TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

Download TS Board Solutions for Class 11 Chemistry Chapter 02 Classification of Elements and Periodicity in Properties

Explore reliable textbook solutions for Chapter 02 Classification of Elements and Periodicity in Properties tailored for Class 11 learners. Utilizing these Chemistry answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Access TS Board Solutions and Answers

Access the complete solution PDF for Class 11 Chemistry below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

అత్యంత లఘు సమాధాన ప్రశ్నలు

Question 1: మెండలీవ్ ఆవర్తన నియమ పద్ధతికి, ఆధునిక ఆవర్తన నియమ పద్ధతికి గల తేడా ఏమిటి ?

Answer:

మెండలీవ్ ఆవర్తన నియమము పరమాణు భారాలపై ఆధారపడి ఉండును. ఆధునిక ఆవర్తన నియమము ఎలక్ట్రాన్ విన్యాసంపై ఆధారపడినది.
మెండలీవ్ ఆవర్తన నియమము : మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు.
ఆధునిక ఆవర్తన నియమము : మూలకాల భౌతికరసాయన ధర్మాలు, వాటి ఎలక్ట్రాన్విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు.

Exam Tips:

a) మెండలీవ్ నియమం = పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు; ఆధునిక నియమం = ఎలక్ట్రాన్ విన్యాసాల (పరమాణు సంఖ్యల) ఆవర్తన ప్రమేయాలు అని రెండు నిర్వచనాలనూ రాయండి.
b) రెండింటి మధ్య ప్రాతిపదిక (పరమాణు భారం / ఎలక్ట్రాన్ విన్యాసం) తేడాను ఒక వాక్యంలో స్పష్టంగా చూపండి.

 

Question 2: Z = 114 గల మూలకాన్ని ఏ పీరియడ్, ఏ గ్రూప్‌లో ఉంచుతారు ?

Answer:

Z = 114 మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం [Rn] 5f¹⁴ 6d¹⁰ 7s² 7p²; బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం 7s² 7p².
బాహ్య కర్పరం ప్రధాన క్వాంటం సంఖ్య 7 కనుక అది ఏడవ పీరియడ్‌కు చెందుతుంది.
ఇది p బ్లాకు మూలకం; బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 2 + 2 = 4 కనుక గ్రూపు సంఖ్య = 10 + 4 = 14 (IVA).
కాబట్టి Z = 114 మూలకం ఏడవ పీరియడ్, 14వ గ్రూపులో ఉంటుంది.

Exam Tips:

a) Z = 114 కు p బ్లాకు విన్యాసం 7s² 7p²; పీరియడ్ = బాహ్య కర్పరం n (7), గ్రూపు = 10 + (s + p ఎలక్ట్రాన్ల సంఖ్య) = 14.
b) గ్రూపు సంఖ్య నియమం: p బ్లాక్ కు 10 కలపడం మరచిపోకండి; 4 అని రాస్తే తప్పు.

 

Question 3: ఆవర్తన పట్టికలో మూడో పీరియడ్, పదిహేడో గ్రూప్ లో ఉన్న మూలకం పరమాణు సంఖ్యను తెలపండి.

Answer:

17వ గ్రూపులోని మూలకము హాలోజన్. మూడవ పీరియడ్లోని హాలోజన్ మూలకము క్లోరిన్. క్లోరిన్ పరమాణు సంఖ్య పదిహేడు (17).

Exam Tips:

a) 17వ గ్రూపు = హాలోజన్లు; 3వ పీరియడ్ హాలోజన్ క్లోరిన్ (Z = 17); విన్యాసం 1s² 2s² 2p⁶ 3s² 3p⁵ తో సరిచూడండి.

 

Question 4: a) లారెన్స్ బర్క్లీ ప్రయోగశాల
b) సీబర్గ్ గ్రూప్
వీరిచే నామకరణం చేయబడిన మూలకాలు ఏవై ఉంటాయి ?

Answer:

a) లారెన్స్ బర్క్లీ ప్రయోగశాల (కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ)లో పరమాణు సంఖ్య 97, 98 గల మూలకాలను కనుగొన్నారు. వాటికి బర్క్లియం (Bk, Z = 97), కాలిఫోర్నియం (Cf, Z = 98) అని నామకరణం చేశారు. ఈ ప్రయోగశాల వ్యవస్థాపకుడు E. O. లారెన్స్ పేరుతో లారెన్షియం (Lr, Z = 103) అని పేరు పెట్టారు.
b) సీబర్గ్ (G. T. Seaborg) పేరు మీద 106వ మూలకానికి సీబోర్గియం (Sg) అని నామకరణం చేశారు.

Exam Tips:

a) Bk (97), Cf (98) బర్క్లీ (కాలిఫోర్నియా) పేర్ల నుండి వచ్చాయి; సీబోర్గియం (Sg, 106) సీబర్గ్ పేరుతో; పేరుకు కారణాన్ని కూడా ఒక్క పదంతో చెప్పండి.

 

Question 5: ఒకే గ్రూప్ లోని మూలకాలు సారూప్య భౌతిక, రసాయన ధర్మాలను ఎట్లా కలిగి ఉంటాయి ?

Answer:

ఒకే గ్రూపులోని మూలకాలు ఒకే విధమైన బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండుట వలన సారూప్య భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి.

Exam Tips:

a) ఒకే గ్రూపులోని మూలకాలకు వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య, విన్యాసం సమానం కాబట్టే ధర్మాలు సారూప్యంగా ఉంటాయి; ఉదా : Li, Na, K అన్నిటికీ ns¹.

 

Question 6: ప్రాతినిధ్య మూలకాలంటే ఏమిటి ? వాటి వేలన్సీ కక్ష్య విన్యాసాన్ని తెలపండి.

Answer:

జడవాయువులు మినహా మిగిలిన s మరియు p బ్లాకు మూలకాలను ప్రాతినిధ్య మూలకాలంటారు. వాటి బాహ్య స్థాయి విన్యాసం ns¹⁻² np⁰⁻⁵

Exam Tips:

a) ప్రాతినిధ్య మూలకాలు = s మరియు p బ్లాకు మూలకాలు (0 గ్రూపు మినహా); విన్యాసం ns¹⁻² np⁰⁻⁵ అని ఖచ్చితంగా రాయండి.

 

Question 7: ఆవర్తన పట్టికలో f – బ్లాక్ మూలకాల స్థానాన్ని సమర్థించండి.

Answer:

1. f – బ్లాకు మూలకాలు రెండు శ్రేణులుగా ఉన్నాయి. అవి 4f శ్రేణి మరియు 5f శ్రేణి.
2. అవి ఒకే విధమైన సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉన్నాయి. (n – 2) f1 – ¹⁴ (n – 1) d0 – 1 ns²
3. 4f శ్రేణి మూలకాలు ఒకే విధమైన ధర్మాలు కలిగి ఉన్నాయి. అదే విధంగా 5f శ్రేణి మూలకాలు ఒకే విధమైన ధర్మాలు కలిగి ఉన్నాయి.
4. సారూప్య ధర్మాలు గల మూలకాలను ఒకే నిలువు పట్టీలో ఉంచాలనే వర్గీకరణ సూత్రం అమలు అయ్యేటట్లు ఆవర్తన పట్టిక నిర్మాణాన్ని చేయడానికి 4f. 5f – అంతర పరివర్తన శ్రేణుల మూలకాలను ఆవర్తన పట్టికలో వేరుగా ఉంచారు.

Exam Tips:

a) f బ్లాకు స్థానం సమర్థనకు మూడు అంశాలు: రెండు శ్రేణులు (4f, 5f), సాధారణ విన్యాసం (n–2)f¹⁻¹⁴(n–1)d⁰⁻¹ns², ధర్మాల సారూప్యం.
b) పట్టిక పొడవు పెరగకుండా వాటిని అడుగున ఉంచారని ముగింపులో రాయండి.

 

Question 8: ‘z’ అనే మూలకం పరమాణు సంఖ్య 34. ఆవర్తన పట్టికలో దాని స్థానాన్ని తెలపండి.

Answer:

z = 34 ఎలక్ట్రాన్ విన్యాసం
1s² 2s² 2p⁶ 3s² 3p⁶ 3d¹⁰ 4s² 4p⁴
బాహ్యకర్పర ప్రధాన క్వాంటం సంఖ్య పీరియడ్ను, దానిలోని ఎలక్ట్రాన్ల సంఖ్య
గ్రూపును తెలియచేస్తాయి. అందువల్ల z = 34 మూలకం 4వ పీరియడ్ మరియు 6వ (VIA; ఆధునిక సంఖ్యలో 16వ) గ్రూపుకు చెందినది.

Exam Tips:

a) పరమాణు సంఖ్య 34 (Se): 1s² 2s² 2p⁶ 3s² 3p⁶ 3d¹⁰ 4s² 4p⁴ రాసి, n = 4 → 4వ పీరియడ్; బాహ్య ఎలక్ట్రాన్లు 6 → VIA (16వ గ్రూపు) అని చెప్పండి.

 

Question 9: పరివర్తన మూలకాల అభిలాక్షణిక ధర్మాలకు కారణమయ్యే అంశాలు ఏవి ?

Answer:

1. అల్ప పరమాణు పరిమాణం
2. అధిక కేంద్రక ఆవేశం
3. అనేక ఆక్సీకరణ స్థితులు (చర సంయోజకత)
4. ‘d’ ఆర్బీటాళ్లు బంధాలు ఏర్పరచుటకు అందుబాటులో ఉండుట.
ఈ కారణాలవల్ల పరివర్తన మూలకాలు అభిలాక్షణికమైన ధర్మాలను ప్రదర్శిస్తాయి.

Exam Tips:

a) పరివర్తన మూలకాల విశిష్ట ధర్మాలకు కారణాలు: చిన్న పరిమాణం, అధిక కేంద్రక ఆవేశం, అనేక ఆక్సీకరణ స్థితులు, d ఆర్బిటాళ్ల లభ్యత; కనీసం నాలుగు రాయండి.

 

Question 10: d – బ్లాక్, f – బ్లాక్ మూలకాల బాహ్య కక్ష్యల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇవ్వండి.

Answer:

d బ్లాకు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం (n – 1) d1 – 10 ns1 or 2 f బ్లాకు మూలకాల విన్యాసం (n – 2) f1 – 14 (n – 1)d0 or 1 ns²

Exam Tips:

a) d బ్లాక్: (n–1)d¹⁻¹⁰ ns¹⁻²; f బ్లాక్: (n–2)f¹⁻¹⁴ (n–1)d⁰⁻¹ ns²; సూపర్ స్క్రిప్ట్‌లను (n–1), (n–2) తప్పులేకుండా రాయండి.

 

Question 11: డొబరైనర్ త్రిక నియమాన్ని, న్యూలాండ్ అష్టక నియమాన్ని నిర్వచించి ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి.

Answer:

డొబరైనర్ త్రికాలు : పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చబడి ధర్మాలలో పోలికలు గల మూడు మూలకాల సమూహాలను త్రికాలు అంటారు.
మూడు మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమరిస్తే, మధ్యమూలకం పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరి విలువకు సమానం. దీనినే త్రిక సిద్ధాంతం అంటారు.
ఉదా:

త్రిక ILi 7Na 23K 39
త్రిక IICl 35.5Br 80I 127

(7 + 39)/2 = 23 (Na పరమాణు భారం); (35.5 + 127)/2 = 81.25 ≈ 80 (Br పరమాణు భారం)
న్యూలాండ్స్ అష్టక నియమం : మూలకాలను వాటి పరమాణు భారాలు పెరిగే క్రమంలో అమరిస్తే, ప్రతి ఎనిమిదవ మూలకం మొదటి మూలకాన్ని దాని ధర్మాలతో పోలి వుంటుంది. ఈ సంబంధం సంగీత స్వరాలలో ఎనిమిదో స్వరం మొదటి స్వరాన్ని పోలినట్లుంటుంది.
మూలకంLiBeBCNOF
పరమాణు భారం791112141619
మూలకంNaMgAlSiPSCl
పరమాణు భారం23242729313235.5

Li నుండి ఎనిమిదవ మూలకం Na, Be నుండి ఎనిమిదవది Mg, … ఇలా ప్రతి ఎనిమిదవ మూలకం పోలి ఉంటుంది.

Exam Tips:

a) త్రిక నియమానికి గణన చూపండి: (7 + 39)/2 = 23 (Li, Na, K); న్యూలాండ్స్ నియమానికి Li → Na (8వ మూలకం) వంటి ఉదాహరణ ఇవ్వండి.
b) రెండు నియమాల ఉదాహరణలూ పట్టిక రూపంలో రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 12: మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అసంగత మూలకాల జంటలు ఏవి ?

Answer:

మెండలీవ్ ఆవర్తన పట్టికలో మూలకాలను పరమాణు భారాలు పెరిగే క్రమంలో అమర్చడం జరిగింది. పరమాణు భారక్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తే కొన్ని మూలకాలు వర్గీకరణ క్రమంలో ఇమడటంలేదు. అందువల్ల కొన్ని జతల మూలకాలలో పరమాణు భారాల వరుసలు అపక్రమంలో ఉన్నాయి. వీటినే అసంగత మూలకాల జంటలు అంటారు.
1. ఆర్గాన్ – పొటాషియం
2. కోబాల్ట్ – నికెల్
3. టెల్యూరియం – అయోడిన్
4. థోరియం – ప్రోటాక్టినియంలు
కాని ఇవి మాత్రం పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి.

Exam Tips:

a) అసంగత జంటలు: Ar–K, Co–Ni, Te–I, Th–Pa; ప్రతి జంటలో మొదటి మూలకం పరమాణు భారం ఎక్కువ, కానీ పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలోనే ఉంటుంది.

 

Question 13: పీరియడ్లో, గ్రూప్లో పరమాణు వ్యాసార్థం ఎలా మార్పు చెందుతుంది ? మార్పును ఎట్లా విశదీకరిస్తారు ?

Answer:

పరమాణు వ్యాసార్ధం : ఒక గ్రూపులో పై నుండి క్రిందికి వచ్చిన కొద్దీ పరమాణు వ్యాసార్ధం పెరుగుతుంటుంది. కారణం గ్రూపులో కిందికి వచ్చిన కొద్దీ వేలన్సీ ఎలక్ట్రాన్లు కొత్త కక్ష్యలో ప్రవేశిస్తాయి. కేంద్రక ఆవేశం పెరిగినా కూడా వేలన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ అధికంగా ఉండనందున కక్ష్యలు దూరంగా జరుగుతాయి. అప్పుడు పరమాణు సైజు పెరుగుతుంది.
ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళిన కొద్దీ పరమాణు సైజు తగ్గుతుంది. కారణం భేదాత్మక ఎలక్ట్రాన్ అదే కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కేంద్రక ఆవేశం కూడా పెరగడం వల్ల ఈ కక్ష్యపై కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. దాని వల్ల కక్ష్యల సైజు తగ్గి పరమాణు సైజు, తగ్గుతుంది.

Exam Tips:

a) గ్రూపులో కిందికి: కొత్త కర్పరం చేరడం వల్ల వ్యాసార్ధం పెరుగుతుంది; పీరియడ్‌లో కుడికి: అదే కర్పరం, పెరిగే కేంద్రక ఆవేశం వల్ల తగ్గుతుంది; రెండు కారణాలనూ విడిగా రాయండి.

 

Question 14: N ⁻³, O ⁻², F –, Na ⁺, Mg⁺² Al⁺³ లను పరిశీలించండి.
a) వీటిలో గల సారూప్యత ఏమిటి ?
b) వీటిని అయానిక వ్యాసార్థ పెరుగుదల క్రమంలో అమర్చండి.

Answer:

N ⁻³, O ⁻², F –, Na ⁺, Mg⁺², Al⁺³ అయానులు సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నాయి. వీటిని సమ ఎలక్ట్రాన్ శ్రేణి అంటారు. సమ ఎలక్ట్రాన్ శ్రేణిలో అయానులు పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో అమరిస్తే అయానిక వ్యాసార్ధం క్రమంగా తగ్గుతుంది. అందువల్ల పరమాణు సంఖ్య ఎక్కువగాఉన్న అయాను చిన్నదిగా ఉంటుంది.
Al³⁺ < Mg²⁺ < Na⁺ < F⁻ < O²⁻ < N³⁻

Exam Tips:

a) ఇవన్నీ 10 ఎలక్ట్రాన్లు గల సమ ఎలక్ట్రానిక్ శ్రేణి; కేంద్రక ఆవేశం (Z) పెరిగితే వ్యాసార్ధం తగ్గుతుంది.
b) క్రమం: Al³⁺ < Mg²⁺ < Na⁺ < F⁻ < O²⁻ < N³⁻ (వ్యాసార్ధ పెరుగుదల).

 

Question 15: అయొనైజేషన్ ఎంథాల్పీని నిర్వచించినప్పుడు, భూస్థితిలోని ఒంటరి పరమాణువు అను పదానికి గల ప్రాముఖ్యం ఏమిటి? (సూచన : పోల్చడానికి అవసరమైంది.)

Answer:

వివిధ మూలకాల అయొనైజేషన్ ఎంథాల్పీలను పోల్చడానికి ఎంథాల్పీలను సారూప్య పరిస్థితులలో కొలవాలి. అందువల్లనే వాయుస్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది.

Exam Tips:

a) IE ని పోల్చాలంటే ఒకే ప్రామాణిక స్థితి కావాలి: వాయుస్థితిలోని, ఒంటరి, తటస్థ, భూస్థితి పరమాణువు; పరమాణువుల మధ్య ఆకర్షణలు ఉండకూడదని చెప్పండి.

 

Question 16: భూస్థితిలో హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ శక్తి -2.18 × 10⁻¹⁸J. హైడ్రోజన్ పరమాణువు అయొనైజేషన్ ఎంథాల్పీని J mol⁻¹ లలో లెక్కకట్టండి.

Answer:

హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ భూస్థితిలో ప్రథమశక్తిస్థాయిలో ఉంటుంది. పరమాణు హైడ్రోజన్ యొక్క అయొనైజేషన్ ఎంథాల్పీని లెక్కించడానికి దానిలోని ఎలక్ట్రాన్‌ను పరమాణువు నుంచి వేర్పరచాలి. అప్పుడు దాని శక్తి 0 J
అయొనైజేషన్ ఎంథాల్పీ = E∞ – E₁ = 0 – (-2.18 × 10⁻¹⁸) = 2.18 × 10⁻¹⁸ J
అయొనైజేషన్ ఒక మోల్కు దీని విలువ = 2.18 × 10⁻¹⁸ × 6.023 × 10²³ J mol⁻¹ ≈ 1312 kJ mol⁻¹

Exam Tips:

a) అయొనైజేషన్ ఎంథాల్పీ = E∞ – E₁ = 0 – (–2.18 × 10⁻¹⁸ J); జౌళ్ల నుండి J mol⁻¹ కు మార్చడానికి N_A (6.023 × 10²³) తో గుణించండి → ≈ 1312 kJ mol⁻¹.
b) ప్రమాణాలు (J / kJ) ఇవ్వడం మరచిపోకండి.

 

Question 17: ‘O’ అయొనైజేషన్ ఎంథాల్పీ ‘N’ కంటే తక్కువ – విశదీకరించండి.

Answer:

నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2pₓ¹ 2p_y¹ 2p_z¹. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం సగం నిండిన ఆర్బిటాళ్ళను కలిగి ఉంది అందువల్ల స్థిరమైనది. ఆక్సిజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2pₓ² 2p_y¹ 2p_z¹; జతకూడిన 2p ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ ఫలితంగా అయొనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది.
అందువల్ల I.P (O) < I.P (N)

Exam Tips:

a) N: 2p³ సగం నిండిన స్థిరమైన విన్యాసం → IE ఎక్కువ; O: 2p⁴ లో జతకూడిన ఎలక్ట్రాన్ల వికర్షణ → IE తక్కువ; విన్యాసాలు రాసి చూపండి.

 

Question 18: కింది ప్రతి జంటలో దేనికి అధిక రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉంది ? a) O లేదా F
b) F లేదా Cl

Answer:

a) ఒక పీరియడ్లో ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ పెరుగుతుంది. అందువల్ల ఫ్లోరిన్‌కు ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఎక్కువ.
b) క్లోరిన్‌కు ఎక్కువ.
ఫ్లోరిన్కు గల స్వల్ప పరిమాణం కారణంగా దానిలో ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువ. అందువల్ల కొత్తగా చేరే ఎలక్ట్రాన్ వికర్షించబడుతుంది. ఈ కారణంగా ‘ఫ్లోరిన్’ కు ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువ. కనుక క్లోరిన్‌కు ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఎక్కువ.

Exam Tips:

a) ఒక పీరియడ్‌లో ఎడమ నుండి కుడికి EA ఎక్కువ రుణాత్మకం: F > O; కానీ F కంటే Cl కు ఎక్కువ (F లో చిన్న 2p ఉపస్థాయి వల్ల ఎలక్ట్రాన్ వికర్షణ).

 

Question 19: లోహాలకు, అలోహాలకు ఉన్న ముఖ్యమైన తేడాలు ఏవి ?

Answer:

లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థాలు. వాటికి ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అవి ఉత్తమ విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలు. రసాయనికంగా లోహాలు అధిక ధన విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి.
అలోహాలు ఘనపదార్థాలుగా గాని, వాయుస్థితిలోగాని ఉంటాయి. అలోహాలకు ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అలోహాలు అథమ ఉష్ణ మరియు అథమ విద్యుత్ వాహకాలు. అలోహాలలో ఋణ విద్యుదాత్మక విలువలు ఎక్కువగా ఉంటాయి.

Exam Tips:

a) భౌతిక (స్థితి, ద్ర.స్థా., వాహకత) మరియు రసాయన (ధన / ఋణ విద్యుదాత్మకత) ధర్మాల పరంగా రెండు నిలువు వరుసల పట్టికలా రాయండి.

 

Question 20: ఆవర్తన పట్టిక సహాయంతో కింది మూలకాలను గుర్తించండి.
a) బాహ్య ఉపస్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
b) రెండు ఎలక్ట్రాన్లను పోగొట్టుకోగలది
c) రెండు ఎలక్ట్రాన్లను గ్రహించగలది.

