ఎంథాల్పీన్ అంటే వేడిచేయటం (లేదా) అంతర్గత ఉష్ణం. qp = H₂ – H₁ = ΔH గా వ్రాయవచ్చు.
5. స్థిరపీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద కలిగే శక్తి మార్పును ఎంథాల్పీ మార్పు (ΔH) అంటారు.
6. ఎంథాల్పీ U, p, V ల మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ స్థితి ప్రమేయాలు. కాబట్టి H కూడా స్థితి ప్రమేయమే. qp కూడా ప్రక్రియ మార్గంపై ఆధారపడదు.
స్థిరపీడనం వద్ద పరిమితమైన మార్పులకు
ΔH = ΔU + Δ(pV); ‘p’ స్థిరం కాబట్టి
ΔH = ΔU + pΔV
Exam Tips:
a) H = U + pV, స్థిర పీడనం వద్ద ΔH = qp మరియు ΔH = ΔU + pΔV అని చూపండి.
Question 49: ΔH = ΔU + ΔngRT ను ఉత్పాదించండి.
Answer:
ఒక చర్యలో వాయు క్రియాజనకాలు, వాయు క్రియాజన్యాలు పాల్గొంటాయని అనుకొందాం (ఘన, ద్రవ పదార్థాల ఘనపరిమాణం అతి స్వల్పం కాబట్టి ఉపేక్షించవచ్చు). క్రియాజనక వాయువుల మొత్తం ఘనపరిమాణం VA అనుకొనుము. చర్య జరిగిన తరువాత వాయు క్రియాజన్యాల మొత్తం ఘనపరిమాణం VB అనుకొనుము.
nA = వాయు క్రియాజనకాల మొత్తం మోల్‌లు
nB = వాయు క్రియాజన్యాల మొత్తం మోల్‌లు
అపుడు pVA = nART, pVB = nBRT అగును.
pVB – pVA = nBRT – nART = (nB – nA)RT
(లేదా) p(VB – VA) = (nB – nA)RT
(లేదా) pΔV = ΔngRT, ఇక్కడ Δng = nB – nA
pΔV విలువను ΔH = ΔU + pΔV సమీకరణంలో ప్రతిక్షేపిస్తే
ΔH = ΔU + ΔngRT అవుతుంది.
Exam Tips:
a) pΔV = ΔngRT ని ΔH = ΔU + pΔV లో ప్రతిక్షేపించండి.
Question 50: 1 మోల్ నీటిని 1 bar పీడనం, 100°C వద్ద ఆదర్శ వాయువులా ప్రవర్తించే నీటిబాష్పంగా మారిస్తే ఆ చర్యలో మోలార్ బాష్పీకరణ ఎంథాల్పీ 41 kJ mol⁻¹. క్రింది వాటికి అంతరికశక్తి మార్పును లెక్కకట్టండి.
a) 1 మోల్ నీరు 1 bar, 100°C వద్ద బాష్పీకరణం చెందినప్పుడు
b) 1 మోల్ నీరు ద్రవస్థితి నుంచి మంచుగా మారినప్పుడు
Answer:
a)
\( \mathrm{H_2O}(\text{ద్ర}) \longrightarrow \mathrm{H_2O}(\text{వా}) \)
Δn = 1
\( \Delta H = \Delta U + \Delta n_{(g)}RT \)
\( 41 = \Delta U + (1 \times 8.314 \times 10^{-3}) \times 373 \)
\( \Delta U = 41 - 3.1 = 37.9\ \text{kJ} \)
b)
\( \mathrm{H_2O}(\text{ద్ర}) \longrightarrow \mathrm{H_2O}(\text{ఘ}) \)
Δn = 0
ఈ మార్పులో ఘనపరిమాణం మార్పు అతిస్వల్పం, పరిగణించదగింది కాదు. కాబట్టి pΔV = ΔngRT ≈ 0, అందువల్ల ΔU ≈ ΔH. నీరు మంచుగా మారేటపుడు ΔH = – ΔfusH = – 6.00 kJ mol⁻¹ (Question 57 లోని దత్తాంశం), కాబట్టి ΔU ≈ – 6.00 kJ mol⁻¹
Exam Tips:
a) ΔU = ΔH – ΔngRT; బాష్పీకరణలో Δng = 1, ద్రవ↔ఘన మార్పులో Δng ≈ 0.
Question 51: గహన, విస్తార ధర్మాలు వివరించండి.
Answer:
పదార్థ పరిమాణంపై ఆధారపడని ధర్మాలను గహన ధర్మాలు అంటారు.
ఉదా : పీడనం, సాంద్రత, బాష్పీభవన, ద్రవీభవన స్థానాలు, బాష్పపీడనం. పదార్థ పరిమాణంపై ఆధారపడు ధర్మాలను విస్తార ధర్మాలు అంటారు.
ఉదా : ఎంట్రోపి, ద్రవ్యరాశి, ఘనపరిమాణం, అంతరికశక్తి, ఎంథాల్పీ, గిబ్స్ స్వేచ్ఛాశక్తి.
Exam Tips:
a) రెండు రకాల ధర్మాలకు రెండేసి ఉదాహరణలు ఇవ్వండి.
Question 52: ఉష్ణధారణ అంటే ఏమిటి ? Cₚ – Cᵥ = Rను ఉత్పాదించండి.
Answer:
ఒక పదార్థపు ఉష్ణోగ్రతను 1°C పెంచుటకు కావల్సిన ఉష్ణరాశిని ఉష్ణధారణ సామర్థ్యము అంటారు. దీనిని గణితం ప్రకారం క్రింది విధంగా సూచిస్తారు.
\( C = \frac{\mathrm{q}}{\mathrm{dT}} \)
Cₚ – Cᵥ = R ఉత్పాదన:
ఆదర్శ వాయువుకు, H = E + pV
ఉష్ణోగ్రతాపరంగా అవకలనం చేస్తే
\( \frac{dH}{dT} = \frac{dE}{dT} + \frac{d(pV)}{dT} \)
\( \frac{dH}{dT} = \frac{dE}{dT} + \frac{d(RT)}{dT} \quad [\because pV = RT] \)
\( \frac{dH}{dT} = \frac{dE}{dT} + R \) (లేక) \( \frac{dH}{dT} - \frac{dE}{dT} = R \)
కాని \( \frac{dH}{dT} = C_p \) మరియు \( \frac{dE}{dT} = C_v \)
∴ \( C_p - C_v = R \)
Exam Tips:
a) C = q/dT; H = E + RT ని T పరంగా అవకలనం చేసి Cp – Cv = R పొందండి.
Question 53: ΔU ను ప్రయోగపూర్వకంగా కెలోరిమెట్రిక్ విధానంలో ఏ విధంగా నిర్ణయిస్తారు ?
Answer:
అంతరికశక్తి మార్పు ΔU కొలిచే సాధనం : రసాయన చర్యల్లో స్థిర ఘనపరిమాణం వద్ద గ్రహించబడిన ఉష్ణాన్ని బాంబ్ కెలోరిమీటర్లో కొలుస్తారు. బాంబ్ కెలోరిమీటర్ ఒక దృఢమైన గోడలు గల ఉక్కుపాత్ర. ఇది ఒక జలపాత్రలో ముంచబడి ఉంటుంది. ఈ మొత్తం పాత్రల అమరికనే కెలోరిమీటర్ అంటారు. తేలికగా దహనం చెందే పదార్థాన్ని ఉక్కు బాంబులో ఉంచి ఆక్సిజన్‌ను కలిపి దహనం చేస్తారు.
చర్య ఉష్ణమోచకమై ఉష్ణం వెలువడుతుంది. ఇది కెలోరిమీటర్ ఉష్ణోగ్రతను పెంచుతుంది. బాంబ్ కెలోరిమీటర్ ఉష్ణబంధకం చేయబడి ఉంటుంది. అందువల్ల కెలోరిమీటర్ నుంచి పరిసరాలకు ఉష్ణ వినిమయం జరగదు. బాంబ్ కెలోరిమీటర్ చర్య జరిగేటపుడు పూర్తిగా మూసివుంచబడి ఉంటుంది. కాబట్టి దాని ఘనపరిమాణంలో మార్పు ఉండదు. అంటే చర్యలో శక్తి మార్పులు స్థిర ఘనపరిమాణంలో జరిగినవిగా అనుకొని కొలతలు చేయాలి. స్థిర ఘనపరిమాణం అంటే ΔV = 0,
w = pΔV = 0, అంటే చర్యలో పని ఏమీ జరగదు. చర్యలో వాయు పదార్థాలున్నప్పటికీ ఘనపరిమాణంలో మార్పురాదు. చర్య వల్ల కెలోరిమీటర్ పెరిగిన ఉష్ణోగ్రతను ఉపయోగించి కెలోరిమీటర్ ద్రవ్యరాశి, దాని ఉష్ణధారణ విలువల ద్వారా వెలువడిన ఉష్ణాన్ని (q) క్రింది సమీకరణం ఉపయోగించి గణించవచ్చు.
విశిష్టోష్ణం × ద్రవ్యరాశి = ఉష్ణధారణ
q = C × m × ΔT = C × ΔT, ఇచ్చట c × m = C
Exam Tips:
a) బాంబ్ కెలోరిమీటర్లో ΔV = 0 కాబట్టి w = 0 మరియు q = ΔU; పటం గీసి భాగాలను గుర్తించండి.
Question 54: ΔH ను ప్రయోగపూర్వకంగా కెలోరిమెట్రిక్ విధానంలో ఏ విధంగా నిర్ణయిస్తారు ?
Answer:
స్థిరపీడనం వద్ద ఉష్ణశక్తి ΔH ని కొలవడం : మూత లేకుండా తెరచి ఉన్న కెలోరిమీటర్ సాధారణంగా వాతావరణ పీడనం దగ్గర ఉంటుంది. వాతావరణ పీడనం స్థిరంగా ఉంటుంది కాబట్టి కెలోరిమీటర్లో చర్య వల్ల వచ్చిన ఉష్ణ మార్పు స్థిరపీడనం వద్ద కొలిచినదిగా భావించవచ్చు. దీనిని qp అంటారు, ఇది ΔH కు సమానమవుతుంది. ΔH = qp. కాబట్టి స్థిరపీడనం వద్ద కొలిచిన ఉష్ణమార్పు చర్యోష్ణం (అది వెలువడిన ఉష్ణం కావచ్చు లేదా గ్రహించబడిన ఉష్ణం కావచ్చు) లేదా చర్యా ఎంథాల్పీ ΔrH అవుతుంది.
