TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం

Solutions for Class 10 Telugu: Lesson 09 Jeevana Bhashyam

Access comprehensive textbook solutions for Lesson 09 Jeevana Bhashyam using the official curriculum guides for Class 10 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 10 Telugu Solutions: Lesson 09 Jeevana Bhashyam

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

పాఠ్యపుస్తక అభ్యాసాలు

Question 1: పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి ?

Answer:

పాటుపడటం అంటే కష్టపడడం, పనిచేయడం. ఎవరైనా తమ గురించి, తమ కుటుంబం గురించి, తమ వాళ్ళ గురించి పాటుపడడం సహజం. పరులు అంటే ఇతరులు. అంటే మనకు సంబంధం లేనివాళ్ళు. వాళ్ళ గురించి కష్టపడడం గొప్పవారి లక్షణం. ఇతరులకు ఉపకారం చేయడానికి దేనినీ లెక్క చేయకూడదు. అంటే సమాజం కోసం కష్టపడాలి. సమాజ అభివృద్ధి కోసం పాటు పడాలని కవి సందేశం.

Exam Tips:

a) ‘పరులు’ అంటే ఇతరులు – పదానికి అర్థం చెప్పి, సమాజం కోసం కష్టపడడం గొప్పతనమని తేల్చండి.

 

Question 2: కవి ప్రశ్నల్లోని ఆంతర్యం ఏమిటి ?

Answer:

ప్రతిదానికీ ఒక ఉపయోగం ఉంటుంది. కొన్ని ఖచ్చితంగా కొన్ని పనులకు ఉపయోగపడాలి. ఆయా పనులకు ఉపయోగపడనపుడు అవి ఉన్నా లేక పోయినా ఒకటే అని కవిగారి ఉద్దేశం.
1. సమాజం కోసం పాటుపడని మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే.
2. చేలకు నీరివ్వని ఏరు వలన ప్రయోజనం లేదు.
3. ఎండా, వానలనుండి కాపాడలేని గొడుగు వృథా.
4. మాటలే తప్ప కదలని అడుగులు వలన ఏమీ సాధించలేము.

Exam Tips:

a) కవి అడిగిన ప్రతి ప్రశ్నా ‘ఉపయోగం లేని వస్తువు విలువలేనిది’ అనే భావాన్నే సూచిస్తుందని చెప్పండి; ఉదాహరణలు (ఏరు, గొడుగు, అడుగులు) ఇవ్వండి.

 

Question 3: దీనిని రాసిందెవరు ?

Answer:

ఈ కవితను డా॥ సి. నారాయణరెడ్డి గారు (సినారె) రచించారు.

Exam Tips:

a) కవి పూర్తి పేరు (డా॥ సింగిరెడ్డి నారాయణరెడ్డి – సినారె), ప్రక్రియ (గజల్) రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 89)

Question 1: ‘మనసుకు మబ్బుముసరడం’ అనడంలో ఆంతర్యంమేమిటి?

Answer:

నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది.

Exam Tips:

a) మబ్బు నీరై కురవడం, మనసు కన్నీరవడం మధ్య పోలికను చూపండి.

 

Question 2: ‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుం’దనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు ?

Answer:

లోకం భయపెడుతుంది. ఆ మాటలకు జంకకుండా, అడుగులు ముందుకు వేస్తే, అనగా భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే నీకు విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురూ అనుసరించేందుకు ఒక దారిగా మారుతుందని దీని అర్థం. నేను కూడా ఇది సరైనదేనని సమర్థిస్తాను.

Exam Tips:

a) ‘సమర్థిస్తారా’ అంటే అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి కారణం రాయాలి; ‘జంకని అడుగులు – దారి’ భావాన్ని విశ్లేషించండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 90)

Question 1: మనిషి మృగము ఒకటేనా ? కాదా ? చర్చించండి .