Answer:

a) బాహ్యశక్తి స్థాయిలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఆవర్తన పట్టికలో గ్రూప్ సంఖ్యకు సమానం. బాహ్య ఉపస్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి బాహ్య శక్తి స్థాయిలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 7. అంటే s ఉపస్థాయిలో 2 ఎలక్ట్రాన్లు p ఉపస్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కనుక బాహ్యస్థాయిలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కనుక మూలకం 7వ గ్రూపు (VIIA; 17వ గ్రూపు) కి చెందినది.
b) 2 ఎలక్ట్రాన్లను పోగొట్టుకోగలిగిన మూలకము బాహ్యస్థాయిలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కనుక ఆ మూలకం 2వ గ్రూపుకు చెందినది.
c) ప్రతీ మూలక పరమాణువు బాహ్యస్థాయిలో ఎలక్ట్రాన్ అష్టకాన్ని పొందడానికి వీలుగా ఎలక్ట్రాన్లను గ్రహించుట లేదా కోల్పోవుట చేస్తుంది. రెండు ఎలక్ట్రాన్లను గ్రహించే మూలకం బాహ్యస్థాయిలో ఆరు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. కనుక మూలకం ఆరవ గ్రూపు (VIA; 16వ గ్రూపు) కి చెందినది.

Exam Tips:

a) బాహ్య శక్తిస్థాయి ఎలక్ట్రాన్ల సంఖ్య నుండి గ్రూపు: (a) ns² np⁵ → 17వ గ్రూపు; (b) 2 ఎలక్ట్రాన్లు కోల్పోయేది → 2వ గ్రూపు; (c) 2 ఎలక్ట్రాన్లు గ్రహించేది → 16వ గ్రూపు.

 

Question 21: s, p, d, f బ్లాక్ మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇవ్వండి.

Answer:

S – బ్లాక్ మూలకాలు బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns¹ లేదా ns² p – బ్లాక్ మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns² np¹ నుంచి ns² np⁶ d – బ్లాక్ మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం (n – 1) d1 – 10 ns¹లేదా² f – బ్లాక్ మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం (n – 2) f1 – 14 (n – 1) d0- 1 ns²

Exam Tips:

a) s: ns¹⁻²; p: ns² np¹⁻⁶; d: (n–1)d¹⁻¹⁰ ns¹⁻²; f: (n–2)f¹⁻¹⁴ (n–1)d⁰⁻¹ ns²; నాలుగింటినీ వరుసగా రాయండి.

 

Question 22: B, Al, Mg, K ల లోహ స్వభావం పెరిగే క్రమాన్ని రాయండి.

Answer:

B < Al < Mg < K

Exam Tips:

a) లోహ స్వభావం గ్రూపులో కిందికి పెరుగుతుంది, పీరియడ్‌లో కుడికి తగ్గుతుంది; B < Al < Mg < K అని పెరిగే క్రమంలో రాయండి.

 

Question 23: B, C, N, F, Si ల సరైన అలోహ స్వభావ పెరుగుదల క్రమాన్ని రాయండి.

Answer:

అధిక ఋణ విద్యుదాత్మకత మరియు అధిక అయనీకరణ శక్తి అలోహ ధర్మానికి సూచికలు. పై మూలకాలలో అలోహ స్వభావం Si నుండి F కు పెరుగుతుంది. Si < B < C < N < F

Exam Tips:

a) అలోహ స్వభావం ఋణ విద్యుదాత్మకతతో పెరుగుతుంది: Si (1.8) < B (2.0) < C (2.5) < N (3.0) < F (4.0).

 

Question 24: N, O, F, Cl ల సరైన రసాయన చర్యాశీలత పెరుగుదల క్రమాన్ని వాటి ఆక్సీకరణ ధర్మం పరంగా రాయండి.

Answer:

అధిక ఋణ విద్యుదాత్మకత గల మూలకాలు బలమైన ఆక్సీకారులు (ఎలక్ట్రాన్లను గ్రహించే సామర్థ్యం ఎక్కువ).
ఋణ విద్యుదాత్మకత (పౌలింగ్): N = 3.0, Cl = 3.0, O = 3.5, F = 4.0
కనుక ఆక్సీకరణ సామర్థ్యం క్రమం : N < Cl < O < F

Exam Tips:

a) ఆక్సీకరణ సామర్థ్యం ఋణ విద్యుదాత్మకతతో పెరుగుతుంది (N 3.0, Cl 3.0, O 3.5, F 4.0); పెరిగే క్రమం అడిగారని గమనించండి.

 

Question 25: ఋణ విద్యుదాత్మకత అంటే ఏమిటి ? మూలకాల స్వభావాన్ని తెలుసుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది?

Answer:

అణువులోని పరమాణువు బంధ ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు ఆకర్షించే సామర్థ్యాన్ని ఋణ విద్యుదాత్మకత అంటారు. అధిక ఋణ విద్యుదాత్మకతను కలిగిన మూలకాలు అధిక అలోహ స్వభావాన్ని చూపుతాయి మరియు బలమైన ఆక్సీకారుణులుగా పనిచేస్తాయి.

Exam Tips:

a) నిర్వచనంలో 'బంధ ఎలక్ట్రాన్ జంటను ఆకర్షించే సామర్థ్యం' అనే మాటలు ఉండాలి; ఉపయోగం: అధిక EN → అలోహ స్వభావం, బలమైన ఆక్సీకారి.

 

Question 26: పరిరక్షక ప్రభావం అంటే ఏమిటి ? అది ఏ విధంగా అయొనైజేషన్ ఎంథాల్పీ (IE) తో సంబంధం కలిగి ఉంది ?

Answer:

వేలన్సీ కక్ష్యకు, కేంద్రకానికీ మధ్యగల కక్ష్యలలోని ఎలక్ట్రాన్లు కేంద్రకావేశాన్ని కొంత వరకు తటస్థీకరించడం వల్ల బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది. అంతర్ కక్ష్యలలోని ఎలక్ట్రాన్లు బాహ్య కక్ష్యలలోని ఎలక్ట్రాన్లకు కేంద్రకానికి మధ్యగల ఆకర్షణపై కనబరిచే ఈ ప్రభావాన్ని పరిరక్షక ప్రభావం అంటారు. ఈ ప్రభావం పెరిగితే, అనగా అంతర కక్ష్యల సంఖ్య పెరిగే కొద్దీ అయొనైజేషన్ శక్తి తగ్గుతుంది.
IP ∝ 1 / (పరిరక్షక ప్రభావం)

Exam Tips:

a) పరిరక్షక ప్రభావం పెరిగితే IE తగ్గుతుంది: IP ∝ 1/పరిరక్షక ప్రభావం; ఆర్బిటాళ్ల పరిరక్షణ క్రమం s > p > d > f అని కూడా రాయండి.

 

Question 27: మూలకాల ఋణ విద్యుదాత్మకత లోహ, అలోహ లక్షణాలకు సంబంధం ఏమిటి ?

Answer:

ఋణ విద్యుదాత్మకత ఆధారంగా మూలకాల స్వభావాన్ని ఊహించవచ్చు. ఋణ విద్యుదాత్మకత అధికంగా కలిగిన మూలకాలు అలోహ స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహాలకు ఋణ విద్యుదాత్మక విలువలు తక్కువగా ఉంటాయి. ఒక పీరియడ్ మూలకాల్లో ఎడమ నుంచి కుడికి ఋణ విద్యుదాత్మకత పెరుగుతుంది. కనుక లోహ స్వభావము తగ్గి అలోహ స్వభావము పెరుగుతుంది.
ఒక గ్రూపు మూలకాల్లో పై నుంచి కిందకు ఋణ విద్యుదాత్మకత తగ్గుతుంది. కనుక లోహ స్వభావం పై నుండి కిందకు పెరుగుతుంది. అలోహ స్వభావం తగ్గుతుంది.

Exam Tips:

a) EN ఎక్కువ → అలోహ స్వభావం; EN తక్కువ → లోహ స్వభావం; పీరియడ్‌లో (EN పెరుగుతుంది) మరియు గ్రూపులో (EN తగ్గుతుంది) రెండు ధోరణులూ చెప్పండి.

 

Question 28: ఆక్సిజన్, హైడ్రోజన్ పరంగా ఆర్సినిక్కు సాధ్యమయ్యే వేలన్సీ ఎంత ?

Answer:

ఆక్సిజన్ పరంగా ఆర్సినిక్ మూడు మరియు ఐదు సంయోజకతలను చూపుతుంది (As₂O₃ మరియు As₂O₅) హైడ్రోజన్ పరంగా AsH₃ లో As సంయోజకత మూడు.

Exam Tips:

a) As: ఆక్సిజన్ పరంగా 3 మరియు 5 (As₂O₃, As₂O₅); హైడ్రోజన్ పరంగా 3 (AsH₃).

 

Question 29: ద్విస్వభావిత ఆక్సైడ్ అంటే ఏమిటి ? 13వ గ్రూప్ మూలకం ఏర్పరచే ద్విస్వభావిక ఆక్సైడ్ ఫార్ములాను ఇవ్వండి.

Answer:

ఆమ్లాలు మరియు క్షారాలలో చర్యపొందే ఆక్సైడును దిస్వభావ ఆక్సైడ్ అంటారు. 13వ గ్రూపులో Al₂O₃ మరియు Ga₂ O₃ లు ద్విస్వభావ ఆక్సైడ్లు.

Exam Tips:

a) ద్విస్వభావ ఆక్సైడ్ ఆమ్లం, క్షారం రెండింటితోనూ చర్య జరుపుతుంది; 13వ గ్రూపు ఉదా : Al₂O₃, Ga₂O₃.

 

Question 30: అధిక ఋణ విద్యుదాత్మకత కల మూలకం ఏది ? దానికి అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉందా ? ఎందుకు ఉంది? ఎందుకు లేదు ?

Answer:

అధిక ఋణ విద్యుదాత్మకత గలిగిన మూలకం ఫ్లోరిన్ (4.0). కాని ఫ్లోరిన్‌కు అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ లేదు. హాలోజన్లో అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ కలిగిన మూలకం క్లోరిన్. Cl > F > Br > I > At క్రమంలో ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీలు ఉంటాయి.
కారకం : క్లోరిన్ కన్నా ఫ్లోరిన్ చిన్న పరమాణువు కనుక ఫ్లోరిన్పై ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువ. కొత్తగా చేరే ఎలక్ట్రాన్ . వికర్షణకులోనవుతుంది. అందువల్ల ‘F’ కు ఎలక్ట్రాన్గ్రాహ్య ఎంథాల్పీ విలువ తక్కువ.
F < Cl

Exam Tips:

a) అత్యధిక EN = F (4.0), కానీ అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ Cl (F లో చిన్న పరిమాణం వల్ల ఎలక్ట్రాన్ వికర్షణ). క్రమం Cl > F > Br > I.

 

Question 31: కర్ణ సంబంధం అంటే ఏమిటి ? ఈ సంబంధం ఉన్న ఒక మూలకాల జంటను ఇవ్వండి.

Answer:

రెండవ పీరియడ్‌లోని ఒక మూలకం, మూడవ పీరియడ్‌లో దాని తరువాతి గ్రూపులోని మూలకంతో సారూప్య ధర్మాలను ప్రదర్శించడాన్ని కర్ణ సంబంధం అంటారు.

గ్రూపుIIIIIIIV
2వ పీరియడ్LiBeBC
3వ పీరియడ్NaMgAlSi

కర్ణ సంబంధం గల జంటలు: Li – Mg, Be – Al, B – Si
Li, Mg లు ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి.

Exam Tips:

a) కర్ణ సంబంధం: 2వ పీరియడ్ మూలకం – 3వ పీరియడ్‌లో తదుపరి గ్రూపు మూలకం; Li–Mg, Be–Al, B–Si అనే జంటలు రాయండి.

 

Question 32: మూడో పీరియడ్లో ఆక్సైడ్ స్వభావం ఎలా మారుతుంది ?

Answer:

ఏ పీరియడ్ మూలకాలలోనైనా ఆక్సైడ్ ఆమ్ల స్వభావం ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. క్షారస్వభావం తగ్గుతుంది. మూడవ పీరియడ్లో ఆక్సైడ్ క్షార స్వభావం తగ్గి ఆమ్ల స్వభావం పెరుగుతుంది.
Na₂O నుండి Cl₂O₇ కు ఆక్సైడ్ స్వభావం మార్పును దిగువ సూచించడమైనది.

మూలకంNaMgAlSiPSCl
ఆక్సైడ్Na₂OMgOAl₂O₃SiO₂P₂O₅SO₃Cl₂O₇
స్వభావంబలమైన క్షారంబలహీన క్షారంద్విస్వభావంబలహీన ఆమ్లంఆమ్లంబలమైన ఆమ్లంబలమైన ఆమ్లం

Exam Tips:

a) 3వ పీరియడ్ ఆక్సైడ్లు: Na₂O (బలమైన క్షారం) → MgO → Al₂O₃ (ద్విస్వభావం) → SiO₂ → P₄O₁₀ → SO₃ → Cl₂O₇ (బలమైన ఆమ్లం); పట్టిక గీయండి.

 

Question 33: ఐరన్ పరమాణువు, వాటి అయాన్ల వ్యాసార్థాలు పాటించే క్రమం Fe > Fe²⁺ > Fe³⁺ విశదీకరించండి.

Answer:

మాతృ పరమాణువు కన్నా దాని కేటయాన్ చిన్నది. ఒంటరి తటస్థపరమాణువు ఎలక్ట్రాను కోల్పోతే ఏర్పడే ధన అయాన్లో ఎలక్ట్రాన్ల సంఖ్య కన్నా ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ. అందువల్ల వేలన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ అధికమవుతుంది.
తత్ఫలితంగా ఎలక్ట్రాన్ మేఘం కుచించుకుపోయి పరిమాణం తగ్గుతుంది.
ఎక్కువ ఎలక్ట్రాన్లను కోల్పోతే అయాన్ పరిమాణం మరింత తగ్గుతుంది. కనుక Fe > Fe²⁺ > Fe³⁺

Exam Tips:

a) పరమాణువు కంటే కాటయాన్ చిన్నది; ఎక్కువ ఎలక్ట్రాన్లు పోతే ప్రోటాన్ల ఆకర్షణ పెరిగి పరిమాణం తగ్గుతుంది: Fe > Fe²⁺ > Fe³⁺.

 

Question 34: ఒక మూలకం రెండో అయొనైజేషన్ ఎంథాల్పీ (IE₂) కంటే మొదటి అయొనైజేషన్ఎంథాల్పీ (IE₁) తక్కువ. ఎందుకు?

Answer:

తటస్థ పరమాణువు ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు ఏర్పడే ఏకమాత్ర ధనావేశిత అయాన్లో వేలన్స్ ఎలక్ట్రాన్ల పై కేంద్రక ఆకర్షణ అధికం. అందువల్ల ఎలక్ట్రాను తొలగించుటకు అధిక శక్తి అవసరం అవుతుంది. కనుక ఏక మాత్ర ధనావేశిత అయాన్ నుండి ఎలక్ట్రాను తొలగించుటకు కావలసిన అయొనైజేషన్ పొటెన్షియల్IE₂ విలువ IE₁ కంటె ఎక్కువ. అనగా ద్వితీయ అయొనైజేషన్ పొటెన్షియల్ విలువలు ప్రథమ అయొనైజేషన్ పొటెన్షియల్ కన్నా ఎక్కువ.

Exam Tips:

a) IE₂ > IE₁ ఎందుకంటే ఏక ధనావేశిత అయాన్‌లో ప్రాభావిక కేంద్రక ఆవేశం ఎక్కువ, ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ తక్కువ; కాబట్టి రెండవ ఎలక్ట్రాన్ తొలగించడానికి ఎక్కువ శక్తి కావాలి.

 

Question 35: లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి ? దాని ఫలితాలలో ఒక దానిని చెప్పండి.

Answer:

లాంథనైడ్లో ఎడమ నుంచి కుడికి వాటి పరిమాణాలు క్రమేపి తగ్గుతూ వస్తాయి. Ce నుండి Lu వరకు ఈ తగ్గుదల సుమారు 0.2 Å ఉన్నది. దీనినే లాంథనైడ్ సంకోచం అంటారు. లాంథనైడ్లో భేదాత్మక ఎలక్ట్రాన్ (n – 2) f ఉపకక్ష్యలో ప్రవేశిస్తుంది. వితరణం చెందిన ఆకృతుల మూలంగా f – ఆర్బిటాళ్లు, కేంద్ర కాకర్షణ నుండి వేలన్సీ ఎలక్ట్రాన్లకు తగు పరిరక్షణ కల్పించలేవు. ఈ కారణంగా కేంద్రక ఆకర్షణ పెరిగి పరమాణు సైజులు ఎడమ నుండి కుడికి తగ్గుతాయి.
ఈ పరమాణు సైజు తగ్గుదల, లాంథనైడ్ పరమాణువుల కన్నా వాటి +3 అయాన్లో క్రమ పద్ధతిలో ఉంటుంది.
ఫలితాలు:
1. లాంథనైడ్ సంకోచం వలన మూలకాల ద్రవీభవనస్థానం, బాష్పీభవన స్థానం Ce నుండి Lu వరకు పెరుగుతాయి.
2. 4d మరియు 5d శ్రేణులలోని గ్రూపుల మూలకాలలో అధిక సారూప్యతలు గోచరిస్తాయి. ఈ సారూప్యత 3d మరియు 4d శ్రేణుల మూలకాలలో కనిపించదు. దీనికి కారణం లాంథనైడ్ సంకోచం.
ఉదా : (Zr, Hf); (Nb, Ta) జంటల పరిమాణాలు దాదాపు సమానం కావున వాటి ధర్మాలలో సారూప్యత ఉంటుంది.

Exam Tips:

a) లాంథనైడ్ సంకోచానికి కారణం 4f ఎలక్ట్రాన్ల బలహీన పరిరక్షణ; ఫలితంగా 4d, 5d మూలకాల (Zr–Hf, Nb–Ta) పరిమాణాలు సమానం అని ఉదాహరణ ఇవ్వండి.

 

Question 36: అధిక సంఖ్యలో జతగూడని 2p ఎలక్ట్రాన్లు ఉన్న మూలకం పరమాణు సంఖ్య ఎంత ? అది ఏ గ్రూప్కు చెందింది ?

Answer:

p ఆర్బిటాలులో గరిష్ఠంగా 3 జతలేని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు. కనుక మూలక ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p³ మూలక పరమాణు సంఖ్య 7. మూలకం పేరు నైట్రోజన్. అది Vవ గ్రూప్‌కు (VA; 15వ గ్రూపు) చెందినది.

Exam Tips:

a) p ఆర్బిటాళ్లలో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు → 2p³; విన్యాసం 1s² 2s² 2p³ → Z = 7 (N), గ్రూపు 15 (VA).

 

Question 37: సోడియంకు బలమైన లోహ స్వభావం ఉంటుంది ? క్లోరిన్‌కు బలమైన అలోహ స్వభావం ఉంటుంది. విశదీకరించండి.
(లేదా)
సోడియం బలమైన లోహం కాగా, క్లోరిన్ బలమైన అలోహం – ఎందుకు ?

Answer:

సోడియంకు స్వల్ప అయనీకరణ శక్తి కలదు. అందువల్ల అది ఎలక్ట్రాన్లను సులువుగా కోల్పోయి ధన అయానును ఏర్పరచగలదు. కనుక అది బలమైన లోహ స్వభావము కలిగినది.
క్లోరిన్ కు అధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ మరియు అధిక ఋణ విద్యుదాత్మకతకలవు. అందువల్ల అది సులువుగా ఎలక్ట్రాను గ్రహించి ఋణ అయానును ఏర్పరచగలదు. అందువల్ల అది అధిక అలోహ స్వభావాన్ని కలిగి ఉంటుంది.

Exam Tips:

a) Na: తక్కువ IE → ఎలక్ట్రాన్లు కోల్పోవడం సులభం (లోహం); Cl: ఎక్కువ EA, EN → ఎలక్ట్రాన్ గ్రహణం సులభం (అలోహం); రెండు భాగాలనూ వివరించండి.

 

Question 38: శూన్య గ్రూపు మూలకాలను ఉత్కృష్ట లేదా తటస్థ వాయువులని ఎందుకు అంటారు ?

Answer:

శూన్య గ్రూపు మూలకాలకు ns² np⁶ ఎలక్ట్రాన్ విన్యాసం కలదు. హీలియం ఎలక్ట్రాన్విన్యాసం 1s ². ఈ ఎలక్ట్రాన్ విన్యాసాలు స్థిరమైనవి. రసాయన జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. కనుక వాటిని జడ వాయువులు అంటారు.
ఇటీవల కాలంలో జడ వాయువులు కూడా రసాయనచర్యలలో పాల్గొని సమ్మేళనాలను ఏర్పరుస్తాయి అని కనుగొన్నారు. కాని బంగారం, ప్లాటినం వంటి లోహాల వలె చర్యాశీలత తక్కువని తెలిసినది కనుక వాటిని ఉత్కృష్ట వాయువులని వ్యవహరిస్తారు.

Exam Tips:

a) జడ వాయువుల విన్యాసం ns² np⁶ (He కు 1s²) → స్థిరం; ఇటీవల XeF₂ వంటి సమ్మేళనాలు ఏర్పడతాయని తెలిసినందున 'ఉత్కృష్ట వాయువులు' అని పిలుస్తారని చెప్పండి.

 

Question 39: ప్రతి జంటలో, తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి.
a) I, I–
b) Br, K
c) Li, Li⁺
d) Ba, Sr
e) O, S
f) Be, B
g) N, O

Answer:

a) I– కు అయనీకరణ శక్తి తక్కువ. కారణం : I– పరిమాణం I కంటే ఎక్కువ.
b) K కు అయనీకరణ శక్తి తక్కువ. కారణం : K ధన విద్యుదాత్మక మూలకం కాగా Br ఋణ విద్యుదాత్మక మూలకం.
c) Li కు అయనీకరణ శక్తి తక్కువ. కారణం : Li పరిమాణం Li⁺ కంటె ఎక్కువ.
d) Ba కు అయనీకరణ శక్తి తక్కువ. కారణం : గ్రూపులో పై నుండి క్రిందికి అయనీకరణ శక్తి తగ్గుతుంది; Sr తరువాత మూలకం Ba.
e) S కు అయనీకరణ శక్తి తక్కువ. కారణం : S పరిమాణం O కంటె ఎక్కువ.
f) B కు అయనీకరణ శక్తి తక్కువ. కారణం : Be లో పూర్తిగా నిండిన 2s ఆర్బిటాల్ ఉంటుంది.
g) O కు అయనీకరణ శక్తి తక్కువ. కారణం : N లో సగం నిండిన 2p ఆర్బిటాళ్ళు ఉంటాయి.

