TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు

Official TS Board Solutions for Class 11 Accountancy: Chapter 09 Final Accounts of Sole Proprietors

Explore reliable textbook solutions for Chapter 09 Final Accounts of Sole Proprietors tailored for Class 11 learners. Utilizing these Accountancy answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Accountancy: Chapter 09 Final Accounts of Sole Proprietors

Navigate directly to the solved Accountancy textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

Question 1: ముగింపు లెక్కలను నిర్వచించి, వాటి తయారీలోని వివిధ దశలను వివరించండి.

Answer:

1. ప్రతి వ్యాపారస్తుడు ఒక నిర్ణీత కాలాంతానికి తన వ్యాపార సంస్థ ఆర్జించిన లాభనష్టాలను మరియు ఆర్థిక స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవటానికి తయారుచేసే వివిధ ఖాతాలు మరియు నివేదికలను “ముగింపు లెక్కలు” అంటారు. వీటిని “ముగింపు నివేదికలు” లేదా “ముగింపు ఆర్థిక నివేదికలు” అని కూడా పిలుస్తారు.
2. సొంతవ్యాపారి యొక్క ముగింపు లెక్కల తయారీ అతని వ్యాపార స్వభావం మీద ఆధారపడి ఉంటుంది.
3. వ్యాపార సంస్థ వర్తక వ్యవహారాలను చేపట్టేది అయితే వర్తకపు ఖాతా, లాభనష్టాల ఖాతా మరియు ఆస్తి-అప్పుల పట్టీని తయారుచేస్తారు. ఒకవేళ వ్యాపార సంస్థ వస్తువుల ఉత్పత్తి లేదా తయారు చేసేది అయితే వర్తకపు ఖాతా, లాభనష్టాల ఖాతా ఆస్తి-అప్పుల పట్టికతో పాటు అదనంగా “ఉత్పత్తి ఖాతాను” తయారు చేయాల్సి ఉంటుంది.
ముగింపు లెక్కల తయారీలోని వివిధ దశలు:
1. వర్తకపు ఖాతా మరియు ఉత్పత్తి ఖాతా:
వర్తకపు ఖాతా తయారీ అనేది ముగింపు లెక్కల తయారీ ప్రక్రియలో మొదటి దశ. వ్యాపార సంస్థ యొక్క “స్థూల లాభం” లేదా “స్థూల నష్టాన్ని” కనుక్కోడానికి దీనిని తయారు చేస్తారు. ఈ ఖాతా ద్వారా అమ్మిన సరుకుల వాస్తవ వ్యయానికి మరియు అమ్మకాలకు మధ్య గల వ్యత్యాసాన్ని కనుక్కోవటం జరుగుతుంది.
ఈ వర్తకపు ఖాతా నామమాత్రపు స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాబడి స్వభావం గల వర్తకపు ఖర్చులన్నింటిని ఈ ఖాతాకు డెబిట్ చేయాలి. అలాగే రాబడి స్వభావంగల వర్తకపు ఆదాయాలన్నింటిని క్రెడిట్ చేయాలి. ఈ ఖాతాలో వచ్చిన ఫలితాన్ని అనగా స్థూలలాభం లేదా స్థూలనష్టాన్ని లాభనష్టాల ఖాతాకు మళ్ళించాలి.
వస్తువులను ఉత్పత్తి లేదా తయారుచేసే వర్తకుడు వర్తకపు ఖాతాతోపాటు ఉత్పత్తి ఖాతాను కూడా తయారు చేయడం జరుగుతుంది. సరుకులను పొందడానికి మరియు వాటిని పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చడానికి అయిన ఖర్చులను ఉత్పత్తి ఖాతాకు డెబిట్ వైపు, కొనసాగుతున్న పని మరియు తుక్కు అమ్మకాన్ని ముగింపున ఉండే వివిధ రకాల సరుకులను క్రెడిట్ వైపు నమోదు చేయాలి. ఈ ఖాతావల్ల “ఉత్పత్తి వ్యయం” తెలుస్తుంది.
2. లాభనష్టాల ఖాతా:
ముగింపు లెక్కల తయారీలో రెండవ దశ లాభనష్టాల ఖాతాను తయారు చేయడం. వ్యాపార సంస్థ యొక్క “నికర లాభం” లేదా “నికర నష్టాన్ని” తెలుసుకోడానికి ఈ ఖాతాను తయారు చేస్తారు.
ఈ లాభనష్టాల ఖాతా నామమాత్రపు ఖాతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. అన్ని రకాల రాబడి వ్యయాలను, ఖర్చులను, నష్టాలను డెబిట్ వైపున, అన్ని రకాల రాబడి స్వభావం గల ఆదాయాలు, వసూళ్ళు మరియు లాభాలను క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. ఇందులో నికర లాభం లేదా నికర నష్టాన్ని ఆస్తి అప్పుల పట్టికకు మళ్ళించి, మూలధనంతో సర్దుబాటు చేయటం జరుగుతుంది.
3. ఆస్తి, అప్పుల పట్టీ:
వ్యాపార ముగింపు దశలో చివరి దశ ఆస్తి, అప్పుల పట్టికను తయారుచేయడం. వ్యాపార సంస్థ ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి ఈ పట్టిక ఉపయోగపడుతుంది. ఆస్తి, అప్పుల పట్టి ఖాతా కాదు, ఇది ఒక నివేదిక. దీనిలో మూలధనం, అప్పులను ఎడమవైపు, ఆస్తులను కుడివైపు నమోదు చేస్తారు.

Exam Tips:

a) నిర్వచనం రాసి, మూడు దశలను వరుసగా రాయండి: 1) వర్తకపు (ఉత్పత్తి) ఖాతా, 2) లాభనష్టాల ఖాతా, 3) ఆస్తి-అప్పుల పట్టీ.
b) ప్రతి దశ ఫలితం ఎక్కడికి మళ్ళుతుందో చెప్పండి: స్థూల లాభం లాభనష్టాల ఖాతాకు, నికర లాభం మూలధనానికి.
c) వస్తువులు తయారుచేసే వ్యాపారానికే ఉత్పత్తి ఖాతా అదనంగా అవసరమని తప్పక ప్రస్తావించండి.

 

Question 2: వివిధ రకాల ఆదాయాలు – ఖర్చులను ఉదాహరణలతో వివరించండి.

Answer:

సంస్థ యొక్క ఖచ్చితమైన, నిజమైన ఆర్థిక నివేదికలను తయారుచేయడములో వ్యయాలు మరియు ఆదాయాలను పెట్టుబడి, రాబడికి కేటాయించడములో ముఖ్యపాత్రను వహిస్తాయి.
వ్యయాలు / ఖర్చులు:
ఒక వ్యాపార సంస్థ తాలూకు వ్యయాన్ని 1) పెట్టుబడి వ్యయము / ఖర్చులు 2) రాబడి వ్యయము / ఖర్చులు 3) విలంబిత రాబడి వ్యయము / ఖర్చుగా విభజిస్తారు.
1. పెట్టుబడి వ్యయము / ఖర్చు:
స్థిరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా సంస్థ లాభార్జన శక్తిని పెంపొందించడానికి చేసిన ఖర్చులను పెట్టుబడి వ్యయము / పెట్టుబడి ఖర్చులు అంటారు. ఈ వ్యయము ద్వారా సంస్థకు కొన్ని సంవత్సరాలు ప్రయోజనము కలుగుతుంది.
మూలధన ఖర్చులకు ఉదా : ప్లాంటు-యంత్రాలు, భవనాలు మొదలైన స్థిరాస్తుల కొనుగోలు, యంత్రాల స్థాపన వాటి అభివృద్ధికి అయిన వ్యయము. ఈ వ్యయాలను ఆస్తి, అప్పుల పట్టీలో ఆస్తులవైపు చూపుతారు.
2. రాబడి వ్యయము / ఖర్చు:
సాధారణ వ్యాపార కార్యకలాపాలలో సంస్థ పెట్టిన ఖర్చులను రాబడి వ్యయము/ రాబడి ఖర్చులు అంటారు. ఈ ఖర్చుల వలన సంస్థకు ప్రయోజనము ఒక అకౌంటింగ్ సంవత్సరానికి పరిమితము. రాబడి ఖర్చులకు ఉదా : జీతాలు, అద్దె, రవాణా, ఆఫీసు ఖర్చులు, అమ్మకాల ఖర్చులు మొదలైనవి. ఈ ఖర్చులను లాభనష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారు.
3. విలంబిత రాబడి వ్యయము / ఖర్చులు:
రాబడి వ్యయాల లక్షణము కలిగి ఉండి, పెద్ద మొత్తములో ఖర్చు చేసి, ప్రయోజనము ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు సంభవిస్తే వీటిని విలంబిత రాబడి వ్యయాలు అంటారు. విలంబిత రాబడి వ్యయాలకు ఉదా : ప్రాథమిక ఖర్చులు, వాటాలు, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్, పెద్ద మొత్తములో చేసిన ప్రకటన ఖర్చు, వ్యాపార ఆవరణాల మార్పిడి మొదలైనవి.
ఆదాయాలు/వసూళ్ళు : ఆదాయాలను
1. మూలధన వసూళ్ళు
2. రాబడి వసూళ్ళు
3. విలంబిత రాబడి వసూళ్ళుగా విభజించవచ్చు.
1. మూలధన వసూళ్ళు/ఆదాయాలు:
సంస్థ యజమానుల నుంచి పెట్టుబడి రూపములో వచ్చినవి, అప్పులు తీసుకున్నవి, ఆస్తుల అమ్మకము ద్వారా వచ్చిన వసూళ్ళను మూలధన వసూళ్ళు/ మూలధన ఆదాయాలు అంటారు.
ఉదా : మూలధనము, యంత్రాల అమ్మకం మొదలైనవి. మూలధన వసూళ్ళను ఆస్తి, అప్పుల పట్టీలో అప్పులపై చూపాలి.
2. రాబడి వసూళ్ళు / ఆదాయాలు:
సాధారణ వ్యాపార వ్యవహారాల ద్వారా ఆర్జించిన వసూళ్ళను రాబడి వసూళ్ళు లేదా రాబడి ఆదాయాలు అంటారు.
ఉదా : వచ్చిన కమీషన్, వచ్చిన వడ్డీ మొ||నవి. రాబడి వసూళ్ళను లాభనష్టాల ఖాతాకు క్రెడిట్ చేయాలి.
3. విలంబిత ఆదాయము:
ఈ ఆదాయము రాబడి మూలధన ఆదాయము స్వభావము వలన వచ్చిన ఆదాయ ప్రయోజనాన్ని రాబోయే సంవత్సరాలకు కూడా విస్తరించవచ్చును.
ఉదా : రెండు, మూడు సంవత్సరాలకు కలిపే ఒకేసారి వచ్చిన వడ్డీ లేదా అద్దె.