ఉష్ణమోచక చర్యలో ఉష్ణం వెలువడుతుంది. అంటే వ్యవస్థ నుంచి పరిసరాలకు ఉష్ణం ఇవ్వబడుతుంది. అందువల్ల qp ఋణాత్మకమవుతుంది. ΔrH కూడా ఋణాత్మకం. అదేవిధంగా ఉష్ణగ్రాహక చర్యలో వ్యవస్థ లేదా చర్య ఉష్ణం గ్రహిస్తుంది. అంటే పరిసరాల నుంచి చర్యకు ఉష్ణం ఇవ్వబడుతుంది. దీనికి qp ధనాత్మకం, ΔrH కూడా ధనాత్మకమే.
Exam Tips:
a) తెరచిన కెలోరిమీటర్ వాతావరణ పీడనం వద్ద ఉంటుంది కాబట్టి qp = ΔH; పటం గీయండి.
Question 55: చర్యా ఎంథాల్పీ అంటే ఏమిటి ? ప్రమాణ చర్యా ఎంథాల్పీని వివరించండి.
Answer:
చర్యా ఎంథాల్పీ మార్పు ΔrH : ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారతాయి.
క్రియాజనకాలు → క్రియాజన్యాలు
స్టాయికియోమెట్రిక్ సమీకరణం ప్రకారం క్రియాజనకాల మోల్‌లు చర్యలో పాల్గొన్నప్పుడు జరిగే ఎంథాల్పీ మార్పునే చర్యా ఎంథాల్పీ అంటారు. ఒక చర్య ఎంథాల్పీ మార్పును ΔrH సంకేతంతో చూపిస్తారు.
ప్రమాణ చర్యా ఎంథాల్పీలు : చర్యలో పాల్గొన్న అన్ని పదార్థాలు ప్రమాణ స్థితుల్లో ఉంటే అప్పుడు ఆ చర్యా ఎంథాల్పీని ప్రమాణ చర్యా ఎంథాల్పీ అంటాం. ప్రమాణ చర్యా ఎంథాల్పీని ΔrH° గా, అంటే ΔH సంకేతానికి తలమీద కుడివైపున ప్రమాణ గుర్తు (°) రాస్తారు. 1 బార్ పీడనాన్ని ప్రమాణ పీడనంగాను, 298 K ఉష్ణోగ్రతను ప్రమాణ ఉష్ణోగ్రతగాను తీసుకుంటారు.
Exam Tips:
a) ప్రమాణ చర్యా ఎంథాల్పీలో అన్ని పదార్థాలు ప్రమాణ స్థితిలో (1 బార్, 298 K) ఉండాలి.
Question 56: “సంఘటనోష్ణం”ను నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
Answer:
సంఘటనోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రమాణస్థితిలో ఒక మోల్ సమ్మేళనం దాని అనుఘటక మూలకాల నుంచి (ప్రమాణ స్థితిలో) ఏర్పడినపుడు వెలువడే లేదా గ్రహించబడే ఉష్ణరాశిని సంఘటనోష్ణం (సంశ్లేషణ ఉష్ణం) అంటారు.
అనుఘటకాల నుంచి ఉష్ణం ఉద్గారం అయ్యే చర్యలో ఏర్పడే సమ్మేళనాలను ఉష్ణమోచక సమ్మేళనాలంటారు. అనుఘటకాల నుంచి సమ్మేళనం ఉష్ణగ్రాహక చర్య ద్వారా ఏర్పడినపుడు ఉష్ణగ్రాహక సమ్మేళనాలు అంటారు. అనుఘటక పదార్థాలు కూడా ప్రమాణస్థితిలో ఉంటే దానిని ప్రమాణ సంశ్లేషణోష్ణం అంటారు.
ఉదా :
\( \mathrm{C}(\text{గ్రాఫైట్}) + 2\mathrm{H_2}(\text{వా}) \longrightarrow \mathrm{CH_4}(\text{వా}),\ \Delta H = -17.9\ \text{కి.కా} \)
\( \mathrm{C}(\text{గ్రాఫైట్}) + \mathrm{O_2}(\text{వా}) \longrightarrow \mathrm{CO_2}(\text{వా}),\ \Delta H = -94.1\ \text{కి.కా} \)
Exam Tips:
a) ఒక మోల్ సమ్మేళనం ఏర్పడేటపుడు ఎంథాల్పీ మార్పు; ఉదా: C + 2H₂ → CH₄ .
Question 57: ప్రావస్థ మార్పు ఎంథాల్పీని నిర్వచించి వివరించండి.
Answer:
ఒక ప్రావస్థ ఇంకొక ప్రావస్థకు మారినప్పుడు శక్తిని వ్యవస్థ గ్రహించడమో లేదా శక్తి పరిసరాలకు విడుదల కావడమో జరుగుతుంది. ఉదాహరణకు మంచును కరిగించి నీరుగా మార్చాలంటే ఉష్ణాన్ని మంచుకు ఇవ్వాలి. ఇది 273 K వద్ద స్థిర పీడనం వద్ద జరుగుతుంది.
H₂O(ఘ) → H₂O(ద్ర) ; ΔfusH° = 6.00 kJ mol⁻¹
ఇక్కడ ΔfusH° ప్రమాణ స్థితుల్లో ద్రవీభవన ఎంథాల్పీ. అదే 273 K, 1 అట్మాస్ఫియర్ పీడనంలో నీరు ఘనీభవించి మంచుగా మారే ఉత్క్రమణీయ ప్రక్రియలో అదే ప్రమాణంలో ఉష్ణం పరిసరాలకు విడుదల అవుతుంది.
Exam Tips:
a) ప్రావస్థ మార్పు ఎంథాల్పీకి ఉదా: మంచు కరగడం ΔfusH° = 6.00 kJ mol⁻¹.
Question 58: ద్రవీభవన ఎంథాల్పీ (మోలార్ ద్రవీభవన ఎంథాల్పీ)ని నిర్వచించి వివరించండి.
Answer:
ఒక మోల్ ఘనపదార్థాన్ని ప్రమాణ పరిస్థితుల్లో ద్రవీకరించినప్పుడు కలిగే ఎంథాల్పీ మార్పును ప్రమాణ మోలార్ ద్రవీభవన ఎంథాల్పీ అంటారు. దీనిని ΔfusH° గా రాస్తారు.
H₂O(ఘ) → H₂O(ద్ర) ; ΔfusH° = 6.0 kJ mol⁻¹
Exam Tips:
a) ఒక మోల్ ఘనం ద్రవంగా మారేటపుడు ΔfusH°; ఉదా: H₂O(ఘ) → H₂O(ద్ర).
Question 59: బాష్పీభవన ఎంథాల్పీ (మోలార్ బాష్పీభవన ఎంథాల్పీ)ని నిర్వచించి వివరించండి.
Answer:
ప్రమాణ స్థితిలో ఉన్న ఒక మోల్ ద్రవాన్ని బాష్పంగా మార్చడానికి అవసరమయ్యే ఎంథాల్పీ మార్పును మోలార్ బాష్పీభవన ఎంథాల్పీ అంటారు.
ఉదా : H₂O(ద్ర) → H₂O(వా) ; ΔvapH° = + 40.79 kJ mol⁻¹
Exam Tips:
a) ఒక మోల్ ద్రవం బాష్పంగా మారేటపుడు ΔvapH°; నీటికి + 40.79 kJ mol⁻¹.
Question 60: ప్రమాణ ఉత్పతన ఎంథాల్పీని నిర్వచించి వివరించండి.
Answer:
ప్రమాణ పీడనం మరియు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక మోల్ ఘనపదార్థం ఉత్పతనం చెందినపుడు కలిగే ఎంథాల్పీ మార్పును ప్రమాణ ఉత్పతన ఎంథాల్పీ అంటారు.
ఉదా : CO₂(ఘ) → CO₂(వా) ; ΔsubH° = + 25.2 kJ mol⁻¹
Exam Tips:
a) ఘనం నేరుగా వాయువుగా మారే మార్పుకు ΔsubH°; ఉదా: CO₂(ఘ).
Question 61: ప్రమాణ సంఘటనోష్ణం (సంశ్లేషణోష్ణం) (ΔfH°) ను నిర్వచించి వివరించండి.
Answer:
ఒక మోల్ సంయోగపదార్థం దాని అత్యంత స్థిరమైన స్థితిలో, సంఘటిత మూలకాల నుంచి ఏర్పడినప్పుడు వచ్చే ప్రమాణ ఎంథాల్పీ మార్పునే ఆ సంయోగ పదార్థపు ప్రమాణ మోలార్ సంఘటన ఎంథాల్పీ లేదా ప్రమాణ మోలార్ సంఘటనోష్ణం అంటారు. దీనికి సంకేతం ΔfH°. అత్యంత స్థిరమైన సంఘటిత స్థితినే నిర్దేశ లేదా ప్రమాణ స్థితి అంటారు. ఒక మూలకం నిర్దేశ లేదా ప్రమాణ స్థితి అంటే ఆ మూలకపు అత్యంత స్థిరమైన, 25°C వద్ద 1 బార్ పీడనం వద్ద ఉన్న సంఘటిత స్థితి. ప్రమాణస్థితిలో హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్లు వరుసగా H₂(g), O₂(g), C(graphite) గా ఉంటాయి.
C(graphite) + O₂(g) → CO₂(g) ; ΔfH° = – 393.5 kJ mol⁻¹
Exam Tips:
a) సంఘటనోష్ణంలో ఒక మోల్ సమ్మేళనం, మూలకాలు ప్రమాణ స్థితిలో ఉండాలి; ప్రమాణ స్థితిలోని మూలకాల ΔfH° = 0.
Question 62: హెస్ స్థిరోష్ణ నియమాన్ని నిర్వచించి వివరించండి. (March 2013)
Answer:
ఒక రసాయన చర్య ఒక దశలో జరిగినా లేక అనేక దశల్లో జరిగినా ఆ చర్యలో జరిగే మొత్తం ఎంథాల్పీ మార్పు సమానంగా ఉంటుంది.
A అనే పదార్థం రెండు విభిన్న మార్గాల ద్వారా చర్య జరిపి D అనే పదార్థాన్ని ఇచ్చినదని అనుకోండి.
ఏకదశ : A → D ; ΔH = Q
అనేక దశలు:
A → B ; ΔH₁ = q₁
B → C ; ΔH₂ = q₂
C → D ; ΔH₃ = q₃
ΔH₁ + ΔH₂ + ΔH₃ = q₁ + q₂ + q₃
హెస్ నియమం ప్రకారం Q = q₁ + q₂ + q₃
ఉదా : CO₂(వా) ను C(గ్రా), O₂(వా) నుండి రెండు విధాలుగా పొందవచ్చు.