Exam Tips:

a) ప్రతి జతలో ఎంపికతో పాటు కారణం (పరిమాణం, స్థిర విన్యాసం, గ్రూపులో కిందికి IE తగ్గడం) రాయండి; ఒక్క అక్షరం మాత్రమే రాస్తే మార్కులు తగ్గుతాయి.

 

Question 40: ఆక్సిజన్ IE₁ < నైట్రోజన్ IE₁ కాని ఆక్సిజన్ IE₂ > నైట్రోజన్ IE₂ – విశదీకరించండి.

Answer:

NO
పరమాణు విన్యాసం1s² 2s² 2p³1s² 2s² 2p⁴
IE₁ ↓ అయాన్ (M⁺) విన్యాసం1s² 2s² 2p²1s² 2s² 2p³
IE₂ ↓ అయాన్ (M²⁺) విన్యాసం1s² 2s² 2p¹1s² 2s² 2p²

‘N’ లో సగం నిండిన ‘p’ ఆర్బిటాళ్ళు (2p³) ఉన్నాయి కాబట్టి దాని IE₁ ‘O’ యొక్క IE₁ కన్నా ఎక్కువగా ఉంటుంది (O < N).
‘O⁺’ లో సగం నిండిన ‘p’ ఆర్బిటాళ్ళు (2p³) ఉన్నాయి కాబట్టి, O⁺ నుండి ఎలక్ట్రాన్ తొలగించడానికి అధిక శక్తి అవసరం. N⁺ (2p²) కు ఈ స్థిరత్వం లేదు. అందువల్ల O యొక్క IE₂, N యొక్క IE₂ కన్నా ఎక్కువగా ఉంటుంది.

Exam Tips:

a) N: 2p³ సగం నిండింది → IE₁(N) > IE₁(O); O⁺: 2p³ సగం నిండింది → IE₂(O) > IE₂(N); విన్యాసాల పట్టిక రాయండి.

 

Question 41: Na⁺, Ne లకు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నప్పటికీ, Na⁺ కు Ne కంటే ఎక్కువ అయనీకరణ శక్తి విలువ ఉంది – విశదీకరించండి.

Answer:

Na⁺ అయాన్ కేంద్రకంలో ప్రోటానుల సంఖ్య (11) Ne పరమాణువు కేంద్రకంలోని ప్రోటానుల సంఖ్య (10) కంటే ఎక్కువ. Na⁺, Ne లలో ఎలక్ట్రానుల సంఖ్య సమానం. కాని Na⁺ కేంద్రకం ఎలక్ట్రానులను బలంగా ఆకర్షిస్తుంది. కనుక Na⁺ I.P విలువ Ne కంటే ఎక్కువ.

Exam Tips:

a) Na⁺ మరియు Ne లకు ఎలక్ట్రాన్లు 10 చొప్పున; Na⁺ లో ప్రోటాన్లు 11, Ne లో 10 → ఎక్కువ కేంద్రక ఆకర్షణ → IE ఎక్కువ.

 

Question 42: కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉంది ? విశదీకరించండి.
a) N, O
b) F, Cl

Answer:

a) ఆక్సిజన్ కు ఎక్కువ. నైట్రోజన్లో p³ ఎలక్ట్రాన్ విన్యాసం స్థిరమైనది కనుక దాని ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఆక్సిజన్ కన్నా తక్కువ.
b) క్లోరిన్కు ఎక్కువ: ఫ్లోరిన్ స్వల్ప పరిమాణం కారణంగా అధిక ఎలక్ట్రాన్ సాంద్రతను కలిగి, కొత్తగా చేరే ఎలక్ట్రాన్ అధిక వికర్షణకు గురవుతుంది. అందువల్ల విడుదలయ్యే ఉష్ణం తక్కువ. ఫ్లోరిన్ E.A. తక్కువ.

Exam Tips:

a) (a) O కు ఎక్కువ (N లో p³ స్థిరత్వం); (b) Cl కు ఎక్కువ (F లో చిన్న పరిమాణం వల్ల వికర్షణ); కారణం ఒక వాక్యంలో రాయండి.

 

Question 43: క్లోరిన్ ఎలక్ట్రాన్ అఫినిటి ఫ్లోరిన్ కంటే ఎక్కువ – విశదీకరించండి.

Answer:

ఫ్లోరిన్ స్వల్ప పరిమాణం వల్ల దానిపై ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువ. అందువల్ల కొత్తగా చేరే ఎలక్ట్రాన్ వికర్షణకు లోనవుతుంది. వికర్షణను అధిగమించడానికి విడుదలయ్యే ఉష్ణంలో కొంత ఖర్చుచేయబడుతుంది. అందువల్ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తగ్గుతుంది. క్లోరిన్ పరిమాణం అధికం కనుక ఈ విధమైన వికర్షణలు ఉండవు. కనుక క్లోరిన్ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఎక్కువ. ఫ్లోరిన్‌కు తక్కువ.

Exam Tips:

a) F లో 2p ఉపస్థాయి చిన్నదిగా ఉండటం వల్ల ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువ → కొత్త ఎలక్ట్రాన్‌కు వికర్షణ → EA తగ్గుతుంది; Cl లో ఇది లేదు.

 

Question 44: కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంది ?
a) F, Cl–
b) O, O–
c) Na ⁺, F
d) F, F–

Answer:

a) F
b) O
c) Na⁺
d) F

Exam Tips:

a) Cl⁻, O⁻ ఇప్పటికే ఋణ అయాన్లు కాబట్టి వాటికి ఎలక్ట్రాన్ చేర్చడం కష్టం; Na⁺ కు ఎలక్ట్రాన్ చేర్చడం అంటే Na యొక్క IE విలువను విడుదల చేయడం, కాబట్టి EA ఎక్కువ.

 

Question 45: కింది వాటిని అయానిక వ్యాసార్ధ పెరుగుదల క్రమంలో అమర్చండి.
a) Cl –, P ⁻³, S ⁻², F–
b) Al⁺³, Mg⁺⁺, Na ⁺, O ⁻², F–
c) Na ⁺, Mg⁺⁺, K⁺

Answer:

a) F– < Cl– < S⁻² < P⁻³
b) Al⁺³ < Mg⁺⁺ < Na⁺ < F– < O⁻²
c) Mg⁺⁺ < Na⁺ < K⁺

Exam Tips:

a) సమ ఎలక్ట్రానిక్ జంటలలో Z ఎక్కువైతే చిన్నది; వేరు కర్పరాల అయాన్లలో కర్పరాల సంఖ్య ఎక్కువైతే పెద్దది; క్రమాలను 'పెరిగే క్రమం' (చిన్నది → పెద్దది) అని రాయండి.

 

Question 46: Mg⁺⁺, O⁻² రెండూ ఒకే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉన్నప్పటికీ, పరిమాణంలో Mg⁺⁺, O⁻² కంటే తక్కువ.

Answer:

Mg⁺⁺ మరియు O⁻² లు సమ ఎలక్ట్రాన్ సంఖ్య కలిగినవి. కాని Mg⁺⁺ లో ప్రోటానుల సంఖ్య (12) O⁻² (8) లో కన్న ఎక్కువ. అందువల్ల Mg⁺⁺ లో కేంద్రక ఆకర్షణా ప్రభావం O⁻² లో కన్నా ఎక్కువ. అందువల్ల Mg⁺⁺ అయాను పరిమాణం తక్కువగా ఉంటుంది.

Exam Tips:

a) Mg²⁺ మరియు O²⁻ లకు 10 ఎలక్ట్రాన్లు; Mg²⁺ లో 12 ప్రోటాన్లు, O²⁻ లో 8 → Mg²⁺ చిన్నది.

 

Question 47: B, Al, C, Si మూలకాలలో
a) దేనికి అత్యధిక ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ ఉంది ?
b) దేనికి ఎక్కువ రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉంది ?
c) దేనికి అత్యధిక పరమాణు వ్యాసార్ధం ఉంది ?
d) దేనికి ఎక్కువ లోహ స్వభావం ఉంది ?

Answer:

a) C (IE₁ = 1086 kJ mol⁻¹)
b) Si (ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ: Si = –134, C = –122, Al = –42, B = –27 kJ mol⁻¹)
c) Al
d) Al

Exam Tips:

a) (a) C ఎక్కువ IE; (b) Si కు C కంటే ఎక్కువ రుణాత్మక EA; (c), (d) Al; విలువలు (kJ mol⁻¹) ఇస్తే సమాధానం బలపడుతుంది.

 

Question 48: N, P, O, S మూలకాలను గమనించండి. వాటిని
a) ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ పెరుగుదల క్రమంలో b) ఋణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ పెరుగుదల క్రమంలో c) అలోహ స్వభావం పెరిగే క్రమంలో రాయండి.

Answer:

a) S < P < O < N
b) N < P < O < S
c) P < S < N < O

Exam Tips:

a) IE: S < P < O < N (P, N లలో సగం నిండిన p); EA: N < P < O < S; అలోహ స్వభావం: P < S < N < O (EN క్రమం).

 

Question 49: ఇచ్చిన క్రమంలో అమర్చండి:
a) ఎలక్ట్రాన్ గ్రాహ్య (EA) పెరుగుదల : O, S, Se
b) IE₁ పెరుగుదల : Na, K, Rb
c) వ్యాసార్ధం పెరుగుదల : I –, I ⁺, I
d) రుణ విద్యుదాత్మకత పెరుగుదల : F, Cl, Br, I
e) EA పెరుగుదల : F, Cl, Br, I
f) వ్యాసార్ధం పెరుగుదల : Fe, Fe⁺², Fe⁺³

Answer:

a) O < Se < S
b) Rb < K < Na
c) I⁺ < I < I⁻
d) I < Br < Cl < F
e) I < Br < F< Cl
f) Fe⁺³ < Fe⁺² < Fe

Exam Tips:

a) ప్రతి భాగానికీ ధోరణి గుర్తు పెట్టుకోండి: O, F లో EA అసాధారణం (S, Cl కంటే తక్కువ); I⁺ < I < I⁻ ; Fe³⁺ < Fe²⁺ < Fe.

 

Question 50: a) అత్యధిక అయొనైజేషన్ ఎంథాల్పీ ఉన్న మూలకం ఏది ? b) అత్యధిక అయొనైజేషన్ ఎంథాల్పీ విలువ గల గ్రూపు ఏది ? c) అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీని చూపే మూలకం ఏది ? d) మెండలీవ్ కాలానికి తెలియని మూలకాల పేర్లు ఏమిటి ? e) ఏవైనా రెండు ప్రాతినిధ్య మూలకాల పేర్లు తెలపండి.

Answer:

a) హీలియం
b) శూన్య గ్రూపు
c) క్లోరిన్
d) ఎకా బోరాన్ – స్కాండియం
ఎకా అల్యూమినియం – గాలియం
ఎకా సిలికాన్ – జర్మేనియం
e) సోడియం మరియు మెగ్నీషియం

Exam Tips:

a) ఎకా బోరాన్ = స్కాండియం, ఎకా అల్యూమినియం = గాలియం, ఎకా సిలికాన్ = జర్మేనియం అని సరైన జతలు గుర్తుంచుకోండి; అత్యధిక IE: He; అత్యధిక EA: Cl.

 

Question 51: a) ఏవైనా రెండు వారధి మూలకాల పేర్లు తెలపండి.
b) కర్ణ సంబంధం చూపే ఏదైనా రెండు జంటలను తెలపండి. c) రెండు పరివర్తన మూలకాల పేర్లు తెలపండి.
d) రెండు విరళ మృత్తిక మూలకాల పేర్లు తెలపండి.
e) రెండు ట్రాన్స్ యురానిక్ మూలకాల పేర్లు తెలపండి.

Answer:

a) సోడియం మరియు మెగ్నీషియం
b) Li, Mg; Be, Al
c) క్రోమియం మరియు కాపర్
d) సీరియం మరియు లుటేషియం
e) నెప్ట్యూనియం మరియు ప్లుటోనియం

Exam Tips:

a) వారధి మూలకాలు: Na, Mg; కర్ణ జంటలు: Li–Mg, Be–Al; పరివర్తన: Cr, Cu; విరళ మృత్తిక: Ce, Lu; ట్రాన్స్ యురానిక్: Np, Pu.

 

లఘు సమాధాన ప్రశ్నలు

Question 52: ఆవర్తన పట్టికలోని 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉన్నాయని, క్వాంటమ్ సంఖ్యల ఆధారంతో సమర్థించండి.

Answer:

విస్తృత ఆవర్తనా పట్టికలో ప్రతి పీరియడ్లో కొత్త ప్రధాన శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. 6వ పీరియడ్ మూలకాలలో 6వ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. 6వ పీరియడ్లో చివరి మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం 6s² 6p ⁶. 6p ఉపస్థాయి నిండుటకు ముందు 6s, 4f, 5d లలో ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. 6s లో రెండు, 4f లో పద్నాలుగు, 5d లో పది, మరియు 6p లో ఆరు, మొత్తం 32 ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. కనుక 6వ పీరియడ్లో మొత్తం మూలకాల సంఖ్య 32.

Exam Tips:

a) 6వ పీరియడ్: 6s (2) + 4f (14) + 5d (10) + 6p (6) = 32 ఎలక్ట్రాన్లు → 32 మూలకాలు; ఈ మొత్తాన్ని తప్పనిసరిగా చూపండి.

 

Question 53: పరమాణు భారం కంటె పరమాణు సంఖ్య మూలకాల ప్రాథమిక ధర్మమని, పరమాణు సంఖ్యలపై మేస్లే జరిపిన కృషి ఎలా తెలుపుతుంది ?

Answer:

1913 సం||లో మోస్లే మూలకాల X – కిరణ వర్ణ పటంను తయారుచేసాడు. దీన్ని బట్టి మూలక పరమాణు కేంద్రకం పై గల ఆవేశానికి అది వెలువరించిన X కిరణాల పౌనః పున్యానికి సంబంధం ఉందని చూపాడు.

\( \sqrt{\nu} = a (Z - b) \) సమీకరణంలో
ν = X – కిరణాల పౌనఃపున్యం,
Z = మూలకం కేంద్రక ఆవేశం, దీన్నే పరమాణు సంఖ్య అన్నారు.
a, b లు స్థిరాంకాలు.
\( \sqrt{\nu} \), Z ల మధ్య గీసిన రేఖాపటం ఒక సరళ రేఖగా ఉన్నది. ఇదే రకమైన సంబంధం \( \sqrt{\nu} \), పరమాణు భారాల మధ్య కనబడలేదు. దీన్ని బట్టి, పరమాణు భారం గాక, పరమాణు సంఖ్య మూలకం యొక్క మెరుగైన మౌలిక లక్షణమని
తెలుస్తున్నది. X – కిరణాల పౌనః పున్యము, పరమాణువులోపలి నిర్మాణం పైన అనగా ఎలక్ట్రాన్ల సంఖ్య పైన ఆధారపడుతుంది. ఆ సంఖ్యయే పరమాణు సంఖ్య.

Exam Tips:

a) మోస్లే సమీకరణం √ν = a(Z – b); √ν vs Z సరళ రేఖ, కానీ √ν vs పరమాణు భారం సరళ రేఖ కాదు; అందుకే Z ప్రాథమిక ధర్మం.

 

Question 54: ఆధునిక ఆవర్తనా నియమాన్ని తెలపండి. విస్తృత ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూప్లు, పీరియడ్లు ఉన్నాయి ?

Answer:

‘మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు’. విస్తృత ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు, 7 పీరియడ్లు ఉన్నాయి.

Exam Tips:

a) ఆధునిక ఆవర్తన నియమం: భౌతిక, రసాయన ధర్మాలు పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు; 18 గ్రూపులు, 7 పీరియడ్లు.

 

Question 55: f – బ్లాక్ మూలకాలను అసలు పట్టిక కింద ఎందుకు అమర్చారు ?

Answer:

f బ్లాకు మూలకాలను ప్రధాన పట్టికలోనే ఉంచాలంటే ఆవర్తన పట్టిక పరిమాణం పెరుగుతుంది. దీనిని నివారించుటకు f బ్లాకు మూలకాలను అసలు పట్టిక క్రింద అమర్చారు.
లాంథనైడ్లో 4f స్థాయి క్రమేపి నిండుతుంది. ఆక్టినైడ్లో 5f స్థాయి క్రమేపి నిండుతుంది. సారూప్య ధర్మాలు గల మూలకాలను ఒకే నిలువు పట్టీలో ఉంచాలనే వర్గీకరణ సూత్రం అమలు అయ్యేటట్లు,, ఆవర్తన పట్టిక నిర్మాణాన్ని చేయడానికి 4f, 5f అంతర పరివర్తన శ్రేణుల మూలకాలను ఆవర్తన పట్టికలో వేరుగా ఉంచారు.

Exam Tips:

a) f బ్లాకును ప్రధాన పట్టికలో చేరిస్తే పట్టిక చాలా వెడల్పు అవుతుంది; అందుకే అడుగున రెండు వరుసల్లో (4f, 5f) ఉంచారు.

 

Question 56: విస్తృత ఆవర్తన పట్టికలోని ప్రతి పీరియడ్లో ఉన్న మూలకాల సంఖ్యను తెలపండి.

Answer:

మొదటి పీరియడ్ – 2 మూలకాలు
రెండవ పీరియడ్ – 8 మూలకాలు
మూడవ పీరియడ్ – 8 మూలకాలు
నాల్గవ పీరియడ్ – 18 మూలకాలు
ఐదవ పీరియడ్ – 18 మూలకాలు
ఆరవ పీరియడ్ – 32 మూలకాలు
ఏడవ పీరియడ్ – 32 మూలకాలు (Z = 87 నుండి 118 వరకు)

Exam Tips:

a) పీరియడ్లవారీ మూలకాలు: 2, 8, 8, 18, 18, 32, 32 (7వ పీరియడ్ Z = 87 నుండి 118); మొత్తం 118.

 

Question 57: కింద వాటి సాధారణ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసాలను తెలపండి.
a) ఉత్కృష్ట వాయువులు
b) ప్రాతినిధ్య మూలకాలు
c) పరివర్తన మూలకాలు
d) అంతర పరివర్తన మూలకాలు

Answer:

a) జడవాయువులు : ns² np⁶ (ns² for He)
b) ప్రాతినిథ్య మూలకాలు : ns1 – 2 np0 – 5
c) పరివర్తన మూలకాలు : (n – 1) d1 – 10 ns1 – 2
d) అంతర పరివర్తన మూలకాలు : (n – 2)f1 – 14 (n – 1) d0 – 1 ns²

Exam Tips:

a) నాలుగు వర్గాలకు సాధారణ విన్యాసం: జడ వాయువులు ns²np⁶; ప్రాతినిధ్య ns¹⁻² np⁰⁻⁵; పరివర్తన (n–1)d¹⁻¹⁰ns¹⁻²; అంతర పరివర్తన (n–2)f¹⁻¹⁴(n–1)d⁰⁻¹ns².

 

Question 58: పరివర్తన మూలకాల ఏవైనా నాలుగు అభిలాక్షణిక ధర్మాలను తెలపండి.

Answer:

పరివర్తన మూలకాల అభిలాక్షణిక ధర్మాలు.
1. పరివర్తన మూలకాలు కఠిన మరియు బరువైన లోహాలు
2. అధిక సాంద్రత, ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు
3. ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు
4. అనేక ఆక్సీకరణ స్థితులు చూపుట
5. రంగు కలిగిన సమ్మేళనాలను ఏర్పరుచుట
6. పారా అయస్కాంత ధర్మం
7. సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుచుట.

Exam Tips:

a) పరివర్తన మూలకాల ధర్మాలలో నాలుగు రాయండి: బహుళ ఆక్సీకరణ స్థితులు, రంగు సమ్మేళనాలు, పారా అయస్కాంతత్వం, ఉత్ప్రేరక లక్షణం, సంక్లిష్ట సమ్మేళనాలు.

 

Question 59: విరళ మృత్తిక లోహాలు, ట్రాన్స్ యురానిక్ మూలకాలు అంటే ఏమిటి ?

Answer:

సీరియం (Z = 58) నుండి లుటీషియం వరకు గల 14 మూలకాలు భూమిలో లభ్యత తక్కువ. కనుక వీటిని విరళ మృత్తికలు అంటారు. వీటి ధర్మాలు లాంథనంను పోలి ఉంటాయి కనుక లాంథనైడ్లు అని కూడా అంటారు. వీటిని 4f శ్రేణి
మూలకాలంటారు.
యురేనియం (z = 92) తరువాత మూలకాలను ట్రాన్స్ యురానిక్ మూలకాలు అంటారు. ఈ మూలకాలు ప్రకృతిలో లభించవు. అవి సంశ్లేషిత మూలకాలు. అవి రేడియోధార్మిక మూలకాలు. ఇవి 5f శ్రేణి మూలకాలు.

Exam Tips:

a) విరళ మృత్తికలు = Ce (58) నుండి Lu (71) వరకు 14 లాంథనైడ్లు; ట్రాన్స్ యురానిక్ = U (92) తరువాతి మూలకాలు, సంశ్లేషిత, రేడియోధార్మికం.

 

Question 60: సమ ఎలక్ట్రానిక్ శ్రేణులంటే ఏమిటి ? కింద ఉన్న ప్రతి పరమాణువు, అయాన్లకు సంబంధించిన సమ ఎలక్ట్రానిక్ శ్రేణులను తెలపండి.
(a) F–
b) Ar
c) He
d) Rb⁺

Answer:

సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగిన అయానులను సమ ఎలక్ట్రానిక్ శ్రేణి అంటారు.
a) N³⁻, O²⁻, F⁻, Ne, Na⁺, Mg²⁺, Al³⁺ (10 ఎలక్ట్రాన్లు)
b) P³⁻, S²⁻, Cl⁻, Ar, K⁺, Ca²⁺, Sc³⁺ (18 ఎలక్ట్రాన్లు)
c) H⁻, He, Li⁺, Be²⁺ (2 ఎలక్ట్రాన్లు)
d) As³⁻, Se²⁻, Br⁻, Kr, Rb⁺, Sr²⁺ (36 ఎలక్ట్రాన్లు)

Exam Tips:

a) సమ ఎలక్ట్రానిక్ శ్రేణి = ఒకే ఎలక్ట్రాన్ల సంఖ్య; ముందు ఇచ్చిన అయాన్ ఎలక్ట్రాన్లు లెక్కించండి (F⁻: 10, Ar: 18, He: 2, Rb⁺: 36), తరువాత అదే సంఖ్య గల వాటిని రాయండి.