Exam Tips:

a) ఖర్చులను పెట్టుబడి, రాబడి, విలంబిత రాబడి అని మూడు రకాలుగా విభజించి ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
b) పెట్టుబడి వ్యయం ఆస్తి-అప్పుల పట్టీలోకి, రాబడి వ్యయం లాభనష్టాల ఖాతాకు వెళ్తాయని రాయండి; ఇదే ముఖ్యమైన మార్కుల అంశం.
c) ఆదాయాలను కూడా అదే మూడు రకాలుగా (మూలధన, రాబడి, విలంబిత) విభజించండి.

 

Question 3: వర్తకపు ఖాతాకు – లాభనష్టాల ఖాతాకు మధ్యగల తేడాలను రాయండి.

Answer:

వర్తకపు ఖాతాకు, లాభనష్టాల ఖాతాకు మధ్య తేడాలు:

వర్తకపు ఖాతాలాభనష్టాల ఖాతా
1. వ్యాపార సంస్థ యొక్క “స్థూల లాభం” లేదా “స్థూల నష్టాన్ని” కనుక్కోడానికి వర్తకపు ఖాతాను తయారుచేస్తారు.1. వ్యాపార సంస్థ యొక్క “నికర లాభం” (లేదా) “నికర నష్టాన్ని” తెలుసుకోడానికి లాభనష్టాల ఖాతాను తయారుచేస్తారు.
2. వర్తకపు ఖాతా ముగింపు లెక్కల తయారీలో మొదటి దశ.2. లాభనష్టాల ఖాతా ముగింపు లెక్కల తయారీలో రెండవ దశలో తయారుచేస్తారు.
3. వర్తకపు ఖాతాలోని ఫలితాన్ని లాభనష్టాల ఖాతాకు మళ్ళించాలి.3. లాభనష్టాల ఖాతాలోని ఫలితాన్ని ఆస్తి, అప్పుల పట్టికలోని మూలధనం ఖాతాకు మళ్ళించాలి.

Exam Tips:

a) రెండు కాలమ్‌ల పట్టికలో తేడాలు రాయండి: ఉద్దేశం (స్థూల/నికర లాభం), తయారీ దశ (మొదటి/రెండవ), ఫలితం ఎక్కడికి మళ్ళుతుంది.
b) కనీసం నాలుగు తేడాలు రాయండి, ప్రతి తేడాకు సంఖ్య వేయండి.

 

Question 4: ముగింపు ఖాతాల యొక్క ప్రధాన లక్షణాలను, లాభాలను, పరిమితులను తెలపండి.

Answer:

ముగింపు ఖాతాల లక్షణాలు:
1. ముగింపు ఖాతాల వల్ల వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిని, ఆర్థిక ఫలితాలను తెలుసుకోవచ్చు.
2. ముగింపు ఖాతాలలో ద్రవ్య సంబంధ వ్యవహారాలను, చారిత్రాత్మక అంశాలను మాత్రమే నమోదు చేస్తారు.
3. ముగింపు ఖాతాల తయారీ చట్టబద్ధమైనవి. వీటిని చట్టరీత్యా తప్పనిసరి తయారుచేయాలి.
4. ముగింపు ఖాతాలను, యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవడానికి ప్రణాళికలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
5. ముగింపు ఖాతాలను ఒక నిర్ణీత కాలాంతానికి తయారు చేస్తారు.
ప్రయోజనాలు : ముగింపు లెక్కలను తయారుచేయడం వలన ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.
1. లాభము లేదా నష్టాన్ని తెలుసుకోవడము:
ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి వ్యాపార సంస్థ నిర్దిష్ట కాలానికి ఆర్థిక కార్యకలాపాల ఫలితాలను తెలుసుకోవాలి. వర్తకపు, లాభనష్టాల ఖాతాల ద్వారా వ్యాపార సంస్థ లాభనష్టాలను తెలియజేస్తాయి.
2. ఆర్థిక స్థితి:
ఆస్తి, అప్పుల పట్టీ సంస్థ ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తుంది.
3. ఆర్థిక ప్రణాళిక:
ముగింపు లెక్కల ద్వారా ఆర్థిక సమాచారము తెలుసుకొని వ్యాపార సంస్థ ఆర్థిక ప్రణాళికలు తయారు చేయడములో నిర్వాహకులకు, వ్యాపారస్తులకు సహాయపడుతుంది.
4. వ్యాపార నిర్ణయాలు:
ప్రస్తుత ఆర్థిక నివేదికల ఫలితాలు, గత సంవత్సరము ఫలితాలతో పోల్చుకొని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది.
5. రుణాలు పొందడానికి:
వ్యాపార సంస్థ ఆర్థిక స్థితి, పటిష్టత, ఆర్థిక నివేదికలు ప్రతిబింబిస్తాయి. కాబట్టి వ్యాపారస్తులు బాంకుల నుంచి, ఇతర మార్గాల ద్వారా ఋణాలు తీసుకోవడములో సహాయపడుతుంది.
6. పన్నులు చెల్లించడానికి:
లాభనష్టాల ఖాతా ద్వారా లాభనష్టాలు తెలుసుకొని వ్యాపార సంస్థ పన్నులు చెల్లించడానికి వీలవుతుంది. ఆర్థిక నివేదికలు సమర్పించడం చట్టరీత్యా తప్పనిసరి.
పరిమితులు:
1. ముగింపు ఖాతాలు చారిత్రక అంశాల మీద ఆధారపడి తయారుచేయబడతాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని యదార్థంగా ప్రతిబింబింపవు.
2. ఈ ముగింపు ఖాతాలు ధరలలో మార్పులను పరిగణనలోకి తీసుకోవు.
3. గుణాత్మక అంశాలయిన నాణ్యత, సామర్థ్యం, ఉద్యోగి – యజమాని సంబంధాలు, ఉద్యోగుల ప్రేరణస్థాయిలు, మానవ వనరుల విలువ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవు.
4. ఆస్తులు, ఖర్చుల ఆదాయాల విలువల నిర్ధారణపై యాజమాన్యం యొక్క వ్యక్తిగత మరియు పక్షపాత ప్రభావం ఉంటుంది. కాబట్టి ఫలితాలు ఖచ్చితంగా ఉండకపోవచ్చు.

Exam Tips:

a) ప్రశ్నలో మూడు భాగాలు (లక్షణాలు, ప్రయోజనాలు, పరిమితులు) ఉన్నాయి; ప్రతిదానికి వేర్వేరు శీర్షిక ఇవ్వండి.
b) పరిమితులలో చారిత్రక వ్యయ ఆధారం, ధరల మార్పులను విస్మరించడం, గుణాత్మక అంశాలను లెక్కలోకి తీసుకోకపోవడం తప్పక రాయండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: ముగింపు ఖాతాల ధ్యేయాలు తెలపండి.

Answer:

ముగింపు లెక్కల తయారీ ప్రధాన ధ్యేయాలు:
1. వర్తకపు, లాభ-నష్టాల ఖాతా తయారీ ద్వారా సంస్థ యొక్క ‘లాభ-నష్టాలను’ కనుక్కోవడం.
2. ఆస్తి-అప్పుల పట్టిక తయారీ ద్వారా ఒక నిర్ణీత కాలానికి సంస్థ యొక్క ‘ఆర్థిక స్థితి’ని తెలుసుకోవడం.
3. భవిష్యత్ కాలంలో సంస్థ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికల రూపకల్పనకు దోహదపడడం.

Exam Tips:

a) మూడు ధ్యేయాలు రాయండి: లాభనష్టాల నిర్ధారణ, ఆర్థిక స్థితి తెలుసుకోవడం, భవిష్యత్ ప్రణాళికలకు సహాయం.
b) ప్రతి ధ్యేయం ఏ ఖాతా లేదా పట్టిక ద్వారా సాధ్యమో కలిపి రాస్తే సమాధానం బలంగా ఉంటుంది.

 

Question 2: వర్తకపు ఖాతా లక్షణాలను రాయండి.

Answer:

సాధారణముగా వ్యాపారసంస్థలు ఇతరుల నుంచి సరుకులను కొని వాటిని అమ్మకము చేయడము ద్వారా లాభాన్ని ఆర్జిస్తాయి. దీనిని వర్తకపు ప్రక్రియ అంటారు. ఏదైనా ఒక నిర్దిష్ట కాలానికి వర్తక కార్యకలాపాల ద్వారా ఫలితాన్ని తెలుసుకొనడానికి ఒక ఖాతాను తయారు చేస్తారు. ఈ ఖాతాను వర్తకపు ఖాతా అంటారు.
వర్తకపు ఖాతా నామమాత్రపు ఖాతా స్వభావమును కలిగి ఉంటుంది. వర్తకపు ఖర్చులన్నింటిని ఈ ఖాతాకు డెబిట్ చేస్తారు. వర్తకపు ఆదాయాన్ని క్రెడిట్ చేస్తారు. ఈ ఖాతా నిల్వ స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని తెలుపుతుంది.
లక్షణాలు:
1. వర్తకపు ఖాతా ముగింపు లెక్కల తయారీ ప్రక్రియలో మొదటి దశ.
2. వర్తకపు ఖాతా నామమాత్రపు ఖాతా స్వభావాన్ని కలిగి ఉంటుంది.
3. స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని తెలుసుకోవచ్చును.
4. వర్తకపు ఖాతా ప్రత్యక్ష ఖర్చులను వర్తక ఖర్చులను నమోదు చేస్తుంది.
5. వర్తకపు ఖాతా ఫలితాన్ని లాభనష్టాల ఖాతాకు మళ్ళిస్తారు.
6. అమ్మిన సరుకు వ్యయమును కనుక్కోవచ్చు.
7. అమ్మకాల ధోరణి విశ్లేషించవచ్చు.
8. స్థూల లాభ నిష్పత్తిని లెక్కించడానికి ఉపయోగపడుతుంది.

Exam Tips:

a) వర్తకపు ఖాతా నామమాత్రపు ఖాతా అని, ఖర్చులు డెబిట్ వైపు, ఆదాయాలు క్రెడిట్ వైపు అని తప్పక రాయండి.
b) ఖాతా నిల్వ స్థూల లాభం లేదా స్థూల నష్టం అని, అది లాభనష్టాల ఖాతాకు మళ్ళుతుందని చెప్పండి.

 

Question 3: లాభ-నష్టాల ఖాతా అర్థంను, ప్రధాన లక్షణాలను తెలపండి.