ఏకదశ : \( \mathrm{C}(\text{గ్రాఫైట్}) + \mathrm{O_2}(g) \longrightarrow \mathrm{CO_2}(\text{వా}),\ \Delta_r H^{\circ} = -393.5\ \text{kJ} \)
అనేక దశలు : \( \mathrm{C}(\text{గ్రాఫైట్}) + \tfrac{1}{2}\mathrm{O_2}(g) \longrightarrow \mathrm{CO}(\text{వా}),\ \Delta_r H^{\circ} = -110.5\ \text{kJ} \)
\( \mathrm{CO}(\text{వా}) + \tfrac{1}{2}\mathrm{O_2}(\text{వా}) \longrightarrow \mathrm{CO_2}(\text{వా}),\ \Delta_r H^{\circ} = -283.02\ \text{kJ} \)
అనేక దశలలో మొత్తం ఎంథాల్పీ మార్పు = – 110.5 + (– 283.02) = – 393.52 kJ ≈ – 393.5 kJ
ఏకదశలో మరియు అనేక దశలలో ఎంథాల్పీ మార్పు సమానంగా ఉంది కాబట్టి ఈ ఉదాహరణ హెస్ నియమానికి అనుగుణంగా ఉన్నది.
Exam Tips:
a) ఏకదశ, అనేక దశల ఎంథాల్పీ మార్పులు సమానమని CO₂ ఉదాహరణతో చూపండి (– 393.5 kJ).
Question 63: దహనచర్య ఎంథాల్పీ (ΔcH°) ను నిర్వచించి వివరించండి.
Answer:
ఒక మోల్ పదార్థం ప్రమాణస్థితుల్లో అధిక ఆక్సిజన్ సమక్షంలో దహనం చెంది పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు వచ్చిన క్రియాజన్యాలు కూడా ప్రమాణస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దహన చర్యలో వెలువడిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క ప్రమాణ దహనచర్య ఎంథాల్పీ అంటారు.
ఉదా : C₄H₁₀(వా) + 13/2 O₂(వా) → 4CO₂(వా) + 5H₂O(ద్ర) ; ΔcH° = – 2658.0 kJ mol⁻¹
Exam Tips:
a) ఒక మోల్ పదార్థం పూర్తి దహనం; ఉదా: C₄H₁₀ కు ΔcH° = – 2658.0 kJ mol⁻¹.
Question 64: ΔaH° పరమాణీకరణ ఎంథాల్పీని నిర్వచించి వివరించండి.
Answer:
నిర్వచనం : ఒక మోల్ పదార్థాన్ని పూర్తిగా విడగొట్టి వాయుస్థితిలోని తటస్థ పరమాణువులుగా మార్చేటప్పుడు కలిగే ఎంథాల్పీ మార్పును పరమాణీకరణ ఎంథాల్పీ అంటారు.
ఉదా : H – H బంధాల విచ్ఛిత్తి వల్ల హైడ్రోజన్ పరమాణువులు ఏర్పడుతున్నాయి. ఈ చర్యలో వచ్చే ఎంథాల్పీ మార్పును పరమాణీకరణ ఎంథాల్పీ, ΔaH° అంటారు.
H₂(వా) → 2H(వా) ; ΔaH° = 435.0 kJ mol⁻¹.
Exam Tips:
a) పరమాణీకరణ = పదార్థాన్ని వాయుస్థితి పరమాణువులుగా విడగొట్టడం; ఉదా: H₂ → 2H, 435.0 kJ mol⁻¹.
Question 65: బంధ ఎంథాల్పీ (ΔbondH°) నిర్వచించి వివరించండి.
Answer:
నిర్వచనం : వాయుస్థితిలో ఉన్న ఒక సమయోజనీయ పదార్థంలోని ఒక మోల్ సమయోజనీయ బంధాలను విచ్ఛిత్తిచేసి వాయుస్థితిలో ఉన్న క్రియాజన్యాలను ఇచ్చినప్పుడు జరిగిన ఎంథాల్పీ మార్పును బంధ వియోజన ఎంథాల్పీ అంటారు.
ఉదా : H₂(g) → 2H(g) ; ΔH–HH° = 435.0 kJ mol⁻¹
ఈ చర్యలో జరిగిన ఎంథాల్పీ మార్పు H – H బంధపు బంధ వియోజన ఎంథాల్పీ.
Exam Tips:
a) బంధ వియోజన ఎంథాల్పీ = ఒక మోల్ బంధాలు విచ్ఛిత్తి చెందడానికి కావలసిన ఎంథాల్పీ; H–H కు 435.0 kJ mol⁻¹.
Question 66: CH₄ లోని C–H బంధ ఎంథాల్పీని వివరించండి.
Answer:
మీథేన్ (CH₄) లో నాలుగు C – H బంధాలున్నాయి. ఇవన్నీ బంధ దైర్ఘ్యం, బంధశక్తులకు సంబంధించి సమాన విలువలు కలిగి ఉంటాయి. అయితే బంధాల్ని ఒక్కొక్కటిగా విచ్ఛిత్తి చేస్తుంటే బంధశక్తి విలువలు మారతాయి.
CH₄(వా) → CH₃(వా) + H(వా) ; ΔbondH° = + 427 kJ mol⁻¹
CH₃(వా) → CH₂(వా) + H(వా) ; ΔbondH° = + 439 kJ mol⁻¹
CH₂(వా) → CH(వా) + H(వా) ; ΔbondH° = + 452 kJ mol⁻¹
CH(వా) → C(వా) + H(వా) ; ΔbondH° = + 347 kJ mol⁻¹
కాబట్టి,
CH₄(వా) → C(వా) + 4H(వా) ; ΔaH° = 1665 kJ mol⁻¹
ఇలాంటి పరిస్థితుల్లో సగటు బంధశక్తి తీసుకోవాలి.
ఉదా : CH₄ లో C – H కు సగటు బంధ ఎంథాల్పీ
ΔC–HH° = ¼ (ΔaH°) = ¼ (1665 kJ mol⁻¹) = 416 kJ mol⁻¹
Exam Tips:
a) నాలుగు బంధ ఎంథాల్పీల మొత్తం 1665; సగటు C–H = 1665/4 = 416 kJ mol⁻¹.
Question 67: ద్రావణోష్ణం (ΔsolH°), విలీన ప్రక్రియ ఉష్ణం (ΔdilH°) లను నిర్వచించి వివరించండి.
Answer:
1. ఒక మోల్ ద్రావితాన్ని అధిక ద్రావణిలో సంపూర్ణంగా కరిగించినప్పుడు విడుదలైన లేదా గ్రహించబడిన ఉష్ణరాశి ప్రమాణాన్ని ద్రావణోష్ణం అంటారు.
ఉదా : MgSO₄ + నీరు → MgSO₄ (జల ద్రావణం)
2. స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 1 మోల్ ద్రావితం కరిగి ఉన్న ద్రావణానికి అధిక ద్రావణి కలిపి విలీనం చేసినపుడు జరిగే ఎంథాల్పీ మార్పును విలీనోష్ణం అంటారు. ద్రావణి పరిమాణం మీద ఆధారపడి ద్రావణ ప్రక్రియలో ఎంథాల్పీ మార్పు ఉంటుంది. ఇంకా ఇంకా ఎక్కువ ద్రావణి కలిపిన కొద్దీ ఒక దశ దాటాక ఎంథాల్పీలో మార్పు ఏమీ ఉండదు.
ఉదా : HCl(వా) ను విలీనం చేసినపుడు ఎంథాల్పీ మార్పు
ΔH(40H₂O) – ΔH(25H₂O) = ΔHవిలీనం
ΔHవిలీనం = [– 72.79 – (– 72.03)] kJ mol⁻¹ = – 0.76 kJ mol⁻¹
Exam Tips:
a) ద్రావణోష్ణం, విలీనోష్ణం నిర్వచనాలు వేరువేరుగా రాసి HCl ఉదాహరణ లెక్క (– 0.76 kJ) చూపండి.
Question 68: అయొనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ స్వీకరణ ఎంథాల్పీలను నిర్వచించండి.
Answer:
అయొనైజేషన్ ఎంథాల్పీ : వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు బాహ్యకర్పరం నుండి ఒక ఎలక్ట్రాన్‌ను తొలగించి అయాన్‌గా మార్చే సందర్భంలో కలిగే ఎంథాల్పీ మార్పును అయొనైజేషన్ ఎంథాల్పీ అంటారు.
ఉదా : Na(వా) → Na⁺(వా) + ఎలక్ట్రాన్ ; ΔiH° = 496 kJ mol⁻¹
ఎలక్ట్రాన్ స్వీకరణ ఎంథాల్పీ : వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు అదనంగా ఒక ఎలక్ట్రాన్‌ను పొందినపుడు కలిగే ఎంథాల్పీ మార్పును ఎలక్ట్రాన్ స్వీకరణ ఎంథాల్పీ (లేక) ఎలక్ట్రాన్ ఎఫినిటి అంటారు.
ఉదా : Cl(వా) + ఎలక్ట్రాన్ → Cl⁻(వా) ; ΔegH° = – 348.6 kJ mol⁻¹
Exam Tips:
a) ΔiH° ధనాత్మకం (Na కు 496), ΔegH° ఋణాత్మకం (Cl కు – 348.6) అని ఉదాహరణలు ఇవ్వండి.
Question 69: ఒక ప్రక్రియ అయత్నీకృతాన్ని వివరించండి.
Answer:
బాహ్యకారక ప్రమేయం లేకుండా చర్య స్వచ్ఛందంగా జరిగే ప్రక్రియను అయత్నీకృతం అంటారు. ఇది అద్విగత (అనుత్క్రమణీయ) చర్య. అన్ని సహజ ప్రక్రియలు అయత్నీకృత చర్యలే. ఎంథాల్పీలో తగ్గుదల అయత్నీకృత చర్యలకు ఒక అనుకూల అంశం, కాని ఇది అన్ని సందర్భాలలో నిజం కాదు. అయత్నీకృత చర్యలలో విశ్వం యొక్క ఎంట్రోపీ పెరుగుతుంది. అయత్నీకృతతకు నిర్ణయాత్మక నియమం ΔG° = – (స్వేచ్ఛాశక్తి మార్పు ఋణాత్మకం). ΔH° = – (ఎంథాల్పీ మార్పు ఋణాత్మకం), ΔS° = + (ఎంట్రోపీలో మార్పు ధనాత్మకం) రెండూ ఉంటే చర్య అన్ని ఉష్ణోగ్రతల వద్ద అయత్నీకృతం.