 

Question 61: వ్యాసార్ధంలో మాతృక పరమాణువుల కంటే ఎందుకు కాటయాన్ చిన్నగా ఉంటుందో, ఆనయాన్ పెద్దగా ఉంటుందో విశదీకరించండి.

Answer:

తటస్థ పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాను తొలగించినపుడు, కాటయాన్ ఏర్పడుతుంది. కాటయాను మరియు దాని పరమాణువులకు కూడా కేంద్రక ఆవేశం సమానమే. కాని కాటయానులోని ఎలక్ట్రాన్ల సంఖ్య, మాతృపరమాణువులో కన్నా తక్కువగా ఉంటాయి. ఆ కారణంగా కేంద్రక ఆకర్షణ ఎలక్ట్రాన్లపై పెరిగి ఎలక్ట్రాన్మేఘం సంకోచిస్తుంది. కాబట్టి కాటయాన్ సైజు తగ్గుతుంది.

తటస్థ పరమాణువుకు ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు, ఆనయాన్ ఏర్పడుతుంది.
ఆనయాన్ మరియు దాని మాతృపరమాణువులోను కేంద్రక ఆవేశం సమానమే. కాని ఆనయానులోని ఎలక్ట్రాన్ల సంఖ్య, మాతృ పరమాణువులో కన్నా అధికంగా ఉంటాయి. ఆ కారణంగా కేంద్రక ఆకర్షణ ఎలక్ట్రాన్లపై తగ్గి ఎలక్ట్రాన్ మేఘం వ్యాకోచిస్తుంది. కాబట్టి ఆనయాన్ సైజు పెరుగుతుంది.

Exam Tips:

a) కాటయాన్: ఎలక్ట్రాన్లు తగ్గి, ప్రోటాన్లు అలాగే ఉండి ఆకర్షణ పెరిగి చిన్నది; ఆనయాన్: ఎలక్ట్రాన్ల వికర్షణ పెరిగి పెద్దది.

 

Question 62: రెండవ పీరియడ్ మూలకాలను, వాటి ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీలు పెరిగే క్రమంలో అమర్చండి. B కంటే Be కు అధిక IE₁ ఎందుకు ఉందో తెలపండి.

Answer:

Li < B < Be < C < O < N < F < Ne
Be ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s². దీనిలో బాహ్యతమ ఎలక్ట్రాన్ జతకూడి ఉన్నది. అంతేగాక, బాగా చొచ్చుకుపోయే S ఆర్బిటాల్లో ఉన్నది. అనగా దాన్ని పరమాణువు నుండి విడదీయడానికి అధిక శక్తి కావాలి. అనగా అధిక IP అవసరము. B ఎలక్ట్రాన్విన్యాసం 1s² 2s² 2p¹. దానిలో బాహ్యతమ ఎలక్ట్రాన్ ఒంటరిగా ఉన్నది మరియు తక్కువగా చొచ్చుకుపోయే p ఆర్బిటాల్లో ఉన్నది. కాబట్టి B అయనీకరణ శక్తి తక్కువ. కాబట్టి Be కంటే B కి తక్కువ IP ఉన్నది.

Exam Tips:

a) రెండవ పీరియడ్ IE₁: Li < B < Be < C < O < N < F < Ne; Be (2s² పూర్తి) > B (2p¹) కారణం: s ఎలక్ట్రాన్ ఎక్కువగా చొచ్చుకుపోతుంది.

 

Question 63: Mg కంటె Na IE₁ తక్కువ, కానీ Mg కంటే Na IE₂ ఎక్కువ – విశదీకరించండి.

Answer:

Mg 1s² 2s² 2p⁶ 3s² లోని 3s ఎలక్ట్రాన్లు జంటగా ఉన్నాయి. (3s ²) కాబట్టి బాహ్యతమ ఎలక్ట్రాన్, అనగా 3s ఎలక్ట్రాన్ జత గూడి ఉన్నది. అదీ గాక ఆ ఎలక్ట్రాన్ అధికంగా చొచ్చుకుపోయే s ఆర్బిటాల్లో ఉన్నది. కాబట్టి ఈ 3s ఎలక్ట్రాను తొలగించటానికి అధికశక్తి అవసరము. కాబట్టి Mg కు అయనీకరణశక్తి ఊహించిన దాని కన్నా అధికంగా ఉంటుంది.
Na⁺ అయానుకు స్థిరమైన 2s² 2p⁶ ఎలక్ట్రాన్ విన్యాసం కలదు. అందువల్ల Na⁺ నుండి ఎలక్ట్రాను తొలగించుటకు అధిక శక్తి అవసరము. అనగా Na కు IE₂ విలువ ఎక్కువగా ఉంటుంది. Mg⁺ కు స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం లేదు కనుక Mg IE₂ విలువ తక్కువ.

Exam Tips:

a) Na⁺ (2p⁶, ఉత్కృష్ట విన్యాసం) నుండి ఎలక్ట్రాన్ తీయడం కష్టం → IE₂(Na) ఎక్కువ; Mg కు 3s² జంట వల్ల IE₁ ఎక్కువ.

 

Question 64: ప్రాతినిధ్య గ్రూప్ మూలకాల IE గ్రూప్లో కిందకు తగ్గడానికి గల కారణాలు ఏమిటి ?

Answer:

ఒక గ్రూపులో పై నుండి క్రిందకి పోయే కొద్దీ పరమాణు సైజు పెరుగుతుంది. కనుక అయనీకరణ శక్తి తగ్గుతుంది. గ్రూపులో కేంద్రకావేశం పెరిగినా కూడా దానితోబాటు అంతర కక్ష్యల సంఖ్య పెరిగి ఆ కక్ష్యల పరిరక్షక ప్రభావం పెరుగుతుంది. అదీకాక పరమాణు సైజు పెరుగుతుంది. కాబట్టి బాహ్యతమ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది. అందువల్ల ఎలక్ట్రాన్ను తేలికగా తీసివేయవచ్చు. అంటే అయనీకరణ శక్తి గ్రూపులో క్రిందికి తగ్గుతుంది.

Exam Tips:

a) గ్రూపులో కిందికి: పరమాణు పరిమాణం, పరిరక్షక ప్రభావం పెరిగి కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది → IE తగ్గుతుంది.

 

Question 65: 13వ గ్రూప్ మూలకాల ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ విలువలు (KJ Mol ⁻¹) లలో

మూలకంBAlGaInTl
ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ (kJ mol⁻¹)801577579558589

సాధారణ క్రమం నుంచి ఈ విచలనాన్ని ఏ విధంగా విశదీకరిస్తారు ?

Answer:

B నుండి Al కు అయొనైజేషన్ విలువలో తగ్గుదలకు కారణం పరమాణు పరిమాణం పెరగడమే. ప్రథమ పరివర్తనా శ్రేణి మూలకాల తర్వాత గాలియం వస్తుంది.
గాలియంలోని 3d ఎలక్ట్రానులకు పరిరక్షక ప్రభావం తగ్గుతుంది. అందువల్ల పరమాణు పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా Al, Ga లు సమాన సైజు కలిగి ఉంటాయి. ఇదే విధంగా ఇండియంలో 4d ఎలక్ట్రానులకు కూడా పరిరక్షక ప్రభావం తక్కువ.
అందువల్ల Al, Ga మరియు ln లకు అయనీకరణ శక్తి దాదాపుగా సమానంగా ఉంటుంది. టాలియంలో 5d ఎలక్ట్రానులతోపాటు 4f ఎలక్ట్రానులు కూడా ఉంటాయి. 4f ఎలక్ట్రానులకు పరిరక్షక ప్రభావం తక్కువ. అందువల్ల టాలియం పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా Tl అయనీకరణ శక్తి Al, Ga, In ల కన్న ఎక్కువ.

Exam Tips:

a) B → Al తగ్గుదల: పెరిగిన పరిమాణం; Ga లో 3d, In లో 4d, Tl లో 4f బలహీన పరిరక్షణ కారణంగా IE కొద్దిగా పెరుగుతుంది; ఈ అసాధారణతను వివరించండి.

 

Question 66: ఆక్సిజన్ రెండవ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ, మొదటి ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ కంటె ధనాత్మకమా ? ఎక్కువ ఋణాత్మకమా? లేదా తక్కువ ఋణాత్మకమా ?
సమర్ధించండి.

Answer:

ఆక్సిజన్ మొదటి ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఋణాత్మకం. అంటే అవి : 1 ఎలక్ట్రాన్ను గ్రహించినప్పుడు శక్తి విడుదలవుతుంది. అనగా ΔH విలువ ఋణ గుర్తు కలిగి ఉంటుంది. ఏర్పడిన ఋణ అయానుకు మరొక ఎలక్ట్రాన్ కలుపవలెనన్న, ఋణావేశానికి, కలిపెడి ఎలక్ట్రాన్కు మధ్య వికర్షణలు అధికంగా ఉండి దాన్ని నిరోధిస్తాయి. కాబట్టి X– అయానుకు మరొక ఎలక్ట్రాను కలుపవలెనన్న శక్తి అవసరమవుతుంది. అనగా ΔH విలువ ధనాత్మకమవుతుంది. అనగా EA₂ విలువ గ్రహించిన శక్తి అవుతుంది.
O + e⁻ → O⁻; ΔH = – 142 kJ mol⁻¹
O⁻ + e⁻ → O²⁻; ΔH = + 702 kJ mol⁻¹

Exam Tips:

a) O → O⁻ ఉష్ణమోచకం (–142 kJ mol⁻¹); O⁻ → O²⁻ ఉష్ణగ్రాహకం (ధనాత్మకం) ఎందుకంటే ఋణావేశాల వికర్షణ; ΔH గుర్తులను సరిగ్గా రాయండి.

 

Question 67: ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ, ధన విద్యుదాత్మకతల మధ్య ప్రాథమికమైన తేడా ఏమిటి ?

Answer:

వాయుస్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ ను గ్రహించినప్పుడు విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటారు.
X(g) + e⁻ → X⁻(g); ΔH = –ve
ధనవిద్యుదాత్మకత ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావాన్ని తెలుపుతుంది. లోహాలు ఎలక్ట్రాన్ కోల్పోయి ధన అయాన్లుగా మారతాయి.
ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఎక్కువగా ఉన్న మూలకాలకు ఎలక్ట్రాన్ గ్రహించే స్వభావం ఉంటుంది. అటువంటి మూలకాలు అలోహ ధర్మాలను చూపుతాయి. అధిక ధన విద్యుదాత్మకత మూలకాలు బలమైన క్షయకారుణులుగాను, ఎలక్ట్రాన్గ్రాహ్య ఎంథాల్పీలు అధికంగా ఉన్న మూలకాలు ఆక్సీకారుణులు గాను ప్రవర్తిస్తాయి.

Exam Tips:

a) EA = వాయుస్థితి పరమాణువు ఎలక్ట్రాన్ గ్రహించినప్పుడు విడుదలయ్యే శక్తి; ధన విద్యుదాత్మకత = ఎలక్ట్రాన్లు కోల్పోయే ప్రవృత్తి; ఒకటి అలోహ, మరొకటి లోహ లక్షణాన్ని సూచిస్తుంది.

 

Question 68: ఒకే మూలకపు రెండు ఐసోటోప్లు IE₁ లు ఒకేలా ఉంటాయో లేదో ఊహించగలరా ? సమర్థించండి.

Answer:

ఒక మూలకపు ఐసోటోపులు ఒకే IE విలువలను కలిగి ఉంటాయి. ఐసోటోపుల పరమాణు సంఖ్యలు సమానం కనుక అవి ఒకే కేంద్రక ఆవేశాన్ని కలిగి ఉంటాయి. వాటి పరమాణు పరిమాణాలు సమానం. కనుక ఐసోటోపులలోని ఎలక్ట్రానులపై కేంద్రక ఆకర్షణ సమానం. కనుక ఐసోటోపుల IE₁ లు సమానం.

Exam Tips:

a) ఐసోటోపులకు పరమాణు సంఖ్య (కేంద్రక ఆవేశం), ఎలక్ట్రాన్ విన్యాసం సమానం కాబట్టి IE₁ సమానం; ద్రవ్యరాశి తేడా పెద్దగా ప్రభావం చూపదు.

 

Question 69: గ్రూప్ 1 మూలకాల చర్యాశీలత పెరిగే క్రమం Li < Na < K < Rb <Cs, అయితే గ్రూప్17 మూలకాలకు ఈ క్రమం F > Cl > Br > I. విశదీకరించండి.

Answer:

గ్రూప్ I మూలకాల ధర్మాలు ధనవిద్యుదాత్మకత మీద ఆధారపడినవి. ఇవి లోహాలు. లోహ స్వభావం Li నుండి Cs కు పెరుగుతుంది. దీనికి కారణం Li నుండి Cs కు అయనీకరణశక్తి తగ్గడమే.
Li < Na < K < Rb < Cs గ్రూపు 17 మూలకాలు హాలోజన్లు. ఇవి అలోహాలు. వీటి ధర్మాలు ఋణ విద్యుదాత్మకత పై ఆధారపడినవి. ఇవి ఎలక్ట్రాను గ్రహించి ఋణ అయాన్ గా మారతాయి. ఫ్లోరిన్‌కు ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువయినప్పటికి, ఋణ విద్యుదాత్మకత విలువ ఎక్కువ. అధిక ఋణ విద్యుదాత్మకత మరియు ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీలు అధికంగా ఉన్నందువల్ల హాలోజన్లు అధిక చర్యాశీలత కలవి. కాని ఈ విలువలు F నుండి I కు తగ్గడం వల్ల చర్యాశీలత F నుండి 1 కు తగ్గుతుంది. F > Cl > Br > I

Exam Tips:

a) గ్రూపు 1 చర్యాశీలత IE తగ్గడంతో (లోహ స్వభావం) పెరుగుతుంది; గ్రూపు 17 చర్యాశీలత EN, EA ఎక్కువ ఉండటంతో F నుండి I కు తగ్గుతుంది.

 

Question 70: కింద ఇచ్చిన బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకం స్థానాన్ని తెలపండి.
a) ns² np⁴ (n = 3)
b) (n − 1) d² ns² (n = 4)

Answer:

a) 3s² 3p⁴ (n = 3)
n = 3 అయితే మూలకం మూడవ పీరియడ్కు చెందుతుంది. బాహ్యకర్పరంలో ఆరు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కనుక అది 6వ (VIA; 16వ) గ్రూపు మూలకం. మూలకం సల్ఫర్.
b) 3d² 4s² (n = 4) n = 4 కనుక మూలకం 4వ పీరియడ్కు చెందినది. (n – 1)d ఆర్బిటాల్‌లో రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి అది d బ్లాకుకు చెందినది. బాహ్య విన్యాసం 3d² 4s² మూలకం Titanium. గ్రూపు IV B.

Exam Tips:

a) (a) 3s² 3p⁴ → 3వ పీరియడ్, VIA (S); (b) 3d² 4s² → 4వ పీరియడ్, IVB (Ti); విన్యాసాన్ని బట్టి బ్లాకు కూడా చెప్పండి.

 

Question 71: కింద ఉన్న జంట మూలకాల కలయికతో ఏర్పడగల స్థిర యుగ్మ సమ్మేళనాల ఫార్ములాలను నిర్దేశించండి.
a) Li, O
b) Mg, N
c) Al, I
d) Si, O
e) P, Cl
f) పరమాణు సంఖ్య 30 గల మూలకం, Cl

Answer:

a) లిథియం వేలన్సీ 1. ఆక్సిజన్ వేలన్సీ 2. కనుక సమ్మేళనం ఫార్ములా Li₂O
b) మెగ్నీషియం వేలన్సీ 2. నైట్రోజన్ వేలన్సీ 3. కనుక ఫార్ములా Mg₃N₂
c) అల్యూమినియం వేలన్సీ 3. అయొడిన్ వేలన్సీ 1. ఫార్ములా AlI₃
d) సిలికాన్ వేలన్సీ 4. ఆక్సిజన్ వేలన్సీ 2. ఫార్ములా SiO₂
e) ఫాస్ఫిరస్ వేలన్సీలు 3 మరియు 5. కాని +3 ఆక్సీకరణ స్థితి స్థిరమైనది. ఫార్ములా PCl₃
f) Z = 30 గల మూలకం Zn. దీని వేలన్సీ 2. ఫార్ములా ZnCl₂

Exam Tips:

a) ఫార్ములా కనుక్కోవడానికి వేలన్సీలను అడ్డంగా మార్చండి: Mg (2), N (3) → Mg₃N₂; Al (3), I (1) → AlI₃; Z = 30 → Zn (2) → ZnCl₂.

 

Question 72: గ్రూప్ , పీరియడ్లో లోహ స్వభావంలో మార్పుపై వివరణ ఇవ్వండి.

Answer:

ఎలక్ట్రాన్లను వదలుకొని ధనావేశిత అయానులను (కాటయాన్లు) ఏర్పరచే మూలకాన్ని లోహం అంటారు.
గ్రూపులో : పై నుండి క్రిందకు వెళ్లితే, ఎలక్ట్రాన్లు కోల్పోయి ధనావేశ అయాన్లుగా మారే స్వభావం పెరుగుతుంది. అంటే లోహ స్వభావం పెరుగుతుంది. లేదా అలోహ స్వభావం తగ్గుతుంది. దీనికి కారణం, గ్రూపులో పరమాణు సైజు పై నుండి క్రిందకు పెరగడమే. పరమాణు సైజు పెరిగే కొద్దీ, అయనీకరణ శక్తి తగ్గి పరమాణువు సులభంగా ఎలక్ట్రాన్లు కోల్పోయి కాటయాన్ మారుతుంది. అనగా లోహ స్వభావం పెరుగుతుంది.
ప్రతి పీరియడ్ బలమైన లోహం (క్షారలోహం)తో మొదలై, బలమైన అలోహం (హాలోజన్)తో అంతమవుతుంది. అంటే పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్లిన కొద్దీ మూలకాలలో లోహ ధర్మం తగ్గి అలోహ ధర్మం పెరుగుతుంది.
కారణం : పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ, పీరియడ్లో ఎడమ నుండి కుడికి పరమాణు సైజు తగ్గుతుంది. కాబట్టి అయనీకరణ శక్తి పెరిగి, మూలకం ఎలక్ట్రానులను సులభంగా కోల్పోదు. అది ఎలక్ట్రాన్లను పొందడానికి అపేక్ష కనబర్చుతుంది. అంటే లోహతత్వం తగ్గి అలోహతత్వం పెరుగుతుంది.

Exam Tips:

a) గ్రూపులో కిందికి లోహ స్వభావం పెరుగుతుంది (IE తగ్గడం); పీరియడ్‌లో కుడికి తగ్గుతుంది (IE పెరగడం, EA పెరగడం); రెండు ధోరణులకూ కారణం రాయండి.

 

Question 73: గ్రూప్ – 7లో కోవలెంట్ వ్యాసార్థం ఏ విధంగా పెరుగుతుంది ?

Answer:

పరివర్తన మూలకాలలో 7వ గ్రూపు మూలకాలైన మాంగనీస్, టెక్నీషియం మరియు రీనియం (Manganese, technicium and Rhenium) లలో సమయోజనీయ వ్యాసార్ధం Mn to Tc కు పెరుగుతుంది. మాంగనీసులో బాహ్య కర్పరం నాలుగు టెక్నిషియంలో బాహ్య కర్పరం 5. కక్ష్యల సంఖ్య టెక్నీషియం (technicium) నుండి రీనియం (Rhenium) కు 5 నుండి 6కు పెరుగుతుంది. కాని లాంథనైడ్ సంకోచం కారణంగా Tc, Re లకు దాదాపు సమాన వ్యాసార్థం ఉంటుంది.

Exam Tips:

a) Mn → Tc కు వ్యాసార్ధం పెరుగుతుంది, కానీ Tc ≈ Re (లాంథనైడ్ సంకోచం వల్ల); ఈ చివరి వాక్యమే కీలకం.

 

Question 74: 3వ పీరియడ్లో ఏ మూలకానికి అత్యధిక IE₁ ఉన్నది ? ఈ పీరియడ్లో IE₁ లో మార్పును విశదీకరించండి.

Answer:

ప్రతి పీరియడ్లోను చివరి మూలకానికి అనగా జడవాయు మూలకానికి అత్యధిక అయొనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. కనుక ఆ మూలకం ఆర్గాన్.
3వ పీరియడ్లో IE₁ మార్పు : 3వ పీరియడ్లో IE₁ పెరిగే క్రమం Na < Al < Mg < Si < S < P < Cl < Ar
Mg కు IE₁ విలువ Al IE₁ కన్నా ఎక్కువ:
కారణం : మెగ్నీషియం ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p⁶ 3s² బాహ్య కర్పరంలో 3s ఆర్బిటాల్లోని ఎలక్ట్రానులు జతకూడినవి. అంతేకాక S – ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లకు చొచ్చుకుపోయే సామర్థ్యం (Penetrating power) ఎక్కువ. అందువల్ల ఆ ఎలక్ట్రాన్ను తొలగించడానికి అధిక శక్తి అవసరం. కనుక Mg కు IE₁ ఎక్కువ.
సల్ఫర్ కన్నా ఫాస్ఫరస్ IE₁ ఎక్కువ : ఫాస్ఫరస్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p⁶ 3s² 3pₓ¹ 3p_y¹ 3p_z¹ సగం నిండిన ఆర్బిటాల్ ఉండుట వలన ఆ ఎలక్ట్రాన్ విన్యాసం స్థిరమైనది. అందువల్ల ఫాస్ఫరస్ IE₁ ఎక్కువ.

Exam Tips:

a) 3వ పీరియడ్ IE₁ క్రమం: Na < Al < Mg < Si < S < P < Cl < Ar; ఉల్లంఘనలు: Mg > Al (3s² నిండింది), P > S (3p³ సగం నిండింది).

 

Question 75: మూలకం సంయోజకత (valency) అంటే ఏమిటి ? మూడో పీరియడ్లో హైడ్రోజన్ పరంగా ఇది ఎట్లా మారుతుంది?