Answer:

మనిషీ, మృగమూ ఒక్కటికానేకాదు. మనిషికి ఆలోచనాశక్తి వుంది. భావాలను తెలుపగలిగే భాష ఉంది. కానీ మృగానికి ఆలోచనాశక్తీ, భావాలను తెలిపే భాష లేవు. కనుక మనిషి మృగమూ ఒకటికాదు. ఆలోచనాశక్తి నశించి మానవత్వం మరిచిపోతే మనిషినే మృగం అనవచ్చు.

Exam Tips:

a) మనిషికి ఆలోచనాశక్తి, భాష ఉన్నాయి – ఈ తేడాను చెప్పి మానవత్వం ముఖ్యమని ముగించండి.

 

Question 2: హిమగిరి శిరసు మాడటం అంటే మీకేమర్థమయింది ?

Answer:

హిమాలయ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. అయినా దాని నెత్తిని కూడా సూర్యుడు తన వేడి కిరణాలతో మాడుస్తాడు. అంత ఎత్తు ఉన్నా హిమగిరికీ సూర్యుని తాపం తప్పలేదు కదా ! ఎండవేడికి అది కరిగి ఏరుగా, అనగా నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషైనా అతని గర్వం, సమస్యలకు వేడెక్కి నీరుగా కారిపోవలసిందే అని నాకు అర్థమయింది.

Exam Tips:

a) ‘హిమగిరి శిరసు మాడటం’ లోని భావం – ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు, గర్వం పనికిరాదు.

 

Question 3: ‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుం’దనడాన్ని మీరు సమర్థిస్తారా ? ఎట్లా ?

Answer:

త్యాగం అంటే మనకున్నది ఇతరులకు ఇవ్వడం. స్వార్థం చూసుకోకుండా ఇవ్వడం. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం. మనకోసం ఎవరైనా ఏదైనా త్యాగం చేస్తే మనం వారిని జీవితాంతం మరచిపోలేము.
అలాగే తమకున్న డబ్బుతో గుడి, బడి, ఆసుపత్రి, అన్నదాన సత్రము మొదలైనవి కట్టిస్తే వారి పేరును సమాజం గుర్తు పెట్టుకొంటుంది. ఉదాహరణకు రంగయ్యగారు బడి కట్టిస్తే, దానిని రంగయ్య బడి అంటాం. బిర్లా టెంపుల్ మొదలైనవి. అంటే అవి ఉన్నంతకాలం వారి పేరు కూడా ఉంటుంది. అందుకే ఇది సమర్థించతగినది.

Exam Tips:

a) త్యాగం ప్రతిఫలం ఆశించకుండా చేసేది; పేరు నిలిచిన ఒక ఉదాహరణ (బడి, గుడి, ఆసుపత్రి) తప్పక ఇవ్వండి.

 

I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: క్రింది అంశాన్ని గురించి చర్చించండి.
అ) ‘జీవనభాష్యం’ అనే శీర్షిక ఈ గజల్‌కు ఎలా సరిపోయిందో చెప్పండి.

Answer:

ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనే పేరు తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠ్యభాగంలో మానవుడు తన జీవితంలో ఎప్పుడు గౌరవం పొందుతాడు. ఎలా జీవించాలి అనే విషయాలను లోతుగా పరిశీలించి కవి మనకు అందించారు. మానవ జీవిత పరమార్థాన్ని ఈ చిన్న గజల్ ద్వారా అందించడం జరిగింది.
మానవుడు దుఃఖాలన్నింటిని సమర్థవంతంగా తట్టుకుంటూ, కష్టాలను సాహసంతో ఎదుర్కొంటూ ఉండాలని, తనంతట తాను ఉన్నతంగా ఎదుగుతూ, తోటి వారి కోసం పాటుపడుతూ జీవించాలనే జీవిత సత్యం ఇందులో ఉంది. అందువల్ల ఈ పాఠానికి ‘జీవన భాష్యం’ అనేపేరు తగినదిగా చెప్పవచ్చు.