Answer:

1. వర్తకపు ఖాతా తయారు చేసిన తర్వాత నికర లాభాన్ని లేదా నష్టాన్ని తెలుసుకొనడానికి లాభనష్టాల ఖాతాను తయారు చేస్తారు.
2. ఇది నామమాత్రపు ఖాతా.
3. అందువలన అన్ని వ్యయాలను, నష్టాలను ఈ ఖాతాకు డెబిట్ చేయాలి. అలాగే లాభాలను, ఆదాయాలను క్రెడిట్ చేయాలి.
4. లాభనష్టాల ఖాతా చూపే నిల్వ నికర లాభమును లేదా నికర నష్టమును సూచిస్తుంది. ఈ మొత్తాన్ని ఆస్తి-అప్పుల పట్టీలో మూలధన ఖాతాకు కలపడంగాని, తీసివేయడంగాని చేస్తారు.
లాభనష్టాల ఖాతా లక్షణాలు:
1. లాభనష్టాల ఖాతా ముగింపు లెక్కల తయారీలో రెండవ దశ.
2. లాభనష్టాల ఖాతా నామమాత్రపు ఖాతా.
3. ఇది నికర లాభాన్ని లేదా నికర నష్టాన్ని తెలియజేస్తుంది.
4. లాభనష్టాల ఖాతాలో వచ్చిన ఫలితాన్ని ఆస్తి-అప్పుల పట్టీలోని మూలధనానికి మళ్ళించి సర్దుబాటు చేస్తారు.
5. నికర లాభ నిష్పత్తిని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.
6. ప్రస్తుత సంవత్సరము పరిపాలనా ఖర్చులను, అమ్మకము ఖర్చులను గత సంవత్సరము ఖర్చులతో పోల్చవచ్చును.
7. ఆస్తి-అప్పుల పట్టీని తయారుచేయడానికి సహాయపడుతుంది.

Exam Tips:

a) లాభనష్టాల ఖాతా నికర లాభం లేదా నష్టాన్ని తెలుపుతుందని, ఆ మొత్తాన్ని మూలధనంలో కలపడం లేదా తీసివేయడం చేస్తారని రాయండి.
b) వర్తకపు ఖాతా (స్థూల ఫలితం) మరియు లాభనష్టాల ఖాతా (నికర ఫలితం) మధ్య తేడా పరీక్షలో తరచుగా అడుగుతారు.

 

Question 4: వివిధ రకాల ఆస్తులను గూర్చి వివరించండి.

Answer:

సంస్థ నిర్వాహణకు, వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగపడే లేదా ప్రయోజనాలను ఇచ్చే అంశాలనే ఆస్తులు అంటారు.
ఈ ఆస్తులను ప్రధానంగా క్రింది రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి :
1. స్థిరాస్తులు
2. చరాస్తులు.
1. స్థిరాస్థులు:
1. శాశ్వత స్వభావం కలిగి ఉండి, తిరిగి అమ్మే ఉద్దేశ్యంతో కాకుండా, వ్యాపార నిర్వాహణ కోసం సమకూర్చుకొన్నటువంటి ఆస్తులను స్థిరాస్తులు అంటారు.
2. ఈ స్థిరాస్తులను తిరిగి కంటికి కనిపించే స్థిరాస్తులు మరియు కంటికి కనిపించని స్థిరాస్తులు అని విభజించవచ్చు.
3. కంటితో చూడకలిగి, చేయితో తాకకలిగే ఆస్తులను కనిపించే స్థిరాస్తులు అంటారు. భవనాలు, భూమి, యంత్రాలు, ఫర్నిచర్, వాహనాలు మొదలైనవి వీటికి ఉదాహరణలు. కంటితో చూడలేని, చేయితో తాకలేని ఆస్తులను కనిపించని స్థిరాస్తులు అంటారు. ఉదా : గుడ్విల్, పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్మార్కులు.
2. చరాస్తులు:
1. నగదులోకి సులభంగా మార్చుకోవడానికి వీలున్న, తిరిగి అమ్మడానికి వీలున్న ఆస్తులను చరాస్తులు అంటారు.
2. నగదు, బ్యాంకు నిల్వ, రుణగ్రస్తులు, సరుకు, వసూలు బిల్లులు మొదలైనవి ఈ తరహా ఆస్తులకు ఉదాహరణ.

Exam Tips:

a) ఆస్తులను స్థిరాస్తులు (కనిపించేవి, కనిపించనివి), చరాస్తులు అని వర్గీకరించి ప్రతిదానికి ఉదాహరణలు ఇవ్వండి.
b) గుడ్‌విల్, పేటెంట్లు కనిపించని స్థిరాస్తులు; రుణగ్రస్తులు, సరుకు నిల్వ చరాస్తులు; ఈ రెండు వర్గాలను కలపవద్దు.

 

Question 5: ‘ఉత్పత్తి ఖాతా’ను నిర్వచించి, అందులోని అంశాలను తెలపండి.

Answer:

1. వస్తువులను ఉత్పత్తి లేదా తయారు చేసే వర్తకుడు ఈ ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. వర్తకపు ఖాతా లాగానే ఈ ఖాతా కూడా నామమాత్రపు ఖాతా స్వభావాన్ని కలిగి ఉంటుంది.
2. సరుకులను పొందడానికి మరియు కర్మాగారములో వాటిని పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చడానికి అయిన ఖర్చులను పరిగణనలోకి తీసుకొని, ఈ ఉత్పత్తి ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది.
కొనసాగుతున్న పని మరియు తుక్కు అమ్మకాన్ని అలాగే ముగింపున ఉండే వివిధ రకాల సరుకులను ఈ ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయాలి.
3. సాధారణంగా డెబిట్ మొత్తం క్రెడిట్ మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ తేడాను ‘ఉత్పత్తి వ్యయం’ అంటారు. ఈ మొత్తాన్ని వర్తకపు ఖాతాకు మళ్ళించి ఆ ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది.
4. ఈ ఉత్పత్తి ఖాతాను అడ్డు వరుసలలో మరియు నిలువు వరుసలలో తయారు చేయడం జరుగుతుంది. వాటి యొక్క నమూనాను మరియు అందులోని అంశాలను క్రింద ఇవ్వడమైనది.
అడ్డువరుసల నమూనా:

............. సంవత్సరంతో అంతమయ్యే కాలానికి XYZ కో యొక్క ఉత్పత్తి ఖాతా
వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
To ప్రారంభపు సరుకుBy ముగింపు సరుకు
ఎ) ముడిపదార్థాలుXXXఎ) ముడిపదార్థాలుXXX
బి) తయారీలో ఉన్న సరుకుXXXబి) తయారీలో ఉన్న సరుకుXXX
సి) పూర్తిగా తయారైన సరుకుXXXXXXసి) పూర్తిగా తయారైన సరుకుXXXXXX
To కొనుగోళ్ళుXXXBy ఉత్పత్తి వ్యయం (వర్తకపు ఖాతాకు మళ్ళింపు)XXX
తీసివేయండి: కొనుగోలు వాపసులుXXXXXX
To వేతనాలు (ఉత్పత్తి)XXX
To రవాణాXXX
To క్లియరింగ్ ఛార్జీలుXXX
To గ్యాస్ మరియు బొగ్గుXXX
To నూనె మరియు ఇంధనంXXX
To ఫ్యాక్టరీ అద్దె, బీమా, లైటింగ్XXX
To ప్రవర్తక శక్తిXXX
XXXXXX

Exam Tips:

a) ఖాతా నమూనాను గీసి చూపండి: డెబిట్‌లో ప్రారంభ సరుకు, కొనుగోళ్ళు, ఉత్పత్తి ఖర్చులు; క్రెడిట్‌లో ముగింపు సరుకు.
b) డెబిట్, క్రెడిట్ తేడా అయిన ఉత్పత్తి వ్యయం వర్తకపు ఖాతా డెబిట్ వైపునకు మళ్ళుతుందని రాయండి.

 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

Question 1: విలంబిత వ్యయాలను నిర్వచించండి.

Answer:

1. రాబడి, మూలధన స్వభావాలు రెండింటిని కలిగి ఉండే వ్యయాలను విలంబిత రాబడి వ్యయాలు అంటారు. అంటే ఏదైనా ఒక సంవత్సరంలో వెచ్చించిన వ్యయాల యొక్క ప్రయోజనం ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం అవ్వకుండా భవిష్యత్ సంవత్సరాలకు కూడా విస్తరిస్తే, ఆ వ్యయాలను విలంబిత రాబడి వ్యయాలు అంటారు.
2. వ్యాపార ప్రకటనలపై మరియు పరిశోధనా – అభివృద్ధిపై వెచ్చించే ఖర్చులు, ప్రకటన ఖర్చులు వీటికి మంచి ఉదాహరణలు.
3. ముగింపు లెక్కలను తయారు చేసేటప్పుడు, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన భాగాన్ని లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపున రాసి, మిగిలిన భాగాన్ని, మూలధన స్వభావం కలిగినవిగా భావిస్తూ ఆస్తి-అప్పుల పట్టికలో ఆస్తుల వైపు చూపాలి.

Exam Tips:

a) నిర్వచనంతో పాటు ప్రకటన ఖర్చుల వంటి ఒక ఉదాహరణ రాయండి.
b) ప్రస్తుత సంవత్సరం భాగం లాభనష్టాల ఖాతాకు, మిగిలిన భాగం ఆస్తి-అప్పుల పట్టీలో ఆస్తిగా చూపుతారని చెప్పండి.

 

Question 2: చరాస్తులు మరియు చర అప్పులను నిర్వచించండి.

Answer:

చరాస్తులు:
1. తిరిగి అమ్మడానికిగాని లేదా స్వల్పకాలములో అనగా ఒక సంవత్సరములోపు నగదులోకి మార్చుకునే ఆస్తులను చరాస్తులు అంటారు. వీటిని ఫ్లోటింగ్ లేదా సర్క్యులేటింగ్ ఆస్తులని కూడా అంటారు.
2. ఉదా : చేతిలో నగదు, బాంకులో నగదు, వివిధ ఋణగ్రస్తులు, సరుకు నిల్వ మొదలైనవి.
చర అప్పులు లేదా ప్రస్తుత అప్పులు:
1. ఒక అకౌంటింగ్ సంవత్సరములో వ్యాపార సంస్థ తిరిగి చెల్లించవలసిన అప్పులను “చర అప్పులు” లేదా ప్రస్తుత అప్పులు అంటారు. ఇవి స్వల్పకాలిక ఋణబాధ్యతలు. కారణము అప్పు తీసుకున్న తేదీ నుంచి సంవత్సరములోపు చెల్లించవలసి ఉంటుంది.
2. ఉదా : చెల్లింపు బిల్లులు, వివిధ ఋణదాతలు, బాంకు ఓవర్ డ్రాఫ్ట్ మొదలైనవి.