Answer:

‘సంయోజకత’ (వేలన్సీ) అనగా ‘కలయిక శక్తి’. ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో లేదా ఎన్ని క్లోరిన్ పరమాణువులతో మూలకపు ఒక పరమాణువు సంయోగం చెందుతుందో, ఆ సంఖ్యయే ఆ మూలకపు వేలన్సీ.
ఉదా : NH₃ లో ఒక నైట్రోజన్ పరమాణువు, మూడు H లతో సంయోగం చెందింది కాబట్టి N యొక్క సంయోజకత = 3.
ఒకే గ్రూపులోని మూలకాలన్నీ సాధారణంగా ఒకే వేలన్సీ కల్గి ఉంటాయి.
‘s’ బ్లాకు మూలకాల వేలన్సీ = గ్రూపు సంఖ్య
p బ్లాకు మూలకాల వేలన్సీ = గ్రూపు సంఖ్య లేదా (8 – గ్రూపు సంఖ్య)
హైడ్రోజన్ పరంగా వేలన్సీ మారే విధానం: ప్రాతినిధ్య మూలకాలలో ఎడమ నుండి కుడికి వేలన్సీ 1 నుండి 4 వరకు పెరిగి మరల 1 వరకు తగ్గుతుంది.
3వ పీరియడ్ మూలకాల వేలన్సీలు:

మూలకం పేరుNaMgAlSiPSCl
హైడ్రోజన్ పరంగా వేలన్సీ1234321
సమ్మేళనంNaHMgH₂AlH₃SiH₄PH₃H₂SHCl

Exam Tips:

a) సంయోజకత = కలిసే H (లేదా Cl) పరమాణువుల సంఖ్య; 3వ పీరియడ్ H పరంగా: 1, 2, 3, 4, 3, 2, 1.

 

Question 76: కర్ణ సంబంధం అంటే ఏమిటి ? కర్ణ సంబంధం గల ఒక మూలకాల జంటను తెలపండి. అవి ఈ సంబంధాన్ని ఎందుకు చూపిస్తాయి ?

Answer:

ఇది రెండవ మరియు మూడవ పీరియడ్లకు సంబంధించినది. “ఆవర్తన పట్టికలో రెండో పీరియడ్లోని ఒక మూలకానికి, మూడో పీరియడ్లోని తర్వాత గ్రూపులోని రెండో మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. ఈ సంబంధాన్ని కర్ణ సంబంధం అంటారు. ఉదా : (Li, Mg); (Be, Al); (B, Si)

గ్రూపుIIIIIIIV
2వ పీరియడ్LiBeBC
3వ పీరియడ్NaMgAlSi

కర్ణ సంబంధం గల జంటలు: Li – Mg, Be – Al, B – Si

Exam Tips:

a) కర్ణ సంబంధ ఉదాహరణ Li–Mg; కారణం: ఆవేశ / వ్యాసార్ధ నిష్పత్తి, ఎలక్ట్రాన్ ఋణ విద్యుదాత్మకతలు సమానంగా ఉండటం అని రాయండి.

 

Question 77: లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి ? వాటి ఫలితాలు ఏమిటి ?

Answer:

లాంథనైడులలో ఎడమ నుండి కుడికి వాటి పరిమాణాలు నిలకడగా తగ్గుతూ వస్తాయి. పరిమాణంలో ఈ తగ్గుదలను, లాంథనైడ్ సంకోచమంటారు. Ce నుంచి Lu వరకు ఈ తగ్గుదల సుమారు 0.2 Å ఉన్నది.
లాంథనైడులలో భేదాత్మక ఎలక్ట్రాన్లు (n – 2) f ఉపకక్ష్యలో ప్రవేశిస్తుంది. వితరణం చెందిన ఆకృతుల మూలంగా, f ఆర్బిటాళ్లు, కేంద్రకాకర్షణ నుండి వేలన్సీ ఎలక్ట్రాన్లకు తగు పరిరక్షణ కల్పించలేవు. ఆ కారణంగా కేంద్రక ఆకర్షణ వలన పరమాణు సైజులు ఎడమ నుండి కుడికి తగ్గుతాయి.
ఈ పరమాణు సైజు తగ్గుదల, లాంథనైడ్ పరమాణువుల (Ln) కన్నా వాటి +3 అయాన్ల (Ln³⁺) లో క్రమపద్ధతిలో ఉంటుంది.

ఫలితాలు:
1. లాంథనైడ్ సంకోచం వలన మూలకాల ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం, గట్టిదనం Ce నుండి Lu వరకు పెరుగుతాయి.
2. 4d మరియు 5d శ్రేణులలోని గ్రూపుల మూలకాలలో అధిక సారూప్యతలు గోచరిస్తాయి. ఈ సారూప్యత, 3d మరియు 4d శ్రేణుల గ్రూపుల మూలకాలలో కన్పించదు. దీనికి కారణం, “లాంథనైడ్ సంకోచము”.
ఉదా : (Zr, Hf); (Nb, Ta); (Mo, W) మూలకాల జంటల సైజులు దాదాపు ఒకటే ఉంటాయి. కాబట్టి ఈ మూలకాల జంటల రసాయన ధర్మాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ జంటలలో మొదటిది 4d మరియు రెండవది 5d మూలకము.

Exam Tips:

a) లాంథనైడ్ సంకోచం కారణం: 4f ఎలక్ట్రాన్ల బలహీన పరిరక్షణ; ఫలితాలు: Zr, Hf ల వ్యాసార్ధాలు సమానం, 4d, 5d మూలకాల సారూప్యత; బేసిక్ లక్షణం తగ్గుదల కూడా చెప్పవచ్చు.

 

Question 78: లిథియం ప్రథమ IE₁ = 5.41 eV. Cl ఎలక్ట్రాన్ అఫినిటీ = –3.61 eV. Li(g) + Cl(g) → Li⁺(g) + Cl⁻(g) ఈ చర్య ΔH ను kJ mol⁻¹ లో లెక్కించండి.

Answer:

Li(g) → Li⁺(g) + e⁻; ΔH = + 521.98 kJ/mol
Cl(g) + e⁻ → Cl⁻(g); ΔH = – 348.29 kJ/mol
కలుపగా (adding):
Li(g) + Cl(g) → Li⁺(g) + Cl⁻(g); ΔH = + 173.69 kJ/mol
eV లలో : ΔH = 5.41 – 3.61 = 1.80 eV
1 eV = 96.49 kJ mol⁻¹ కనుక ΔH = 1.80 × 96.49 ≈ 173.7 kJ mol⁻¹

Exam Tips:

a) ΔH (eV) = IE₁ + EA = 5.41 – 3.61 = 1.80 eV; 1 eV = 96.49 kJ mol⁻¹ గుణించి kJ mol⁻¹ లో రాయండి → ≈ 173.7.

 

Question 79: Cl + e⁻ → Cl⁻ ప్రక్రియలో ఒక అవగాడ్రో సంఖ్యలోని పరమాణువులకు విడుదలయ్యే శక్తితో Cl → Cl⁺ + e⁻ ప్రక్రియలో ఎన్ని Cl పరమాణువులను అయనీకరణం చెందించవచ్చు ?

Answer:

వాయుస్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు ఎలక్ట్రాన్‌ను గ్రహించినప్పుడు విడుదలయ్యే శక్తి ఎలక్ట్రాన్ అఫినిటీ.
Cl + e⁻ → Cl⁻; EA = 3.6 eV/atom
అవగాడ్రో సంఖ్యలో Cl పరమాణువులు ఎలక్ట్రాన్లను గ్రహించినప్పుడు విడుదలయ్యే శక్తి = 6.02 × 10²³ × 3.6 = 21.67 × 10²³ eV
క్లోరిన్ అయనీకరణ శక్తి : Cl → Cl⁺ + e⁻, IE = 13.0 eV
21.67 × 10²³ eV తో అయనీకరణం చెందించగల క్లోరిన్ పరమాణువుల సంఖ్య
\( = \frac{21.67 \times 10^{23}}{13.0} = 1.667 \times 10^{23} \)

Exam Tips:

a) ఒక మోల్ లో విడుదలయ్యే శక్తిని (N_A × EA) ను IE (13 eV) తో భాగిస్తే అయనీకరణం చెందే పరమాణువుల సంఖ్య వస్తుంది → ≈ 1.67 × 10²³.

 

Question 80: Cl ఎలక్ట్రాన్ అఫినిటీ 3.7 eV. వాయుస్థితిలో 2 g క్లోరిన్ పరమాణువులు పూర్తిగా Cl⁻ అయాన్లుగా మారినప్పుడు kcal లలో ఎంత శక్తి విడుదల అగును ? (1 eV = 23.06 kcal mol⁻¹)

Answer:

1 eV = 23.06 kcal/mol
ఒక మోల్ క్లోరిన్ పరమాణువులు Cl⁻ అయాన్లుగా మారినప్పుడు విడుదలయ్యే శక్తి = 3.7 × 23.06 = 85.32 kcal/mol
అంటే 35.5 g Cl విడుదల చేసే శక్తి = 85.32 kcal
2 g క్లోరిన్ విడుదల చేసే శక్తి \( = \frac{2 \times 3.7 \times 23.06}{35.5} = 4.807 \) kcal

Exam Tips:

a) 1 eV = 23.06 kcal mol⁻¹ ఉపయోగించి ముందు మోల్‌కు శక్తి (3.7 × 23.06), తరువాత 2/35.5 మోల్స్‌కు గుణించండి → ≈ 4.81 kcal.

 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

Question 81: మెండలీవ్ మూలకాల వర్గీకరణ గురించి రాయండి.

Answer:

మెండలీవ్ మరియు లోథర్ మేయర్లు మూలకాలను వాటి పరమాణు భారాల ఆధారంగా వర్గీకరించారు. మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మూలక ధర్మాలు ఆవర్తన మవుతాయని మెండలీవ్ చూపాడు. మెండలీవ్ ఆవర్తన నియమం : “మూలకాల, వాటి సమ్మేళనాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు”.
అప్పటి వరకు కనుగొన్న 65 మూలకాలను మెండలీవ్ తన ఆవర్తన పట్టికలో అమర్చాడు. మూలకాలను పట్టికలో అమర్చేటప్పుడు, మెండలీవ్ వాటి పరమాణుభారాలనే గాక వాటి రసాయన ధర్మాలను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. ఆవర్తన నియమం వివరణ : మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో వ్రాసినప్పుడు, సదృశమైన పోలికలు గల మూలకాలు, నిర్దిష్ట వ్యవధుల తర్వాత మరల మరల ఆవర్తనమవుతాయి. కాబట్టి ఈ అమరికకు ‘ఆవర్తన పట్టిక’ అని పేరు పెట్టారు. ప్రకృతిలో రోజులు, వారాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాల మొ||నవి నిర్దిష్ట కాలవ్యవధుల తర్వాత ఆవర్తనం చెందడంతో, దీన్ని పోల్చవచ్చు.
మెండలీవ్ ఆవర్తన పట్టిక : మెండలీవ్ ప్రతి మూలకానికి ఒక సంఖ్యను గుర్తుగా ఇచ్చాడు. అది దాని పరమాణు సంఖ్య. మూలకాలను అడ్డశ్రేణులలోను, నిలువుగడుల్లోను అమర్చాడు. అడ్డశ్రేణులను ‘పీరియడ్’లని, నిలువుగళ్లను ‘గ్రూపు’లని మెండలీవ్ తెల్పినాడు. మెండలీవ్ యొక్క సవరింపబడ్డ సంక్షిప్త ఆవర్తన పట్టికలో 9 గ్రూపులు ఉన్నాయి. అవి, I నుండి VIII వరకు మరియు సున్నా (0) గ్రూపులు. మొదటి ఏడు గ్రూపులను A మరియు B అనే ఉపగ్రూపులుగా విభజించాడు. ఈ పట్టికలో 7 పీరియడ్లున్నాయి.
VIIIవ గ్రూపులో మూడు త్రికాలు (Triads, ట్రయడ్లు) ఉన్నాయి. అవి (Fe, Co, Ni); (Ru, Rh, Pd) మరియు (Os, Ir, Pt) పరివర్తన మూలకాలు.
మెండలీవ్ గుర్తించిన విషయాలు:
1. మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణక్రమంలో వ్రాసినప్పుడు, వాటి ధర్మాలలో ఆవర్తన ప్రదర్శిస్తాయి.
2. a) ఒకే రకమైన ధర్మాలున్న మూలకాలకు దాదాపు సమాన పరమాణు భారాలుంటాయి.
ఉదా : Fe(56), CO(59), Ni(59)
Os (190), Ir (192), Pt (195)
(b) పరమాణు భారాలు స్థిరంగా పెరుగుతుంటాయి.
ఉదా : IA గ్రూపు మూలకాలలో K(39), Rb(85), CS (133) (తేడా సుమారు 47) 3. మూలకపు గ్రూపు సంఖ్య, ఆ మూలకపు వేలెన్సీని తెలుపుతుంది.
4. అల్ప పరమాణు భారాలు గల మూలకాలన్నీ ప్రకృతిలో విరివిగా దొరుకుతాయి. ఉదా : H, C, O, N, Si, S మొ||నవి. వీటిని విలక్షణ మూలకాలంటారు. వీటికి పరమాణు భారాలు తక్కువగా ఉంటాయి.
5. ఆసన్న పరమాణువుల పరమాణు ధర్మాల ఆధారంగా, ఒక మూలకపు సరియైన పరమాణు భారాన్ని లెక్క గట్టవచ్చు. ఆ విధంగా Be, ln, U ల పరమాణుభారాలను సవరించారు.
మెండలీవ్ ఆవర్తన పట్టిక విశిష్టతలు:
1) తర్వాత కాలంలో ఏర్పరచబడ్డ అనేక రకాల ఆవర్తన పట్టికలకు; మూలాధారం మెండలీవ్ ఆవర్తన పట్టికయే.
2) ఆసన్న మూలకాలు, వాటి సమ్మేళనాలను అధ్యయనం చేసి మెండలీవ్ కొన్ని తెలియని మూలకాల ధర్మాలు చెప్పాడు. మెండలీవ్ ఊహించిన ఆ మూలకాలు తర్వాత కనుక్కోబడ్డాయి. మెండలీవ్ ఊహించిన మూలకాల లక్షణాలు, కనుక్కోబడ్డ మూలకాల లక్షణాలు చాలా ఖచ్చితంగా సరిపోయాయి.
ఉదా : ఎకా బోరాన్ (స్కాండియం), ఎకా సిలికాన్ (జెర్మేనియం), ఎకా అల్యూమినియం (గాలియం) మొ||నవి.
3) మెండలీవ్ కాలానికి గ్రూపు “0” మూలకాలు తెలియవు. తర్వాత వాటిని కాలక్రమేణా కనుగొన్నారు. ఈ మూలకాలు మెండలీవ్ పట్టికలో సరియైన స్థానంలో అమరాయి.
4) ఆధునిక మెండలీవ్ ఆవర్తన పట్టికలో పరమాణుభారాల వరుసలు జతల మూలకాల్లో అపక్రమంలో ఉన్నాయి. అవి ఆర్గాన్ – పొటాషియం, కోబాల్టు – నికెల్, టెల్యూరియం – అయొడిన్ మరియు థోరియం – ప్రోటాక్టినియంలు. ఈ జంటలలో రెండవ మూలకం కన్నా మొదటి మూలకం పరమాణు భారం అధికము. వీటిని ‘అసంగత జంట’ అంటారు. కాని రసాయన ధర్మాలు మరియు పరమాణు సంఖ్యలను బట్టి చూస్తే, ఈ అమరిక సరియైనదేనని తెలుస్తుంది.
మెండలీవ్ ఆవర్తన పట్టిక అవధులు:
1. కొన్ని మూలకాల స్థానాలు వాటి రసాయన ధర్మాలకు అనుగుణంగా లేవు. ఉదా : నాణెలోహాలైన Cu, Ag, Au లను క్షారలోహాలైన K, Rb, CS లో కలిపి I గ్రూపులో ఉంచారు. నాణెలోహాలకు, క్షారలోహాలకు ధర్మాలలో చాలా భేదమున్నది. ఈ రెండు రకాల మూలకాలకు వేలన్సీ మాత్రం సమానంగా ఉన్నది (వేలన్సీ = 1); అందువల్లనే వాటిని ఒకే గ్రూపులో ఉంచారు.
2. విరళమృత్తిక (లాంథనైడ్)లను ఈ పట్టికలో ఒకే స్థానంలో ఉంచారు.
3. హైడ్రోజన్ స్థానం సంతృప్తికరంగా లేదు. ఇది అటు క్షారలోహాలను (IA) ఇటు హేలోజన్ అలోహాలను (VIIA) పోలిన ధర్మాలు చూపుతుంది.

Exam Tips:

a) మెండలీవ్ పట్టిక: గ్రూపులు I–VIII, 0 (9), పీరియడ్లు 7; గొప్పదనాలు (ఎకా మూలకాల అంచనా), అవధులు (Cu–K అమరిక, హైడ్రోజన్ స్థానం) రెండూ రాయండి.

 

Question 82: తెలియని మూలకం ధర్మాలను, దాని పక్కనున్న మూలకాల ధర్మాల అధ్యయనం వల్ల, నిర్దేశించవచ్చు – ఒక ఉదాహరణతొ సమర్థించండి.

Answer:

మూలకాలను, వాటి సమ్మేళనాలను అధ్యయనం చేసి, మెండలీవ్ కొన్ని తెలియని మూలకాల ధర్మాలను చెప్పగలిగాడు.. ఆవర్తన పట్టికను ఏర్పరచిననాటికి, స్కాండియం, గాలియం, జెర్మేనియం మొ॥ కొన్ని మూలకాలు ఆవిష్కరింపబడలేదు. మెండలీవ్ ఆ మూలకాల ధర్మాలను ఊహించడమేగాక ఆ మూలకాలకు ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్ మొ॥ పేర్లు కూడా పెట్టాడు. పైన చెప్పిన మూడు మూలకాలు, మెండలీవ్ కాలంలోనే కనుక్కోబడ్డాయి. విశేషమేమంటే ప్రయోగాత్మకంగా కనుగొన్న ఆ మూలకాల ధర్మాలు, మెండలీవ్ ఊహించిన ధర్మాలు ఖచ్చితంగా సరిపోయాయి.
ఉదాహరణ : ఎకా అల్యూమినియం లేదా గాలియం.

క్ర.సం.ధర్మంమెండలీవ్ ఊహించిన ధర్మాలు (ఎకా అల్యూమినియం)ప్రయోగపూర్వకంగా తెలిసిన ధర్మాలు (గాలియం)
1మూలకం పేరుఎకా అల్యూమినియంగాలియం
2పరమాణు భారం6870
3సాంద్రత5.90 g/cc5.94 g/cc
4ద్రవీభవన స్థానంతక్కువగా ఉండాలి30°C
5ఆక్సైడ్ ఫార్ములా(Eka-Al)₂O₃Ga₂O₃
6క్లోరైడ్ ఫార్ములా(Eka-Al)Cl₃GaCl₃

ఇవి గాక మెండలీవ్ మరికొన్ని మూలకాలను ఊహించి, ధర్మాలు తెలిపాడు.

Exam Tips:

a) ఎకా అల్యూమినియం (గాలియం) ఉదాహరణ: పరమాణు భారం 68 → 70, సాంద్రత 5.90 → 5.94 g/cc; పట్టిక రూపంలో ఊహించిన, నిర్ణయించిన విలువలు పోల్చండి.

 

Question 83: విస్తృత ఆవర్తన పట్టిక నిర్మాణాన్ని తెలపండి.