అయత్నీకృత చర్యల యొక్క నిబంధనను వివరించడానికి గిబ్స్ ఒక ఉష్ణగతిక ప్రమేయాన్ని ప్రవేశపెట్టాడు. దీనిని గిబ్స్ శక్తి అంటారు. గిబ్స్ సమీకరణం ప్రకారం, ΔG = ΔH – TΔS
అయత్నీకృత చర్యలు – నిబంధనలు:
చర్యల స్వచ్ఛందత లేదా అయత్నీకృతంపై ఉష్ణోగ్రత ప్రభావం
| ΔrH° | ΔrS° | ΔrG° | ఉష్ణోగ్రతపరంగా చర్య అయత్నీకృతమా కాదా అనే వివరణ |
| – | + | – | చర్య అయత్నీకృతం, అన్ని ఉష్ణోగ్రతల దగ్గరా స్వచ్ఛందం |
| – | – | – (తక్కువ T వద్ద) | చర్య తక్కువ ఉష్ణోగ్రత వద్ద అయత్నీకృతం |
| – | – | + (ఎక్కువ T వద్ద) | అధిక ఉష్ణోగ్రతల వద్ద చర్య అనయత్నీకృతం (nonspontaneous) |
| + | + | + (తక్కువ T వద్ద) | అల్ప ఉష్ణోగ్రతల వద్ద చర్య అనయత్నీకృతం (nonspontaneous) |
| + | + | – (అధిక T వద్ద) | చర్య అయత్నీకృతం, ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద |
| + | – | + (అన్ని ఉష్ణోగ్రతల T వద్ద) | చర్య అనయత్నీకృతం, అన్ని ఉష్ణోగ్రతల వద్ద |
Exam Tips:
a) అయత్నీకృతతకు నిర్ణాయకం ΔG < 0; ΔG = ΔH – TΔS పట్టికతో ఉష్ణోగ్రత ప్రభావం చెప్పండి.
Question 70: ఒక అయత్నీకృత ప్రక్రియకు కారణం ఎంథాల్పీ తగ్గుదల మాత్రమే కారణమా ? వివరించండి.
Answer:
ఎంథాల్పీలో తగ్గుదల (ΔH = – ve) అనేది అయత్నీకృత చర్యలకు తోడ్పడే ఒక అంశమే గాని అన్ని సందర్భాలలో అది నిజం కాదు. ఎందుకంటే ఎంథాల్పీలో పెరుగుదల (ΔH = + ve) ఉన్న కొన్ని చర్యలు అయత్నీకృతాలుగా ఉంటాయి.
ఉదా : H₂O(ఘ) → H₂O(ద్ర) ; ΔH° = + 6.0 kJ mol⁻¹ (273 K కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అయత్నీకృతం)
గిబ్స్ ప్రకారం, అయత్నీకృత చర్యలకు ΔG విలువ ఋణాత్మకంగా ఉండాలి. కాబట్టి అయత్నీకృత చర్యలకు ఎంథాల్పీ తగ్గుదల మాత్రమే కారణం కాదు.
Exam Tips:
a) ΔH ధనాత్మకమైనా అయత్నీకృతమయ్యే ఉదాహరణ ఇచ్చి ΔG ప్రమాణమని ముగించండి.
Question 71: ఎంట్రోపీ అంటే ఏమిటి ? ఉదాహరణలతో వివరించండి.
Answer:
ఎంట్రోపి : ఒక వ్యవస్థలోని అణువుల క్రమరాహిత్యాన్ని తెలియచేసే దానిని ఎంట్రోపి అంటారు. వ్యవస్థలోని అణువుల క్రమరాహిత్యం పెరిగే కొలది ఎంట్రోపి పెరుగుతుంది. ఇది స్థితి ప్రమేయం ఒక వివిక్త వ్యవస్థలో జరిగే అయత్నీకృత ప్రక్రియకు ఎంట్రోపి మార్పు (ΔS) ధనాత్మకంగా వుంటుంది.
\( \Delta S = \frac{q_{rev}}{T} \)
\( \Delta S_{\text{మొత్తం}} = \Delta S_{\text{వ్యవస్థ}} + \Delta S_{\text{పరిసరాలు}} \)
ఉదా : ఘనపదార్థం (ఎంట్రోపీ తక్కువ) –ఉష్ణం→ ద్రవం (ఎంట్రోపీ మధ్యస్థం) –ఉష్ణం→ బాష్పం (ఎంట్రోపీ ఎక్కువ)
Exam Tips:
a) ఎంట్రోపీ = క్రమరాహిత్యం కొలత; ఘనం < ద్రవం < వాయువు అని ఉదాహరణ ఇవ్వండి.
Question 72: ఎంట్రోపీ పెరుగుదలే అయత్నీకృత ప్రక్రియకు కారణం. వివరించండి.
Answer:
అయత్నీకృత చర్యకు ఎంట్రోపీలో పెరుగుదల అనేది ఒక అంశం మాత్రమే. అన్ని సందర్భాలలో కాదు. ఎంట్రోపీలో తగ్గుదల (ΔS = – ve) ఉన్నపుడు తిరోగామి చర్య అయత్నీకృతంగా ఉంటుంది. ఎంట్రోపీలో మార్పు సున్న (ΔS = 0) అయితే ఆ వ్యవస్థ సమతాస్థితిలో ఉంటుంది. ΔH = – ve, ΔS = + ve, ΔG = -ve అయితే అన్ని ఉష్ణోగ్రతల వద్ద చర్య అయత్నీకృతంగా ఉంటుంది.
Exam Tips:
a) ΔH = – ve, ΔS = + ve అయితే అన్ని ఉష్ణోగ్రతల వద్ద అయత్నీకృతం; ΔS ఒక్కటే చాలదు.
Question 73: ΔU, ΔS ఉత్క్రమణీయ, అనుత్క్రమణీయ ప్రక్రియలను వివరించగలుగుతాయా ? వివరించండి.
Answer:
ΔU అనేది అంతరికశక్తిలో మార్పు. ΔS అనేది ఎంట్రోపిలో మార్పు.
ఉష్ణమోచక చర్యలలో పురోగామి ప్రక్రియలో ΔU లో తగ్గుదల ఉంటుంది. ఈ సందర్భంలో ΔU అనే చర్య అయత్నీకృతకు అనుకూలం. ద్విగత చర్యలలో ΔU లో తగ్గుదల ఉండే దిశ చర్యకు అనుకూలంగా ఉంటుంది.
ΔS విషయంలో ΔS = + ve అయితే చర్య అయత్నీకృతం.
ΔS = -ve అయితే తిరోగామి చర్య అయత్నీకృతం, ΔS = 0 అయితే చర్య
సమతాస్థితిలో ఉంటుంది.
ΔU లేదా ΔH = -ve, ΔS = + ve, ΔG = -ve అయితే అన్ని ఉష్ణోగ్రతల వద్ద చర్య అయత్నీకృతం.
Exam Tips:
a) ΔU, ΔS ఒక్కొక్కటి మాత్రమే అయత్నీకృతతను పూర్తిగా వివరించలేవు; ΔG అవసరం.
Question 74: 4Fe(ఘ) + 3O₂(వా) → 2Fe₂O₃(ఘ) అనే ఐరన్ ఆక్సీకరణ చర్యకు 298 K వద్ద ఎంట్రోపీ మార్పు – 549.45 J K⁻¹ mol⁻¹ (ΔH = – 1648 × 10³ J mol⁻¹). దీనికి ఋణాత్మక ఎంట్రోపీ ఉన్నా చర్య అయత్నీకృతంగా జరుగుతుంది. ఎందువల్ల ?
Answer:
ΔG = ΔH – TΔS
= – 1648 × 10³ J mol⁻¹ – 298 × (– 549.45) J mol⁻¹
= – 1648 × 10³ + 163.7 × 10³ = – 1484 × 10³ J mol⁻¹
ΔG ఋణాత్మకం. అందువల్ల ఎంట్రోపీ మార్పు ఋణాత్మకంగా ఉన్నప్పటికీ చర్య అయత్నీకృతంగా జరుగుతుంది.
Exam Tips:
a) ΔS ఋణాత్మకమైనా ΔH ఋణాత్మకత ఎక్కువగా ఉంటే ΔG ఋణాత్మకం; విలువలు ప్రతిక్షేపించండి.
Question 75: కింది వాటిల్లో ఏ ఫార్ములాలు సరైనవి ?
a) G = H – TS
b) ΔGవ్యవస్థ = ΔHవ్యవస్థ – TΔSవ్యవస్థ
c)
\( \Delta S_{\text{పరిసరాలు}} = \frac{\Delta H_{\text{పరిసరాలు}}}{T} = \frac{-\Delta H_{\text{వ్యవస్థ}}}{T} \)
d)
\( \Delta S_{\text{మొత్తం}} = \Delta S_{\text{వ్యవస్థ}} + \frac{-\Delta H_{\text{వ్యవస్థ}}}{T} \)
e) TΔSమొత్తం = TΔSవ్యవస్థ – ΔHవ్యవస్థ
Answer:
స్థిర ఉష్ణోగ్రత వద్ద
| సూత్రం | నిర్ణయం | |
| a) | \( G = H - TS \) | సరైనది |
| b) | \( \Delta G_{\text{వ్యవస్థ}} = \Delta H_{\text{వ్యవస్థ}} - T\Delta S_{\text{వ్యవస్థ}} \) | సరైనది |
| c) | \( \Delta S_{\text{పరిసరాలు}} = \frac{\Delta H_{\text{పరిసరాలు}}}{T} = \frac{-\Delta H_{\text{వ్యవస్థ}}}{T} \) | సరైనది |
| d) | \( \Delta S_{\text{మొత్తం}} = \Delta S_{\text{వ్యవస్థ}} + \frac{-\Delta H_{\text{వ్యవస్థ}}}{T} \) | సరైనది |
| e) | \( T\Delta S_{\text{మొత్తం}} = T\Delta S_{\text{వ్యవస్థ}} - \Delta H_{\text{వ్యవస్థ}} \) | సరైనది |
Exam Tips:
a) సూత్రాలు అన్నీ స్థిర ఉష్ణోగ్రత వద్ద సరైనవే (G = H – TS, ΔSపరిసరాలు = – ΔHవ్యవస్థ/T).
Question 76: ఆక్సిజన్‌ను ఓజోన్‌గా మార్చడానికి ΔrG° ను 298 K వద్ద గణించండి. చర్య Kp విలువ 2.43 × 10⁻²⁹.
Answer:
ΔrG° = – 2.303 RT log Kp
Kp = 2.43 × 10⁻²⁹
ΔrG° = – 2.303 × 8.314 × 298 × log (2.43 × 10⁻²⁹)
= – 5705.9 × (– 28.614) J mol⁻¹
ΔrG° = + 163 kJ mol⁻¹
Exam Tips:
a) ΔG° = – 2.303 RT log Kp; log 10⁻²⁹ విలువను జాగ్రత్తగా లెక్కించండి (– 28.61).
Question 77: ఉష్ణగతికశాస్త్రం రెండో నియమాన్ని నిర్వచించి వివరించండి.