Exam Tips:

a) చరాస్తులకు ఒక సంవత్సరంలోపు నగదుగా మారేవి, చర అప్పులకు ఒక సంవత్సరంలోపు చెల్లించవలసినవి అనే అంశం తప్పక ఉండాలి.
b) ఉదాహరణలు: చరాస్తులు నగదు, రుణగ్రస్తులు; చర అప్పులు ఋణదాతలు, చెల్లింపు బిల్లులు, బ్యాంకు ఓవర్‌డ్రాఫ్ట్.

 

Question 3: కంటికి కనిపించని ఆస్తులకు ఉదాహరణ ఇవ్వండి.

Answer:

1. ఏ ఆస్తులయితే కంటికి కనిపించకుండా అదృశ్యముగా ఉంటాయో వాటిని కంటికి కనిపించని ఆస్తులు అంటారు.
2. ఉదా : గుడ్విల్, పేటెంట్లు, ట్రేడ్మార్కులు.

Exam Tips:

a) రెండు ఉదాహరణలు చాలు: గుడ్‌విల్, పేటెంట్లు లేదా ట్రేడ్‌మార్కులు.
b) కనిపించని ఆస్తులు స్థిరాస్తులలో భాగమని గుర్తుంచుకోండి.

 

Question 4: అకౌంటింగ్ సమీకరణాన్ని రాయండి.

Answer:

1. ఆస్తులకు, అప్పులు మరియు మూలధనానికి మధ్యగల సంబంధాన్ని తెలియజేసే సమీకరణాన్ని అకౌంటింగ్ సమీకరణం అంటారు.
2. ఆస్తి-అప్పుల పట్టీలో ఎడమభాగంలో అప్పులు మరియు మూలధనాన్ని, కుడివైపు భాగంలో ఆస్తులను నమోదు చేస్తారు. సంక్షిప్త రూపంలో ఆస్తి- అప్పుల పట్టిక అకౌంటింగ్ సమీకరణాన్ని తెలియజేస్తుంది.
3. అకౌంటింగ్ సమీకరణం:
ఆస్తులు = అప్పులు + మూలధనం

Exam Tips:

a) సమీకరణం: ఆస్తులు = అప్పులు + మూలధనం; ఆస్తి-అప్పుల పట్టీ దీనికే ఆధారం.
b) పట్టీలో ఎడమవైపు అప్పులు, మూలధనం; కుడివైపు ఆస్తులు అని రాయండి.

 

Question 5: ప్రారంభపు, ముగింపు సరుకులపై చిన్న వ్యాసం రాయండి.

Answer:

ప్రారంభపు సరుకు:
1. గత సంవత్సరపు ముగింపు సరుకే, ప్రస్తుత సంవత్సరానికి ప్రారంభపు సరుకు అవుతుంది. వర్తకపు ఖాతాలో డెబిట్ వైపున వ్రాసే మొట్టమొదటి అంశం ఈ ప్రారంభపు సరుకు.
2. ఇది ఎప్పుడు డెబిట్ నిల్వను చూపుతుంది.
ముగింపు సరుకు:
1. ప్రస్తుత అకౌంటింగ్ సంవత్సరంలో అమ్మకుండా మిగిలిపోయిన సరుకులను ‘ముగింపు సరుకులు’ అంటారు.
2. ఈ ముగింపు సరుకును అంకణాలో గాని సర్దుబాట్లో గాని ఇవ్వవచ్చు. అంకణాలో మాత్రమే ఇస్తే, కేవలం ఆస్తి – అప్పుల పట్టికలో ఆస్తుల వైపు రాయాలి. అలా కాకుండా సర్దుబాట్లో ఇస్తే మొదట వర్తకపు ఖాతాలో క్రెడిట్వైపున, రెండవసారి ఆస్తి – అప్పుల పట్టికలో ఆస్తుల వైపున నమోదు చేయాలి.

Exam Tips:

a) ప్రారంభపు సరుకు వర్తకపు ఖాతా డెబిట్ వైపు మొదటి అంశం.
b) ముగింపు సరుకు అంకణాలో ఉంటే ఒక్కసారే (ఆస్తుల వైపు), సర్దుబాటులో ఇస్తే రెండుసార్లు (వర్తకపు ఖాతా క్రెడిట్ వైపు, ఆస్తి-అప్పుల పట్టీ ఆస్తుల వైపు) చూపాలి.

 

అదనపు ప్రశ్నలు:

Question 1: మూలధన వ్యయాన్ని నిర్వచించి, రెండు ఉదాహరణలు రాయండి.

Answer:

1. స్థిరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా సంస్థ లాభార్జన శక్తిని పెంపొందించడానికి చేసే వ్యయాన్ని మూలధన వ్యయము అంటారు. ఈ వ్యయం ద్వారా సంస్థకు కొన్ని సంవత్సరాలపాటు ప్రయోజనము కలుగుతుంది.
2. ప్లాంటు-యంత్రాలు, భవనాలు మొదలైన స్థిరాస్తుల కొనుగోలు, యంత్రాల స్థాపన, వాటి అభివృద్ధి ఖర్చులు మూలధన వ్యయాలకు ఉదాహరణలు.

Exam Tips:

a) నిర్వచనం, రెండు ఉదాహరణలు (యంత్రాల కొనుగోలు, భవనాల నిర్మాణం) రాయండి.
b) మూలధన వ్యయం ఆస్తి-అప్పుల పట్టీలో ఆస్తిగా చేరుతుంది, లాభనష్టాల ఖాతాలో కాదు.

 

Question 2: రాబడి వ్యయాన్ని నిర్వచించి, రెండు ఉదాహరణలు రాయండి.

Answer:

1. సాధారణ వ్యాపార సరళిలో సంస్థ పెట్టిన ఖర్చులను రాబడి వ్యయము అంటారు. ఈ ఖర్చుల వలన సంస్థకు కలిగే ప్రయోజనము ఒక అకౌంటింగ్ సంవత్సరానికి పరిమితమవుతుంది.
2. ఉదా : జీతాలు, అద్దె, రవాణా, ఆఫీసు ఖర్చులు, అమ్మకాల ఖర్చులు మొదలైనవి.

Exam Tips:

a) ప్రయోజనం ఒక అకౌంటింగ్ సంవత్సరానికే పరిమితం అని రాయండి.
b) ఈ ఖర్చులను లాభనష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారు; ఉదాహరణలు జీతాలు, అద్దె.

 

Question 3: మూలధన ఆదాయమంటే ఏమిటి ? రెండు ఉదాహరణలు రాయండి.

Answer:

1. సంస్థ యజమానుల నుంచి పెట్టుబడి రూపములో వచ్చినవి, తీసుకున్న అప్పులు, ఆస్తుల అమ్మకము ద్వారా వచ్చిన వసూళ్ళను మూలధన ఆదాయము అంటారు.
2. ఉదా : మూలధనము, యంత్రాల అమ్మకము.

Exam Tips:

a) మూలధనం, తీసుకున్న అప్పులు, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చేవి మూలధన ఆదాయాలు.
b) ఇవి లాభనష్టాల ఖాతాలో కాకుండా ఆస్తి-అప్పుల పట్టీలో చూపుతారు.

 

Question 4: కంటికి కనిపించే ఆస్తులు అనగానేమి ? రెండు ఉదాహరణలు రాయండి.

Answer:

1. ఏ ఆస్తులనయితే కంటితో చూడగలిగి, అస్థిత్వము (చేతితో తాకగలిగిన) తో ఉంటాయో వాటిని కంటికి కనిపించే ఆస్తులు అంటారు.
2. ఉదా : యంత్రాలు, ఫర్నిచర్, భవనాలు.

Exam Tips:

a) ఉదాహరణలు: యంత్రాలు, ఫర్నిచర్, భవనాలు; చేతితో తాకగలిగేవి అని నిర్వచనంలో రాయండి.
b) కనిపించని ఆస్తులైన గుడ్‌విల్‌తో పోల్చి రాస్తే సమాధానం స్పష్టంగా ఉంటుంది.

 

సమస్యలు:

Question 1: 31.12.2015 తో అంతమయ్యే కాలానికి శ్రీకాంత్ ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
1-1-2015 న సరుకు8,500రవాణా500
కొనుగోళ్ళు15,200కర్మాగారం అద్దె925
అమ్మకాలు33,000అమ్మకాల వాపసులు500
కొనుగోలు వాపసులు1,200కస్టమ్స్ సుంకాలు800
వేతనాలు87531.12.2015 న సరుకు3,500

Answer:

31.12.2015తో అంతమయ్యే సంవత్సరానికి శ్రీకాంత్ ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు (1.1.2015)8,500By అమ్మకాలు33,000
To కొనుగోళ్ళు15,200తీసివేయండి: అమ్మకాల వాపసులు50032,500
తీసివేయండి: కొనుగోలు వాపసులు1,20014,000By ముగింపు సరుకు (31.12.2015)3,500
To వేతనాలు875
To రవాణా500
To కర్మాగారం అద్దె925
To కస్టమ్స్ సుంకాలు800
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)10,400
మొత్తం36,000మొత్తం36,000

Exam Tips:

a) వర్తకపు ఖాతా డెబిట్: ప్రారంభ సరుకు, నికర కొనుగోళ్ళు (కొనుగోళ్ళు − కొనుగోలు వాపసులు), వేతనాలు, రవాణా, కర్మాగారం అద్దె, కస్టమ్స్; క్రెడిట్: నికర అమ్మకాలు, ముగింపు సరుకు.
b) ఇక్కడ స్థూల లాభం ₹ 10,400; రెండు వైపులా మొత్తం ₹ 36,000 సరిపోవాలి.

 

Question 2: 31.03.2017 సంవత్సరంతో అంతమయ్యే కాలానికి వర్తకపు ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు2,100కొనుగోళ్ళు6,400
అమ్మకాలు18,500వాపసులు లోపలికి700
వాపసులు బయటికి500కొనుగోలు రవాణా625
వేతనాలు975ఫ్యాక్టరీ బీమా400
క్లియరింగ్ ఛార్జీలు500ఫ్రైట్3,000
ముగింపు సరుకు2,500

Answer:

31.03.2017తో అంతమయ్యే సంవత్సరానికి వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు2,100By అమ్మకాలు18,500
To కొనుగోళ్ళు6,400తీసివేయండి: వాపసులు లోపలికి70017,800
తీసివేయండి: వాపసులు బయటికి5005,900By ముగింపు సరుకు2,500
To వేతనాలు975
To క్లియరింగ్ ఛార్జీలు500
To కొనుగోలు రవాణా625
To ఫ్యాక్టరీ బీమా400
To ఫ్రైట్3,000
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)6,800
మొత్తం20,300మొత్తం20,300

Exam Tips:

a) వాపసులు బయటికి (₹ 500) కొనుగోళ్ళ నుండి, వాపసులు లోపలికి (₹ 700) అమ్మకాల నుండి తీసివేయండి.
b) కొనుగోలు రవాణా, ఫ్రైట్, క్లియరింగ్ ఛార్జీలు డెబిట్ వైపు చేర్చడం మరవకండి; స్థూల లాభం ₹ 6,800, మొత్తం ₹ 20,300.