Answer:

మూలకానికి విలక్షణమైన ధర్మం పరమాణు సంఖ్యగాని పరమాణు భారం కాదని మోస్లే ప్రయోగాత్మకంగా నిర్ణయించారు. అనగా మూలక ధర్మాలు వాటి పరమాణు సంఖ్యతో మారుతాయి. అప్పుడు ఆవర్తన నియమాన్ని సవరించారు. “మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు”.
మూలకాల ధర్మాలు, పరమాణు సంఖ్య కన్నా, పరమాణువు ఎలక్ట్రాన్ నిర్మితిపై అధికంగా ఆధారపడతాయని తెలియడంతో, మరొక మారు ఆవర్తన సిద్ధాంతమును సవరించారు. నూతన ఆవర్తన నియమం ప్రకారం “మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు’. మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారం చేసుకొని నీల్బోర్ విస్తృతావర్తన పట్టికను నిర్మించారు. విస్తృత ఆవర్తన పట్టిక యొక్క ముఖ్యమైన లక్షణాలు :
1. పరమాణు సంఖ్య ఆధారంగా ఈ పట్టిక తయారుచేయబడింది.
2. మూలకాల ధర్మాలలోని పోలికలను, భేదాలను మరియు మార్పులను ఈ పట్టిక ప్రతిఫలిస్తుంది.
3. ఈ పట్టికలోని విషయాలను గ్రహించడం, గుర్తుంచుకోవడం, తిరిగి తెలియజేయడం సులభము.
4. పట్టికలోని నిలువు గళ్ళను గ్రూపులని, అడ్డ శ్రేణులను పీరియడ్లని పిలుస్తారు. 5. ఈ పట్టికలో 7 పీరియడ్లున్నాయి. మొదటి పీరియడ్లో 2, రెండవ మరియు మూడవ పీరియడ్లో 8 చొప్పున, నాల్గు మరియు ఐదవ పీరియడ్లో 18 చొప్పున మూలకాలున్నాయి. ఆరవ పీరియడ్లో 32 ఉన్నాయి. ఏడవ పీరియడ్లో కూడా 32 మూలకాలు (Z = 87 నుండి 118 వరకు) ఉన్నాయి; ఈ పుస్తకం రాసిన కాలంలో ఇది అసంపూర్ణంగా ఉండేది.
6. 1వ పీరియడ్ : అతి పొట్టిది
2, 3 పీరియడ్లు : పొట్టివి
4, 5 పీరియడ్లు : పొడవైనవి.
6వ పీరియడ్ : అతి పొడవైనది
7వ పీరియడ్ : అసంపూర్ణము
7. ఈ పట్టికలో 18 గ్రూపులున్నాయి. అవి వరుసగా IA, IIA, IIIB, IVB, V B, VI B, VII B, VIII (దీనిలో 3), IB, IIB, IIIA, IV A, V A, VI A, VIIA మరియు ‘0’ గ్రూపులు. 8. అన్ని A గ్రూపు లలోని మూలకాలను ప్రాతినిధ్య లేదా సాధారణ (normal) మూలకాలంటారు.
9. అన్ని B గ్రూపు మూలకాలను పరివర్తన మూలకాలంటారు.
10. పట్టిక కుడి చివరన ‘0’ గ్రూపులో జడవాయువులను ఉంచారు. వీటికి స్థిరమైన ఎలక్ట్రాన్ అష్టక నిర్మాణం ns² np⁶ వేలన్సీ కక్ష్యలో ఉంటుంది. (Heకు 1s ²) 11. మెండలీవ్ ఆవర్తన పట్టికలోని పొట్టి పీరియడ్లను విడగొట్టినారు. పొడుగు పీరియడ్లో మధ్యలో పరివర్తన మూలకాలను చేర్చి, పీరియడ్ను విస్తృతపరచారు.
12. ప్రధాన పట్టిక నుండి వేరుగా, దిగువ భాగంలో, రెండు శ్రేణులలో లాంథనైడు మరియు ఆక్టినైడులనుంచారు.
13. భేదపరచే ఎలక్ట్రాన్ స్థానాన్ని బట్టి, మూలకాలను నాల్గు బ్లాకులుగా విభజింపవచ్చు. అవి s, p, d, మరియు f బ్లాకులు. భేదపరచే ఎలక్ట్రానును s ఉపస్థాయిలో గల మూలకాలు S బ్లాకుకు, p ఉపస్థాయిలో గల మూలకాలు p బ్లాకుకు చెందుతాయి. ఇదే విధంగా d ఉపస్థాయిలో గల మూలకాలు d బ్లాకుకు, f ఉపస్థాయిలో గల మూలకాలు f బ్లాకుకు చెందుతాయి.
14. అసంపూర్తిగా మరియు పూర్తిగా నిండిన ఎలక్ట్రాన్ కక్ష్యల ఆధారంగా, మూలకాలను నాలుగు రకాలుగా విభజింపవచ్చు. అవి –
1. మొదటి రకం మూలకాలు : జడవాయువులు – బాహ్యతమ కక్ష్య (n) నిండి ఉంటుంది.
2. రెండవ రకం మూలకాలు : బాహ్యతమ కక్ష్య అసంపూర్ణంగా నిండి ఉంటుంది. దీనిలో S బ్లాకు మరియు ‘0’ గ్రూపు తప్ప మిగతా p బ్లాకు మూలకాలు ఉంటాయి. ఇవి ప్రాతినిధ్య మూలకాలు.
3. మూడవ రకం మూలకాలు : బాహ్య రెండు కక్ష్యలు అనగా n మరియు (n – 1) కక్ష్యలు అసంపూర్ణంగా నిండి ఉంటాయి. ఇవి పరివర్తన మూలకాలు. 4. నాల్గవ రకం మూలకాలు : వీనిలో బాహ్య మూడు కక్ష్యలు అనగా n, (n – 1) మరియు (n – 2) కక్ష్యలు అసంపూర్ణంగా నిండి ఉంటాయి. ఇవి అంతరపరివర్తన మూలకాలు.
15. మూలకాల బాహ్యతమ కక్ష్య ఎలక్ట్రాన్ సాధారణ నిర్మితి :
s — బ్లాకు : ns1 – 2; p-బ్లాకు : ns ²np¹⁻⁶ d బ్లాకు : ns1 – 2 (n – 1) d1 – 10, f బ్లాకు (n – 2)f1 – 14 (n – 1) d0 – 1 ns²
16. ఒక గ్రూపులోని మూలకాలలో వేలన్సీ ఎలక్ట్రాన్లు సమాన సంఖ్యలో ఉన్నందున అవి సమాన ధర్మాలు ప్రదర్శిస్తాయి.
17. పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళేకొద్దీ, ఇంద్ర ధనస్సులో రంగులు మారినట్లు ధర్మాలు క్రమంగా మారుతూంటాయి.

Exam Tips:

a) విస్తృత పట్టిక లక్షణాలు: 7 పీరియడ్లు, 18 గ్రూపులు, 4 బ్లాకులు; పీరియడ్లవారీ మూలకాల సంఖ్య 2, 8, 8, 18, 18, 32, 32.

 

Question 84: కక్ష్యలోని ఉపశక్తి స్థాయిలలో పూర్తిగా నిండిన ఎలక్ట్రాన్ల సంఖ్యకు, పీరియడ్లో ఉండే మూలకాల అత్యధిక సంఖ్యకూ గల సంబంధాన్ని విశదీకరించండి.

Answer:

పీరియడ్ల నిర్మాణం:
a) 1వ పీరియడ్ (అతి సంక్షిప్తమైనది) : దీనిలో రెండు మూలకాలు ₁H మరియు ₂He మాత్రమే ఉన్నాయి. హైడ్రోజన్ ఒక విలక్షణ మూలకం. దీన్ని కొన్నిసార్లు పట్టిక పైభాగంలో విడిగా ఉంచుతారు. K కక్ష్య (n = 1) లో రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే
ఉండగలవు. అందువల్ల ఈ పీరియడ్లో రెండే మూలకాలున్నాయి.
b) 2వ పీరియడ్ (సంక్షిప్తమైనది) : దీనిలో ₃Li నుండి ₁₀Ne వరకు 8 మూలకాలుంటాయి.
Li పరమాణువులో K – కక్ష్య నుండి కొత్త కక్ష్య L లోకి ఒక ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది.
పీరియడ్లోని మిగతా మూలకాలలో అంటే Be నుండి Ne వరకు L కక్ష్య క్రమంగా నిండుతుంది. Ne లో K, L కక్ష్యలు పూర్తిగా నిండుతాయి.
ఆ విధంగా ఈ పీరియడ్ అంతమవుతుంది. ఈ మూలకాలలో, రెండవ శక్తి స్థాయి (L) క్రమంగా నిండి గరిష్ఠంగా 8 ఎలక్ట్రానులతో అంతమవుతుంది. కాబట్టి ఈ పీరియడ్లో 8 మూలకాలుంటాయి.
c) 3వ పీరియడ్ (సంక్షిప్తమైనది) : దీనిలో కూడా ₁₁Na నుండి ₁₈Ar వరకు 8 మూలకాలుంటాయి.
సోడియంలో M కక్ష్య ప్రారంభమవుతుంది. ఈ కక్ష్య ఆర్గాన్ వచ్చే వరకు క్రమంగా నిండుతుంది. అందువల్ల ఈ పీరియడ్లో 8 మూలకాలే ఉంటాయి.
ఆర్గాన్ తర్వాత, భేదపరిచే ఎలక్ట్రాన్ M కక్ష్యలోకి పోదు. దాని బదులు N కక్ష్య (అనగా 4వ కక్ష్య)లో ప్రవేశిస్తుంది. ఇది పొటాషియం (k) తో మొదలవుతుంది.
d) 4వ పీరియడ్ (విస్తృతమైనది) : దీనిలో ₁₉K నుండి ₃₆Kr వరకు 18 మూలకాలుంటాయి. పైన చెప్పినట్లు, Ar తర్వాత భేదపరచే ఎలక్ట్రాన్ M కక్ష్యలోకి వెళ్ళకుండా పొటాషియం (K) యొక్క N కక్ష్యలో ప్రవేశిస్తుంది.
K : 2, 8, 8, 1 (K)(L)(M)(N)
తర్వాతి మూలకం Ca తో అదే కక్ష్య N లోకి భేదపరచే ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది.
Ca : 2, 8, 8, 2 (K)(L)(M)(N)
Ca తర్వాత, భేదపరచే ఎలక్ట్రాన్ లోపలి M కక్ష్యలో ప్రవేశించి, Sc (Z = 21) నుండి Zn (Z = 30) వరకు M కక్ష్య క్రమంగా నిండి మొత్తం 18 ఎలక్ట్రాన్లు కల్గి ఉంటుంది. Zn లో M కక్ష్య నిండుతుంది. Cr మరియు Cu లు మాత్రము Nth కక్ష్యలో ఒక్కొక్క ఎలక్ట్రానును మాత్రమే కల్గి ఉంటాయి. మిగతా అన్నింటిలో Nth కక్ష్యలో 2 ఎలక్ట్రాన్ల చొప్పున ఉంటాయి.
తర్వాత వచ్చే మూలకాలు Ga నుండి Kr వరకు N కక్ష్యలోకి ఎలక్ట్రాన్లు వచ్చి చేరుతాయి. 4వ పీరియడ్లో 4s, 3d, 4p, ఉపస్థాయిలు క్రమంగా నిండుతాయి.
అందువల్ల ఈ పీరియడ్లో 18 మూలకాలుంటాయి.
e) 5వ పీరియడ్ (విస్తృతమైనది) : ఇది కూడా 4వ పీరియడ్ వలెనే ఎలక్ట్రాన్లతో క్రమంగా నిండుతుంది. దీనిలో Rb లో 5s ఎలక్ట్రాను మొదలవుతుంది. 5p ఉపకక్ష్య నిండే వరకు ఎలక్ట్రాన్లు చేరుతాయి. ఈ పీరియడ్లో 5s, 4d మరియు 5p ఉపస్థాయిలు క్రమంగా నిండుతాయి. కాబట్టి ఈ పీరియడ్లో Rb నుండి Xe వరకు మొత్తం 18 మూలకాలుంటాయి.
f) 6వ పీరియడ్ (అతి విస్తృతమైనది) : దీనిలో 6s, 4f, 5d మరియు 6p ఉపస్థాయిలు క్రమంగా నిండుతాయి. ఈ పీరియడ్లో 14 లాంథనైడ్లు కూడా కలసి ఉంటాయి. ఈ ఉపస్థాయిలన్నింటిని నింపగల ఎలక్ట్రాన్ల గరిష్ఠ సంఖ్య 32. కాబట్టి ఈ పీరియడ్లో 32 మూలకాలున్నాయి.
g) 7వ పీరియడ్ (అసంపూర్ణమైనది) : దీనిలో 14 ఆక్టినైడులు కలసి ఉంటాయి. వానితో సహా మొత్తం 32 మూలకాలు ఈ పీరియడ్లో ఉంటాయి (7s, 5f, 6d, 7p ఉపస్థాయిలు నిండగా).

Exam Tips:

a) పీరియడ్లో మూలకాల సంఖ్య = ఆ పీరియడ్‌లో నిండే ఉపస్థాయిల ఎలక్ట్రాన్ల మొత్తం: 1s (2); 2s2p (8); 3s3p (8); 4s3d4p (18); 5s4d5p (18); 6s4f5d6p (32); 7s5f6d7p (32).

 

Question 85: s, p, d, f బ్లాక్ మూలకాలపై వ్యాసాన్ని రాయండి.

Answer:

మూలకాలను s, p, d, f బ్లాకులుగా వర్గీకరించడం: భేదపరచే ఎలక్ట్రాన్ పరమాణువులోని ఉపస్థాయిలోకి ప్రవేశించడం ఆధారంగా, మూలకాలను నాల్గు బ్లాకులుగా విభజింపవచ్చు. అవి s, p, d మరియు f బ్లాకు మూలకాలు.
s – బ్లాకు మూలకాలు : భేదపరచే ఎలక్ట్రాను ఉపస్థాయిలో గల మూలకాలు, S బ్లాకు మూలకాలు. ఈ మూలకాలలో S – ఉపస్థాయి పాక్షికంగా గాని, పూర్తిగా గాని ఎలక్ట్రానులతో నిండి ఉంటుంది. s ఆర్బిటాల్లో అత్యధికంగా రెండు ఎలక్ట్రాన్లు ఉండవచ్చు. అందువల్ల S బ్లాకులో రెండు గ్రూపులుంటాయి. అవి IA, IIA గ్రూపులు. IA గ్రూపు : క్షారలోహాలు. బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns ¹.
IIA గ్రూపు : క్షారమృత్తిక లోహాలు. బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns ².
S – బ్లాకు మూలకాలు అన్నీ చాలా చురుకైన లోహాలు. అందువల్ల ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించవు. చర్యలలో ఇవి 1 లేదా 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి Na ⁺, Ca²⁺ వంటి అయాన్ల నేర్పరుస్తాయి. ఇవి అధిక ధన విద్యుదాత్మకత గల లోహాలు. లోహస్వభావం మరియు చర్యా శీలత, గ్రూపులో పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ పెరుగుతాయి.
p – బ్లాకు మూలకాలు : వీనిలో p ఆర్బిటాల్ క్రమంగా నిండుతుంది. p ఉపస్థాయిలో అత్యధికంగా ఆరు ఎలక్ట్రానులుండవచ్చు. కాబట్టి దీనిలో ఆరు గ్రూపులున్నాయి. వీటి బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం ns² npx (x = 1 నుండి 6 వరకు)
p బ్లాకులో లోహాలు, అర్ధలోహాలు, అలోహాలు ఉంటాయి. లోహాల చురుకుదనం S బ్లాకు కన్నా తక్కువ. S మరియు p బ్లాకు (0 గ్రూపుమినహా) మూలకాలను కలిపి ‘ప్రాతినిధ్య మూలకాలు’ లేదా ప్రధాన గ్రూపు మూలకాలంటారు. p బ్లాకులో ‘0’ గ్రూపులో జడ మూలకాలుంటాయి. వీటి వేలెన్సీ 0. VII గ్రూపులో హాలోజన్లు చాలా చురుకైనవి. VI గ్రూపు మూలకాలను చాల్కోజన్ లంటారు. ఇవి కూడా చురుకైనవే. ఈ గ్రూపులలో పై నుండి క్రిందకు అలోహ ధర్మం తగ్గి లోహ ధర్మం పెరుగుతుంది. d – బ్లాకు మూలకాలు : వీటిలో ‘d’ ఆర్బిటాల్ క్రమంగా నిండుతుంది. ఇవి s మరియు p బ్లాకుల మధ్యన వారధివలె ఉంటాయి. ఇవన్నీ లోహాలే. అంత చురుకైనవి కావు. వీటి బాహ్య విన్యాసం (n – 1) d1 – 10 ns1 – 2 గా ఉంటుంది. ఇవి 3d, 4d, 5d, 6d అనే నాల్గు శ్రేణులలో ఉంటాయి. 6d శ్రేణి ఆక్టినియం (Ac) తో మొదలై అసంపూర్ణంగా ఉంటుంది. ప్రతిశ్రేణిలోను 10 చొప్పున మూలకాలుంటాయి. 3d – శ్రేణిలో Sc నుండి Zn వరకు, 4d – శ్రేణిలో Y నుండి Cd వరకు మరియు 5d – శ్రేణిలో La, Hf ల నుండి Hg వరకు ఉంటాయి.

ఈ బ్లాకు మూలకాల ధర్మాలు విశిష్టంగా ఉంటాయి. పెక్కు లోహాలు కాని అయాన్లు గాని రంగు కల్గి ఉంటాయి, అనేక ఆక్సీకరణ స్థితులు కల్గి ఉంటాయి మరియు సంక్లిష్ట సమ్మేళనాల నేర్పరుస్తాయి. ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.
మిశ్రలోహాలుగా బాగా ఉపయోగపడతాయి.
f – బ్లాకు మూలకాలు : ఇవి ఆవర్తన పట్టిక క్రింద రెండు వరుసలలో ఉన్నాయి. అవి : 4f శ్రేణి లేదా లాంథనైడ్లు (Ce నుండి Lu వరకు) మరియు 5f శ్రేణి లేదా ఆక్టినైడ్లు (Th నుండి Lr వరకు).
ప్రతి వరుసలో 14 మూలకాలుంటాయి. ఇవన్నీ లోహాలే. వీటి బాహ్య సాధారణ విన్యాసం, (n – 2)f1 – 14 (n – 1). d0 – 1 ns ². ఈ మూలకాలు రంగుగల అయాన్ల నేర్పరుస్తాయి, పారా అయస్కాంత ధర్మం కల్గి ఉంటాయి.

Exam Tips:

a) s, p, d, f బ్లాకులకు: భేదపరచే ఎలక్ట్రాన్ ఉపస్థాయి, గ్రూపుల సంఖ్య (2, 6, 10, 14 ఆధారంగా), సాధారణ విన్యాసం, ధర్మాలు ప్రతి బ్లాకుకు రాయండి.

 

Question 86: మూలకాల వర్గీకరణలో మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసానికి, వాటి ధర్మాలకు గల సంబంధాన్ని తెలపండి.

Answer:

మూలకాలను వాటి లక్షణాల ప్రాతిపదిక మీద, వాటి ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా నాల్గు రకాలుగా విభజించారు.
అవి:
I ఉత్కృష్ట వాయు మూలకాలు
II ప్రాతినిథ్య మూలకాలు
III పరివర్తన మూలకాలు
IV అంతర్ పరివర్తన మూలకాలు
I. ఉత్కృష్ట వాయు మూలకాలు : ఇవి ‘0’ గ్రూపు మూలకాలు. వీటిని ‘విరళవాయువులు’ అని కూడా అంటారు. ఇవి He, Ne, Ar, Kr, Xe, Rn. He(1s² ) తప్ప మిగతా మూలకాల బాహ్య సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns² np ⁶. వీటి జడత్వానికి కారణం, బాహ్యతమ కక్ష్యలో 8 ఎలక్ట్రానులుండటమే. He కు మాత్రం K కక్ష్య నిండినందువల్ల జడత్వం వచ్చింది. రేడాన్, రేడియోథార్మిక మూలకము.
II. ప్రాతినిథ్య మూలకాలు : ‘0’ గ్రూపు మూలకాలు గాక, మిగతా s మరియు p బ్లాకు మూలకాలు ఈ రకానికి చెందినవి. వీటి బాహ్యకక్ష్య విన్యాసం.ns1 – 2 np1 – 5 s బ్లాకు మూలకాలన్నీ చురుకైన లోహాలు. ఇవి రసాయన చర్యలో ఎలక్ట్రాన్లను కోల్పోయి ధన అయానుల నేర్పరుస్తాయి. ఉదా : Na ⁺, Ca²⁺. p బ్లాకులో లోహాలు, అర్థలోహాలు మరియు అలోహాలుంటాయి. ఇవి అయానిక మరియు సమయోజనీయ సమ్మేళనాల నేర్పరుస్తాయి. p బ్లాకులోని గ్రూపులలో పై నుండి క్రిందకు అలోహ ధర్మం తగ్గి లోహ ధర్మం పెరుగుతుంది. s – బ్లాకు మూలకాలలో పై నుండి క్రిందకు లోహధర్మం పెరుగుతుంది.
ఈ మూలకాలు చర్యలలో తరచుగా వస్తుంటాయి. కాబట్టి వీటిని ప్రాతినిధ్య మూలకాలని పిలిచారు.
III. పరివర్తన మూలకాలు : ఇవి s మరియు p బ్లాకుల మధ్యలో వంతెనవలె ఉంటాయి. ఈ మూలకాలేర్పరచే సమ్మేళనాలలో, అయానిక నుండి కోవెలంట్కు బంధ స్వభావాలు మారడం గమనిస్తాము. వీని బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం (n – 1) d1 – ¹⁰ ns1 – 2 గా ఉంటుంది. ఈ మూలకాలు ఒక ప్రత్యేకతను గల్గి ఉంటాయి. దానికి కారణాలు.
1. అసంపూర్తిగా నిండిన d ఆర్బిటాళ్లు
2. అధిక కేంద్రక ఆవేశం
3. పరమాణు అల్పసైజు
పరివర్తన మూలకాల అభిలాక్షణిక ధర్మాలు:
1. ఇవన్నీ గట్టి, భారీ లోహాలు
2. వీని ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం, సాంద్రత ఎక్కువ
3. మంచి ఉష్ణ, విద్యుద్వాహకాలు
4. ఒకటి కన్నా ఎక్కువ ఆక్సీకరణ స్థితులు కల్గి ఉంటాయి.
5. ఈ మూలకాలు, వాటి సమ్మేళనాలు రసాయన చర్యల్లో మంచి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
6. వీటి ఆర్బిటాళ్లు సాధారణంగా పారా అయస్కాంత ధర్మాన్ని చూపుతాయి. 7. ఇవి మిశ్రలోహాలనిస్తాయి.
IV) అంతర్ పరివర్తన మూలకాలు : వీటి సాధారణ బాహ్య విన్యాసం (n – 2) f1 – 14 (n – 1) d0 – 1 ns ². కాబట్టి వీటిని కూడా d బ్లాకు మూలకాలతో చేర్చుతారు (d ఆర్బిటాల్అసంపూర్ణం). కాని భేదాత్మక ఎలక్ట్రాను (n – 2)f ఉపస్థాయిలో ప్రవేశించడం వల్ల వీటిని f బ్లాకు మూలకాలంటారు. వీటి సాధారణ ఆక్సీకరణ స్థితి + 3.
అంతర్ పరివర్తన మూలకాలన్నీ లోహాలే. వీటిలో రెండు శ్రేణులున్నాయి అవి :
లాంథనైడులు – సీరియమ్ నుండి లుటీషియం వరకు. వీనిలో 4f ఆర్బిటాళ్ళు నిండుతాయి. ఇవి 14 మూలకాలు.
అక్టినైడులు – థోరియం నుండి లారెన్షియమ్ వరకు. వీనిలో 5f ఆర్బిటాళ్లు నిండుతాయి. ఇవి 14 మూలకాలు. Th, U వంటి కొన్ని మూలకాలు మినహాయిస్తే ఆక్టినైడులన్నీ కృత్రిమంగా తయారైనవే. ఇవన్నీ రేడియోధార్మిక మూలకాలు.

Exam Tips:

a) నాలుగు రకాలు: ఉత్కృష్ట వాయువులు, ప్రాతినిధ్య, పరివర్తన, అంతర పరివర్తన మూలకాలు; ప్రతి దానికి విన్యాసం, ధర్మాలు, ఉదాహరణలు ఇవ్వండి.