Answer:
క్లాసియస్ నిర్వచనం : విశ్వం యొక్క ఎంట్రోపీ గరిష్ఠంగా మారే దిశలో చలిస్తుంది. లేదా ఉష్ణశక్తి స్వచ్ఛందంగా చల్లని వస్తువు నుంచి వేడిగా గల వస్తువుకు ప్రసరించదు. లేదా పనిని పూర్తిగా ఉష్ణరాశిగా మార్చవచ్చు కానీ ఉష్ణరాశిని 100% పనిగా మార్చడం అసాధ్యం.
లేదా
అన్ని స్వచ్ఛంద చర్యల్లో ఎంట్రోపీ మార్పు ధనాత్మకం లేదా రెండోరకం సతతచలన యంత్ర నిర్మాణం అసాధ్యం.
Exam Tips:
a) రెండో నియమానికి రెండు నిర్వచనాలు రాయండి (ఎంట్రోపీ పెరుగుదల, ఉష్ణం పూర్తిగా పనిగా మారదు).
Question 78: ఉష్ణగతికశాస్త్రం మూడో నియమాన్ని నిర్వచించండి. దీనిని గురించి మీకు ఏమి తెలిసింది ?
Answer:
మూడవ నియమం:
పరిపూర్ణ శుద్ధ స్ఫటిక పదార్థాల ఎంట్రోపి విలువ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద శూన్యవిలువను కలిగి ఉంటుంది.
\( S_T = \int_0^T \frac{C_p}{T}\,dT \) సమీకరణం ఉపయోగించి, ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద Cp విలువ తెలిస్తే ఎంట్రోపి (S) విలువను లెక్కగట్టవచ్చు.
ప్రాముఖ్యత:
1. ఈ నియమం సాయంతో చర్యల్లో ఎంట్రోపీ మార్పును నిర్ణయించవచ్చు.
2. పదార్థాల పరమ ఎంట్రోపీ విలువలను కొలవడానికి పరమశూన్యం వద్ద S = 0 అనేది నిర్దేశ బిందువుగా ఉపయోగపడుతుంది.
3. ఈ నియమం ఎంట్రోపి అవధిని గురించి తెలుపుతుంది.
Exam Tips:
a) మూడో నియమం, ST = ∫Cp/T dT, ప్రాముఖ్యత ఒకదాని తరువాత ఒకటి రాయండి.
Question 79: ఎంట్రోపీ భావనను వివరించండి.
Answer:
ఎంట్రోపి : ఒక వ్యవస్థలోని అణువుల క్రమరాహిత్యాన్ని తెలియచేసే దానిని ఎంట్రోపి అంటారు. వ్యవస్థలోని అణువుల క్రమరాహిత్యం పెరిగే కొలదీ ఎంట్రోపి పెరుగుతుంది. ఇది స్థితి ప్రమేయం. ఒక వివిక్త వ్యవస్థలో జరిగే అయత్నీకృత ప్రక్రియకు ఎంట్రోపి మార్పు (ΔS) ధనాత్మకంగా ఉంటుంది.
\( \Delta S = \frac{q_{rev}}{T} \)
\( \Delta S_{\text{మొత్తం}} = \Delta S_{\text{వ్యవస్థ}} + \Delta S_{\text{పరిసరాలు}} \)
ఉదా : ఘనపదార్థం (ఎంట్రోపీ తక్కువ) –ఉష్ణం→ ద్రవం (ఎంట్రోపీ మధ్యస్థం) –ఉష్ణం→ బాష్పం (ఎంట్రోపీ ఎక్కువ)
Exam Tips:
a) ఎంట్రోపీ = క్రమరాహిత్యం; అయత్నీకృత ప్రక్రియలో ΔSమొత్తం > 0.
Question 80: గిబ్స్ శక్తిపరంగా ప్రక్రియ అయత్నీకృత మార్పును వివరించండి.
Answer:
గిబ్స్ శక్తి : ఇది ఉష్ణగతిక ప్రమేయం. దీనిలో ఎంథాల్పీ, ఎంట్రోపీ ప్రమేయాలు ఇమిడి ఉంటాయి. ఒక చర్య స్వచ్ఛంద చర్య అవునో, కాదో తెలుసుకొనుటకు ఇది తగినంత, అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. ఇది స్థితి ప్రమేయం.
గిబ్స్ సమీకరణం ప్రకారం
ΔG = ΔH – TΔS
ఇచ్చట ΔG = గిబ్స్ శక్తిలో మార్పు
ΔH = ఎంథాల్పీ మార్పు
TΔS = ఉష్ణోగ్రత × ఎంట్రోపీ మార్పు.
ΔG ఋణాత్మకమైతే (ΔG < 0) చర్య స్వచ్ఛందం; ΔG ధనాత్మకమైతే (ΔG > 0) చర్య అస్వచ్ఛందం.
ΔG = 0 అయితే చర్య సమతాస్థితిలో ఉంటుంది.
ΔG = – ve, ΔS = + ve అయితే ప్రక్రియ అయత్నీకృతం (TΔS > ΔH గా ఉండాలి). ΔG = – ve, ΔS = + ve, ΔH = – ve అయితే చర్య అన్ని ఉష్ణోగ్రతల వద్ద అయత్నీకృతం.
Exam Tips:
a) ΔG = ΔH – TΔS; ΔG < 0 స్వచ్ఛందం, = 0 సమతాస్థితి, > 0 అస్వచ్ఛందం.
Question 81: గిబ్స్ శక్తి మార్పు విలువ, గుర్తుల ఆధారంగా ఒక రసాయనిక చర్య అయత్నీకృత మార్పును, దాని నుంచి లభించే ఉపయోగకరమైన పనిని తెలుసుకోవచ్చు. దీన్ని వివరించండి.
Answer:
ఒక స్వచ్ఛంద చర్యకు గిబ్స్ శక్తి మార్పు ΔG విలువ ఋణాత్మకంగా ఉండవలెను. భిన్న చర్యల ΔH, ΔS మరియు ΔG విలువలు క్రింది విధంగా ఉండును.
| ΔH | ΔS | ΔG | చర్య స్వభావం | |
| 1) | – | + | – | అన్ని ఉష్ణోగ్రతల వద్ద అయత్నీకృతం. ఉదా : 2O₃ → 3O₂ |
| 2) | + | – | + | అన్ని ఉష్ణోగ్రతల వద్ద అస్వచ్ఛందం. ఉదా : 3O₂ → 2O₃ |
| 3) | – | – | – | అల్ప ఉష్ణోగ్రత వద్ద అయత్నీకృతం. ఉదా : నీరు → మంచు |
| 4) | – | – | + | అధిక ఉష్ణోగ్రత వద్ద అస్వచ్ఛందం |
| 5) | + | + | + | అల్ప ఉష్ణోగ్రత వద్ద అస్వచ్ఛందం |
| 6) | + | + | – | అధిక ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛందం |
గిబ్స్ శక్తిలో మార్పుకు, సమతాస్థితి స్థిరాంకం ‘K’ కు గల సంబంధాన్ని క్రింది సమీకరణం సూచిస్తుంది.
ΔrG° = ΔrH° – TΔrS° = – RT ln K
ఉష్ణగ్రాహక చర్యలకు ΔrH° విలువ అధికంగా ఉండి ధనాత్మకంగా ఉంటే (K < 1).
ఉష్ణమోచక చర్యలకు ΔrH° విలువ అధికంగా ఉండి ఋణాత్మకంగా ఉంటే (K > 1).
ΔG ఋణాత్మకమైనపుడు చర్య నుండి ఉపయోగకరమైన (విస్తరణేతర) పని లభిస్తుంది; లభించే గరిష్ఠ ఉపయోగకరమైన పని = – ΔG.
Exam Tips:
a) ΔG ఋణాత్మకమైతే చర్య అయత్నీకృతం మరియు – ΔG గరిష్ఠ ఉపయోగకరమైన పనికి సమానం; పట్టిక ఇవ్వండి.
Question 82: ఒక ప్రక్రియలో 701 J ల ఉష్ణం వ్యవస్థ గ్రహించగా వ్యవస్థ 394 J పనిని చేసింది. వ్యవస్థ అంతరిక శక్తి మార్పు ఎంత ?
Answer:
ΔU = q + w
q = + 701 J (వ్యవస్థ ఉష్ణం గ్రహించింది), w = – 394 J (వ్యవస్థ పని చేసింది)
ΔU = 701 + (– 394) = 307 J
వ్యవస్థ అంతరిక శక్తి మార్పు = 307 J
Exam Tips:
a) ΔU = q + w, ఇక్కడ q = + 701 J, w = – 394 J.
Question 83: సయనమైడ్ NH₂CN(ఘ), డైఆక్సిజన్ల మధ్య బాంబ్ కెలోరిమీటర్లో 298 K వద్ద చర్య జరిగితే ΔU = – 742.7 kJ mol⁻¹. ఇదే ఉష్ణోగ్రత వద్ద ఎంథాల్పీ మార్పు ఎంత ?
NH₂CN(ఘ) + 3/2 O₂(వా) → N₂(వా) + CO₂(వా) + H₂O(ద్ర)
Answer:
NH₂CN(ఘ) + 3/2 O₂(వా) → N₂(వా) + CO₂(వా) + H₂O(ద్ర)
వాయుస్థితిలో ఉన్న క్రియాజనకాల మోల్‌ల సంఖ్య = 3/2 = 1.5
వాయుస్థితిలో ఉన్న క్రియాజన్యాల మోల్‌ల సంఖ్య = 1 + 1 = 2
Δng = 2 – 1.5 = + 0.5
ΔH = ΔU + ΔngRT
= – 742.7 + (0.5 × 8.314 × 10⁻³ × 298)
= – 742.7 + 1.24 = – 741.5 kJ mol⁻¹
Exam Tips:
a) Δng లో ఘనపదార్థాలను లెక్కించవద్దు (NH₂CN ఘనం); ΔH = ΔU + ΔngRT.
Question 84: 60 g అల్యూమినియం ఉష్ణోగ్రతను 35°C నుంచి 55°C కు మార్చడానికి ఎన్ని kJ ఉష్ణం కావాలి ? అల్యూమినియం మోలార్ ఉష్ణధారణ = 24 J mol⁻¹ K⁻¹.
Answer:
q = n × C × ΔT
q = అల్యూమినియం గ్రహించిన ఉష్ణం
n = అల్యూమినియం మోల్‌ల సంఖ్య = 60/27 (Al పరమాణు ద్రవ్యరాశి 27)
C = అల్యూమినియం మోలార్ ఉష్ణధారణ
ΔT = ఉష్ణోగ్రతలో వ్యత్యాసం = 55 – 35 = 20 K
q = (60/27) × 24 × 20 = 1067 J = 1.067 kJ
Exam Tips:
a) మోల్‌ల సంఖ్య = ద్రవ్యరాశి/మోలార్ ద్రవ్యరాశి; q = n C ΔT.