 

Question 3: వర్తకపు ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
నగదు కొనుగోళ్ళు12,500కొనుగోలు వాపసులు750
అరువు కొనుగోళ్ళు8,500అమ్మకాల వాపసులు300
రవాణా1,200అమ్మకాలు29,300
వేతనాలు & జీతాలు1,400నూనె & ఇంధనం900
ఫ్యాక్టరీ లైటింగ్550ముగింపు సరుకు1,500

Answer:

వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To కొనుగోళ్ళు: నగదు12,500By అమ్మకాలు29,300
అరువు8,500తీసివేయండి: అమ్మకాల వాపసులు30029,000
21,000By ముగింపు సరుకు1,500
తీసివేయండి: కొనుగోలు వాపసులు75020,250
To రవాణా1,200
To వేతనాలు & జీతాలు1,400
To ఫ్యాక్టరీ లైటింగ్550
To నూనె & ఇంధనం900
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)6,200
మొత్తం30,500మొత్తం30,500

Exam Tips:

a) నగదు, అరువు కొనుగోళ్ళను కలిపి ₹ 21,000 గా చూపి, కొనుగోలు వాపసులు ₹ 750 తీసివేయండి.
b) స్థూల లాభం ₹ 6,200; రెండు వైపులా మొత్తం ₹ 30,500.

 

Question 4: హైదరాబాద్ ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతాను 31.12.2017 నాటికి తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు4,700కొనుగోళ్ళు20,000
అమ్మకాలు39,000వాపసులు (డెబిట్ నిల్వ)800
ఉత్పత్తి ఖర్చులు975వాపసులు (క్రెడిట్ నిల్వ)400
వేతనాలు1,650రవాణా500
బొగ్గు మరియు నీరు425దిగుమతి సుంకాలు1,000

Answer:

31.12.17తో అంతమయ్యే సంవత్సరానికి హైదరాబాద్ ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు4,700By అమ్మకాలు39,000
To కొనుగోళ్ళు20,000తీసివేయండి: వాపసులు (డెబిట్)80038,200
తీసివేయండి: వాపసులు (క్రెడిట్)40019,600
To వేతనాలు1,650
To బొగ్గు & నీరు425
To ఉత్పత్తి ఖర్చులు975
To రవాణా500
To దిగుమతి సుంకాలు1,000
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)9,350
మొత్తం38,200మొత్తం38,200

Exam Tips:

a) ఇక్కడ ముగింపు సరుకు ఇవ్వలేదు; వాపసులు (క్రెడిట్ నిల్వ) కొనుగోళ్ళ నుండి, వాపసులు (డెబిట్ నిల్వ) అమ్మకాల నుండి తీసివేయండి.
b) ఉత్పత్తి ఖర్చులు, బొగ్గు–నీరు, దిగుమతి సుంకాలు డెబిట్ వైపు; స్థూల లాభం ₹ 9,350.

 

Question 5: కింది వివరాల ఆధారంగా 31.03.2019న లాభనష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
జీతాలు1,500వచ్చిన డిస్కౌంట్1,500
అద్దె800స్థూల లాభం9,000
స్టేషనరీ500
ఇచ్చిన డిస్కౌంట్400
ప్రకటన ఖర్చులు1,600
చెల్లించిన కమీషన్700

Answer:

31.03.19తో అంతమయ్యే సంవత్సరానికి లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
To జీతాలు1,500By స్థూల లాభం9,000
To అద్దె800By వచ్చిన డిస్కౌంట్1,500
To స్టేషనరీ500
To ఇచ్చిన డిస్కౌంట్400
To వ్యాపార ప్రకటనలు1,600
To చెల్లించిన కమీషన్700
To నికర లాభం (మూలధన ఖాతాకు మళ్ళింపు)5,000
మొత్తం10,500మొత్తం10,500

Exam Tips:

a) స్థూల లాభం, వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ వైపు; మిగిలిన ఖర్చులు డెబిట్ వైపు రాయండి.
b) నికర లాభం ₹ 5,000 ను మూలధన ఖాతాకు మళ్ళించండి; మొత్తం ₹ 10,500.

 

Question 6: కింద ఇచ్చిన వివరాల నుంచి లాభనష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
అద్దె, పన్నులు850చెల్లించిన డిస్కౌంట్300
జీతాలు & వేతనాలు1,000వచ్చిన డిస్కౌంట్2,900
పోస్టేజి1,175వచ్చిన వడ్డీ1,600
ప్రయాణపు ఖర్చులు800వర్తకపు ఖర్చులు350
రానిబాకీలు500రిపేర్లు300
తరుగుదల700లీగల్ ఖర్చులు950
అమ్మకాల రవాణా500ఆడిట్ ఛార్జీలు375
స్థూల లాభం12,800

Answer:

లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
To అద్దె, పన్నులు850By స్థూల లాభం12,800
To జీతాలు & వేతనాలు1,000By వచ్చిన డిస్కౌంట్2,900
To పోస్టేజి1,175By వచ్చిన వడ్డీ1,600
To ప్రయాణపు ఖర్చులు800
To రానిబాకీలు500
To తరుగుదల700
To అమ్మకాల రవాణా500
To ఇచ్చిన డిస్కౌంట్300
To వర్తకపు ఖర్చులు350
To రిపేర్లు300
To లీగల్ ఖర్చులు950
To ఆడిట్ ఛార్జీలు375
To నికర లాభం (మూలధన ఖాతాకు మళ్ళింపు)9,500
మొత్తం17,300మొత్తం17,300

Exam Tips:

a) ఇచ్చిన డిస్కౌంట్ ఖర్చు (డెబిట్), వచ్చిన డిస్కౌంట్ ఆదాయం (క్రెడిట్); ఈ రెంటినీ కలపవద్దు.
b) స్థూల లాభం ₹ 12,800 క్రెడిట్ వైపు మొదటి అంశం; నికర లాభం ₹ 9,500, మొత్తం ₹ 17,300.

 

Question 7: కింది వివరాల నుంచి 31.12.2018న వర్తకపు, లాభనష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు4,200జీతాలు1,200
కొనుగోళ్ళు7,700వేతనాలు750
అద్దె650కొనుగోలు వాపసులు200
అమ్మకాలు15,500ఇచ్చిన డిస్కౌంట్525
ప్రయాణ ఖర్చులు400అమ్మకాల వాపసులు300
వచ్చిన వడ్డీ800కస్టమ్స్ సుంకాలు600
క్లియరింగ్ ఛార్జీలు400వర్తకపు ఖర్చులు700
ముగింపు సరుకు4,000

Answer:

31.12.18 నాటి వర్తకపు, లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు4,200By అమ్మకాలు15,500
To కొనుగోళ్ళు7,700తీసివేయండి: అమ్మకాల వాపసులు30015,200
తీసివేయండి: కొనుగోలు వాపసులు2007,500By ముగింపు సరుకు4,000
To క్లియరింగ్ ఛార్జీలు400
To వేతనాలు750
To కస్టమ్స్ సుంకాలు600
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)5,750
మొత్తం19,200మొత్తం19,200
To అద్దె650By స్థూల లాభం5,750
To ప్రయాణ ఖర్చులు400By వచ్చిన వడ్డీ800
To ఇచ్చిన డిస్కౌంట్525
To జీతాలు1,200
To వర్తకపు ఖర్చులు700
To నికర లాభం (మూలధన ఖాతాకు మళ్ళింపు)3,075
మొత్తం6,550మొత్తం6,550

Exam Tips:

a) ఒకే ఖాతాలో రెండు భాగాలు రాయండి: మొదట వర్తకపు భాగం (స్థూల లాభం ₹ 5,750), తరువాత లాభనష్టాల భాగం (నికర లాభం ₹ 3,075).
b) వచ్చిన వడ్డీ లాభనష్టాల ఖాతా క్రెడిట్ వైపు వెళ్తుంది, వర్తకపు ఖాతాలో కాదు.

 

Question 8: 31.12.2017తో అంతమయ్యే సంవత్సరానికి సురేష్ ట్రేడర్స్ యొక్క వర్తకపు, లాభనష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
సరుకు (1.1.17)2,300కొనుగోళ్ళు13,700
అమ్మకాలు28,900కొనుగోలు రవాణా600
అమ్మకాల రవాణా425వేతనాలు2,825
జీతాలు3,000ఇచ్చిన డిస్కౌంట్550
వచ్చిన డిస్కౌంట్3,975ఫ్యాక్టరీ అద్దె750
ఆఫీసు అద్దె1,500కస్టమ్స్ సుంకాలు450
క్లియరింగ్ ఛార్జీలు325స్టేషనరీ750
టెలిఫోన్ ఛార్జీలు1,275కొనుగోలు వాపసులు200
అమ్మకాల వాపసులు400ముగింపు సరుకు8,800

Answer:

31.12.17తో అంతమయ్యే సంవత్సరానికి సురేష్ ట్రేడర్స్ వర్తకపు, లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు (1-1-2017)2,300By అమ్మకాలు28,900
To కొనుగోళ్ళు13,700తీసివేయండి: అమ్మకాల వాపసులు40028,500
తీసివేయండి: కొనుగోలు వాపసులు20013,500By ముగింపు సరుకు8,800
To క్లియరింగ్ ఛార్జీలు325
To కొనుగోలు రవాణా600
To వేతనాలు2,825
To ఫ్యాక్టరీ అద్దె750
To కస్టమ్స్ సుంకాలు450
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)16,550
మొత్తం37,300మొత్తం37,300
To అమ్మకాల రవాణా425By స్థూల లాభం16,550
To జీతాలు3,000By వచ్చిన డిస్కౌంట్3,975
To ఆఫీసు అద్దె1,500
To టెలిఫోన్ ఛార్జీలు1,275
To ఇచ్చిన డిస్కౌంట్550
To స్టేషనరీ750
To నికర లాభం (మూలధన ఖాతాకు తరలింపు)13,025
మొత్తం20,525మొత్తం20,525

Exam Tips:

a) కర్మాగారం అద్దె, కస్టమ్స్, కొనుగోలు రవాణా వర్తకపు ఖాతాకు; ఆఫీసు అద్దె, టెలిఫోన్, స్టేషనరీ, అమ్మకాల రవాణా లాభనష్టాల ఖాతాకు.
b) స్థూల లాభం ₹ 16,550, నికర లాభం ₹ 13,025.