 

Question 87: ఆవర్తన ధర్మమనగా నేమి ? కింది ధర్మాలు గ్రూప్ , పీరియడ్లో ఏ విధంగా మారతాయి ? విశదీకరించండి.
(a) పరమాణు వ్యాసార్థం
(b) ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ

Answer:

ఆవర్తన ధర్మం : ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు ఎలక్ట్రానిక్ విన్యాసంతో బాటు క్రమంగా మారుతాయి. ఈ మార్పుల సరళి క్రమ వ్యవధుల్లో పునరావృతమవుతుంది. ఇలా ఒక ధర్మం పునరావృతమవడాన్ని ‘ఆవర్తనం’ అంటారు. పునరావృతమయే ధర్మాన్ని ‘ఆవృత ధర్మం’ అంటారు.
పరమాణు వ్యాసార్థం : ఒక గ్రూపులో పైనుండి క్రిందికి వచ్చిన కొద్దీ, పరమాణు వ్యాసార్ధం పెరుగుతుంటుంది. కారణం గ్రూపులో క్రిందికి వచ్చిన కొద్దీ వేలన్సీ ఎలక్ట్రాన్లు కొత్త కక్ష్యలో ప్రవేశిస్తాయి. కేంద్రక ఆవేశం పెరిగినా కూడా, ఈ వేలన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ అధికంగా ఉండనందున కక్ష్యలు దూరంగా జరుగుతాయి. అప్పుడు పరమాణు సైజు పెరుగుతుంది.
ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళిన కొద్దీ పరమాణు సైజు తగ్గుతుంది.
కారణం, భేదాత్మక ఎలక్ట్రాన్ అదే కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కేంద్రక ఆవేశం కూడా పెరగడం వల్ల, ఈ కక్ష్యపై కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. దాని వల్ల కక్ష్యల సైజు తగ్గి పరమాణు సైజు తగ్గుతుంది.
ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ : గ్రూపులో పైనుంచి క్రిందికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం పెరగడం వల్ల ఎలక్ట్రాన్ అఫినిటీ విలువలు తగ్గుతాయి.
పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం తగ్గుతుంది.
మూలక స్వభావం లోహం నుంచి ఆలోహానికి మారుతుంది. దీని ఫలితంగా ఎలక్ట్రాన్లపై అపేక్ష పెరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ పెరుగుతుంది.

Exam Tips:

a) ఆవర్తన ధర్మం నిర్వచనం రాసి, వ్యాసార్ధం మరియు EA పోకడలను గ్రూపు, పీరియడ్ రెండింటికీ కారణంతో వివరించండి.

 

Question 88: ఆవర్తన ధర్మం అంటే ఏమిటి ? కింది ధర్మాలు గ్రూప్లో, పీరియడ్లో ఎట్లా మారతాయి ? విశదీకరించండి.
a) IE
b) EN

Answer:

మూలకాలను వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆరోహణ క్రమంలో అమర్చితే సారూప్య ధర్మాలుగల మూలకాలు పునరావృతం అవుతాయి. నిర్ధిష్ట వ్యవధిలో పునరావృతమయ్యే ధర్మాలను ఆవర్తన ధర్మాలు అంటారు. పునరావృతమయ్యే ధర్మాన్ని ‘ఆవృత ధర్మం’ అంటారు.
a) IE. అయనీకరణ శక్తి : ఒక గ్రూపులో అయనీకరణ శక్తి పై నుండి క్రింది మూలకానికి తగ్గుతుంది. పరమాణు పరిమాణం పెరగడమే దీనికి కారణం.
ఒక పీరియడ్‌లో అయనీకరణ శక్తి ఎడమ నుంచి కుడి మూలకానికి పెరుగుతుంది. పరమాణు పరిమాణం తగ్గడమే దీనికి కారణం.
b) EN. ఋణవిద్యుదాత్మకత : ఒక గ్రూపులో పై నుంచి క్రిందకు పోయే కొలదీ ఋణ విద్యుదాత్మకత తగ్గుతుంది. పరమాణు పరిమాణం పెరగడం వల్ల కేంద్రకానికి ఎలక్ట్రానును ఆకర్షించే శక్తి తగ్గుతుంది. అనగా ఋణ విద్యుదాత్మకత తగ్గుతుంది. ఒక పీరియడ్లో ఎడమ నుంచి కుడికి ఋణ విద్యుదాత్మకత పెరుగుతుంది. పరమాణు పరిమాణం తగ్గడంవల్ల ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. అంటే ఋణ విద్యుదాత్మకత పెరుగుతుంది.

Exam Tips:

a) IE: గ్రూపులో కిందికి తగ్గుతుంది, పీరియడ్‌లో కుడికి పెరుగుతుంది; EN కూడా అదే ధోరణి; కారణం పరమాణు పరిమాణం మార్పు అని రాయండి.

 

Question 89: a) పరమాణు వ్యాసార్ధం
b) లోహ వ్యాసార్ధం
c) సంయోజక వ్యాసార్ధంల గురించి రాయండి.

Answer:

a) పరమాణు వ్యాసార్ధం : ఒక అణువు లేదా స్ఫటికంలో ఆసన్నంగా ఉన్న రెండు పరమాణు కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్ధం అంటారు. బంధ స్వభావాన్ని బట్టి దీనిని లోహ, సమయోజనీయ, వాన్ డర్ వాల్స్ వ్యాసార్ధాలుగా చెబుతారు.
b) లోహ (స్ఫటిక) వ్యాసార్ధం : లోహ స్ఫటికంలో రెండు ఆసన్న లోహ పరమాణు కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని లోహ వ్యాసార్ధం అంటారు.
ఉదా : రెండు సోడియం పరమాణు కేంద్రకాల మధ్య దూరం = 3.72 Å
∴ సోడియం లోహ వ్యాసార్ధం \( = \frac{3.72}{2} = 1.86\ \text{Å} \)
వాన్ డర్ వాల్స్ వ్యాసార్ధం (పోలిక కోసం) : అతి సన్నిహితంగా ఉన్న భిన్న అణువుల్లోని రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని వాన్ డర్ వాల్స్ వ్యాసార్ధం అంటారు. భిన్న అణువుల మధ్య వాన్ డర్ వాల్స్ ఆకర్షణ బలాలు ఉన్నప్పుడు ఆ అణువులు దగ్గరవుతాయి, కాని వాటి మధ్య రసాయన బంధం ఉండదు. ఉదా : భిన్న క్లోరిన్ అణువుల్లోని ఆసన్న పరమాణువుల కనిష్ఠ దూరం 3.6 Å కనుక క్లోరిన్ వాన్ డర్ వాల్స్ వ్యాసార్ధం \( \frac{3.6}{2} = 1.8\ \text{Å} \). వాన్ డర్ వాల్స్ ఆకర్షణలు రసాయన బంధం కన్నా బలహీనం కనుక అణువుల మధ్య దూరం ఎక్కువ; అందువల్ల వాన్ డర్ వాల్స్ వ్యాసార్ధం సమయోజనీయ వ్యాసార్ధం కన్నా ఎక్కువ.
c) సమయోజనీయ (కోవలెంట్) వ్యాసార్ధం : సజాతీయ పరమాణువులు గల అణువులో సమయోజనీయ బంధంతో కలపబడిన రెండు పరమాణు కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని సమయోజనీయ వ్యాసార్ధం అంటారు.
ఉదా : క్లోరిన్ అణువులో పరమాణు కేంద్రకాల మధ్య దూరం (బంధ దైర్ఘ్యం) = 1.98 Å

∴ క్లోరిన్ సమయోజనీయ వ్యాసార్ధం \( = \frac{1.98}{2} = 0.99\ \text{Å} \)
ఈ వ్యాసార్ధాన్ని సాధారణంగా అలోహాలకు వాడుతారు.

Exam Tips:

a) మూడు వ్యాసార్ధాలను నిర్వచించి ఉదాహరణ ఇవ్వండి: Na లోహ వ్యాసార్ధం 3.72/2 = 1.86 Å; Cl సమయోజనీయ 1.98/2 = 0.99 Å; Cl వాన్ డర్ వాల్స్ 3.6/2 = 1.8 Å.

 

Question 90: IE₁, IE₂ లను నిర్వచించండి. ఏదైనా పరమాణువుకు IE₂ > IE₁ గా ఎందుకు ఉంటుంది ? ఒక మూలకపు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి. (March 2013)

Answer:

అయనీకరణ శక్తి : “స్వేచ్ఛా స్థితిలో ఉండే వాయు పరమాణువు నుంచి అత్యంత బలహీనంగా బంధితమైన ఎలక్ట్రాను విడదీసి వాయు స్థితిలో అయాను ఏర్పరచడానికి అవసరమైన కనీస శక్తిని అయనీకరణ శక్తి” అంటారు.
దీన్ని ఒకటవ అయనీకరణ శక్తి అంటారు.
\( M_{(g)} + IE_1 \rightarrow M^{+}_{(g)} + e^{-} \)
“ఏకధనావేశిత అయాన్ నుంచి రెండవ ఎలక్ట్రాన్ ను తీసివేయడానికి కావల్సిన కనీస శక్తిని రెండో అయొనైజేషన్ శక్తి (I₂) అంటారు.
\( M^{+}_{(g)} + IE_2 \rightarrow M^{2+}_{(g)} + e^{-} \)
I₂ >I₁ కు కారణం : పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాన్ ను తీసివేస్తే ఏర్పడే ఏక ధనావేశిత అయానులో తటస్థ పరమాణువులో కన్నా అధిక ప్రాభావిక కేంద్రక ఆవేశం ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణలు తగ్గుతాయి. అదే సమయంలో బాహ్య కక్ష్యలలోని ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. దీని ఫలితంగా ఏక ధనావేశిక అయాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ను తీసివేయడానికి అధిక శక్తి అవసరమవుతుంది. కాబట్టి రెండవ అయనీకరణ శక్తి (I₂) మొదటి అయనీకరణ శక్తి (I₁) కన్నా ఎక్కువగా ఉంటుంది.
మూలకాల IP విలువలను ప్రభావితం చేసే అంశాలలో మూడు అంశాలు :
1. పరమాణు వ్యాసార్ధం
2. కేంద్రక ఆవేశం
3. బాహ్య ఎలక్ట్రాన్లపై రక్షక ప్రభావం.
1) పరమాణు వ్యాసార్ధం : పరమాణు వ్యాసార్ధం పెరిగే కొద్దీ వేలెన్సీ ఎలక్ట్రాన్లు కేంద్రకం నుంచి దూరం అవుతాయి. కాబట్టి వాటిపై కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది. అందువలన ఎలక్ట్రాన్లను తొలగించడానికి తక్కువ శక్తి సరిపోతుంది.
అనగా,అయనీకరణ శక్తి తగ్గుతుంది. గ్రూపులోని మూలకాలకు పై నుండి క్రిందకు పరమాణు సైజు పెరిగినందున, IP విలువ తగ్గుతుంది.
I.P. ∝ \( \frac{1}{r} \)
అదే విధంగా పరమాణు సైజు తగ్గితే IP విలువ పెరుగుతుంది.
2) కేంద్రక ఆవేశం : ఎలక్ట్రాన్ కక్ష్యల సంఖ్య స్థిరంగా ఉండి కేంద్రకావేశం పెరిగినపుడు బాహ్య ఎలక్ట్రాన్లను కేంద్రకం ఎక్కువ బలంగా ఆకర్షిస్తుంది. దీనివల్ల బాహ్య ఎలక్ట్రానును తొలగించడానికి అధిక శక్తి అవసరము. అనగా IP విలువ అధికమవుతుంది.
I.P ∝ Z
3) బాహ్య ఎలక్ట్రాన్లపై రక్షక ప్రభావం : వేలన్సీ కక్ష్యకు, కేంద్రకానికి మధ్య గల కక్ష్యలలోని ఎలక్ట్రాన్లు కేంద్రకావేశాన్ని కొంత వరకు తటస్థీకరించడం వల్ల, బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది. అంతర్ కక్ష్యలలోని ఎలక్ట్రాన్లు బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్లకు – కేంద్రకానికి మధ్య గల ఆకర్షణపై కనబరచే ఈ ప్రభావాన్ని ‘పరిరక్షక ప్రభావం’ అంటారు. ఈ ప్రభావం పెరిగితే, అనగా అంతర్కక్ష్యల సంఖ్య పెరిగే కొద్దీ అయొనైజేషన్ శక్తి తగ్గుతుంది.
IP ∝ 1 / (పరిరక్షక ప్రభావం)
ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ల పరిరక్షక దక్షత అవరోహణ క్రమం s > p > d>f గా ఉంటుంది.

Exam Tips:

a) IE₁, IE₂ సమీకరణాలు (M → M⁺ + e⁻, M⁺ → M²⁺ + e⁻) రాసి, IE ని ప్రభావితం చేసే మూడు అంశాలు (పరిమాణం, కేంద్రక ఆవేశం, పరిరక్షణ) వివరించండి.

 

Question 91: క్రింది చెప్పిన లక్షణాలు 1వ గ్రూపులోను, IIIవ పీరియడ్లోను ఎట్లా మారతాయో ఉదాహరణతో వివరించండి.
a) మూలకాల ఆక్సైడ్ స్వభావం
b) మూలకాల లోహ, అలోహ స్వభావాలు
c) అయనీకరణ శక్తి.

Answer:

a) మూలకాల ఆక్సైడ్ స్వభావం : IA గ్రూపు మూలకాలు క్షార మూలకాలు. వాటి ఆక్సైడ్లు (M₂O) క్షార ప్రవృత్తి కల్గి ఉంటాయి. ఉదా : Li₂O, Na₂O, K₂O. Li₂O చాలా బలహీన క్షారధర్మం కలది . Cs₂O చాలా బలమైన క్షార ధర్మం కలది.
క్షార ఆక్సైడ్లు నీటిలో కరిగి క్షారాన్నిస్తాయి.
ఉదా : Na₂O + H₂O → 2NaOH
IA గ్రూపులో, క్షార ఆక్సైడ్ స్వభావం, పై నుండి క్రిందకు పెరుగుతుంది.
3వ పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్తే, ఆక్సైడ్ స్వభావం క్షార స్వభావం నుంచి ఆమ్ల స్వభావానికి క్రమంగా మారుతుంది.

గ్రూపుIIIIIIIVVVIVII
ఆక్సైడ్Na₂OMgOAl₂O₃SiO₂P₄O₁₀SO₃Cl₂O₇
స్వభావంబలమైన క్షారంక్షారంద్విస్వభావందుర్బల ఆమ్లంఒక మోస్తరు ఆమ్లంబలమైన ఆమ్లంబలమైన ఆమ్లం
హైడ్రాక్సైడ్ / ఆమ్లంNaOHMg(OH)₂Al(OH)₃H₂SiO₃H₃PO₄H₂SO₄HClO₄

ఈ విధంగానే హైడ్రాక్సైడుల స్వభావం కూడా మారుతుంది.
b) మూలకాల లోహ, అలోహ స్వభావాలు : ఎలక్ట్రాన్ను వదలుకొని ధన అయాన్గా మారే మూలకాన్ని లోహమంటారు. ఎలక్ట్రాన్ను పొంది ఋణ అయానుగా మారే మూలకాన్ని అలోహమంటారు.
IA గ్రూపులో క్షారలోహాలు లోహప్రవృత్తిని అధికంగా చూపుతాయి. చర్యలలో ఇవి ధన అయానులుగా మారుతాయి. ఈ గ్రూపులో పై నుండి క్రిందకు పెరిగే కొద్దీ లోహ స్వభావం పెరుగుతుంది. Li కన్నా Cs అతి చురుకైన లోహము.
3వ పీరియడ్లో Na నుండి Cl కు వెళ్ళేకొద్దీ లోహ స్వభావం తగ్గి అలోహ స్వభావం పెరుగుతుంది. Na కు అత్యధిక లోహ స్వభావం ఉన్నది. మధ్యలోని Al ద్విస్వభావ ఆక్సైడ్‌ను ఇచ్చే లోహం (కొంత అలోహ లక్షణం ఉంటుంది). తర్వాతి Si అర్ధలోహం. చివరగా ఉన్న Cl బలమైన అలోహము.
c) అయనీకరణశక్తి : IA గ్రూపులో పై నుండి క్రిందకు వెళ్ళే కొద్దీ పరమాణు సైజు పెరుగుతుంది. ఆ కారణం వల్ల అయనీకరణ శక్తి తగ్గుతుంది. మొదటి మూలకం Li కు అత్యధిక ‘I₁ విలువ (I₁ = 520 kJ mol⁻¹) ఉండగా దాదాపు చివరి మూలకం Cs కు అత్యల్ప I₁ విలువ (I₁ = 375 kJ mol⁻¹) ఉన్నది.
3వ పీరియడ్లో Na నుండి Cl కు పరమాణు సైజు తగ్గినందువల్ల అయనీకరణ శక్తి పెరుగుతుంది. మొదటగల లోహాలకు తక్కువగాను చివర గల అలోహాలకు
ఎక్కువగాను IP విలువలుంటాయి. (I₁ : Na = 5.14 eV; Cl = 13 eV)

Exam Tips:

a) గ్రూపు 1 మరియు 3వ పీరియడ్ లలో ఆక్సైడ్ స్వభావం, లోహ-అలోహ స్వభావం, IE పోకడలను ఉదాహరణలతో (Li₂O → Cs₂O; Na₂O → Cl₂O₇) చెప్పండి.

 

Question 92: అయొనైజేషన్ ఎంథాల్పీని ప్రభావితం చేసే వివిధ అంశాలపై వ్యాసం వ్రాయండి.

Answer:

ఒక పరమాణువు యొక్క అయనీకరణ శక్తి క్రింది అంశాలపై ఆధారపడుతుంది :
1. పరమాణు వ్యాసార్ధం
2. కేంద్రక ఆవేశం
3. బాహ్య ఎలక్ట్రాన్లపై రక్షణ ప్రభావం
4. వేలన్సీ ఎలక్ట్రాన్ల ఆర్బిటాల్లు చొచ్చుకొనిపోయే విస్తృతి
5. ఉపకక్ష్యల స్వభావం అవి సగం లేదా పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉండటం లేదా ఉండకపోవడం.
1) పరమాణు వ్యాసార్ధం : పరమాణు వ్యాసార్ధం పెరిగే కొద్దీ వేలన్సీ ఎలక్ట్రాన్లు కేంద్రకం నుంచి దూరం అవుతాయి. కాబట్టి వాటిపై కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది. అందువలన ఎలక్ట్రాన్లను తొలగించడానికి తక్కువ శక్తి సరిపోతుంది. అనగా అయనీకరణ శక్తి తగ్గుతుంది. గ్రూపులోని మూలకాలకు పై నుండి క్రిందకు పరమాణు సైజు పెరిగినందున, IP విలువ తగ్గుతుంది.
I.P ∝ \( \frac{1}{r} \)
అదే విధంగా పరమాణు సైజు తగ్గితే IP విలువ, పెరుగుతుంది.
2) కేంద్రక ఆవేశం : ఎలక్ట్రాన్ కక్ష్యల సంఖ్య స్థిరంగా ఉండి కేంద్రకావేశం పెరిగినప్పుడు బాహ్య ఎలక్ట్రాన్లను కేంద్రకం ఎక్కువ బలంగా ఆకర్షిస్తుంది. దీనివల్ల బాహ్య ఎలక్ట్రాను తొలగించడానికి అధిక శక్తి అవసరము. అనగా IP విలువ అధికమవుతుంది. అంటే కేంద్రక ఆవేశం పెరిగే కొలది IP పెరుగుతుంది. ‘ I.P ∝ Z
3) బాహ్య ఎలక్ట్రాన్లపై రక్షక ప్రభావం : వేలన్సీ కక్ష్యకు, కేంద్రకానికి మధ్య గల కక్ష్యలలోని ఎలక్ట్రాన్లు కేంద్రకావేశాన్ని కొంత వరకు తటస్థీకరించడం వల్ల, బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది. అంతర్ కక్ష్యలలోని ఎలక్ట్రాన్లు బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రానులకు – కేంద్రకానికి మధ్య గల ఆకర్షణపై కనబరచే ఈ ప్రభావాన్ని ‘పరిరక్షక ప్రభావం’ అంటారు. ఈ ప్రభావం పెరిగితే, అనగా అంతర్కక్ష్యల సంఖ్య పెరిగే, కొద్దీ అయొనైజేషన్ శక్తి తగ్గుతుంది.
IP ∝ 1 / (పరిరక్షక ప్రభావం)
ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ల పరిరక్షక దక్షత అవరోహణ క్రమం s > p > d > f గా ఉంటుంది.
4) వేలన్సీ ఎలక్ట్రాన్ల ఆర్బిటాల్లు చొచ్చుకొనిపోయే విస్తృతి : ఒకే కక్ష్యకు చెందిన ఆర్బిటాళ్లు కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే క్రమము s > p > d > f గా ఉంటుంది. అనగా గోళాకార సౌష్ఠవం గల S ఆర్బిటాల్ అత్యధికంగాను, డంబెల్ ఆకారం గల P ఆర్బిటాల్ తక్కువగాను వితరణ చెందిన ఆకృతులు గల d మరియు f ఆర్బిటాళ్లు అతి తక్కువగాను కేంద్రకం వైపు చొచ్చుకుపోతాయి. ఈ చొచ్చుకుపోయే విస్తృతిని బట్టి ఆ ఆర్బిటాళ్లపై కేంద్రక ఆకర్షణ ప్రభావం ఉంటుంది. అయొనైజేషన్ పొటెన్షియల్ విలువలు ఆర్బిటాళ్లు చొచ్చుకుపోయే విస్తృతుల క్రమంలోనే ఉంటాయి. s > p > d > f. అనగా IP విలువ s – ఎలక్ట్రాన్కు అధికంగాను, f ఎలక్ట్రాన్కు అల్పంగాను ఉంటాయి.
5) పూర్తిగా నిండిన లేదా సగం నిండిన ఉపకర్పరాలు ఉండటం : సగం లేదా పూర్తిగా నిండిన ఉపశక్తి స్థాయిలు పరమాణువుకు అధిక స్థిరత్వాన్ని ఇస్తాయి. అటువంటి పరమాణువుల నుంచి ఎలక్ట్రాను వేరుచెయ్యడానికి అధిక శక్తి కావాలి. కాబట్టి వాటికి అయనీకరణ శక్తులు అధికంగా ఉంటాయి.

Exam Tips:

a) IE ని ప్రభావితం చేసే ఐదు అంశాలు: పరిమాణం, కేంద్రక ఆవేశం, పరిరక్షక ప్రభావం, ఆర్బిటాళ్ల చొచ్చుకుపోవడం (s > p > d > f), సగం/పూర్తిగా నిండిన ఉపస్థాయిలు.

 

Question 93: ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీని నిర్వచించండి. గ్రూప్ , పీరియడ్లో అది ఎలా మారుతుంది ? గ్రూప్ తర్వాత మూలకం కంటే O, F ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఎందుకు తక్కువ రుణాత్మకంగా ఉంటుంది ?