Question 85: 1.0 mol నీటిని 10°C నుంచి మంచుగా – 10°C కు మార్చడానికి ఎంత ఎంథాల్పీ మార్పు తేవాలి ?
ΔfusH = 6.03 kJ mol⁻¹ (0°C వద్ద)
Cp[H₂O(ద్ర)] = 75.3 J mol⁻¹ K⁻¹
Cp[H₂O(ఘ)] = 36.8 J mol⁻¹ K⁻¹
Answer:
\( \underset{10^\circ C}{\mathrm{H_2O}(l)} \longrightarrow \underset{0^\circ C}{\mathrm{H_2O}(l)} \longrightarrow \underset{0^\circ C}{\mathrm{H_2O}(s)} \longrightarrow \underset{-10^\circ C}{\mathrm{H_2O}(s)} \)
1వ దశ (ద్రవ నీటిని 10°C నుండి 0°C కు చల్లబరచడం) : ΔH = nCpΔT = 75.3 × (– 10) = – 753 J
2వ దశ (0°C వద్ద ఘనీభవనం) : ΔH = – 6.03 kJ = – 6030 J
3వ దశ (మంచును 0°C నుండి – 10°C కు చల్లబరచడం) : ΔH = nCpΔT = 36.8 × (– 10) = – 368 J
∴ ΔH = – 6030 + (– 753) + (– 368) = – 7151 J = – 7.151 kJ
Exam Tips:
a) మూడు దశలను (చల్లబరచడం, ఘనీభవనం, మంచును చల్లబరచడం) వేరువేరుగా లెక్కించి కూడండి; అన్నీ ఋణాత్మకం.
Question 86: C(ఘ) ను CO₂ గా మార్చడానికి దహనక్రియ ఎంథాల్పీ – 393.5 kJ mol⁻¹. కార్బన్, డై ఆక్సిజన్ వాయువు నుంచి 35.2 g CO₂ ఏర్పడినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి ఎంత ?
Answer:
C(ఘ) + O₂(వా) → CO₂(వా) ; ΔH = – 393.5 kJ
1 మోల్ CO₂ (44 g) ఏర్పడేటపుడు విడుదలయ్యే ఉష్ణం = 393.5 kJ
35.2 g CO₂ ఏర్పడేటపుడు విడుదలయ్యే ఉష్ణం = (35.2/44) × 393.5 = 314.8 kJ (ΔH = – 314.8 kJ)
Exam Tips:
a) 35.2 g CO₂ = 0.8 మోల్; ఉష్ణం = 0.8 × 393.5 kJ.
Question 87: CO(వా), CO₂(వా), N₂O(వా), N₂O₄(వా) ల సంఘటన ఎంథాల్పీలు వరుసగా – 110, – 393, 81, 9.7 kJ mol⁻¹. కింది చర్య ΔrH విలువ కనుక్కోండి.
N₂O₄(వా) + 3CO(వా) → N₂O(వా) + 3CO₂(వా)
Answer:
\( \Delta_r H^{\circ} = [3\Delta_f H^{\circ}(\mathrm{CO_2}) + \Delta_f H^{\circ}(\mathrm{N_2O})] - [\Delta_f H^{\circ}(\mathrm{N_2O_4}) + 3\Delta_f H^{\circ}(\mathrm{CO})] \)
\( = [3(-393) + 81] - [9.7 + 3(-110)] = -777.7\ \text{kJ} \)
Exam Tips:
a) ΔrH° = Σ ΔfH°(క్రియాజన్యాలు) – Σ ΔfH°(క్రియాజనకాలు), గుణకాలతో.
Question 88: N₂(వా) + 3H₂(వా) → 2NH₃(వా) ; ΔrH° = – 92.4 kJ mol⁻¹, అయితే అమ్మోనియా ప్రమాణ సంఘటన ఎంథాల్పీ ఎంత ?
Answer:
చర్యా ఉష్ణం ΔrH° = – 92.4 kJ mol⁻¹
పైన పేర్కొన్న సమీకరణం 2 మోల్‌ల అమ్మోనియా ఏర్పడటానికి సంబంధించిన ఉష్ణశక్తి.
ఒక్క మోల్ అమ్మోనియా ప్రమాణ సంఘటన ఎంథాల్పీ
ΔfH°(NH₃) = – 92.4/2 = – 46.2 kJ mol⁻¹
∴ అమ్మోనియా ప్రమాణ సంఘటన ఎంథాల్పీ = – 46.2 kJ mol⁻¹
Exam Tips:
a) చర్య 2 మోల్ NH₃ కు కాబట్టి 2 తో భాగించండి: – 46.2 kJ mol⁻¹.
Question 89: CH₃OH(ద్ర) ప్రమాణ సంఘటన ఎంథాల్పీని కింది చర్యల ద్వారా గణించండి.
CH₃OH(ద్ర) + 3/2 O₂(వా) → CO₂(వా) + 2H₂O(ద్ర) ; ΔrH° = – 726 kJ mol⁻¹
C(గ్రాఫైట్) + O₂(వా) → CO₂(వా) ; ΔcH° = – 393 kJ mol⁻¹
H₂(వా) + ½O₂(వా) → H₂O(ద్ర) ; ΔfH° = – 286 kJ mol⁻¹
Answer:
ఇచ్చిన దత్తాంశం నుండి
1. CH₃OH(ద్ర) + 3/2 O₂(వా) → CO₂(వా) + 2H₂O(ద్ర) ; ΔrH° = – 726 kJ mol⁻¹
2. C(graphite) + O₂(వా) → CO₂(వా) ; ΔcH° = – 393 kJ mol⁻¹
3. H₂(వా) + ½O₂(వా) → H₂O(ద్ర) ; ΔfH° = – 286 kJ mol⁻¹
1 ని తిరగరాస్తే,
\( \mathrm{CO_2}(\text{వా}) + 2\mathrm{H_2O}(\text{ద్ర}) \longrightarrow \mathrm{CH_3OH}(\text{ద్ర}) + \tfrac{3}{2}\mathrm{O_2}(\text{వా}),\quad \Delta_r H^{\circ} = +726\ \text{kJ mol}^{-1} \)
\( \mathrm{C}(\text{graphite}) + \mathrm{O_2}(\text{వా}) \longrightarrow \mathrm{CO_2}(\text{వా}),\quad \Delta_c H^{\circ} = -393\ \text{kJ mol}^{-1} \)
3 ని 2 తో గుణిస్తే,
\( 2\mathrm{H_2}(\text{వా}) + \mathrm{O_2} \longrightarrow 2\mathrm{H_2O},\quad \Delta_f H^{\circ} = -572\ \text{kJ mol}^{-1} \)
మొత్తం కూడగా,
\( \mathrm{C} + 2\mathrm{H_2} + \tfrac{1}{2}\mathrm{O_2} \longrightarrow \mathrm{CH_3OH},\quad \Delta_f H^{\circ} = -239\ \text{kJ mol}^{-1} \)
Exam Tips:
a) సమీకరణం 1 ని తిరగరాసి, 3 ని 2 తో గుణించి, మూడింటినీ కూడండి: – 239 kJ mol⁻¹.
Question 90: CCl₄(వా) → C(వా) + 4Cl(వా) చర్యకు ఎంథాల్పీ మార్పు గణించండి. CCl₄ లోని C – Cl బంధానికి బంధ ఎంథాల్పీ ఎంత ?
ΔvapH°(CCl₄) = 30.5 kJ mol⁻¹
ΔfH°(CCl₄) = – 135.5 kJ mol⁻¹
ΔaH°(C) = 715.0 kJ mol⁻¹, ఇక్కడ ΔaH° అనేది పరమాణీకరణ ఎంథాల్పీ
ΔaH°(Cl₂) = 242 kJ mol⁻¹
Answer:
CCl₄(వా) → C(వా) + 4Cl(వా) ఎంథాల్పీ మార్పును హెస్ నియమంతో కనుగొందాం.
CCl₄(వా) → CCl₄(ద్ర) ; ΔH = – 30.5 kJ
CCl₄(ద్ర) → C(ఘ) + 2Cl₂(వా) ; ΔH = + 135.5 kJ
C(ఘ) → C(వా) ; ΔH = + 715.0 kJ
2Cl₂(వా) → 4Cl(వా) ; ΔH = 2 × 242 = + 484 kJ
మొత్తం ΔH = – 30.5 + 135.5 + 715.0 + 484 = 1304 kJ mol⁻¹
∴ C – Cl బంధ ఎంథాల్పీ = \( \frac{1304}{4} = 326 \) kJ mol⁻¹
Exam Tips:
a) మొత్తం ΔH = 1304 kJ ని 4 తో భాగించి C–Cl బంధ ఎంథాల్పీ (326 kJ mol⁻¹) పొందండి.
Question 91: ఒక వివిక్త వ్యవస్థలో ΔU = 0 అయితే ΔS ఏమవుతుంది ?
Answer:
వివిక్త వ్యవస్థకు పరిసరాలతో శక్తి, ద్రవ్య వినిమయం ఉండదు; ΔU = 0, అంటే శక్తి స్థిరం. ఇటువంటి వ్యవస్థలో జరిగే అయత్నీకృత ప్రక్రియలన్నింటిలో ఎంట్రోపీ పెరుగుతుంది.
∴ ΔS > 0 (లేక) ΔS = + ve (సమతాస్థితిలో ΔS = 0)
Exam Tips:
a) వివిక్త వ్యవస్థలో అయత్నీకృత ప్రక్రియలకు ΔS > 0, సమతాస్థితిలో ΔS = 0.
Question 92: 298 K వద్ద 2A + B → C చర్యకు ΔH = 400 kJ mol⁻¹, ΔS = 0.2 kJ K⁻¹ mol⁻¹. ఉష్ణోగ్రతా విస్తృతిలో ΔH, ΔS లు స్థిరంగా ఉంటాయనుకొంటే ఏ ఉష్ణోగ్రత వద్ద చర్య అయత్నీకృతం అవుతుంది ?
Answer:
సమతాస్థితి వద్ద ΔG = 0
Tసమతా = ΔH/ΔS = 400/0.2 = 2000 K
ΔH, ΔS లు రెండూ ధనాత్మకం కాబట్టి 2000 K కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ΔG ఋణాత్మకమై ప్రక్రియ అయత్నీకృతం అవుతుంది.
Exam Tips:
a) T = ΔH/ΔS = 2000 K; ΔH, ΔS ధనాత్మకం కాబట్టి T > 2000 K వద్ద అయత్నీకృతం.