 

Question 9: క్రింది అంకణ నుండి 31.12.2018 తో అంతమయ్యే సంవత్సరానికి శ్రీమతి వీణా రెడ్డి యొక్క వర్తకపు మరియు లాభ-నష్టాల ఖాతాలను తయారు చేయండి.

డెబిట్ నిల్వలుమొత్తం (₹)క్రెడిట్ నిల్వలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు7,800మూలధనం38,000
కొనుగోళ్ళు35,000వచ్చిన డిస్కౌంట్2,850
రవాణా2,000వచ్చిన అద్దె3,750
వేతనాలు1,650అమ్మకాలు26,800
జీతాలు4,000కొనుగోలు వాపసులు2,000
క్లియరింగ్ ఛార్జీలు400వాటాలపై డివిడెండ్లు1,225
ఫర్నిచర్9,000
ఇచ్చిన డిస్కౌంట్525
రానిబాకీలు475
అమ్మకపు ఖర్చులు350
యంత్రాలు10,000
దిగుమతి సుంకాలు650
అమ్మకాల వాపసులు500
ప్రకటనలు3,700
చెల్లించిన వడ్డీ500
వర్తకపు ఖర్చులు325
నూనె & ఇంధనం250
అద్దె2,650
రవాణా450
మొత్తం80,225మొత్తం80,225
ముగింపు సరుకు7,200

నోట్ : లెక్కలో రవాణా రెండుసార్లు ఇచ్చారు. అందువల్ల రెండో రవాణాను అమ్మకాల రవాణాగా తీసుకున్నాము.

Answer:

31.12.18తో అంతమయ్యే సంవత్సరానికి శ్రీమతి వీణారెడ్డి యొక్క వర్తకపు, లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు7,800By అమ్మకాలు26,800
To కొనుగోళ్ళు35,000తీసివేయండి: అమ్మకాల వాపసులు50026,300
తీసివేయండి: కొనుగోలు వాపసులు2,00033,000By ముగింపు సరుకు7,200
To రవాణా2,000By స్థూల నష్టం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)12,250
To వేతనాలు1,650
To క్లియరింగ్ ఛార్జీలు400
To దిగుమతి సుంకాలు650
To నూనె, ఇంధనం250
మొత్తం45,750మొత్తం45,750
To స్థూల నష్టం12,250By వచ్చిన డిస్కౌంట్2,850
To జీతాలు4,000By వచ్చిన అద్దె3,750
To ఇచ్చిన డిస్కౌంట్525By వాటాల డివిడెండ్లు1,225
To రానిబాకీలు475By నికర నష్టం (మూలధన ఖాతాకు మళ్ళింపు)17,400
To అమ్మకాల ఖర్చులు350
To ప్రకటనలు3,700
To చెల్లించిన వడ్డీ500
To వర్తకపు ఖర్చులు325
To అద్దె2,650
To అమ్మకాల రవాణా450
మొత్తం25,225మొత్తం25,225

Exam Tips:

a) అంకణాలో రవాణా రెండుసార్లు ఉంది; మొదటిది వర్తకపు ఖాతాలో, రెండవది అమ్మకాల రవాణాగా లాభనష్టాల ఖాతాలో చూపండి.
b) ఇక్కడ డెబిట్ ఎక్కువ కాబట్టి స్థూల నష్టం ₹ 12,250, నికర నష్టం ₹ 17,400 వస్తాయి; నష్టాన్ని మూలధనం నుండి తీసివేయాలి.
c) ముద్రించిన క్రెడిట్ మొత్తం (₹ 80,225) జాబితా చేసిన క్రెడిట్ల కూడికతో సరిపోదు; ఖాతాల తయారీకి ఇది అడ్డంకి కాదు.

 

Question 10: వర్తకపు, లాభ-నష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు3,700ఫ్యాక్టరీ బీమా350
కొనుగోళ్ళు7,100ప్రకటన ఖర్చులు700
అమ్మకాలు18,000డిస్కౌంట్550
వాపసులు లోనికి250వర్తకపు ఖర్చులు250
వాపసులు బయటికి500వచ్చిన డిస్కౌంట్1,600
రవాణా450వచ్చిన వడ్డీ975
వేతనాలు2,725తరుగుదల525
జీతాలు800అమ్మకాల రవాణా450
రానిబాకీలు500ముగింపు సరుకు4,600
కస్టమ్స్ సుంకాలు600

Answer:

వర్తకపు, లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు3,700By అమ్మకాలు18,000
To కొనుగోళ్ళు7,100తీసివేయండి: వాపసులు లోనికి25017,750
తీసివేయండి: వాపసులు బయటికి5006,600By ముగింపు సరుకు4,600
To రవాణా450
To వేతనాలు2,725
To కస్టమ్స్ సుంకాలు600
To ఫ్యాక్టరీ బీమా350
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)7,925
మొత్తం22,350మొత్తం22,350
To జీతాలు800By స్థూల లాభం7,925
To రానిబాకీలు500By వచ్చిన డిస్కౌంట్1,600
To ప్రకటన ఖర్చులు700By వచ్చిన వడ్డీ975
To డిస్కౌంట్550
To వర్తకపు ఖర్చులు250
To తరుగుదల525
To అమ్మకాల రవాణా450
To నికర లాభం (మూలధన ఖాతాకు మళ్ళింపు)6,725
మొత్తం10,500మొత్తం10,500

Exam Tips:

a) ముందుగా అంశాలను విభజించండి: వర్తకపు ఖాతా (ప్రారంభ సరుకు, కొనుగోళ్ళు, రవాణా, వేతనాలు, కస్టమ్స్, ఫ్యాక్టరీ బీమా), మిగిలినవి లాభనష్టాల ఖాతా.
b) స్థూల లాభం ₹ 7,925, నికర లాభం ₹ 6,725.

 

Question 11: క్రింది వివరాల నుంచి 31.12.2016 న యాదగిరి యొక్క ఆస్తి – అప్పుల పట్టీను తయారు చేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
మూలధనం35,000చెల్లింపు బిల్లులు9,000
యంత్రాలు60,000వసూలు బిల్లులు10,000
ఋణదాతలు17,500ఫర్నిచర్8,000
ఋణం22,500నికర లాభం12,000
ఋణగ్రస్తులు34,000ముగింపు సరుకు8,000
బ్యాంకు ఓవర్‌డ్రాఫ్ట్24,000

Answer:

31.12.16 నాటి యాదగిరి యొక్క ఆస్తి-అప్పుల పట్టీ
మూలధనము మరియు అప్పులుమొత్తం (₹)మొత్తం (₹)ఆస్తులుమొత్తం (₹)మొత్తం (₹)
ఋణదాతలు17,500వసూలు బిల్లులు10,000
చెల్లింపు బిల్లులు9,000ఋణగ్రస్తులు34,000
బ్యాంకు ఓవర్‌డ్రాఫ్ట్24,000ముగింపు సరుకు8,000
ఋణం22,500యంత్రాలు60,000
మూలధనం35,000ఫర్నిచర్8,000
కూడిక: నికర లాభం12,00047,000
మొత్తం1,20,000మొత్తం1,20,000

Exam Tips:

a) ఎడమవైపు అప్పులు, మూలధనం (మూలధనం + నికర లాభం = ₹ 47,000), కుడివైపు ఆస్తులు; రెండు వైపులా మొత్తం ₹ 1,20,000.
b) బ్యాంకు ఓవర్‌డ్రాఫ్ట్, ఋణం, చెల్లింపు బిల్లులు అప్పులు; వసూలు బిల్లులు, ఋణగ్రస్తులు ఆస్తులు.

 

Question 12: కర్నాకర్ రెడ్డి ఆస్తి-అప్పుల పట్టీను 31.12.2017 న తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
ఋణదాతలు21,000పెట్టుబడులు75,000
ముగింపు సరుకు12,000ఋణగ్రస్తులు38,000
మూలధనం1,65,000ఫర్నిచర్18,000
కెనరా బ్యాంకు ఋణం75,000గుడ్‌విల్20,000
యంత్రాలు1,15,000చెల్లించాల్సిన జీతాలు17,000

Answer:

31.12.2017 నాటి కర్నాకర్ రెడ్డి యొక్క ఆస్తి-అప్పుల పట్టీ
మూలధనము మరియు అప్పులుమొత్తం (₹)ఆస్తులుమొత్తం (₹)
ఋణదాతలు21,000ఋణగ్రస్తులు38,000
మూలధనము1,65,000పెట్టుబడులు75,000
కెనరా బ్యాంకు ఋణం75,000ముగింపు సరుకు12,000
చెల్లించాల్సిన జీతాలు17,000యంత్రాలు1,15,000
ఫర్నిచర్18,000
గుడ్‌విల్20,000
మొత్తం2,78,000మొత్తం2,78,000

Exam Tips:

a) ఇక్కడ నికర లాభం ఇవ్వలేదు; మూలధనం ₹ 1,65,000 ను నేరుగా తీసుకోండి.
b) కెనరా బ్యాంకు ఋణం, చెల్లించాల్సిన జీతాలు అప్పుల వైపు; పెట్టుబడులు, గుడ్‌విల్ ఆస్తుల వైపు; మొత్తం ₹ 2,78,000.

 

Question 13: మాధవి ట్రేడర్స్ యొక్క ఆస్తి-అప్పుల పట్టీను 31.12.2016న తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
నికర లాభం4,500విడి పరికరాలు3,000
పెట్టుబడులు10,000చెల్లించాల్సిన జీతాలు500
ఫర్నిచర్3,000ఋణదాతలు6,500
యంత్రాలు14,500నగదు1,000
ఋణగ్రస్తులు15,000ముగింపు సరుకు2,500
వసూలు బిల్లులు12,500
మూలధనం50,000

Answer:

మూలధనము మరియు అప్పులుమొత్తం (₹)మొత్తం (₹)ఆస్తులుమొత్తం (₹)మొత్తం (₹)
ఋణదాతలు6,500నగదు1,000
చెల్లించాల్సిన జీతాలు500వసూలు బిల్లులు12,500
మూలధనము50,000ఋణగ్రస్తులు15,000
కూడిక: నికర లాభం4,50054,500పెట్టుబడులు10,000
ముగింపు సరుకు2,500
విడి పరికరాలు3,000
యంత్రాలు14,500
ఫర్నిచర్3,000
మొత్తం61,500మొత్తం61,500

Exam Tips:

a) నికర లాభం ₹ 4,500 ను మూలధనానికి కలపండి (₹ 54,500); విడి పరికరాలు ఆస్తి.
b) చెల్లించాల్సిన జీతాలు అప్పు; రెండు వైపులా మొత్తం ₹ 61,500.