Exam Tips:

a) శీర్షిక ఎందుకు సరిపోతుందో పాఠంలోని సందేశం (కష్టాలను ఎదుర్కోవడం, ఇతరుల కోసం పాటుపడడం) ఆధారంగా సమర్థించండి.

 

Question 2: పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.

Answer:

ప్రాస పదాలు
1) నీరవుతుంది, కన్నీరవుతుంది, దారవుతుందికరిగితే, ముసిరితే, కదిలితే
2) దున్నితే, పగిలితే, కూడితే–
3) యేరవుతుంది, పేరవుతుందిమాడితే, మిగిలితే

Exam Tips:

a) ప్రాస పదాలను గజల్ పంక్తి చివర వచ్చే పదాలతో జతచేసి రాయండి (నీరవుతుంది – కరిగితే, దారవుతుంది – కదిలితే).

 

Question 3: క్రింది అపరిచిత గేయ పాదాలను చదువండి.
భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో
తనివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకునో
అడ్డుగోడ లేని సమసమాజమెచట నుండునో
హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో
ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము
లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా !
గేయం చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) ‘శిరమునెత్తి నిలుచునో’ అంటే మీకేమి అర్థమైంది ?
ఆ) జ్ఞానసుధలు ఎట్లా ఉండాలని గేయంలో ఉన్నది ?
ఇ) సమసమాజం ఎట్లా ఏర్పడుతుంది ?
ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి ?
ఉ) ‘స్వర్గసీమ’ అనడంలో అంతరార్థం ఏమిటి ?

Answer:

అ) భీతి (భయం) లేకుండా ఉంటే మనిషి తల ఎత్తుకొని గర్వంగా నిలబడతాడని అర్థమైంది.
ఆ) జ్ఞానసుధలతో తృప్తి కలగాలి. అంటే జ్ఞానతృష్ణ తీరాలి.
ఇ) సమసమాజం అడ్డుగోడలు లేకుండా ఏర్పడుతుంది.
ఈ) మనస్సులో నుండి వచ్చే నిజమే విలసిల్లుతుంది.
ఉ) స్వర్గసీమలో భయం ఉండదు. తృప్తి కలిగించే జ్ఞానం దొరుకుతుంది. కుల, మతాలు, ధనిక, పేద అనే అడ్డుగోడలుండవు. నిజమైన మాట, ఆలోచన, ప్రవర్తన ఉంటుంది. పూర్తిగా స్వతంత్రం ఉంటుంది. అటువంటి ప్రదేశం కావాలి కనుక స్వర్గసీమ అన్నారు.

Exam Tips:

a) గేయం చదివి ప్రతి ప్రశ్నకూ గేయంలోని మాటలనే ఆధారంగా చేసుకుని చిన్న వాక్యాల్లో జవాబివ్వండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి ?

Answer:

1. దశదానాలు, షోడశమహాదానాలు చేయాలి.
2. గ్రామంలో దేవాలయము కట్టించాలి.
3. పేద బ్రాహ్మణుడికి పెళ్ళి చేయించాలి.
4. ఒక కవి రాసిన కావ్యాన్ని అంకితం తీసుకోవాలి.
5. గ్రామంలో అందరికీ త్రాగేందుకు నీటి కోసం చెరువు తవ్వించాలి.
6. ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి.
పైన చెప్పినవి అన్నీ “సప్త సంతానములు” అనే వాటిలోని మంచి పనులు.
ఇవిగాక పాఠశాలలూ, కళాశాలలూ ఏర్పాటు చేయించడం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం, చదువులు చెప్పించడం, పేదవారికి వైద్య ఖర్చులు భరించడం, గ్రామాలకు మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించడం, దైవపూజలు చేయించడం, పేదల కోసం పెళ్ళి ఖర్చులు భరించడం, మంగళసూత్రాలు దానం చేయడం వంటి మంచి పనులు చేస్తే వారి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.
ఆ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు ‘సినారె’ ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు ?
జవాబు:
‘జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా సినారె విద్యార్థులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు.
విద్యార్థులు చదువులో ఒక్కోసారి వెనుకబడతారు. చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాలను ఓర్పుతో సహించాలి.
అవాంతరాలను అధిగమించాలి. అప్పుడే విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రగతి పథంలో పయనించ గలుగుతారు. ఉత్తమ ఫలితాలను పొంద గలుగుతారు. తమకు డబ్బులేదని, చదువు సరిగా రావడం లేదని నిరాశపడవద్దని, అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడ కుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలనే ఉపదేశాన్ని నారాయణరెడ్డి గారు విద్యార్థులకు అందించారని భావిస్తున్నాను.
ఇ) “మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని ‘సినారె’ ఎందుకు అన్నాడు ?
జవాబు:
“జీవన భాష్యం” అనే పాఠ్యభాగంలో “మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది” అని నారాయణ రెడ్డి గారు ఉపదేశించారు. సమాజంలో మానవులంతా కలిసిమెలిసి జీవించాలి. పరస్పర సహకారాన్ని పొందాలి. వర్గ వైషమ్యాలను విడనాడాలి. కులమతాల అడ్డు గోడలను తొలగించుకోవాలి.
ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఆపదల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలి.
అప్పుడే సమాజంలోని వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని, అటువంటి ప్రశాంతతో కూడిన గ్రామీణ వాతావరణం రావాలని కవి కోరుతున్నారు. పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచు కోవాలి. అప్పుడే అందరు కలిసి ఆనందంగా జీవించ గలుగుతారని, అలాంటి మనుషులంతా ఏకమైతేనే చల్లని ఊరు ఏర్పడుతుందని కవి భావించాడు.

Exam Tips:

a) ఐదేసి వాక్యాల పరిమితిని పాటించండి; పాఠంలోని పంక్తిని ఉటంకించి దాని భావం, సందేశం రాయండి.

 

Question 2: క్రింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాల్లో జవాబు వ్రాయండి.
అ) ‘జీవనభాష్యం’ అందించే సందేశాన్ని వివరించండి.

Answer:

జీవనభాష్యం ద్వారా ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడనీ మరియు వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రకృతిలో ఇటువంటి పరోపకార గుణం గల ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేగాకుండా పరోపకార గుణం గల నదులు, మేఘాలు, వృక్షాలు మనకు ఎంతో సహకారం అందిస్తాయి. జీవనభాష్యం ద్వారా చింతలు, బాధలు, ఆందోళనలు అనేవి మనసును కుంగదీసినపుడు అవి కన్నీరు రూపంలో బయటకు వస్తాయి.
ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచినపుడే మనకు విజయం చేకూరుతుంది. అదే విధంగా బీడు భూమిలో ఏ పంటలూ పండవని నిరాశపడకుండా అదే నేలను కష్టపడి దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.
సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయత, సంబంధాలు కలిగి ఉండాలని నేర్పుతుంది జీవనభాష్యం. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుందని కవి భావన.
అలాగే “కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం” ఒకదాని తరువాత మానవ జీవితంలో పరిపాటి అని తెలుస్తుంది. ఏమి ఆలోచించకుండా మబ్బు వర్షాన్ని ఇస్తుంది. నదులు నీటిని అందిస్తాయి. అలాగే రైతు మనందరి కోసం రేయింబవళ్ళు కష్టపడి మనకు ఆహారాన్ని అందించి “అన్నదాత” గా మారాడు.
అటువంటి రైతు చేసే గొప్ప పని, నిస్వార్థ త్యాగం మనం మరచిపోరాదు. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందే పనులు చేసి, నిజమైన విలువ, గుర్తింపు పొందాలని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. అప్పుడే మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని జీవనభాష్యం మనకు సందేశం ఇస్తుంది.

Exam Tips:

a) పది వాక్యాల జవాబులో గజల్ లోని భావాలన్నింటినీ (కష్టాలు, ధైర్యం, శ్రమ, ఐక్యత, త్యాగం) క్రమంగా చేర్చండి.