Answer:

వాయు స్థితిలోని తటస్థ పరమాణువును రుణాత్మక అయానుగా మార్చడానికి ఎలక్ట్రాన్ను కలిపే ప్రక్రియలో జరిగే ఎంథాల్పీలోని మార్పును ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అంటారు. పరమాణువు ఎలక్ట్రాను గ్రహించి ఆనయాన్‌గా (ఋణ అయాన్‌గా) మారే సామర్థ్యాన్ని ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తెలియజేస్తుంది.
\( X_{(g)} + e^{-} \rightarrow X^{-}_{(g)} \)
గ్రూపులో మార్పు : గ్రూపు మూలకాలలో ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ పై నుంచి కిందకి తగ్గుతుంది. ఎందుకంటే పరమాణు పరిమాణం పెరగడంవల్ల చేరే ఎలక్ట్రాన్ కేంద్రకానికి దూరంగా ఉంటుంది. అయినప్పటికీ తర్వాత ఉండే మూలకాల కంటె O, F ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువ రుణాత్మకంగా ఉంది. O, F లకు ఎలక్ట్రాన్చేర్చినపుడు చేరే ఎలక్ట్రాన్లు n = 2 క్వాంటమ్ స్థాయిలోకి వెళ్తుంది. అప్పటికే ఆ స్థాయిలో ఉన్న ఇతర ఎలక్ట్రాన్లతో ప్రాముఖ్యమైన వికర్షణకు లోనౌతుంది.
అందువల్ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువ రుణాత్మకంగా ఉంటుంది.
పీరియడ్లో మార్పు : పీరియడ్లో పరమాణు సంఖ్యతోపాటు ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అధిక రుణాత్మకమవుతుంది. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి ప్రభావిత కేంద్రకావేశం పెరుగుతుంది. ఫలితంగా ఆవేశపు కేంద్రకానికి మొత్తం మీద చేరబోయే ఎలక్ట్రాన్ దగ్గరవుతుంది. కనుక చిన్న పరమాణువుకు ఎలక్ట్రాన్ ను కలపడం సులభం.

Exam Tips:

a) EA నిర్వచనం, గ్రూపు/పీరియడ్ పోకడ, మరియు O, F ల EA S, Cl కంటే తక్కువ ఎందుకు (చిన్న n = 2 స్థాయిలో ఎలక్ట్రాన్ వికర్షణ) అనే మూడు భాగాలూ రాయండి.

 

Question 94: a) ఋణ విద్యుదాత్మకత అంటే ఏమిటి ?
b) గ్రూప్, పీరియడ్లో అది ఎట్లా మారుతుంది ?

Answer:

a) రసాయన పదార్థంలోని పరమాణువు సమిష్టిగా పంచుకున్న (బంధ) ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించుకునే ప్రవృత్తిని ఋణ విద్యుదాత్మకత అంటారు.
b) ఆవర్తన పట్టికలో ఋణ విద్యుదాత్మకత పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. ఉదా : లిథియం నుండి ఫ్లోరిన్‌కు పెరుగుతుంది. గ్రూపులో పై నుంచి కిందకి తగ్గుతుంది. ఉదా : ఫ్లోరిన్ నుండి ఆస్టటైన్‌కు తగ్గుతుంది.
కారణం : గ్రూపులో పరమాణు పరిమాణం పెరగడం వల్ల ఋణ విద్యుదాత్మకత తగ్గుతుంది. అదే విధంగా పీరియడ్‌లో పరమాణు పరిమాణం తగ్గడం వల్ల ఋణ విద్యుదాత్మకత పెరుగుతుంది.
* ఋణ విద్యుదాత్మకతను పౌలింగ్ స్కేలులో బంధ శక్తుల ఆధారంగా కొలుస్తారు.
\( X_A - X_B = 0.208\sqrt{\Delta} \)
XA = A యొక్క ఋణ విద్యుదాత్మకత
XB = B యొక్క ఋణ విద్యుదాత్మకత
Δ = బంధ ధృవాత్మకత (kcal mol⁻¹ లలో)
బంధ ధృవాత్మకత = ప్రయోగ బంధ శక్తి – సైద్ధాంతిక బంధ శక్తి
\( \Delta = E_{A-B} - \frac{1}{2}\left(E_{A-A} + E_{B-B}\right) \)
EA–B = A – B బంధ శక్తి
EA–A = A – A బంధ శక్తి
EB–B = B – B బంధ శక్తి
లోహాలు ధన విద్యుదాత్మకతను చూపుతాయి; వాటి ఋణ విద్యుదాత్మకతలు తక్కువ. అలోహాలు అధిక ఋణ విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి.

Exam Tips:

a) ఋణ విద్యుదాత్మకత నిర్వచనం, పోకడ (పీరియడ్‌లో పెరుగుదల, గ్రూపులో తగ్గుదల) మరియు పౌలింగ్ సమీకరణం X_A – X_B = 0.208√Δ రాయండి.

 

Question 95: కింది వాటిని విశదీకరించండి.
a) సంయోజకత
b) కర్ణ సంబంధం
c) గ్రూప్ I లో ఆక్సైడ్ స్వభావంలో మార్పు.

Answer:

a) వేలన్సీ (సంయోజకత) అనగా సంయోజక శక్తి. ఏదైనా మూలక పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో, లేదా క్లోరిన్ పరమాణువులతో కలుస్తోందో ఆ సంఖ్యను సంయోజకత అంటారు. సాధారణంగా ఒక గ్రూపులోని మూలకాలు ఒకే వేలన్సీని చూపుతాయి.
S బ్లాకు మూలకాలకు సంయోజకత గ్రూపు సంఖ్యకు సమానం.
p బ్లాకు మూలకాలకు సంయోజకత = గ్రూపు సంఖ్య లేదా (8 – గ్రూపు సంఖ్య) హైడ్రోజన్ పరంగా వేలన్సీ : ప్రాతినిథ్య మూలకాలలో వేలన్సీ 1 నుండి 4 వరకు పెరిగి తరువాత 1 వరకు తగ్గుతుంది.
3వ పీరియడ్ మూలకాలు:

మూలకం పేరుNaMgAlSiPSCl
హైడ్రోజన్ పరంగా వేలన్సీ1234321
సమ్మేళనంNaHMgH₂AlH₃SiH₄PH₃H₂SHCl

b) కర్ణ సంబంధం : ఇది రెండవ, మూడవ పీరియడ్లకు సంబంధించినది. ఆవర్తన పట్టికలో రెండో పీరియడ్లోని ఒక మూలకానికి మూడో పీరియడ్లోని తరువాత గ్రూపులోని రెండో మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. ఈ సంబంధాన్ని కర్ణ సంబంధం అంటారు.
ఉదా : Li, Mg; Be, Al; B, Si
గ్రూపుIIIIIIIV
2వ పీరియడ్LiBeBC
3వ పీరియడ్NaMgAlSi

కర్ణ సంబంధం గల జంటలు: Li – Mg, Be – Al, B – Si
c) గ్రూప్ I లో ఆక్సైడ్ స్వభావంలో మార్పు : గ్రూప్ I మూలకాలను ఆల్కలీ లోహాలు అంటారు. ఇవి క్షార ఆక్సైడ్లు.
ఇవి నీటిలో కరిగి క్షారాలను ఏర్పరుస్తాయి.
Na₂O + H₂O → 2 NaOH
గ్రూప్ I ఆక్సైడ్ క్షార ధర్మం Na₂O నుండి Cs₂O వరకు పెరుగుతుంది. దీనికి కారణం Na నుండి Cs వరకు లోహ స్వభావం పెరుగుటయే.

Exam Tips:

a) సంయోజకత, కర్ణ సంబంధం, గ్రూప్ I ఆక్సైడ్ స్వభావం మూడూ విడివిడిగా ఉదాహరణలతో; 3వ పీరియడ్ హైడ్రోజన్ వేలన్సీ: 1, 2, 3, 4, 3, 2, 1.

 

అదనపు ప్రశ్నలు

Question 1: మనం మూలకలను ఎందుకు వర్గీకరించాలి ?

Answer:

మూలకాలను గురించిన అధ్యయనాన్ని సులభతరం చేయడం కోసం మూలకాలను వర్గీకరించాలి. మూలకాలు అధిక సంఖ్యలో ఉండుట వలన వాటి గురించి వాటి సమ్మేళనాల గురించి విడివిడిగా అధ్యయనం చేయడం చాలా కష్టం. ఈ సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు మూలకాలను వర్గీకరించటం ద్వారా వాటి పరిజ్ఞానాన్ని పొందుపరచే ఒక క్రమ పద్ధతిని అన్వేషించారు. ఈ పద్ధతి మూలకాలను గురించి తెలిసిన రసాయన వాస్తవాలను హేతుబద్ధీకరించటమే కాకుండా తదుపరి అధ్యయనానికి కొత్త విషయాలను నిర్దేశిస్తుంది.

Exam Tips:

a) కారణం ఇవ్వండి: మూలకాలు చాలా ఉండటం వల్ల వాటి ధర్మాలను క్రమబద్ధంగా అధ్యయనం చేయడానికి, కొత్త మూలకాల ధర్మాలను ఊహించడానికి వర్గీకరణ అవసరం.

 

Question 2: లాంథనమ్, d – బ్లాకుకు చెందిన మూలకం. f బ్లాకుకు చెందదు.

Answer:

ఆఫ్ సూత్రం ప్రకారం లాంథనమ్ ఎలక్ట్రాన్ విన్యాసం [Xe] 6s² 4f ¹. కాని భౌతిక పద్ధతుల విశ్లేషణ వల్ల [Xe] 6s² 5d¹ గా కనుగొన్నారు. వేలన్సీ ఎలక్ట్రాన్ d ఉపస్థాయిలో ఉన్నందున లాంథనమ్ను ‘d’ బ్లాకు మూలకంగా పరిగణిస్తారు.

Exam Tips:

a) La: అఫ్‌బౌ ప్రకారం [Xe]6s²4f¹, కానీ ప్రయోగాత్మకంగా [Xe]6s²5d¹; భేదపరచే ఎలక్ట్రాన్ d లో ఉన్నందున d బ్లాకు.

 

Question 3: Na₂O నుంచి Cl₂O₇ వరకు పీరియడ్లో స్వభావం ఎట్లా మారుతుంది ?

Answer:

Na₂O నుండి Cl₂O₇ వరకు ఆక్సైడ్స్లో క్షార స్వభావం తగ్గి ఆమ్ల స్వభావం పెరుగుతుంది.

మూలకంNaMgAlSiPSCl
ఆక్సైడ్Na₂OMgOAl₂O₃SiO₂P₂O₅SO₃Cl₂O₇
స్వభావంగాఢ క్షారంక్షారంద్విస్వభావంబలహీన ఆమ్లంఆమ్లంగాఢ ఆమ్లంగాఢ ఆమ్లం

Exam Tips:

a) పీరియడ్‌లో Na₂O (బలమైన క్షారం) నుండి Cl₂O₇ (బలమైన ఆమ్లం) వరకు క్షార స్వభావం తగ్గి ఆమ్ల స్వభావం పెరుగుతుంది; Al₂O₃ ద్విస్వభావం అని చెప్పండి.

 

Question 4: ముల్లికెన్ స్కేలులో ఋణవిద్యుదాత్మకతను నిర్వచించండి.

Answer:

ముల్లికెన్ ప్రకారం, ఒక మూలకం ఋణవిద్యుదాత్మకత దాని అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ అపేక్షల సగటు.
ఋణ విద్యుదాత్మకత \( = \frac{\text{అయనీకరణ శక్తి} + \text{ఎలక్ట్రాన్ అఫినిటీ}}{2} \)

Exam Tips:

a) ముల్లికెన్: EN = (IE + EA)/2; ఇది ఎంత ఎక్కువైతే ఆ మూలకం ఎలక్ట్రాన్లను అంత బలంగా ఆకర్షిస్తుంది.

 

Question 5: మెండలీవ్ ఆవర్తన నియమానికి ఏవైనా నాల్గు అవధులు చెప్పండి.

Answer:

మెండలీవ్ ఆవర్తన నియమానికి అవధులు:
1. పరమాణు భారాల పరంగా లాంథనైడ్లలో విరళ మృత్తిక మూలకాల స్థానాలను నిర్ణయించడం చాలా కష్టమవుతుంది. మెండలీవ్ ఆవర్తన పట్టికలో వీటన్నింటినీ ఒకే స్థానంలో ఉంచడం జరిగింది.
2. ఈ పట్టికలో నాల్గు జతల మూలకాల్లో పరమాణు భారాల వరుసలు
అపక్రమంలో ఉన్నాయి. అవి:
1. ఆర్గాన్ – పొటాషియం
2. కోబాల్డు – నికెల్
3. టెల్యూరియం – అయొడిన్ మరియు
4. థోరియం – ప్రోటాక్టినియంలు. కాని ఇవి మాత్రం పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి.
3. ఈ పట్టికలో కొన్ని మూలకాల స్థానాలు వాటి రసాయన గుణాలకు
అనుగుణంగా లేవు. ఉదా : నాణెలోహాలైన Cu. Ag, Au లను అతిచురుకైన K, Rb. Cs అనే క్షార లోహాలతో కలిపి 1 గ్రూపులో ఉంచారు. ఈ రెండు సమూహాల మూలకాలకు ధర్మాలలో ఏ మాత్రం పోలికలు లేవు. ఉన్నదల్లా, వాటిన్నింటి వేలన్సీ సమానంగా ఉన్నది ( = 1)
4. హైడ్రోజన్ ధర్మాలు మిగతా మూలకాల ధర్మాలతో అధికంగా పోలి ఉండవు. కొన్నిచర్యల్లో క్షార లోహాలను, మరికొన్ని చర్యల్లో హాలోజన్ అలోహాలను పోలి ఉంటుంది. కాబట్టి హైడ్రోజన్కు ఏ ఇతర మూలకానికీ లేని ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.
5. VIII వ గ్రూపులో మూడేసి లోహాలను కలిపి (త్రికము) ఒకే చోటు ఉంచారు. కారణం, రసాయనికంగా ఇవి అతి సన్నిహితత్వం చూపుతాయి.

Exam Tips:

a) మెండలీవ్ అవధులలో కనీసం నాలుగు రాయండి: లాంథనైడ్ల స్థానం, అసంగత జంటలు, Cu–K అమరిక, హైడ్రోజన్ స్థానం, VIII గ్రూపు త్రికాలు.

 

Question 6: ఉత్కృష్ట వాయుమూలకాలేవి ? ఆవర్తన పట్టికలోని వాటి స్థానాన్ని సమర్థించండి.

Answer:

సున్నా (0) గ్రూపు మూలకాలను ఉత్కృష్ట వాయువులంటారు. వీటినే జడవాయువులంటారు. అవి He, Ne, Ar, Kr, Xe మరియు Rn లు. ఈ మూలకాల ns మరియు np ఉపకక్ష్యలు పూర్తిగా నిండి ఉంటాయి. అనగా ns² np ⁶. (He కు 1s ²) వీటి రసాయనిక జడత్వానికి కారణం, వీటిలోని బాహ్య కక్ష్య పూర్తిగా నిండి ఉండటమే. ఈ మూలకాలు ఏక పరమాణుక వాయువులుగానే ఉంటాయి.
ఈ మూలకాల విశిష్టత ఏమంటే, వీటి స్థిర విన్యాసం కారణంగా ఇవి అత్యధిక స్థిరమైనవిగా ఉంటాయి. వీటిని ఆవర్తన పట్టికలో కుడి చివరన p – బ్లాకులో ఉంచడానికి రెండు కారణాలున్నాయి. అవి
1. వీనిలో, భేదాత్మక ఎలక్ట్రాన్ p ఉపస్థాయిలోకి ప్రవేశిస్తుంది. (He కు తప్ప)
2. ఈ మూలకాలు, VII A గ్రూపులోని అధిక ఋణవిద్యుదాత్మక హాలోజన్లకు, IA గ్రూపులోని అధిక ధనవిద్యుదాత్మక క్షారలోహాలకు మధ్యన వంతెన వలె నిలుస్తాయి.

Exam Tips:

a) ఉత్కృష్ట వాయువులు: He, Ne, Ar, Kr, Xe, Rn; విన్యాసం ns²np⁶; హాలోజన్లు, క్షారలోహాల మధ్య వంతెన; స్థానం సమర్థనకు ఈ కారణాలు చెప్పండి.

 

Question 7: d బ్లాకుకు చెంది పరివర్తన మూలకాలు కానివి ఏవి ?

Answer:

జింక్ (Zn), కాడ్మియం (Cd), మెర్కురీ (Hg)

Exam Tips:

a) d బ్లాకులో పరివర్తన కాని మూలకాలు: Zn, Cd, Hg (d¹⁰ పూర్తిగా నిండి ఉండటం).

 

Question 8: ఎలక్ట్రాను అఫినిటీ, ఋణ విద్యుదాత్మకతల తేడా ఏమిటి ?

Answer:

ఎలక్ట్రాన్ అఫినిటీ ఒంటరి పరమాణువు ధర్మం, ఋణ విద్యుదాత్మకత బంధ గత పరమాణువు ధర్మం.

Exam Tips:

a) EA: ఒంటరి (వాయు) పరమాణువు ధర్మం; EN: అణువులో బంధంలోని పరమాణువు ధర్మం.

 

Question 9: మిథ్యాజడవాయు విన్యాసం అంటే ఏమిటి ?

Answer:

బాహ్య కర్పరానికి ముందున్న కర్పరంలో s, p, dఉపస్థాయిలు నిండిన విన్యాసాన్ని సూడో (మిథ్యా) జడవాయు విన్యాసం అంటారు.
ఉదా : Zn²⁺ [Ne] 3s² 3p⁶ 3d¹⁰ (= [Ar] 3d¹⁰)

Exam Tips:

a) మిథ్యా జడవాయు విన్యాసం = బాహ్య కర్పరానికి ముందు కర్పరంలో s, p, d పూర్తిగా నిండటం; ఉదా : Zn²⁺ [Ne]3s²3p⁶3d¹⁰.

 

Question 10: ఆర్బిటాళ్లు చొచ్చుకొనిపోవటం అంటే ఏమిటి ?

Answer:

ఒక కక్ష్యలోని ఆర్బిటాల్, కేంద్రకం వైపుగా వెళ్లడాన్ని ఆర్బిటాల్ చొచ్చుకొని పోవడం అంటారు.
చొచ్చుకుపోయే క్రమం : s > p > d > f ఈ చొచ్చుకుపోయే సామర్థ్యము, ఆర్బిటాళ్ల ఆకృతులపైన ఆధారపడుతుంది.

Exam Tips:

a) ఆర్బిటాల్ చొచ్చుకుపోవడం = ఆర్బిటాల్ కేంద్రకానికి దగ్గరగా వెళ్లే సామర్థ్యం; క్రమం s > p > d > f.

 

Question 11: విస్తృత ఆవర్తన పట్టిక యొక్క గొప్పదనాలు మరియు లోపాలు రాయండి.

Answer:

గొప్పదనాలు:
1. “పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అతిక్రమణ” అనే లోపం సరిదిద్దుకొన్నది.
2. పట్టికలో మూలకం యొక్క స్థానాన్ని సులువుగా గుర్తించవచ్చు.
3. మూలకాల ధర్మాలలో పోలికలు, భేదాలు మరియు క్రమమైన మార్పులు ఈ పట్టికలో స్పష్టంగా చిత్రీకరించబడ్డాయి.
4. ట్రాన్షినల్ మూలకాలకు సరియైన స్థానం లభించింది.
5. ఉప సమూహాలు (A మరియు B) విడివిడి గ్రూపులుగా లాజికల్గా వేరు చేయబడ్డాయి.
6. జడవాయు మూలకాలను పట్టికలో కుడివైపు చిట్టచివర ఏర్పరచడం సంతృప్తికరంగా ఉంది.
లోపాలు:
1. హైడ్రోజన్ యొక్క స్థానం సంతృప్తికరంగా లేదు.
2. ప్రధాన పట్టికలో అంతర పరివర్తన మూలకాలకు స్థానం కల్పించలేదు. అవి పట్టికలో ప్రత్యేకంగా అడుగు భాగంలో ఏర్పాటు చేయబడ్డాయి.
3. పరివర్తన మూలకాలను పొడుగు పీరియడ్లో అమర్చడం వల్ల పొట్టి పీరియడ్ల మధ్య అంతరాయం ఏర్పడింది.
4. Zn, Cd మరియు Hg ల స్థానం సంతృప్తికరంగా లేదు.
5. VIIIవ గ్రూపులో మూడు ఉపసమూహాలు ఉండటం సరిగా లేదు.
6. లోహాలు, ఆలోహాలు ప్రత్యేకంగా గుర్తింపబడలేదు.

Exam Tips:

a) గొప్పదనాలు మరియు లోపాలు రెండింటిలోనూ కనీసం మూడు-మూడు పాయింట్లు విడిగా శీర్షికలతో రాయండి.

 

Question 12: ఋణ విద్యుదాత్మకతలకు పౌలింగ్ స్కేలు, ముల్లికెన్ స్కేలుకి గల సంబంధం వ్రాయండి.

Answer:

ముల్లికెన్ ఋణ విద్యుదాత్మకత = పౌలింగ్ ఋణ విద్యుదాత్మకత × 2.8

Exam Tips:

a) ముల్లికెన్ EN = పౌలింగ్ EN × 2.8 (IE, EA లను eV లో తీసుకున్నప్పుడు).

 

Question 13: ఫ్లోరిన్కు ఋణ విద్యుదాత్మకత 4.0 అయితే ముల్లికెన్ స్కేలులో ఎంత ?

Answer:

(EN)M = (EN)P × 2.8
= (4.0) (2.8) = 11.2
ఏక సంయోజకతగల మూలకాలకు మాత్రమే ముల్లికెన్ స్కేలు నిర్వచనం వర్తిస్తుంది.

Exam Tips:

a) సూత్రం (EN)_M = 2.8 × (EN)_P; 4.0 × 2.8 = 11.2.

 

Question 14: అత్యల్ప అయనీకరణ శక్తి కల మూలకం.

Answer:

సీసియం (Cs).

Exam Tips:

a) అత్యల్ప అయనీకరణ శక్తి గల స్థిరమైన మూలకం Cs (గ్రూపు 1 లో అడుగున ఉన్నది); Fr రేడియోధార్మికం.

 

Free study material for Chemistry

Step-by-Step Textbook Answers: Class 11 Chemistry Chapter 02 Classification of Elements and Periodicity in Properties

Accessing Chapter 02 Classification of Elements and Periodicity in Properties Solutions

Access structured TS Board textbook solutions for Chapter 02 Classification of Elements and Periodicity in Properties. Designed in alignment with the latest academic curriculum for Class 11 Chemistry, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 11 Chemistry

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Chemistry module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 02 Classification of Elements and Periodicity in Properties with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest TS Board curriculum.

Are the Chemistry TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు in both English and Hindi medium.

Is it possible to download the Chemistry TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు in printable PDF format for offline study on any device.