 

Question 14: క్రింది అంకణా నుండి సాహిత్య యొక్క వర్తకపు ఖాతాను, లాభ-నష్టాల ఖాతాను, ఆస్తి-అప్పుల పట్టీను తయారు చేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
ఋణగ్రస్తులు16,300మూలధనం40,000
నగదు12,500అమ్మకాలు9,000
ఫర్నిచర్10,000కొనుగోలు వాపసులు500
కొనుగోళ్ళు3,500ఋణదాతలు2,500
అమ్మకాల వాపసులు300
ప్రారంభపు సరుకు2,000
అద్దె & రేట్లు750
బీమా350
వేతనాలు800
రవాణా500
డిస్కౌంట్650
నూనె & ఇంధనం550
సొంతవాడకాలు2,900
అమ్మకాల రవాణా300
స్టేషనరీ600
మొత్తం52,000మొత్తం52,000
ముగింపు సరుకు2,600

Answer:

సాహిత్య యొక్క వర్తకపు, లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు2,000By అమ్మకాలు9,000
To కొనుగోళ్ళు3,500తీసివేయండి: అమ్మకాల వాపసులు3008,700
తీసివేయండి: కొనుగోలు వాపసులు5003,000By ముగింపు సరుకు2,600
To వేతనాలు800
To రవాణా500
To నూనె, ఇంధనం550
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)4,450
మొత్తం11,300మొత్తం11,300
To అద్దె మరియు రేట్లు750By స్థూల లాభం4,450
To బీమా350
To డిస్కౌంట్650
To అమ్మకాల రవాణా300
To స్టేషనరీ600
To నికర లాభం (మూలధన ఖాతాకు మళ్ళింపు)1,800
మొత్తం4,450మొత్తం4,450
సాహిత్య యొక్క ఆస్తి-అప్పుల పట్టీ
మూలధనము మరియు అప్పులుమొత్తం (₹)మొత్తం (₹)ఆస్తులుమొత్తం (₹)మొత్తం (₹)
ఋణదాతలు2,500నగదు12,500
మూలధనము40,000ఋణగ్రస్తులు16,300
కూడిక: నికర లాభం1,800ఫర్నిచర్10,000
41,800ముగింపు సరుకు2,600
తీసివేయండి: సొంతవాడకాలు2,90038,900
మొత్తం41,400మొత్తం41,400

Exam Tips:

a) మూడు ఖాతాలు తయారుచేయండి: స్థూల లాభం ₹ 4,450, నికర లాభం ₹ 1,800, ఆస్తి-అప్పుల పట్టీ మొత్తం ₹ 41,400.
b) సొంతవాడకాలు (₹ 2,900) లాభనష్టాల ఖాతాలో కాకుండా ఆస్తి-అప్పుల పట్టీలో మూలధనం నుండి తీసివేయండి.

 

Question 15: క్రింది అంకణా నుంచి 31.03.2015న సుజాత యొక్క ముగింపు లెక్కలను తయారు చేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
కొనుగోళ్ళు6,500అమ్మకాలు15,000
ప్రారంభపు సరుకు7,100మూలధనం30,000
వాపసులు800చెల్లింపు బిల్లులు3,000
అద్దె మరియు పన్నులు1,500వచ్చిన వడ్డీ2,650
ఋణగ్రస్తులు10,000బాంకు ఋణం5,000
జీతాలు6,500
యంత్రాలు9,500
ప్రవర్తక శక్తి850
బీమా900
తరుగుదల700
వేతనాలు2,700
ఫర్నిచర్6,400
సొంతవాడకాలు1,000
ప్రకటనలు1,200
మొత్తం55,650మొత్తం55,650
ముగింపు సరుకు3,000

Answer:

31.3.15తో అంతమయ్యే సంవత్సరానికి సుజాత యొక్క వర్తకపు, లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు7,100By అమ్మకాలు15,000
To కొనుగోళ్ళు6,500తీసివేయండి: అమ్మకాల వాపసులు80014,200
To ప్రవర్తక శక్తి850By ముగింపు సరుకు3,000
To వేతనాలు2,700
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)50
మొత్తం17,200మొత్తం17,200
To అద్దె మరియు పన్నులు1,500By స్థూల లాభం50
To జీతాలు6,500By వచ్చిన వడ్డీ2,650
To బీమా900By నికర నష్టం (మూలధన ఖాతాకు మళ్ళింపు)8,100
To తరుగుదల700
To ప్రకటనలు1,200
మొత్తం10,800మొత్తం10,800
31.03.2015 నాటి సుజాత యొక్క ఆస్తి-అప్పుల పట్టీ
మూలధనము మరియు అప్పులుమొత్తం (₹)మొత్తం (₹)ఆస్తులుమొత్తం (₹)మొత్తం (₹)
చెల్లింపు బిల్లులు3,000ఋణగ్రస్తులు10,000
బాంకు ఋణం5,000ముగింపు సరుకు3,000
మూలధనం30,000ఫర్నిచర్6,400
తీసివేయండి: నికర నష్టం8,100యంత్రాలు9,500
21,900
తీసివేయండి: సొంతవాడకాలు1,00020,900
మొత్తం28,900మొత్తం28,900

Exam Tips:

a) స్థూల లాభం కేవలం ₹ 50, ఖర్చులు ఎక్కువ కాబట్టి నికర నష్టం ₹ 8,100 వస్తుంది; దీనిని మూలధనం నుండి తీసివేయండి.
b) మూలధనం: ₹ 30,000 − 8,100 − 1,000 (సొంతవాడకాలు) = ₹ 20,900.

 

పాఠ్యపుస్తక ఉదాహరణలు:

Question 1: క్రింది సమాచారం నుంచి 31.12.2018 తో అంతమయ్యే కాలానికి శైలజ ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతాను తయారు చేయండి.

వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు40,000
కొనుగోళ్ళు85,000
అమ్మకాలు1,80,000
కొనుగోలు వాపసులు3,000
అమ్మకాల వాపసులు5,000
వేతనాలు8,000
రవాణా2,000
బొగ్గు, గ్యాసు మరియు ఇంధనం7,000
ఫ్యాక్టరీ అద్దె4,000
ముగింపు సరుకు9,000

Answer:

31.12.2018తో అంతమయ్యే కాలానికి శైలజ ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు40,000By అమ్మకాలు1,80,000
To కొనుగోళ్ళు85,000తీసివేయండి: అమ్మకాల వాపసులు5,0001,75,000
తీసివేయండి: కొనుగోలు వాపసులు3,00082,000By ముగింపు సరుకు9,000
To వేతనాలు8,000
To రవాణా2,000
To బొగ్గు, గ్యాస్, ఇంధనం7,000
To ఫ్యాక్టరీ అద్దె4,000
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)41,000
మొత్తం1,84,000మొత్తం1,84,000

Exam Tips:

a) నికర కొనుగోళ్ళు ₹ 82,000, నికర అమ్మకాలు ₹ 1,75,000; స్థూల లాభం ₹ 41,000.
b) బొగ్గు, గ్యాస్, ఇంధనం, ఫ్యాక్టరీ అద్దె వర్తకపు ఖాతా డెబిట్ వైపు రాయండి.

 

Question 2: క్రింది సమాచారం నుంచి 31.12.2018 నాటికి స్వామి యొక్క వర్తకపు ఖాతాను తయారు చేయండి.

వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు8,000
కొనుగోళ్ళు20,000
అమ్మకాలు35,000
కొనుగోలు రవాణా2,000
ఫ్యాక్టరీ బీమా1,000
గ్యాస్ మరియు నీళ్ళ ఖర్చులు3,000
అమ్మకాల వాపసులు2,000
కొనుగోలు వాపసులు4,000
వేతనాలు5,000
దిగుమతి సుంకాలు1,000
ముగింపు సరుకు6,000

Answer:

31.12.2018 నాటి స్వామి యొక్క వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు8,000By అమ్మకాలు35,000
To కొనుగోళ్ళు20,000తీసివేయండి: అమ్మకాల వాపసులు2,00033,000
తీసివేయండి: కొనుగోలు వాపసులు4,00016,000By ముగింపు సరుకు6,000
To రవాణా2,000
To ఫ్యాక్టరీ బీమా1,000
To గ్యాస్ మరియు నీళ్ళు3,000
To వేతనాలు5,000
To దిగుమతి సుంకాలు1,000
To స్థూల లాభం (లాభ-నష్టాల ఖాతాకు మళ్ళింపు)3,000
మొత్తం39,000మొత్తం39,000

Exam Tips:

a) అమ్మకాల వాపసులు ₹ 2,000 అమ్మకాల నుండి, కొనుగోలు వాపసులు ₹ 4,000 కొనుగోళ్ళ నుండి తీసివేయండి.
b) స్థూల లాభం ₹ 3,000; రెండు వైపులా మొత్తం ₹ 39,000.

 

Question 3: 31.12.2017 తో అంతమయ్యే సంవత్సరానికి అయ్యప్ప ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతాను తయారు చేయండి.

వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు28,000
కొనుగోళ్ళు40,000
అమ్మకాలు75,000
కొనుగోలు వాపసులు5,000
అమ్మకాల వాపసులు7,000
వేతనాలు9,000
రవాణా2,000
కర్మాగారం లైటింగ్1,500
క్లియరింగ్ ఛార్జీలు1,000
కస్టమ్స్ సుంకాలు1,800
కర్మాగారం పర్యవేక్షకుడి జీతం3,700
ముగింపు సరుకు10,000

Answer:

31.12.2017తో అంతమయ్యే సంవత్సరానికి అయ్యప్ప ట్రేడర్స్ యొక్క వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు28,000By అమ్మకాలు75,000
To కొనుగోళ్ళు40,000తీసివేయండి: అమ్మకాల వాపసులు7,00068,000
తీసివేయండి: కొనుగోలు వాపసులు5,00035,000By ముగింపు సరుకు10,000
To వేతనాలు9,000By స్థూల నష్టం (లాభ-నష్టాల ఖాతాకు మళ్ళింపు)4,000
To రవాణా2,000
To కర్మాగారం లైటింగ్1,500
To క్లియరింగ్ ఛార్జీలు1,000
To కస్టమ్స్ సుంకాలు1,800
To కర్మాగారం పర్యవేక్షకుడి జీతం3,700
మొత్తం82,000మొత్తం82,000

Exam Tips:

a) ఇక్కడ డెబిట్ మొత్తం క్రెడిట్ కంటే ఎక్కువ కాబట్టి స్థూల నష్టం ₹ 4,000 ను క్రెడిట్ వైపు చూపండి.
b) కర్మాగారం పర్యవేక్షకుడి జీతం, లైటింగ్ వర్తకపు ఖాతా ఖర్చులు.