Question 93: 2Cl(వా) → Cl₂(వా) చర్యకు ΔH, ΔS ల గుర్తులు ఇవ్వండి.
Answer:
బంధం ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది.
∴ ΔH = – ve
ఈ ప్రక్రియలో 2 క్లోరిన్ ఆటమ్స్ కలిసి ఒక Cl₂ అణువుగా ఏర్పడతాయి. ఇది ఉష్ణమోచక చర్య ఎంట్రోపీ తగ్గుతుంది.
∴ ΔS = – ve
Exam Tips:
a) బంధం ఏర్పడినపుడు శక్తి విడుదల (ΔH ఋణ), అణువుల సంఖ్య తగ్గి క్రమరాహిత్యం తగ్గుతుంది (ΔS ఋణ).
Question 94: 2A(వా) + B(వా) → 2D(వా) చర్యకు ΔU° = – 10.5 kJ, ΔS° = – 44.1 J K⁻¹. చర్యకు 25°C వద్ద ΔG° విలువ ఎంత ? చర్య అయత్నీకృతమా, కాదా ?
Answer:
ΔH° = ΔU° + ΔngRT
Δng = 2 – 3 = – 1
ΔH° = – 10.5 + (– 1) × 8.314 × 10⁻³ × 298
= – 12.98 kJ
ΔG° = ΔH° – TΔS°
= – 12.98 – 298 × (– 44.1 × 10⁻³) = + 0.164 kJ
ΔG° ధనాత్మకం (ΔG° > 0). కావున చర్య అయత్నీకృతం కాదు.
Exam Tips:
a) ముందు Δng = – 1 తో ΔH లెక్కించి, తరువాత ΔG = ΔH – TΔS; ΔG > 0 అయితే అయత్నీకృతం కాదు.
Question 95: ఒక చర్యకు 300 K వద్ద సమతాస్థితి స్థిరాంకం 10. దీనికి ΔG° విలువ ఎంత ? R = 8.314 J K⁻¹ mol⁻¹.
Answer:
ΔG° = – 2.303 RT log K
= – 2.303 × 8.314 × 300 × 1 = – 5744 J mol⁻¹ = – 5.744 kJ mol⁻¹
Exam Tips:
a) ΔG° = – 2.303 RT log K; ఫలితం – 5.744 kJ mol⁻¹.
Question 96: ఉష్ణగతికశాస్త్రం ప్రథమ నియమం నిర్వచించండి. దాని గణితరూప సమీకరణం రాయండి.
Answer:
ఉష్ణగతికశాస్త్ర ప్రథమ నియమం : “శక్తిని సృష్టింపలేము నశింపచెయ్యలేము. ఒక రూపములోని శక్తిని వేరొక రూపంలోకి మార్చగలము”.
లేదా
“మొదటిరకం సతతచలన యంత్ర నిర్మాణం అసాధ్యం”
లేదా
“చక్రీయ ప్రక్రియలో వ్యవస్థ శక్తి మార్పు శూన్యం” ఒక వ్యవస్థ తొలి అంతరశక్తి EA అని వ్యవస్థ గ్రహించిన ఉష్ణరాశి Q అని, వ్యవస్థ చేసిన పని “w”, అని దాని తుది అంతరికశక్తి EB అని అంతరిక శక్తిలోని మార్పు ΔE అని అనుకుంటే
ΔE = EB – EA = Q – w
⇒ Q = ΔE + w
దీనినే ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమపు గణితాత్మక రూపం అంటారు.
Exam Tips:
a) ΔE = Q – w రాసి నియమాన్ని మూడు రకాలుగా చెప్పండి.
Question 97: ఉష్ణగతికశాస్త్రం రెండో నియమానికి ఏవైనా రెండు వేరువేరు నిర్వచనాలు ఇవ్వండి.
Answer:
క్లాసియస్ నిర్వచనం : విశ్వం యొక్క ఎంట్రోపీ గరిష్ఠంగా మారే దిశలో చలిస్తుంది. లేదా ఉష్ణశక్తి స్వచ్ఛందంగా చల్లని వస్తువు నుంచి వేడిగా ఉన్న వస్తువుకు ప్రసరించదు. లేదా పనిని పూర్తిగా ఉష్ణరాశిగా మార్చవచ్చు కానీ ఉష్ణరాశిని 100% పనిగా మార్చడం అసాధ్యం.
లేదా
అన్ని స్వచ్ఛంద చర్యలలో ఫలిత ఎంట్రోపీ మార్పు ధనాత్మకం లేదా రెండోరకం సతతచలన యంత్ర నిర్మాణం అసాధ్యం.
Exam Tips:
a) రెండు వేరువేరు నిర్వచనాలు ఇవ్వండి; ఒకటి ఎంట్రోపీ ఆధారంగా, రెండోది సతతచలన యంత్రం ఆధారంగా.
Question 98: గిబ్స్ శక్తిని వివరించండి.
Answer:
గిబ్స్ శక్తి : ఇది ఉష్ణగతిక ప్రమేయం. దీనిలో ఎంథాల్పీ, ఎంట్రోపీ ప్రమేయాలు ఇమిడి ఉంటాయి. ఒక చర్య స్వచ్ఛంద చర్య అవునో, కాదో తెలుసుకొనుటకు ఇది తగినంత, అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. ఇది స్థితి ప్రమేయం.
ΔG = ΔH – TΔS
గిబ్స్ శక్తి మార్పు = ఎంథాల్పీ మార్పు – (ఉష్ణోగ్రత × ఎంట్రోపీ మార్పు)
Exam Tips:
a) గిబ్స్ శక్తి = ఉష్ణగతిక, స్థితి ప్రమేయం; G = H – TS; ΔG ద్వారా అయత్నీకృతత తెలుస్తుంది.
Question 99: చర్య అయత్నీకృతాన్ని గిబ్స్ శక్తితో వివరించండి.
Answer:
ఒక స్వచ్ఛంద చర్యకు గిబ్స్ శక్తి మార్పు ΔG విలువ ఋణాత్మకంగా ఉండవలెను. భిన్న చర్యల ΔH, ΔS మరియు ΔG విలువలు క్రింది విధంగా ఉండును.
| ΔH | ΔS | ΔG | చర్య స్వభావం |
| – | + | – | అన్ని ఉష్ణోగ్రతల వద్ద అయత్నీకృతం. ఉదా : 2O₃ → 3O₂ |
| + | – | + | అన్ని ఉష్ణోగ్రతల వద్ద అస్వచ్ఛందం. ఉదా : 3O₂ → 2O₃ |
| – | – | – | అల్ప ఉష్ణోగ్రత వద్ద అయత్నీకృతం. ఉదా : నీరు → మంచు |
| – | – | + | అధిక ఉష్ణోగ్రత వద్ద అస్వచ్ఛందం |
| + | + | + | అల్ప ఉష్ణోగ్రత వద్ద అస్వచ్ఛందం |
| + | + | – | అధిక ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛందం |
గిబ్స్ శక్తి మార్పు (ΔG) కు, ఎంథాల్పీ మార్పు (ΔH) కు గల సంబంధం ఈ క్రింది విధంగా రాస్తారు.
ΔG = ΔH – TΔS
ΔG = – ve అయితే (ΔG < 0) ఆ చర్య అయత్నీకృత చర్య
ΔG = + ve అయితే (ΔG > 0) ఆ చర్య అనయత్నీకృత చర్య
ΔG = 0 అయితే ఆ చర్య సమతాస్థితిలో ఉంటుంది.
ΔG = – ve, ΔS = + ve అయితే ప్రక్రియ అయత్నీకృతం (TΔS > ΔH గా ఉండాలి). ΔG = – ve, ΔS = + ve, ΔH = – ve అయితే ఆ చర్య అన్ని ఉష్ణోగ్రతల వద్ద అయత్నీకృతం.
Exam Tips:
a) ΔG ఋణాత్మకమైతే అయత్నీకృతం, ధనాత్మకమైతే అనయత్నీకృతం; ΔH, ΔS గుర్తుల పట్టిక ఇవ్వండి.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 100: హెస్ స్థిర ఉష్ణ సంకలన నియమం నిర్వచించి వివరించండి. ఉదాహరణ ఇవ్వండి.
Answer:
ఒక రసాయన చర్య ఒక దశలో జరిగినా లేక అనేక దశల్లో జరిగినా ఆ చర్యలో జరిగే మొత్తం ఎంథాల్పీ మార్పు సమానంగా ఉంటుంది.
A అనే పదార్థం రెండు విభిన్న మార్గాల ద్వారా చర్య జరిపి D అనే పదార్థాన్ని ఇచ్చినదని అనుకోండి.
ఏకదశ : A → D ; ΔH = Q
అనేక దశలు:
A → B ; ΔH₁ = q₁
B → C ; ΔH₂ = q₂
C → D ; ΔH₃ = q₃
ΔH₁ + ΔH₂ + ΔH₃ = q₁ + q₂ + q₃
హెస్ నియమం ప్రకారం Q = q₁ + q₂ + q₃
ఉదా : CO₂(వా) ను C(గ్రా), O₂(వా) నుండి రెండు విధాలుగా పొందవచ్చు.
ఏకదశ : C(గ్రాఫైట్) + O₂(వా) → CO₂(వా) ; ΔrH° = – 393.5 kJ
అనేక దశలు : C(గ్రాఫైట్) + ½O₂(వా) → CO(వా) ; ΔrH° = – 110.5 kJ
CO(వా) + ½O₂(వా) → CO₂(వా) ; ΔrH° = – 283.02 kJ
అనేక దశలలో మొత్తం ఎంథాల్పీ మార్పు = – 110.5 + (– 283.02) = – 393.52 kJ
ఏకదశలో మరియు అనేక దశలలో ఎంథాల్పీ మార్పు సమానంగా ఉంది కాబట్టి ఈ ఉదాహరణ హెస్ నియమానికి అనుగుణంగా ఉన్నది.
ఉపయోగాలు:
1. ప్రయోగం ద్వారా నిర్ణయించడానికి వీలుకాని సమ్మేళనాల సంఘటనోష్ణాలను ఈ నియమం ద్వారా పరోక్షంగా లెక్కించవచ్చు.
2. నెమ్మదిగా జరిగే చర్యల చర్యోష్ణాన్ని నిర్ణయించవచ్చు.
3. అయానిక పదార్థాల స్ఫటిక జాలకశక్తిని నిర్ణయించవచ్చు.
4. కొన్ని మూలకాల ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలను పరోక్ష పద్ధతిలో కనుగొనవచ్చు.
Exam Tips:
a) హెస్ నియమం, A → D ఏకదశ/అనేక దశల పటం, CO₂ ఉదాహరణ మరియు ఉపయోగాలను క్రమంగా రాయండి.