 

Question 3: క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.
అ) “జీవన భాష్యం” గజల్‌లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
(లేదా)
ఆ) ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు వ్రాయండి.

Answer:

అ) వచన కవిత :
1) మంచు కరిగితే నీరవుతుంది.
2) మంచి నడక నడిస్తే దారవుతుంది.
3) వర్షం కురిస్తే పంట పైరవుతుంది.
4) మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
5) నదులు పారితే అది ఏరవుతుంది.
6) త్యాగధనులుంటే పేరవుతుంది.
(లేదా)
ఆ) సినారె గారిని అడగదగిన ప్రశ్నలు :
1. మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది ?
2. ‘ప్రపంచపదులు’ ను మీరు ఎలా సృష్టించారు ?
3. మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది ?
4. మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు ?
5. మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి ?
6. ‘మధ్యతరగతి మందహాసం’ లోని ప్రధానమైన అంశం ఏమిటి ?
7. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
8. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి ఎలా బయట పడగలుగుతారు ?
9. నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?
10. ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడం లేదు ?

Exam Tips:

a) వచన కవితలో ‘…తే … అవుతుంది’ అనే అంత్యప్రాసను పాటించండి; ప్రశ్నలు అడిగేటప్పుడు కవి రచనల గురించి సంబంధిత ప్రశ్నలే రాయండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: క్రింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) మబ్బు
ఆ) గుండె
ఇ) శిరసు

Answer:

అ) మబ్బు : మేఘం, అంబుదం, జలదం, చీకటి, అజ్ఞానము
ఆ) గుండె : హృదయము, మనస్సు, ధైర్యము, ఎద, ఎడద
ఇ) శిరసు : తల, శీర్షము, మస్తకము, ఉత్తమాంగము, శిఖరము

Exam Tips:

a) పర్యాయపదాలు ఒకే అర్థాన్నిచ్చే పదాలై ఉండాలి; సందేహమున్న పదాన్ని రాయకండి.

 

Question 2: క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) వ్యాప్తి
ఆ) జంకని అడుగులు
ఇ) ఎడారి దిబ్బలు
ఈ) చెరగని త్యాగం

Answer:

అ) వ్యాప్తి : తెలంగాణ సంగీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశమంతటా వ్యాప్తి చేసింది.
ఆ) జంకని అడుగులు : గుండెబలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు.
ఇ) ఎడారి దిబ్బలు : ప్రయోజనం లేని ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.
ఈ) చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగగుణం కలవారుగా ఉంటారు.

Exam Tips:

a) ఇచ్చిన పదాన్ని వాక్యంలో సరైన అర్థంతో వాడాలి; వాక్యం పూర్తిగా ఉండాలి.

 

వ్యాకరణాంశాలు

Question 1: క్రింది పదాలను కలిపి, సంధిని గుర్తించి వ్రాయండి.
అ) నీరు + అవుతుంది
ఆ) ఎత్తులకు + ఎదిగిన
ఇ) పేరు + అవుతుంది

Answer:

అ) నీరు + అవుతుంది = నీరవుతుంది – ఉకార సంధి
ఆ) ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన – ఉకార సంధి
ఇ) పేరు + అవుతుంది = పేరవుతుంది – ఉకార సంధి

Exam Tips:

a) సంధి చేసేటప్పుడు ఉకారసంధి సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం; ‘నీరు + అవుతుంది = నీరవుతుంది’ ఉదాహరణ గుర్తుంచుకోండి.

 

Question 2: క్రింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి, విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.
అ) ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు.
ఆ) ఇసుకగుండెలు పగిలితే అది పైరవుతుంది.

Answer:

అ) ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు – రూపక సమాసం

Exam Tips:

a) విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి; రూపకంలో ‘అనెడి’ వస్తుంది, షష్ఠిలో ‘యొక్క’ వస్తుంది.

 

Question 3: క్రింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి.
అ) నీకు వంద వందనాలు
ఆ) తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికే నవోదయం
ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్
ఈ) అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.