 

Question 4: ఈ క్రింద ఇచ్చిన వివరాల నుంచి 31.12.2018 తో అంతమయ్యే సంవత్సరానికి సాత్విక యొక్క లాభ-నష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
జీతాలు3,500ప్రింటింగ్ స్టేషనరీ1,200
అద్దె మరియు పన్నులు1,500వచ్చిన డిస్కౌంట్2,000
బీమా1,000వచ్చిన కమీషన్1,600
మరమ్మత్తులు900ఇంటర్నెట్ ఛార్జీలు800
వర్తకపు ఖర్చులు600
అమ్మకాల రవాణా600
స్థూల లాభం12,000
రానిబాకీలు800

Answer:

31.12.2018తో అంతమయ్యే సంవత్సరానికి సాత్విక యొక్క లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
To జీతాలు3,500By స్థూల లాభం12,000
To అద్దె మరియు పన్నులు1,500By వచ్చిన డిస్కౌంట్2,000
To బీమా1,000By వచ్చిన కమీషన్1,600
To మరమ్మత్తులు900
To వర్తకపు ఖర్చులు600
To అమ్మకాల రవాణా600
To రానిబాకీలు800
To ప్రింటింగ్, స్టేషనరీ1,200
To ఇంటర్నెట్ ఛార్జీలు800
To నికర లాభం (ఆస్తి-అప్పుల పట్టికకు మళ్ళింపు)4,700
మొత్తం15,600మొత్తం15,600

Exam Tips:

a) ఖర్చులు ₹ 10,900, ఆదాయాలు ₹ 15,600 (స్థూల లాభం, డిస్కౌంట్, కమీషన్); నికర లాభం ₹ 4,700.
b) నికర లాభాన్ని ఆస్తి-అప్పుల పట్టికలో మూలధనానికి కలపడానికి మళ్ళించండి.

 

Question 5: నవీన్ కుమార్ ట్రేడర్స్ యొక్క లాభ-నష్టాల ఖాతాను 31.03.2018 నాటికి తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
అద్దె1,500చెల్లించిన డిస్కౌంట్3,500
ప్రింటింగ్ - స్టేషనరీ2,000టెలిఫోన్ ఛార్జీలు1,500
జీతాలు మరియు వేతనాలు8,000వడ్డీ2,000
వచ్చిన వడ్డీ3,000బీమా1,800
వసూలైన రానిబాకీలు2,000మరమ్మత్తులు800
ప్రకటనలు5,000పోస్టేజి1,200
స్థూల లాభం39,500రానిబాకీలు3,200

Answer:

31.12.2018 నాటికి నవీన్ కుమార్ ట్రేడర్స్ యొక్క లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
To అద్దె1,500By స్థూల లాభం39,500
To డిస్కౌంట్3,500By వచ్చిన వడ్డీ3,000
To టెలిఫోన్ ఛార్జీలు1,500By రానిబాకీల వసూళ్ళు2,000
To వడ్డీ2,000
To ఇన్సూరెన్స్ (బీమా)1,800
To మరమ్మత్తులు800
To పోస్టేజి1,200
To రానిబాకీలు3,200
To ప్రింటింగ్, స్టేషనరీ2,000
To జీతాలు మరియు వేతనాలు8,000
To ప్రకటనలు5,000
To నికర లాభం (ఆస్తి-అప్పుల పట్టికకు మళ్ళింపు)14,000
మొత్తం44,500మొత్తం44,500

Exam Tips:

a) వచ్చిన వడ్డీ, రానిబాకీల వసూళ్ళు ఆదాయాలు (క్రెడిట్); వడ్డీ, రానిబాకీలు ఖర్చులు (డెబిట్); పేర్లు ఒకేలా ఉన్నా వైపు వేరు.
b) నికర లాభం ₹ 14,000, మొత్తం ₹ 44,500; ప్రశ్నలో తేదీ 31.03.2018 అని ఉన్నా సమాధానంలో 31.12.2018 అని ముద్రించారు, ఖాతా శీర్షికలో ఒకే తేదీ రాయండి.

 

Question 6: క్రింది నిల్వల సహాయంతో 31.12.2018 నాటికి హరిణి యొక్క లాభనష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
సాధారణ ఖర్చులు475వచ్చిన డిస్కౌంట్950
బీమా300పెట్టుబడుల అమ్మకంపై లాభం1,200
అద్దె మరియు పన్నులు250స్థూల నష్టం500
కమీషన్125
డిస్కౌంట్ (డెబిట్)275
తరుగుదల325
రానిబాకీలు450
అమ్మకాల రవాణా250
మూలధనంపై వడ్డీ325

Answer:

31.12.2018 నాటికి హరిణి యొక్క లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
To స్థూల నష్టం500By డిస్కౌంట్950
To సాధారణ ఖర్చులు475By పెట్టుబడుల అమ్మకంపై లాభం1,200
To బీమా300By నికర నష్టం (ఆస్తి-అప్పుల పట్టికకు మళ్ళింపు)1,125
To అద్దె మరియు పన్నులు250
To కమీషన్125
To డిస్కౌంట్ (డెబిట్)275
To తరుగుదల325
To రానిబాకీలు450
To అమ్మకాల రవాణా250
To మూలధనంపై వడ్డీ325
మొత్తం3,275మొత్తం3,275

Exam Tips:

a) స్థూల నష్టం ₹ 500 ను డెబిట్ వైపు మొదటి అంశంగా తీసుకోండి.
b) ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ కాబట్టి నికర నష్టం ₹ 1,125 ను క్రెడిట్ వైపు చూపి ఆస్తి-అప్పుల పట్టికకు మళ్ళించండి; పెట్టుబడుల అమ్మకంపై లాభం ఆదాయం.

 

Question 7: క్రింది వివరాల నుండి వర్తకపు, లాభ-నష్టాల ఖాతాను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
ప్రారంభపు సరుకు1,500వచ్చిన కమీషన్625
కొనుగోళ్ళు6,800కస్టమ్స్ సుంకాలు500
అమ్మకాలు13,200వచ్చిన వడ్డీ700
అద్దె & పన్నులు500క్లియరింగ్ ఛార్జీలు250
ఇచ్చిన డిస్కౌంట్350ప్రయాణపు ఖర్చులు400
అమ్మకాల వాపసులు200ఫ్యాక్టరీ బీమా200
కొనుగోలు వాపసులు500ముగింపు సరుకు2,700
వేతనాలు475
జీతాలు825
రానిబాకీలు500

Answer:

వర్తకపు ఖాతా
వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)వివరాలుమొత్తం (₹)మొత్తం (₹)
To ప్రారంభపు సరుకు1,500By అమ్మకాలు13,200
To కొనుగోళ్ళు6,800తీసివేయండి: వాపసులు20013,000
తీసివేయండి: వాపసులు5006,300By ముగింపు సరుకు2,700
To వేతనాలు475
To కస్టమ్స్ సుంకాలు500
To క్లియరింగ్ ఛార్జీలు250
To ఫ్యాక్టరీ బీమా200
To స్థూల లాభం (లాభనష్టాల ఖాతాకు మళ్ళింపు)6,475
మొత్తం15,700మొత్తం15,700
లాభనష్టాల ఖాతా
వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
To అద్దె & పన్నులు500By స్థూల లాభం6,475
To డిస్కౌంట్350By వచ్చిన కమీషన్625
To జీతాలు825By వచ్చిన వడ్డీ700
To రానిబాకీలు500
To ప్రయాణపు ఖర్చులు400
To నికర లాభం (ఆస్తి-అప్పుల పట్టికకు మళ్ళింపు)5,225
మొత్తం7,800మొత్తం7,800

Exam Tips:

a) కస్టమ్స్, క్లియరింగ్ ఛార్జీలు, ఫ్యాక్టరీ బీమా వర్తకపు ఖాతాకు; అద్దె, డిస్కౌంట్, జీతాలు, రానిబాకీలు, ప్రయాణపు ఖర్చులు లాభనష్టాల ఖాతాకు.
b) ప్రయాణపు ఖర్చులు ₹ 400 మరవకుండా చేర్చితే నికర లాభం ₹ 5,225 వస్తుంది.

 

Question 8: 31.12.2017 నాటి క్రింది వివరాల ఆధారంగా శ్రీనివాస్ యొక్క ఆస్తి-అప్పుల పట్టికను తయారుచేయండి.

వివరాలుమొత్తం (₹)వివరాలుమొత్తం (₹)
మూలధనం48,000యంత్రాలు10,000
ఋణగ్రస్తులు12,000నగదు13,000
ఋణదాతలు28,000పెట్టుబడులు19,000
ఫర్నిచర్12,000ముగింపు సరుకు3,000
నికర లాభం4,000ఫిక్స్‌డ్ డిపాజిట్లు11,000

Answer:

31.12.2017 నాటికి శ్రీనివాస్ యొక్క ఆస్తి-అప్పుల పట్టిక
అప్పులుమొత్తం (₹)మొత్తం (₹)ఆస్తులుమొత్తం (₹)మొత్తం (₹)
మూలధనం48,000ఋణగ్రస్తులు12,000
కూడిక: నికర లాభం4,00052,000పెట్టుబడులు19,000
ఋణదాతలు28,000ఫర్నిచర్12,000
యంత్రాలు10,000
నగదు13,000
ముగింపు సరుకు3,000
ఫిక్స్‌డ్ డిపాజిట్లు11,000
మొత్తం80,000మొత్తం80,000

Exam Tips:

a) నికర లాభం ₹ 4,000 ను మూలధనానికి కలపండి (₹ 52,000).
b) ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులు ఆస్తులు; ఋణదాతలు అప్పు; రెండు వైపులా మొత్తం ₹ 80,000.

 

Free study material for Accountancy

Accountancy Class 11 Curriculum Solutions: Chapter 09 Final Accounts of Sole Proprietors

Official TS Board Solutions for Chapter 09 Final Accounts of Sole Proprietors

Review comprehensive exercise answers for Class 11 Accountancy Chapter 09 Final Accounts of Sole Proprietors. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Step-by-Step Explanations for Chapter 09 Final Accounts of Sole Proprietors

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 09 Final Accounts of Sole Proprietors concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Accountancy Revision

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 09 Final Accounts of Sole Proprietors with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Accountancy are as per latest TS Board curriculum.

Are the Accountancy TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Accountancy concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Accountancy. You can access TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు in both English and Hindi medium.

Is it possible to download the Accountancy TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Accountancy Study Material Chapter 9 సొంత వ్యాపార సంస్థల ముగింపు లెక్కలు in printable PDF format for offline study on any device.