Question 101: ప్రయోగపూర్వకంగా ఒక ప్రక్రియలో అంతరిక శక్తి మార్పు కొలిచే విధానం వివరించండి.
Answer:
అంతరిక శక్తి : స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక పదార్థంలో నిల్వ ఉంచబడిన మొత్తం శక్తిని అంతరిక శక్తి అంటారు. ఇది స్థితి ప్రమేయం మరియు విస్తార ధర్మం. అంతరిక శక్తిలో మార్పు ΔU = UP – UR
UP = క్రియాజన్యాల అంతరికశక్తి; UR = క్రియాజనకాల అంతరికశక్తి.
ΔU = q – w ; q = ఉష్ణం ; w = పని
అంతరికశక్తి మార్పు ΔU కొలిచే సాధనం : రసాయన చర్యల్లో స్థిర ఘనపరిమాణం వద్ద గ్రహించబడిన ఉష్ణాన్ని బాంబ్ కెలోరిమీటర్లో కొలుస్తారు. బాంబ్ కెలోరిమీటర్ ఒక దృఢమైన గోడలు గల ఉక్కుపాత్ర. ఇది ఒక జలపాత్రలో ముంచబడి ఉంటుంది. ఈ మొత్తం పాత్రల అమరికనే కెలోరిమీటర్ అంటారు. తేలికగా దహనం చెందే పదార్థాన్ని ఉక్కు బాంబులో ఉంచి ఆక్సిజన్‌ను కలిపి దహనం చేస్తారు. చర్య ఉష్ణమోచకమై ఉష్ణం వెలువడుతుంది. ఇది కెలోరిమీటర్ ఉష్ణోగ్రతను పెంచుతుంది. బాంబ్ కెలోరిమీటర్ ఉష్ణబంధకం చేయబడి ఉంటుంది. అందువల్ల కెలోరిమీటర్ నుంచి పరిసరాలకు ఉష్ణ వినిమయం జరగదు.
బాంబ్ కెలోరిమీటర్ చర్య జరిగేటపుడు పూర్తిగా మూసివుంచబడి ఉంటుంది. కాబట్టి దాని ఘనపరిమాణంలో మార్పు ఉండదు. అంటే చర్యలో శక్తి మార్పులు స్థిర ఘనపరిమాణంలో జరిగినవిగా అనుకొని కొలతలు చేయాలి. స్థిర ఘనపరిమాణం అంటే ΔV = 0, w = pΔV = 0, అంటే చర్యలో పని ఏమీ జరగదు (ΔU = qv). చర్యలో వాయు పదార్థాలున్నప్పటికీ ఘనపరిమాణంలో మార్పురాదు. చర్య వల్ల కెలోరిమీటర్ పెరిగిన ఉష్ణోగ్రతను ఉపయోగించి కెలోరిమీటర్ ద్రవ్యరాశి, దాని ఉష్ణధారణ విలువల ద్వారా వెలువడిన ఉష్ణాన్ని (q) క్రింది సమీకరణం ఉపయోగించి గణించవచ్చు.
విశిష్టోష్ణం × ద్రవ్యరాశి = ఉష్ణధారణ
q = C × m × ΔT = C × ΔT, ఇచ్చట c × m = C
Exam Tips:
a) బాంబ్ కెలోరిమీటర్లో ΔV = 0, w = 0, qv = ΔU; పటం గీయండి.
Question 102: ప్రయోగ పూర్వకంగా ఒక ప్రక్రియలో ఎంథాల్పీ మార్పు కొలిచే విధానం వివరించండి.
Answer:
ఎంథాల్పీ (H) : స్థిర పీడనం మరియు ఉష్ణోగ్రత వద్ద వ్యవస్థకు, పరిసరాలకు మధ్య మార్పిడి జరిగే ఉష్ణపరిమాణాన్ని ఎంథాల్పీ (H) అంటారు.
ఎంథాల్పీ మార్పు (ΔH) = ΔU + pΔV (లేక) ΔH = ΔU + ΔngRT
ΔU = అంతరికశక్తి మార్పు,
p = పీడనం,
ΔV = ఘనపరిమాణంలో మార్పు.
ఎంథాల్పీ స్థితి ప్రమేయం మరియు విస్తార ధర్మం.
ఎంథాల్పీ మార్పు (ΔH) = Hక్రియాజన్యాలు – Hక్రియాజనకాలు
స్థిరపీడనం వద్ద ఉష్ణశక్తి ΔH ని కొలవడం : మూత లేకుండా తెరచి ఉన్న కెలోరిమీటర్ సాధారణంగా వాతావరణ పీడనం దగ్గర ఉంటుంది. వాతావరణ పీడనం స్థిరంగా ఉంటుంది కాబట్టి కెలోరిమీటర్లో చర్య వల్ల వచ్చిన ఉష్ణ మార్పు స్థిరపీడనం వద్ద కొలిచినదిగా భావించవచ్చు. దీనిని qp అంటారు, ఇది ΔH కు సమానమవుతుంది. ΔH = qp. కాబట్టి స్థిరపీడనం వద్ద కొలిచిన ఉష్ణమార్పు చర్యోష్ణం (అది వెలువడిన ఉష్ణం కావచ్చు లేదా గ్రహించబడిన ఉష్ణం కావచ్చు) లేదా చర్యా ఎంథాల్పీ ΔrH అవుతుంది.
ఉష్ణమోచక చర్యలో ఉష్ణం వెలువడుతుంది. అంటే వ్యవస్థ నుంచి పరిసరాలకు ఉష్ణం ఇవ్వబడుతుంది. అందువల్ల qp ఋణాత్మకమవుతుంది. ΔrH కూడా ఋణాత్మకం. అదేవిధంగా ఉష్ణగ్రాహక చర్యలో వ్యవస్థ ఉష్ణం గ్రహిస్తుంది. అంటే పరిసరాల నుంచి చర్యకు ఉష్ణం ఇవ్వబడుతుంది. దీనికి qp ధనాత్మకం, ΔrH కూడా ధనాత్మకమే.
Exam Tips:
a) ΔH = ΔU + pΔV; తెరచిన కెలోరిమీటర్ (స్థిర పీడనం) లో qp = ΔH; పటం గీయండి.
Question 103: ఒక చర్య అయత్నీకృతమా కాదా అన్నది ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ శక్తులు ఉపయోగించి వివరించండి.
Answer:
అయత్నీకృత చర్య : బాహ్యకారకం ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా జరిగే చర్యను అయత్నీకృత చర్య అంటారు. అయత్నీకృత చర్యలన్నీ ఉష్ణగతికశాస్త్రం ప్రకారం “అద్విగత చర్యలే”.
1. ప్రకృతిలో జరిగే చర్యలన్నీ అయత్నీకృత చర్యలే.
2. అన్ని అయత్నీకృత చర్యలలో విశ్వం ఎంట్రోపీలో పెరుగుదల ఉంటుంది.
3. అయత్నీకృత చర్యలలో, ఎంట్రోపీ మార్పు (ΔSమొత్తం) = + ve
4. అయత్నీకృత చర్యలలో సాధారణంగా ఎంథాల్పీ మార్పు (ΔH) = – ve అవుతుంది (ఇది అనుకూల అంశం, అన్ని సందర్భాలలో తప్పనిసరి కాదు).
5. అయత్నీకృత చర్యల యొక్క నిబంధనను వివరించడానికి “గిబ్స్” ఒక ఉష్ణగతిక ప్రమేయాన్ని ప్రవేశపెట్టాడు. దానినే గిబ్స్ శక్తి అంటారు. ఈ గిబ్స్ శక్తికి, ఎంథాల్పీకి, ఎంట్రోపీకి సంబంధం క్రింది విధంగా ఉంటుంది.
G = H – TS. దీనినే గిబ్స్ సమీకరణం అంటారు. అన్ని అయత్నీకృత చర్యలలో ΔG = – ve. స్థిర ఉష్ణోగ్రత, మరియు పీడనం వద్ద జరిగే మార్పును గిబ్స్ సమీకరణాన్ని క్రింది విధంగా రాస్తారు.
ΔG = ΔH – TΔS
ΔSమొత్తం = + ve అయితే ప్రక్రియ అయత్నీకృతం
ΔSమొత్తం = – ve అయితే తిరోగామి చర్య అయత్నీకృతం
ΔSమొత్తం = 0 అయితే ప్రక్రియ సమతాస్థితిలో ఉంటుంది.
అయత్నీకృత చర్యలు – నిబంధనలు:
చర్యల స్వచ్ఛందత లేదా అయత్నీకృతంపై ఉష్ణోగ్రత ప్రభావం
| ΔrH° | ΔrS° | ΔrG° | ఉష్ణోగ్రతపరంగా చర్య అయత్నీకృతమా కాదా అనే వివరణ |
| – | + | – | చర్య అయత్నీకృతం, అన్ని ఉష్ణోగ్రతల దగ్గరా స్వచ్ఛందం |
| – | – | – (తక్కువ T వద్ద) | చర్య తక్కువ ఉష్ణోగ్రత వద్ద అయత్నీకృతం |
| – | – | + (ఎక్కువ T వద్ద) | అధిక ఉష్ణోగ్రతల వద్ద చర్య అనయత్నీకృతం (nonspontaneous) |
| + | + | + (తక్కువ T వద్ద) | అల్ప ఉష్ణోగ్రతల వద్ద చర్య అనయత్నీకృతం (nonspontaneous) |
| + | + | – (అధిక T వద్ద) | చర్య అయత్నీకృతం, ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద |
| + | – | + (అన్ని ఉష్ణోగ్రతల T వద్ద) | చర్య అనయత్నీకృతం, అన్ని ఉష్ణోగ్రతల వద్ద |
Exam Tips:
a) అయత్నీకృత చర్యకు ΔG = ΔH – TΔS < 0 ప్రమాణం; ΔH, ΔS గుర్తుల పట్టికతో ఉష్ణోగ్రత ప్రభావం వివరించండి.
Free study material for Chemistry
Step-by-Step Textbook Answers: Class 11 Chemistry Chapter 06 Thermodynamics
Textbook Solutions for Class 11 Chemistry Chapter 06 Thermodynamics
Explore reliable textbook solutions for Chapter 06 Thermodynamics tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Chemistry.
Mastering Theoretical and Practical Questions
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 06 Thermodynamics concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 06 Thermodynamics with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 ఉష్ణగతిక శాస్త్రం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 ఉష్ణగతిక శాస్త్రం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 ఉష్ణగతిక శాస్త్రం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 ఉష్ణగతిక శాస్త్రం in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Chemistry Study Material Chapter 6 ఉష్ణగతిక శాస్త్రం in printable PDF format for offline study on any device.