Answer:

అ) ఛేకానుప్రాసాలంకారం.
వివరణ : ‘వంద’ అనే హల్లుల జంట వెంటవెంటనే అర్థభేదంతో వచ్చింది. మొదటి ‘వంద’ నూరు సంఖ్యను, రెండోసారి వచ్చిన ‘వంద’ (వందనాలు) నమస్కారాలను తెలుపుతోంది. కావున ఇది ఛేకానుప్రాసాలంకారం.
లక్షణం : హల్లుల జంట, అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.
ఆ) అంత్యానుప్రాసాలంకారం.
వివరణ : పై గేయంలో ప్రాసపదాలు (అభ్యుదయం – నవోదయం) చరణం చివర ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం.
ఇ) వృత్త్యానుప్రాసాలంకారం.
వివరణ : ‘జ’ అనే అక్షరం (రాజు, రివాజులు, బూజు) పలుమార్లు వచ్చింది. కాబట్టి ఇది వృత్త్యానుప్రాసాలంకారం.
ఈ) రూపకాలంకారం.
వివరణ : అజ్ఞానము – ఉపమేయం; అంధకారం – ఉపమానం. ఇక్కడ ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమానమైన అంధకారం ఆరోపించబడింది. కావున ఇది రూపకాలంకారం.

Exam Tips:

a) అలంకారం పేరుతో పాటు లక్షణం, ఇచ్చిన వాక్యంలోని సమన్వయం రాస్తే పూర్తి మార్కులు వస్తాయి. అనుప్రాసలో ఛేక, వృత్తి, అంత్య భేదాలను గుర్తించండి.

 

ప్రాజెక్టు పని

Question 1: డా॥ సి. నారాయణరెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు / గజల్స్‌ను సేకరించండి. నివేదిక రాసి ప్రదర్శించండి.

Answer:

కొన్ని (సినారె) గేయాలు :
1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం”
2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”
3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది. ఎ.సి. గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”
నివేదిక :
డా॥ సి. నారాయణరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ కవులుగా కీర్తి పొందారు. వీరి గేయాలు భావస్ఫోరకంగా ఉంటాయి. తేటతెలుగు పదాలతో అలరారుతుంటాయి. అంత్యప్రాసలు పాటలకు మరింత అందాన్ని ఇస్తాయి. చిన్న పదాలతో విస్తృతమైన భావాన్ని గేయాల ద్వారా అందించడం నారాయణరెడ్డి గారి ప్రత్యేకత.
సన్నివేశానికి అనుగుణంగా పదాలను గేయంలో చూపించడం నారాయణరెడ్డి గారికే చెల్లుతుంది. జాతీయాలను, తెలుగు నుడికారాలను చక్కగా చెప్పగల విశిష్ట కవి. పదలాలిత్యం, అంతకుమించిన గుణాత్మకశైలి గేయాలకు వన్నె చేకూరుస్తాయి. అందుకే తరాలు మారినా తెలుగువాడి మదిలో నారాయణరెడ్డి గారి గేయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Exam Tips:

a) ప్రాజెక్టు నివేదికలో కవి పరిచయం, గేయాల విశేషాలు, మీ అభిప్రాయం మూడు భాగాలు ఉండాలి.

 

Free study material for Telugu

Telugu Class 10 Curriculum Solutions: Lesson 09 Jeevana Bhashyam

Chapter Exercise Answers for Class 10 Telugu

Access structured TS Board textbook solutions for Lesson 09 Jeevana Bhashyam. Designed in alignment with the latest academic curriculum for Class 10 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Lesson 09 Jeevana Bhashyam

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 10 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Complete Preparation Kit for Class 10 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 09 Jeevana Bhashyam with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం for the 2026-27 session?

The complete and updated TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం will help students to get full marks in the theory paper.

Do you offer TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire TS 10th Class Telugu Guide 9th Lesson జీవనభాష్యం in printable PDF format for offline study on any device.